కోట శ్రీనివాసరావు మరణం.. ఆ సినిమాను గుర్తు చేసుకున్న ఆర్జీవీ | Ram gopal Varma Remembers Work with Kora Srinivasa rao | Sakshi
Sakshi News home page

Ram gopal Varma: కోట శ్రీనివాసరావు మరణం.. ఆ సినిమాను గుర్తు చేసుకున్న ఆర్జీవీ

Jul 13 2025 4:26 PM | Updated on Jul 13 2025 4:52 PM

Ram gopal Varma Remembers Work with Kora Srinivasa rao

తెలుగు సినీ ప్రియులను వెండితెరపై అలరించిన కోటా శ్రీనివాసరావు ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కన్నుమూశారు. ప్రాణం ఖరీదు మూవీతో మొదలైన ఆయన జర్నీ.. వందలకు పైగా చిత్రాల్లో నటించి తనదైన నటనలో అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో తనదైన ముద్రవేశారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

లెజెండరీ నటుడు మరణంతో ఆయనతో ఉన్న క్షణాలను టాలీవుడ్ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా మధుర జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. తాజాగా సంచలన డైరెక్టర్గా పేరున్న రాం గోపాల్ వర్మ కోట శ్రీనివాసరావుతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన అనగనగా ఒక రోజు మూవీ సెట్స్లో కోటతో ఉన్న ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. అంతకుముందుకోట శ్రీనివాసరావు మృతి పట్ల ఆర్జీవీ సంతాపం వ్యక్తం చేశారు.

నిస్సందేహంగా నేను చూసిన గొప్ప నటులలో కోట శ్రీనివాసరావు ఒకరని ట్వీట్ చేశారు. శివ,గాయం, డబ్బు, సర్కార్, రక్తచరిత్ర లాంటి సినిమాలకు ఆయన చేసిన కృషి గొప్పదని అన్నారు. ఇప్పుడు మీరు వెళ్లిపోయి ఉండవచ్చు.. కానీ మీ పాత్రలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయని ఆర్జీవీ పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement