అర్థరాత్రి 2 గంటలకు ఫోన్‌..నాకేంటి అనేవాళ్లు : నటి | Actress Dakkshi Guttikonda Opens About Casting Couch | Sakshi
Sakshi News home page

అందుకే బోల్డ్‌ ఫోటో షూట్‌ చేశా : నటి దక్షి గుత్తికొండ

Nov 16 2025 1:53 PM | Updated on Nov 16 2025 2:40 PM

Actress Dakkshi Guttikonda Opens About Casting Couch

‘తెలుగమ్మాయిలు ఎక్స్‌ఫోజింగ్‌ చేయమంటే చేయలేరు.. అందుకే అవకాశాలు రావు’ అని చెప్పేవాళ్లకు..‘అది తప్పు మేం కూడా కథ డిమాండ్‌ చేస్తే అలాంటి సీన్స్‌ చేయగలం’ అని నిరూపించడానికే బోల్డ్‌ ఫోటో షూట్‌ చేశానని అంటోంది నటి దక్షి గుత్తికొండ(Dakkshi Guttikonda). ఆర్జీవీ ‘కరోనా వైరస్‌’ సినిమా ద్వారా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ విజయవాడ అమ్మాయి.. కొత్త పోరడు వెబ్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే సినిమాల కంటే ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇన్‌స్టాలో హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. అయితే ఒకరు ధరించే దుస్తులను చూసి వారి క్యారెక్టర్‌ని అంచనా వేయొద్దని చెబుతోంది దక్ష. తాజాగా ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో​కి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.

అలా సినిమాల్లోకి.. 
చిన్నప్పటి నుంచి నాకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చినా..అమ్మ చేయనీయలేదు. చదవు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వెళ్లమని చెప్పింది. మోడలింగ్‌ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చా. కరోనా సమయంలో ఆర్జీవీ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆడిషన్స్‌ కోసం వెళ్లాను. ఒక్కరోజులోనే ఆడిషన్స్‌, లుక్‌టెస్ట్‌ పూర్తి తర్వాత షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. అలా ‘కరోనా వైరస్‌’ సినిమాతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను.

ఆర్జీవీ బోల్డ్‌గా చూపిస్తారు కానీ..
ఆర్జీవీ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చినప్పుడు భయపడ్డాను. మీడియాలో ఆయనను చూపించే కోణం వేరు. ఆయనను బోల్డ్‌గా చూపించారు. నాకే కాదు కొత్తగా వచ్చిన అమ్మాయిలకు ఆర్జీవీని కలవాలంటే కాస్త భయమే. కానీ బయట మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకున్నంత సినిమా నాలెడ్జ్‌ ఇంకెవరీకీ లేదు. చాలా తక్కువ మాట్లాడతారు. కరోనా వైరస్‌ సినిమా సమయంలో నేను 12 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గాన్నా. చాలా బాగా చూసుకున్నారు.

కొత్త అమ్మాయిలకు తప్పవు..
సినిమా ఇండస్ట్రీ ఒక్కటే కాదు ఎక్కడగా అమ్మాయిలకు వేధింపులు ఉన్నాయి. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది అంతటా ఉంది. కెరీర్‌ ప్రారంభంలో నేను కూడా అది ఫేస్‌ చేశా. కొంతమంది అర్థరాత్రి 2-3 గంటలకు ఫోన్‌ చేసేవారు. చాలా పెద్ద సినిమాలో అవకాశం ఇప్పిస్తామని.. నీ కెరీర్‌కు చాలా హెల్ప్‌ అవుతుందని చెప్పి చివరిలో ‘నాకేంటి’ అనేవాళ్లు. స్టార్టింగ్‌లో అలా అడిగితే చాలా ఏడ్చాను. కానీ కొన్నాళ్ల తర్వాత తిరిగి నేనే మారిపోయాను. ఎవరైనా కాల్‌ చేస్తే..‘మీకు అలాంటి వాళ్లు కావాలంటే వేరే వాళ్లు ఉంటారు అక్కడకు వెళ్లండి...ఆర్టిస్ట్‌ కోసం అయితే నా దగ్గరకు రండి’ అని చెప్పేదాన్ని. 

అర్థరాత్రి ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయకుండా ఉదయం చేసేదాన్ని.కొంతమంది ఫోన్‌ లిప్ట్‌ చేసేవాళ్లు కాదు. నాకే కాదు ఏ అమ్మాయికి అయినా ఇలాంటి వేధింపులు కామన్‌. కొత్తగా ఓ అమ్మాయి వస్తుందంటే చాలు..అలాంటి వెదవలు కాల్‌ చేస్తునే ఉంటారు. అమ్మాయిలు ఎలా డీల్‌ చేశారనేది ముఖ్యం.  కొంతమంది అమ్మాయిలు స్కిన్‌ షో చేసి చాన్స్‌లు కొట్టేస్తారు. అయితే వాళ్లకు నాలుగైదు చాన్స్‌ వస్తాయంటే..అంతకు మించి ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేరు’ అని దక్షి చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement