సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తరచూ స్పందించే ఆర్జీవీ.. తాజాగా జనసేన నేత నాగబాబు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రకాశ్ రాజ్‌కు తన మద్దతు తెలుపుతూ పరోక్షంగా నాగబాబుకు చురకలు అంటించాడు.
ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘నాయకుడి మాటే శిరోధార్యం. ఏది సరైనదో, ఏది కాదో నాయకుడికే తెలుసు. సందేహాలను పక్కనపెట్టి, ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించాలి’ అంటూ పవన్ కల్యాణ్ ఫోటోని షేర్ చేశాడు.
ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ‘మేము గొర్రెలం కాదు, బానిసలమూ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు. ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది’ అని నాగబాబుకు కౌంటర్ ఇచ్చాడు.
ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు. అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు’ అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
In effect what you mean is , in a democracy, a leader is given a responsible position by people who trusted him to take care of their issues ..He’s not been crowned as a king 🙏 https://t.co/k9OaxI2Mn8
— Ram Gopal Varma (@RGVzoomin) June 7, 2026


