డబ్బు కన్నా... పట్టుదల ముఖ్యం
బెంగళూరు: ఐపీఎల్‌తో తక్షణమే పేరు ప్రఖ్యాతలు వచ్చినా... సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ప్రస్తుతం కాలంలో ఐపీఎల్ వల్ల యువ ఆటగాళ్లకు భారీగా డబ్బు, పేరు వస్తోందని... అయితే అక్కడితో ఆగిపోకుండా మరింత కష్టపడితేనే ఆటలో గొప్ప స్థాయికి చేరగలరని కోహ్లి వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆర్సీబీ స్పోర్ట్స్ సమ్మిట్ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ... ‘అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్ల ఆటగాడిగా కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం. పట్టుదలను డబ్బుతో ముడిపెట్టలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఐపీఎల్ రూపంలో 20 బంతుల్లో 40–50 పరుగులు చేస్తే చాలు ఎనలేని పేరు, డబ్బు వస్తున్నాయి. అది సుఖవంతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ 10–15 ఏళ్లు ఏకబిగిన అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దానికి ఎంతో పట్టుదల ఉండాలి. అది టి20 క్రికెట్ ఆడినంత సులువు కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అభిమానుల ఆదరణ, ఆట నుంచి గౌరవం పొందగలం. అలా అని టి20 క్రికెట్‌ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఇటీవలి కాలంలో చూస్తే... గొప్ప గొప్ప పవర్ హిట్టర్లు పుట్టుకొస్తున్నారు. వారు బంతిని బాదుతున్న విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవలీలగా సిక్స్‌లు కొడుతున్నారు. ఐపీఎల్ ఆరంభంలో మాదిరిగా ప్రతిసారి భారీ స్కోర్ల పిచ్‌లు ఎదురుకావు. కొన్నిసార్లు కఠినమైన పిచ్‌పై రెండు, మూడు వికెట్లు కోల్పోయినప్పుడు 175–180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి జట్టును గెలిపించాల్సి వస్తుంది. అలాంటి స్థితిని తట్టుకున్న బ్యాటర్ దీర్ఘకాలం నిలబడగలుగుతాడు. పరిస్థితులు పరీక్షిస్తున్న సమయంలో అత్యుత్తమ ఆట తీరు కనబర్చడం ముఖ్యం. నా వరకైతే ఆటను ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని... పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగుతా. నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకోవాలి అంటే బలమైన పునాది అవసరం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక బంతిని ఎదుర్కొనే ముందు మీ దగ్గర ఎక్కువ మార్గాలు ఉండాలి. అప్పుడే కష్టమైన పిచ్‌పై కూడా పరుగులు రాబట్టగలం. అది కేవలం సాధన వల్లే సాధ్యమవుతుంది’ అని వివరించాడు.
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.చవితి సా.4.22 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.11.13 వరకు తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.28 నుండి 11.58 వరకు, దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.21 వరకు, అమృత ఘడియలు: లేవు.సూర్యోదయం : 5.31సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన పనులు చకచకా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. స్థిరాస్తి వృద్ధి. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.వృషభం... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందగోళంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.మిథునం.... సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.కర్కాటకం... బడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.సింహం... శ్రమ ఫలించే సమయం. నూతన విద్యావకాశాలు. కొత్త వ్యక్తులతో పరిచయం. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.కన్య.... వ్యవహారాలలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి సైతం సాయం అందుతుఉంది. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు.వృశ్చికం.... పనుల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.ధనుస్సు.... మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థికాభివృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖుల పరిచయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.మకరం.... దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనప్రాప్తి. పాతమిత్రుల కలయిక. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.కుంభం... బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని పనుల్లో అవాంతరాలు ఎదురుకావచ్చు. శ్రమాధిక్యం. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దైవదర్శనాలు.మీనం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా
సాక్షి, అమరావతి : అసలు దొంగలు తప్పించుకోవాలంటే, ఇంకెవరిపైనైనా దొంగ అనే ముద్ర వేయాలి. తద్వారా తాము దొంగలము, దోషులము కాదని ప్రజల దృష్టిని మళ్లించాలి. టీటీడీ ఆన్లైన్లో దొరకాల్సిన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లను దళారుల చేతుల్లో పెట్టి.. సెకన్ల వ్యవధిలో టికెట్లు దక్కించుకుంటున్న వ్యవహారంలో అసలు సూత్రధారులు టీటీడీ, ప్రభుత్వ పెద్దలు అచ్చంగా ఇలానే చేస్తున్నారని స్పష్టమవుతోంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోసం భక్తులు తమ వివరాలు నమోదు చేసేలోపే కేవలం 10–15 సెకండ్ల వ్యవధిలోనే అత్యధికంగా టికెట్లు బుక్ అవ్వడం వెనుక పెద్ద స్థాయి రాకెట్ ఉందని తేటతెల్లమైంది. పై స్థాయిలో పెద్దల సహకారం లేనిదే టీటీడీ చరిత్రలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద దందా ఇలా కొనసాగదని టీటీటీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆన్లైన్ ద్వారా శ్రీవాణి టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలు తాజాగా వెలుగులోకి రాగానే అటు భక్తులు, ఇటు టీటీడీ, ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాలక మండలి పెద్దలకు పూర్తి అనుకూలురుగా, చెప్పింది చెప్పినట్లు చేసే వ్యక్తిని ముందుపెట్టి.. అతనికి అర్హత లేకపోయినా అందలం ఎక్కించి దందా సాగిస్తున్నారు. ఏఈవో స్థాయిలో పనిచేసే వెంకటేశ్వర నాయుడుని ముందు పెట్టి.. డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించి అనుకున్నది అనుకున్నట్లు చేస్తున్నారు. ఇదే వెంకటేశ్వర నాయుడు ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు నిరూపితం కావడంతో గత పాలక మండలి హయాంలో ఆయనకు మెమో ఇచ్చారు. అలాంటి ఆయన్ను ముందు పెట్టి.. ప్రస్తుత టీటీడీ పాలక మండలి పెద్దలు అతనికే ఉన్నత బాధ్యతలు అప్పగించారంటే అర్థం ఏమిటి? టీటీడీనీ స్కామ్‌ల మయంగా మార్చడానికి టీటీడీ, ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారనే కదా! ఈ ప్రభుత్వం వచ్చాకే శ్రీవాణి టికెట్ల దందా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సనాతన హైందవ ధర్మం పరిరక్షణ విశ్వవ్యాప్తం చేసేందుకు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో 2019 సెప్టెంబర్ 23న టీటీడీ శ్రీవాణి (శ్రీవేంకటేశ్వర ఆలయాల నిర్మాణం ట్రస్ట్) ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ప్రొటోకాల్ తరహా వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోదలచిన భక్తులు రూ.10 వేలు విరాళంగా, రూ.500 టికెట్ రూపంగా చెల్లించాలి. ఈ టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన నిధులతో హిందూ దేవాలయాల నిర్మాణాలు, పునరుద్దరణ, ధూపదీప నైవేద్యాలకు ఖర్చు చేయటమే శ్రీవాణి ట్రస్ట్ లక్ష్యం. ఇందులో భాగంగా ప్రతి రోజూ శ్రీవాణి ట్రస్ట్ కింద టీటీడీ వెయ్యి టికెట్లు జారీ చేయటం ప్రారంభించింది. ఇందులో 500 టికెట్లు ముందస్తుగా ఆన్లైన్ విధానంలో విడుదల చేసేవారు. మరో 500 టికెట్లను ఆఫ్‌లైన్ విధానం ద్వారా భక్తులు నేరుగా టికెట్ పొందేవారు. ఆఫ్‌లైన్ విధానం ద్వారా పంపిణీ చేసే 500 టికెట్లలో 400 టికెట్లు టీటీడీ జేఈఓ కార్యాలయం వద్ద ఇచ్చేవారు. మిగిలిన 100 టికెట్లు తిరుపతి విమానాశ్రయం వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడే విక్రయించేవారు. కాగా, ఎన్నికలకు ముందు శ్రీవాణి ట్రస్టును చంద్రబాబు రద్దు చేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రస్టు రద్దు మాటను పక్కనపెట్టి, దాని ఆధారంగా నిధులను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ హయాంలో వెయ్యి టికెట్లు ఇస్తే.. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సంఖ్యను రెండు వేలకు పెంచేశారు. విమానాశ్రయం వద్ద మాత్రమే కొన్ని టికెట్లను ఆఫ్‌లైన్‌లో ఇస్తున్నారు. మిగతావన్నీ ఆన్లైన్ విధానం ద్వారా విక్రయిస్తున్నారు. దీని ఆధారంగానే దందాకు శ్రీకారం చుట్టారని తెలిసింది. ఆటో ఫిల్లింగ్ పద్దతుల ద్వారా దళారులను అడ్డుపెట్టుకుని దందా సాగిస్తున్నారని స్పష్టమవుతోంది. ఫలితంగానే ఈ టికెట్లు 10–15 సెకన్ల వ్యవధిలోనే ఫిల్ అవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో నిబంధనల ప్రకారమే నియామకం మురళీ సందీప్‌రెడ్డిని టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్‌గా నియమించడం పూర్తి నిబంధనల ప్రకారమే జరిగిందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ నియామక ప్రక్రియకు విధివిధానాలు, అర్హతలు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి నియమించిన కమిటీనే నిర్ధారించింది. ఆ కమిటీలో సుధా నారాయణమూర్తి లాంటి పలువురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్, ఇస్రో శాస్త్రవేత, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో మురళీ సందీప్‌రెడ్డి నియామకం జరిగింది. ఆ ఎంపిక కమిటీలో మరో సభ్యుడిగా నియమితులైన నాగారం అమర్‌ను అర్హత లేకుండా కమిటీలో నియమించినట్టు టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవానికి అమర్ స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదివారు. ప్రముఖ సంస్థ వాల్‌మార్ట్‌తో పాటు ఫ్లిప్‌కార్డు, మింధ్రా వంటి దిగ్గజ కంపెనీల్లో పని చేశారనే విషయాన్ని దాచి మరీ దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. ఇంకోవైపు.. టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ నియామక ఇంటర్వ్యూలు 2022 మే నెలలో కొనసాగగా, ఆ బాధ్యతల్లో మురళీ సందీప్‌రెడ్డిని 2024 మార్చిలో ఖారారు చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్లో మీడియా చెబుతున్నట్లు అప్పటి టీటీడీ పాలక మండలి పెద్దలు తమకు కావాల్సిన వారిని ఆ బాధ్యతల్లో నియమించాలని అనుకుంటే ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి దాదాపు రెండేళ్ల కాలం ఎందుకు వేచిచూస్తారనే ప్రశ్నపై అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. శ్రీవాణి టిక్కెట్ల అక్రమాల ఆరోపణలు తమపైకి రావడంతోనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి పెద్దలు మురళీ సందీప్‌రెడ్డిపై, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని తేటతెల్లమైంది. దందా బయట పడగానే డైవర్షన్ రాజకీయం తొలుత చెన్నైకి చెందిన ‘ఎంఎస్ పద్మావతి ట్రావెల్స్’ అనే సంస్థపై వచ్చిన ఫిర్యాదుతో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కుంభకోణం వ్యవహారం వెలుగులోకి రాగానే టీటీడీ, ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎప్పటిలాగే ఎల్లో మీడియా ద్వారా డైవర్షన్ రాజకీయానికి తెర లేపారు. టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ మురళీ సందీప్‌రెడ్డి వైఎస్సార్సీపీ వ్యక్తి అని, దీంట్లో ఆయన ప్రమేయం ఉందన్నట్లు దుష్ప్రచారానికి ఒడిగట్టారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సదరు మురళీ సందీప్‌రెడ్డిని స్విమ్స్‌లో సాఫ్ట్వేర్ మానిటరింగ్ విభాగానికి బదిలీ చేసింది. టీటీడీలో ఆ పోస్టు నుంచి ఆయన్ను వెంటనే తొలగించింది. ఈ లెక్కన దాదాపు రెండేళ్లుగా టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ విధుల్లో ఆయన లేనేలేరు. టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్‌కు ఉండే అధికారిక ఆన్లైన్ లాగిన్లు అన్నింటి నుంచీ మురళీ సందీప్‌రెడ్డిని అప్పుడే తొలగించారు కూడా. కానీ, శ్రీవాణి ట్రస్టు దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెట్ దందా బట్టబయలు కాగానే, బెంబేలెత్తిపోయిన టీటీటీ, ప్రభుత్వ పెద్దలు మురళీ సందీప్రెడ్డే ఇప్పటికీ టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ విధుల్లోనే కొనసాగుతున్నట్టు దుష్ప్రచారం చేస్తూ ఎల్లో మీడియా ద్వారా డైవర్షన్ రాజకీయానికి తెరతీయడం దుర్మార్గం.
పెంకులేకుండానే గుడ్లను పొదిగారు!
వాషింగ్టన్: అంతరించిపోయిన జీవులను డీఎన్ఏల సాయంతో మళ్లీ పునర్సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాలోని జీవసాంకేతికరంగ సంస్థ ‘కొలోసల్ బయోసైన్సెస్’తన ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. న్యూజిలాండ్‌లో చాలా శతాబ్దాల క్రితం అంతరించిపోయిన భారీ పక్షిజాతి ‘మోవా’ను పునర్సృష్టించే క్రతువులో మరో ముందడుగువేశామని కొలోసల్ బయోసైన్సెస్ తాజాగా ప్రకటించింది. మోవాకు జన్యువులపరంగా అత్యంత సారూప్యత ఉండే ఇతర జాతుల పక్షుల డీఎన్ఏతో సింథసిస్ చేసి తొలుత మోవా గుడ్డును తయారుచేయాలని సంకల్పించింది.అయితే ఆనాటి మోవాజాతి గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే ఏకంగా గరిష్టంగా 80 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇంతటి భారీ గుడ్డును పొదగాలంటే అంతపెద్దస్థాయిలో కృత్రిమ ఎగ్‌షెల్ అవసరం అవుతుంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కృత్రిమమేధతో త్రిమితీయ(3డీ) ముద్రిత చిన్నపాటి ఎగ్‌షెల్‌ను తయారుచేశామని కంపెనీ ప్రకటించింది. ఇందులో సాధారణ కోడి గుడ్లలోని పచ్చ, తెల్లసొనలను బయటకుతీసి ఈ 3డీ ముద్రిత ఎగ్షెల్లో పెట్టి విజయవంతంగా పొదిగామని కంపెనీ మంగళవారం వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా ఇలా ఇప్పటిదాకా 26 కోడిపిల్లలను సృష్టించారు. ఏఐ ఎగ్‌షెల్ ఎలా? పెంకును పగలగొట్టి పచ్చ, తెల్లసొనలను కప్పులాంటి ఇతర గోళాకార ఆకృతుల్లో పొదగడంపై గతంలోనూ చాలా మంది ప్రయోగాలు చేశారు. అయితే సహజసిద్ధ పెంకు నుంచి మాత్రమే సరిపడా ఆక్సిజన్ అందుతుంది. దాంతోనే లోపల గుడ్డు పొదుగుతుంది. ఇందుకోసం ఆక్సిజన్ సరైన మోతాదులో అందేలా లోపలివైపు జల్లెడ లాంటి దానిని కొలోసల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దానికి బయటివైపు పారదర్శకంగా ఉండేలా మరో కణత్వచాన్ని తయారుచేశారు. వీటి సాయంతో పచ్చ,తెల్లసొనలు ఏమాత్రం పాడవకుండా సహజసిద్ధ వాతావరణాన్ని వాటికి అందించామని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చ,తెల్లసొన కోడిపిల్లగా మారే క్రమంలో సాధారణ పెంకు నుంచి కాల్షియంను సంగ్రహించుకుంటుంది.ఇదే తరహాలో తాము కూడా ఈ ఏఐ ఎగ్‌షెల్ ద్వారా కాల్షియంను అందించామని పరిశోధకులు తెలిపారు. ఈ ఎగ్‌షెల్‌ను ఇంక్యుబేటర్‌లో పెట్టి సరిపడా వేడిని అందించి పొదిగారు. తమ ప్రయోగం విజయవంతంకావడంపై కొలోసల్ సంస్థ సీఈఓ బెన్లామ్ ఆనందం వ్యక్తంచేశారు. సింథటిక్ బయాలజీ పితామహుడిగా పేరొందిన అమెరికా దిగ్గజ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ జార్జ్ చర్చ్ ఆధ్వర్యంలో కొలోసల్ సంస్థ పనిచేస్తోంది. ‘‘కృత్రిమమేధతో పనిచేసే కృత్రిమ ఎగ్‌షెల్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే భవిష్యత్తులో అంతరించిపోయిన పక్షిజాతులకూ తిరిగి ప్రాణం పోయవచ్చు. న్యూజిలాండ్‌లో ప్రాచీనకాలంలో కలియతిరిగిన మోవా జాతిని పునర్సృష్టించాలంటే దాని గుడ్డును మోయగలిగే భారీ పక్షిజాతులు ఇప్పుడులేవు. అందుకే ఇలా కృత్రిమ ఎగ్‌షెల్ తయారీకి పూనుకున్నాం’’అని బెన్లామ్ వివరించారు.
మళ్లీ ‘పెట్రో’ మంట
సెప్టెంబర్‌లో భారత్‌కు పుతిన్
ఒకవైపు మోసం చేస్తూ.. మరోవైపు మాటలు చెబుతూ..
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా
స్పెషల్ ఎట్రాక్షన్
ఫలించిన గిరిజన యువకుడి 13 ఏళ్ల న్యాయపోరాటం
తమిళ భాష నేర్చుకుంటున్నాను
మద‘గజం’ సర్కారు
నేను ఒంటరివాడిని కాను: సల్మాన్ ఖాన్
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
దగ్గుపాటి రాజకీయం.. టీడీపీలో భారీ పొలిటికల్ ట్విస్ట్
మళ్లీ ‘పెట్రో’ మంట
సెప్టెంబర్‌లో భారత్‌కు పుతిన్
ఒకవైపు మోసం చేస్తూ.. మరోవైపు మాటలు చెబుతూ..
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా
స్పెషల్ ఎట్రాక్షన్
ఫలించిన గిరిజన యువకుడి 13 ఏళ్ల న్యాయపోరాటం
తమిళ భాష నేర్చుకుంటున్నాను
మద‘గజం’ సర్కారు
నేను ఒంటరివాడిని కాను: సల్మాన్ ఖాన్
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
దగ్గుపాటి రాజకీయం.. టీడీపీలో భారీ పొలిటికల్ ట్విస్ట్
ఫొటోలు
'పెద్ది' కోసం జాన్వీ కపూర్ రెడీ అయిందిలా (ఫొటోలు)
రాశీ ఖన్నా గ్లామర్ ఫోటోషూట్
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
మంచు మనోజ్ కొత్త ట్రస్ట్ ప్రారంభం (ఫొటోలు)
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
పెట్రో బాదుడు: వైఎస్సార్సీపీ పోరుబాటకు విశేష స్పందన
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
అనంతపురం : భారమైన వేళ.. బాధతో విక్రయం! (ఫొటోలు)
సినిమా
రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్మెంట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. తన భార్య మౌనిక రాజకీయ ఎంట్రీపై స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి బయటపెట్టారు. తాము నెలకొల్పిన సేవా సంస్థ 'ఐక్య' గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?)'ఐక్య' స్వచ్ఛంద సంస్థ. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ప్రజల కోసం దీన్ని ప్రారంభించాం. దీని కోసం మేం మా సొంత నిధులే ఖర్చు పెట్టనున్నాం. నా భార్య మౌనిక రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రస్తుతం మేం రాజకీయాల్లో భాగమయ్యాయం అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.మౌనిక విషయానికొస్తే.. ఉమ్మడి కర్నూలుకి చెందిన భూమా కుటుంబం ఈమెది. ఈమె తండ్రి భూమా నాగిరెడ్డి వైసీపీ, టీడీపీ, ప్రజారాజ్యం తరఫున రెండుసార్లు ఎమ్మెల్మేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి కూడా రెండుసార్లు ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత పెద్ద కుమార్తె అఖిలప్రియ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ నుంచి గెలిచిన ఈమె.. తర్వాత టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయింది. తల్లిదండ్రుల రాజకీయ వారసురాలగా అఖిలప్రియ కొనసాగుతున్నారు. ఇప్పుడు చిన్నకుమార్తె మౌనిక కూడా రాజకీయాల్లోకి వస్తుండటంతో రాయలసీమ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. మరి మౌనిక.. ఏ పార్టీ తరఫున ఎక్కడ పోటీ చేస్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే)
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనడా నుంచి వచ్చి కిడ్నాప్- హత్య
పంజాబ్‌లో లేడీ సింగర్ హత్య ఉదంతం సంచలనం సృష్టించింది. యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్ (29) మృతదేహాన్ని ఆరు రోజుల తర్వాత పోలీసులు నీటి కాలువలో గుర్తించారు. మే 13న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇందర్ కౌర్.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మృతదేహం లభించడంతో అసలేం జరిగిందనే విషయాలు బయటకొచ్చాయి.(ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే)హత్యకు గురైన ఇందర్ కౌర్ సోదరుడు జోటిందర్ సింగ్ ఫిర్యాదు ప్రకారం.. ఇందర్ మే 13న రాత్రి 8:30 గంటలకు కారులో సరుకులు కొనుగులు చేసేందుకు వెళ్లింది. కాసేపటి తర్వాత నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. అయితే ఈమె కనిపించకపోవడం వెనక మోగా జిల్లాకు చెందిన సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మూడేళ్ల క్రితం ఇందర్ కౌర్‌కి ఇన్ స్టా ద్వారా సుఖ్విందర్ సింగ్ పరిచయమయ్యాడు. ప్రేమ పేరిట పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయిందని తెలుసుకున్న ఇందర్ కౌర్, సుఖ్విందర్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు.. ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసుల దర్యాప్తు ప్రకారం.. కెనడాలో ఉంటున్న సుఖ్విందర్, నేపాల్ గుండా పంజాబ్‌కి చేరుకున్నాడు. 13వ తేదీన తన సహచరులతో కలిసి ఇందర్ కౌర్ కారుని అడ్డగించి తుపాకీతో బెదిరించి ఆమెని కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆమెని హత్య చేసి నీటి కాలువలో పడేశాడు. నేరం చేసిన వెంటనే నేపాల్ ద్వారానే తిరిగి కెనడాకి పారిపోయాడని తెలుస్తోంది.అయితే ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇందర్ కౌర్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15వ తేదీనే జమాల్పూర్ పోలీస్ స్టేషన్లో సుఖ్విందర్ సింగ్, కరమ్‌జిత్ సింగ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇందర్ కౌర్ మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. నిందితులని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదు.. కొత్త తెలుగు సినిమా)
పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కు ఎంట్రీ ఈజీగానే ఉంటుంది, కానీ తమని తాము నిరూపించుకోవడమే అసలైన టాస్క్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కెరీర్ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో బిగ్ బ్రేక్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి, ఇక్కడి కమర్షియల్ ఫార్మాట్ ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.'దేవర'లో గ్లామర్ షోకే పరిమితంభారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'తంగం' అనే పల్లెటూరి పడచు పాత్రలో జాన్వీ లుక్స్, ముఖ్యంగా ‘చుట్టమల్లే’ పాటలో ఆమె పండించిన గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఒక నటిగా చూస్తే మాత్రం దేవరలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. కేవలం గ్లామర్ షోకే, కమర్షియల్ ఎలిమెంట్స్‌కే ఆమెను పరిమితం చేసేశారనే విమర్శలు వచ్చాయి.'పెద్ది’లోనూ అదే రిపీట్ అవుతుందా?ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే, నిన్న రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇందులోనూ ఆమె కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయినట్లుగా అర్థమవుతుంది. కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ ప్లస్ కావచ్చు. కానీ, ‘పెద్ది’ లాంటి రా అండ్ రస్టిక్, ఇంటెన్స్ కథలకు గ్లామర్ మాత్రమే నమ్ముకుంటే అది సినిమాకే మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ‘పెద్ది’ సినిమాలోనూ జాన్వీ పాత్రకు నటన పరంగా స్కోప్ లేకపోతే, ఆమె టాలీవుడ్ కెరీర్‌కు అది పెద్ద మైనస్ అవుతుంది. టాలీవుడ్లో లాంగ్ రన్ ఉండాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు, బలమైన పాత్రలు కూడా పడాలి.దాచి పెట్టారా?గ్లింప్స్, ట్రైలర్లో జాన్వీ గ్లామర్ షోకే పరిమితం చేశారు. ప్రతి సీన్ లో పైట గాల్లోకి ఎగరేస్తూ నడుము హైలైట్ అయ్యేలా పదే పదే ఫ్రేమ్ సెట్ చేశాడు దర్శకుడు. కానీ హీరో రామ్ చరణ్ మాత్రం జాన్వీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. పెద్దిలో జాన్వీ నటన ఓ రేంజ్లో ఉంటుందని చెబుతున్నాడు. డాన్స్ కూడా అద్భుతంగా చేసిందని ప్రశంసించాడు. చరణ్ మాటల బట్టి చూస్తే.. ట్రైలర్లో జాన్వీని కావాలనే గ్లామర్ డాల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. ఆమె నటనకు సంబంధించిన సీన్‌ని పెడితే.. రిలీజ్ ముందే కథపై ఊహగానాలు ఎక్కువైపోతాయని దర్శకుడు భావించాడట. అందుకే ట్రైలర్లో చరణ్‌ని మాత్రమే హైలెట్ చేస్తూ.. మిగతావాళ్ల సీన్లను దాచిపెట్టాడని టాలీవుడ్ టాక్. ఒకవేళ అదే నిజమై.. జాన్వీకి మంచి సీన్లు పడితే ఒకే. కేవలం పాటలకే పరిమితం అయితే మాత్రం.. ఆమె కెరీర్‌కి ఇబ్బంది తప్పదని సినీ పండితులు చెబుతున్నారు.
మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే
ఒకప్పుడు తెలుగులో హీరోగా సినిమాలు చేసిన మంచు మనోజ్.. రీసెంట్ టైంలో మిరాయ్, భైరవం చిత్రాలతో విలన్‌గా మారిపోయాడు. ఆకట్టుకున్నాడు కూడా. ప్రస్తుతం 'డేవిడ్ రెడ్డి' అనే మూవీలో నెగిటివ్ టచ్ ఉండే హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఓ ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. మీడియాతో కలిసి తన ప్రీ బర్త్ డే వేడుకల్ని హైదరాబాద్‌లో చేసుకున్నాడు. ఇందులోనే తండ్రితో గొడవ గురించి ప్రశ్న ఎదురవగా సెటైరికల్‌గా సమాధానమిచ్చాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ అదేనా?)'మీ నాన్నతో గొడవ క్లియర్ అయినట్టేనా?' అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మనోజ్.. అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా? కానీ మైక్‌తో వెళ్ళకండి. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. గతంలో మంచు కుటుంబంలో గొడవ జరుగుతున్నప్పుడు ఓ మీడియా ప్రతినిధిని మోహన్ బాబు మైక్‌తో కొట్టారు. తర్వాత క్షమాపణ చెప్పారు.మీడియాతో మాట్లాడుతూ మనోజ్ మరికొన్ని విషయాల్ని పంచుకున్నాడు. భైరవం, మిరాయ్ సినిమాలు నాకు ఇచ్చిన డైరెక్టర్స్ ఇద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఇంకో జన్మ ఇచ్చారు. అలానే నా భార్య మౌనిక కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని మనోజ్ చెప్పాడు.తాజాగా 'ఐక్య ధైర్య సేనా సమితి' పేరుతో ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. ఎవరైనా బెదిరింపు కాల్స్‌తో బాధపడుతుంటే వాళ్లకు మా ట్రస్ట్ అండగా ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికే దీనిని మొదలుపెట్టాం. ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని, వారి చదువు బాధ్యతలను ఈరోజు నుంచే పూర్తిగా తీసుకుంటామని మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ)Media Person: మీ ఫ్యామిలీ ఇష్యూ క్లియర్ అయినట్టేనా ? #ManchuManoj: అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా ? వెళ్ళి అడగండి. కానీ Mic పట్టుకొని వెళ్లొద్దు. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. pic.twitter.com/M4WBvEe1rH— cinee worldd (@Cinee_Worldd) May 19, 2026
క్రీడలు
‘ఏఐటీఏలోకి అడుగు పెడతా’
ముంబై: భారత మాజీ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఇప్పుడు పరిపాలనా వ్యవహారాల వైపు పూర్తి స్థాయిలో రావాలని ఆశిస్తున్నాడు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఎన్నికల్లో పాల్గొని జాతీయ స్థాయిలో అన్ని రకాలుగా భాగం కావాలని అతను భావిస్తున్నాడు. ఏఐటీఏలో చేరితే టెన్నిస్‌లో పలు కీలక మార్పులు తీసుకొచ్చేందుకు తాను సిద్ధమని బోపన్న ప్రకటించాడు. 2024లో జరిగిన ఎన్నికల ఫలితాలపై చెలరేగిన వివాదం కోర్టు జోక్యంతో ఇటీవలే సమసిపోగా... త్వరలోనే మళ్లీ పూర్తి స్థాయిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బోపన్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బోపన్న ఇప్పటికే కర్ణాటక టెన్నిస్ సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ‘ఏఐటీఏలో ఎన్నికల సమయం వచ్చింది. నాకూ ఏదైనా అవకాశం దొరికితే ఈ పరిపాలనలో భాగం కావాలని కోరుకుంటున్నా. భారత టెన్నిస్‌ను అభివృద్ధి చేసే దిశగా కీలక మార్పులు చేయగలననే విశ్వాసం నాకుంది. అలాంటి అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఏదో ఒక పదవి తీసుకోవడం నా ఉద్దేశం కాదు. నా వంతుగా ఏదైనా చేయగలనని నమ్మితే కచ్చితంగా వస్తా’ అని బోపన్న చెప్పాడు. మరోవైపు భారత టెన్నిస్‌లో డబుల్స్ ఆటగాళ్లను తీర్చిదిద్దే క్రమంలో తన సొంత అకాడమీలో సాగుతున్న ‘డబుల్స్ డ్రీమ్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంపై కూడా బోపన్న మాట్లాడాడు. ఇటీవలి కాలంలో డబుల్స్‌కు కూడా ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో తాను దానిపై దృష్టి పెట్టానని, పైగా స్పాన్సర్ల సహకారం కూడా లభించిందని అతను వెల్లడించాడు. ‘మా అకాడమీలో డబుల్స్ ఆటగాళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. దీనికి స్పాన్సర్లు కూడా లభించడం సానుకూలాంశం. సింగిల్స్‌తో పోలిస్తే ఇటీవల డబుల్స్‌కు మంచి ప్రాధాన్యత పెరిగింది. అందుకే దీనికి డబుల్స్ డ్రీమ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టాం. మా అకాడమీలో మొత్తం 175 మంది ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఇప్పటికే దక్షిణేశ్వర్ సురేశ్, వైష్ణవి అడ్కర్, దేవ్ జావియా, ప్రార్థన తోంబరే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అసోం, జమ్మూకు చెందిన కొందరు ప్రతిభ గల పేద కుర్రాళ్లకు గుర్తించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. భవిష్యత్తులో అత్యుత్తమ ఆటగాళ్లు రావాలనేదే నా లక్ష్యం’ అని గతంలో డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన రోహన్ బోపన్న వివరించాడు.
82 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టాతో...
లాస్ ఏంజెలిస్: మహిళల టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు... సుదీర్ఘ కెరీర్లో 12 సింగిల్స్ ట్రోఫీలు సహా ఏకంగా 39 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఘనత... ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు... ఆమె పేరుతోనే మహిళల టెన్నిస్‌లో టీమ్ ఈవెంట్ నిర్వహణ... ఇవన్నీ బిల్లీ జీన్ కింగ్ సొంతం. అయితే ఇంత అసాధారణ కెరీర్ తర్వాత కూడా జీన్ కింగ్ మదిలో ఒక తీరని కోరిక మిగిలిపోయింది. ఆటలో పడి తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయలేకపోయానని అనిపించేది. రెండేళ్ల క్రితమే చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పుడు దానిని సాధించి చూపించింది. 82 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పట్టాతో సగర్వంగా నిలిచింది. లాస్ ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో జీన్ కింగ్ 1961లో అడ్మిషన్ తీసుకుంది. అదే ఏడాది వింబుల్డన్‌లో డబుల్స్ టైటిల్ సాధించడంతో జీన్ కింగ్ చదువుకు దూరమైంది. ఆమె విజయప్రస్థానంలో ఇది మొదటి ట్రోఫీ కాగా... దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె ఆటను శాసించింది. అడ్మిషన్ తీసుకున్న 65 ఏళ్ల తర్వాత ఆమె చేతుల్లోకి డిగ్రీ రావడం విశేషం. ‘దీని విలువ ఎంతో నేను మాటల్లో చెప్పలేను. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఏదైనా సాధించాలని అనుకుంటే, మీపై మీకు నమ్మకం ఉంటే వయసులో సంబంధం లేదు. దేనికైనా ఆలస్యం అనేదే ఉండదు’ అని బిల్లీ జీన్ కింగ్ వ్యాఖ్యానించింది. 2026లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న మరో 6 వేల మందితో కలిసి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కరతాళ ధ్వనుల మధ్య ఆమె తన డిగ్రీ పట్టాను అందుకుంది.
వైభవ్,జురేల్ ఊచకోత.. లక్నోపై రాజస్తాన్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు మరింత దగ్గరైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ (93) విధ్వంసానికి తోడు ధ్రువ్ జురేల్ (53 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్, మోసిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.అంతకముందు లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన పూరన్ (16) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పంత్ (23 బంతుల్లో 35) పర్వాలేదనిపించాడు. అయితే లక్నో చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 220 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లలో యష్ రాజ్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.ఈ విజయంతో రాజస్తాన్ 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన రాజస్తాన్ తమ చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరుకోనుంది. రాజస్తాన్ తమ చివరి మ్యాచ్‌ను మే 24 (ఆదివారం) ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.Joy and jubilation in Jaipur 🩷🥳A statement chase from @rajasthanroyals sees them jump back into the 🔝4️⃣ 👏Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/7lJD2IYOUF— IndianPremierLeague (@IPL) May 19, 2026చదవండి: వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు!
వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం విజయంవంతంగా సాగుతోంది. మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. జైస్వాల్ ఉన్నంతసేపు సైలెంట్‌గా ఉన్న వైభవ్ అతడు ఔటయ్యాకా ఆటను పూర్తిగా మార్చేశాడు.ఇన్నింగ్స్ 8వ ఓవర్ వరకు వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 9వ ఓవర్ వేసిన లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్‌కు ఆ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు, రెండు వైడ్లు కలిపి మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. పనిలో పనిగా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత వైభవ్ తన ఆటలో దూకుడును మరింత పెంచాడు. మయాంక్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జురెల్‌తో కలిసి వైభవ్ మరోసారి చెలరేగిపోయాడు. అగ్నికి వాయువు తోడైనట్లు ఈ ఇద్దరు కలిసి ఆ ఓవర్లో 29 పరుగులు పిండుకున్నారు. తొలుత ధ్రువ్ జురేల్ తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను వరుసగా 4,6,6 బాదాడు. ఆ తర్వాత ఓవర్ ఐదు, ఆరు బంతులను వైభవ్ సూర్యవంశీ సిక్సర్లుగా మలిచాడు.దీంతో చూస్తుండగానే వైభవ్ 80 పరుగుల మార్క్‌ను దాటాడు. ఇక దిగ్వేష్ రాఠీ వేసిన 13వ ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టిన వైభవ్ 90ల్లోకి అడుగుపెట్టాడు. ఇక మరో సెంచరీ ఖాయమనుకున్న దశలో మోసిన్ ఖాన్ 14వ ఓవర్ తొలి బంతికి రనౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ అదే ఓవర్ చివరి బంతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో 93 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది.అంతకముందు లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. 𝗦𝘁𝗼𝗿𝗺 𝗼𝗳 𝗦𝗶𝘅𝗲𝘀 🚀Vaibhav Sooryavanshi lit up #RR's chase with a thunderous 93(38) 🎇Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/qe6TfmGnTx— IndianPremierLeague (@IPL) May 19, 2026Just when we thought we'd seen it all 😅🎥 How has that evaded the stumps? 😮Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/qxBKA8TMhS— IndianPremierLeague (@IPL) May 19, 2026
న్యూస్ పాడ్‌కాస్ట్
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
బిజినెస్
నేను అడ్వైజర్ కాదు.. పెట్టుబడులు మీ ఇష్టం
పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు.. ఆర్థికపరమైన సమాచారం వెల్లడించే రాబర్ట్ కియోసాకి తొలిసారి ఘాటుగా స్పదించారు. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదని, ఇతరులకు పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం లేదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను ఆర్ధిక సలహాదారుని కారు.. అయితే నా పేరును ఉపయోగించి, కొందరు వ్యక్తులు.. నేను చెప్పినట్లు పెట్టుబడులకు సంబంధించిన విషయాలను చెబుతున్నారు. వారికి నా లాయర్ ద్వారా నోటీసులు పంపించాను. నా పేరు వాడి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని హెచ్చరించాను.I AM NOT A FINANCIAl ADVISORMy attorney has sent a “Cease and Decist” notice to someone or group who is using my name to state investments I recommend.Please be aware I will always share with you what I am investing in and why.I do not recommend anyone invest in what I am…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 19, 2026నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో మాత్రమే చెబుతాను. నేను ఎవరిని ఇక్కడే పెట్టుబడులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదని కియోసాకి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఏథీరియం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాను అని చెప్పారు. నాకు 401(k), లేదా IRA వంటి రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాలు లేవని.. స్టాక్స్ లేదా బాండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టడం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహానేను ఏం చేస్తున్నానో చెబుతాను. కానీ ఇతరులు వాటిని తప్పకుండా అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తన ఆర్థిక నిర్ణయాలను తన ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో తీసుకోవడం మంచిది. కియోసాకి మాటలను బట్టి చూస్తే.. ఎవరుపడితే వారు చెప్పినమాటలు విని పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Vodafone Idea: రూ.లక్ష కోట్లు సమీకరణపై ఆశలు
వచ్చే మూడేళ్లలో అవసరమయ్యే రూ. 1 లక్ష కోట్లను సమకూర్చుకునేందుకు కొత్త రుణాలు, ట్యాక్స్ రిఫండ్లు, ప్రమోటర్ల నుంచి మరిన్ని పెట్టుబడులపై టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) భారీగా ఆశలు పెట్టుకుంది. మార్కెట్లో నిలబడే దిశగా నెట్వర్క్ని మెరుగుపర్చుకునేందుకు కంపెనీ దాదాపు రూ. 45,000 కోట్లు వెచ్చించనుంది. అలాగే, వచ్చే మూడేళ్లలో స్పెక్ట్రం చార్జీల కింద సంస్థ రూ. 49,000 కోట్లు, రుణభారానికి సంబంధించిన వడ్డీల కోసం మరో రూ. 5,000-6,000 కోట్లు చెల్లించాల్సి రానుంది.అయితే.. మరింత రుణాన్ని ఈక్విటీ కింద మార్చాల్సిన అవసరం లేకుండానే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తేజస్ మెహతా తెలిపారు. తాము రూ. 25,000 కోట్ల నిధులతో పాటు మూడేళ్ల వ్యవధిలో రూ. 60,000 కోట్ల వరకు ఎబిటాను సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఇక ట్యాక్స్ రిఫండ్ కింద మరో రూ. 10,000 కోట్లు రావాల్సి ఉంటుందని వివరించారు.కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలు..పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా మరిన్ని ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలను ఆవిష్కరించినట్లు వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా తెలిపారు. ఇవి 7 రోజులు, 14 రోజులు, 21 రోజుల కాలవ్యవధితో లభిస్తాయని వివరించారు. దీనితో మొత్తం 1 రోజు నుంచి 30 రోజుల వరకు వేలిడిటీతో 17 రకాల ప్యాక్‌లను అందిస్తున్నట్లవుతుందన్నారు.
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా (Meta) త్వరలో, భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టబోతోందని వచ్చిన సమాచారం.. టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఈసారి కంపెనీ సుమారు 10 శాతం మందిని తొలగించే అవకాశం ఉంది.మెటా కంపెనీ సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. 2025 చివరి నాటికి సంస్థలో పనిచేసేవారి సంఖ్య సుమారు 78,000గా ఉండేది. దీన్నిబట్టి చూస్తే లేఆఫ్స్ ప్రభావం సుమారు 10 శాతం ఉద్యోగులపై పడుతుందని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఖర్చులు తగ్గించడమే కాకుండా, కంపెనీని కొత్త దిశగా మలచడానికి తీసుకుంటున్న నిర్ణయాలు అని తెలుస్తోంది.మెటా ఇప్పుడు తన సంస్థ నిర్మాణాన్ని పూర్తిగా మార్చుకోవడంలో భాగంగా.. పెద్ద పెద్ద టీమ్‌లకు బదులుగా చిన్న, వేగంగా పనిచేసే టీమ్‌లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కంపెనీ ఇప్పుడు పూర్తిగా ఏఐ కేంద్రంగా మారుతోంది. సంస్థ భవిష్యత్ పెట్టుబడుల్లో భారీ భాగాన్ని ఏఐ డేటా సెంటర్లు, చిప్‌లు, మోడల్ ట్రైనింగ్ వంటి రంగాల్లో పెట్టనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాదు, 7000 మంది కొత్త ఏఐ ఆధారిత ప్రాజెక్ట్‌ల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఉద్యోగుల్లో అసంతృప్తిని కూడా పెంచుతున్నాయి. దీంతో కంపెనీ అంతర్గత వాతావరణం కొంత ఒత్తిడిగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని AI టూల్స్ ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తాయన్న భయం కూడా ఉంది. కంపెనీ మాత్రం వాటిని కేవలం AI శిక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామని వివరణ ఇస్తోంది.
పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే!
వంటనూనెల దిగుమతులు 2025–26 నూనెల సీజన్లో (నవంబర్–ఏప్రిల్) 13 శాతం పెరిగి 7.94 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా పామాయిల్ దిగుమతులు భారీగా పెరిగినట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. అంతక్రితం సంవత్సరం ఇదే కాలంలో దిగుతులు 7.04 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.విలువ పరంగా చూస్తే రూ.73,000 కోట్ల నుంచి రూ.87,000 కోట్లకు చేరాయి. మొత్తం నూనెల దిగుమతుల్లో వంటనూనెలు 7.82 మిలియన్ టన్నులుగా ఉంటే, 1,21,000 టన్నులు నాన్ ఎడిబుల్ నూనెలు ఉన్నాయి. పామాయిల్ దిగుమతులు దాదాపు రెట్టింపై 3.97 మిలియన్ టన్నులకు చేరాయి. సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతులు 3.85 మిలియన్ టన్నులకు తగ్గాయి.పామాయిల్ ధరలు 14–15 శాతం, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల ధరలు 17–22 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి ఖర్చులు భారీగా పెరిగాయి. మే చివరికి దేశంలో మొత్తం నూనె నిల్వలు 2.12 మిలియన్ టన్నులకు చేరాయి.
ఫ్యామిలీ
ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎన్ని ఇక్కట్లు వచ్చాయో తెలిసిందే. గ్యాస్ నుంచి పెట్రోల్ వరకు దాని అన్నిట్లపై దాని ప్రభావం ఏం రేంజ్లో ఉందో తెలసిందే హార్బూజ్ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. భారత్ పట్ల సముచితంగా ఇరాన్ ఉన్నా..మనకు ఈ ఇబ్బందులు మాతరం ఇప్పట్లో తగ్గేలే లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇరాన్లో మన భారతీయవ దేవాలయంకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పైగా విష్ణు మంత్రాలు సైతం పర్షియన్ భాషలోనే ఉండటం విశేషం. మరి ఆ ఆలయ విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ రాజధాని అయిన బందర్ అబ్బాస్‌లో ఉన్న విష్ణు దేవాలయం ఉన్న వీడియోని నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఏంటా ఆలయం అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ వీడియో క్యాప్షన్‌లో రాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఉన్న పురాతన హిందూ విష్ణు దేవాలయం. 1892లో, ఖజార్ యుగంలో నిర్మించబడింది. ఈ నగరంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన హిందూ వ్యాపారుల కోసం దీనిని నిర్మించారు, ఆ గుడిలోని పాట సైతం పర్షియన్ భాషలోనే ఉంది అని పేర్కొన్నారు. 83 ఏళ్ల నటుడు అమితాబ్ షేర్ చేసిన వీడియో కారణంగా అందరిలో ఒక్కసారిగా ఆ ఆలయ విశేషాలు గురించి తెలుసుకునే ఆసక్తిని రేకెత్తించింది. ఆలయ చరిత్రచారిత్రక కథనాలు, యూట్యూబ్‌లోని వివిధ ట్రావెల్ వ్లాగ్‌ల ప్రకారం..ఈ ఆలయం 1892లో మహమ్మద్ హసన్ సాద్-ఓల్-మాలిక్ పాలనలో హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో నిర్మించారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్, భౌగోళికంగా ఇది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం, అదీగాక ముఖ్యమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి వెంబడి ఉంది. ఇది విష్ణుమూర్తి ఆలయం. ఒకప్పుడు, భారతీయులకు, ఇరాన్‌లకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతికగా ఈ దేవాలయం నిలుస్తోంది. ఇది ఇండో-ఇరానియన్ వాస్తుశైలికి నిలువెత్తు నిదర్శనం. అలాగే చరిత్రకారుల ప్రకారం..కవి,రచయిత మహమ్మద్ అలీ సదీద్ అల్-సల్తానే తన ఒక రచనలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయులకు 1888లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత హిందూ కమ్యూనిటీలకు ప్రత్యేకంగా ఒక దేవాలయం ఏర్పడింది. అప్పట్లో ఇరు వర్గాలు ఎంత శాంతియుతంగా జీవించాయనేందుకు నిదర్శనం ఈ కట్టడం. స్థానికులు హిందువులను 'గూర్' లేదా 'గాబర్' అని పిలిచేవారు కాబట్టి, ఈ ఆలయాన్ని స్థానికులు 'గూరన్' అని పిలుస్తారు. భారత్‌లో ఉండే ఆలయాల మాదిరిగా సాంప్రదాయ వాస్తుశిల్పం ఈ ఆలయానికి లేదు. మధ్యలో ఉన్న చతురస్రాకార గది ఉల్లిపాయ ఆకారంలో ఉన్న గోపురంతో కప్పబడి ఉంటుంది, దానిపై తామర పువ్వుల చెక్కి ఉన్నాయి. ఈ గుడిలోనే పూజారులు, సన్యాసుల కోసం గదులు కూడా నిర్మించారు. 1979 ఇస్లామిక విప్లవం కారణంగా ఈ గుడిలోని చాలా విగ్రహాలు, చిత్రాలు ధ్వసం అయ్యాయి. పైగా అధిక సంఖ్యల్లో భారతీయులు ఇరాన్‌ను విడిచిపెట్టారు. ఈ ఆలయంలో బుద్ధుడు, విష్ణుమూర్తి విగ్రహాలు, శ్రీకృష్ణుని చిత్రాలను చూడవచ్చు. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ కూర్చుని ఉన్న ఒక చిత్రం ఉంది. పునరుద్ధరణ అవసరమైన హిందూ దేవతల పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ఒక గది మ్యూజియంగా మారింది. అక్కడి పెట్టెలలో ఒకదానిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజు శివుని పురాతన విగ్రహం ఉంది. కాగా ఇరాన్లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు, ఇరాన్‌లోని సిస్తాన్ , బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్‌లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.ఆ ఆలయంలో పాటలు..ఏయ్ విష్ణు జాన్ (ఓ ప్రియమైన విష్ణు)ఏయ్ రామ జాన్ (ఓ ప్రియమైన రామా)ఏయ్ కృష్ణ జాన్ (ఓ ప్రియమైన కృష్ణా)దర్ ఖల్బ్-ఎ మా బేమన్ (మా హృదయాలలో ఉండిపో)హమీషే బేమన్-2 (శాశ్వతంగా ఉండిపో)నూర్-ఎ తో బేతాబాద్ (నీ కాంతి ప్రకాశించుగాక)ఇష్క్-ఎ తో బేతాబాద్ (నీ ప్రేమ ప్రకాశించుగాక) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)
పాటలు పాడటం ఇంత మంచిదా..? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు
సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని మన పెద్దలు చెబతుండటం విన్నాం. అంతెందుకు శ్రావ్యమైన సంగీతం వింటుంటే శారీరకంగా, మానసికంగా బాగుంటాం అని నిపుణులు సైతం అంటున్నమాటే. తాజాగా వినడమే కాదు పాటలు పాడితే మన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందట. పైగా గట్ హెల్త్ బాగుంటుందని సాక్షాత్తు హార్వర్డ్ నిపుణులే చెబుతున్నారు. అదేవిధంగానో ఆ నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా.!.పాడటం అనేది కళాత్మక ప్రక్రియ. మరి దీనికి జీర్ణక్రియకు సంబంధం ఎలా అంటే.. పాటలు పాడినప్పుడు మనసు, పేగులు, నాడీ వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఒక బృందంగా పాడుతున్నప్పుడు శరీరంలో ఇమ్యూనోగ్లోబిన్ (ఏ), కార్డిసాల్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో గమనించారు. పాడటం అనేది మానవ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జీర్ణ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. ఒత్తిడి, ఆందోళనతో చాలామంది బాధపడుతుంటారు. కానీ కొందరు దీన్ని అధిగమించిగలుగుతారు అందుకు ఇదే కారణమని అంటున్నారు.పాడినప్పుడు ఏం జరుగుతుందంటే..శరీరంపై సానుకూల ప్రభావం మెదడు నుంచి మొదలై వేగస్ నాడి ప్రేరణ ద్వారా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకోసం బీథోవెన్ సంగీతాన్ని ఆలపిస్తున్న బృందంపై పరిశోధనలు చేయగా, వారందిరలోనూ పాడటం కారణంగా లాలాజలంలో ఒక కీలకమైన రోగనిరోధక యాంటీబాడీ నాటకీయంగా పెరగడం గుర్తించామని తెలిపారు. ఆ యాంటీబాడీ.. జీర్ణవ్యవస్థ లోపలి పొర, గొంతు, శ్వాస మార్గాలలో మన శరీరానికి మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఫలితంగా వ్యాధికారకాలు మనపై పట్టు సాధించే అవకాశం రాకమునుపే ఈ యాంటీబాడీ అడ్డుగోడగా మారుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే గానానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉందని చెబుతున్నారు. మెదడుకు, పేగుకి మధ్య ఉన్న ప్రధాన సమాచార ప్రసార మార్గం అయిన వేగస్ నాడి పాటను ఆలపించగానే ఉత్తేజితమవుతుందట. ఎప్పుడైతే పాట కోసం ఉదర శ్వాసను ఉపయోగిస్తామో అప్పుడు ఈ వేగస్ నాడీ తక్షణమే యాక్టివ్ అవుతుందట. దాంతో విశ్రాంతి, జీర్ణక్రియ అనే ప్రక్రియ ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి ప్రేగులు అత్యుత్తమంగా పనిచేయడం ప్రారంభిస్తాయట. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమేగాక, ప్రేగుల లోపలి పొర ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు శరీరంలో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతకు మద్దతిస్తుందట. గానం ఎలా హెల్ప్ అవుతుందంటే..గానం విశ్రాంతిని ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఆటోమేటిగ్గా మనం రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోతాం. దాంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ పాట పడటం కోసం ఉదర శ్వాసను వినియోగిస్తాం దాంతో శ్వాశ, నాడీవ్యవస్థ నియంత్రణ ఫలితం ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. జీర్ణవ్యవస్థకు మెదడు నుంచి సరైన సంకేతాలు అందితేనే తన పనిని సజావుగా జరపగలదట. అందువల్లే గానం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నొక్కి చెప్పగలమని అన్నారు. గానం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అది సమర్థవంతంగా సంకేతాలను అందించడంతో ప్రేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు. అందరూ పాడేటప్పుడు లోతైన శ్వాసను తీసుకుంటే వేగస్ నాడీ ఉత్తేజమయ్యి..జీర్ణవ్యవస్థ బాగుండేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే మన పూర్వీకులు మన చేత నిరంతరం జపాలు, పారాయణాల పేర్లతో మంత్రాలు, భక్తిపాటలను లయబద్ధంగా ఆలపించేలా చేసేవారని అంటున్నారు. అంటే మెరుగైన ఆరోగ్యానికి చక్కటి జీవనశైలి, శ్వాస, మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమనేది గుర్తురెగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం View this post on Instagram A post shared by Akanksha Pandey (@acanxa) (చదవండి: వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే..)
ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..
ఫుడ్‌తో కొంగొత్త పరిచయాలే కాదు..ఓ దేశాన్నే మైమరిపించొచ్చు. ఎంతటి శత్రుత్వాలు, కోపతాపలు..ఒక్క విందుతో సమసిపోతాయి. అలాంటి టేస్టీ ఫుడ్‌తో ఇతర దేశాల మనసును దోచుకుని కోట్లు ఆర్జించడం మాటలు కాదుకదా. అలాంటి ఘన విజయాన్నే అందుకుంది ఈ భారత సంతతి మహిళ. మన భారతీయ రుచులను జోడించి తయారు చేసిన ఐస్‌క్రీమ్ బ్రాండ్‌తో దూసుకుపోతూ..శెభాష్ అనిపించుకుంటోంది పూజా బావిషి. ఎవరామె అంటే..భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా బావిషి, 'మలై' అనే ఐస్ క్రీమ్ బ్రాండ్‌తో అమెరికన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఏడాదికి రూ. రెండు వేల కోట్లు టర్నోవర్‌ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇద హోల్‌సేల్ ఈ కామర్స్ వ్యాపారంగా మారింది. 46 ఏళ్ల వ్యవస్థాపకురాలు, సీఈఓ 2015లొ ఈ మలైని ప్రారంభించారు. ఈ వ్యాపారం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో నాలుగు దుకాణాలను నిర్వహిస్తోంది. చాలామటుకు ఐస్‌క్రీమ్‌లలో చాక్లెట్, వెనిలా వంటి ఫ్లేవర్లు చూశాం. కానీ అంతకుమించిన రుచి కోసం మలై వంటి వెరైటీ టేస్ట్‌ని పరిచయం చేశారు. దీని తయారీలో ఉపయోగించిన యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, జాజికాయ వంటి రుచులను జోడించడంతో అమెరికా వాసుల మనసులను దోచుకుంది ఈ మలై ఐస్ క్రీమ్. ఈ కంపెనీ 2025లోనే సుమారు రూ. రెండు వేల కోట్లు పైనే ఆర్జించేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతకుముందు ఏడాది 2024, 2025 సంత్సరాలలో సంస్థ లాభదాయకంగా సాగింది. ఇక పూజా విద్యా నేపథ్యం వచ్చేసి..బావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే ఆమె ఆమె వాషింగ్టన్ డిసి-ఆధారిత లాభాపేక్షలేని సంస్థ అయిన ఈక్వల్ రైట్స్ సెంటర్లో పౌర హక్కుల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందిలా..స్నేహితులకు ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీంల రుచి చూపించినప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చేసినట్లు గుర్తు చేసుకుంది. అల్లం-స్టార్ సోంపు ఐస్ క్రీమ్ - ఒక డిన్నర్ పార్టీలో తక్షణమే అందర్నీ ఆకట్టు కోవడంతో..ఇలాంటి టేస్టే టేస్టీ ఐస్‌క్రీం షాపు పెట్టాలని భావించారట ఆమె. అయితే తన ఉత్పత్తులు మార్కెట్లో క్లిక్ అవుతాయో లేతో అన్న సందేహం మాత్రం బాగా ఉండేదని చెప్పుకొచ్చారామె. అయితే తన షాపుకు వచ్చే కస్టమర్ ఎలాంటి ఫ్లేవర్ కోరుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తూ..టేస్టీ, టేస్టీ..మలై ఐస్‌క్రీమ్‌ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే తన షాపు కి వచ్చే కస్టమర్ ఎవరు?, వాళ్లకేం కావాలన్నదే పూర్తిగా అవగాహన ఉండాలని, లేదంటే వ్యాపారం లాభదాయకంగా ఉండదని అంటోంది. అలాగే తాను కేవలం లాభాల మీదే గాక, వ్యాపార విస్తరణపై కూడా దృష్టిపెట్టానని అన్నారు. అలాగే తాను వ్యాపారాన్ని చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి..అన్ని విధాల క్లిక అవుతుందని నమ్మకం కొనసాగేక ముందుకు తీసుకెళ్లానని అన్నారు. అలాగే భారతీయ రుచులు ప్రయోగాత్మకమైనవి కావు, ఈ రుచులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించడం విశేషం. పైగా మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది. అందుకు చాలా గర్వకారణంగా ఉందంటోంది పూజ. View this post on Instagram A post shared by Malai (@malai_icecream) (చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)
స్కూలు బస్సుకి పసుపు రంగే ఎందుకు?
ఫ్రెండ్స్.. మనం రోజూ స్కూలుకి వెళ్లే బస్సు పసుపు రంగులోనే ఉంటుంది. ఎందుకలా ఉంటుందో మీరెపుడైనా ఆలోచించారా? ఎందుకంటారు? ఎందుకంటే పసుపు రంగు ఎంత దూరం నుంచైనా ఆకర్షిస్తుంది. దానివల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి.టాక్సీలు, స్కులు బస్సులకు, రసాయనాలను సూచించే ఫలకాలకు ఈ రంగును వాడుతుంటారు. ప్రమాదాన్ని సూచించే సందర్భాలకి ఎరుపు రంగుని వాడితే, జాగ్రత్త పాటించాల్సిన సూచనల కోసం పసుపుని వాడుతారన్నమాట. అలాగే ట్రాఫిక్ సిగ్నల్‌లో ఈ రంగు లైట్ వెలిగితే.. నెమ్మదిగా వెళ్లాలని అర్థం. ఔనా?హార్న్‌బిల్ అనే పక్షి తన పిల్లల్ని ఎవరూ చూడకుండా, తాకకుండా వుండాలని వాటి నివాసం కోసం చాలా సురక్షితమైన ప్రదేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒక చెట్టుతొర్రలో వుంచి, ఆ తొర్రను వుట్టి లేదా బెరడుతో కప్పేస్తుంది. అయితే గాలి, వెలుతురు కోసం చిన్న రంధ్రం ఒకటి వుంచుతుంది. పిల్లలకు ఆ రంధ్రంలోంచి వుుక్కుతో ఆహారాన్ని అందిస్తుంది. అలా పిల్లలు పెద్దవయ్యేదాకా ఆ తల్లికి ఈ కష్టం తప్పదు వురి.
అంతర్జాతీయం
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై జరపాలనుకున్న సైనిక దాడిని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల అధినేతలు చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రతిపాదనల విషయంలో తిరస్కరణల పరంపర కొనసాగుతుండడంతో మరోసారి మధ్యప్రాచ్యంలో బాంబుల మోత మోగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ట్రంప్ తాజా నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి కాస్త పక్కకు తొలిగాయి."ఇరాన్‌తో ప్రస్తుతం కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై మేము తలపెట్టిన సైనిక దాడిని వాయిదా వేయమని ఖతార్ అమీర్ షేక్ తమీమ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్‌లు నన్ను కోరారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు లేకుండా చేస్తామమని" ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో రాసుకొచ్చారు. కాగా ఇరాన్ విషయంలో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ భిన్నమైన వైఖరులను కలిగి ఉన్నాయి. ఇరాన్‌తో శాంతి చర్చలు సఫలం కాకపోతే భారీ దాడి చేస్తామని ట్రంప్ ఇటీవలే మరోసారి హెచ్చరించారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం వస్తే మొత్తం తమ ప్రాంతమే అతలాకుతలం అవుతుందని భావించిన గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇకపై ఒకటో తేదీనే జీతం.. లేదంటే కంపెనీ క్లోజ్!
అబుదాబి: యూఏఈలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి శ్రమకు తగ్గ ఫలితం సమయానికి దక్కేలా 'మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ 0340 ఆఫ్ 2026' పేరుతో కొత్త చట్టాన్ని యూఏఈ మానవ వనరులు, స్వదేశీకరణ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. ప్రైవేట్ రంగ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తేదీ నాడే జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటో తేదీ లోపు జీతం అకౌంట్లో పడకపోతే, దానిని 'ఆలస్యమైన వేతనం' గా పరిగణిస్తారు. కంపెనీ సేఫ్ జోన్లో ఉండాలంటే 1వ తేదీ నాటికి ఉద్యోగి మొత్తం జీతంలో కనీసం 85% డబ్బులు అకౌంట్లో వేయాలి. ఒకవేళ జీతం చెల్లించకపోతే రెండో రోజు నుంచి సదరు కంపెనీపై ప్రభుత్వం నిఘా పెట్టి, నోటీసులు జారీచేస్తోంది. ప్రభుత్వం ఐదు రోజుల వరకు చూస్తోంది. అప్పటికి ఉద్యోగుల ఖాతాలో జీతాలు జమ కాకపోతే సదరు కంపెనీలకు కొత్త వర్క్ పర్మిట్లను జారీ చేయడం అధికారులు నిలిపివేస్తారు.16 రోజులు దాటితే కార్మికుల తరపున మంత్రిత్వ శాఖే స్వయంగా రంగంలోకి దిగి కేసు నమోదు చేస్తోంది. ఈ నిబంధనలు జూన్ 1, 2026 నుండి అమలుల్లోకి రానున్నాయి. ఈ కొత్త చట్టంతో యూఏఈలో పనిచేస్తున్నప్రవాస భారతీయులకు మేలు జరగనుంది.అయితే 11 ప్రత్యేక కేసులకు మాత్రం ఈ గడువు చట్టం నుండి మినహాయింపు ఇచ్చారు:కోర్టులో వేతన వివాదాల క్లెయిమ్ నడుస్తున్న కార్మికులు.కంపెనీ నుండి పారిపోయినట్లు రిపోర్ట్ నమోదైన వారు.జైలు లేదా కస్టడీలో ఉండి విధులకు హాజరుకాలేని వారు.అధికారికంగా జీతం లేని సెలవులో ఉన్న కాలంలో.ఓడలపై పనిచేసే నావికులు (సీఫేరర్స్).విదేశీ కంపెనీల బ్రాంచ్‌లలో పనిచేస్తూ, యూఏఈ వెలుపల జీతాలు పొందే విదేశీయులు.3 నెలల లోపు కాలపరిమితి గల 'మిషన్ వర్క్ పర్మిట్'లపై ఉన్నవారు.స్థానిక యూఏఈ పౌరుల యాజమాన్యంలోని చేపల వేట పడవలు.స్థానిక పౌరుల స్వంత యాజమాన్యంలోని పబ్లిక్ టాక్సీలు.బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.మతపరమైన ప్రార్థనా స్థలాలు.
రెస్టారెంట్లో బుల్లెట్ల వర్షం.. నలుగురిని బలితీసుకున్న 17 ఏళ్ల కుర్రాడు!
దక్షిణ టర్కీలోని మెర్సిన్ నగరంలో సోమవారం తుపాకుల మోత మోగింది. ఓ దుండగుడు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. టర్కిష్ వార్తా సంస్థ డీహెచ్ఏ ప్రకారం... నిందితుడు మొదట ఒక రెస్టారెంట్లోకి చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత నగరంలోని మరో ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. అనంతరం దుండగుడు కారులో పారిపోయినట్లు డీహెచ్ఏ తమ కథనంలో పేర్కొంది. కాల్పులు జరిపిన వ్యక్తిని 17 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు. నిందుతుడి కోసం పోలీసులు హెలికాప్టర్లతో సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు స్ధానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ కాల్పుల్లో మరణించిన వారిలో రెస్టారెంట్ యజమాని, అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ఉన్నారు. నగరంలోని వేరే చోట జరిగిన కాల్పుల్లో పశువులను మేపుకుంటున్న ఒక యువకుడు, అలాగే ఒక ట్రక్ డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు.చదవండి: పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్‌కు రహస్యంగా..
దుబాయ్ లాటరీ: భారతీయులకు జాక్‌పాట్
అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో మరోసారి భారతీయులను అదృష్టం వరించింది. యూఏఈలో ప్రవాసుల కలల సిరి 'అబుదాబీ బిగ్ టికెట్' మే నెల మొదటి వారపు ఈ-డ్రా ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ లక్కీలో డ్రాలో 1,00,000 దిర్హాల (సుమారు రూ. 26 లక్షలకు పైగా) నగదు బహుమతిని మొత్తం నలుగురు గెలుచుకున్నారు. ఈ నలుగురు విజేతలలో ఇద్దరు భారతీయులు కాగా, మిగిలిన ఇద్దరు మలేషియా, బంగ్లాదేశ్ పౌరులు. విజేతలలో ప్రతి ఒక్కరికీ 25,000 దిర్హాల (సుమారు రూ. ఆరున్నర లక్షలు) చొప్పున నగదు బహుమతి దక్కనుంది.లాటరీ గెలుచుకున్న భారతీయలు వీరేకేరళకు చెందిన 39 ఏళ్ల జవాద్ నజీర్.. ఖతార్‌లోని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పనిచేస్తున్నాడు. అయితే ఖతార్‌లో ఉంటున్న జవాద్, అబుదాబి బిగ్ టికెట్ గురించి తెలుసుకుని గత మూడేళ్లుగా తన 20 మంది స్నేహితులతో కలిసి టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్టకేలకు అతడికి అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో గెలిచినట్లు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మొదట నమ్మలేకపోయానని నజీర్ తెలిపాడు. అదేవిధంగా వచ్చిన బహుమతి మొత్తాన్ని మా స్నేహితులమంతా సమానంగా పంచుకుంటాం అని జవాద్ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు బెంగళూరు చెందిన వినయ్ పుదుమన గత 15 ఏళ్లుగా దుబాయ్‌లో నివాసముంటున్నాడు.గత ఐదేళ్లుగా బిగ్ టికెట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వినయ్.. మొదట్లలో తన స్నేహితులతో కలిసి టికెట్లు కొనేవాడు. కానీ ఆ తర్వాత సొంతంగానే టికెట్లు కొనడం ప్రారంభించాడు. ఆన్లైన్ ద్వారా ఆయన కొనుగోలు చేసిన 037772 అనే నంబర్ టికెట్ అతడికి భారీ నగదుబహుమతిని తెచ్చిపెట్టింది.
జాతీయం
దేశంలో ఆర్థిక తుపాన్.. రాహుల్ వ్యాఖ్యలు
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో ఆర్థిక తుపాన్ రాబోతుందన్నారు. ప్రజలందరూ భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోక తప్పదని మోదీ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చుతాయని తెలిపారు. రాయిబరేలీలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. సామాన్యులంతా ఆర్థిక భారం ఎదుర్కొక తప్పదని బిలియనీర్ల కోసం మోదీ ఆర్థిక వ్యవస్థను తారుమారు చేశారన్నారు.రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "గత కొన్ని రోజులుగా దేశ ప్రజలకు నేను సూచన చేస్తూ వస్తున్నాను. అంబానీ- అదానీ వ్యవస్థ ఎక్కువ కాలం నిలవదు. అది త్వరలోనే కుప్పకూలిపోతుంది. ఈ సంక్షోభం సామాన్య ప్రజలపైనే అధికంగా ఉంటుంది. ఇటువంటి కష్ట సమయంలో చర్యలు తీసుకోవడానికి బదులుగా నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు చేపడుతున్నారు." అని రాహుల్ అన్నారు.కాగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలంతా దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని ఏడాదిపాటు బంగారం కొనకూడదని విజ్ఞప్తి చేశారు. కాగా హర్ముజ్ జలసంధి మూసివేతతో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో పెట్రో,డీజిల్ ధరలను ఇటీవలే ప్రభుత్వం పెంచింది.
భోజ్‌శాల: 700 ఏళ్ల తర్వాత వెలిగిన అఖండ జ్యోతి
ధార్: మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం లిఖితమయ్యింది. ధార్ జిల్లాలోని చరిత్రాత్మక భోజ్‌శాల సముదాయం సరస్వతీ దేవి ఆలయమేనని హైకోర్టు కీలక తీర్పునిచ్చిన నేపథ్యంలో హిందువుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నేపధ్యంలో ఆలయంలో నిర్వహిస్తున్న పూజలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. గత 23 ఏళ్లుగా సాగుతున్న నిరంతర పోరాటానికి దక్కిన విజయంగా భావిస్తూ, భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఇక్కడ పూజల్లో మునిగితేలుతున్నారు.700 ఏళ్ల తర్వాత వెలిగిన అఖండ జ్యోతిహైకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో భోజ్‌శాల సముదాయంలో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. రాజా భోజ్ నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 700 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ‘అఖండ జ్యోతి’ని వెలిగించారు. అంతేకాకుండా, 2003 తర్వాత మొదటిసారిగా గర్భగుడిలో వాగ్దేవి (సరస్వతీ దేవి) ప్రతీకాత్మక విగ్రహాన్ని ప్రతిష్టించారు. భోజ్‌శాల ఉద్యమంతో ముడిపడి ఉన్న ముగ్గురు అమరవీరుల చిత్రపటాలను సైతం తొలిసారిగా ఆలయంలో ఉంచి ఘన నివాళులర్పించారు.ఏడాది పొడవునా పూజలు2003 నుండి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. హిందువులు కేవలం మంగళవారం మాత్రమే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పూజలు చేసుకోవడానికి, ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. అయితే హైకోర్టు తాజా తీర్పుతో ఆ పాత నిబంధనల బోర్డుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) రంగు వేసి, పూర్తిగా చెరిపివేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు హిందువులకు మంగళవారమే కాకుండా, ఏడాది పొడవునా ప్రతిరోజూ పూజలు చేసుకునే హక్కు లభించింది. ప్రస్తుత నిబంధనలను మారుస్తూ సరికొత్త మార్గదర్శకాల రూపకల్పన ప్రారంభమైంది.‘మహా సత్యాగ్రహం’ లక్ష్యం ఇదే భోజ్‌శాల ఉత్సవ కమిటీ జనరల్ మేనేజర్ హేమంత్ దౌరాయా మాట్లాడుతూ, ఈ చారిత్రాత్మక సరస్వతీ ఆలయాన్ని దక్కించుకునేందుకు 2003 నుండి ప్రతి మంగళవారం హిందూ సమాజం శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తోందని గుర్తుచేశారు. కోర్టు తీర్పుతో 23 ఏళ్ల పోరాటం ఫలించిందని, భోజ్‌శాల సరస్వతీ దేవి ఆలయమేనని నిరూపితమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ ‘మహా సత్యాగ్రహం’ ఇక్కడితో ఆగదని, ఆలయ సముదాయానికి 300 మీటర్ల పరిధిలో ఉన్న మసీదు, సమాధులను పూర్తిగా తొలగించడమే తమ తదుపరి ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.ఇది కూడా చదవండి: ‘దీదీ’ ఆనవాళ్లపై సువేందు ఉక్కుపాదం.. ముందుగా..
స్క్వాడ్రన్ లీడర్ సాన్యా సరికొత్త చరిత్ర : సర్వత్రా ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి (IAF) చెందిన స్క్వాడ్రన్ లీడర్ (Sqn Ldr) సాన్యా సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మకమైన 'క్యాట్-ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్' (Cat-A Qualified Flying Instructor - QFI) అర్హత సాధించిన దేశంలోనే మొట్టమొదటి మహిళా అధికారిగా ఆమె నిలిచారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించింది.Excellence takes flight.Sqn Ldr Saanya achieved a historic first by becoming the first woman officer to earn the coveted Cat-A Qualified Flying Instructor (QFI) qualification. Her achievement embodies dedication and relentless pursuit of excellence.A proud milestone for the… pic.twitter.com/K6hWya0iUi— Indian Air Force (@IAF_MCC) May 18, 2026సాన్యా సాధించిన ఘనతపై వైమానిక దళ అధిపతి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పి. సింగ్.. స్క్వాడ్రన్ లీడర్ సాన్యాను కలిసి ఆమె సాధించిన ఈ అద్భుత విజయానికి గాను అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఐఏఎఫ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. "ఉత్కృష్టత సరికొత్త శిఖరాలను తాకింది. స్క్వాడ్రన్ లీడర్ సాన్యా ఎంతో ప్రతిష్టాత్మకమైన 'క్యాట్-ఏ క్యూఎఫ్ఐ' అర్హతను సాధించి, ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఆమె సాధించిన ఈ విజయం అంకితభావానికి, నిరంతర ప్రతిభా సాధనకు నిదర్శనం" అని వైమానిక దళం పేర్కొంది.దేశానికి స్ఫూర్తిఈ విజయం భారత వైమానిక దళానికి ఒక గర్వకారణమైన మైలురాయి అని, దేశవ్యాప్తంగా విమానయాన రంగంలోకి రావాలనుకునే ఎంతోమంది యువతీయువకులకు ఇది గొప్ప స్ఫూర్తినిస్తుందని ఐఏఎఫ్ కొనియాడింది.ఇదీ చదవండి: టీవీకే విజయం : డిజిటల్ సునామీపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలుకాగా 2015 జూన్ 20న సాన్యా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ఫ్లయింగ్ బ్రాంచ్‌లో కమిషన్ అయ్యారు. ఈమె 42 ఎస్ఎస్సి (SSC) కోర్సు ద్వారా ఎంపికయ్యారు. ప్రస్తుత బాధ్యతల్లో భవిష్యత్తులో ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇవ్వడం, ఇతర ఇన్స్ట్రక్టర్లకు మార్గదర్శకత్వం వహించడం, విమానంలో ఉన్నప్పుడు తప్పులను సరిదిద్దడం వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తారు.ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్
‘దీదీ’ ఆనవాళ్లపై సువేందు ఉక్కుపాదం.. ముందుగా..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సువేందు అధికారి నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతోంది. గత ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపివేస్తూ, వివాదాస్పద కట్టడాలపై కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన ఒక ఫుట్‌బాల్ విగ్రహాన్ని సాల్ట్ లేక్ స్టేడియం నుండి తొలగించాలని నిర్ణయించింది. ఇది కొత్త ప్రభుత్వం పాలనలో తన మార్క్‌ను స్పష్టంగా చూపిస్తోంది.వింత విగ్రహంపై మంత్రి ఫైర్కోల్కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫుట్‌బాల్ విగ్రహం ఆకారం మొదటి నుంచీ విమర్శలకు దారితీసింది. సగం మనిషి కాళ్లు ఉండి, మొండెం స్థానంలో కేవలం ఫుట్‌బాల్ ఉన్న ఈ కట్టడాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి నిసిత్ ప్రామాణిక్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం జరిగిన ఐఎస్ఎల్ మ్యాచ్ (మోహన్ బగాన్ వర్సెస్ ఈస్ట్ బెంగాల్) అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రెండు కాళ్లు మాత్రమే ఉండి, మొండెం లేకుండా ఫుట్‌బాల్‌తో ఉన్న ఈ విగ్రహం చూడటానికి ఎబ్బెట్టుగా ఉంది. దీనికి ఎలాంటి అర్థం లేదు. ఇలాంటి వికృతమైన కట్టడాన్ని స్టేడియం ముందు ఉంచబోము. దాన్ని తక్షణమే తొలగిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.టీఎంసీకి షాక్.. ప్రక్షాళన దిశగా సువేందుబెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత టీఎంసీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన కట్టడాలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్‌కు మింగుడుపడని పరిణామంగా మారింది. నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని సువేందు సర్కార్ స్పష్టమైన సంకేతాలు పంపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 207 సీట్ల భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రాగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.ప్రభుత్వ విద్యాలయాల రూపురేఖల మార్పుమరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల మౌలిక సదుపాయాల మెరుగుదలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. సోమవారం నాడు 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘విద్య అనేది ప్రాథమిక హక్కు. అయితే ప్రభుత్వ విద్యాలయాలు.. ప్రైవేటు సంస్థల కన్నా పోటీలో, సదుపాయాల్లో వెనుకబడి ఉండటం బాధాకరమన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల పురోగతిని నేను కోరుకుంటాను, అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల మౌలిక సదుపాయాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని సీఎం హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: నీటితో ఇంధన సంక్షోభానికి ఎండ్ కార్డ్?
ఎన్ఆర్ఐ
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
క్రైమ్
నీట్ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!
