టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
రాజస్తాన్ రాయల్స్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం అఫ్గానిస్తాన్‌తో సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జట్టు ఎంపికకు సంబంధించిన వివరాలను అగార్కర్ మీడియాకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ స్లాట్‌కు వైభవ్ సూర్యవంశీ పేరును ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా అని ఒక విలేకరి ప్రశ్న సంధించాడు. దీనిపై అగార్కర్ ఆసక్తికరంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే క్రికెట్లో సంచలన ప్రదర్శన చేస్తున్న విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. కానీ ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ స్థానానికి యశస్వి జైస్వాల్‌కు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపాడు. ‘వైభవ్ సూర్య వంశీ బాగా ఆడుతున్నాడు, కానీ అంతకముందే టీమిండియాలోకి వచ్చిన జైస్వాల్‌ను మనం మర్చిపోకూడదు. వైభవ్ అద్భుతంగా ఆడు తున్నప్పటికీ, అతడి కంటే సీనియర్ అయిన జైస్వాల్ కూడా బాగానే రాణిస్తున్నాడు.ఇప్పటికే వైభవ్ ‘ఇండియా-ఏ' జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలోనే టీమిండియా సీనియర్ జట్టుకు కూడా ఆడే అవకాశముంది. కానీ దానికి ఇంకా సమయం ఉంది. ఈలోగా ఇండియా-ఏ తరఫున వైభవ్ బాగా రాణించాలని ఆశిస్తున్నా’ అని అగార్కర్ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ తరఫున ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. భారీ స్కోర్లు నమోదు చేయనప్పటికీ క్రీజులోకి అడుగుపెట్టడమే ఆలస్యం..ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడిన వైభవ్ సూర్యవంశీ 486 పరుగులు సాధించాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అగార్కర్ టీమిండియాలో వైభవ్ ఎంపికకు ఇంకా సమయం ఉందని కుండబద్దలు కొట్టాడు.చదవండి: అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
భారీ అక్రమ ఆస్తులు.. జలమండలి జీఎం అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: జలమండలి జీఎం అనంతకుమార్ అరెస్ట్ అయ్యారు. అనంతకుమార్ వద్ద భారీ అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. సుదీర్ఘ సోదాల అనంతరం అరెస్ట్ చేశారు. సుమారు 15 గంటలపాటు అనంతకుమర్ నివాసంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారుప.ఈ తనిఖీల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల భూమి, 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఫ్లాట్లు ఉన్నట్లు బయటపడింది. జీఎం కుమార్‌కు చెందిన బ్యాంక్ లాకర్లు కూడా తెరిచి తనిఖీ చేశారు. సోదాలు మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ రోజు మంగళవారం ఏసీబీ అధికారులు హైదరాబాద్ జలమండలి జీఎం అనంతకుమార్ ఇంట్లో సోదాలు ప్రారంభించారు. ప్రారంభ సమయంలో తనిఖీల్లో రూ.కోటి ఐదు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కిలోకు పైగా బంగారం, నిజామాబాద్‌లో మూడు ఎకరాల భూమి, ఇతర స్థిరాస్తులు ఉన్నట్లు తేలింది. వీటన్నిటి విలువ దాదాపు రూ.100 కోట్లుగా భావిస్తున్నారు. అదే విధంగా అనంతకుమార్ బ్యాంక్ లాకర్లు కూడా తెరిచి తనిఖీ చేయాలని అధికారులు నిర్ణయించారు. జీఎంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు జరిపారు. రెడ్ హిల్స్‌లోని జీఎం నివాసంతో పాటు మల్లాపూర్‌లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఇంట్లో తిట్లు, బయట సెటైర్లు.. అయినా బస్సు డ్రైవర్లుగా అమ్మాయిలు
బిహార్‌లో ఆరుగురు యువతులు కొన్ని నెలల క్రితమే బస్ డ్రైవర్లుగా తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. వాళ్లని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆడపిల్లలు బస్సులు నడపడం ఏంటని అంటున్నారు. బిహార్‌లో మహిళల భద్రత కోసం ప్రారంభించిన ‘పింక్ బస్’ పథకంలో భాగంగా తొలి మహిళా బస్ డ్రైవర్లుగా ఆరుగురు ముసహర్ దళిత మహిళలు బాధ్యతలు చేపట్టారు. అయితే మహిళా సాధికారత పేరుతో వచ్చిన ఈ పథకంలోనూ లింగ వివక్ష, అవమానాలు వారిని వెంటాడుతున్నాయి. అధికారులు ఇప్పటికీ వారితో పాటు పురుష డ్రైవర్లను పర్యవేక్షణకు పంపుతున్నారు. “ఇది మగవాళ్ల పని” అంటూ కొందరు సహచరులు ఎగతాళి చేస్తున్నారని మహిళా డ్రైవర్లు చెబుతున్నారు. పేదరికం, కుల వివక్ష, కుటుంబ అడ్డంకులను దాటుకుని వచ్చిన ఈ యువతులు ఇప్పుడు బిహార్ రోడ్లపై తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు పోరాడుతున్నారు.విశాలమైన బస్ డిపోలో 21 ఏళ్ల రాగిణి కుమారి జీన్స్, గులాబీ రంగు కుర్తీ, చెప్పులు ధరించి గులాబీ బస్సును కిక్కిరిసిన పార్కింగ్ ప్రాంతం నుంచి నెమ్మదిగా బయటకు తీసుకొస్తోంది. వరుసగా నిల్చున్న పురుష డ్రైవర్లు ఆమెను గమనిస్తున్నారు. బిహార్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన గులాబీ బస్ పథకం కింద నియమితులైన తొలి మహిళా బస్ డ్రైవర్లలో ఆమె ఒకరు. “పార్కింగ్ నుంచి బస్సును బయటకు తీసుకురాగలవా?” అని ఓ సహచరుడు అడిగాడు. రాగిణి మాత్రం స్టీరింగ్‌పై నుంచి చూపు తిప్పలేదు. “మా అమ్మాయిలపై మీకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? కనీసం మమ్మల్ని నమ్మేందుకు ప్రయత్నించండి” అని ఆమె సమాధానం ఇచ్చింది. కొద్ది సేపటికి ఆ బస్సు డిపో నుంచి గాంధీ మైదాన్ వైపు బయల్దేరింది. రాగిణి నడిపే మార్గాల్లో అది ఒకటి. బిహార్ తొలి మహిళా బస్ డ్రైవర్ల బృందంలో ఆమెతో పాటు ఇంకో ఐదుగురు ఉన్నారు.ఈ నెల బిహార్ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ నియమించిన ఆరుగురు మహిళలూ ముసహర్ సమాజానికి చెందినవారే. బిహార్‌లో అత్యంత వెనుకబడిన దళిత వర్గాల్లో ఇది ఒకటి. బిహార్ ప్రభుత్వం చేసిన ఈ నియామకాలు మహిళా సాధికారతలో కీలక ఘట్టమని ప్రశంసలు అందుకున్నాయి. అయితే ఆ మహిళలకు అసలు పోరాటం అప్పుడే మొదలైంది. డిపోలో అనుమానం, మహిళలపై ద్వేషభావం, మహిళలకు పూర్తిగా బాధ్యత ఇవ్వటానికి వెనుకాడుతున్న రవాణా వ్యవస్థతో ఆ మహిళా డ్రైవర్లు పోరాడాల్సి వస్తోంది. పితృస్వామ్య సమాజంలో మార్పు తెస్తారా? బిహార్ తొలి మహిళా బస్ డ్రైవర్లుగా నియమితులైన ఈ ఆరుగురు ముసహర్ మహిళల పేర్లు రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి. ఈ యువతులు పేదరికం, కుల వివక్ష, కుటుంబ అడ్డంకులను దాటుకుని బస్సు స్టీరింగ్ పట్టారు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వారికి పూర్తిస్థాయి స్వేచ్ఛ దక్కలేదు. మహిళల శారీరక సామర్థ్యంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకంలో 100 బస్సులకుగాను కేవలం ఆరుగురు మహిళా డ్రైవర్లే చేరారు. మిగతావారిని కుటుంబాలు ఆ పనులకు పంపలేదు. మరికొందరు అమ్మాయిల పెళ్లిళ్లు జరగడంతో వారు డ్రైవర్లుగా ఉద్యోగాల్లో చేరలేదు. అయినా, రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి బిహార్ పితృస్వామ్య ఆలోచనలకు సవాల్ విసురుతూ పోరాడుతున్నారు.గత ఏడాది ప్రారంభమైన బిహార్ గులాబీ బస్ పథకం పూర్తిగా మహిళల ఆధారిత వ్యవస్థగా మార్చాలనుకున్నారు. మహిళా ప్రయాణికులు, మహిళా కండక్టర్లు, మహిళా నోడల్ అధికారులు, మహిళా డ్రైవర్లు ఉండేలా రూపకల్పన చేశారు. ఆరు నగరాల్లో ప్రవేశపెట్టిన ఈ బస్సులు మహిళలకు సురక్షిత ప్రజా రవాణా అందించాలనే ఉద్దేశంతో వచ్చాయి. ఉద్యోగం కంటే పెళ్లికే ప్రాధాన్యం ఇవ్వాలని కుటుంబాలు ఒత్తిడి చేయటం, మహిళల సామర్థ్యంపై పురుష డ్రైవర్ల అనుమానాలు, మహిళా ఉద్యోగులకు సరిపడా సదుపాయాలు లేని రవాణా కార్యాలయాలు సమస్యలుగా మారాయి. బిహార్ అణచివేతకు గురైన ముసహర్ సమాజానికి చెందిన ఆరుగురు యువతులు తమవారి భవిష్యత్తు మారేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పట్టు వదలకుం డ్రైవర్ జాబ్ చేస్తూ పితృస్వామ్య సమాజంలో మార్పు తెస్తారన్న భావనను అందరిలో కలిగిస్తున్నారు. “బిహార్ పితృస్వామ్య సమాజంలో ఈ అమ్మాయిల ప్రవేశం విప్లవాత్మకం. వీరు చూపిన ధైర్యం రాష్ట్రవ్యాప్తంగా యువతులకు ప్రేరణ అవుతుంది. పితృస్వామ్య ఆలోచనలను సవాలు చేసే మార్గం ఇది” అని సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుధా వర్గీస్ చెప్పారు. బస్సు స్టీరింగ్‌ను తాకితే ఆత్మవిశ్వాసం ప్రతి రోజు ఉదయం 6 గంటలకు 21 ఏళ్ల రాగిణి కుమారి పాట్నాలోని బిహార్ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ డిపోకు చేరుకుంటుంది. “బస్సు స్టీరింగ్‌ను తాకిన ప్రతిసారి నాకు ఆత్మవిశ్వాసం వస్తుంది. బస్సు స్టార్ట్ చేసిన ప్రతిసారి నా కష్టాల ప్రయాణం కళ్లముందు తిరుగుతుంది” అని ఆమె చెప్పింది.రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి 2025లో ఔరంగాబాద్‌లోని డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. ఈ పథకానికి “మహిళలకు భద్రత, గౌరవం అందించేందుకు కట్టుబడి ఉన్న బిహార్ ప్రభుత్వం” అనే నినాదాన్ని ఇచ్చారు. పట్నా, గయా, ముజఫర్‌పూర్, దర్భంగా, భాగల్పూర్, పూర్ణియా నగరాల్లో బస్సులను ప్రారంభించారు.పట్నా పున్పున్ ప్రాంతంలోని అల్లౌద్దీన్చక్ గ్రామం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్‌కు పంపేందుకు రాగిణి తండ్రి తొలుత నిరాకరించాడు. “నాన్న అనుమతించలేదు. అయినా నేను ఇంటి నుంచి వెళ్లిపోయి శిక్షణ తీసుకున్నాను. అది సులభమైన ప్రయాణం కాదు” అని ఆమె చెప్పింది.గ్రామంలో పొరుగువారు ఆమె తల్లిదండ్రులను ఎగతాళి చేశారు. పెళ్లి చేయాలని సలహాలు ఇచ్చారు. ఆమె తల్లి సోనీ దేవి మాత్రం తన కూతురికి మద్దతుగా నిలిచింది. “ఆమె కోరుకున్నది చేయనిచ్చాను. నేను జీవితాంతం పేదరికంలో గడిపాను. ఆమె మాత్రం అలాంటి జీవితం గడపకూడదు” అని చెప్పింది. మసౌర్హిలో చరిత్ర ఆనర్స్ చదివిన రాగిణి ఇప్పుడు తన సహచరులతో కలిసి నెలకు రూ. 3,000 అద్దె చెల్లిస్తూ డిపోకు సమీపంలో ఉంటోంది.
ఘనమైన గతంతో 'బలమైన భవితలోకి'!
ఇండియా, ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు నేడొక కీలక మలుపులో నిలిచాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన అవి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి. అంతర్జాతీయ వ్యవస్థ తీవ్రమైన మార్పులకు లోనవుతున్న తరుణంలో క్రమబద్ధ ఆదాన ప్రదానాలు రెండు దేశాల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. మేడిన్ ఇటలీ... మేడిన్ ఇండియాప్రస్తుత 21వ శతాబ్దంలో ఆ యా దేశాల ఆవిష్కరణ సామర్థ్యం, ఇంధన మార్పిడి నిర్వహణ, వ్యూహాత్మక సార్వభౌమత్వం తదిత రాలే ప్రజా శ్రేయస్సు, జాతీయ భద్రత వంటి అంశాలకు రూపు నిస్తాయి. ఈ విషయంలో మా ఉమ్మడి అవగాహనను రెండు దేశాల మధ్య సహకారం ప్రస్ఫుటం చేస్తోంది. డిజైన్, తయారీ నైపుణ్యం, అంతర్జాతీయ స్థాయి సూపర్ కంప్యూటర్లతో పారిశ్రామిక కూడలిగా ప్రపంచంలో ఇటలీకి ప్రముఖ స్థానం ఉంది. అదేవిధంగా 100కు పైగా యూనికార్న్ సంస్థలు సహా 2,00,000 అంకుర సంస్థలతో భారత్ శరవేగంగా ఆర్థిక వృద్ధిని సాధిస్తోంది. రెండు దేశాలకుగల ఈ సామర్థ్యాల మధ్య శక్తిమంతమైన సమన్వయ సాధన లక్ష్యాన్ని మేం నిర్దేశించుకున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఇనుమడించేందుకు ఐరోపా సమాఖ్య–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) బాటలు వేస్తుంది. రక్షణ–ఏరోస్పేస్, కాలుష్య రహిత సాంకేతికతలు, యంత్రాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, రసాయన–ఔషధ, జౌళి, వ్యవసాయ–ఆహార, పర్యాటకం సహా మరిన్ని రంగాలపై ‘ఎఫ్‌టీఏ’ దృష్టి సారిస్తుంది. తద్వారా 2029 నాటికి ఇటలీ–ఇండియా మధ్య నిర్దేశిత 20 బిలియన్ యూరోల వాణిజ్య లక్ష్యాన్ని చేరడంతో సరి పెట్టకుండా దాన్ని అధిగమించాలన్నది మా ఆకాంక్ష. ‘మేడ్ ఇన్ ఇటలీ’ అనేది అంతర్జాతీయంగా అత్యుత్తమ నాణ్యతకు పర్యాయ పదబంధం. ఇప్పుడిది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ నిర్దేశిత ఉన్నత నాణ్యత లక్ష్యంతో సమన్వయం ఏర్పరచు కుంటుంది. ఈ నేపథ్యంలో భారత్ కోసం ఉత్పాదన దిశగా ఇటలీ వ్యాపార సంస్థలలో ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు ఇటలీలో భారత పరిశ్రమల సంఖ్య కూడా పెరగడం (ప్రస్తుతం రెండువైపులా వీటి సంఖ్య 1000కి పైగానే) మా సరఫరా వ్యవస్థల ఏకీకరణను బలోపేతం చేసే సానుకూల సంకేతం.ఏఐలో మానవీయతకే ప్రాధాన్యంఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అత్యాధునిక తయారీ, కీలక ఖనిజాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో నేటి పురోగమన వేగం రాబోయే దశాబ్దాల్లో అసాధారణ పరిధిగల సాంకేతిక విప్లవంగా రూపుదిద్దుకోగలదు. ఈ క్రమంలో చైతన్యవంతమైన భారత ఆవిష్కరణావరణ వ్యవస్థ, అత్యంత నైపుణ్యంగల వృత్తి నిపుణుల వనరులు, ఇటలీకిగల అత్యధునాతన పారిశ్రామిక సామర్థ్యం మేళవింపుతో పైన పేర్కొన్న రంగాలన్నిటా మన సహ కారం సహజసిద్ధమైనదిగా, వ్యూహాత్మకంగా రూపొందుతుంది. రెండు దేశాల్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం ఈ పరిణామశీలతకు తోడ్పడుతుంది. సాంకేతికత పరిజ్ఞానాలను మానవాళి కేంద్రకంగా ఉంచేందుకు ‘మానవ్’ పేరిట భారత్ ఒక దార్శనిక విధానం అనుసరిస్తోంది. మానవతావాద సంప్రదాయంలో పాదుకున్న మానవ–కేంద్రక ‘అల్గార్–ఎథిక్స్’ను ప్రోత్సహించడంలో ఇటలీ ముందంజ వేసింది. ఇటలీ జి7 అధ్యక్షతకు, న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026’ సత్ఫలితాలకు మూలం ఈ సంయుక్త దృక్పథమే. అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ సాంకేతికతలలో భారత్ ఇప్ప టికే అద్భుత ప్రగతి సాధించింది. ఇప్పుడిక ఇటలీ ఏరోస్పేస్ ఇంజి నీరింగ్ నైపుణ్యం తోడ్పాటుతో సంయుక్త కార్యక్రమాలు చేపట్టడం సహా భవిష్యత్తరం సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పనకు గణనీయ అవకాశాలు అందివస్తాయి. ప్రపంచ దేశాల శ్రేయస్సుకు భరోసా లభించాలంటే జాతీయ భద్రత–స్థిరత్వం అత్యావశ్యకం. కాబట్టే రక్షణ–భద్రత, వ్యూహాత్మక సాంకేతికతలు వంటి రంగాల్లో సహకార బలోపేతానికి ఇటలీ, ఇండియా సంకల్పించాయి. కీలక సముద్ర మార్గాల భద్రతకు భరో సాతోపాటు ఉగ్రవాదం, అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లు, మాదక ద్రవ్యాల దొంగ రవాణా, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను ఎదుర్కొనగల సామర్థ్యాన్ని పటిష్ఠం చేయడంలో ఈ సహకారం దోహదం చేస్తుంది.ఇండో–మధ్యదరా కోసం వ్యూహాత్మక భాగస్వామ్యంమన భాగస్వామ్యానికి ఇంధన రంగం మరో మూలస్తంభం. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనాల నుంచి హైడ్రోజన్ సాంకే తికతల దాకా... స్మార్ట్ గ్రిడ్ల నుంచి పునరుత్థాన మౌలిక సదు పాయాల వరకూ భారత్, ఇటలీ ఇప్పటికే సహకారం కొనసాగిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నేతృత్వాన ఏర్పడిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ), విపత్తు పునరుత్థాన మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), అంతర్జాతీయ జీవఇంధన కూటమి (జీబీఏ) వంటి సంకీర్ణ సంస్థల కృషిలో ఇతర దేశాలతోపాటు మన సహకారం కూడా కీలకం.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలక కేంద్రాలైన ఇండో–పసి ఫిక్, మధ్యధరా ప్రాంతాల నడిబొడ్డున ఇండియా, ఇటలీ ఉన్నాయి. కాబట్టి, ఈ ప్రాంతాలను వేర్వేరు పరిధులుగా కాకుండా అంతకంతకూ పరస్పర సంధానితం అవుతున్న ప్రదేశాలుగా పరిగణించాలి. హిందూ మహాసముద్రాన్ని ఐరోపాతో ముడిపెట్టే వాణిజ్య, సాంకేతిక, ఇంధన, డేటా సహా సమాలోచనలకు కీలక మార్గమైన భారత–మధ్యధరా ప్రాంతం ఆవిర్భావానికి మన రెండు దేశాలే ప్రత్యక్ష సాక్షులు. సరిగ్గా ఈ పరస్పర సంధాన క్రమంలోనే మన స్నేహబంధం సహజ రీతిలో ఒక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా పరిఢవిల్లుతూ – రెండు ఖండాలను కలిపి, కొత్త ప్రపంచ గమనాన్ని రూపుదిద్దుతుంది. ఈ పరిస్థితుల నడుమ ఆధునిక రవాణా, మౌలిక సదుపాయాలు, డిజిటల్ నెట్‌వర్క్‌లు, ఇంధన వ్యవస్థలు, పటిష్ఠ సరఫరా వ్యవస్థలతో మన ప్రాంతాలను అనుసంధానించడమే లక్ష్యంగా పెట్టుకున్న దార్శనికతకు ‘ఇండియా– మధ్యప్రాచ్య–ఐరోపా ఆర్థిక కారిడార్’ (ఐఎంఈసీ) ఒక ప్రతీక. భారతీయ సంస్కృతి ప్రబోధించే ‘ధర్మం’ అనే ఉదాత్త భావన మా బాధ్యతా స్ఫూర్తిని ఉత్తేజితం చేస్తుంది. ఆ క్రమంలో నేటి పరస్పర సంధాన డిజిటల్ యుగంలోనూ ‘వసుధైవ కుటుంబకం’ (యావత్ ప్రపంచం ఒకే కుటుంబం) సూత్రం మానవాళి మొత్తాన్నీ ముడివేయడంలో శక్తిమంతంగా పనిచేస్తుంది. పునరుజ్జీవన పథంలో పయనించే ఇటలీ మానవతావాద సంప్రదాయం కూడా ఈ విలువలను సహజంగా ప్రతిబింబిస్తుంది. అందుకే, రెండు దేశాల ప్రజలకు కేంద్ర స్థానమిస్తూ ఇండియా–ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది వేయాలని మా సంయుక్త దార్శనికత లక్ష్యనిర్దేశం చేసుకుంది.
పిల్లలూ... చదవాలి లా
నిమ్స్‌లాగే టిమ్స్!
సెల్ఫ్ ఎన్యుమరేషన్ @ 5.14 లక్షల మంది
దొంగ అంటూ ముద్ర వేశారని...
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అడ్డంకులు!
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
‘ప్రపంచకప్‌కు మేం సిద్ధం’
ఆరు నెలల గరిష్టానికి నిరుద్యోగం
డబ్బు కన్నా... పట్టుదల ముఖ్యం
కొత్త కుర్రాళ్లకు పిలుపు
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మమతకు సీఎం సువేందు ఝలక్
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
దగ్గుపాటి రాజకీయం.. టీడీపీలో భారీ పొలిటికల్ ట్విస్ట్
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
పిల్లలూ... చదవాలి లా
నిమ్స్‌లాగే టిమ్స్!
సెల్ఫ్ ఎన్యుమరేషన్ @ 5.14 లక్షల మంది
దొంగ అంటూ ముద్ర వేశారని...
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అడ్డంకులు!
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
‘ప్రపంచకప్‌కు మేం సిద్ధం’
ఆరు నెలల గరిష్టానికి నిరుద్యోగం
డబ్బు కన్నా... పట్టుదల ముఖ్యం
కొత్త కుర్రాళ్లకు పిలుపు
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మమతకు సీఎం సువేందు ఝలక్
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
దగ్గుపాటి రాజకీయం.. టీడీపీలో భారీ పొలిటికల్ ట్విస్ట్
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
ఫొటోలు
'పెద్ది' కోసం జాన్వీ కపూర్ రెడీ అయిందిలా (ఫొటోలు)
రాశీ ఖన్నా గ్లామర్ ఫోటోషూట్
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
మంచు మనోజ్ కొత్త ట్రస్ట్ ప్రారంభం (ఫొటోలు)
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
పెట్రో బాదుడు: వైఎస్సార్సీపీ పోరుబాటకు విశేష స్పందన
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
అనంతపురం : భారమైన వేళ.. బాధతో విక్రయం! (ఫొటోలు)
సినిమా
మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే
ఒకప్పుడు తెలుగులో హీరోగా సినిమాలు చేసిన మంచు మనోజ్.. రీసెంట్ టైంలో మిరాయ్, భైరవం చిత్రాలతో విలన్‌గా మారిపోయాడు. ఆకట్టుకున్నాడు కూడా. ప్రస్తుతం 'డేవిడ్ రెడ్డి' అనే మూవీలో నెగిటివ్ టచ్ ఉండే హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఓ ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. మీడియాతో కలిసి తన ప్రీ బర్త్ డే వేడుకల్ని హైదరాబాద్‌లో చేసుకున్నాడు. ఇందులోనే తండ్రితో గొడవ గురించి ప్రశ్న ఎదురవగా సెటైరికల్‌గా సమాధానమిచ్చాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ అదేనా?)'మీ నాన్నతో గొడవ క్లియర్ అయినట్టేనా?' అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మనోజ్.. అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా? కానీ మైక్‌తో వెళ్ళకండి. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. గతంలో మంచు కుటుంబంలో గొడవ జరుగుతున్నప్పుడు ఓ మీడియా ప్రతినిధిని మోహన్ బాబు మైక్‌తో కొట్టారు. తర్వాత క్షమాపణ చెప్పారు.మీడియాతో మాట్లాడుతూ మనోజ్ మరికొన్ని విషయాల్ని పంచుకున్నాడు. భైరవం, మిరాయ్ సినిమాలు నాకు ఇచ్చిన డైరెక్టర్స్ ఇద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఇంకో జన్మ ఇచ్చారు. అలానే నా భార్య మౌనిక కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని మనోజ్ చెప్పాడు.తాజాగా 'ఐక్య ధైర్య సేనా సమితి' పేరుతో ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. ఎవరైనా బెదిరింపు కాల్స్‌తో బాధపడుతుంటే వాళ్లకు మా ట్రస్ట్ అండగా ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికే దీనిని మొదలుపెట్టాం. ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని, వారి చదువు బాధ్యతలను ఈరోజు నుంచే పూర్తిగా తీసుకుంటామని మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ)Media Person: మీ ఫ్యామిలీ ఇష్యూ క్లియర్ అయినట్టేనా ? #ManchuManoj: అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా ? వెళ్ళి అడగండి. కానీ Mic పట్టుకొని వెళ్లొద్దు. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. pic.twitter.com/M4WBvEe1rH— cinee worldd (@Cinee_Worldd) May 19, 2026
ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన ‘కరుప్పు’ టీమ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కరుప్పు(తెలుగులో వీరభద్రుడు) చిత్ర బృందం క్షమాపణలు చెప్పింది. ఆయనను అగౌరపరచడం తమ ఉద్దేశం కాదని.. సినిమాలో ఉన్న డైలాగలను వెంటనే తొలగిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.అసలేం జరిగింది?సూర్య, త్రిష జంటగా నటించిన తాజా చిత్రం కరుప్పు. ఆర్.జే. బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ఇళయారాజాపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా కొన్ని డైలాగులు ఉన్నాయి. కొన్ని చోట్ల అసందర్భంగానూ ఇళయరాజాపై డైలాగులు పెట్టారు. అవి ఆయన గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇళయరాజా కూడా ఆ డైలాగులపై అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కొంతమంది ఇళయరాజా అభిమానులు సినిమాను ట్రోల్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదం పెద్దది కాకముందే ముగింపు పలికారు చిత్రబృందం. ఇళయరాజాను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది.ఈ రోజు నుంచే మార్పు..ఇళయరాజా అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. సినీ రంగం కోసం ఆయన చేస్తున్న సేవలు ఎన్నోతరాల్లో స్ఫూర్తి నింపుతున్నాయి. కరుప్పులో ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగు వల్ల ఆయన బాధ పడ్డారని మా దృష్టికి వచ్చింది. ఇళయరాజాను మేము క్షమాపణలు కోరుతున్నాం. ఆయన మనోభావాలను దెబ్బతీయడం, అగౌరవపర్చడం మా ఉద్దేశం కాదు. ఈ చిత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నాం. ఈరోజు నుంచి ఈ మార్పు చేస్తున్నాం. ఆయన గౌరవమే మాకు ప్రధానం’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
నా పోస్ట్‌ని బ్రేకింగ్ న్యూస్ చేశారు.. అమ్మ కంగారుపడుతోంది : సల్మాన్ ఖాన్
నిన్నంటి నుంచి సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన షర్ట్‌లెస్ ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ఒంటరితనం గురించి రాసుకొచ్చాడు. ‘ఒంటరిగా ఉండటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి 'అలోన్', రెండోది 'లోన్లీ'. 'అలోన్'గా ఉండటం అనేది మన ఇష్టపూర్వక ఎంపిక. కానీ, ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడనప్పుడు వచ్చేది 'లోన్లీ'నెస్... ఇక దీని తర్వాత ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. ‘సల్మాన్ ఖాన్‌కి ఏమైంది?’, ఒంటరిగా ఉన్నానని ఎందుకు ఫీల్ అవుతున్నాడంటూ ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ వైరల్ న్యూస్‌పై సల్మాన్ ఖాన్ స్పందించాడు. సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్ట్.. వైరల్ అయిన న్యూస్ చూసి తన తల్లి కంగారు పడిందని, అయితే తాను మాత్రం చాలా హ్యాపీగానే ఉన్నానని చెప్పాడు.‘అరే యార్.. నేను నా గురించి మాట్లాడలేదు. అయినా.. ఇంత పెద్ద కుటుంబం, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను ఎలా ఒంటరివాడిని అవుతాను? మీ అందరి ప్రేమాభిమానాలు నాకు తోడుగా ఉంటే నేను ఒక్కడినే అనే భావన నాలో ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు చుట్టూ జనాలు ఉండటం వల్ల విసుగ్గా అనిపిస్తుంది. అందుకే నా కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలనిపించిందంతే. దాన్ని మీరంతా హైలైట్ చేశారు. కనీసం ఫొటో కూడా పెట్టకుండానే మీరు దీన్ని బ్రేకింగ్ న్యూస్ చేసేశారు. మా అమ్మ కూడా నన్ను ‘ఏమైంది నాన్న?’ అని అడుగుతోంది. రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్’ అని ఆయన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీంతో సల్మాన్ ఖాన్‌కి ఏం కాలేదనే విషయం తెలిసి.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన ‘మాతృభూమి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమాలో నా పాత్రే చాలా కీలకం: భాగ్యశ్రీ బోర్సే
లక్కీ హీరోయిన్లలో నటి భాగ్యశ్రీ బోర్సే ఒకరనే చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో ఈమె తొలి నుంచి స్టార్ హీరోలతోనే జత కడుతున్నారు. తెలుగులో మొదటగా రవితేజతో మిస్టర్ బచ్చన్ చిత్రంలో జత కట్టారు. ఆ తరువాత విజయ్‌దేవరకొండ సరసన కింగ్డమ్ చిత్రంలో నటించారు. ఆ తరువాత తమిళంలో దుల్కర్సల్మాన్, రానాలతో కలిసి కాంతా చిత్రంలో నటించారు. తాజాగా తమిళంలో నటుడు కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న సెయోన్ చిత్రంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించే లక్కీఛాన్స్‌ను కొట్టేశారు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇది ఇంతకు ముందు కమలహాసన్ నటించిన విరుమాండి చిత్రం తరహాలో కరుమాత్తూర్ దైవాల ఇతి వృత్తంతో సాగుతుందని సమాచారం. మదురై నేపధ్యంలో యాక్షన్, కామెడీ అంశాలతో గ్రామీణ కుటుంబ కథా చిత్రంగా సెయోన్ ఉంటుందని తెలిసింది. కాగా ఈ చిత్రంలో తన పాత్ర గురించి నటి భాగ్యశ్రీ బోర్సే ఇటీవల ఓ భేటీలో తెలుపుతూ కమలహహాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించే ఈ చిత్రం గురించి ఇప్పుడే ఎక్కువ చెప్పలేనన్నారు. అయితే ఈ చిత్రానికి తన పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు. తనను ఉత్తమ నటిగా ప్రేక్షకులకు చూపుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రేక్షకులకు నిజాయితీగా ఉండాలంటే తాము నటించే చిత్రాల భాషను తెలుసుకోవాలన్నారు. అందుకే తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా కింగ్డమ్ చిత్రంలో నటించినప్పుడు ఆ చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పానని అన్నారు. అదే విధంగా ఇప్పుడు సెయోన్ చిత్రం కోసం తమిళ భాషను నేర్చుకుంటున్నట్లు భాగ్యశ్రీ బోర్సే చెప్పారు.
క్రీడలు
‘ఏఐటీఏలోకి అడుగు పెడతా’
ముంబై: భారత మాజీ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఇప్పుడు పరిపాలనా వ్యవహారాల వైపు పూర్తి స్థాయిలో రావాలని ఆశిస్తున్నాడు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఎన్నికల్లో పాల్గొని జాతీయ స్థాయిలో అన్ని రకాలుగా భాగం కావాలని అతను భావిస్తున్నాడు. ఏఐటీఏలో చేరితే టెన్నిస్‌లో పలు కీలక మార్పులు తీసుకొచ్చేందుకు తాను సిద్ధమని బోపన్న ప్రకటించాడు. 2024లో జరిగిన ఎన్నికల ఫలితాలపై చెలరేగిన వివాదం కోర్టు జోక్యంతో ఇటీవలే సమసిపోగా... త్వరలోనే మళ్లీ పూర్తి స్థాయిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బోపన్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బోపన్న ఇప్పటికే కర్ణాటక టెన్నిస్ సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ‘ఏఐటీఏలో ఎన్నికల సమయం వచ్చింది. నాకూ ఏదైనా అవకాశం దొరికితే ఈ పరిపాలనలో భాగం కావాలని కోరుకుంటున్నా. భారత టెన్నిస్‌ను అభివృద్ధి చేసే దిశగా కీలక మార్పులు చేయగలననే విశ్వాసం నాకుంది. అలాంటి అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఏదో ఒక పదవి తీసుకోవడం నా ఉద్దేశం కాదు. నా వంతుగా ఏదైనా చేయగలనని నమ్మితే కచ్చితంగా వస్తా’ అని బోపన్న చెప్పాడు. మరోవైపు భారత టెన్నిస్‌లో డబుల్స్ ఆటగాళ్లను తీర్చిదిద్దే క్రమంలో తన సొంత అకాడమీలో సాగుతున్న ‘డబుల్స్ డ్రీమ్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంపై కూడా బోపన్న మాట్లాడాడు. ఇటీవలి కాలంలో డబుల్స్‌కు కూడా ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో తాను దానిపై దృష్టి పెట్టానని, పైగా స్పాన్సర్ల సహకారం కూడా లభించిందని అతను వెల్లడించాడు. ‘మా అకాడమీలో డబుల్స్ ఆటగాళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. దీనికి స్పాన్సర్లు కూడా లభించడం సానుకూలాంశం. సింగిల్స్‌తో పోలిస్తే ఇటీవల డబుల్స్‌కు మంచి ప్రాధాన్యత పెరిగింది. అందుకే దీనికి డబుల్స్ డ్రీమ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టాం. మా అకాడమీలో మొత్తం 175 మంది ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఇప్పటికే దక్షిణేశ్వర్ సురేశ్, వైష్ణవి అడ్కర్, దేవ్ జావియా, ప్రార్థన తోంబరే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అసోం, జమ్మూకు చెందిన కొందరు ప్రతిభ గల పేద కుర్రాళ్లకు గుర్తించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. భవిష్యత్తులో అత్యుత్తమ ఆటగాళ్లు రావాలనేదే నా లక్ష్యం’ అని గతంలో డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన రోహన్ బోపన్న వివరించాడు.
82 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టాతో...
లాస్ ఏంజెలిస్: మహిళల టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు... సుదీర్ఘ కెరీర్లో 12 సింగిల్స్ ట్రోఫీలు సహా ఏకంగా 39 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఘనత... ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు... ఆమె పేరుతోనే మహిళల టెన్నిస్‌లో టీమ్ ఈవెంట్ నిర్వహణ... ఇవన్నీ బిల్లీ జీన్ కింగ్ సొంతం. అయితే ఇంత అసాధారణ కెరీర్ తర్వాత కూడా జీన్ కింగ్ మదిలో ఒక తీరని కోరిక మిగిలిపోయింది. ఆటలో పడి తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయలేకపోయానని అనిపించేది. రెండేళ్ల క్రితమే చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పుడు దానిని సాధించి చూపించింది. 82 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పట్టాతో సగర్వంగా నిలిచింది. లాస్ ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో జీన్ కింగ్ 1961లో అడ్మిషన్ తీసుకుంది. అదే ఏడాది వింబుల్డన్‌లో డబుల్స్ టైటిల్ సాధించడంతో జీన్ కింగ్ చదువుకు దూరమైంది. ఆమె విజయప్రస్థానంలో ఇది మొదటి ట్రోఫీ కాగా... దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె ఆటను శాసించింది. అడ్మిషన్ తీసుకున్న 65 ఏళ్ల తర్వాత ఆమె చేతుల్లోకి డిగ్రీ రావడం విశేషం. ‘దీని విలువ ఎంతో నేను మాటల్లో చెప్పలేను. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఏదైనా సాధించాలని అనుకుంటే, మీపై మీకు నమ్మకం ఉంటే వయసులో సంబంధం లేదు. దేనికైనా ఆలస్యం అనేదే ఉండదు’ అని బిల్లీ జీన్ కింగ్ వ్యాఖ్యానించింది. 2026లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న మరో 6 వేల మందితో కలిసి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కరతాళ ధ్వనుల మధ్య ఆమె తన డిగ్రీ పట్టాను అందుకుంది.
వైభవ్,జురేల్ ఊచకోత.. లక్నోపై రాజస్తాన్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు మరింత దగ్గరైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ (93) విధ్వంసానికి తోడు ధ్రువ్ జురేల్ (53 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్, మోసిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.అంతకముందు లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన పూరన్ (16) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పంత్ (23 బంతుల్లో 35) పర్వాలేదనిపించాడు. అయితే లక్నో చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 220 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లలో యష్ రాజ్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.ఈ విజయంతో రాజస్తాన్ 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన రాజస్తాన్ తమ చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరుకోనుంది. రాజస్తాన్ తమ చివరి మ్యాచ్‌ను మే 24 (ఆదివారం) ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.Joy and jubilation in Jaipur 🩷🥳A statement chase from @rajasthanroyals sees them jump back into the 🔝4️⃣ 👏Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/7lJD2IYOUF— IndianPremierLeague (@IPL) May 19, 2026చదవండి: వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు!
వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం విజయంవంతంగా సాగుతోంది. మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. జైస్వాల్ ఉన్నంతసేపు సైలెంట్‌గా ఉన్న వైభవ్ అతడు ఔటయ్యాకా ఆటను పూర్తిగా మార్చేశాడు.ఇన్నింగ్స్ 8వ ఓవర్ వరకు వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 9వ ఓవర్ వేసిన లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్‌కు ఆ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు, రెండు వైడ్లు కలిపి మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. పనిలో పనిగా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత వైభవ్ తన ఆటలో దూకుడును మరింత పెంచాడు. మయాంక్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జురెల్‌తో కలిసి వైభవ్ మరోసారి చెలరేగిపోయాడు. అగ్నికి వాయువు తోడైనట్లు ఈ ఇద్దరు కలిసి ఆ ఓవర్లో 29 పరుగులు పిండుకున్నారు. తొలుత ధ్రువ్ జురేల్ తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను వరుసగా 4,6,6 బాదాడు. ఆ తర్వాత ఓవర్ ఐదు, ఆరు బంతులను వైభవ్ సూర్యవంశీ సిక్సర్లుగా మలిచాడు.దీంతో చూస్తుండగానే వైభవ్ 80 పరుగుల మార్క్‌ను దాటాడు. ఇక దిగ్వేష్ రాఠీ వేసిన 13వ ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టిన వైభవ్ 90ల్లోకి అడుగుపెట్టాడు. ఇక మరో సెంచరీ ఖాయమనుకున్న దశలో మోసిన్ ఖాన్ 14వ ఓవర్ తొలి బంతికి రనౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ అదే ఓవర్ చివరి బంతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో 93 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది.అంతకముందు లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. 𝗦𝘁𝗼𝗿𝗺 𝗼𝗳 𝗦𝗶𝘅𝗲𝘀 🚀Vaibhav Sooryavanshi lit up #RR's chase with a thunderous 93(38) 🎇Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/qe6TfmGnTx— IndianPremierLeague (@IPL) May 19, 2026Just when we thought we'd seen it all 😅🎥 How has that evaded the stumps? 😮Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/qxBKA8TMhS— IndianPremierLeague (@IPL) May 19, 2026
న్యూస్ పాడ్‌కాస్ట్
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
బిజినెస్
నేను అడ్వైజర్ కాదు.. పెట్టుబడులు మీ ఇష్టం
పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు.. ఆర్థికపరమైన సమాచారం వెల్లడించే రాబర్ట్ కియోసాకి తొలిసారి ఘాటుగా స్పదించారు. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదని, ఇతరులకు పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం లేదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను ఆర్ధిక సలహాదారుని కారు.. అయితే నా పేరును ఉపయోగించి, కొందరు వ్యక్తులు.. నేను చెప్పినట్లు పెట్టుబడులకు సంబంధించిన విషయాలను చెబుతున్నారు. వారికి నా లాయర్ ద్వారా నోటీసులు పంపించాను. నా పేరు వాడి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని హెచ్చరించాను.I AM NOT A FINANCIAl ADVISORMy attorney has sent a “Cease and Decist” notice to someone or group who is using my name to state investments I recommend.Please be aware I will always share with you what I am investing in and why.I do not recommend anyone invest in what I am…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 19, 2026నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో మాత్రమే చెబుతాను. నేను ఎవరిని ఇక్కడే పెట్టుబడులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదని కియోసాకి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఏథీరియం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాను అని చెప్పారు. నాకు 401(k), లేదా IRA వంటి రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాలు లేవని.. స్టాక్స్ లేదా బాండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టడం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహానేను ఏం చేస్తున్నానో చెబుతాను. కానీ ఇతరులు వాటిని తప్పకుండా అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తన ఆర్థిక నిర్ణయాలను తన ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో తీసుకోవడం మంచిది. కియోసాకి మాటలను బట్టి చూస్తే.. ఎవరుపడితే వారు చెప్పినమాటలు విని పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Vodafone Idea: రూ.లక్ష కోట్లు సమీకరణపై ఆశలు
వచ్చే మూడేళ్లలో అవసరమయ్యే రూ. 1 లక్ష కోట్లను సమకూర్చుకునేందుకు కొత్త రుణాలు, ట్యాక్స్ రిఫండ్లు, ప్రమోటర్ల నుంచి మరిన్ని పెట్టుబడులపై టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) భారీగా ఆశలు పెట్టుకుంది. మార్కెట్లో నిలబడే దిశగా నెట్వర్క్ని మెరుగుపర్చుకునేందుకు కంపెనీ దాదాపు రూ. 45,000 కోట్లు వెచ్చించనుంది. అలాగే, వచ్చే మూడేళ్లలో స్పెక్ట్రం చార్జీల కింద సంస్థ రూ. 49,000 కోట్లు, రుణభారానికి సంబంధించిన వడ్డీల కోసం మరో రూ. 5,000-6,000 కోట్లు చెల్లించాల్సి రానుంది.అయితే.. మరింత రుణాన్ని ఈక్విటీ కింద మార్చాల్సిన అవసరం లేకుండానే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తేజస్ మెహతా తెలిపారు. తాము రూ. 25,000 కోట్ల నిధులతో పాటు మూడేళ్ల వ్యవధిలో రూ. 60,000 కోట్ల వరకు ఎబిటాను సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఇక ట్యాక్స్ రిఫండ్ కింద మరో రూ. 10,000 కోట్లు రావాల్సి ఉంటుందని వివరించారు.కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలు..పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా మరిన్ని ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలను ఆవిష్కరించినట్లు వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా తెలిపారు. ఇవి 7 రోజులు, 14 రోజులు, 21 రోజుల కాలవ్యవధితో లభిస్తాయని వివరించారు. దీనితో మొత్తం 1 రోజు నుంచి 30 రోజుల వరకు వేలిడిటీతో 17 రకాల ప్యాక్‌లను అందిస్తున్నట్లవుతుందన్నారు.
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా (Meta) త్వరలో, భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టబోతోందని వచ్చిన సమాచారం.. టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఈసారి కంపెనీ సుమారు 10 శాతం మందిని తొలగించే అవకాశం ఉంది.మెటా కంపెనీ సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. 2025 చివరి నాటికి సంస్థలో పనిచేసేవారి సంఖ్య సుమారు 78,000గా ఉండేది. దీన్నిబట్టి చూస్తే లేఆఫ్స్ ప్రభావం సుమారు 10 శాతం ఉద్యోగులపై పడుతుందని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఖర్చులు తగ్గించడమే కాకుండా, కంపెనీని కొత్త దిశగా మలచడానికి తీసుకుంటున్న నిర్ణయాలు అని తెలుస్తోంది.మెటా ఇప్పుడు తన సంస్థ నిర్మాణాన్ని పూర్తిగా మార్చుకోవడంలో భాగంగా.. పెద్ద పెద్ద టీమ్‌లకు బదులుగా చిన్న, వేగంగా పనిచేసే టీమ్‌లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కంపెనీ ఇప్పుడు పూర్తిగా ఏఐ కేంద్రంగా మారుతోంది. సంస్థ భవిష్యత్ పెట్టుబడుల్లో భారీ భాగాన్ని ఏఐ డేటా సెంటర్లు, చిప్‌లు, మోడల్ ట్రైనింగ్ వంటి రంగాల్లో పెట్టనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాదు, 7000 మంది కొత్త ఏఐ ఆధారిత ప్రాజెక్ట్‌ల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఉద్యోగుల్లో అసంతృప్తిని కూడా పెంచుతున్నాయి. దీంతో కంపెనీ అంతర్గత వాతావరణం కొంత ఒత్తిడిగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని AI టూల్స్ ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తాయన్న భయం కూడా ఉంది. కంపెనీ మాత్రం వాటిని కేవలం AI శిక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామని వివరణ ఇస్తోంది.
పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే!
వంటనూనెల దిగుమతులు 2025–26 నూనెల సీజన్లో (నవంబర్–ఏప్రిల్) 13 శాతం పెరిగి 7.94 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా పామాయిల్ దిగుమతులు భారీగా పెరిగినట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. అంతక్రితం సంవత్సరం ఇదే కాలంలో దిగుతులు 7.04 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.విలువ పరంగా చూస్తే రూ.73,000 కోట్ల నుంచి రూ.87,000 కోట్లకు చేరాయి. మొత్తం నూనెల దిగుమతుల్లో వంటనూనెలు 7.82 మిలియన్ టన్నులుగా ఉంటే, 1,21,000 టన్నులు నాన్ ఎడిబుల్ నూనెలు ఉన్నాయి. పామాయిల్ దిగుమతులు దాదాపు రెట్టింపై 3.97 మిలియన్ టన్నులకు చేరాయి. సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతులు 3.85 మిలియన్ టన్నులకు తగ్గాయి.పామాయిల్ ధరలు 14–15 శాతం, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల ధరలు 17–22 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి ఖర్చులు భారీగా పెరిగాయి. మే చివరికి దేశంలో మొత్తం నూనె నిల్వలు 2.12 మిలియన్ టన్నులకు చేరాయి.
ఫ్యామిలీ
ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎన్ని ఇక్కట్లు వచ్చాయో తెలిసిందే. గ్యాస్ నుంచి పెట్రోల్ వరకు దాని అన్నిట్లపై దాని ప్రభావం ఏం రేంజ్లో ఉందో తెలసిందే హార్బూజ్ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. భారత్ పట్ల సముచితంగా ఇరాన్ ఉన్నా..మనకు ఈ ఇబ్బందులు మాతరం ఇప్పట్లో తగ్గేలే లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇరాన్లో మన భారతీయవ దేవాలయంకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పైగా విష్ణు మంత్రాలు సైతం పర్షియన్ భాషలోనే ఉండటం విశేషం. మరి ఆ ఆలయ విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ రాజధాని అయిన బందర్ అబ్బాస్‌లో ఉన్న విష్ణు దేవాలయం ఉన్న వీడియోని నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఏంటా ఆలయం అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ వీడియో క్యాప్షన్‌లో రాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఉన్న పురాతన హిందూ విష్ణు దేవాలయం. 1892లో, ఖజార్ యుగంలో నిర్మించబడింది. ఈ నగరంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన హిందూ వ్యాపారుల కోసం దీనిని నిర్మించారు, ఆ గుడిలోని పాట సైతం పర్షియన్ భాషలోనే ఉంది అని పేర్కొన్నారు. 83 ఏళ్ల నటుడు అమితాబ్ షేర్ చేసిన వీడియో కారణంగా అందరిలో ఒక్కసారిగా ఆ ఆలయ విశేషాలు గురించి తెలుసుకునే ఆసక్తిని రేకెత్తించింది. ఆలయ చరిత్రచారిత్రక కథనాలు, యూట్యూబ్‌లోని వివిధ ట్రావెల్ వ్లాగ్‌ల ప్రకారం..ఈ ఆలయం 1892లో మహమ్మద్ హసన్ సాద్-ఓల్-మాలిక్ పాలనలో హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో నిర్మించారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్, భౌగోళికంగా ఇది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం, అదీగాక ముఖ్యమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి వెంబడి ఉంది. ఇది విష్ణుమూర్తి ఆలయం. ఒకప్పుడు, భారతీయులకు, ఇరాన్‌లకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతికగా ఈ దేవాలయం నిలుస్తోంది. ఇది ఇండో-ఇరానియన్ వాస్తుశైలికి నిలువెత్తు నిదర్శనం. అలాగే చరిత్రకారుల ప్రకారం..కవి,రచయిత మహమ్మద్ అలీ సదీద్ అల్-సల్తానే తన ఒక రచనలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయులకు 1888లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత హిందూ కమ్యూనిటీలకు ప్రత్యేకంగా ఒక దేవాలయం ఏర్పడింది. అప్పట్లో ఇరు వర్గాలు ఎంత శాంతియుతంగా జీవించాయనేందుకు నిదర్శనం ఈ కట్టడం. స్థానికులు హిందువులను 'గూర్' లేదా 'గాబర్' అని పిలిచేవారు కాబట్టి, ఈ ఆలయాన్ని స్థానికులు 'గూరన్' అని పిలుస్తారు. భారత్‌లో ఉండే ఆలయాల మాదిరిగా సాంప్రదాయ వాస్తుశిల్పం ఈ ఆలయానికి లేదు. మధ్యలో ఉన్న చతురస్రాకార గది ఉల్లిపాయ ఆకారంలో ఉన్న గోపురంతో కప్పబడి ఉంటుంది, దానిపై తామర పువ్వుల చెక్కి ఉన్నాయి. ఈ గుడిలోనే పూజారులు, సన్యాసుల కోసం గదులు కూడా నిర్మించారు. 1979 ఇస్లామిక విప్లవం కారణంగా ఈ గుడిలోని చాలా విగ్రహాలు, చిత్రాలు ధ్వసం అయ్యాయి. పైగా అధిక సంఖ్యల్లో భారతీయులు ఇరాన్‌ను విడిచిపెట్టారు. ఈ ఆలయంలో బుద్ధుడు, విష్ణుమూర్తి విగ్రహాలు, శ్రీకృష్ణుని చిత్రాలను చూడవచ్చు. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ కూర్చుని ఉన్న ఒక చిత్రం ఉంది. పునరుద్ధరణ అవసరమైన హిందూ దేవతల పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ఒక గది మ్యూజియంగా మారింది. అక్కడి పెట్టెలలో ఒకదానిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజు శివుని పురాతన విగ్రహం ఉంది. కాగా ఇరాన్లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు, ఇరాన్‌లోని సిస్తాన్ , బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్‌లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.ఆ ఆలయంలో పాటలు..ఏయ్ విష్ణు జాన్ (ఓ ప్రియమైన విష్ణు)ఏయ్ రామ జాన్ (ఓ ప్రియమైన రామా)ఏయ్ కృష్ణ జాన్ (ఓ ప్రియమైన కృష్ణా)దర్ ఖల్బ్-ఎ మా బేమన్ (మా హృదయాలలో ఉండిపో)హమీషే బేమన్-2 (శాశ్వతంగా ఉండిపో)నూర్-ఎ తో బేతాబాద్ (నీ కాంతి ప్రకాశించుగాక)ఇష్క్-ఎ తో బేతాబాద్ (నీ ప్రేమ ప్రకాశించుగాక) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)
పాటలు పాడటం ఇంత మంచిదా..? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు
సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని మన పెద్దలు చెబతుండటం విన్నాం. అంతెందుకు శ్రావ్యమైన సంగీతం వింటుంటే శారీరకంగా, మానసికంగా బాగుంటాం అని నిపుణులు సైతం అంటున్నమాటే. తాజాగా వినడమే కాదు పాటలు పాడితే మన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందట. పైగా గట్ హెల్త్ బాగుంటుందని సాక్షాత్తు హార్వర్డ్ నిపుణులే చెబుతున్నారు. అదేవిధంగానో ఆ నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా.!.పాడటం అనేది కళాత్మక ప్రక్రియ. మరి దీనికి జీర్ణక్రియకు సంబంధం ఎలా అంటే.. పాటలు పాడినప్పుడు మనసు, పేగులు, నాడీ వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఒక బృందంగా పాడుతున్నప్పుడు శరీరంలో ఇమ్యూనోగ్లోబిన్ (ఏ), కార్డిసాల్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో గమనించారు. పాడటం అనేది మానవ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జీర్ణ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. ఒత్తిడి, ఆందోళనతో చాలామంది బాధపడుతుంటారు. కానీ కొందరు దీన్ని అధిగమించిగలుగుతారు అందుకు ఇదే కారణమని అంటున్నారు.పాడినప్పుడు ఏం జరుగుతుందంటే..శరీరంపై సానుకూల ప్రభావం మెదడు నుంచి మొదలై వేగస్ నాడి ప్రేరణ ద్వారా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకోసం బీథోవెన్ సంగీతాన్ని ఆలపిస్తున్న బృందంపై పరిశోధనలు చేయగా, వారందిరలోనూ పాడటం కారణంగా లాలాజలంలో ఒక కీలకమైన రోగనిరోధక యాంటీబాడీ నాటకీయంగా పెరగడం గుర్తించామని తెలిపారు. ఆ యాంటీబాడీ.. జీర్ణవ్యవస్థ లోపలి పొర, గొంతు, శ్వాస మార్గాలలో మన శరీరానికి మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఫలితంగా వ్యాధికారకాలు మనపై పట్టు సాధించే అవకాశం రాకమునుపే ఈ యాంటీబాడీ అడ్డుగోడగా మారుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే గానానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉందని చెబుతున్నారు. మెదడుకు, పేగుకి మధ్య ఉన్న ప్రధాన సమాచార ప్రసార మార్గం అయిన వేగస్ నాడి పాటను ఆలపించగానే ఉత్తేజితమవుతుందట. ఎప్పుడైతే పాట కోసం ఉదర శ్వాసను ఉపయోగిస్తామో అప్పుడు ఈ వేగస్ నాడీ తక్షణమే యాక్టివ్ అవుతుందట. దాంతో విశ్రాంతి, జీర్ణక్రియ అనే ప్రక్రియ ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి ప్రేగులు అత్యుత్తమంగా పనిచేయడం ప్రారంభిస్తాయట. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమేగాక, ప్రేగుల లోపలి పొర ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు శరీరంలో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతకు మద్దతిస్తుందట. గానం ఎలా హెల్ప్ అవుతుందంటే..గానం విశ్రాంతిని ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఆటోమేటిగ్గా మనం రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోతాం. దాంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ పాట పడటం కోసం ఉదర శ్వాసను వినియోగిస్తాం దాంతో శ్వాశ, నాడీవ్యవస్థ నియంత్రణ ఫలితం ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. జీర్ణవ్యవస్థకు మెదడు నుంచి సరైన సంకేతాలు అందితేనే తన పనిని సజావుగా జరపగలదట. అందువల్లే గానం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నొక్కి చెప్పగలమని అన్నారు. గానం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అది సమర్థవంతంగా సంకేతాలను అందించడంతో ప్రేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు. అందరూ పాడేటప్పుడు లోతైన శ్వాసను తీసుకుంటే వేగస్ నాడీ ఉత్తేజమయ్యి..జీర్ణవ్యవస్థ బాగుండేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే మన పూర్వీకులు మన చేత నిరంతరం జపాలు, పారాయణాల పేర్లతో మంత్రాలు, భక్తిపాటలను లయబద్ధంగా ఆలపించేలా చేసేవారని అంటున్నారు. అంటే మెరుగైన ఆరోగ్యానికి చక్కటి జీవనశైలి, శ్వాస, మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమనేది గుర్తురెగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం View this post on Instagram A post shared by Akanksha Pandey (@acanxa) (చదవండి: వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే..)
ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..
ఫుడ్‌తో కొంగొత్త పరిచయాలే కాదు..ఓ దేశాన్నే మైమరిపించొచ్చు. ఎంతటి శత్రుత్వాలు, కోపతాపలు..ఒక్క విందుతో సమసిపోతాయి. అలాంటి టేస్టీ ఫుడ్‌తో ఇతర దేశాల మనసును దోచుకుని కోట్లు ఆర్జించడం మాటలు కాదుకదా. అలాంటి ఘన విజయాన్నే అందుకుంది ఈ భారత సంతతి మహిళ. మన భారతీయ రుచులను జోడించి తయారు చేసిన ఐస్‌క్రీమ్ బ్రాండ్‌తో దూసుకుపోతూ..శెభాష్ అనిపించుకుంటోంది పూజా బావిషి. ఎవరామె అంటే..భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా బావిషి, 'మలై' అనే ఐస్ క్రీమ్ బ్రాండ్‌తో అమెరికన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఏడాదికి రూ. రెండు వేల కోట్లు టర్నోవర్‌ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇద హోల్‌సేల్ ఈ కామర్స్ వ్యాపారంగా మారింది. 46 ఏళ్ల వ్యవస్థాపకురాలు, సీఈఓ 2015లొ ఈ మలైని ప్రారంభించారు. ఈ వ్యాపారం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో నాలుగు దుకాణాలను నిర్వహిస్తోంది. చాలామటుకు ఐస్‌క్రీమ్‌లలో చాక్లెట్, వెనిలా వంటి ఫ్లేవర్లు చూశాం. కానీ అంతకుమించిన రుచి కోసం మలై వంటి వెరైటీ టేస్ట్‌ని పరిచయం చేశారు. దీని తయారీలో ఉపయోగించిన యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, జాజికాయ వంటి రుచులను జోడించడంతో అమెరికా వాసుల మనసులను దోచుకుంది ఈ మలై ఐస్ క్రీమ్. ఈ కంపెనీ 2025లోనే సుమారు రూ. రెండు వేల కోట్లు పైనే ఆర్జించేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతకుముందు ఏడాది 2024, 2025 సంత్సరాలలో సంస్థ లాభదాయకంగా సాగింది. ఇక పూజా విద్యా నేపథ్యం వచ్చేసి..బావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే ఆమె ఆమె వాషింగ్టన్ డిసి-ఆధారిత లాభాపేక్షలేని సంస్థ అయిన ఈక్వల్ రైట్స్ సెంటర్లో పౌర హక్కుల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందిలా..స్నేహితులకు ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీంల రుచి చూపించినప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చేసినట్లు గుర్తు చేసుకుంది. అల్లం-స్టార్ సోంపు ఐస్ క్రీమ్ - ఒక డిన్నర్ పార్టీలో తక్షణమే అందర్నీ ఆకట్టు కోవడంతో..ఇలాంటి టేస్టే టేస్టీ ఐస్‌క్రీం షాపు పెట్టాలని భావించారట ఆమె. అయితే తన ఉత్పత్తులు మార్కెట్లో క్లిక్ అవుతాయో లేతో అన్న సందేహం మాత్రం బాగా ఉండేదని చెప్పుకొచ్చారామె. అయితే తన షాపుకు వచ్చే కస్టమర్ ఎలాంటి ఫ్లేవర్ కోరుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తూ..టేస్టీ, టేస్టీ..మలై ఐస్‌క్రీమ్‌ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే తన షాపు కి వచ్చే కస్టమర్ ఎవరు?, వాళ్లకేం కావాలన్నదే పూర్తిగా అవగాహన ఉండాలని, లేదంటే వ్యాపారం లాభదాయకంగా ఉండదని అంటోంది. అలాగే తాను కేవలం లాభాల మీదే గాక, వ్యాపార విస్తరణపై కూడా దృష్టిపెట్టానని అన్నారు. అలాగే తాను వ్యాపారాన్ని చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి..అన్ని విధాల క్లిక అవుతుందని నమ్మకం కొనసాగేక ముందుకు తీసుకెళ్లానని అన్నారు. అలాగే భారతీయ రుచులు ప్రయోగాత్మకమైనవి కావు, ఈ రుచులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించడం విశేషం. పైగా మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది. అందుకు చాలా గర్వకారణంగా ఉందంటోంది పూజ. View this post on Instagram A post shared by Malai (@malai_icecream) (చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)
స్కూలు బస్సుకి పసుపు రంగే ఎందుకు?
ఫ్రెండ్స్.. మనం రోజూ స్కూలుకి వెళ్లే బస్సు పసుపు రంగులోనే ఉంటుంది. ఎందుకలా ఉంటుందో మీరెపుడైనా ఆలోచించారా? ఎందుకంటారు? ఎందుకంటే పసుపు రంగు ఎంత దూరం నుంచైనా ఆకర్షిస్తుంది. దానివల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి.టాక్సీలు, స్కులు బస్సులకు, రసాయనాలను సూచించే ఫలకాలకు ఈ రంగును వాడుతుంటారు. ప్రమాదాన్ని సూచించే సందర్భాలకి ఎరుపు రంగుని వాడితే, జాగ్రత్త పాటించాల్సిన సూచనల కోసం పసుపుని వాడుతారన్నమాట. అలాగే ట్రాఫిక్ సిగ్నల్‌లో ఈ రంగు లైట్ వెలిగితే.. నెమ్మదిగా వెళ్లాలని అర్థం. ఔనా?హార్న్‌బిల్ అనే పక్షి తన పిల్లల్ని ఎవరూ చూడకుండా, తాకకుండా వుండాలని వాటి నివాసం కోసం చాలా సురక్షితమైన ప్రదేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒక చెట్టుతొర్రలో వుంచి, ఆ తొర్రను వుట్టి లేదా బెరడుతో కప్పేస్తుంది. అయితే గాలి, వెలుతురు కోసం చిన్న రంధ్రం ఒకటి వుంచుతుంది. పిల్లలకు ఆ రంధ్రంలోంచి వుుక్కుతో ఆహారాన్ని అందిస్తుంది. అలా పిల్లలు పెద్దవయ్యేదాకా ఆ తల్లికి ఈ కష్టం తప్పదు వురి.
అంతర్జాతీయం
దుబాయ్ లాటరీ: భారతీయులకు జాక్‌పాట్
అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో మరోసారి భారతీయులను అదృష్టం వరించింది. యూఏఈలో ప్రవాసుల కలల సిరి 'అబుదాబీ బిగ్ టికెట్' మే నెల మొదటి వారపు ఈ-డ్రా ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ లక్కీలో డ్రాలో 1,00,000 దిర్హాల (సుమారు రూ. 26 లక్షలకు పైగా) నగదు బహుమతిని మొత్తం నలుగురు గెలుచుకున్నారు. ఈ నలుగురు విజేతలలో ఇద్దరు భారతీయులు కాగా, మిగిలిన ఇద్దరు మలేషియా, బంగ్లాదేశ్ పౌరులు. విజేతలలో ప్రతి ఒక్కరికీ 25,000 దిర్హాల (సుమారు రూ. ఆరున్నర లక్షలు) చొప్పున నగదు బహుమతి దక్కనుంది.లాటరీ గెలుచుకున్న భారతీయలు వీరేకేరళకు చెందిన 39 ఏళ్ల జవాద్ నజీర్.. ఖతార్‌లోని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పనిచేస్తున్నాడు. అయితే ఖతార్‌లో ఉంటున్న జవాద్, అబుదాబి బిగ్ టికెట్ గురించి తెలుసుకుని గత మూడేళ్లుగా తన 20 మంది స్నేహితులతో కలిసి టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్టకేలకు అతడికి అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో గెలిచినట్లు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మొదట నమ్మలేకపోయానని నజీర్ తెలిపాడు. అదేవిధంగా వచ్చిన బహుమతి మొత్తాన్ని మా స్నేహితులమంతా సమానంగా పంచుకుంటాం అని జవాద్ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు బెంగళూరు చెందిన వినయ్ పుదుమన గత 15 ఏళ్లుగా దుబాయ్‌లో నివాసముంటున్నాడు.గత ఐదేళ్లుగా బిగ్ టికెట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వినయ్.. మొదట్లలో తన స్నేహితులతో కలిసి టికెట్లు కొనేవాడు. కానీ ఆ తర్వాత సొంతంగానే టికెట్లు కొనడం ప్రారంభించాడు. ఆన్లైన్ ద్వారా ఆయన కొనుగోలు చేసిన 037772 అనే నంబర్ టికెట్ అతడికి భారీ నగదుబహుమతిని తెచ్చిపెట్టింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీకి తోడుగా పాక్ సైన్యం భారీ మోహరింపు
ఇస్లామాబాద్:పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ ఏ క్షణమైనా మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనిక బలగాలను పంపింది. సైనికులతో పాటు ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. అయితే, ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇరాన్‌తో సాంస్కృతిక, భౌగోళిక సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది.ఒప్పందం ప్రకారం, ఇరాన్ దాడులు చేస్తే తిప్పికొట్టేలా సైన్యం, యుద్ధ విమానాలను సౌదీకి పంపినట్లు భద్రతా అధికారులు ధృవీకరించారు. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వాటిలో ప్రత్యర్థి దేశాల దాడుల సమయంలో ఒకరికొకరు అండగా నిలబడాలని నిబంధనలు ఉన్నాయి. పాకిస్థాన్-సౌదీ రక్షణ ఒప్పందం పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ, ఒకరిపై దాడి జరిగితే మరొకరు రక్షణకు రావాల్సి ఉంటుందని ప్రకటించారు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈ ఒప్పందం సౌదీ అరేబియాను పాకిస్థాన్ అణు కవచం కింద ఉంచుతుందని సూచించారు.సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఏప్రిల్ ప్రారంభంలో 16 జేఎఫ్-17 యుద్ధ విమానాలు, రెండు డ్రోన్ స్క్వాడ్రన్లు, హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను సౌదీకి పంపింది. ఈ మోహరింపులో 8,000 సైనికులు ఉన్నారు. అవసరమైతే మరిన్ని సైనికులను పంపుతామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది.ఘర్షణ సమయంలో పంపిన సైనికులు, వైమానిక దళ సిబ్బంది ప్రధానంగా సలహా, శిక్షణ పాత్ర పోషిస్తారని అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 80,000 పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపే అవకాశం ఉంది. అదనంగా యుద్ధ నౌకలు పంపే అంశం కూడా ఒప్పందంలో ఉంది.ఈ మోహరింపు ప్రతీకాత్మకంగా కాకుండా, యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, వేలాది సైనికులతో కూడిన పెద్ద స్థాయి చర్య అని వర్గాలు పేర్కొన్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, సౌదీ ఇరాన్‌పై గోప్య దాడులు జరిపింది. పాకిస్థాన్ గతంలో కూడా సౌదీకి సైనిక శిక్షణ, సలహా అందించింది. మరోవైపు, సౌదీ పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక సహాయం అందించింది.
పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్‌కు రహస్యంగా..
పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ ఏం చేసినా భారత్‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. భారత్ త్రివిధ దళాల వద్ద ఉన్న విధ్వంసకర ఆయుధాలను చూసి పాక్ భయపడుతుంది. భారత్‌లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో, ఎలాంటి అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయో అటువంటివి అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుంది. కానీ, అగ్ర దేశాల వద్ద అప్పులు అడుక్కునే పాక్ ఎన్నో రకాల ఆయుధాలను తన అమ్ములపొదిలో చేర్చుకోలేకపోయింది. ప్రపంచంలో 6 దేశాలకు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉంది. అవే.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, భారత్. ఇక ఇజ్రాయెల్ వద్ద క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద అణు బాలిస్టిక్ క్షిపణిని మోసే ఒక సంప్రదాయ జలాంతర్గామి ఉంది. భారత్‌కు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉండడంతో తమకూ కావాలని పాక్ ప్రయత్నాలు జరిపింది.చైనా నౌకాదళం తమ గ్వాదర్ పోర్ట్‌ను శాశ్వతంగా వినియోగించుకునే అవకాశం ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ప్రతిఫలంగా అణుదాడి చేయగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు లేదా అణు ఆయుధ వ్యవస్థను ఇవ్వాలని చైనాను పాక్ కోరిందని అమెరికాకు చెందిన ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ పేర్కొంది. శత్రుదేశం ముందుగా అణుదాడి చేసినా.. జలాంతర్గాముల నుంచి తిరిగి అణుదాడి చేసే శక్తిని పొందాలని పాక్ భావిస్తోంది. దీన్ని అణు నిరోధక వ్యవస్థలో అత్యంత కీలక భాగంగా భావిస్తారు.పాక్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించి.. పాకిస్థాన్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించామని, దాని ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నామని ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ తెలిపింది. 2024లో పాకిస్థాన్ సైన్యం-చైనా ద్వైపాక్షిక చర్చల్లో ఈ డిమాండ్ వచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యానికి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నాయకత్వం వహించాడు. 2024 ఆరంభంలో గ్వాదర్‌ను చైనా సైన్యానికి శాశ్వత స్థావరంగా మార్చేందుకు అనుమతి ఇస్తామని చైనాకు పాకిస్థాన్ రహస్యంగా హామీ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు ఇవ్వాలని చైనాను కోరింది. దీంతో ఇప్పటికే పాక్ వద్ద ఉన్న గగనతల, భూతల అణ్వాయుధాల ద్వంద్వ వ్యవస్థను సముద్ర వ్యూహాత్మక ఆయుధాలతో కూడిన త్రివిధ వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిమాండ్ అసంబద్ధమని చైనా భావించడంతో చర్చలు నిలిచిపోయాయి.ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేటివ్‌లోని కీలక అధికారి రహస్య కేబుల్ వివరాలు కూడా ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ వెల్లడించింది. దీంతో, అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్.. అటు చైనా, ఇటు అమెరికాతో చర్చోపచర్చలు జరిపినట్టు స్పష్టమైంది. గత ఐదేళ్లలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలను మలిచిన పరిణామాలను ఈ కథనం వివరించింది. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే.. వ్యూహాత్మక ఆయుధాలు ఇవ్వాలని చైనాతోనూ పాకిస్థాన్ బేరసారాలు జరిపింది.అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు 3 రకాలుగా ఉంటాయి.. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు, బాలిస్టిక్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు.ఈ మూడింట్లో పాకిస్థాన్ దేన్ని కోరిందో పాకిస్థాన్ కథనంలో స్పష్టత లేదు. 1970 చివర, 1980 ఆరంభంలో చైనా సహకారంతో పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసింది. రహస్య అణు సాంకేతిక బదిలీల్లో ఇదే తొలి ఉదాహరణగా భావిస్తున్నారు. అధిక సాంద్రత యురేనియం సరఫరాతో పాటు, 1960లలో పరీక్షించిన 12 కిలోటన్నుల సామర్థ్యమున్న సీహెచ్ఐసీ-4 అణు విస్ఫోటక రూపకల్పనను కూడా పాకిస్థాన్‌కు చైనా ఇచ్చింది. 1990లలో అణ్వాయుధాలను ప్రయోగించే ఎం-11 మధ్యదూర బాలిస్టిక్ క్షిపణులను కూడా పాకిస్థాన్‌కు చైనా విక్రయించింది.ఈ ఆయుధాలతో గగనతలం, భూమి నుంచి ప్రయోగించే ద్వంద్వ అణు వ్యవస్థను పాకిస్థాన్ తయారుచేసుకుంది. కానీ త్రివిధ వ్యవస్థలో మూడో భాగమైన సముద్ర ఆధారిత అణ్వాయుధ సామర్థ్యం మాత్రం సాంకేతిక, ఆర్థిక పరిమితుల వల్ల సాధ్యం కాలేదు.సముద్రం అడుగునుంచి ప్రయోగించే అణ్వాయుధాను అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా భావిస్తారు. శత్రువు తొలి అణుదాడి చేసినా, తీవ్ర నష్టం జరిగిన తర్వాత కూడా ప్రతిదాడి చేయొచ్చు. 2017లో 450 కిలోమీటర్ల పరిధితో జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి త్రివిధ అణు వ్యవస్థ పూర్తి చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. కానీ పాకిస్థాన్ వద్ద కేవలం 5 క్రియాశీల సంప్రదాయ జలాంతర్గాములు మాత్రమే ఉండటం, క్షిపణి పరిధి తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రాథమిక స్థాయి సముద్ర అణు నిరోధక వ్యవస్థగానే మిగిలింది.
ఇజ్రాయెల్‌కు పదులకొద్దీ విమానాల్లో మందుగుండు సామగ్రి
టెల్ అవీవ్: జర్మనీలోని స్థావరాల నుంచి అమెరికాకు చెందిన పదుల కొద్దీ కార్గో విమానాలు మందుగుండు సామగ్రితో సోమవారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో దిగినట్లు అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్ 13 సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించే ఉద్దేశంతోనే వాషింగ్టన్ చర్యలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు పెరిగాయి. దీంతో పశ్చిమాసియా ఘర్షణ మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా చర్యలు ఇరాన్‌పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో భాగమని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు, యుద్ధ నష్టపరిహారం అంశాలపై చర్చలు నిలిచిపోయిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్ ముందున్న సమయం వేగంగా ముగుస్తోంది. వారు వెంటనే కదలాలి. లేకపోతే వారి దగ్గర ఏమీ మిగలదు. సమయం అత్యంత కీలకం” అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు.చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా విధించిన ప్రధాన షరతులను ఇరాన్ మీడియా బయటపెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించాలని, ఒక అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించాలని, యుద్ధ నష్టపరిహారం డిమాండ్‌ను వదులుకోవాలని అమెరికా కోరింది.దీనికి ప్రతిగా టెహ్రాన్ కూడా చర్చలపై 5 షరతులు పెట్టింది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా లెబనాన్‌లో సైనిక చర్యలు ముగియాలని, ఇరాన్‌పై ఆంక్షలు తొలగించాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.అదనంగా యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలని, హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ వ్యూహాత్మక మార్గంలో నౌకల రాకపోకలపై ఇరాన్ నియంత్రణ కఠినతరం చేసింది. మరోవైపు ఇరాన్ పోర్టులు, సముద్ర వాణిజ్యంపై అమెరికా విస్తృత నౌకాదళ దిగ్బంధంతో ఒత్తిడి పెంచింది.
జాతీయం
స్క్వాడ్రన్ లీడర్ సాన్యా సరికొత్త చరిత్ర : సర్వత్రా ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి (IAF) చెందిన స్క్వాడ్రన్ లీడర్ (Sqn Ldr) సాన్యా సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మకమైన 'క్యాట్-ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్' (Cat-A Qualified Flying Instructor - QFI) అర్హత సాధించిన దేశంలోనే మొట్టమొదటి మహిళా అధికారిగా ఆమె నిలిచారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించింది.Excellence takes flight.Sqn Ldr Saanya achieved a historic first by becoming the first woman officer to earn the coveted Cat-A Qualified Flying Instructor (QFI) qualification. Her achievement embodies dedication and relentless pursuit of excellence.A proud milestone for the… pic.twitter.com/K6hWya0iUi— Indian Air Force (@IAF_MCC) May 18, 2026సాన్యా సాధించిన ఘనతపై వైమానిక దళ అధిపతి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పి. సింగ్.. స్క్వాడ్రన్ లీడర్ సాన్యాను కలిసి ఆమె సాధించిన ఈ అద్భుత విజయానికి గాను అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఐఏఎఫ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. "ఉత్కృష్టత సరికొత్త శిఖరాలను తాకింది. స్క్వాడ్రన్ లీడర్ సాన్యా ఎంతో ప్రతిష్టాత్మకమైన 'క్యాట్-ఏ క్యూఎఫ్ఐ' అర్హతను సాధించి, ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఆమె సాధించిన ఈ విజయం అంకితభావానికి, నిరంతర ప్రతిభా సాధనకు నిదర్శనం" అని వైమానిక దళం పేర్కొంది.దేశానికి స్ఫూర్తిఈ విజయం భారత వైమానిక దళానికి ఒక గర్వకారణమైన మైలురాయి అని, దేశవ్యాప్తంగా విమానయాన రంగంలోకి రావాలనుకునే ఎంతోమంది యువతీయువకులకు ఇది గొప్ప స్ఫూర్తినిస్తుందని ఐఏఎఫ్ కొనియాడింది.ఇదీ చదవండి: టీవీకే విజయం : డిజిటల్ సునామీపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలుకాగా 2015 జూన్ 20న సాన్యా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ఫ్లయింగ్ బ్రాంచ్‌లో కమిషన్ అయ్యారు. ఈమె 42 ఎస్ఎస్సి (SSC) కోర్సు ద్వారా ఎంపికయ్యారు. ప్రస్తుత బాధ్యతల్లో భవిష్యత్తులో ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇవ్వడం, ఇతర ఇన్స్ట్రక్టర్లకు మార్గదర్శకత్వం వహించడం, విమానంలో ఉన్నప్పుడు తప్పులను సరిదిద్దడం వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తారు.ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్
‘దీదీ’ ఆనవాళ్లపై సువేందు ఉక్కుపాదం.. ముందుగా..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సువేందు అధికారి నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతోంది. గత ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపివేస్తూ, వివాదాస్పద కట్టడాలపై కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన ఒక ఫుట్‌బాల్ విగ్రహాన్ని సాల్ట్ లేక్ స్టేడియం నుండి తొలగించాలని నిర్ణయించింది. ఇది కొత్త ప్రభుత్వం పాలనలో తన మార్క్‌ను స్పష్టంగా చూపిస్తోంది.వింత విగ్రహంపై మంత్రి ఫైర్కోల్కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫుట్‌బాల్ విగ్రహం ఆకారం మొదటి నుంచీ విమర్శలకు దారితీసింది. సగం మనిషి కాళ్లు ఉండి, మొండెం స్థానంలో కేవలం ఫుట్‌బాల్ ఉన్న ఈ కట్టడాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి నిసిత్ ప్రామాణిక్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం జరిగిన ఐఎస్ఎల్ మ్యాచ్ (మోహన్ బగాన్ వర్సెస్ ఈస్ట్ బెంగాల్) అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రెండు కాళ్లు మాత్రమే ఉండి, మొండెం లేకుండా ఫుట్‌బాల్‌తో ఉన్న ఈ విగ్రహం చూడటానికి ఎబ్బెట్టుగా ఉంది. దీనికి ఎలాంటి అర్థం లేదు. ఇలాంటి వికృతమైన కట్టడాన్ని స్టేడియం ముందు ఉంచబోము. దాన్ని తక్షణమే తొలగిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.టీఎంసీకి షాక్.. ప్రక్షాళన దిశగా సువేందుబెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత టీఎంసీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన కట్టడాలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్‌కు మింగుడుపడని పరిణామంగా మారింది. నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని సువేందు సర్కార్ స్పష్టమైన సంకేతాలు పంపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 207 సీట్ల భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రాగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.ప్రభుత్వ విద్యాలయాల రూపురేఖల మార్పుమరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల మౌలిక సదుపాయాల మెరుగుదలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. సోమవారం నాడు 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘విద్య అనేది ప్రాథమిక హక్కు. అయితే ప్రభుత్వ విద్యాలయాలు.. ప్రైవేటు సంస్థల కన్నా పోటీలో, సదుపాయాల్లో వెనుకబడి ఉండటం బాధాకరమన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల పురోగతిని నేను కోరుకుంటాను, అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల మౌలిక సదుపాయాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని సీఎం హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: నీటితో ఇంధన సంక్షోభానికి ఎండ్ కార్డ్?
టీవీకే విజయం : డిజిటల్ సునామీపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చేతిలో ఓటమి పాలైన కొన్ని రోజుల తర్వాత, డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్.. బూత్ ఏజెంట్లను కూడా సరిగ్గా నియమించుకోకుండా, కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా పిల్లలను ప్రభావితం చేసి ముఖ్యమంత్రి అయ్యారని స్టాలిన్ విమర్శించారు.VIDEO | Thanjavur, Tamil Nadu: DMK chief MK Stalin says, "TVK leader Vijay became CM by influencing children through Instagram, without even appointing booth agents properly."(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/HhI7ofAjeY— Press Trust of India (@PTI_News) May 18, 2026'డిజిటల్ సునామీ'తమిళనాడులోని తంజావూరులో జరిగిన ఒక సభలో స్టాలిన్ మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల ద్వారా పెద్దలను ప్రభావితం చేసిన టీవీకే విజయం సాధించిందన్నారు. ఇన్‌స్టా ఆధారిత ప్రచారం, పిల్లలు టీవీకేకు అనుకూలంగా ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడంలో డీఎంకే విఫలమైందన్నారు. తంజావూరులో ఒక వివాహవేడుకకు హాజరైన ఆయన మాట్లాడారు. ‘సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించడం, వారి తల్లులు, తాతలు, పెద్దలను ప్రభావితం చేయడానికి పిల్లలతో ప్రచారం చేయించడం వంటివి ఉద్దేశపూర్వకంగానే చేశారు. దాన్ని మేం గ్రహించలేకపోయాం. ఇకపై ఇలాంటి చర్యలను ఓడించడానికి పార్టీ వ్యూహాలను రూపొందిస్తుంది’అని చెప్పారు. ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశఅధికారం కోల్పోయినప్పటికీ డీఎంకే రాజకీయంగా ప్రాసంగికంగానే ఉందన్నారు. డీఎంకే పాలనలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగించడాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో పరిపాలనను ఇప్పటికీ తమ పార్టీ విధానాలే ప్రభావితం చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎన్నికల ఓటమి తర్వాత తాను కుంగిపోలేదని, ఓటమి తరువాత సమయంలో డీఎంకే ఫీనిక్స్ పక్షిలా పుంజుకుంటుందని అన్నారు. ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్అధికార కూటమి వ్యాపింపజేస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవాలని పార్టీ కార్యకర్తలను కోరారు. పాలనకు డీఎంకే ఆటంకం కలిగించదని హామీ ఇస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను కూడా పంచుకున్నారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వారు పరిపాలిస్తున్నంత కాలం ఇబ్బంది పెట్టం. కానీ వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందారోపణలు చేస్తే, వివరణలు ఇస్తాం. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే, నిజాన్ని బయటపెడతాం’అని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతిరోజూ హత్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దోషులను గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడి, శాంతిభద్రతలను పరిరక్షించడం పరిపాలనలో ప్రాథమిక కర్తవ్యం. ఈ వాస్తవాన్ని టీవీకే ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి గ్రహించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్కాగా ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 234 స్థానాలకు గాను 104 స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేయగా, డీఎంకే 59 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది.ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?
నీటితో ఇంధన సంక్షోభానికి ఎండ్ కార్డ్?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు మండిపోతుండటం, రూపాయి విలువ క్షీణిస్తుండటంతో భారతదేశం తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రజలపై భారం పడకుండా రోజుకు దాదాపు రూ.1,000 కోట్లు నష్టపోతున్న తరుణంలో యూరప్‌లోని మొనాకోకు చెందిన ‘ఫోవ్ ఎకో సొల్యూషన్స్’ ఒక అద్భుత పరిష్కారంతో ముందుకు వచ్చింది. కేవలం ‘నీటి’ ఆధారిత సాంకేతికతతో దేశంలో రూ.1.7 లక్షల కోట్ల ఇంధన సంక్షోభానికి తెరదించవచ్చని ఈ సంస్థ చెబుతోంది.ఏంటీ ఈ ‘క్యావిటెక్’ మాయాజాలం?ఈ సరికొత్త ఇంధన విప్లవం వెనుక ‘క్యావిటెక్’ అనే పేటెంటెడ్ ఎమల్షన్ టెక్నాలజీ ఉంది. కంట్రోల్డ్ క్యావిటేషన్ టెక్నాలజీ (సీసీటీ) ద్వారా రసాయన రహితంగా ఇంధనంలో సూక్ష్మమైన నీటి బిందువులను ఈ సాంకేతికత ప్రవేశపెడుతుంది. ఈ ఇంధనం మండే సమయంలో ఇంజిన్ లోపల చిన్నపాటి ‘సూక్ష్మ పేలుళ్లు’ సంభవిస్తాయి. దీనివల్ల ఇంధనం పూర్తిగా, అత్యంత సమర్థవంతంగా మండి, మైలేజీని పెంచుతుంది. ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయకుండా, ప్లాంట్లను మూసివేయకుండానే ఇంధన వినియోగాన్ని 10 శాతం వరకు తగ్గించవచ్చని సంస్థ చెబుతోంది.భారతీయ పరిశ్రమల్లో విజయవంతమైన ప్రయోగాలుడెన్మార్క్లోని ఆల్ఫా లావల్ సంస్థతో పాటు అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలలో జరిగిన పరీక్షల్లో ఈ టెక్నాలజీతో 6 నుంచి 10 శాతం వరకు ఇంధనం ఆదా అయినట్లు రుజువైంది. భారతదేశంలోనూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) హల్దియా రిఫైనరీ, బీపీసీఎల్ (బీపీసీఎల్) మథుర, పలు ఉక్కు కర్మాగారాలలో దీనిపై ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రయోగాలు నిర్వహించారు. హల్దియా రిఫైనరీలో 3.6 శాతం, ఒక ఉక్కు కర్మాగారంలో ఫర్నెస్ ఇంధన వినియోగం 5 శాతం మేర తగ్గినట్లు ఫలితాలు వెల్లడించాయి. అంతేకాకుండా, దేశంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో బాయిలర్లను ప్రారంభించే సమయంలో ఈ టెక్నాలజీ అద్భుతంగా ఉపయోగపడుతుంది.పర్యావరణానికి మేలు.. విదేశీ మారకద్రవ్యానికి రక్షణభారతదేశం తన ముడిచమురు అవసరాలలో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో, లీటరు ఇంధనం ఆదా అయినా అది దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుతుందని సంస్థ సీఓఓ హేమంత్ సోంధీ పేర్కొన్నారు. ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఈ టెక్నాలజీ ద్వారా నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు 30 శాతం, సల్ఫర్ ఆక్సైడ్ ఉద్గారాలు 40 శాతం వరకు తగ్గుతాయి. పర్యావరణ కాలుష్యాన్ని అరికడుతూ, పరిశ్రమల నిర్వహణ వ్యయాన్ని తగ్గించే ఈ నీటి ఆధారిత సాంకేతికత ప్రస్తుత తరుణంలో భారతదేశానికి అత్యంత కీలకంగా మారనుంది.ఇది కూడా చదవండి: తైవాన్ యుద్ధంలోకి ఫిలిప్పీన్స్
ఎన్ఆర్ఐ
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
క్రైమ్
నీట్ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!
సాక్షి, న్యూఢిల్లీ : 2024లో నీట్ (NEET UG) పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినప్పుడు, విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తిగా మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కెమిస్ట్రీ టీచర్ శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ గుర్తింపు పొందారు. విద్యార్థులు ఆయన్ను ఆప్యాయంగా "ఎమ్ సర్" (M Sir) అని పిలుచుకునేవారు. నాడు విద్యార్థులకు "ఘోర అన్యాయం" జరిగిందంటూ వాదించిన ఆయన కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ, సరిగ్గా రెండేళ్ల తర్వాత.. 2026 నీట్ (NEET UG) పేపర్ లీక్ కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.శివరాజ్ మొతేగావ్కర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో, 2024లో ఆయన విద్యార్థుల కోసం మాట్లాడిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. "నీట్ 2024లో భారీ కుంభకోణం జరిగింది. దీనివల్ల మహారాష్ట్రలో చదువు కుంటున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. సంభాజీనగర్‌లోని ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్‌లో మేము ఇప్పటికే పిల్ (PIL) దాఖలు చేశాం. విద్యార్థుల తరఫున మరో ప్రత్యేక పిటిషన్ కూడా వేశాము. ఈ రోజు మేము ముంబై వచ్చాము. బాంబే హైకోర్టులో అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాము. మహారాష్ట్రలోని అన్ని న్యూస్ ఛానళ్ల ప్రతినిధులను కలిసి, దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరతాము. పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు మీడియా మద్దతు చాలా అవసరం."అని విద్యార్థుల తరపున గళమెత్తాడు. కట్ చేస్తే సరిగ్గా రెండేళ్లకు అదే విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ సీబీఐ చేతికి చిక్కాడు.'ఎమ్ సర్' అరెస్ట్ లాతూర్‌లోని ప్రముఖ 'రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్' (RCC) వ్యవస్థాపకుడైన శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మే 17 (ఆదివారం) నాడు అరెస్ట్ చేసింది. ఆయన నివాసాలు, కార్యాలయాలపై జరిపిన సోదాల్లో.. ఆయన మొబైల్ ఫోన్లో లీకైన నీట్ క్వశ్చన్ పేపర్ లభ్యమవ్వడంతో సీబీఐ ఈ చర్య తీసుకుంది.ఇదీ చదవండి: నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్ఎవరీ కెమిస్ట్రీ టీచర్ 'ఎమ్ సర్'?లాతూర్‌లోని ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన మొతేగావ్కర్, మొదట్లో సైకిల్‌పై తిరుగుతూ విద్యార్థులకు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేవారు 1990ల చివర్లో ఒక చిన్న అద్దె గదిలో కేవలం 10 మంది విద్యార్థులతో ఆయన కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. చేత్తో రాసిన నోట్స్ ఇస్తూ, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల కాంపిటేటివ్ పరీక్షల్లో టాపర్లను అందిస్తూ ఆయన స్వల్ప కాలంలోనే ఎంతో ప్రసిద్ధి చెందారు.ఇదీ చదవండి: నో టాయిలెట్, నో లీవ్స్ : రూ. 19 లక్షల జాబ్ వదిలేశా!ప్రస్తుతం 'ఆర్సీసీ' (RCC) క్లాసెస్‌కు మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన బ్రాంచ్ అయిన లాతూర్‌తో సహా 9 బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 40,000 మంది విద్యార్థులు నీట్, జేఈఈ, సెట్ (NEET, JEE, CET) పరీక్షల కోసం ఇక్కడ చేరుతుంటారు. సోషల్ మీడియాలో (ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్) కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. నాడు విద్యార్థుల రక్షకుడిగా ఫోజులిచ్చిన ప్రముఖ విద్యావేత్తే, నేడు అదే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అవ్వడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
నన్ను చంపాలని చూస్తున్నారు: పాస్టర్ అభినయ్
విశాఖపట్నం: పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగే తనను చంపాలని చూస్తున్నారని భరోసా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ధార అభినయ్ దర్శన్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని అన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలేసి, తన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారని వాపోయారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నందునే తనపై దాడి జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.''నాపై నేనే దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. నాపై దాడి విషయంలో పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరిస్తున్నారు. నాపై దాడి వెనుక కుట్ర దాగి ఉంది. నాపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకి సంబంధం ఉందని అనుకోను. కొంతమందిపై నాకు అనుమానం ఉంది. వారి పేర్లు త్వరలోనే బయట పెడతాను. ప్రవీణ్ పగడాల నాలుగు బ్రాండ్లు తాగి యాక్సిడెంట్ చేసినట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించారు. ప్రవీణ్ పగడాల విషయంలో జరిగింది పూర్తిగా అన్యాయమే. ప్రవీణ్ పగడాలపై వేసినట్టుగానే నాపై నిందలు వేస్తున్నారు. దాడులకు నేను భయపడను. ప్రజల సమస్యలపై ప్రభుత్వాధికారులను ప్రశ్నిస్తూనే ఉంటాన''ని అభినయ్ అన్నారు.దాడిని ఖండించిన పాడేరు ఎమ్మెల్యే పాస్టర్ అభినయ్‌పై దాడి చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. అభినయ్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభినయ్‌పై దాడి చేసిన వారిని ప్రజల ముందు పోలీసులు నిలబెట్టాలని కోరారు.''జరిగిన దాడిపై నేనే పోలీసులకు ఫోన్ చేసి పూర్తిస్థాయి విచారణ జరపాలని సూచించాను. ఈ దాడి తన అనుచరులు చేశారని కూటమి నాయకులు ప్రచారం చేయడం దురదృష్టకరం. ఒక గిరిజన బిడ్డపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు నాకు క్షమాపణ చెప్పాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నార''ని విశ్వేశ్వరరాజు మండిపడ్డారు.అసలేం జరిగింది?అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో మొండిగెడ్డ పంచాయతీ నీరుతోటపాలెం కాఫీ తోటల సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు అభినయ్‌పై దాడి చేశారు. కడపకు చెందిన అభినయ్ కొన్ని రోజులుగా జిల్లాలో ఉంటున్నారు. నీరుతోటపాలెంలో సమస్యలపై పాదయాత్ర చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసి కారులో తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అభినయ్, ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరిని వాహనం నుంచి దింపి, కాఫీ తోటల సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ అభినయ్‌పై బ్లేడుతో దాడి చేశారు. తల, కాళ్లపై కోసేశారు.అభినయ్‌తో పాటు ఉన్న ఇద్దరిపై కూడా దాడి చేశారు. వారికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అభినయ్ స్పృహ తప్పి పడిపోవడంతో మృతి చెంది ఉంటాడని భావించి, దుండ గులు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అభినయ్‌ను జెర్రెల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారు ఎవరో, ఎందుకు దాడి చేశారో తెలియడం లేదు. కడప నుంచి వచ్చిన అభినయ్‌కి ఇక్కడ ఎవరు శత్రువులున్నారో తెలియడం లేదని స్థానికులు తెలిపారు. అభినయ్ కారుపై కూడా దాడి చేయడంతో కారు అద్దం పగిలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భర్త.. రెండో భర్త.. ఇద్దరు ప్రియులు!
వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏదో ఒక మూల రోజుకో దారుణం జరుగుతోంది. ప్రేమ, మోసం, హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం.. ఇలా ఒక్కో తీరు నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా గుజరాత్లో బయటపడ్డ ‘శాంతిగిరి కేసు’ ట్విస్టుల మీద ట్విస్టులను ఇచ్చింది. ఈ తరహా కేసుల్లోనే ఓ కొత్తదనం చూపించింది. సురేంద్రనగర్ జిల్లాలో శాంతిగిరి గోస్వామి అనే వ్యక్తి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలోనే అతను దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ కేసును చేధించిన పోలీసులు.. నిందితుల నుంచి విస్తుపోయే వివరాలను సేకరించారు. అసలేం జరిగిందంటే.. జాగృతి గోస్వామి అనే మహిళ సుఖ్దేవ్గిరి గోస్వామిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొంతకాలానికి ఆమె తన భర్త పెద్ద అన్న శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను వదిలి.. అతనితో పారిపోయి మరో గ్రామంలో కొత్త జీవితం మొదలుపెట్టింది. అయితే అక్కడా ఆమె బుద్ధి వక్రదారి పట్టింది. శాంతిగిరి ట్రక్ డ్రైవర్ పని కోసం తరచూ బయట ఉండేవాడు. ఈ సమయంలో కాంతిలాల్ అలియాస్ భారత్ సబారియా అనే వ్యక్తితో జాగృతి సంబంధం పెట్టుకుంది. కాంతిలాల్ ఏకంగా జాగృతి ఇంటి పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. శాంతిగిరి లేని సమయంలో ఇద్దరూ కలుసుకునేవారు. అయితే ఏదో ఒకరోజు తమ విషయం తెలుస్తుందని.. శాంతిగిరిని అడ్డు తొలగించుకోవాలని ఆ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యూనిస్ అనే వ్యక్తికి 25,000 సుపారీ ఇచ్చారు. అయితే యూనిస్ ‘భలే’ మోసం చేశాడు. నిద్రపోతున్న శాంతిగిరిని ఫోటో తీసి హత్య చేశానంటూ జాగృతికి పంపాడు. అయితే మరుసటి రోజు ఉదయం భర్త బతికే ఉండడంతో జాగృతి షాక్‌కు గురైంది. తీరా చూస్తే యూనిస్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో జాగృతి, కాంతిలాల్ స్వయంగా హత్యకు ప్లాన్ చేశారు. నిద్రిస్తున్న శాంతిగిరి గొంతును కాంతిలాల్ నులిమి చంపగా.. జాగృతి దుప్పటి తోసి శబ్దం రాకుండా చేసింది. ఆపై శవాన్ని గదిలో దాచారు. ఆ తర్వాత దీపక్ అలియాస్ మున్నా అనే వ్యక్తి సహాయంతో కారులో తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు కథ అల్లే ప్రయత్నం చేశారు. శాంతిగిరి కొత్త ఉద్యోగం కోసం బయటి ఊరికి వెళ్లాడని.. ఫోన్ నెంబర్ మార్చాడని అందరినీ నమ్మించారు. అలా ఎనిమిది నెలలు గడిచాయి. ఈ గ్యాప్‌లో కాంతిలాల్‌కు తెలియకుండా దీపక్‌తో ఆమె వ్యవహారం నడిపించింది. అయితే.. శాంతిగిరి బంధవుల ఎంట్రీతో సీన్ మారింది. జాగృతి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు వాళ్లు. అలా ఈ మిస్సింగ్ మిస్టరీ కేసు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు చేరింది. రెండు నెలల దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం.. జాగృతి, కాంతిలాల్‌ను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న దీపక్ కోసం గాలింపు చేపట్టింది.
రూ. 51 లక్షలు, ఫార్చ్యూనర్ కారు కోసం దారుణం?
తమ బిడ్డ పెళ్లి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. రూ. 11 లక్షల నగదు, రూ. 50 లక్షల విలువైన బంగారం, ఫర్నిచర్ , ఒక స్కోర్పియో (Scorpio) కారు లాంటి ఖరీదైన కానుకలను కట్నంగా ఇచ్చారు. కానీ ఏం లాభం, పెళ్లైన 17 నెలలకే తీరని కట్నం దాహానికి 25 ఏళ్ల కొత్త కోడలు బలైపోయింది. దీంతో అమ్మాయి తల్లి దండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్యంత హృదయ విదారకమైన ఈ ఘటన, గ్రేటర్ నోయిడాలోని జల్పురా ప్రాంతంలో, Ecotech-III పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా (జల్పురా ప్రాంతం)లో 25 ఏళ్ల దీపికా నాగర్ అనే వివాహిత తన అత్తవారింటి పైకప్పు (టెర్రస్) పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2024 డిసెంబరులో దీపిక వివాహం జరిగింది. ఈ వివాహం కోసం దీపిక తండ్రి సంజయ్ నగర్ దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లయిన 3-4 నెలల నుంచే అత్తవారింటి వేధింపులు మొదలయ్యాయని దీపిక తల్లిదండ్రలు ఆరోపించారు. నిందితులు అదనంగా ఒక ఫార్చ్యూనర్ కారు, రూ. 51 లక్షల నగదు కావాలని దీపికను వేధించడం ప్రారంభించారు. కట్నం కోసమే ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఎలాగైన తనబిడ్డ సంసారం నిలబడుతుందనే ఆశతో, సర్దుకుపోతుందని భావించి తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని దీపిక తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అంత కట్నం ఇచ్చినా నా కూతురు నాకు దక్కలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పడిపోయిందా? తోసేశారా? ఆదివారం నాడు దీపికా తన తండ్రికి ఫోన్ చేసి, భర్త మరియు అత్తవారింటి వారు తనను తీవ్రంగా కొడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దాంతో తండ్రి బంధువులు ఆ సాయంత్రం అత్తగారింటికి వెళ్లి గొడవను సర్దిచెప్పి, వారు ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, రాత్రి 12:30 గంటల ప్రాంతంలో దీపికా మూడో అంతస్తునుంచి పైనుంచి కింద పడిందని సమాచారం అందింది.అయితే ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి చెప్పారు. ఆమెను తీవ్రంగా కొట్టి, కడుపులో స్క్రూడ్రైవర్ లేదా కత్తితో పొడిచి, ఆపై పైనుంచి కిందకు తోసేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, ముక్కు, చెవులలోంచి రక్తం కారుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను కొట్టి, ఆపై అది ఒక ప్రమాదంలా కనిపించేలా చేయడానికి కిందకు విసిరేశారని దీపిక బాబాయ్ విశేష్ నాగర్ ఆరోపించారుమామ, భర్త అరెస్ట్సెంట్రల్ నోయిడా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పైకప్పు పైనుంచి దూకి మరణించినట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దీపిక భర్త రితిక్ తన్వర్, మామ మనోజ్ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శవపరీక్ష (Post-mortem) నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
వీడియోలు
ఏపీకి ముగ్గురు సీఎంలు
విజయ్ కేబినెట్ మీటింగ్ లో సెల్ఫీ తీసుకుంటున్న అంకుల్
చెపాక్ ధోనీ కన్నీటి వీడ్కోలు..సురేష్ రైనాని హగ్ చేసుకుని ధోని ఎమోషనల్
రఘురామకృష్ణ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు..!
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
ఇంటికెళ్లి విజిల్ వేసుకోండి.. ఇషాన్ కిషన్ మాస్ ర్యాగింగ్
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం
నీ అయ్యా జాగీరా..? ధూళిపాళ్ల కు ఇచ్చిపడేసిన దాసరి రాము
మీరు హెలికాప్టర్ లో తిరిగి పాపం నిమ్మల రామనాయుడితో 10KM సైకిల్ తొక్కిస్తారా?
నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మా చెప్పుతో... నువ్వు వెంట్రుక కూడా పీకలేవ్...


