కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో ఆర్థిక తుపాన్ రాబోతుందన్నారు. ప్రజలందరూ భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోక తప్పదు మోదీ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుతాయని తెలిపారు. సామాన్యులంతా ఆర్థిక భారం ఎదుర్కొక తప్పదని బిలియనీర్ల కోసం మోదీ ఆర్థిక వ్యవస్థను తారుమారు చేశారన్నారు. గత కొన్ని రోజులుగా తాను ఈ విషయమే ప్రజలకు వివరిస్తున్నానన్నారు. మోదీ ఆర్థిక విధానాలతోనే దేశానికి ఈ దుస్థితి రాబోతుందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.