సాక్షి, న్యూఢిల్లీ : 2024లో నీట్ (NEET UG) పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినప్పుడు, విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తిగా మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కెమిస్ట్రీ టీచర్ శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ గుర్తింపు పొందారు. విద్యార్థులు ఆయన్ను ఆప్యాయంగా "ఎమ్ సర్" (M Sir) అని పిలుచుకునేవారు. నాడు విద్యార్థులకు "ఘోర అన్యాయం" జరిగిందంటూ వాదించిన ఆయన కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ, సరిగ్గా రెండేళ్ల తర్వాత.. 2026 నీట్ (NEET UG) పేపర్ లీక్ కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.శివరాజ్ మొతేగావ్కర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో, 2024లో ఆయన విద్యార్థుల కోసం మాట్లాడిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. "నీట్ 2024లో భారీ కుంభకోణం జరిగింది. దీనివల్ల మహారాష్ట్రలో చదువు కుంటున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. సంభాజీనగర్‌లోని ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్‌లో మేము ఇప్పటికే పిల్ (PIL) దాఖలు చేశాం. విద్యార్థుల తరఫున మరో ప్రత్యేక పిటిషన్ కూడా వేశాము. ఈ రోజు మేము ముంబై వచ్చాము. బాంబే హైకోర్టులో అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాము. మహారాష్ట్రలోని అన్ని న్యూస్ ఛానళ్ల ప్రతినిధులను కలిసి, దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరతాము. పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు మీడియా మద్దతు చాలా అవసరం."అని విద్యార్థుల తరపున గళమెత్తాడు. కట్ చేస్తే సరిగ్గా రెండేళ్లకు అదే విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ సీబీఐ చేతికి చిక్కాడు.'ఎమ్ సర్' అరెస్ట్ లాతూర్‌లోని ప్రముఖ 'రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్' (RCC) వ్యవస్థాపకుడైన శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మే 17 (ఆదివారం) నాడు అరెస్ట్ చేసింది. ఆయన నివాసాలు, కార్యాలయాలపై జరిపిన సోదాల్లో.. ఆయన మొబైల్ ఫోన్లో లీకైన నీట్ క్వశ్చన్ పేపర్ లభ్యమవ్వడంతో సీబీఐ ఈ చర్య తీసుకుంది.ఇదీ చదవండి: నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్ఎవరీ కెమిస్ట్రీ టీచర్ 'ఎమ్ సర్'?లాతూర్‌లోని ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన మొతేగావ్కర్, మొదట్లో సైకిల్‌పై తిరుగుతూ విద్యార్థులకు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేవారు 1990ల చివర్లో ఒక చిన్న అద్దె గదిలో కేవలం 10 మంది విద్యార్థులతో ఆయన కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. చేత్తో రాసిన నోట్స్ ఇస్తూ, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల కాంపిటేటివ్ పరీక్షల్లో టాపర్లను అందిస్తూ ఆయన స్వల్ప కాలంలోనే ఎంతో ప్రసిద్ధి చెందారు.ఇదీ చదవండి: నో టాయిలెట్, నో లీవ్స్ : రూ. 19 లక్షల జాబ్ వదిలేశా!ప్రస్తుతం 'ఆర్సీసీ' (RCC) క్లాసెస్‌కు మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన బ్రాంచ్ అయిన లాతూర్‌తో సహా 9 బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 40,000 మంది విద్యార్థులు నీట్, జేఈఈ, సెట్ (NEET, JEE, CET) పరీక్షల కోసం ఇక్కడ చేరుతుంటారు. సోషల్ మీడియాలో (ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్) కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. నాడు విద్యార్థుల రక్షకుడిగా ఫోజులిచ్చిన ప్రముఖ విద్యావేత్తే, నేడు అదే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అవ్వడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
నన్ను చంపాలని చూస్తున్నారు: పాస్టర్ అభినయ్
విశాఖపట్నం: పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగే తనను చంపాలని చూస్తున్నారని భరోసా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ధార అభినయ్ దర్శన్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని అన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలేసి, తన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారని వాపోయారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నందునే తనపై దాడి జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.''నాపై నేనే దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. నాపై దాడి విషయంలో పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరిస్తున్నారు. నాపై దాడి వెనుక కుట్ర దాగి ఉంది. నాపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకి సంబంధం ఉందని అనుకోను. కొంతమందిపై నాకు అనుమానం ఉంది. వారి పేర్లు త్వరలోనే బయట పెడతాను. ప్రవీణ్ పగడాల నాలుగు బ్రాండ్లు తాగి యాక్సిడెంట్ చేసినట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించారు. ప్రవీణ్ పగడాల విషయంలో జరిగింది పూర్తిగా అన్యాయమే. ప్రవీణ్ పగడాలపై వేసినట్టుగానే నాపై నిందలు వేస్తున్నారు. దాడులకు నేను భయపడను. ప్రజల సమస్యలపై ప్రభుత్వాధికారులను ప్రశ్నిస్తూనే ఉంటాన''ని అభినయ్ అన్నారు.దాడిని ఖండించిన పాడేరు ఎమ్మెల్యే పాస్టర్ అభినయ్‌పై దాడి చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. అభినయ్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభినయ్‌పై దాడి చేసిన వారిని ప్రజల ముందు పోలీసులు నిలబెట్టాలని కోరారు.''జరిగిన దాడిపై నేనే పోలీసులకు ఫోన్ చేసి పూర్తిస్థాయి విచారణ జరపాలని సూచించాను. ఈ దాడి తన అనుచరులు చేశారని కూటమి నాయకులు ప్రచారం చేయడం దురదృష్టకరం. ఒక గిరిజన బిడ్డపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు నాకు క్షమాపణ చెప్పాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నార''ని విశ్వేశ్వరరాజు మండిపడ్డారు.అసలేం జరిగింది?అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో మొండిగెడ్డ పంచాయతీ నీరుతోటపాలెం కాఫీ తోటల సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు అభినయ్‌పై దాడి చేశారు. కడపకు చెందిన అభినయ్ కొన్ని రోజులుగా జిల్లాలో ఉంటున్నారు. నీరుతోటపాలెంలో సమస్యలపై పాదయాత్ర చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసి కారులో తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అభినయ్, ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరిని వాహనం నుంచి దింపి, కాఫీ తోటల సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ అభినయ్‌పై బ్లేడుతో దాడి చేశారు. తల, కాళ్లపై కోసేశారు.అభినయ్‌తో పాటు ఉన్న ఇద్దరిపై కూడా దాడి చేశారు. వారికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అభినయ్ స్పృహ తప్పి పడిపోవడంతో మృతి చెంది ఉంటాడని భావించి, దుండ గులు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అభినయ్‌ను జెర్రెల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారు ఎవరో, ఎందుకు దాడి చేశారో తెలియడం లేదు. కడప నుంచి వచ్చిన అభినయ్‌కి ఇక్కడ ఎవరు శత్రువులున్నారో తెలియడం లేదని స్థానికులు తెలిపారు. అభినయ్ కారుపై కూడా దాడి చేయడంతో కారు అద్దం పగిలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భర్త.. రెండో భర్త.. ఇద్దరు ప్రియులు!
వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏదో ఒక మూల రోజుకో దారుణం జరుగుతోంది. ప్రేమ, మోసం, హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం.. ఇలా ఒక్కో తీరు నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా గుజరాత్లో బయటపడ్డ ‘శాంతిగిరి కేసు’ ట్విస్టుల మీద ట్విస్టులను ఇచ్చింది. ఈ తరహా కేసుల్లోనే ఓ కొత్తదనం చూపించింది. సురేంద్రనగర్ జిల్లాలో శాంతిగిరి గోస్వామి అనే వ్యక్తి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలోనే అతను దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ కేసును చేధించిన పోలీసులు.. నిందితుల నుంచి విస్తుపోయే వివరాలను సేకరించారు. అసలేం జరిగిందంటే.. జాగృతి గోస్వామి అనే మహిళ సుఖ్దేవ్గిరి గోస్వామిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొంతకాలానికి ఆమె తన భర్త పెద్ద అన్న శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను వదిలి.. అతనితో పారిపోయి మరో గ్రామంలో కొత్త జీవితం మొదలుపెట్టింది. అయితే అక్కడా ఆమె బుద్ధి వక్రదారి పట్టింది. శాంతిగిరి ట్రక్ డ్రైవర్ పని కోసం తరచూ బయట ఉండేవాడు. ఈ సమయంలో కాంతిలాల్ అలియాస్ భారత్ సబారియా అనే వ్యక్తితో జాగృతి సంబంధం పెట్టుకుంది. కాంతిలాల్ ఏకంగా జాగృతి ఇంటి పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. శాంతిగిరి లేని సమయంలో ఇద్దరూ కలుసుకునేవారు. అయితే ఏదో ఒకరోజు తమ విషయం తెలుస్తుందని.. శాంతిగిరిని అడ్డు తొలగించుకోవాలని ఆ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యూనిస్ అనే వ్యక్తికి 25,000 సుపారీ ఇచ్చారు. అయితే యూనిస్ ‘భలే’ మోసం చేశాడు. నిద్రపోతున్న శాంతిగిరిని ఫోటో తీసి హత్య చేశానంటూ జాగృతికి పంపాడు. అయితే మరుసటి రోజు ఉదయం భర్త బతికే ఉండడంతో జాగృతి షాక్‌కు గురైంది. తీరా చూస్తే యూనిస్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో జాగృతి, కాంతిలాల్ స్వయంగా హత్యకు ప్లాన్ చేశారు. నిద్రిస్తున్న శాంతిగిరి గొంతును కాంతిలాల్ నులిమి చంపగా.. జాగృతి దుప్పటి తోసి శబ్దం రాకుండా చేసింది. ఆపై శవాన్ని గదిలో దాచారు. ఆ తర్వాత దీపక్ అలియాస్ మున్నా అనే వ్యక్తి సహాయంతో కారులో తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు కథ అల్లే ప్రయత్నం చేశారు. శాంతిగిరి కొత్త ఉద్యోగం కోసం బయటి ఊరికి వెళ్లాడని.. ఫోన్ నెంబర్ మార్చాడని అందరినీ నమ్మించారు. అలా ఎనిమిది నెలలు గడిచాయి. ఈ గ్యాప్‌లో కాంతిలాల్‌కు తెలియకుండా దీపక్‌తో ఆమె వ్యవహారం నడిపించింది. అయితే.. శాంతిగిరి బంధవుల ఎంట్రీతో సీన్ మారింది. జాగృతి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు వాళ్లు. అలా ఈ మిస్సింగ్ మిస్టరీ కేసు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు చేరింది. రెండు నెలల దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం.. జాగృతి, కాంతిలాల్‌ను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న దీపక్ కోసం గాలింపు చేపట్టింది.
రూ. 51 లక్షలు, ఫార్చ్యూనర్ కారు కోసం దారుణం?
తమ బిడ్డ పెళ్లి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. రూ. 11 లక్షల నగదు, రూ. 50 లక్షల విలువైన బంగారం, ఫర్నిచర్ , ఒక స్కోర్పియో (Scorpio) కారు లాంటి ఖరీదైన కానుకలను కట్నంగా ఇచ్చారు. కానీ ఏం లాభం, పెళ్లైన 17 నెలలకే తీరని కట్నం దాహానికి 25 ఏళ్ల కొత్త కోడలు బలైపోయింది. దీంతో అమ్మాయి తల్లి దండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్యంత హృదయ విదారకమైన ఈ ఘటన, గ్రేటర్ నోయిడాలోని జల్పురా ప్రాంతంలో, Ecotech-III పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా (జల్పురా ప్రాంతం)లో 25 ఏళ్ల దీపికా నాగర్ అనే వివాహిత తన అత్తవారింటి పైకప్పు (టెర్రస్) పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2024 డిసెంబరులో దీపిక వివాహం జరిగింది. ఈ వివాహం కోసం దీపిక తండ్రి సంజయ్ నగర్ దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లయిన 3-4 నెలల నుంచే అత్తవారింటి వేధింపులు మొదలయ్యాయని దీపిక తల్లిదండ్రలు ఆరోపించారు. నిందితులు అదనంగా ఒక ఫార్చ్యూనర్ కారు, రూ. 51 లక్షల నగదు కావాలని దీపికను వేధించడం ప్రారంభించారు. కట్నం కోసమే ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఎలాగైన తనబిడ్డ సంసారం నిలబడుతుందనే ఆశతో, సర్దుకుపోతుందని భావించి తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని దీపిక తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అంత కట్నం ఇచ్చినా నా కూతురు నాకు దక్కలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పడిపోయిందా? తోసేశారా? ఆదివారం నాడు దీపికా తన తండ్రికి ఫోన్ చేసి, భర్త మరియు అత్తవారింటి వారు తనను తీవ్రంగా కొడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దాంతో తండ్రి బంధువులు ఆ సాయంత్రం అత్తగారింటికి వెళ్లి గొడవను సర్దిచెప్పి, వారు ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, రాత్రి 12:30 గంటల ప్రాంతంలో దీపికా మూడో అంతస్తునుంచి పైనుంచి కింద పడిందని సమాచారం అందింది.అయితే ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి చెప్పారు. ఆమెను తీవ్రంగా కొట్టి, కడుపులో స్క్రూడ్రైవర్ లేదా కత్తితో పొడిచి, ఆపై పైనుంచి కిందకు తోసేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, ముక్కు, చెవులలోంచి రక్తం కారుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను కొట్టి, ఆపై అది ఒక ప్రమాదంలా కనిపించేలా చేయడానికి కిందకు విసిరేశారని దీపిక బాబాయ్ విశేష్ నాగర్ ఆరోపించారుమామ, భర్త అరెస్ట్సెంట్రల్ నోయిడా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పైకప్పు పైనుంచి దూకి మరణించినట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దీపిక భర్త రితిక్ తన్వర్, మామ మనోజ్ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శవపరీక్ష (Post-mortem) నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
వీడియోలు
ఏపీకి ముగ్గురు సీఎంలు
విజయ్ కేబినెట్ మీటింగ్ లో సెల్ఫీ తీసుకుంటున్న అంకుల్
చెపాక్ ధోనీ కన్నీటి వీడ్కోలు..సురేష్ రైనాని హగ్ చేసుకుని ధోని ఎమోషనల్
రఘురామకృష్ణ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు..!
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
ఇంటికెళ్లి విజిల్ వేసుకోండి.. ఇషాన్ కిషన్ మాస్ ర్యాగింగ్
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం
నీ అయ్యా జాగీరా..? ధూళిపాళ్ల కు ఇచ్చిపడేసిన దాసరి రాము
మీరు హెలికాప్టర్ లో తిరిగి పాపం నిమ్మల రామనాయుడితో 10KM సైకిల్ తొక్కిస్తారా?
నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మా చెప్పుతో... నువ్వు వెంట్రుక కూడా పీకలేవ్...


