
టాలీవుడ్ సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరోసారి లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా పేరుతో ఏపీ ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేస్తుందని తెలుస్తోంది. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా వర్మతో పాటు ఆర్‌జీవి ఆర్వీ సంస్థ, పార్టనర్ గొట్టుముక్కల రవి శంకర్ వర్మకి నోటీసులు పంపారు. ఈ క్రమంలో ఫైబర్ నెట్ మాజీ ఎండి మధు సుధన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి.