ఓటీటీలో 'శారీ' సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..? | Saree Movie OTT Streaming Details Out Now | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'శారీ' సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Jul 7 2025 5:48 PM | Updated on Jul 7 2025 7:20 PM

Saree Movie OTT Streaming Details Out Now

ఆర్జీవీ డెన్‌ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘శారీ’(Saaree Movie ) సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు.  ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. ఏప్రిల్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం  ల‌య‌న్స్ గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీలో తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, 'ఆహా'లో కూడా ఈ చిత్రం విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటన వచ్చేసింది. జుల్లై 11 నుంచి ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఉవుతుందని ఒక పోస్టర్‌ను షేర్‌ చేశారు. ఇందులో ఆరాధ్య దేవి, సత్య యాదు జంటగా  నటించారు.

కథ ఏంటి..?
ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య  నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్‌ సంభ్యాల్‌)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement