
నటి జెనీలియాను పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లనున్నారట రామ్‌గోపాల్ వర్మ. ‘సత్య (1988), కౌన్ (1999), శూల్’ (1999) చిత్రాల తర్వాత బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం పోలీస్ స్టేషన్ మే భూత్’. ఈ సినిమాలోని ఓ లీడ్ రోల్ కోసం జెనీలియాను సంప్రదించగా, ఆమె ఓకే చెప్పారని బాలీవుడ్ సమాచారం. ఈ హారర్ కామెడీ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోందట.
ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను ప్రకటించారు రామ్‌గోపాల్ వర్మ. ఓ పోలీస్ స్టేషన్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కొంతమంది గ్యాంగ్‌స్టర్స్ చని పోతారు. ఆ చని పోయిన గ్యాంగ్‌స్టర్స్ భూతాలుగా మారడంతో ఈ పోలీస్ స్టేషన్ ఓ హాంటెడ్ స్టేషన్‌గా మారి పోతుంది. భూతాలైన గ్యాంగ్‌స్టర్స్ పోలీసులను ఎలా ఇబ్బంది పెడతారు? ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా తప్పించుకోగలిగారు? అన్నదే పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమా కథ అని సమాచారం.