
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కుక్కడ బెడద ఎక్కువైపోయింది. వీధి కుక్కల దాడిలో పలువురు యువకులు, చిన్న పిల్లలు తీవ్రంగా గాయపడుతున్నారు. దీంతో సుమోటోగా కేసు తీసుకున్న సుప్రీం కోర్టు.. 8 వారాల్లోగా నగరంలోని వీధి కుక్కలన్నింటిని షెల్టర్లకు తరలించాలని ఆగస్ట్ 11న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు దీన్ని అడ్డుకోవాలని జంతు ప్రేమికులు ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
అయితే సుప్రీంకోర్టు తీర్పుని పలువురు జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇందులో సదా, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హా లాంటి సినీ తారలు కూడా ఉన్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma ) వీరందరికి కౌంటర్ ఇస్తూ ఓ ట్వీట్ చేశాడు.
వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఓ చిన్నారికి సంబంధించిన వీడియోని ఎక్స్‌లో షేర్ చేస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పుపై ఏడుస్తున్న డాగ్ లవర్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక నగరం మధ్యలో పట్టపగలు నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్స్ ఆర్జీవీ పోస్ట్‌కి మద్దతు తెలుపుతున్నారు. గతంలో ఇలాంటివి చాలా జరుగాయంటూ ఆయా వీడియోలను షేర్ చేస్తున్నారు.
To all the DOG LOVERS who are crying hoarse on the SUPREME court’s judgement on STRAY DOGS , please check this video , where a 4 year old boy was killed by street dogs in broad day light in the middle of a city pic.twitter.com/DWtVnBchvQ
— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025