
టాలీవుడ్ హీరో నాని (Nani) సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి తప్పకుండా సమయం కేటాయిస్తాడు. కుటుంబంతో కలిసి వెకేషన్స్‌కు వెళ్లడమే కాకుండా పండగలను కూడా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇటీవల వినాయక చవితి రోజు నాని తన ఫ్యామిలీతో గణపతి పూజ చేశాడు. ఈ పూజలో నాని కుమారుడు అర్జున్ శ్లోకాలు చదివాడు. అర్జున్‌ను నాని ముద్దుగా జున్ను అని పిలుచుకుంటాడు.
జున్ను కాలికి ఫ్రాక్చర్
అయితే ఇటీవల జున్ను కాలికి దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయిందట! ఆ విషయాన్ని నాని 'జయమ్ము నిశ్చయమ్మురా' షోలో వెల్లడించాడు. నాని మాట్లాడుతూ.. పిల్లలకు దెబ్బ తగిలినా, ఏదైనా జబ్బు చేసినా చాలా బాధగా అనిపిస్తుంది. ఆ సమయంలో వారి ముఖం చూడలేము. గతేడాది జున్ను సైకిల్ మీద నుంచి పడటంతో కాలికి ఫ్రాక్చర్ అయింది. కాలు కాస్తంత పక్కకు జరిపినా సరే.. నొప్పి అని విలవిల్లాడిపోయేవాడు. వాడు కదలడానికి లేదు, లేవడానికి లేదు. బాత్రూమ్‌కు కూడా మేమే తీసుకెళ్లేవాళ్లం. ఒక్కోసారి అర్ధరాత్రిళ్లు లేచి నొప్పిగా ఉందని ఏడ్చేవాడు.

అర్ధరాత్రి లేచి సారీ చెప్పాడు
వాడిని చూసుకునే క్రమంలో అంజుకు, నాకు సరిగా నిద్రుండేది కాదు. ఒకరోజు రాత్రి జున్ను సడన్‌గా లేచి నా చేయి పట్టుకుని సారీ నాన్న అన్నాడు. నాకెందుకు సారీ చెప్తున్నావురా? అంటే నా వల్ల మీ అందరికీ నిద్ర ఉండట్లేదు కదా అన్నాడు. అంత చిన్న పిల్లాడికి అంత పెద్ద మాట ఎలా వచ్చిందో అంటూ హీరో భావోద్వేగానికి లోనయ్యాడు. సినిమాల విషయానికి వస్తే.. నాని చివరగా హిట్: ద థర్డ్ కేస్ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ద ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.
చదవండి: సూపర్‌స్టార్ సినిమాని దాటేసిన 'కొత్త లోక'.. కలెక్షన్ ఎంతంటే?