పోలీస్‌ స్టేషన్‌లో దెయ్యాలు.. ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్‌ | Ram Gopal Varma’s Police Station Mein Bhoot: Manoj Bajpayee & Genelia in Haunted Cop Drama | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: గ్యాంగ్‌స్టర్‌ దెయ్యమైతే.. ఆర్జీవీ కొత్త మూవీ పోస్టర్‌ చూశారా?

Sep 1 2025 2:06 PM | Updated on Sep 1 2025 2:58 PM

Ram Gopal Varma Released Police Station me Gangster Poster

కెరీర్‌ మొదట్లో ఎన్నో గొప్ప సినిమాలు తీశాడు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma). తర్వాత ట్రాక్‌ తప్పి అన్నీ ఫ్లాపులే తీశాడు. ఇటీవలే తన తప్పు తెలుసుకున్న ఆర్జీవీ.. ఇకపై మంచి సినిమాలే చేస్తానని శపథం చేశాడు. అప్పుడే సిండికేట్‌ అనే భారీ చిత్రాన్ని ప్రకటించాడు. కానీ తర్వాత సిండికేట్‌ గురించి మళ్లీ ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దాన్ని పక్కనపెట్టి ఓ హారర్‌ సినిమా చేస్తున్నాడు. అదే పోలీస్‌ స్టేషన్‌ మే భూత్‌. యు కాంట్‌ అరెస్ట్‌ ద డెడ్‌ అన్నది క్యాప్షన్‌!

కాంబినేషన్‌ రిపీట్‌
బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ‘సత్య (1988), కౌన్‌ (1999), శూల్‌’ (1999) చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది! ఇందులో జెనీలియా హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ గ్లింప్స్‌ను ఆర్జీవీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఎవరి వల్లయినా మనకు భయం వేస్తే పోలీసుల దగ్గరకు వెళ్తాం.. మరి పోలీసులే భయపడితే వాళ్లెక్కడికి పరుగుతీస్తారు? అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ పోస్టర్‌ గ్లింప్స్‌ ఏఐ వీడియో అని తెలుస్తోంది.

కథ అదేనా?
పోలీస్‌ స్టేషన్‌ మే భూత్‌ సినిమా విషయానికి వస్తే.. ఓ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కొంతమంది గ్యాంగ్‌స్టర్స్‌ చనిపోతారు. వాళ్లందరూ భూతాలుగా మారడంతో ఈ పోలీస్‌ స్టేషన్‌ ఓ హాంటెడ్‌ స్టేషన్‌గా మారి పోతుంది. భూతాలైన గ్యాంగ్‌స్టర్స్‌ పోలీసులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు? ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా తప్పించుకోగలిగారు? అన్నదే సినిమా కథ అని తెలుస్తోంది!

 

 

చదవండి: జున్ను కాలికి ఫ్రాక్చర్‌.. అర్ధరాత్రి నొప్పితో ఏడుపు.. చూడలేకపోయా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement