‘శివ’లో చిరంజీవి హీరో అయితే.. ఆర్జీవీ ఏం చెప్పారంటే... | Shiva Re Release: Ram Gopal Varma Shares Interesting Facts About Shiva | Sakshi
Sakshi News home page

‘శివ’ నాగార్జునది కాదు.. కథే లేదు: ఆర్జీవీ

Nov 9 2025 1:58 PM | Updated on Nov 9 2025 3:45 PM

Shiva Re Release: Ram Gopal Varma Shares Interesting Facts About Shiva

‘శివ’.. టాలీవుడ్‌ హిస్టరీలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన కల్ట్‌ క్లాసిక్‌ చిత్రం ఇది. రాజమౌళి మొదలు సందీప్‌రెడ్డి వంగా వరకు చాలా మంది దర్శకులకు ‘శివ’ఒక భగవద్గీత లాంటిది. ఆ సినిమా నుంచే చాలా నేర్చుకున్నామని పలువురు దర్శకులు చెప్పారు. 36 ఏళ్ల కిత్రం(1989) రామ్‌ గోపాల్‌వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం.. ఇప్పుడు మరోసారి థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. సరికొత్త సాంకేతిక హంగులతో నవంబర్‌ 14న ఈ చిత్రం రీరిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ ఆర్జీవీ తాజాగా ‘సాక్షి’తో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

నాగార్జున కోసమే ‘శివ’ పేరు
శివ ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు. ఈ సినిమా తీసినప్పుడు నా వయసు 26 ఏళ్లు మాత్రమే. ఒకటి రెండు హాలీవుడ్‌ సినిమాలు చూసి మనం ఎందుకు ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని శివ కథ రాసుకున్నా. అప్పటికీ తెలుగు తెరపై ఇలాంటి సినిమాలు రాలేదు. ముద్దుల మామయ్య లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ ఆడుతున్న రోజులవి. ఒక రియలిస్టిక్‌ కథలా చెబితే జనాలు చూస్తారనే నమ్మకం కూడా లేదు. కానీ నా కోసమే ఈ సినిమా తీశా. నాకు నచ్చినట్లుగా తెరకెక్కించా. హిట్‌ కోసం తీయాలనుకుంటే.. ఇప్పటికే హిట్‌ అయిన సినిమాలను కాపీ చేసి తీయాలి.

 ఆ పని నేను చేయలేదు. ఇలాంటి కథలు ఆడవని అంతా చెప్పేవారు.కానీ తీస్తే కదా ఆడుతుందో లేదో తెలిసేదని నేను శివ తీశాను. వాస్తవంగా ఈ సినిమాలో ‘శివ’ పేరు ముందుగా విలన్‌ రఘువరన్‌కి పెట్టాను. కానీ నాగార్జున కథ విని.. శివ పేరు బాగుంది కదా.. నా పాత్రకు పెట్టొచ్చు కదా అన్నాడు. అప్పుడు హీరో పాత్రకి శివ పేరు మార్చాను.  విలన్‌కి భవానీ పేరు పెట్టాను. 

తక్కువ బడ్జెట్‌
ఈ సినిమా రిలీజై 36 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారంటే.. ఇదేదో బాహుబలి చిత్రం అని కాదు. కానీ అప్పటికీ ఇలాంటి కథతో సినిమా తీసిన దాఖలాలు లేవు. నిజం చెప్పాలంటే శివలో అసలు కథే లేదు. కానీ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కొత్తగా ఉంటుంది. యాక్షన్‌ సన్నివేశాలు వాస్తవికంగా ఉంటాయి. ఆడియన్స్‌కి కొత్త సౌండ్స్‌తో సినిమా చూపించాం. నాతో పాటు అందరూ కొత్తవాళ్లే కాబట్టి.. ఇళయరాజా లాంటి సీనియర్‌ సంగీత దర్శకుడు ఉండాలని పట్టుపట్టి మరీ ఆయనను ఒప్పించాను. కారు బురలో పడిన సౌండ్స్‌ తో, హీరో-విలన్‌ షర్ట్‌ పట్టుకొని కొట్టుకునే సౌండ్స్‌ అన్ని రికార్డు చేసి మరీ వాడాం. అంతకు ముందు అన్ని సినిమాల్లో యాక్షన్‌ సీన్లలో అరుపులు వినిపించేవి.కానీ శివలో మాత్రం ఎవరూ కూడా నోటితో అరవొద్దని ముందే చెప్పా. సౌండ్స్‌తో యాక్షన్‌ సీన్స్‌ తీశాం.

చిరంజీవితో తీస్తే.. 
శివ రిలీజ్‌ అయిన తర్వాత టాక్‌ ఎలా ఉందనే విషయం నాతో పాటు నాగార్జునకు కూడా పూర్తిగా తెలియదు. రిలీజ్‌ అయిన రెండు రోజుల తర్వాత నాగేశ్వరరావుతో నాగార్జున కారులో వెళ్తుంటే.. ‘సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చింది...ఎంత పెద్ద విజయం అవుతుందో చెప్పలేం’అని అంటున్నారని చెప్పారట. అప్పుడు కానీ ఈ సినిమా హిట్‌ అయిందనే విషయం నాగార్జునకు తెలియలేదట. నేను కూడా ఇంత హిట్‌ అవుతుందని ఊహించలేదు’ అని ఆర్జీవి చెపుకొచ్చాడు. 

ఇక ఈ సినిమా హిట్‌ అయిన తర్వాత ‘చిరంజీవి’ అనే మ్యాగజైన్‌లో ఈ సినిమాలో నాగార్జున కాకుండా చిరంజీవి హీరో అయితే ఎలా ఉండేది అనే శీర్షికతో ఓ స్టోరీ ముద్రించారని.. నిజంగానే చిరంజీవితో తీస్తే ఎలా ఉండేది?’ అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ సమాధానం చెబుతూ.. ‘అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒక చిన్న హీరో సినిమా హిట్‌ అయితే.. ఇదే సినిమాను పెద్ద హీరోతో చేస్తే బ్లాక్‌ బస్టర్‌ అయ్యేది అని చెబుతుంటారు. కానీ ఆ పాత్రకు నాగార్జున సెట్‌ అయ్యాడు కాబట్టే హిట్‌ అయింది. చిరంజీవితో అయితే ఎలా ఉండేదో చెప్పలేం’ అని ఆర్జీవీ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement