వుమెన్స్‌ డే.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌ | Ram Gopal Varma Interesting Tweet On International Women's Day 2025 | Sakshi
Sakshi News home page

వుమెన్స్‌ డే.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

Mar 8 2025 12:30 PM | Updated on Mar 8 2025 12:34 PM

Ram Gopal Varma Interesting Tweet On International Women's Day 2025

రామ్‌ గోపాల్‌ వర్మ(Ram Gopal Varma )..ఎప్పుడు ఏ పని చేస్తాడో, ఎలాంటి కామెంట్స్‌ చేస్తాడో ఎవరికీ తెలియదు. ఓ అంశంపై అందరూ ఒకలా అభిప్రాయం వ్యక్తం చేస్తే.. ఆయన మాత్రం కాస్త డిఫరెంట్‌గా స్పందిస్తుంటాడు. దానికి లాజికైన సమాధానం కూడా ఆయన దగ్గర ఉంటుంది. అందుకే ఆర్జీవీ ట్వీట్స్‌ ఎప్పుడూ వైరల్‌ అవుతుంటాయి. కేవలం సినిమాల గురించే కాదు.. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై ఇతరులకు భిన్నంగా స్పందిస్తుంటాడు. నేను(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day 2025 ). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఆర్జీవీకి కూడా వుమెన్స్‌ డే విషెస్‌ తెలియజేశాడు. అయితే అందరిలా శుభాకాంక్షలు తెలిపితే ఆర్జీవీ ఎందుకు అవుతాడు? ఆయన విషెస్‌ కూడా కాస్త డిఫరెంట్‌గానే ఉంటాయి. ‘నా ఉనికి లేకుండా నేను జీవించగలను, కానీ స్త్రీల ఉనికి లేకుండా నేను జీవించలేను .. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆర్జీవీ కూడా ఇలాంటి పోస్టులు పెడతారా’ అని కొంతమంది షాకవుతుంటే.. ‘సూపర్‌ సార్‌.. మీకు మీరే లెజెండ్‌’, ‘భళే చెప్పావ్‌ సర్‌’ అంటూ మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.

 ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్‌లో ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ‘శారీ’అనే మూవీని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణ కమల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సత్య యాదు, ఆరాధ్య జంటగా నటించారు. మార్చి 21న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement