సింగర్ చిన్మయి ఎప్పటికప్పుడు ఏదోలా సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతూనే ఉంటుంది. నిర్భయంగా తన అభిప్రాయాల్ని చెప్పే ఈమెపై ట్రోలింగ్స్, విమర్శలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు ఈమె ఫొటోని మార్ఫింగ్ చేసిన కొందరు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి.. తన ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇలాంటి సైకోలతో మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
(ఇదీ చదవండి: కన్నడ యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్)
'ఈరోజు ఒక పేజీ నుండి మార్ఫింగ్ చేసిన నా చిత్రాన్ని తీసుకొని పోలీసులను ట్యాగ్ చేశాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది సమస్య కాదు. మా కుటుంబాన్ని వేధించడానికి గత 8-10 వారాలుగా డబ్బు చెల్లించి ఇలాగే చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు వారి భార్య, చెల్లెళ్లను ఎక్కువగా వేధిస్తారు. ఈ సైకోల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి' అని చిన్మయి చెప్పుకొచ్చింది.
పుట్టిన పిల్లలు చచ్చిపోవాలని కోరుకునే ఇలాంటి అబ్బాయిలకు అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేయాలా? అని చిన్మయి ప్రశ్నించింది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు వస్తే అమ్మాయిలు భయపడొద్దని, కుటుంబ సభ్యులకు తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చిన్మయి సూచించింది. ఇదే కాదు గత నెలలో ఈమె భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన 'ద గర్ల్‌ఫ్రెండ్' మూవీ రిలీజైంది. అప్పుడు కూడా చిన్మయి, రాహుల్‌పై దారుణమైన విమర్శలు వచ్చాయి.
(ఇదీ చదవండి: తనూజకు కల్యాణ్ ఫుల్ సపోర్ట్.. అయినా టాప్‌లో భరణి)


