చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ | Ram Gopal Varma Apologises to Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరంజీవి స్పెషల్‌ వీడియో.. క్షమాపణలు చెప్పిన రామ్‌గోపాల్‌ వర్మ

Nov 9 2025 10:24 AM | Updated on Nov 9 2025 11:39 AM

Ram Gopal Varma Apologises to Chiranjeevi

నాగార్జునను స్టార్‌గా మార్చిన సినిమా శివ. ఈ చిత్రంతోనే రామ్‌గోపాల్‌ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఫస్ట్‌ సినిమాతోనే ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ శివ మూవీకి ఆయన కెరీర్‌లోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ చిత్రం దాదాపు 36 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌ అవుతోంది. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

చిరంజీవి స్పెషల్‌ విషెస్‌
ఈ క్రమంలో అల్లు అర్జున్‌, ప్రభాస్‌, మహేశ్‌బాబు.. తదితర హీరోలు ఆల్‌ద బెస్ట్‌ చెప్తూ వీడియోలు చేశారు. తాజాగా చిరంజీవి (Chiranjeevi) సైతం ఓ వీడియో వదిలారు. శివ సినిమా చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్‌ సెట్టర్‌.. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పడంతో కొత్త ఒరవడికి నాంది పలికిన మూవీ. ఆ సైకిల్‌ చైన్‌ సీన్‌ అయితే ఇప్పటికీ జనాల మనసుల్లో అలాగే నిలిచిపోయింది.

ఆర్జీవీపై ప్రశంసలు
నాగార్జున నటనలోని తీవ్రత, శక్తి ఫెంటాస్టిక్‌. అమల, రఘువరన్‌.. ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పోశారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్‌గోపాల్‌ వర్మ.. ఆయన విజన్‌, కెమెరా యాంగిల్స్‌, లైట్స్‌, సౌండ్‌ ప్రజెంటేషన్‌.. అన్నీ కొత్తగా వావ్‌ అనిపించాయి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే అనుకున్నాను. హ్యాట్సాఫ్‌ రామ్‌గోపాల్‌ వర్మ.. తెలుగు సినిమా ఉన్నంతకాలం 'శివ' చిరంజీవిలా చిరస్మరణీయం. శివ టీమ్‌కు ఆల్‌ ద బెస్ట్‌ అని పేర్కొన్నాడు.

బాధపెట్టి ఉంటే క్షమించండి
ఈ వీడియోను ఆర్జీవీ (Ram Gopal Varma) ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేస్తూ.. చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపాడు. అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్జీవీ - చిరంజీవి కాంబినేషన్‌లో గతంలో వినాలని వుంది అనే సినిమా ప్లాన్‌ చేశారు. 20% షూటింగ్‌ కూడా పూర్తి చేశారు. కానీ, సడన్‌గా ఆ సినిమాను అటకెక్కించారు. 

అప్పటినుంచే వైరం మొదలు?
ఆ సమయంలో సంజయ్‌ దత్‌ జైలు నుంచి రిలీజవడంతో ఆయనతో ఓ సినిమా చేస్తానని చిరు ప్రాజెక్ట్‌ను వర్మ మధ్యలోనే వదిలేసి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. కథలో హీరో జోక్యం చేసుకోవడం వల్లే సినిమా ఆపేశాడన్న ప్రచారమూ ఉంది. అలా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటినుంచే చిరు- వర్మ మధ్య వైరం మొదలైందని అంటుంటారు. సమయం దొరికినప్పుడల్లా వర్మ.. చిరంజీవిపై సెటైర్లు వేస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా చిరుకు సారీ చెప్పడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు.

 

చదవండి: ఓటీటీలో 'తెలుసు కదా' మూవీ.. అఫీషియల్ ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement