Travel
-
బౌద్ధవిహారం: బిహార్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..?
బిహార్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? చారిత్రక– పౌరాణిక సాహిత్యంలో ఈ ప్రదేశం ఉంది. కానీ...అప్పట్లో ఈ ప్రదేశం పేరు బిహార మాత్రం కాదు. చాణుక్యుడు పుట్టాడు... కానీ అతడి పేరు రాలేదు. ఆర్యభట్ట పుట్టాడు... అతడి పేరూ రాలేదు. అశోకుడు పాలించాడు... ఆ చక్రవర్తి పేరూ రాలేదు. బుద్ధుడు విహరించిన ఈ ప్రదేశం బుద్ధవిహారగా పేరు తెచ్చుకుంది.. బౌద్ధ విహారాలు... చైత్యాల నిలయం బౌద్ధవిహారగా స్థిరపడింది. స్థానిక భాషల్లో విహార... బిహారగా వాడుకలోకి వచ్చింది. నాడు బుద్ధుడు విహరించిన బుద్ధవిహారయే నేటి మన బిహార్. గంగా తీరాన నడక... నదిలో డాల్ఫిన్ వీక్షణం ఈ టూర్లో బోనస్.నలంద విద్యాలయంనలంద విశ్వవిద్యాలయం మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ్ర΄ాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటి, తొలి రెసిడెన్సియల్ యూనివర్సిటీ ఇదే. ఈ బౌద్ధ మహావిహారకు విద్యాభ్యాసం కోసం క్రీ.శ ఐదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు దేశవిదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. వారు నివసించడానికి ఒక్కొక్కరికి ఒక్కో గది, ఆ గదిలో గోడలకు ఒక వైపు పుస్తకాల అర, మరొక గోడకు దుస్తులు పెట్టుకునే వెసులుబాటు ఉండేవి. ప్రతి గది బయట నీరు వెలుపలకు వెళ్లడానికి నిర్మాణంలోనే పైపుల ఏర్పాటు ఉండేది. పౌర్ణమి రోజు చంద్రుడి వెలుతురు పడి ప్రకాశించే చంద్రశిలలను చూడవచ్చు. క్లాసు రూముల ఏర్పాటు చాలా సమగ్రంగా ఉంటుంది. అందరూ నేల మీదనే కూర్చోవాలి. అయితే ఆచార్యులు కూర్చునే పీఠం వంటి స్థానం, విద్యార్థులు ఒకరికొకరు మూడడుగుల దూరంలో కూర్చునే విధంగా ఉంది నిర్మాణం. భక్తియార్ ఖిల్జీ హయాంలో ఇక్కడ తాళపత్ర గ్రంథాలను రాశి΄ోసి తగుల పెట్టిన చోట ఇటుకలు కూడా నల్లగా మాడి΄ోయి ఉన్న గోడలను చూపిస్తారు గైడ్లు. ఇక్కడ దుకాణాల్లో పెన్నులు నలంద, రాజ్‌గిర్ వంటి బౌద్ధ క్షేత్రాల పేర్లతో ఉంటాయి. టూర్‌కి గుర్తుగా తెచ్చుకోవచ్చు, స్నేహితులుగా బహుమతులుగా ఇవ్వవచ్చు. ఇది పట్నాకు 70 కిలోమీటర్ల దూరాన ఉంది. పట్నా నుంచి బయలుదేరిన తర్వాత నలంద పర్యటన పూర్తి చేసుకుని రాజ్‌గిర్‌కు వెళ్లాలి. నలంద మహావిహారను చూసిన తర్వాత సూర్యమందిర్, చైనా యాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ మందిరాన్ని కూడా చూడాలి. ఈ ఆలయం ఒక చరిత్ర పుస్తకానికి దృశ్యరూపం. వీటి తర్వాత చూడాల్సిన ప్రదేశం ఆర్కియలాజికల్ మ్యూజియం.మహాబోధిగయ బోద్‌గయకు ఆ పేరు రావడానికి కారణం మహాబోధి వృక్షమే. సిద్ధార్థ గౌతముడు ఈ బోధి చెట్టు కింద ధ్యానం చేశాడు. అతడికి జ్ఞానోదయమై బుద్ధుడిగా మారిన ప్రదేశం ఇది. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఈ బోధి వృక్షాన్ని చూస్తే ఆశ్చర్యంతోపాటు క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ల నాటి వృక్షమా అనే సందేహం కలుగుతుంది. ఆ సందేహంలో అర్థం ఉంది. బుద్ధుని కాలం నాటి మహాబోధి వృక్షం మతహింసలో భాగంగా అగ్నికి ఆహుతై΄ోయింది. ఆ స్థానంలో శ్రీలంక నుంచి తెచ్చి నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే... శ్రీలంకలోని అనూరాధపురను ΄ాలిస్తున్న రాజు దేవానాం ప్రియ తిస్స బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు. బౌద్ధ పట్ల అవగాహన కోసం అశోక చక్రవర్తిని కోరాడు. అశోకుడు బౌద్ధ ప్రచారంలో భాగంగా తన కూతురు సంఘమిత్ర, కొడుకు మహేంద్రను శ్రీలంకకు పంపించాడు. శ్రీలంకకు వెళ్లేటప్పుడు సంఘమిత్ర ఈ మహాబోధి నుంచి సేకరించిన మొక్కను తీసుకెళ్లి దేవానాం ప్రియ తిస్సకు బహూకరించింది. ఆ మొక్కను అనూరాధ పురలో నాటారు. బోధగయలోని మూలవృక్షం స్థానంలో శ్రీలంక బోధి వృక్షం నుంచి మొక్కను తెచ్చి నాటారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న బోధి వృక్షం. ఈ వృక్షం పక్కనే మహాబోధి ఆలయం ఉంది. బౌద్ధం పరిఢవిల్లుతున్న భూటాన్, థాయ్‌లాండ్ వంటి అనేక దేశాల మోనాస్ట్రీలు కూడా బోద్‌గయలో ఉన్నాయి. వీటిలో వ్యక్తమయ్యే సంపన్నతను చూసినప్పుడు బుద్ధుడు చెప్పిన నిరాడంబరత కోసం బౌద్ధంలో ఆశించకూడదనిపిస్తుంది. ఈ ప్రదేశం బిహార్ రాజధాని నగరం పట్నా నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. గయకు 15 కిలోమీటర్ల దూరం. ఈ టూర్లో చూడాల్సిన మరో ప్రదేశం నిరంజన నది. బుద్ధుడు ధ్యానంలో ఉన్న కాలంలో తరచూ ఈ నదికి వెళ్లేవాడు. స్థానికులు ఫాల్గు నదిగా పిలుస్తారు. వైశాలి గత వైభవంబుద్ధుడు తన జీవితకాలంలో ఎక్కువ కాలం ( మూడు దఫాలు) వైశాలిలో జీవించాడు. తన చివరి బోధనను వెలువరించాడు. బుద్ధుడి అవశిష్టంతో ఇక్కడ ఒక స్థూపాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో అశోకుడు ఏకసింహం స్థూపాన్ని నిర్మించాడు. మ్యూజియం కూడా ఉంది. ఈ ప్రదేశం ఒకప్పుడు లిచ్ఛవుల రాజధాని. ఆసియా ఖండంలో తొలి రిపబ్లిక్ స్టేట్ కూడా ఇదే. వైశాలి గత వైభవం విశాలమైనదే కానీ ఇప్పుడిక్క బౌద్ధ విశిష్ఠతలు మినహా మరే ప్రత్యేకతలూ కనిపించవు. జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు పుట్టిన ప్రదేశం కూడా ఇదే. చిన్న జైన మందిరం కూడా ఉంది.విక్రమశిల మహావిహారఇది కూడా భక్తియార్ ఖిల్జీ చేతిలో ధ్వంసమైన ప్రాచీన విశ్వవిద్యాలయం. మనదేశంలో ఉన్న ప్రధానమైన బౌద్ధ మహావిహారల్లో మూడు బీహార్లోనే ఉన్నాయి. విక్రమశిల... వందకు పైగా గురువులు, వెయ్యికి పైగా విద్యార్థులతో విలసిల్లిన విద్యాలయం. తత్వం, వ్యాకరణం, ఆధిభౌతికం, తర్కశాస్త్రాలను బోధించేవారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఆసియా ఖండంలో బౌద్ధాన్ని విస్తరించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ యూనివర్సిటీ శిథిలాలను భద్రపరిచి పునరుద్ధరించే పనిలో ఉంది. చారిత్రక జ్ఞాపకాల గౌరవార్థం ప్రభుత్వం నలంద, విక్రమశిల పేర్లతో కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. లోకల్ ఆటో రిక్షా, కార్ ట్యాక్సీల వాళ్లతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా చెప్పాలి.ఓదంతపురి చదువుల క్షేత్రంమనదేశంలో ప్రసిద్ధమైన బౌద్ధ మహావిహారలు మూడు. నలంద, విక్రమశిల, ఓదంతపురి విహారలు. నలంద తర్వాత రెండవ విశ్వవిద్యాలయం ఓదంతపురి. ఇది బీహార్ షారిఫ్లో ఉంది. పట్నా– రాజ్‌గిర్ రైల్వేలైన్‌లో వస్తుంది. ఈ మహావిహార కూడా టర్కీ నుంచి వచ్చి భారత్ మీద దాడి చేసిన ఖిల్జీ చేతిలో ధ్వంసమైనదే. ఇక్కడ బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన ప్రాధాన్యత తప్ప మరే ప్రత్యేకతలూ లేక΄ోవడంతో పర్యాటకపరంగా సౌకర్యాలు తక్కువ.సారనాథ్ రాజముద్ర బుద్ధుడు తొలి ప్రవచనాన్ని వెలువరించిన ప్రదేశం సారనాథ్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలో ఉంది. ఇక్కడి స్థూపం పరిరక్షణ పనులు పూర్తి చేసి పర్యాటకులకు ప్రవేశం కల్పించారు. మనం అధికారిక ముద్రగా స్వీకరించిన నాలుగు సింహాల పిల్లర్ ఇక్కడిదే. అయితే అసలు పిల్లర్‌ని మ్యూజియానికి తరలించారు. నమూనాలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ టూర్‌కి ఐఆర్సీటీసీ ప్యాకేజ్ సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్యాకేజ్‌లో సారనాథ్(ఉత్తరప్రదేశ్), బుద్ధుడు పుట్టిన లుంబిని (నేపాల్), మహాపరినిర్వాణం పొందిన కుశినగర (ఉత్తరప్రదేశ్) కూడా కవర్ అవుతాయి.రాజ్‌గిర్ విశ్వశాంతి కిరణంఇది మహాభారత కాలం నుంచి ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రదేశం. జరాసంధుని రాజ్యం గిరివ్రజ. పాండవ మధ్యముడు భీముడితో జరాసంధుడు యుద్ధం చేసిన ప్రదేశంగా చెబుతారు. జైనులకు కూడా ఇది ప్రముఖ ప్రదేశమే. 24వ తీర్థంకరుడు మహావీరుడు (ముని సువ్రత) పద్నాలుగేళ్లు నలంద, రాజ్గిర్లలో జీవించాడు. మగధ రాజ్యానికి తొలినాళ్లలో రాజధాని ఇదే. రాజగృహ అని పిలిచేవాళ్లు. ఇక్కడ అనేక రాజ్యాల రాజుల సమావేశంలో బుద్ధుడు బౌద్ధాన్ని బోధించాడు. రాజ్‌గిర్ విశ్వశాంతి స్తూపం నుంచి కనిపించే గ్రద్ధకూట పర్వతం మీద బుద్ధుడు కొంతకాలం ధ్యానం చేసుకున్నాడు. సప్తపర్ణి గుహలో బౌద్ధ సమావేశాలు జరిగేవి. సమీపంలోని వేణుబన్ (వెదురు వనం)లో సాంత్వన దేవాడు. శిష్యులు, సామాన్యులతోపాటు మగధ రాజు బింబిసారుడికి కూడా ఇక్కడే బోధనలు చేశాడు. విశ్వశాంతిని కోరుతూ బుద్ధుడు చేసిన బోధనలకు ప్రతీకగా ఆ ప్రదేశంలో తెల్లటి అందమైన శాంతిస్థూపాన్ని నిర్మించారు. ఈ కొండ మీదకు వెళ్లడానికి రోప్‌వే ఉంటుంది. ఈ రోప్‌వే బకెట్ ఒక్కరు మాత్రమే కూర్చునేటట్లు ఉంటుంది. కొండ మీదకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. (చదవండి: వన్ లెగ్డ్ జీన్స్..! ఇదేం ఫ్యాషన్ ట్రెండ్..) -
అరబిక్ కడలి సౌందర్య వీక్షణం! ఆ తీరానే కృష్ణుడు, జాతిపిత, గోరీ..
ప్రకృతి మన తెలుగువాళ్లకు వెయ్యి కిలోమీటర్ల తీరాన్నిచ్చింది. గుజరాత్‌కి మాత్రం 16 వందల కిలోమీటర్ల తీరాన్నిచ్చింది. ఆ తీరమే ఆ రాష్ట్రానికి పెద్ద ఆదాయవనరుగా మారింది. ఆ అరేబియా తీరమే విదేశీ వర్తకానికి దారులు వేసింది. ఆ తీరానే శ్రీకృష్ణుడు... మన జాతిపిత గాంధీజీ పుట్టారు. సోమనాథుడు వెలిశాడు... గోరీ మనదేశం మీద దండెత్తాడు. ఆ తీరం పర్యాటకపరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వారక నుంచి సోమనాథ్ వరకు ప్రయాణమే ఈ వారం పర్యాటకం.అదిగో ద్వారక...బేట్ ద్వారక... ఇది ద్వారక తీరం నుంచి కనిపించే దీవి. సముద్ర తీరాన విహరించడంతోపాటు సముద్రం మధ్యలో పడవలో పయనించడాన్ని కూడా ఆస్వాదించవచ్చు. కృష్ణుడి ద్వారకను చూసి ఆ నేల మీద నడిస్తే కలిగే పులకింతను మాటల్లో చెప్పలేం. పురాణకాలంలో కూడా ప్రజలు ద్వారక ప్రధాన పట్టణం నుంచి బేట్ ద్వారకకు పడవలో ప్రయాణం చేసినట్లు గ్రంథాల్లో ఉంది. చారిత్రక యుగంలో కూడా ద్వారక గురించి సింధు నాగరకత, హర΄్పా నాగరకత, మౌర్య సామ్రాజ్య రచనల్లో కనిపిస్తుంది. ఈ తీరం నుంచి రోమన్‌తో వర్తక వాణిజ్యాలు జరిగేవి. ఇక్కడి మ్యూజియాలలో ప్రశాంతంగా గడిపే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టూర్ ΄్లాన్ చేసుకోవాలి. ఓఖా– బేట్ ద్వారకలను కలిపే బ్రిడ్జి ‘సుదర్శన సేతు’ మీద ఆగి ఫొటో తీసుకోవడం మరిచిపోవద్దు.అంబానీ సొంతూరుచోర్వాడ్ బీచ్... ఇది సోమనాథ్‌కు 40కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ బీచ్ క్లీన్‌గా ఉంటుంది. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి, చక్కటి ఫొటోలు తీసుకోవడానికి బాగుంటుంది. అరేబియా సముద్రం ఈతకు అనువైనదే. కానీ చోర్వాడ్ దగ్గర మాత్రం ఈత క్షేమం కాదు. ఇక్కడ బీచ్ విజిట్ పూర్తయిన తర్వాత దీరూబాయ్ అంబానీ ఇంటిని చూడడం మర్చిపోవద్దు. నిజమే... ఇది అంబానీల సొంతూరు. ఈ ప్రదేశానికి చోర్వాడ్ అనే పేరు ఎందుకు వచ్చిందా అనే సందేహం తొలుస్తూనే ఉందా? అరేబియా తీరం నుంచి విదేశీ వ్యాపారం విరివిగా జరిగేది. సముద్రంలో ఓడల్లో సరుకుల రవాణా జరుగుతోందంటే అసంకల్పిత చర్యగా ఆ సరుకును దొంగలించే దొంగలు కూడా సిద్ధమై ΄ోతారు. ఆ సముద్రపు దొంగలు నివాసం ఏర్పరుచుకున్న ప్రదేశం ఇది. దొంగల నివాస ప్రదేశం అనే అర్థంలోనే పేరు స్థిరపడి΄ోయింది. రుక్మిణి కల్యాణంమాధవ్పూర్ బీచ్... ఇది పోర్బందర్ నుంచి వెరావల్‌కు వెళ్లే హైవే మీద ఉంటుంది. సముద్ర తీరాన హైవే ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద ప్రయాణిస్తూ అరేబియా సముద్రపు నీటి నీలం గాఢతను చూడవచ్చు. ఆకాశానికి– సముద్రానికి మధ్య రేఖ ఎక్కడో తెలుసుకోవడం ఓ పెద్ద పజిల్. అన్నట్లు ఇక్కడ తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రం ఉంది.స్థానికులను అడిగితే దారి చూపిస్తారు. పోర్బందర్ వరకు కొబ్బరి నీరు దొరకవు. కానీ మాధవ్‌పూర్ నుంచి సముద్ర తీరాన కొబ్బరి బోండాలు కనిపిస్తాయి. సముద్ర తీరాన కామెల్ రైడ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. పెద్ద వాళ్లు మొహమాట పడకుండా ఒంటె విహారాన్ని ఆస్వాదించాలి. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు తీసుకుని వెళ్లిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇక్కడ ఓషో ఆశ్రమం కూడా ఉంది.ఓఖా– మాధీ బీచ్...ఇది ద్వారక వెళ్లే దారిలో వస్తుంది. హైవే మీద వాహనాన్ని ఆపుకుని దిగి ΄ావు కిలోమీటరు నడిస్తే ΄ాదాలు సముద్రపు నీటిలో ఉంటాయి. ఇక్కడ వర్తక వాణిజ్యాలేవీ జరగవు. కాబట్టి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఇతర ప్రమాదాలు కూడా ఏవీ జరగవు. కాబట్టి సముద్రంలో స్నానం, స్విమ్మింగ్ సరదా తీరుతుంది. ఇక్కడ జనం రద్దీ తక్కువ. కాబట్టి ఏకాంతపు పర్యటనకు ఇది మంచి ప్రదేశం. సూర్యాస్తమయాన్ని వీక్షించడంతో΄ాటు రాత్రి బస ΄్లాన్ చేసుకోవడానికి అనువైన ప్రదేశం.కృష్ణుడికి బాణం దెబ్బవెరావల్ బీచ్... ఇది సోమనాథ్‌కు నాలుగుకిలోమీటర్ల దూరాన ఉంది. ఇది శ్రీకృష్ణుడు ప్రణత్యాగం చేసిన ప్రదేశం. కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జర అనే వేటగాడు జింక కాలుగా భావించి బాణం వేశాడని, కృష్ణుడు గాయపడి ప్రణత్యాగం చేశాడని చెబుతారు. ఈ ప్రదేశం భాల్క తీర్థంతో సందర్శన స్థలంగా అభివృద్ధి చెందింది. ఈ సంఘటన క్రీ. పూర్వం 3102, ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీగా భావిస్తారు. కృష్ణుడి మరణంతో ద్వాపర యుగం అంతమైందని, మరుక్షణం నుంచి కలియుగం ప్రారంభమైందని చెబుతారు. వెరావల్ తీరంలో ప్రాచీన కాలం నుంచి వర్తక వాణిజ్యం జరిగేది.సౌరాష్ట్ర కశ్మీరంమహువా బీచ్... ప్రశాంతతకు మారు పేరు ఈ ప్రదేశం. ఏడాదంతా చల్లగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేరళలో ఉన్నామా అనిపిస్తుంది. కొబ్బరిచెట్లు విస్తారంగా ఉంటాయి. ఈత చెట్లు కూడా. రెండు– మూడు గంటల కోసం వెళ్లడం కంటే రాత్రి బస ఇక్కడే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సముద్ర తీరాన భవానీ మాత ఆలయం ఉండడంతో స్థానికులు భవానీ బీచ్ అంటారు.మన పర్షియా ఉద్వాద బీచ్... ఇది భారత భూభాగమే కానీ ఇక్కడ పర్యటిస్తుంటే పర్షియా సామ్రాజ్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనదేశంలో జొరాస్ట్రియన్ మత వికాసానికి నిదర్శనం. ఇక్కడి ఇళ్లన్నీ ్ర΄ాచీన పర్షియన్ నిర్మాణశైలిలో ఉంటాయి. మరమత్తులు చేసేటప్పుడు వాటి నిర్మాణ ప్రత్యేకతను కోల్పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయం కూడా ప్రపంచంలో ఉన్న ఎనిమిది ప్రముఖ జొరాస్ట్రియా ఆలయాల్లో ఒకటి. ఆలయాల్లో అగ్నిమంట చల్లారనివ్వకుండా కాపాడుకోవడం వారి క్రతువుల్లో ప్రధానం. విజయాగ్ని ఆరని ఆలయాల జాబితాలో ఇక్కడ ఉన్న ఆటాశ్ మెహ్రామ్ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో వారు చూపిస్తున్న శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది.గాంధీజీ పుట్టాడుచౌపాటీ బీచ్... ఇది పోర్బందర్లోని అరేబియా తీరం. ΄ోర్బందర్ అంటే మన జాతిపిత గాంధీజీ పుట్టిన ఊరు. అంతకంటే ముందు పౌరాణిక కథనాలను చూస్తే ఇది శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముడు పుట్టిన ప్రదేశం కూడా. గాంధీజీ ఇంటితోపాటు సుధాముడి ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఈ ఆలయంలో అటుకులను ప్రసాదంగా ఇస్తారు. పోర్బందర్ జిల్లాకేంద్రమే, కానీ పట్టణంలో పెద్ద హడావుడి ఉండదు. తీర ప్రాంతం మాత్రం అభివృద్ధికి చిరునామాగా కనిపిస్తుంది. పోర్టు ఉండడంతో దాని అనుబంధ పరిశ్రమలు కూడా ఉంటాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన ఫ్లెమింగోలు కూడా వేసవిలో ఇక్కడ సేదదీరుతుంటాయి. వాటి కోలాహలాన్ని కూడా ఆస్వాదించవచ్చు.జ్ఞాపకాలు దండిదండి సత్యాగ్రహం గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. గాంధీజీ 1930లో ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టింది ఇక్కడి నుంచే. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండుగా బయలుదేరి ఈ ప్రదేశంలో సముద్రపు నీటిని సేకరించి మరిగించి ఉప్పు తయారు చేశాడు. ఆ సంఘటనకు చిహ్నంగా ఇక్కడ గాంధీజీ ఉప్పు రాశి పోస్తున్న విగ్రహం ఉంటుంది. ఈ తీరంలో విహరించడంతో΄ాటు దండి సత్యాగ్రహం సమయంలో గాంధీజీ బస చేసిన సైఫీ బంగ్లాను కూడా చూసి ఒక ఫొటో తీసుకోవచ్చు.గాయపడిన ఆలయంసోమనాథ్ బీచ్... ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ ప్రదేశం విదేశీ దాడులకు ముఖద్వారం అని చెప్పవచ్చు. మహమ్మద్ గోరీ అనేకసార్లు మనదేశం మీద దాడులు చేశాడు. అరేబియా సముద్రం మీద వచ్చి ఈ తీరం నుంచే భారత భూభాగంలోకి అడుగుపెట్టేవాడు. ఆలయ సంపద దోపిడీతోపాటు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం వంటివన్నీ చరిత్రపుటల్లో దాక్కున్నాయి. ఈ ఆలయం ఎన్నిసార్లు పునర్నిర్మాణం చేసుకుందో తెలియాలంటే చరిత్ర పుస్తకాలు చదవాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్న మారు– గుర్జర శైలి నిర్మాణం నిర్మాణం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గాంధీజీ అనుమతితో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ప్రయత్నం. అందుకే ఆయన గౌరవార్థం ఆలయ ప్రాంగణంలో వల్లభాయ్ పటేల్ విగ్రçహాన్ని ప్రతిష్ఠించారు.అరేబియా సముద్రం చిరు అలలతో మంద్రమైన సవ్వడితో ఆలరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కొంత అలజడిగా ఉంటుంది. అలలు వేగంగా వచ్చి ఆలయ గోడలను తాకుతుంటాయి.మన పర్షియా ఉద్వాద బీచ్... ఇది భారత భూభాగమే కానీ ఇక్కడ పర్యటిస్తుంటే పర్షియా సామ్రాజ్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనదేశంలో జొరాస్ట్రియన్ మత వికాసానికి నిదర్శనం. ఇక్కడి ఇళ్లన్నీ ప్రాచీన పర్షియన్ నిర్మాణశైలిలో ఉంటాయి. మరమత్తులు చేసేటప్పుడు వాటి నిర్మాణ ప్రత్యేకతను కోల్పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయం కూడా ప్రపంచంలో ఉన్న ఎనిమిది ప్రముఖ జొరాస్ట్రియా ఆలయాల్లో ఒకటి. ఆలయాల్లో అగ్నిమంట చల్లారనివ్వకుండా కాపాడుకోవడం వారి క్రతువుల్లో ప్రధానం. విజయాగ్ని ఆరని ఆలయాల జాబితాలో ఇక్కడ ఉన్న ఆటాశ్ మెహ్రామ్ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో వారు చూపిస్తున్న శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది. (చదవండి: యమ రిచ్ దొంగ..! మూడు ఫ్లాట్లు భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు..!) -
పర్యాటకంలో సత్తా చాటుతున్న భాగ్యనగరం
చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్ తదితర ల్యాండ్ మార్కుల ద్వారా అందివచి్చన గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నిలయంగా ప్రపంచ వేడుకలకు చిరునామాగా మారిన ఆధునిక తత్వం వెరసి ప్రపంచ పర్యాటకులకు నగరాన్ని గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ఇవే కాకుండా భారీ సినిమాల తయారీ కేంద్రంగా కళలు, ప్రసిద్ధ వంటకాలు కూడా వృద్ధికి ఊతమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం రూపొందించిన పర్యాటక పాలసీ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్త పర్యాటకాభివృద్ధికి మరింత దోహదం చేయనుంది. ఈ నేపథ్యంలో నగర పర్యాటక రంగ వృద్ధి విశేషాలపై ఓ విశ్లేషణ. నగర పర్యాటక అభివృద్ధిలో బిజినెస్ టూరిజమ్ కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడుల రాకతో ప్రపంచ స్థాయి వాణిజ్య సదస్సులు, సమావేశాలకు వేదికగా, వ్యాపార పర్యాటకానికి నగరాన్ని ప్రధాన గమ్యస్థానంగా మార్చాయి. అదే విధంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆరోగ్య వసతులు, కార్పొరేట్ ఆస్పత్రులు విదేశాలతో పోలిస్తే అందుబాటులోనే ఉన్న వైద్య సేవల వ్యయం నగరాన్ని ఆరోగ్య పర్యాటకానికి రాజధానిగా మారుస్తున్నాయి. మెట్రో టు.. ఎయిర్ ట్రా‘వెల్’.. నగర పర్యాటక వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 72 దేశీయ, 18 అంతర్జాతీయ ప్రయాణ గమ్యస్థానాలకు ప్రయాణ సౌకర్యాలను అందిస్తోంది. గత 2023–24లో నగరం నుంచి సుమారు 20లక్షల మంది అమెరికా, యుకేలకు ప్రయాణించారు. ఇందులో గణనీయమైన భాగం విద్యార్థులు, నిపుణులు ఉన్నారు. ప్రయాణికుల సంఖ్య 2021లో 8 లక్షల నుంచి 2022లో 12.4 లక్షలకు, 2023లో దాదాపు 21 లక్షలకు, 2024లో దాదాపు 25 లక్షలకు పెరిగింది. ఇది సుమారు 45.6% సమీకృత వార్షిక వృద్ధి రేటుగా సూచిస్తుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) డేటా ప్రకారం.. 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2024 వరకూ చూస్తే.. దేశంలోని టాప్ 5 మెట్రో నగరాల్లో ప్రయాణికుల రద్దీ పరంగా సిటీ అత్యధిక వృద్ధి సాధించింది. నగరం 11.7% పెరుగుదలను సాధించగా బెంగళూరు (10.1%) ముంబై (4%), కోల్‌కతా 9.7%, చెన్నై 3.3 శాతంతో వెనుకబడ్డాయి. ఫుల్.. హోటల్స్.. ప్రస్తుతం, రాష్ట్రంలో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్ పరంగా చూస్తే.. 7,500 గదులు అందుబాటులో ఉన్నాయని అంచనా. వీటిలో మన హైదరాబాద్ నగరంలోనే 5,000 వరకూ ఉన్నాయి. రాజధాని నగరంలో అడుగుపెట్టిన వారి సంఖ్య ఏడాదిలో 16 శాతానికి పైగా పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలోని ఐటీ కారిడార్‌లోని హోటళ్లు దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడుతున్నాయని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట రెడ్డి చెబుతున్నారు. దేశీయ పర్యాటకులు 2021–22లో 3.2 లక్షల మంది, 2022–23లో 6.07 లక్షల మంది తెలంగాణను సందర్శించారని, 89.84 శాతం పెరుగుదల నమోదు చేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఇదే కాలంలో విదేశీ పర్యాటకులు 5,917 నుంచి 68,401 (10–56.01 శాతం)కి పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వృద్ధిలో సింహభాగం నగరానికే దక్కుతుందనేది తెలిసిందే.రానున్నాయ్ ఆకర్షణలెన్నో.. ముంబయిలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ను నెలకొల్పే ముందు వరకూ కూడా భారీ స్థాయి సమావేశాలకు నగరంలోని హెచ్ఐసీసీ ప్రముఖ గమ్యస్థానంగా ఉంది. అయితే ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో 10,000 సీట్ల సామర్థ్యం గల కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది ఎమ్ఐసీఎఫ్ సెగ్మెంట్లో నగరాన్ని తిరిగి అగ్రస్థానంలో ఉంచుతుందని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. ఇటీవలే హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించారు. దుబాయ్ తరహా షాపింగ్ మాల్స్ సహా ఇంకా మరెన్నో ఆకర్షణలు నగర పర్యాటకానికి మరింత ఊపు తేనున్నాయి.నగరం వెలుపల కూడా.. నగరంలోని చారిత్రాత్మక కట్టడాలతో పాటు సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం, లాడ్ బజార్ వంటివి హిస్టారికల్ టూరిజం వృద్ధికి దోహదం చేసే విశేషాలుగా నిలుస్తున్నాయి. ఇక నగరానికి కాస్త దూరంలోనే ఉన్న యాదాద్రి, బాసర, నల్గొండ, మెదక్, రామప్ప, ఆలంపూర్, వేములవాడ, కాళేశ్వరం.. వంటి చోట్ల స్పిరిట్యువల్ టూరిజం వృద్ధికి కారణంగా నిలుస్తున్నాయి. అలాగే పోచంపల్లి, గద్వాల్, నారాయణ పేట్ వంటివి సంప్రదాయ హస్తకళల పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. -
ఆంధ్రప్రదేశ్ : ఏడాదిలో రెండు రోజులు మాత్రమే దేవాలయ దర్శనం
ఆత్మకూరు : ప్రముఖ శైవక్షేత్రాల్లో బండి ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అడవిలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరక్షేత్రం ప్రసిద్ధి చెందింది. కాకతీయ, విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. దక్షిణ భారత నిర్మాణశైలిని ఆలయంలో గమనించవచ్చు. ఈ క్షేత్రాన్ని చూడాలంటే ఏడాదికి రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. శివరాత్రి వరకు ఈ క్షేత్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఆలయంలో మహాశివుడే బ్రహ్మేశ్వరుడి రూపంలో కొలువై ఉన్నారు. ద్వాపరయుగంలో మహాభారత కురుక్షేత్ర సంగ్రామం అనంతరం అశ్వత్థామ.. శ్రీకృష్ణుడి ఆదేశానుసారంతో గుండ్లకమ్మ నది జన్మస్థానతీరాన శివలింగాన్ని ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. ఆలయంలో గుండ్లబ్రహ్మేశ్వరస్వామితో పాటు రాజరాజేశ్వరిదేవి, అశ్వత్థామ, వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు కొలువై ఉన్నాయి. శివరాత్రి మినహా మరొకరోజు మాత్రమే ఆలయాన్ని దర్శించుకునేందుకు అటవీశాఖ అధికారులు అనుమతిస్తారు.ప్రకృతి రమణీయత..గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఎన్నో వృక్షాలు, జంతువులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో 353 వృక్షజాతులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పులులు, మచ్చలపిల్లి, ఉడతలు తదితర జంతువులు, దుప్పులను చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 23 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దేవాలయం సమీపంలో గుండ్లకమ్మ నది నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాలో ప్రవహిస్తుంది. ఈ నదిపై కందుల ఓబుళరెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ జలాశయంతో ప్రకాశం జిల్లా పరిధిలో అనేక గ్రామాలకు తాగు, సాగునీరు అందుతోంది.ఇలా చేరుకోవచ్చు..వెలుగోడు మీదుగా గట్టుతండా నుంచి నేరుగా ఈ క్షేత్రాన్ని ట్రాక్టర్లు, వివిధ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. గతంలో ఆర్టీసీ బస్సులు, అన్ని వాహనాల్లో ఈ క్షేత్రానికి వెళ్లేవారు. తెలుగుగంగ రిజర్వాయర్‌ను నిర్మించడం, పులుల సంరక్షణ కేంద్రంగా ఈ క్షేత్రాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించి.. ఈ రహదారిని మూసి వేశారు. ఈ రహదారిని ఈ యేడాది మహాశివరాత్రి సందర్భంగా అనుమతించాలని అటవీశాఖ అధికారులకు భక్తులు విన్నవించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి దృష్టికి కూడా భక్తులు తీసుకెళ్లారు. ప్రస్తుతం నంద్యాల, వెలుగోడు, ఆత్మకూరు నుంచి సంతజూటూరు గ్రామం నుంచి పెద్దదేవలాపురం గ్రామం మీదుగా ఈ క్షేత్రానికి వెళ్లవచ్చు. నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు సమీపంలోని దిగువమెట్ట వద్ద దిగి నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. నంద్యాల నుంచి దిగువమెట్ట మీదుగా గుండ్ల బ్రహ్మేశ్వరానికి అన్నిరకాల వాహనాలు వెళ్తాయి. దూరం 42 కి.మీ ఉంటుంది. ఈ కేత్రానికి చేరాలంటే అటవీశాఖ అధికారులు అనుమతి తీసుకోవాలి. వారు కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. వాహనాలు ఉదయం 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తిరిగి రావాల్సి ఉంటుంది.ప్రతి ఒక్కరూ సందర్శించాలినల్లమల అటవీ పరిధిలోని గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిందే. ఈ క్షేత్రంలో వెలిసిన రాజరాజేశ్వరిమాతను పూ జించాలి. ఈ క్షేత్రానికి ఒకప్పుడు వెలుగోడు, సంతజూటూరు, గిద్దలూరు మీదుగా వేలాది మంది భక్తులు కార్తీకమాసం, మాఘమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో వెళ్లేవారు. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్ పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడంతో మహాశివరాత్రి సందర్భంగా రెండు రోజులు మాత్రమే అనుమతిస్తున్నారు. దేవాలయం అభివృద్ధి చెందాలంటే భక్తులను అనుమతించాలి. ఇక్కడ గుండ్ల బ్రహ్మేశ్వరస్వామిని దర్శిస్తే అనేక జన్మల పుణ్య ఫలితం ఉంటుంది.– కృష్ణశర్మ, ఆలయ పురోహితుడురెండు రోజులు మాత్రమేనల్లమల అభయారణ్యంలో గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది పులుల సంరక్షణ కేంద్రం కావడంతో ఎవరినీ అనుమతించం. కేవలం మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే ప్రకాశం, కర్నూలు జిల్లాల భక్తులను రెండు రోజులు మాత్రమే అనుమతిస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.– ఉదయ్‌దీప్,గుండ్ల బ్రహ్మేశ్వరం రేంజ్ ఆఫీసర్ -
మన ఢిల్లీ... మన హెరిటేజ్
ఇక్కడ మనం చూస్తున్నవన్నీ ఢిల్లీ గొప్పదనాలు. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తించిన నిర్మాణాలు. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్... ఆగ్రా రెడ్‌ఫోర్ట్... ఈ రెండింటికీ గుర్తింపు 1983లో వచ్చింది. కుతుబ్ మినార్... హుమయూన్ సమాధి... వీటికి 1993లో ఆ హోదా వచ్చింది. దేశ రాజస దర్పణం రెడ్‌ఫోర్ట్ మాత్రం... ఈ గౌరవాన్ని 2007లో అందుకుంది.ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలా వాయించి ‘అరే హుజూర్ వాహ్ తాజ్ బోలియే’ అన్న ప్రకటనను మనదేశంలో దాదాపుగా అందరూ చూసి ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో తాజ్‌మహల్ ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం. ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు చేసుకుందాం. రెడ్ఫోర్ట్కి తాజ్ మహల్‌కి ఓ దగ్గరి సంబంధం ఉంది. రెండింటి ఆర్కిటెక్ట్ ఒకరే... అతడే ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేటంతటి సౌందర్యం తాజ్‌మహల్‌ది. ఉత్తరప్రదేశ్‌లో కర్మాగారాల నుంచి విడుదలయ్యే కాలుష్యం కారణంగా పాతికేళ్ల కిందట తాజ్‌మహల్ గోడలు పసుపురంగులోకి మారాయి. ఆ సమయంలో తాజ్‌మహల్‌ని చూసిన వాళ్లు ఫొటోల్లోనే బాగుందనుకున్నారు. ఇప్పుడు అలాంటి అసంతృప్తి ఉండదు. మనదేశానికి అమెరికా అధ్యక్షుడు (తొలి దఫా అధ్యక్షుడుగా ఉన్న సమయం) డొనాల్డ్ ట్రంప్ వచ్చిన సందర్భంగా తాజ్‌మహల్‌కి మెరుగులు దిద్దారు. ఇప్పుడు పాలరాయి తెల్లగా మెరుస్తోంది. 42 ఎకరాల్లో నిర్మించిన తాజ్‌మహల్ నిర్మాణం రెడ్‌ఫోర్ట్ నిర్మాణం కంటే ఎనిమిదేళ్లు ముందు మొదలైంది. రెడ్‌ఫోర్ట్ పూర్తయిన తర్వాత ఐదేళ్లకు పూర్తయింది. అంటే 1631– 1653 వరకు 22 ఏళ్లు కట్టారు. ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగు పెట్టిన తర్వాత ముందుకు నడిచే కొద్దీ తాజ్ మహల్‌ను తలెత్తి చూడాలి. తాజ్‌మహల్ నుంచి ఆగ్రాఫోర్ట్, షాజహాన్ ప్యాలెస్ చూడవచ్చు. తాజ్‌మహల్ వెనుక వైపు నుంచి బేస్మెంట్ కిందకు చూస్తే యమునా నది గంభీరంగా ప్రవహిస్తుంటుంది.హుమయూన్ సమాధి భార్య ప్రేమకు చిహ్నం హుమయూన్ కా మఖ్బారా... హుమయూన్సమాధి. మనదేశానికి పర్షియా ఉద్యానవనశైలిని మనకు పరిచయం చేసిన కట్టడం ఇది. మనదేశంలో మొఘల్ వాస్తుశైలిలో నిర్మితమైన తొలికట్టడం. తాజ్ మహల్, హుమయూన్స్ టూంబ్ రెండూ సమాధి నిర్మాణాలే. రెండూ ఆర్కిటెక్చర్ పరంగా గొప్ప కట్టడాలే. తాజ్ మహల్‌ని భార్య జ్ఞాపకార్థం భర్త కట్టించాడు. హుమయూన్ టూంబ్‌ను భర్త జ్ఞాపకార్థం భార్య కట్టించింది. ప్రేమ చిహ్నంగా గొప్ప ప్రమోషన్ రాలేదు, కానీ నిర్మాణపరంగా ఇది కూడా గొప్ప కట్టడమే. హుమయూన్ సమాధి ఢిల్లీ శివార్లలో నిజాముద్దీన్‌లో ఉంది. ఈ సమాధి పైన గుమ్మటం ఎత్తు 42.5 మీటర్లు. ఈ సమాధి మొత్తం నేలకు ఒకటిన్నర మీటర్ల ఎత్తున్న గట్టు మీద ఉంటుంది. దాని మీద ఆరు మీటర్లకు పైగా ఎత్తున్న భవనాన్ని నిర్మించారు. ప్రధాన కట్టడం నిర్మాణం మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్న ఉద్యానవనాల నిర్మాణం కూడా ప్రత్యేకమైనదే. మొఘల్ ఉద్యానవన శైలి చార్బాగ్ శైలి ఇందులో కూడా కనిపిస్తుంది. ఈ గార్డెన్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన నీటి పంపులు, వాటర్ఫౌంటెయిన్లతో ఆధునిక సాంకేతికత కనిపిస్తుంది.హుమయూన్ సమాధి నిర్మాణం క్రీ.శ 1562లో మొదలైంది. ఈ సంగతి తెలియగానే వచ్చే సందేహం ఒక్కటే...∙హుమయూన్ మరణించింది క్రీ.శ 1556 జనవరి 20వ తేదీ. మరి సమాధి అప్పుడు కట్టలేదా అనే ప్రశ్న నిజమే. మరణించిన వెంటనే పురానాఖిలాలో ఖననం చేశారు. కొంతకాలానికి శవపేటికను పెకలించి పంజాబ్ లోని సిర్హింద్కు తీసుకెళ్లారు. రాజ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత హుమయూన్ భార్య హమీదాబేగం (అక్బర్ తల్లి) భర్త జ్ఞాపకార్థం గొప్ప నిర్మాణం చేయాలనుకుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్న హుమయూన్ సమాధి. ఈ నిర్మాణం పూర్తవడానికి పదేళ్లు పట్టింది. ఢిల్లీకి ట్రైన్లో వెళ్లేటప్పుడు నగరంలోకి ప్రవేశించడానికి ముందే నిజాముద్దీన్ స్టేషన్ వస్తుంది. సమాధి నిర్మాణం ఎత్తైన బేస్మెంట్ మీద ఉండడంతో ట్రైన్‌లోకి కనిపిస్తుంది.సలామ్ .. రెడ్ ఫోర్ట్మొఘలుల సామ్రాజ్య విస్తరణలో రెడ్ఫోర్ట్ది కీలకమైన స్థానం. షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాడు. ఇందులో షాజహాన్ నివసించిన ప్యాలెస్, ముంతాజ్ మహల్, రంగ్ మహల్, మోతీ మసీదు, ఇతర ప్యాలెస్‌లు ప్రతిదీ దేనికదే ప్రత్యేకమైన నిర్మాణాలే. ఇక్కడున్న దివానీ ఖాస్, దివానీ ఆమ్లు ఆగ్రాఫోర్ట్‌లో ఉన్న వాటికంటే భారీ నిర్మాణాలు. ఈ కోట ్రపాంగణం అంతా కలియదిరిగినప్పుడు ఇంత గొప్పగా డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరో అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ దీనిని డిజైన్ చేశాడు. ఇందులో ఇండియన్ నిర్మాణశైలితోపాటు పర్షియన్ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని కట్టడానికి పదేళ్లు పట్టింది. రాజసాన్ని ప్రదర్శించే ఈ కోట 1648– 1857 వరకు మొఘలుల అధీనంలో ఉంది. సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ స్వాధీనంలోకి వెళ్లింది. స్వాతంత్య్ర సాధనతో మన జాతీయపతాకం ఎగిరింది. అప్పటి నుంచి ఏటా పతాకావిష్కరణ సందర్భంగా టీవీలు, పత్రికల్లో దేశ ప్రజలకు దర్శనమిస్తోంది. నిర్వహణ భేష్!రెడ్‌ఫోర్ట్ నిర్వహణ బాధ్యత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన తర్వాత కోట ్రపాంగణం టూరిస్ట్ ఫ్రెండ్లీగా మారింది. నిర్మాణాలను దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచడంతోపాటు పచ్చటి లాన్లను మెయింటెయిన్ చేయడంతో ఇక్కడ ఎండాకాలంలో కూడా టూరిస్టులు సౌకర్యంగా తిరుగగలుగుతున్నారు. టాయిలెట్లు, మంచినీటి సౌకర్యాలు కూడా బాగున్నాయిప్పుడు. అనేక కాంప్లెక్స్‌లను మ్యూజియాలుగా మార్చడం మరొక మంచి పరిణామం. రెడ్‌ఫోర్ట్ టూర్‌ను ఆద్యంతం ఆస్వాదించే క్రమంలోనే ముంతాజ్ మ్యూజియం, ఇండియన్ ఆర్ట్ మ్యూజియం వంటి వాటిని కూడా కవర్ చేయవచ్చు. దిగుడుబావి ఉంది!రెడ్‌ఫోర్ట్ ఆవరణలో ఒక స్టెప్‌వెల్ ఉంది. రెడ్ఫోర్ట్ని ఓ పదేళ్ల కిందట చూసిన వాళ్లు దీనిని గమనించి ఉండకపోవచ్చు. ఈ సారి వెళ్లినప్పుడు మర్చిపోకుండా చూడాలి. అయితే ఈ బావిలోకి దిగడానికి ఏ మాత్రం వీల్లేదు. ఢిల్లీ నగరంలోని అగ్రసేన్‌కీ బావోలీ వంటి కొన్ని స్టెప్వెల్స్లోకి ఒకటి– రెండు అంతస్థుల వరకైనా అనుమతిస్తారు. కానీ ఈ రెడ్‌ఫోర్ట్ స్టెప్వెల్ని పూర్తిగా లాక్ చేసి పైన గ్రిల్ అమర్చారు. నేల మీద నుంచి వంగి చూడాల్సిందే.తొలి ఎర్రకోట ఆగ్రా ఫోర్ట్ఈ ఎర్రకోట ఆగ్రాలో ఉంది. ఢిల్లీ ఎర్రకోట కంటే ముందుది. ఈ కోట యమునాతీరాన తాజ్ మహల్‌కు పక్కన ఉంది. ఇక్కడి నుంచి చూస్తే తాజ్‌మహల్ అందంగా కనిపిస్తుంది. తాజ్ మహల్ నుంచి ఈ కోట ఠీవిగా కనిపిస్తుంది. ఈ కోటలో ఏమేమి ఉన్నాయంటే ఢిల్లీ రెడ్‌ఫోర్ట్ అన్నవన్నీ ఉన్నాయి. వంద ఎకరాల్లో విస్తరించిన కోట ఇది. దివానీ ఆమ్, దివానీ ఖాస్ వంటి పాలన భవనాలతోపాటు ప్యాలెస్‌లున్నాయి. షాజహాన్ అంత్యకాలంలో నివసించిన ప్యాలెస్ షా బుర్జ్ ఇక్కడే ఉంది. ఈ ప్యాలెస్ నుంచి తాజ్‌మహల్ వ్యూ అందంగా ఉంటుంది. షాజహాన్‌ను కొడుకు ఔరంగజేబు ఖైదు చేశాడని తెలిసినప్పుడు సానుభూతి కలుగుతుంది. కానీ ఈ ప్యాలెస్‌ను చూస్తే రాజు జైల్లో ఉన్నా రాజరికపు సౌకర్యాలేమీ తగ్గవనే వాస్తవం తెలిసి వస్తుంది. అక్బర్ కట్టించిన ‘జహంగీర్ మహల్’ ఒక అద్భుతం. మధ్య ఆసియా నుంచి అక్కడ ప్రసిద్ధులైన వాస్తు శిల్పులను పిలిపించి, స్థానికంగా ఉన్న హిందూ వాస్తుశిల్పులలో నిపుణులను ఎంపిక చేసి అందరి సమష్టి కృషితో గొప్ప నిర్మాణం జరగాలని ఆదేశించాడట. ఆ మేరకే వాళ్లు దీనిని డిజైన్ చేశారట. మొఘలుల ఉత్థానపతనాలకు ఈ కోట ప్రత్యక్షసాక్షి. కోట లోపల అక్బర్‌కు విజయం అందించిన ఆయుధాగారం ఉంది. రతన్‌సింగ్ హవేలీ, బెంగాల్మహల్, శీష్‌మహల్, షాజహాన్ మహల్, జహంగీర్ బాత్‌టబ్‌లను చూడడం మరువకూడదు. ఈ ఎర్రకోటలోకి పర్యాటకులను అమర్‌సింగ్ గేట్ నుంచి అనుమతిస్తారు. పాలరాతిలో ఇన్లే వర్క్ ఇక్కడి ప్యాలెస్‌లలోనూ కనిపిస్తుంది. టూర్ ఆపరేటర్లు తాజ్‌మహల్ కంటే ఈ కోటకు తీసుకువెళ్తారు. త్వరగా రాకపోతే తాజ్‌మహల్ చూడడానికి సమయం చాలదని తొందరపెడుతుంటారు. దాంతో పర్యాటకులు ప్రశాంతంగా ఆస్వాదించలేకపోతారు.కుతుబ్ మినార్కుతుబ్మినార్ ఐదు అంతస్థుల కట్టడం. ఢిల్లీ శివారులో మెహ్రౌలీలో ఉంది. దీని నిర్మాణం క్రీ.శ 1199 నుంచి 1220 వరకు అనేక దఫాలుగా జరిగింది. అనంగపాల్ తోమార్ నుంచి పృథ్వీరాజ్ చౌహాన్, కుతుబుద్దీన్ ఐబక్ షంషుద్దీన్ ఇల్‌టుట్ మిష్ వరకు అనేక రాజవంశాల చరిత్రలో ఈ మినార్ది కేంద్రస్థానం. హుమయూన్‌కి అక్బర్‌కి మధ్య కాలంలో షేర్షా సూరి కూడా తన వంతుగా కొన్ని మెరుగులు దిద్దాడు. ఈ 62 మీటర్ల ఎత్తున్న ఈ మినార్‌కు 14వ తతాబ్దంలో ఫిరోజ్‌షా తుగ్లక్ పై అంతస్థును నిర్మించాడు. ఈ నిర్మాణం ఇండో ఇస్లామిక్ సమ్మేళనం. సూక్ష్మంగా పరిశీలిస్తే ఇందులో అరబిక్ భాషలో రాసిన ఖురాన్ సూక్తులు కనిపిస్తాయి. నిర్మాణంలో వలలాంటి అల్లికల నిర్మాణం పర్షియన్ వాస్తుశైలిని ప్రతిబింబిస్తుంది. తామర రేకులను పోలిన అంచులు హిందూ నిర్మాణాల శైలికి నిదర్శనం. ఇందులో ఉపయోగించిన ఇటుకలను ఆఫ్గనిస్థాన్ నుంచి తెప్పించారు. ఈ ్రపాంతాన్ని ఏలిన పాలకులందరూ ఈ నిర్మాణానికి ఏదో ఒక సొబగులద్ది చరిత్రలో తమ పేరు కూడా ఉండేటట్లు జాగ్రత్తపడ్డారు.ఐరన్ పిల్లర్ ప్రత్యేక ఆకర్షణకుతుబ్మినార్తోపాటు అనేక కట్టడాలున్నాయి. విశాలమైన ్రపాంగణంలో ఇతమిద్ధంగా ఇదీ అని చెప్పడానికి వీల్లేని నిర్మాణాల అవశేషాలుంటాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ శిథిలాలకు రూపమిచ్చే ప్రయత్నం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే కుతుబ్‌మినార్ కట్టడం లాల్ కోట్ శిథిలాల మీద మొదలైందని చరిత్రకారులు నిర్ధారించారు. ఇక్కడున్న ఐరన్ పిల్లర్ మరో చారిత్రక గొప్పదనం. అది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. కానీ తుప్పు పట్టదు. మనదేశంలో లోహశాస్త్రం ఎంత శాస్త్రబద్ధంగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏయే లోహాలను ఎంతెంత నిష్పత్తిలో వాడారనే విషయంలో రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనలు చేస్తుంటారు.టూర్ ప్యాకేజ్‌లిలా ఉంటాయి!∙ఢిల్లీకి విమానం లేదా రైల్లో వెళ్లిన తర్వాత లోకల్ టూర్ ప్యాకేజ్ తీసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఢిల్లీ డే టూర్ ప్యాకేజ్లుంటాయి.ఏసీ బస్సు లేదా విడిగా కారు మాట్లాడుకోవచ్చు. కారుకు రోజుకు ఏడు లేదా ఎనిమిది వేలుంటుంది. బస్సులో ఒకరికి వెయ్యి రూపాయలకు అటూఇటూగా ఉంటుంది. ∙ఢిల్లీకి వెళ్లడానికి ముందే నగరంలో చూడాల్సిన ప్రదేశాల జాబితాతోపాటు సిటీ టూర్ మ్యాప్‌ను పరిశీలించాలి. ఏయే ప్రదేశాలను ఒక క్లస్టర్‌గా ప్లాన్ చేసుకోవచ్చనే అవగాహన వస్తుంది. అలాగే ఆయా ప్రదేశాలకు సెలవు దినాల వివరాలను కూడా ఆయా వెబ్సైట్ల ద్వారా నిర్ధారించుకోవాలి.∙ఆహారం విషయానికి వస్తే చోలే–బటూరా, బటర్ చికెన్, జిలేబీ, రబ్రీ ఫాలూదాలను తప్పనిసరిగా రుచి చూడాలి. -
దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..
గాడ్స్ ఓన్ కంట్రీ... చూడాల్సినవి ఇవి అని చెప్పుకోవడం కష్టం. జాబితా వేళ్ల మీద లెక్కపెట్టేటంత చిన్నదిగా ఉండదు. ఆర్ట్ అండ్ కల్చర్, ఆధ్యాత్మికం, ధార్మికం, వీకెండ్ పిక్నిక్ స్పాట్స్, బీచ్‌లు, బ్యాక్ వాటర్స్, పర్వతాలు, కొండవాలులో టీ తోటలు, సముద్రం మీద సూర్యాస్తమయాలు, జలపాతాలు, వన్యప్రాణులు, హాలిడే రిసార్టులు... ఇలా పరస్పరంవైవిధ్యభరితమైన పర్యటనల నిలయం ఈ రాష్ట్రం. కేరళలో ఆధ్యాత్మికం కూడా ఆద్యంతం అలరిస్తుంది. త్రివేండ్రంలోని పద్మనాభ స్వామి ఆలయం మొదలు అంబళంపుర శ్రీకృష్ణుడు, చెట్టికుళాంగుర భగవతి, శబరిమల అయ్యప్ప, కొట్టరక్కర గణపతి, తిరునెల్లి ఆలయం, చర్చ్‌లు, మసీదులు ప్రతిదీ టూరిస్టులకు కనువిందు చేస్తాయి.శబరిమలైకి మహిళలను అనుమతించడం కోసం తృప్తి దేశాయ్ చేసిన ఉద్యమంతో ఉత్తరాదివాసుల దృష్టి కూడా కేరళ మీద కేంద్రీకృతమైంది. ఇప్పుడు కేరళలో హిందీవాళ్లు కూడా కనిపిస్తున్నారు.అరబిక్ కడలికేరళ టూర్‌కి కాలంతో పని లేదు. అరేబియా తీరం– పశ్చిమ కనుమల మధ్య విహారానికి ఎప్పుడైనా రెడీ కావచ్చు. ఎండకాలం చల్లగా అలరిస్తుంది. జూన్ నుంచి చిరు వానలు పలకరిస్తాయి. శీతాకాలం పచ్చదనం తన గాఢతను ప్రదర్శిస్తుంది. తలలు వాల్చి ఆహ్వానం పలికే కొబ్బరితోటలు, కోమలత్వాన్ని తాకి చూడమనే అరటి గుబుర్లు, ఎటూ వంగని పోకచెట్లు, ఏ చెట్టు దొరుకుతుందా అల్లుకుపోదామని వెతుక్కునే మిరియాల తీగలు, కాయల బరువుతో భారంగా వంగిపోతున్న కాఫీ చెట్లు, టూర్‌కి మినిమమ్ గ్యారంటీ ఇచ్చే అరేబియా సముద్రం మీద సూర్యాస్తమయాలు... ఇవన్నీ ప్రకృతి ప్రసాదితాలు.ఆది శంకరుడు పుట్టిన నేలకాలడి ఓ చిన్న పట్టణం. పెరియార్ నది ఒడ్డున ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఆది శంకరాచార్యుడు పుట్టిన ప్రదేశం ఇది. ఇక్కడ ఆయన నివసించిన ఇల్లు, ఆయన తల్లి సమాధి ఉన్నాయి. ఇక్కడి స్నానఘట్టంలో ముత్తల కడవు (మొసలి మడుగు) ను కూడా చూడవచ్చు. ఆది శంకరుడు సన్యసించాలనుకున్నప్పుడు తల్లి అంగీకరించలేదు. ఆమె అంగీకారం కోసం ఆది శంకరుడు నాటకం ఆడిన ఘట్టం ఇది. స్నానఘట్టంలో దిగి మొసలి పట్టుకున్నదని, సన్యసించడానికి ఒప్పుకుంటేనే వదులుతుందని తల్లిని మాయ చేసి అంగీకారం పొందిన కథనాన్ని చెబుతారు పూజారులు. పెరియార్ నది కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగడానికి ముందే పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. పచ్చటి చేనులో నీలిరంగు వస్త్రాన్ని మలుపు తిప్పుతూ పరిచినట్లు ఉంటుంది దృశ్యం.కళల నిలయంకేరళ ప్రకృతిసోయగంతోపాటు కళలతోనూ ఆకట్టుకుంటుంది. కలరిపయట్టు వంటి యుద్ధ క్రీడ, మోహినీ అట్టం, కథాకళి వంటి నాట్యరీతులు, రాజారవివర్మ చిత్రలేఖన సమ్మేళనం ఇక్కడే పుట్టాయి. భరత్పుఱ నది తీరాన త్రిశూర్ జిల్లాలోని చెరుత్తురుతి పట్టణంలో కేరళ కళామండలం ఉంది. కళల సాధన కోసం ఏర్పాటు చేసిన ఈ కళామండలంలో నిత్యం సంప్రదాయ నాట్యరీతుల సాధన జరుగుతూ ఉంటుంది. మరో హాలులో కేరళ సంప్రదాయ నాట్య రీతుల నాట్య ముద్రలు, భంగిమలు, ఆహార్యంతో ఉన్న బొమ్మల మ్యూజియం ఒక ఎడ్యుకేషన్. ఈ కళల కోసమే కాదు, కేరళ కళామండలం భవన నిర్మాణశైలిని చూడడం కోసం ఆర్కిటెక్చర్ విద్యార్థులు వెళ్లాల్సిన ప్రదేశం.వాస్కోడిగామా ఎంట్రీ!కేరళ రాష్ట్రంలో సగం తీర్రప్రాంత జిల్లాలైతే మిగిలిన సగం కొండ్రప్రాంత జిల్లాలు. రైలు ప్రయాణంలో తమిళనాడు నుంచి కేరళకు వెళ్లేటప్పుడు పాలక్కాడ్ నుంచే మార్పు కనిపిస్తుంది. మనదేశంలో వలస పాలనలో మగ్గి΄ోవడానికి దారులు పడింది కూడా ఈ రాష్ట్రం నుంచే. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా మనదేశంలోకి ప్రవేశించింది కోళికోద్ పట్టణానికి సమీపంలోని కప్పడ్ అనే చిన్న తీరగ్రామంలో. కప్పడ్ బీచ్‌లో వాస్కోడిగామా జ్ఞాపకచిహ్నాలున్నాయి. చర్చ్‌లు యూరోపియన్ నిర్మాణశైలిలో అందంగా ఉంటాయి. నది తీరాన నిర్మించడంలో గొప్ప అభిరుచి వ్యక్తమవుతుంటుంది. ఎర్నాకుళంలో సెయింట్ మేరీస్ బాసిలికా చర్చ్, మలయత్తూర్ చర్చ్, శాంతాక్రజ్ కేథడ్రల్, జార్జ్ ఫ్రాన్సిస్ చర్చ్, సముద్రతీరాన నిర్మించిన వల్లర΄ాదమ్ చర్చ్‌లు ప్రశాంత వాతావరణంలో మౌనముద్ర దాల్చి ఉంటాయి. ముఖ్యమైన మసీదులు ముప్పైకి పైగా ఉంటాయి.ఆరోగ్యదేవుడు ధన్వంతరిఆయుర్వేదంలో వైద్యానికి మూల పురుషుడు ధన్వంతరి. ధన్వంతరికి ‘ముక్కిడి’ పేరుతో 35 ఔషధాల మిశ్రమాన్ని నివేదిస్తారు. త్రిశూర్ జిల్లా, నెల్లువాయ్ గ్రామంలో ఉన్న ఆలయం పురాతనమైనది. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతభాండాన్ని ధన్వంతరి పట్టుకుని వస్తాడు. ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రం, ఒకచేతిలో అమృతభాండం, మరో చేతిలో జలూకం(జలగ, ఆయుర్వేద వైద్యంలో జలగను ఉపయోగిస్తారు)తో ఉద్భవించాడు ధన్వంతరి. ఆ మూర్తినే ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు. మున్నువరువట్టం, గురువాయూర్లలో కూడా ధన్వంతరి ఆలయం ఉంది. శబరిమలకు వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.టీ తోటల మునార్మున్నార్ అంటే మూడు నదుల కలయిక. ముథిరాప్పుజ, నల్లతన్ని, కుండలి నదుల మధ్య ఉన్న హిల్‌స్టేషన్ ఇది. టీ తోటలు విస్తారంగా ఉంటాయి. ఈ తోటల మధ్య జలపాతాలు తెల్లగా పాలధారలను తలపిస్తుంటాయి. వర్షాకాలంలో దట్టంగా అలముమున్న నల్లటి మేఘాలను చీల్చుకుంటూ భూమ్మీద పాలను కుమ్మరిస్తున్నట్లు ఉంటుంది అట్టుకడ జలపాతం. ఈ టూర్లో ఎరవి కులమ్ నేషనల్ పార్క్‌ను, నీలగిరులు అనే పేరు రావడానికి కారణమైన నీలకురింజి మొక్కలను చూడాలి. మున్నార్, ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రదేశాలను ఒకసారి చూసిన వాళ్లు కూడా కురింజి పూలు పూసినప్పుడు మళ్లీ చూడాలని ఆశపడతారు. బొటానికల్‌గా ఇవి 50 రకాల జాతులున్నాయి. కాని మనకు చూడడానికి అన్నీ నీలంగానే ఉంటాయి, షేడ్లు మాత్రం ఏ చిత్రకారుడూ మిక్స్ చేయలేనంత లలితంగా ఉంటాయి. నీలకురింజి పూలు పన్నెండేళ్లకోసారి పూస్తాయి. 2018లో పూశాయి, మళ్లీ పూసేది 2030లోనే. కోవిడ్ సమయంలో కూర్గ్ కొండల్లో కొన్ని చోట్ల విరిశాయి. కానీ సీజన్లో పూసినట్లు కొండ మొత్తం విస్తరించలేదు. ఇక్కడ జంతు సంచారం కూడా ఎక్కువ. నీలగిరి థార్ ఇక్కడ మాత్రమే కనిపించే జింక జాతి.కోటలు... తోటలు!కేరళ గ్రామాల్లో మన దగ్గర ఉన్నట్లు ఇళ్లన్నీ ఒక చోట, పొలాలు ఒకచోట ఉండవు. రెండు – మూడు ఎకరాల స్థలంలో కొబ్బరి చెట్లు, మధ్యలో ఇల్లు ఉంటుంది. తోట పక్కన మరొక తోట... ఆ తోటలో ఒక ఇల్లు... చాలా ఇళ్లకు పై కప్పు ఎర్ర పెంకులే ఉన్నాయి. రెండస్తుల ఇల్లు కూడా పై కప్పు వాలుగా, ఎర్ర పెంకులతో ఉంటుంది. రాజుల ప్యాలెస్‌లు కూడా భారీ నిర్మాణాలేమీ కాదు. రాజస్థాన్ కోటలు, ప్యాలెస్‌లను చూసిన కళ్లతో ఇక్కడి ప్యాలెస్‌లను చూస్తే కళ్లు విప్పార్చలేం. కానీ ప్రకృతి సహజమైన, శాంతియుతమైన జీవనశైలికి నిదర్శనంగా కనిపిస్తాయి. పాలక్కాడ్, తలస్సెరి కోటలు పర్యాటకులను అలరిస్తుంటాయి. చిన్న చిన్న ప్యాలెస్‌లను రిసార్టులుగా మార్చేశారు. భరత్‌పుర నది ఒడ్డున ఉన్న ప్యాలెస్‌ను ‘ది రివర్ రిట్రీట్’ పేరుతో హెరిటేజ్ ఆయుర్వేదిక్ రిసార్టుగా మార్చారు. అందులో భోజనం చేయడం జిహ్వకు వైద్యం.మీన్ ముట్టి జలపాతంవయనాడు... కేరళ రాష్ట్ర్రంలో అత్యున్నత స్థాయి ప్రకృతి సౌందర్యాన్ని ఇముడ్చుకున్న ప్రదేశం. ఆ రాష్ట్రానికి శిఖరాగ్రం కూడ ఇదే. మీన్ముట్టి వాటర్ ఫాల్స్‌కి రెండు కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో ట్రెకింగ్ చేయాలి. ఈ కొండ మీద మీన్ముట్టి వాటర్‌ఫాల్స్ దగ్గర నుంచి చూస్తే ఒక వైపు తమిళనాడు నీలగిరులు, మరోవైపు కర్నాటకకు చెందిన కూర్గ్ కొండలు దోబూచులాడుతుంటాయి. వరదలు ముంచెత్తినప్పటికీ పర్యాటకం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటోంది. ట్రీ హౌస్‌లో బస చేయాలనే సరదా తీరాలంటే ముందుగానే ΄్లాన్ చేసుకోవాలి. ఇక్కడ పర్యటిస్తే కేరళ వాళ్లు తమ రాష్ట్రాన్ని ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది.గిన్నిస్ బుక్‌లో జటాయుపురాజటాయు నేచర్ పార్క్... కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణం, జటాయుపురాలో ఉంది. రామాయణంలో సీతాపహరణం ఘట్టంలో రావణాసురుడితో జటాయువు పోరాడిన ప్రదేశం ఇదేనని చెబుతారు. నేచర్ పార్కులో 65 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్ మ్యూజియమ్ ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది. వెయ్యి అడుగుల ఎత్తులో జటాయువు పక్షిని నిర్మించడం, పక్షి ఆకారం లోపల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పవచ్చు.త్రివేండ్రం పద్మనాభుడుఅనంత పద్మనాభ స్వామి ఆలయం అప్పుడప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటుంది. తలుపులు తెరుచుకోని ఆరోగది మీదనే అందరి దృష్టి. అంతకంటే గొప్ప ఆసక్తి ఇక్కడి పద్మనాభుడి రూపం. ఈ ఊరికి తిరువనంతపురం అనే పేరు రావడానికి కారణం ఈ ఆలయమే. కేరళ రాజధాని నగరం ఇది. బంగారు గోపురం ఉన్న ఈ ఆలయం టావెన్కోర్ రాజవంశం సంపన్నతకు ప్రతీక.అలెప్పీ హౌస్బోట్హౌస్బోట్లో ప్రయాణం చేయకపోతే కేరళ టూర్ వృథా అనే చెప్పాలి. ఇప్పుడు హౌస్బోట్లు మరింత పెద్దవిగా క్రూయిజ్‌లుగా మారాయి. టూర్ ప్యాకేజ్‌లో డే క్రూయిజ్ ప్యాకేజ్ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ప్రయాణంలో కేరళ సంప్రదాయ భోజనంలో రకరకాలను ఆస్వాదించవచ్చు. భోజనాన్ని అరిటాకులో వడ్డించడం మాత్రమే కాదు అరటికాయ చిప్స్, చేపను అరిటాకులో చుట్టి వేయించిన ఫిష్‌ఫ్రై ఇక్కడ ప్రత్యేకం. చికెన్ కర్రీలో కొబ్బరి ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి నూనె వంటల మీద అపోహ ఉంటుంది. కానీ ఈ వంటలు చాలా రుచిగా ఉంటాయి.షాపింగ్జరీ అంచు హాఫ్‌వైట్ చీర లేదా లంగా–ఓణీ తెచ్చుకోవడం మరువద్దు. ఉడెన్ కార్వింగ్ బాక్సులు, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అందంగా ఉంటాయి. కొబ్బరి, అరటి నారతో చేసిన టేబుల్ మ్యాట్స్, కోషెలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వాల్ హ్యాంగింగ్స్ కొనుక్కోవచ్చు. ఇవి తినాలికోకోనట్ హల్వా, అరటికాయ చిప్స్, అరటికాయ బజ్జీ ప్రసిద్ధి. కొబ్బరి బోండాం తప్పకుండా తాగాలి. వేడుకలివిఫిబ్రవరి 14 నిషగంధి డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఫిబ్రవరి 19 నుంచి 25 వరకు పరియాణమ్ పేట్ పూరమ్, పాలక్కాడ్, భగవతి టెంపుల్, త్రిశూర్ ఆలయంలో ఉత్రాళిక్కవు పూరమ్ వేడుకలు జరుగుతాయి. ప్యాకేజ్‌లిలా...సౌత్ కేరళ 4 రాత్రులు 5 రోజులకు 55 వేలు. 5 రాత్రులు 6 రోజులకు దాదాపుగా అరవై వేలు. ఎంటైర్ కేరళకు ఆఫర్ నడుస్తోంది. పది రాత్రులు 11 రోజులకు 55 వేలు. ఈ ఆఫర్ మార్చి 30 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో కొదుండుళూర్లోని చేరమాన్ జుమా మసీద్, చీయప్పార జలపాతం, వాలర జలపాతం, ఇడుక్కి దేవికులమ్ హిల్స్, కొచ్చిలోని బోల్గట్టీ ఐలాండ్, హౌస్‌బోట్, విలేజ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ మొదలైనవి కవర్ అవుతాయి. సెంట్రల్ కేరళ ప్యాకేజ్ కి20 వేలు. ఇందులో అళప్పుఱ, పెరియార్ టైగర్ రిజర్వ్, తెక్కడి, మునార్, ఫోర్ట్ కొచ్చి మొదలైనవి ఉంటాయి. --వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం చూతము రారండి) -
థాయ్ వెర్షన్ రామాయణం
ఇతిహాసాన్ని శక్తివంతమైన కథగా చెప్పడం, సాంస్కృతిక నేపధ్యంతో దానిని సజీవంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కళాకారుడికి అత్యంత సాహసోపైతమైన చర్య. దీనిని థాయ్‌లాండ్ కళాకారులు మన ఇతిహాసాన్ని తమ సంప్రదాయ కళారూపంతో మన దేశ రాజధానిలో ప్రదర్శించనున్నారు. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి సహకారంతో రాయల్ థాయ్ ఎంబసీ ఖోన్ థాయ్ మాస్క్డ్ డ్యాన్స్ డ్రామాను న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ ఫిబ్రవరి 7, 2025న సాయంత్రం 6:30 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లోని భీమ్ హాల్లో జరుగుతుంది.థాయిలాండ్ అత్యంత గౌరవనీయమైన కళారూపాలలో ఒకటైన ఖోన్, శాస్త్రీయ నృత్యం, లిరికల్ స్టోరీ టెల్లింగ్, ప్రత్యక్ష సాంప్రదాయ థాయ్ సంగీతాన్ని మిళితం చేస్తుంది. యునెస్కో చేత సాంస్కృతిక వారసత్వంగా గుర్తించబడింది. దుస్తులు, కొరియోగ్రఫీ, ఆధ్యాత్మిక వ్యక్తీకరణ ఈ నృత్యం ప్రత్యేకతలు. వారియర్ హనుమాన్ఈ ప్రదర్శనలో రామాయణం ఇతిహాసం నుండి హనుమాన్ ది మైటీ వారియర్ అనే ఎపిసోడ్ ఉంటుంది, ఇది హనుమంతుడి శౌర్యం, విధేయతను చూపే ఆకర్షణీయమైన కథ. ఈ కథ ఐదు దశలలో.. రావణుడిని ఓడించాలనే తపనతో రాముడికి సేవ చేయడానికి వాయు దేవుడు సృష్టించిన హనుమంతుడి దివ్య జననంతో ప్రారంభమవుతుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, హనుమంతుడి బాల్య దుశ్చర్య, రాముడి ఆశీర్వాదంతో అతని బలం తిరిగి వస్తుంది. సీతను రక్షించడానికి అతని అచంచలమైన నిబద్ధతను ఇది అన్వేషిస్తుంది. హనుమంతుడు, రాముడు వారి మిత్రులు రావణుడిపై విజయం సాధించే యుద్ధంతో కథనం ముగుస్తుంది. చారిత్రక సంబంధాలుఖోన్ థాయిలాండ్ రాజ ప్రాంగణాలలో భారతీయ ఇతిహాసం రామాయణంతో గల సంబంధం భారతదేశం– థాయిలాండ్ మధ్య గల లోతైన చారిత్రక సంబంధాలను తెలియజేస్తుంది. దీంతో పాటు తమ కళ ద్వారా వ్యక్తీకరణ హావభావాలు, శక్తివంతమైన కథ చెప్పడం తరతరాలుగా అందించిన గొప్ప సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది థాయ్ వారసత్వంలో ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారుతుంది. భారతీయ ప్రేక్షకులకు థాయిలాండ్ సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని చూపిస్తుంది. ఇది ఉమ్మడి వారసత్వం, కళాత్మకత, రామకీన్, రామాయణ ఇతిహాసాల ద్వారా ప్రతిధ్వనించే భక్తి, శౌర్యం, సార్వత్రిక ఇతివృత్తాల వేడుక. రాయల్ థాయ్ ఎంబసీ, ఐసీసీఆర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేస్తుంది. -
Dock Bridge : ప్రకృతి ఆధారిత వేళ్ల వంతెన..!
ఇది వేళ్లాడే వంతెన. ఉంగాట్ నది మీద ఉంది. అభివృద్ధి చెందిన నగరాలన్నీ నగరం మధ్యలో ఉన్న చెరువు మీద ఇనుప చువ్వలతో వేళ్లాడే వంతెనలను కడుతున్నాయి. కానీ ఉంగాట్ నది మీద కనిపించేవి వేళ్లతో కట్టిన వంతెనలు. అది కూడా చెట్టు నుంచి వేరు చేసిన వేళ్లు కాదు, సజీవంగా ఉన్న వేళ్ల వంతెనలు. ఈ నైపుణ్యం ప్రపంచంలో మనదేశానికే సొంతం, అది కూడా మేఘాలయ వంటి మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించిన నైపుణ్యం. ఈ నది డాకీ పట్టణం నుంచి ప్రవహిస్తోంది. వంతెన డాకీ పట్టణంలో ఉంది. అందుకే డాకీ రూట్ బ్రిడ్జిగా వ్యవహారంలోకి వచ్చింది. ఇలాంటి వంతెనలు డాకీ పట్టణంలో మాత్రమే కాదు. మేఘాలయలో చాలా చోట్ల విస్తారంగా ఉంటాయి. కానీ మేఘాలయ పర్యటనకు వెళ్లిన వాళ్లు తప్పకుండా డాకీ పట్టణంలోని రూట్ బ్రిడ్జి మీద నడిచి మురిసిపోతారు. ఎందుకంటే ఇది దేశానికి చివరి వంతెన. డాకీ దాటితే బంగ్లాదేశ్‌లో అడుగుపెడతాం. మనిషికి జీవన నైపుణ్యాలు అవసరాన్ని బట్టి వృద్ధి చెందుతాయనడానికి నిదర్శనం ఈ వంతెనలు. ఇనుము, సిమెంటు వంటి భవన నిర్మాణ సామగ్రిని తరలించడం సాధ్యం కాని చోట్ల ప్రకృతి ఇచ్చిన మెటీరియల్‌తో జనం తమకు అవసరమైన విధంగా మలుచుకోవడం అంటే ఇదే. మేఘాలయలో నివసించే ఖాసీ, జైంతియా తెగల వాళ్లు నదికి రెండు వైపులా ఉన్న రబ్బరు చెట్ల వేళ్లను ఒకదానితో మరొక దానిని జడలాగ అల్లుతూ ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుతో కలుపుతారు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి వంతెన రెడీ. సిమెంటు వంతెనలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు కానీ ఈ వేళ్ల వంతెనలను ఒకసారి అల్లితే వందేళ్లకు కూడా చెరగవు, పైగా మరింత దృఢమవుతూ ఉంటాయి. మరీ లేత వేళ్లను కాకుండా ఒక మోస్తరు ముదురు వేళ్లతో వంతెన అల్లుతారు. కాలం గడిచే కొద్దీ చెట్టు పెద్దదవుతుంది, వేళ్లు శక్తిపుంజుకుంటూ ఉంటాయి. మరో విచిత్రం ఏమిటంటే... ఈ వేళ్లు నది నీటిని అందుకోవడానికి మాన్గ్రోవ్లాగ పిల్ల వేళ్లను పెంచుకుంటాయి. కొత్త వంతెనలు మనం నడిచేటప్పుడు బరువుకు తగినట్లు ఊగుతుంటాయి. ముదురు వంతెనలు కదలవు. ఈ వంతెనల మీద నుంచి రాకపోకలు సాగించేది మనుషుల మాత్రమే కాదు, జింకలు, చిరుతపులులతోపాటు ఇతర జంతువులు కూడా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వంతెనల మీదనే వెళ్తాయి. ఇప్పటి వరకు వంతెన గొప్పదనాన్నే మాట్లాడుకున్నాం. కానీ ఉంగాట్ నదికి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విశేషణం ఉంది. మనదేశంలో అత్యంత పరిశుభ్రమైన నదుల్లో ఉంగాట్ నది ఒకటి. ఈ నదిలో పడవలో విహరిస్తుంటే నీటి కింద నేల అద్దంలో కనిపించినంత స్వచ్ఛంగా ఉంటుంది. వేళ్ల వంతెన మీద నడవడంతోపాటు పడవ ఎక్కి ఈ నదిలో విహరించడం కూడా గొప్ప అనుభూతి.రాముడు కూడా కట్టాడునది మీద చెట్ల వేళ్లతో వంతెన నిర్మించే నైపుణ్యం ఇతిహాస కాలం నాటిదని చెబుతారు. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు అడవుల్లో నివసించినట్లు చెప్పుకుంటాం. గంగానది తీరాన నివసించిన రోజుల్లో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరడానికి రాముడు, లక్ష్మణుడు నదిలో ఈదుతూ వెళ్లేవారని, ప్రతిరోజూ నది దాటడం సీతమ్మకు కష్టం కావడంతో ఆమె కోసం వంతెన నిర్మించారని చెబుతారు. గంగానది మీద రిషికేశ్ దగ్గర రామ్‌ఝాలా, లక్ష్మణ్ ఝాలా ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలంలో ఈ వంతెనలను ఇనుముతో పునర్నిర్మించారు. రిషికేశ్‌లో గంగానది మీద ఇప్పుడు మనకు కనిపించేవి కొత్త నిర్మాణాలు. వాకా మంజూలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..) -
National Tourism Day సోలో ట్రావెల్ సో బెటర్!
పర్యటనలకు మనదేశం పుట్టిల్లు. తీర్థయాత్రలు మన సంస్కృతిలో భాగం. పర్యటన... ఒక పాఠం... రచనకు అదే మూలం. జీవన వైవిధ్యత అధ్యయనానికి ఓ మాధ్యమం. పర్యటనలు ఒత్తిడి నుంచి సాంత్వన కలిగిస్తాయి.జీవితాన్ని కొత్తగా చూడడానికి కళ్లు తెరిపిస్తాయి.అణగారిన జీవితేచ్ఛను తిరిగి చిగురింప చేస్తాయి. అందుకే ఫ్రెండ్స్‌తో టూర్లు... ఫ్యామిలీ టూర్లు... అలాగే... మహిళల సోలో ట్రావెల్స్ కూడా పెరిగాయి. మహిళలు ఒంటరిగా పర్యటనలు చేయడానికి సందేహించాల్సిన అవసరమేలేదిప్పుడు. ప్రపంచంలో మనుషులందరినీ కలిపే భాష ఇంగ్లిష్. మనదేశంలో పర్యటనలైనా, విదేశీ పర్యటనలైనా ఇంగ్లిష్ భాష వస్తే చాలు. అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం లేక΄ోయినప్పటికీ మనకు అవసరమైన సమాచారాన్ని అడగగలగడం, చెప్పింది అర్థం చేసుకోవడం తెలిస్తే చాలు. సేఫ్టీ, సెక్యూరిటీ నియమాలను పాటిస్తూ ప్రయాణం కొనసాగిస్తే మహిళలు ఒంటరిగా ప్రయాణించినా సరే ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కావన్నారు రజని లక్కా.ఆత్మవిశ్వాసం ఉండాలి, కనీసం ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపించి తీరాలి. బిత్తర చూపులు చూస్తే మోసగించేవాళ్లు అక్కడిక్కడే ప్రత్యక్షమవుతారు. మరో తప్పనిసరి జాగ్రత్త ఏమిటంటే సహ ప్రయాణికులతో కూడా డబ్బు లావాదేవీలు చేయకూడదు. అలాగే పర్యటనను ఆస్వాదించాలంటే లగేజ్ తక్కువగా ఉండాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. సోలోగా పర్యటనకు వెళ్లిన వాళ్లు ఇంట్లో వాళ్లకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలి. అయితే లైవ్ లొకేషన్స్ ఇతరులకు ఎవ్వరికీ షేర్ చేయవద్దు. సోషల్‌మీడియాలో లైక్‌ల కోసం తాపత్రయపడి టూరిస్ట్ ప్లేస్‌లో ఫొటోలు తీసుకుని గంటకో పోస్ట్ పెడుతూ ఉంటే మన కదలికలు ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలిసిపోతుంటాయి. మనల్ని ఎవరైనా రహస్యంగా వెంటాడుతున్నట్లయితే చేజేతులా వారికి దారి చూపించినట్లవుతుంది. పర్యటన వివరాలను సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో షేర్ చేయాలనుకుంటే పర్యటన పూర్తయి ఇంటికి వచ్చిన తర్వాత పోస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో ఒంటరిగా ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు జెన్నిఫర్. మనవాళ్లకు అడ్వెంచర్ టూర్లు చేయడం కంటే నియమాలను ఉల్లంఘించడంలో సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. ఫొటోగ్రఫీ నిషేధం అన్న చోట ఫొటోలు తీసుకుంటారు. సెక్యూరిటీ కళ్లు కప్పి నిషేధిత ప్రదేశాల్లోకి, డేంజర్ జోన్లలోకి దొంగచాటుగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాలు ప్రమాదకరం మాత్రమే కాదు నేరం కూడా. పర్యటనను ఆస్వాదించడం కూడా ఒక కళ. ఎప్పటికీ వన్నె తగ్గని కళ. (టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి)మనదేశం ప్రపంచానికి ప్రతీక కశ్మీర్లో తప్ప సోలో ట్రావెలర్‌గా మరెక్కడా నాకు ఇబ్బంది ఎదురుకాలేదు. తమిళనాడు ప్రజలు సింపుల్‌గా ఉంటారు. 76 దేశాల్లో పర్యటించిన తరవాత నాకనిపించిందేమిటంటే... ప్రపంచంలో ఉన్నవన్నీ మనదేశంలో ఉన్నాయి. మనదేశంలో లేనిది ప్రపంచంలో మరెక్కడా లేదు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతం బొలీవియాను తలపిస్తుంది. మన దగ్గర ఎడారులు, హిమాలయాలు, బీచ్‌లు ఒక్కొక్కటి ఒక్కోదేశంలో ప్రత్యేకమైన టూరిస్ట్ ప్లేస్‌ను తలపిస్తాయి. ఆర్కిటెక్చర్ పరంగా తమిళనాడు ఆలయాలు, రాజస్థాన్ కోటలకు ప్రపంచంలో మరేవీ సాటి రావు.- పొనుగోటి నీలిమ, ట్రావెలర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇదీ చదవండి: ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!ట్రావెల్ లైట్... ట్రావెల్ సేఫ్ ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతటా పర్యటించాను. ఏడు దేశాలు కూడా చూశాను. మనల్ని మనం మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగింది పర్యటన ద్వారానే. సోలో ట్రావెల్ అయితే మన అభిరుచికి తగినట్లు టూరిస్ట్ ప్రదేశాలను ఎంచుకోవచ్చు. ఇప్పుడు పర్యటనలకు సౌకర్యాలు బాగున్నాయి. సోలో ట్రావెల్లో అన్నీ మనమే సమకూర్చుకోవడం కష్టం అనిపిస్తే టూర్ ΄్యాకేజ్లో వెళ్లవచ్చు. ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశంలో స్థానికులతో కలిసి΄ోతున్నట్లుగా ఉండాలి. మనల్ని మనం ఎక్స్΄ోజ్ చేసుకునే ప్రయత్నం చేయరాదు. ఆ ప్రదేశానికి సరి΄ోలని వస్త్రధారణ, మాటల ద్వారా ఇతరుల దృష్టి మన మీద సులువుగా పడుతుంది. ప్రమాదాలు కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. సోలో ట్రావెల్ చేసే మహిళలు జాగ్రత్తగా ఉండాల్సింది ఈ విషయంలో మాత్రమే. – జెన్నిఫర్ ఆల్ఫాన్స్, డైరెక్టర్ సురక్షితంగా వెళ్లిరావచ్చు! ఒంటరి పర్యటనలు ఆస్వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. కెనడాలో మాంట్రియల్లో నేను ప్రయాణించిన టూరిస్ట్ బస్‌లో తొమ్మిది దేశాల వాళ్లున్నారు. అంతమందిలో ఇద్దరు మినహా అంతా సోలో ట్రావెలర్సే. అయితే వెళ్లే ముందు పర్యటనకు వెళ్లే ప్రదేశం గురించి ్ర΄ాథమిక వివరాలైనా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెంట్, జీపీఎస్ సౌకర్యాలున్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ధైర్యంగా ఒంటరి ప్రయాణాలు చేయవచ్చు. భద్రంగా వెళ్లి, సంతోషంగా తిరిగి రాగలిన పరిస్థితులున్నాయి. – రజని లక్కా, సోషల్ యాక్టివిస్ట్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ : డెస్టినేషన్ టూరిజం
సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగానే కాకుండా విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించడానికి వినూత్నంగా హెలీ–టూరిజం, సీ టూరిజం అభివృద్ధి చేశామని కేరళ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సజీవ్ కే.ఆర్ తెలిపారు. కేరళ ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని తాజ్ డెక్కన్ వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సజీవ్ కేరళ పర్యాటక విశేషాలను వెల్లడిస్తూ.. ఇప్పటికే మంచి ఆదరణ ఉన్న పర్యాటక ప్రాంతాలతో పాటు బేకల్, వయనాడ్, కోజికోడ్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలను పరిచయం చేయడం పై దృష్టి సారించామని అన్నారు. నూతన ప్రాజెక్టులతో పాటు బీచ్, హిల్ స్టేషన్స్, హౌస్బోట్లు, బ్యాక్‌వాటర్ విభాగం వంటి అంశాలు సందర్శకులకు హాట్స్పాట్లుగా మారాయన్నారు. కేరళలో పర్యాటకుల సంఖ్య 2022లో పెరిగిందని, 2023 నుంచి ఈ ఆదరణ రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. గతేడాది మొదటి ఆరు నెలల్లో 1,08,57,181 దేశీయ పర్యాటకులు రావడం విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేరళ కళాకారులు మోహినియాట్టం, కథక్, కత్తిసాము వంటి సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఈ వేదికగా బెంగళూరు, అహ్మదాబాద్, చండీగఢ్, ఢిల్లీ, జైపూర్, చెన్నై, కోల్‌కతా తదితర ప్రాంతాలకు చెందిన పర్యాటక రంగ సంస్థలు, ప్రముఖులు బీ టు బీ సమావేశాల్లో పాల్గొన్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 21 వరకూ కనకక్కున్ను ప్యాలెస్‌లో నిషాగంధి నృత్యోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో దేశ వ్యాప్తంగా ప్రఖ్యాత నృత్యకారులు మోహినియాట్టం, కథక్, కూచిపూడి, భరతనాట్యం, మణిపురి వంటి శాస్త్రీయ నృత్య రూపాలను ప్రదర్శిస్తారు. జనవరి 23–26 వరకూ కోజికోడ్ బీచ్‌లో ప్రసిద్ధ కేరళ సాహిత్య ఉత్సవం నిర్వహించనున్నారు. ఇందులో 12కి పైగా దేశాల నుంచి 400 మంది ప్రముఖులు పాల్గోనున్నారు. అంతేకాకుండా సుమారుగా 200 సదస్సులు జరగనున్నాయి. వీటిలో విలాసం, విశ్రాంతిని, కేరళ డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి అంశాలు ప్రధానంగా నిలువనున్నాయి. -
సేఫ్ లడకీ దేశాన్ని చుట్టేస్తోంది!
కాళ్లకు చక్రాలుంటే బావుణ్ణు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దేశమంతా చుట్టేయవచ్చు. ఈ కోరిక చాలామందికే ఉంటుంది. తమిళనాడుకి చెందిన సరస్వతి అయ్యర్ మాత్రం ఈ మాటను నిజం చేస్తోంది. నిజం చేయడమంటే కాళ్లకు చక్రాలు కట్టుకోలేదు కానీ కాళ్లకు పని చెబుతోంది, చక్రాలున్న వాహనాల్లో హిచ్‌హైకింగ్ (ఆ దారిలో వెళ్లే వాహనాల్లో లిఫ్ట్ అడుగుతూ వెళ్లడం) చేస్తూ పర్యటిస్తోంది. దేశంలో ఆ మూల నుంచి ఈ మూలకు ఈ మూల నుంచి ఆ మూలకు అటూ ఇటూ పర్యటించేసింది. ఉమన్ సోలో ట్రావెల్ ఒక ట్రెండ్‌గా మారిన ఈ రోజుల్లో సోలో ట్రావెల్‌తోపాటు జీరో బడ్జెట్ ట్రావెల్ కూడా సాధ్యమేనని నిరూపించింది సరస్వతి అయ్యర్.జీవితాన్ని చదివేస్తోంది!సరస్వతి అయ్యర్ రెండేళ్ల కిందట ఉద్యోగం నుంచి విరామం తీసుకుంది. ఉద్యోగం చేయడానికి పుట్టలేదు, ఇంకా ఏదో సాధించాలనుకుంది. దేశమంతా చుట్టి వచ్చిన తర్వాత తన గురించి తాను సమీక్షించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ప్రయాణం కట్టింది. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆమె దగ్గర ఉన్నది రెండు జతల దుస్తులు, ఒక గుడారం, ఫోన్ చార్జింగ్ కోసం ఒక పవర్ బ్యాంక్. ఈ మాత్రం పరిమితమైన వనరులతో ఆమె పర్వత శిఖరాలను చూసింది. మారుమూల గ్రామాలను పలకరించింది. దేవాలయాల్లో ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించింది. బస కోసం ఆలయ్ర ప్రాంగణాలు, ఆశ్రమాలు, ధర్మశాలలను ఎంచుకుంది. భోజనం కూడా అక్కడే. ఎక్కడైనా శ్రామికులు పని చేస్తూ కనిపిస్తే వారితో కలిసి పని చేస్తోంది. వారితో కలిసి భోజనం చేస్తోంది. పొలంలోనే గుడారం వేసుకుని విశ్రమిస్తోంది. ఈ పర్యటన ద్వారా ఆమె ఇస్తున్న సందేశం మహిళలు సోలో ట్రావెల్ చేయగలరని నిరూపించడం మాత్రమే కాదు. మనదేశంలో మహిళలకు ఉన్న భద్రతను చాటుతోంది. ఒక సాహసం చేయాలంటే అది అంత ఖరీదైనదేమీ కాదని. అలాగే... ఒక పర్యటన జీవిత దృక్పథాన్ని మార్చేస్తుందనే జీవిత సత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది సరస్వతి అయ్యర్.(చదవండి: నృత్యం చిత్తరువు అయితే..!) -
ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి
హిరణ్యకశిపుడి ఆగడాలను అంతమొందించడానికి భక్త ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించడానికి శ్రీహరి ఎత్తిన అవతారమే నరసింహావతారం. ఆ నృసింహ దేవుడు తన ఉనికిని చాటుకోవడానికి అనేక క్షేత్రాలలో అవతరించాడు. అలాంటి పుణ్య క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది ఉన్నాయి. వాటినే మనం నవ నరసింహ క్షేత్రాలని పిలుస్తున్నాం.. ఆ నవ నరసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా మల్లూరు హేమాచల లక్ష్మి నరసింహ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. వరంగల్ జిల్లా మంగ పేట మండలంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామి హేమాచల లక్ష్మి నరసింహస్వామిగా పూజాదికాలు అందుకుంటున్నాడు. సంతాన, ఆరోగ్య ప్రదాతగా విశేష ఖ్యాతిగడించాడు స్వామి. వరంగల్ పట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అటవీ వనాలు కొండలు మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. మల్లూరు గ్రామానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ఆలయం హేమాచలం అనే కొండ మీద అలరారుతోంది. హేమాచల నరసింహ స్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త శత్రు బాధలు తీరుతాయంటారు.ఇక్కడి స్వామి వారి మూర్తి అయిదు వేల సంవత్సరాల నాటిదని ఇక్కడి ఆధారాల ద్వార తెలుస్తోంది. సాక్షాత్తు దేవతలే ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించినట్లు చెబుతారు. గర్భాలయంలో స్వామి వారి మూర్తి మానవ శరీరంలా మెత్తగా దర్శనమిస్తుంది . స్వామి వారి ఛాతీ మీద రోమాలు దర్శనమిస్తాయి. అలాగే స్వామి వారి శరీరాన్ని ఎక్కడ తాకినా మెత్తగా ఉంటుంది. ఉదర భాగం కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండి.. మనుషులకు వచ్చినట్టే చెమట కూడా వస్తుంది. స్వామి వారి నాభి భాగంలో ఓ రంధ్రం దర్శనమిస్తుంది. దీనినుంచి నిరంతరం ఓ ద్రవం కారుతుంటుంది. దీనిని అదుపు చేయడానికి ఆ భాగంలో గంధాన్ని పూస్తారు. పూర్వకాలంలో స్వామి వారి విగ్రహాన్ని తరలించినపుడు, బొడ్డు దగ్గర ఇలా రంధ్రం పడిందంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ బొడ్డు భాగంలో ఉంచిన గంధాన్నే ప్రసాదంగా ఇస్తారు.ఆరోగ్యామృతం ఆ నీరుఇక స్వామివారి పాదాల చెంత నుంచి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు. ఈ నీరు కొద్ది కొద్దిగా కొన్ని రోజుల ΄ాటు తాగితే అన్ని రోగాలూ తగ్గిపోతాయనీ ఆ జలం సర్వ రోగ నివారిణి అనీ, భక్తులు విశ్వసిస్తారు స్వామి పాదాల నుంచి వచ్చే ఆ నీరు చింతామణి జల పాతాన్ని సమీపించే లోపు అనేక ఔషధ విలువలు గల చెట్ల క్రింది నుండి రావడం వల్ల ఆ నీటికి అంతటి శక్తి పెంపొందిందని అంటారు. రాణి రుద్రమదేవి అనారోగ్యానికి గురైన సమయంలో ఈ జలపాతంలోని నీటిని తాగడంతో ఆమె అనారోగ్యం నుంచి కోలుకుందని, ఆ తర్వాత అక్కడి నీటి విశిష్ఠత తెలుసుకున్న రుద్రమదేవి ఆ జలపాతానికి చింతామణి అనే పేరు పెట్టింది. చింతామణి జలధార నీటిని ఇప్పుడు కూడా విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు స్థానికులు, క్షేత్రాన్ని సందర్శించిన వారు. ఈ జలపాతానికి సమీపంలో మహా లక్ష్మి అమ్మవారి పురాతన మందిరం ఉంది. చింతామణి జల పాతానికి సమీపంలో మరో చిన్ని జల పాతం ఉంది.ఎలా చేరుకోవాలి?ములుగు జిల్లాలోని మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో హేమాచల నరసింహస్వామి ఆలయం ఉంది. మల్లూరు క్షేత్రానికి వరంగల్ నుంచి నేరుగా చేరుకోవచ్చు. అలాగే ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణానికి కూడా ఇది సమీపంలో ఉండడం వల్ల మణుగూరు నుంచి కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.– భాస్కర్ -
త్యాగమయి చిత్తోర్ఘర్ పన్నా దాయి : ఆసక్తికర విశేషాలు
రాజస్థాన్, చిత్తోర్ఘర్... పేరు వినగానే మేవార్‌రాజుల ఘనచరిత్ర కళ్ల ముందు మెదులుతుంది. రాణి పద్మిని త్యాగం గుర్తు వస్తుంది. పద్మావత్ సినిమా తర్వాత చిత్తోర్ ఘర్ పేరు అనేక వివాదాలకు, విచిత్ర భాష్యాలకు నెలవైంది. సినిమాలో చూసిన చిత్తోర్ఘర్ కోటను స్వయంగా చూడడం కూడా అవసరమే. చిత్తోర్ఘర్ చరిత్రలో ఉన్న మహిళ రాణి పద్మినిది మాత్రమే కాదు. ఈ కోటలో చరిత్ర సృష్టించిన ముగ్గురు. భక్త మీరాబాయి, రాణి పద్మిని, పన్నాదాయి. భక్త మీరాబాయి... కృష్ణుడి భక్తురాలిగా సుపరిచతమే. ఇక పన్నా దాయి (Panna Dhai) మాత్రం సినిమాటిక్ అట్రాక్షన్ లేని పాత్రకావడంతో చరిత్రపుటల్లో అక్షరాలుగా మాత్రమే మిగిలిపోయింది. త్యాగమయి పన్నారాజపుత్ర రాజు రాణా సంగా భార్య రాణి కర్ణావతి దగ్గర దాదిగా పని చేసింది పన్నాదాయి. పిల్లల్ని పెంచే బాధ్యత ఆమెది. రెండవ ఉదయ్ సింగ్ చంటిబిడ్డగా ఉన్నప్పుడు కోట మీద దాడి జరిగింది. ఉదయ్ సింగ్‌ను కాపాడడానికి శత్రువుల దృష్టి మళ్లించడానికి ఊయలలో తన బిడ్డను పెట్టి ఉదయ్‌సింగ్‌ను భద్రంగా కోట నుంచి బయటకు పంపించింది. రాజ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమకు, త్యాగానికి గుర్తుగా కోట లోపల ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కోటలో రాణా కుంభ కట్టిన విజయ్ స్తంభ్, రాణి పద్మిని ప్యాలెస్ ముఖ్యమైనవి. అల్లావుద్దీన్ ఖిల్జీ అద్దంలో రాణిని చూసిన ప్రదేశం ముఖ్యమైనది. పద్మిని తన ప్యాలెస్ మెట్ల మీద కూర్చుంటే, ఆమె ప్రతిబింబం... ప్యాలెస్ మెట్లకు అభిముఖంగా ఉన్న చిన్న బిల్డింగ్‌లోని అద్దంలో కనిపిస్తుంది. ఖిల్జీ ఆ ప్రతిబింబాన్ని చూసిన అద్దం ఇప్పటికీ ఉంది. జోవార్ గద్దెరాణి పద్మిని అందచందాలను విని ఆశ్చర్యపోయిన ఖిల్జీ ఆమె కోసమే దండెత్తి యుద్ధం చేశాడు. రాజ్యాన్ని ధ్వంసం చేశాక కూడా కోట స్వాధీనం కాకపోవడంతో రాణి పద్మినిని ఒకసారి చూసి వెళ్లిపోతానని కోరాడని, అప్పుడు మంత్రివర్గ ప్రముఖులు ఆమెను స్వయంగా చూపించకుండా అద్దంలో చూపించారని గైడ్లు చె΄్తారు. చూసి వెళ్లిపోతానన్న ఖిల్జీ ఆ తర్వాత మాటతప్పి కోటలోకి ఆహార పదార్థాలు అందకుండా దిగ్బంధించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు పద్మినితో పాటు నాలుగు వేల మంది మహిళలు నిప్పుల్లో దూకి ప్రాణత్యాగం(జోవార్) చేసిన ఆ స్థలాన్ని చూపించి ఈ వివరాలన్నీ చెబుతారు. కోట లోపల శివాలయం, జైనమందిరం ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాలు, ప్యాలెస్‌లు, గార్డెన్లు, జ్ఞాపక నిర్మాణాలు ఏవైనా సరే అందులో ఇమిడిన నైపుణ్యానికి తలవంచి నమస్కరించాల్సిందే. -
మది నిండుగా మహా కుంభమేళా!
మహాకుంభమేళా ఆర్ట్ వర్క్‌తో అందమైన రూపాన్ని నింపుకుంది. కళాకారులు తమదైన శైలిలో భారతీయ సంస్కృతిని కళ్లకు కడుతున్నారు. రికార్డులు కొల్లగొడుతున్నారు. మహాకుంభమేళా ఈవెంట్‌కు దాదాపు 40 – 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా.రూపు మారిన రైల్వే స్టేషన్లుఅధిక సంఖ్యలో భక్తులు రైలు ప్రయాణం ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల రైల్వే స్టేషన్లు హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందిన ఆకర్షణీయమైన కుడ్యచిత్రాలతో అందమైన హబ్‌లుగా మారిపోయాయి. రామాయణం, కృష్ణ లీల, లార్డ్ బుద్ధ, శివశక్తి, గంగా హారతి, మహిళా సాధికారత.. వంటి పౌరాణిక ప్రతిబింబాలను అందించడానికి థీమ్‌లను ఎంపిక చేశారు. యాత్రికులకు ఆధ్యాత్మిక వారసత్వాన్ని సజీవంగా అందించడానికి, స్వాగతం పలకడానికి మన సంప్రదాయానిన ఈ విధంగా కళ్లకు కట్టారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్, నైని జంక్షన్, ఫఫామౌ, ప్రయాగ్ జంక్షన్, ఝూన్సీ స్టేషన్, రాంబాగ్ స్టేషన్, చెయోకి, సంగం, సుబేదర్‌గంజ్, ప్రయాగ్‌రాజ్‌తో సహా ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రైల్వే స్టేషన్లను ’పెయింట్ మై సిటీ’ డ్రైవ్ కింద సుందరీకరించింది. లోతైన సంస్కృతిగురు–శిష్య బంధం, విజ్ఞానం, పరిత్యాగం సామరస్య సమ్మేళనంతో సహా ఒక లోతైన సంప్రదాయాలను నగరం లోపల గోడలపై కళాకారులు చిత్రించారు. ఈ శక్తివంతమైన ఈ కుడ్యచిత్రాలు ప్రతి మూల మహాకుంభ వైభవంతో ప్రతిధ్వనిస్తుందనడానికి నిదర్శనంగా నిలిచాయి. ‘రామ నామం’ మహాకుంభంఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ మేళా సందర్భంగా చాలా మంది కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. మహాకుంభంలో ముఖ్యమైన ఆచారంగా ఉన్న అమృత కలశాన్ని కళాకారిణి ప్రతిభాపాండే ‘రామ నామం’తో చిత్రించింది. ‘ఈ కుంభ కళశాన్ని మహాకుంభ మేళాకు అంకితం చేస్తున్నాను. ఈ కళశాన్ని పూర్తి చేయడానికి ఏడు రోజులు పట్టింది. ఇది నాకు ధ్యాన వ్యాయామంలా ఉపయోగపడింది. గృహిణిగా ఇంటి పనులను త్వరగా పూర్తి చేసుకొని, పగలు–రాత్రి ఈ రామ కళశ కుంభాన్ని చిత్రించాను’ అని చెబుతోంది ఈ చిత్రకారిణి.వరల్డ్ లార్జెస్ట్ రంగోళి రికార్డ్ఇండోర్కు చెందిన శిఖా శర్మ నాయకత్వంలో రూపొందించిన అతి పెద్ద మహాకుంభ మేళా రంగోలీ లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో యమునా క్రిస్టియన్ కళాశాల ప్రాంగణంలో 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 11 టన్నుల సహజ రంగులను ఉపయోగించి, 72 గంటలలో శిఖా శర్మ, ఆమె బృందం ఈ రంగోలీని పూర్తి చేశారు. నదీ జలాలు, జన సంద్రం, పడవలు, భారీ సాధువు బొమ్మను ఇందులో చిత్రించారు. (చదవండి: 'ఉనకోటి': నేలకు దిగివచ్చిన కైలాసం..!) -
'ఉనకోటి': నేలకు దిగివచ్చిన కైలాసం..!
నేలకు దిగివచ్చిన కైలాసం. ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ. త్రిపురలోని అందమైన పర్యాటక ప్రదేశం. ప్రకృతి ఒడిలో కొలువైన భారీ శిల్పాలు. హెరిటేజ్ సైట్ హోదా సొంతమైన చరిత్ర.ఈశాన్య రాష్ట్రాల టూర్లో ప్రకృతి పచ్చదనానిదే పైచేయి. జనారణ్యానికి దూరంగా వెళ్లే కొద్దీ అచ్చమైన స్వచ్ఛత ఒడిలోకి చేరుకుంటాం. చెట్లు చేమలు నిండిన పచ్చటి కొండలు బారులుతీరి ఉంటాయి. రఘునాథ హిల్స్‌లో పచ్చదనం లోపించిన కొండవాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరికించి చూస్తే అందమైన రూపాలు కనువిందు చేస్తాయి. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, దుర్గాదేవి, గంగ, ఇతర కైలాసగణమంతా కొలువుదీరినట్లు ఉంటుంది. ఇంతటి భారీ శిల్పాలను ఎవరు చెక్కి ఉంటారు? ఎప్పుడు జరిగిందీ వింత? ఉనకోటి శిల్పాల సముదాయాన్ని ఏడు నుంచి తొమ్మిది శతాబ్దాల మధ్యలో చెక్కి ఉండవచ్చనేది ఆర్కియాలజిస్టుల అంచనా. ‘కల్లు కుమ్హార్’ అనే గిరిజన శిల్పకారుడు ఈ శిల్పాలను చెక్కినట్లు స్థానికులు చెబుతారు. కైలాస పర్వతంలోని శివపార్వతులను దర్శించుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, ఆ రూపాలను, కైలాసాన్ని కళ్లకు కట్టడానికే ఈ శిల్పాలను చెక్కాడని చెబుతారు.క్రీ.శ 16వ శతాబ్దంలో కాలాపహాడ్ అనే మొఘలు గవర్నర్ భువనేశ్వర్‌లోని శివుడిని, ఉనకోటికి సమీపంలో ఉన్న తుంగేశ్వర శివుడిని ధ్వంసం చేశాడని, ఈ ప్రదేశం మీద దాడిచేయడానికి అతడు చేసిన ప్రయత్నం కుదరక వదిలేసినట్లు చెబుతారు. ఇక్కడ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ‘అశోకాష్టమి మేళా’లో ఈశాన్యరాష్ట్రాలన్నింటి నుంచి వేలాదిగా భక్తులు పాల్గొంటారు. జనపద కథనం...శివుడితోపాటు కోటిమంది కైలాసగణం కాశీయాత్రకు బయలుదేరింది. ఈ ప్రదేశానికి వచ్చేసరికి చీకటి పడింది. ఆ రాత్రికి ఈ అడవిలోనే విశ్రమించారంతా. తెల్లవారక ముందే నిద్రలేచి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని, ఆలస్యమైతే రాళ్లలా మారిపోతారని, నిద్రకుపక్రమించే ముందు శివుడు అందరినీ హెచ్చరిస్తాడు. చెప్పిన సమయానికి శివుడు తప్ప మరెవరూ నిద్రలేవలేకపోవడంతో మిగిలిన వారంతా శిలలుగా మారిపోయారు. కోటి మంది బృందంలో శివుడు మినహా మిగిలిన వారంతా శిలలు కావడంతో ఈ ప్రదేశానికి ‘ఉనకోటి’ అనే పేరు వాడుకలోకి వచ్చిందని స్థానికులు ఆసక్తికరమైన కథనం చెబుతారు. ఆ కథనం ప్రకారమైతే ఈ శిల్పాల సముదాయంలో శివుడి శిల్పం ఉండకూడదు, కానీ శివుడి శిల్పం కూడా ఉంది. దేశంలో అత్యంత పెద్ద శివుడి శిల్పం ఇదే. వాస్తవాల అన్వేషణకు పోకుండా ఆ శిల్పాల నైపుణ్యాన్ని ఆస్వాదిస్తే ఈ టూర్ మధురానుభూతిగా మిగులుతుంది. పెద్ద శివుడు ఈ భారీ శివుడి పేరు ఉనకోటేశ్వర కాలభైరవుడు. విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంటుంది. తలమీద ఎంబ్రాయిడరీ చేసిన తలపాగా ధరించినట్లు చెక్కారు. ఆ తలపాగా ఎత్తు పది అడుగులుంది. తలకు రెండు వైపులా సింహవాహనం మీద దుర్గాదేవి, గంగామాత శిల్పాలుంటాయి. నంది విగ్రహం సగానికి నేలలో కూరుకుపోయి ఉంటుంది. గణేశుడు ప్రశాంతంగా మౌనముద్రలో ఉంటాడు. ఈ శిల్పాలు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్నాయి. ప్రధానమైన వాటిని చూడడంతోనే మనకు శక్తి తగ్గిపోతుంది. కొన్ని శిల్పాలను సమీప గ్రామాల వాళ్లు ఇళ్లకు పట్టుకుపోగా మిగిలిన వాటి కోసం ఇండియన్ ఆర్కియాలజీ సర్వే నోటిస్ బోర్డులుంటాయి. ఏఎస్ఐ అడవినంతా గాలించి, పరిశోధించింది. ఏఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ప్రదేశం హెరిటేజ్ సైట్ల జాబితాలో చేరింది. యునెస్కో గుర్తించి సర్టిఫికేట్ జారీ చేసే లోపు చూసివద్దాం.ఉనకోటి ఎక్కడ ఉంది!త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి 178 కి.మీ.ల దూరంలో ‘కైలాస్‌హర’ పట్టణానికి దగ్గరగా ఉంది. ఎలా వెళ్లాలంటే... సమీప విమానాశ్రయం అగర్తలలో ఉంది. సమీప రైల్వేస్టేషన్ కుమార్‌ఘాట్‌లో ఉంది. ఇది ఉనకోటికి 20 కి.మీ.ల దూరంలో ఉంది.ఎప్పుడు వెళ్లవచ్చు!ఇది పర్వతశ్రేణుల ప్రదేశం కాబట్టి వర్షాకాలం మంచిది కాదు. అక్టోబర్ నుంచి మే నెల మధ్యవాతావరణం అనువుగా ఉంటుంది. – వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: భావోద్వేగాల 'కిజిక్ తివాచీ'..!) -
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ పోషల్ మీడియాలో బాగా పాపులర్. తాజాగా '2024లో నేను ఎంత ఖర్చు చేశాను' అనే క్యాప్షన్‌తో ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన డబ్బులో ఎక్కువ భాగం ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించడానికి ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే తన ప్రయాణాలకు రూ. 50 లక్షలు ఖర్చుపెట్టినట్టు తెలిపింది. అంతేకాదు రూ. 22 లక్షలతో హ్యందాయ్ కారు కొనుక్కొంది. దీంతో నోరెళ్ల బెట్టడం ఫాలోయర్ల వంతైంది. అంత డబ్బు ఎక్కడినుంచి నెటిజన్లు వచ్చిందంటూ ప్రశ్నలు కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శరణ్య అయ్యర్ పోస్ట్ వైరల్ అయ్యింది. 1.3 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అసలింతకీ స్టోరీ ఏంటంటే..ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 5లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ట్రావెల్ వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక రీల్‌ను షేర్ చేసింది.ఇందులో ఒక్క ప్రయాణానికే రూ. 50 లక్షలు.ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత ఏడాదిలో ఆరుకుపైగా దేశాలను చుట్టివచ్చిందట. ఇందులో భాగంగా విమాన ఖర్చులకే రూ. 5 లక్షలు వెచ్చించినట్టు చెప్పుకొచ్చింది. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం వసతి మిగతా ఖర్చులున్నట్టు తెలిపింది. దీంతోపాటు కొత్త హ్యుందాయ్ కారును కూడా కొనుగోలు చేసినట్లు శరణ్య వెల్లడించింది. గత ఏడాది కష్టతరంగా గడిచినప్పటికీ, ఎంతో సంతోషాన్ని, భరోసాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది. 2025లో ఇంత ఖర్చుపెట్టను.. కాస్త పొదుపు చేస్తానని కూడా తెలిపింది. ఇదీ చదవండి: ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్శరణ్య అయ్యర్ ఖర్చులుశరణ్య అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియో ప్రకారం, లావోస్ , థాయిలాండ్ ట్రిప్‌కోసం, 1 లక్ష, రూ. మదీరాకు 1.5 లక్షలు, రూ. తన తల్లిదండ్రులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు రూ.8 లక్షలు, రూ. గ్రీన్‌ల్యాండ్‌లో 3 లక్షలు, మూడుసార్లు ఐస్లాండ్ పర్యటన ఖర్చు రూ2.5 లక్షలు అయింది. అలాగే యూరప్ ట్రిప్ రూ. 60,000 ఖర్చు. అయితే క్యాసినోలో 40 వేలు గెలిచినట్లు పేర్కొంది.అంతేకాదు ఇంకా ఇన్సూరెన్స్ కవర్ చేయని వైద్య ఖర్చులపై 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిందట. ఈ మొత్తం ఖర్చులో ఫుడ్ రోజువారీ ఖర్చులు , షాపింగ్ ఖర్చులను తన జాబితాలో చేర్చలేదంటూ లెక్కలు చెప్పింది. View this post on Instagram A post shared by Sharanya Iyer | Travel (@trulynomadly) నెటిజన్లు ఏమన్నారంటే" ఇంత ఖర్చును భరించారు.. అదృష్టవంతులు.. ఇంతకీ మీ ఆదాయ వనరు ఏమిటి? అని ఒకరు. ఈ రీల్ తర్వాత పాపం మిగిలిన ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్లు బాధపడతారంటూ ఫన్నీగా కమెంట్ చేశారు. ఇంత తక్కువ బడ్జెట్‌తో ఐస్ల్యాండ్ని మూడుసార్లు ఎలా అబ్బా అని మరొకరు ప్రశ్నించగా, స్పాన్సర్లు లభించారంటూ సమాధానం చెప్పింది శరణ్య. -
ట్రా'వెల్నెస్' టిప్స్..!
నిన్నమొన్ననే జరిగిన క్రిస్మస్ సెలవుల కోసమని కొందరు, జనవరి మొదటిరోజు తమకు ఇష్టమైన వారిని కలవడం కోసం లేదా రాబోయే సంక్రాంతికి ఇంకొందరు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. కారణమేదైనా రకరకాల అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ప్రయాణాలు చేయాల్సిన ఆవశ్యకత ఉండనే ఉంటుంది. ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది. అన్నిటికంటే ముందుగా ప్రయాణం చేయబోయే ముందర తాము రెగ్యులర్‌గా సంప్రదించే జనరల్ ఫిజీషియన్‌ను తొలుత తప్పనిసరిగా కలవాలి. తాము వెళ్తున్న ప్రదేశం గురించి తెలపాలి. అక్కడ ఉండే వాతావరణానికి అనువుగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొని... ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్‌కు చెప్పి, ఆ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోవాలి. ఆ మేరకు డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేసిన ప్రకారం... తమకు అవసరమైన మందులను ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. ఉదాహరణకు హై–బీపీ, డయాబెటిస్, హై–కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు తాము ప్రయాణం చేసే కాలానికి అవసరమైనన్ని మందులను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సరిగ్గా తాము అనుకున్న వ్యవధికి అవసరమైనన్నే కాకుండా... వీలైతే కొద్దిగా ఎక్కువ మందులే తీసుకెళ్లడం మంచిది. ఉదాహరణకు ఆస్తమా బాధితులు ఎటాక్ వచ్చిన వెంటనే తాము తక్షణం వాడాల్సిన (ఎస్ఓఎస్) మందుల్ని వెంట ఉంచుకోవాలి. అలాగే వారు తమతోపాటు క్యారీ చేయాల్సిన ఇన్హేలర్స్, ప్రివెంటివ్ ఇన్హేలర్స్ను (వీలైతే ఒకటి రెండు ఎక్కువగానే) తీసుకెళ్లాలి. ఇది ఉదాహరణ మాత్రమే. ప్రయాణికులు తమ ఆరోగ్య సమస్యను బట్టి మందులు క్యారీ చేయాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు... అక్కడ ఉండే ఆరోగ్య పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన ముందస్తు టీకా మందులు (వ్యాక్సిన్స్) తీసుకోవాలి. ఉదాహరణకు ఆఫ్రికా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్లో ఫీవర్ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. ఆ దేశాలకు ప్రయాణం చేసేవారు ముందుగానే అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలి. గర్భవతులు తాము వాడాల్సిన మందులూ, అలాగే తీసుకోవాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లను తీసుకొని ఉండాలి. పిల్లలకు వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి వారు తీసుకోవాల్సిన మందుల్ని రెడీగా ఉంచుకోవాలి. ఆయా దేశాలే కాదు... కొన్ని సందర్భాల్లో తాము ప్రయాణం చేసే విమాన సంస్థలు సైతం కొన్ని ఆంక్షలు పెడుతుంటాయి. ‘‘ఫిట్ టు ఫ్లై’’ నిబంధనలుగా పేర్కొనే ఈ నిబంధనల గురించి ముందుగానే తెలుసుకోవాలి. దీంతో తమ ప్రయాణంలో రాబోయే సమస్యలను తెలుసుకుని, నివారించుకోవడం తేలికవుతుంది. తాము బస చేయబోయే చోట కొందరు పాస్ట్ ట్రావెల్ హిస్టరీ’ అడిగి తీసుకుంటూ ఉంటారు. అంటే... గతంలో ఏయే ప్రాంతాలు / దేశాలు తిరిగివచ్చారో అడిగి తెలుసుకుంటుంటారు. తమ పాస్ట్ ట్రావెల్ హిస్టరీ గురించి ఎవరికి వారు ముందుగానే సమీక్షించుకుని, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అయితే ప్రజలందరి సంక్షేమం కోసం తమ ట్రావెల్ హిస్టరీని పారదర్శకంగా సమర్పించడం ప్రయాణికులకూ మేలు. ఒక్కోసారి ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టడం... వారికే ఇబ్బందులు తెచ్చేందుకు అవకాశమిస్తుంది. ఇవే గాకుండా... తాము వెళ్లబోయే ప్రదేశంలో ఉండే వాతావరణానికి అనువుగా దుస్తులు, అక్కడ ఎదురవ్వబోయే సమస్యలకు అనువుగా ఏర్పాట్లు చేసుకుని వెళ్లడం మంచిది. ఇటీవల పిల్లలకూ, పెద్దలకు దాదాపుగా అందరికీ కళ్లజోళ్లు ఉంటున్నాయి. ఉన్న కళ్లజోడుకి తోడుగా మరొకటి అదనంగా తీసుకెళ్లడం మేలు. ఎందుకంటే జర్నీలో కళ్లజోడు పోయినా లేదా విరిగిపోయినా అప్పటికప్పుడు మరొకటి సమకూర్చుకోవడం ప్రయాణ సమయంలో కష్టమవుతుంది. మరొకటి అదనంగా (స్పేర్‌గా) పెట్టుకోవడం చాలావరకు ఉపకరిస్తుంది. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో ప్రయాణంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యల్ని తేలిగ్గానే అధిగమించవచ్చు. అందుకే కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ప్రయాణం మొదలుపెట్టడం చాలావరకు మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ∙ -
ప్రకృతి ప్రేమికులకు రా రమ్మని... స్వాగతం
గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు, గుట్టలపై ఉండే గిరిజన గూడేలు, ఆకుపచ్చని రంగులో ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్న కొండల అందాలను కనులారా వీక్షించాలని అనుకుంటున్నారా? అయితే, మీరు పాపికొండలు యాత్రకు వెళ్లాల్సిందే. భద్రాచలం సమీపాన పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి నిత్యం బోట్లు నడిపిస్తుండగా.. క్రిస్మస్, కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతి సెలవులు రానున్న నేపథ్యాన పర్యాటకుల రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యాన పాపికొండల అందాలు, యాత్ర మిగిల్చే తీయని అనుభవాలపై ప్రత్యేక కథనమిది.రెండు మార్గాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాపికొండల యాత్రను సందర్శించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటోది.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం వద్ద ఉన్న పోచమ్మ గండి పాయింట్ వద్ద నుంచి బోట్లో ప్రారంభమై.. పేరంటాలపల్లి వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తారు. రెండోది.. తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి ప్రారంభమయ్యే మార్గం. ఈ పాయింట్ తెలంగాణలోని భద్రాచలానికి సమీపాన ఉంటుంది. దీంతో పర్యాటకులు ఒకరోజు ముందుగానే చేరుకుని రామయ్యను దర్శించుకుని.. ఆపై పాపికొండలు యాత్రకు బయలుదేరుతారు.భద్రాచలం నుంచి ఇలా.. హైదరాబాద్ నుంచి పాపికొండల యాత్రకు రావాలనుకునే వారు ముందుగా భద్రాచలం చేరుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలానికి విరివిగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గంలో వచ్చే వారు కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రావాలి. ఇక్కడ వీలు చూసుకుని సీతారాముల దర్శనం చేసుకున్న తర్వాత.. భద్రాచలం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో బోటింగ్ పాయింట్ ఉన్న పోచవరం గ్రామానికి బయలుదేరవచ్చు. 70 కిలోమీటర్ల జలవిహారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి లేదా 5 గంటల మధ్యలో ముగుస్తుంది. పోచవరం ఫెర్రీ పాయింట్ వద్ద పర్యాటకులను ఎక్కించుకుని మళ్లీ అక్కడే దింపుతారు. సుమారు ఆరు గంటల పాటు 70 కిలోమీటర్లు గోదావరిలోనే జలవిహారం చేసే అద్భుత అవకాశం ఈ యాత్రలో పర్యాటకులకు కలుగుతుంది. పేరంటాలపల్లి సందర్శన పాపికొండల యాత్రలో పేరంటాల పల్లి వద్ద నున్న ప్రాచీన శివాలయం వద్ద బోటు ఆపుతారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుడిని గిరిజనులే నిర్వహిస్తున్నారు. గుట్ట పైనుంచి జాలువారే నది జలాన్ని తీర్థంగా పుచ్చుకుంటారు. యాత్ర ప్రారంభానికి ముందు లేదా తర్వాతైనా పోచవరానికి సమీపాన వీఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి రాముడి క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. షెడ్యూల్, ధరలు ఇలా.. పోచవరం వద్ద నుంచి ప్రారంభమయ్యే పాపికొండల యాత్రకు సంబంధించి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750గా ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. కళాశాల విద్యార్థులు గ్రూపుగా పర్యటనకు వస్తే.. వారికి రూ.850, ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.750 ప్యాకేజీ ధరగా ప్రకటించారు. అయితే శని, ఆదివారం, సెలవు దినాల్లో.. దీనికి అదనంగా రూ.100 వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీలోనే భోజన సౌకర్యాన్ని బోటు నిర్వాహకులు కల్పిస్తారు. భద్రగిరిలోని రామాలయం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బుకింగ్ కౌంటర్ల ద్వారా ఏజెంట్లు టికెట్లు విక్రయిస్తారు. ఇసుక తిన్నెల్లో విడిది.. రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణంలో గోదావరి ప్రవాహ శబ్దం, ఇసుక తిన్నెలు, వెన్నెల అందాలను ఆస్వాదించాలంటే వెదురు హట్స్‌ల్లో రాత్రి వేళ బస చేయాల్సిందే. పశ్చిమగోదావరి జిల్లాలోని సిరివాక అనే గ్రామం వద్ద పర్యాటకుల కోసం హట్స్ ఉన్నాయి. గుడారాలలో ఒక్కొక్కరికి రూ.4 వేలు, వెదురు కాటేజీల్లో అయితే రూ.5,500గా ధర నిర్ణయించారు. ఉదయం పోచవరం నుంచి వెళ్లి.. రాత్రికి సిరివాకలో బస చేయిస్తారు. అనంతరం మర్నాడు సాయంత్రానికి పోచవరానికి లాంచీలో చేరుస్తారు. రెండు రోజుల పాటు భోజన వసతి, ఇతర సౌకర్యాలను నిర్వాహకులే చూసుకుంటారు. ఈ టికెట్లు కూడా భద్రాచలంలో అందుబాటులో ఉంటాయి. పటిష్టమైన రక్షణ ఏపీలోని కచ్చలూరు లాంచీ ప్రమాదం అనంతరం పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. అన్ని బోట్లకు అనుసంధానం చేసిన శాటిలైట్ ఫోన్లు, వాకీటాకీలు, వాటిని నియంత్రించే బోటింగ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోలీసు, అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక శాఖ అధికారులు.. పర్యాటకుల ధ్రువీకరణ పత్రాలను సరిపోలి్చన తరువాతే బోటులోకి అనుమతిస్తారు. బోటులో లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రిని సిద్ధంగా ఉంచుతున్నారు.ఆహారం ఉదయం యాత్ర ప్రారంభమయ్యే సమయంలో అల్పాహారం, టీ అందిస్తారు. మధ్యాహ్న సమయాన బోటులోనే శాఖాహార భోజనంతో ఆతిథ్యాన్ని అందిస్తారు. సాయంత్రం యాత్ర ముగిసిన తరువాత మళ్లీ బోట్ పాయింట్ వద్ద స్నాక్స్, టీ అందజేస్తారు. పాపికొండల ప్రయాణంలో కొల్లూరు, సిరివాక, పోచవరం వద్ద ‘బొంగు చికెన్’ అమ్ముతారు. ఆకట్టుకునే వెదురు బొమ్మలు పేరంటాలపల్లి దగ్గర గిరిజనులు తయారు చేసిన వెదురు బొమ్మలు, వస్తువులు ఆకట్టుకుంటాయి. రూ.50 నుంచి రూ.300 వరకు ధరల్లో ఇవి లభిస్తాయి.👉పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు) -
కళాత్మక రాజసం జైపూర్ ఆర్ట్ సెంటర్
‘రండి, చూడండి, తినండి, కొనండి’ ఇది షాపింగ్ మాల్ చేసే హడావుడి కాదు. జైపూర్‌లోని సిటీ ప్యాలెస్ చేస్తున్న ఆర్టిస్టిక్ హంగామా. పింక్‌సిటీ జైపూర్‌లోని గంగోరి బజార్లో ఉంది సిటీ΄్యాలెస్. ఈ ప్యాలెస్ మొదటి గేట్ నుంచి లోపలికి ప్రవేశిస్తే ఒక విశాలమైన హాలు. అందులో ఇటీవల జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ ప్రారంభమైంది.రాజభవనాలంటే రాజుల కాలం నాటి వస్తువులకే పరిమితం కావాలా? కొత్తగా ఏదైనా చేయాలి అదే ఇది అంటున్నారు యువరాజు పద్మనాభ సింగ్, యువరాణి గౌరవికుమారి. రాజపుత్రుల ఘనత, కళాభిరుచి పరంపర కొత్తతరాలకు తెలియాలంటే కొత్త కళాకృతులకు స్థానం కల్పించాలి. వాటిని చూసిపోవడమే కాకుండా తమ వెంట తీసుకుని వెళ్లగలగాలి అంటున్నారామె. అందుకోసం జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ పేరుతో కళాకృతుల మ్యూజియం ఏర్పాటు చేశారు.సర్వతో రుచులుఈ ప్యాలెస్‌ను 18వ శతాబ్దంలో మహారాజా సవాయ్ రెండవ జయ్సింగ్ నిర్మించాడు. నిర్మంచాడనే ఒక్కమాటలో చెప్పడం అన్యాయమే అవుతుంది. ప్యాలెస్ అంటే రాళ్లు, సున్నంతో నిర్మించిన గోడలు కాదు. దేశంలోని రకరకాల నిపుణుల సమష్టి మేధ. పర్యాటకులు జైపూర్ కోటలను, రాజులు ఉపయోగించిన కళాకృతులను చూసి ముచ్చటపడితే సరిపోదు. అలాంటి వాటిని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లాలి. ఇలాగ కళాకృతుల తయారీదారులకు ఉపాధికి మార్గం వేయాలన్నారు గౌరవి కుమారి. అంతేకాదు... రాజస్థాన్ రుచులు ముఖ్యంగా జైపూర్‌కే పరిమితమైన వంటకాలను వడ్డించే సర్వతో రెస్టారెంట్ కూడా ప్రారంభించారు. ప్యాలెస్ అట్లీయర్ పేరుతో ఆభరణాల మ్యూజియానికి కూడా తెరతీశారు. ఇందులో స్థానిక చేనేతకారులు రూపుదిద్దిన చీరలు, సంప్రదాయ ఆభరణాలు, గృహోపకరణాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా రాజుల ప్యాలెస్ పర్యటనకు వెళ్లాలంటే కనీసం రెండు–మూడు గంటల సమయం కేటాయించాలి. బ్రేక్‌ఫాస్ట్ చేసి లోపల ప్రవేశిస్తే మధ్యాహ్నం భోజనం సమయానికి బయటకు రాగలుగుతాం.ఈ సమయాలను పాటించకపోతే ప్యాలెస్ విజిట్‌ని అర్థంతరంగా ముగించుకుని బయటపడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే ఈ సర్వతో రెస్టారెంట్. ప్యాలెస్ ఆవరణలో భోజనం చేయవచ్చు. సాధారణంగా ప్యాలెస్ విజిట్ హైటీ లేదా డిన్నర్ ప్యాకేజ్‌లలో టికెట్ మధ్యతరగతికి అందనంత ఎక్కువగా వేలల్లో ఉంటుంది. ఈ ప్రయోగం మాత్రం అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి జైపూర్ టూర్లో సిటీ ప్యాలెస్ విజిట్‌ని భోజన సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. -
మోతీ షాహీ మహల్ : ఐరన్ మ్యాన్ మెమోరియల్
మోతీ షాహీ మహల్... చారిత్రక నిర్మాణం. అహ్మదాబాద్ నగరంలో షాహీభాగ్లో ఉంది. ఇప్పుడది సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి దర్పణం. వల్లభాయ్ పటేల్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను వివరించే డిజిటల్ స్టూడియో అద్భుతం. డిజిటల్ స్టూడియో జైలు గదుల రూపంలో విభజించి ఉంటుంది. గదులకు ఉన్న ఊచలను పట్టుకుంటే ఒక్కొక్క ఘట్టం ఆడియోలో వినిపిస్తుంది. జాతీయోద్యమంలో భాగంగా పటేల్ జైలు జీవితం గడిపిన సంఘటనలతో పాటు ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో వినవచ్చు. వీటన్నింటినీ లేజర్ షోలో చూడవచ్చు. ఇక మ్యూజియంలో ఒక్కో గది ఒక్కో రకమైన వస్తువులతో అలరిస్తుంది. వర్తమానం, ఆహ్వానపత్రాలను పంపించిన ట్యూబ్‌లాంటి వెండి పెట్టెలున్నాయి. ఐరన్ మ్యాన్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేయించుకోవడానికి సిద్ధం చేసిన వెండితాపీలు లెక్కలేనన్ని ఉన్నాయి. మెమోరియల్ మ్యూజియం అంటే ఆ వ్యక్తి ఉపయోగించిన చెప్పులు, పెన్నులు, భోజనం చేసిన ప్లేట్లు, దుస్తులను మాత్రమే చూస్తుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్‌లో భారత జాతీయోద్యమం కనిపిస్తుంది. గాంధీ, నెహ్రూలతో పటేల్ కలసి ఉన్న ఫొటోలతోపాటు ఆయా సందర్భాల వివరణ కూడా ఉంటుంది. పటేల్ జీవితంలో ఉపయోగించిన వస్తువులు ఏయే సందర్భంగా ఉపయోగించారనే వివరాలు ఉండడంతో ఫ్రీడమ్ మూవ్మెంట్ క్షణక్షణమూ గుర్తుకు వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు పదిహేడేళ్ల వయసులో కొంత కాలం ఈ మహల్లో బస చేశాడు.ఇదీ చదవండి: వెళ్లిపోకు నా ప్రాణమా! బోరున విలపించిన సృజన షాజహాన్ విడిది వల్లభాయ్ పటేల్ మెమోరియల్ ఉన్న భవనం మోతీ షాహీ మహల్... మొఘలుల నిర్మాణాలను తలపిస్తుంది. ఈ షాహీ మహల్‌ని 17వ శతాబ్దంలో షాజహాన్ కట్టించాడు. షాజహాన్ యువరాజుగా ఈ ప్రదేశానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు దీనిని నిర్మించాడు, రాజ్యపర్యటనకు వచ్చినప్పుడు అతడి విడిది కూడా ఇందులోనే. ఆ తర్వాత బ్రిటిష్ ఉన్నతాధికారుల నివాసమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ భవనం రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్. గవర్నర్ నివాసానికి కొత్త భవనం కట్టిన తర్వాత 1978లో ఈ భవనాన్ని పటేల్ మొమోరియల్‌గా మార్చారు. నరేంద్రమోదీ గుజరాత్‌కి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2013లో ఈ మెమోరియల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటలైజ్ అయింది. మ్యూజియం అంతా తిరిగి చూసిన తర్వాత అదే ప్రాంగణంలో ఉన్న పటేల్ విగ్రహం దగ్గరకు వచ్చినప్పుడు ‘ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఇండియా’ అనే ఆత్మీయ ప్రశంసను గుర్తు చేసుకుంటూ ఓ నమస్కారం పెడతాం.ఆదివారం ఆటవిడుపుమోతీ షాహీ మహల్ చుట్టూ అందమైన గార్డెన్ మొఘలుల చార్భాగ్ నమూనాలో ఉంటుంది. దట్టమైన చెట్ల మధ్య పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. రంగురంగుల వాటర్ఫౌంటెయిన్ పిల్లలను అలరిస్తుంది. అహ్మదాబాద్ వాసులకు వీకెండ్ పిక్నిక్ ప్లేస్ ఇది. దాదాపుగా నగరంలోని స్కూళ్లన్నీ విద్యార్థులను ఏటా ఈ మ్యూజియం సందర్శనకు తీసుకువస్తుంటాయి. అహ్మదాబాద్ పర్యటనలో మిస్ కాకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ మెమోరియల్ భవనం లోపల మాత్రమే కాదు భవనం బయట పరిసరాలను కూడా ఆస్వాదించాలి. పచ్చటి ఉద్యానవనంలోని చెట్ల కొమ్మల మీద నెమళ్లు సేదదీరుతుంటాయి. చెట్ల మధ్య విహరిస్తూ తినుబండారాలను రుచి చూడాలంటే అనుమతించరు. చాటుగా తినే ప్రయత్నం చేసినా కోతులు ఊరుకోవు. మెరుపువేగంతో వచ్చి లాక్కెళ్తాయి. మ్యూజియం పర్యటనకు అనువైన కాలం అని ప్రత్యేకంగా అక్కరలేదు, కానీ అహ్మదాబాద్‌లో పర్యటించడానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనువుగా ఉంటుంది. కాబట్టి క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్లాన్ చేసుకోవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్‌కు దూరం ఐదు కిలోమీటర్లు మాత్రమే. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నృత్యంతో సేవ చేస్తున్న భారత సంతతి యువ కళాకారిణి
18 ఏళ్ల నర్తకి విశాఖ విజన్ 2020కి సహాయం చేయడానికి ఈ యేడాది నవంబర్ చివరిలో ఆస్ట్రేలియాలో భరతనాట్యాన్ని ప్రదర్శించింది. విశాఖ ప్రస్తుతం ప్రతిష్టాత్మక వాపా (వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్)లో బ్యాచిలర్ ఆఫ్ డ్యాన్స్ అభ్యసిస్తోంది. భారతదేశంలో చిదంబరం ఖసురేష్, షీజిత్ కృష్ణ, బ్రాగా బెస్సెల్ల వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందింది.ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగిన విశాఖ భారతీయ నృత్యాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకుంది. భారతీయ మూలాలుండటం వల్ల తనలో శాస్త్రీయ నృత్యం శ్వాసగా మారిపోయింది అంటోంది. ‘భావోద్వేగ మేల్కొలుపు – నవరస మోహన’ అనేది మన రోజువారీ పరస్పర చర్యలను ప్రభావితం చేసే, నిర్దేశించే భావోద్వేగాల తొమ్మిది వ్యక్తీకరణలపై ఆధారపడింది. వీటిని విశాఖ పుణికి పుచ్చుకుంది. సామాజిక మేల్కొలుపును కలిగించేలా ‘నిస్వార్ధ జీవి చెట్టు’ గురించి తన ప్రదర్శనలో వర్ణించింది.113 ఏళ్ల వృద్ధురాలు తిమ్మక్క, చెట్లతో ఆమెకు ఉన్న అనుబంధం ఈ కథనంలో అల్లుకుపోయింది. కళా ప్రక్రియలలో విస్తరించిన అద్భుతమైన భాగంగా దీనిని చెప్పవచ్చు. ఇది సామాజిక సందేశాన్ని దాని ప్రధాన భాగంలో ప్రసారం చేయడంలో శైలులు, భాష, ఫార్మాట్లను మిళితం చేసింది. ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఆలోచింపజేసేటటువంటి, ప్రక్రియలో సరిహద్దులను చెరిపేసింది.‘భారతదేశంలో చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలనే అవగాహన, ప్రతి వ్యక్తి సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం.. ఎప్పుడూ మా ఇంట్లో ఒక మంత్రంగా ఉంటుంది. అందువల్ల ఈ నృత్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది’ అని చెబుతుంది విశాఖ. భారతీయ–ఆస్ట్రేలియన్ యువ కళాకారిణిగా ఆమె జీవితంలో భరతనాట్యానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ సందర్భంగా వివరించింది. పాశ్చాత్య నృత్య సమాజంలో భరతనాట్య నర్తకిగా నన్ను బయటి వ్యక్తిగానే చూసేవారు. కానీ ఇప్పుడు అందరిచేత ‘నృత్యం ఆత్మ ప్రదర్శించే భాష, ఇది కేవలం సమకాలీనమైనది కాదు, ఇది శరీరం, ఆత్మ కదలిక’ అని చెబుతుంది విశాఖ. (చదవండి: అత్యంత అరుదైన పెంగ్విన్..!) -
పట్నా నాటి ఔన్నత్యానికి దర్పణం
పట్నా టూర్ అనగానే నాకు ‘చాణక్య’ చారిత్రక నవల, టీవీ సీరియల్ ఒకదానితో ఒకటిపోటీ పడుతూ కళ్ల ముందు మెదిలాయి. ‘సున్న’ తో ప్రపంచ గణితాన్ని గాడిలో పెట్టిన ఆర్యభట్ట గుర్తొచ్చాడు. ఖగోళ పరిజ్ఞానంలో మన మేధ ఎంతో పరిణతి చెందినదనే విషయం మరోసారి గుర్తొచ్చింది. అలాగే వర్తమానంలో బిహార్ అనుభవిస్తున్న పేదరికమూ, జంగిల్ రాజ్ అనే వార్తకథనాలు కూడా గుర్తొచ్చాయి. పాటలీపుత్ర నుంచి పట్నా వరకు ఈ నగరం అనుభవించిన ఆటుపోట్లన్నీ కళ్లముందు మెదిలాయి. పట్నాలో అడుగు పెట్టిన తర్వాత దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్నీ గతంలోకి వెళ్లి విశ్లేషించుకుంటూ ముందుకు సాగాను. ఆర్యభట్ట నాలెడ్జ్ యూనివర్సిటీలో చూపుడువేలితో ఆకాశాన్ని చూపిస్తున్న ఆర్యభట్ట విగ్రహం ముందు మోకరిల్లాను.బిహార్‌లో ఆలూపట్నా ప్రజల జీవనశైలి నిరాడంబరంగా కనిపించింది. కూరగాయల బళ్ల మీద బంగాళదుంప రాశి, పక్కనే మరో బస్తా ఉంటాయి. కాయగూరలు నామమాత్రమే. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక సందర్భంలో ‘సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బిహార్‌లో లాలూ ఉంటాడు’ అన్న మాట గుర్తొచ్చింది. ఇప్పుడు లాలూ లేడు కానీ ఆలూ మాత్రం ఉంది. బిహార్ జీవనశైలిలో ఆకుపచ్చ కూరగాయల కంటే బంగాళదుంపకేప్రాధాన్యం. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో జిలేబీ, భోజనంలో మధ్యమధ్య పచ్చిమిర్చి కొరుక్కుంటూ తినడం ఈ రెండూ కొత్తగా అనిపిస్తాయి. జీవనశైలి విలాసవంతంగా లేకపోయినప్పటికీ కళల పట్ల ఆరాధన మెండుగా ఉంది. సంగీతకార్యక్రమాలు, వేడుకల్లో నాట్య ప్రదర్శనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఊరేగింపులో వాహనాల మీద జరిగే నాట్యప్రదర్శనల్లో నర్తకి రక్షణ కోసం గ్రిల్ ఉంటుంది. బాలికల చదువు, రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్‌తో ప్రచారం బాగున్నాయనిపించింది.ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలుపట్నా నగరం పర్యావరణానికిప్రాధాన్యం ఇస్తోంది. ఆటో రిక్షాలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే. వాహనాల విషయంలో పర్యావరణ స్పృహ మెండుగానే ఉంది. ప్లాస్టిక్ వాడకం మీద నిషేధం ఏమీ లేక΄ోవడంతో సామాన్యుల్లో ఆ ధ్యాస కనిపించదు. గంగాతీరంలో పూజలు చేసి పూలు, అగరవత్తులు తీసుకెళ్లిన పాలిథిన్ కవర్లను అక్కడే పడేస్తున్నారు. తీరమంతా ΄్లాస్టిక్ వ్యర్థాల తోరణంగా కనిపించింది. గంగానది నీరు స్వచ్ఛంగా ఉన్నాయి, నదిలో పడవ విహారం మాత్రం అద్భుతమైన అనుభూతినిచ్చింది. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో నది విహారం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.గోల్ఘర్పట్నాలో తప్పకుండా చూడాల్సిన వాటిలో గోల్ఘర్ ఒకటి. ఇది మగధరాజ్య ధాన్యాగారం. ఈ ధాన్యాగారం ఇనుప నిర్మాణం. రాజ్యంలో రైతులు పండించిన ధాన్యంలో వారి అవసరాలకు పోగా మిగిలిన వాటిని సేకరించి ఇందులో భద్రపరిచేవారు. ఒక ఏడాది కరువు, వరదలు వచ్చినా సరే రాజ్యంలో ఆకలి లేకుండా తిండి గింజలను అందుబాటులో ఉంచడం కోసమే ఈ ఏర్పాటు. ΄ాలనలో ఇంతటి ముందు చూపుకు చాణుక్యుని అర్థశాస్త్రమే మూలం. ప్రాచీన కాలంలో ఇక్కడ పర్యటించిన ఫాహియాన్, మెగస్తనీస్ వంటి విదేశీ యాత్రికులు పట్నా నగరాన్ని ప్రపంచానికి మోడల్‌గా చూపించారు. మెగస్తనీస్ అయితే ఏకంగా ‘గ్రేటెస్ట్ సిటీ ఆన్ ద ఎర్త్’ అని రాశాడు. అంతటి చైతన్యవంతమైన, ఉచ్ఛస్థితిని చూసిన నగరం పట్నా. సామాన్యులతో మాటలు కలిపితే ఆ మూలాల ప్రభావం ఇప్పటికీ ఉందనిపిస్తుంది. వారిని చూస్తే పేదరికంతో పోరాడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ మాటల్లో వారిలో సమృద్ధిగా ఉన్న రాజకీయ చైతన్యం వ్యక్తమవుతుంది. ప్రాచీన కాలంలోకి ఎంట్రీపట్నా నగరం ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుంచి జనజీవనం కొనసాగుతూ వస్తున్న ప్రదేశం. ఆర్యభట్ట, వాత్సాయనుడు, చాణుక్యుడు, సిక్కుల గురువు గురుగోవింద్‌సింగ్ వంటి మేధావులు పుట్టిన నేల. నంద, మౌర్య, గుప్త రాజవంశాల రాజధాని. ఇన్ని ప్రత్యేకతలను సొంతం చేసుకున్న నేల మీద నడిచేటప్పుడు మనకు తెలియకుండానే నేటి నుంచి అక్షరాలలో చూసిన నాటికి వెళ్లిపోతాం. ఇక్కడ పర్యటించడం రియల్లీ ఏ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియెన్స్. పరిణిత శిల్పకళ ప్రాచీన పట్నా జీవనశైలిని చూడాలంటే బిహార్ మ్యూజియంలో అడుగుపెట్టాలి. మొదటగా ఆకర్షించేది యక్షిణి శిల్పం. గంగానది తీరాన దిదర్గంజ్ గ్రామం నుంచి సేకరించిన ఈ శిల్పం శిల్పం అద్దంలా మెరుస్తుంటుంది. శిల్పచాతుర్యాన్ని ఫొటోలో చూడాల్సిందే తప్ప వర్ణించడం అసాధ్యం. రీజనల్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రలేఖనాలు మధుబని ఆర్ట్‌లో కృష్ణుడు, గోపికల ఘట్టాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక పటంలో ఒక గ్రంథం ఇమిడి ఉంటుంది. బొమ్మలు వేయడానికి చిత్రకారులు వాడిన బేసిక్ కలర్స్ నుంచి సెకండరీ కలర్స్ వాడకం వరకు చిత్రవర్ణాల పరిణామ క్రమం అర్థమవుతుంది. చిత్రాలను, శిల్పాలను పరిశీలించినప్పుడు అప్పటి కాలంలో చిత్రకళ కంటే శిల్పకళ ఉచ్ఛస్థితిలో పరిణతి చెందినట్లు అనిపించింది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
'సోలో ట్రిప్సే సో బెటర్'..! అంటున్న నిపుణులు..
సోలో లైఫే సో బెటరూ.. అన్నట్లుగా సోలో ట్రిప్పే సో బెటర్ అంటున్నారు మానసిక నిపుణులు. ఇది మన వ్యక్తిగత వృద్ధికి, మంచి సంబంధాలను నెరపడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. పెళ్లైనా..అప్పుడప్పుడూ సోలోగా ట్రావెల్ చేస్తే..మనస్సుకు ఒక విధమైన రిఫ్రెష్నెస్ వస్తుందట. అంతేగాదు మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అదేంటి కుటుంబంతో వెళ్తేనే కదా ఆనందం! మరి ఇలా ఎలా? అనే కదా..!నిజానికి పెళ్లయ్యాక ఒంటరిగా జర్నీ అంటే..సమాజం ఒక విధమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఇలా సోలో ట్రిప్ చేసే అవకాశం కాదు కదా..ఆ ఆలోచనకే తిట్టిపోస్తారు పెద్దవాళ్లు. కానీ ప్రస్తుత యూత్‌లో ఆ ధోరణి మారింది. పెళ్లైనా..మహిళలు/ పురుషులు సోలోగా ట్రిప్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మానసికి నిపుణులు కూడా దీనికే మద్దతిస్తున్నారు. ఇదే మంచిదని నొక్కి చెబుతున్నారు. ఎందుకు మంచిదంటే..కుటుంబ సమేతంగానే ఇంట్లో ట్రావెల్‌ని ప్లాన్ చేస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా సోలోగా మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లేలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మరింత జోష్‌ఫుల్‌గా ఉంటామని మాననసిక నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ.. కుటుంబం, పిల్లలు బాధ్యతలతో తలామునకలైపోయి ఉంటాం. మన వ్యక్తిగత అభిరుచిలు, ఇష్టాలు తెలిసి తెలియకుండానే పక్కన పెట్టేస్తాం. ఇలా చిన్నపాటి జర్నీ మనకు నచ్చినట్లుగా ఉండేలా ట్రావెల్ చేయడం మంచిదట. కుటుంబ సమేతంగా వెళ్లినప్పుడు బడ్జెట్ అనుసారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆయా పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తాం. వాళ్ల రక్షణ బాధ్యత కూమా మీదే అవుతుంది. ఈ టెన్షన్ల నడుమ పూర్తిగా ఎంజాయ్ చేయడం కష్టమైనా..అది కూడా ఓ ఆనందం అనే చెప్పొచ్చు. ఎందుకంటే నా కుటుంబాన్ని ఫలానా ట్రిప్‌కి తీసుకెళ్లి ఈ మంచి ఫీల్ ఇచ్చాననే ఆనందం మాటలకందనిది. అయితే వ్యక్తిగతంగా అప్పడప్పుడూ సోలోగా టూర్‌కి వెళ్లడం చాలా మంచిదట. దీనివల్ల తమను తాము అనుభవించగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. స్వీయ ఆనందం పొందేందుకు వీలుపడుతుంది. అలాగే ఒక విధమైన స్వేచ్ఛ లభించనట్లుగా ఉంటుంది. దీంతోపాటు స్వీయ సంరక్షణ గురించి కూడా తెలుస్తుంది. కలిగే ప్రయోజనాలు..సోలో పర్యటన వల్ల మానసిక ఆరోగ్య మెరుగ్గా ఉంటుంది. అదికూడా వ్యక్తిగతంగా ఒక మంచి స్పేస్ దొరికనట్లు అనిపిస్తుంది. అలాగే భాగస్వామి నమ్మకాన్ని బలపరుస్తుంది. వ్యక్తిగత ఆనందాలను, అభిరుచులను గౌరవించుకోవడం వల్ల భద్రతగా ఉన్నామనే ఫీల్ భార్యభర్తలిరువురికి కలుగుతుంది. మహిళలకైతే సాధికారత భావాన్ని అందిస్తుంది. కానీ ఇలా సోలోగా పర్యటనలు చేసేవాళ్లు సురక్షితంగా తిరిగొచ్చేలా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం ముఖ్యం.(చదవండి: ప్రపంచంలోనే ది బెస్ట్ టేస్టీ వంటకాలను అందించే దేశాలివే..భారత స్థానం ఇది..!) -
టూరు.. భలే జోరు..
నగరంలో సగటు వ్యక్తి సమయం ఉద్యోగం, వ్యాపారం, ట్రాఫిక్ తంటాలతోనే సగం గడిచిపోతోంది. డిసెంబర్ వచ్చిందంటే ఉద్యోగులకు సెలవులకు ముగిరిపోయే సమయం ఆసన్నమైందని లెక్కలేసుకుంటారు. మరో వైపు క్రిస్మస్ సెలవులు.. దీంతో సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎత్తయిన కొండల్లో దాగిన సరస్సులు, భూమికి పచ్చని చీరకట్టినట్లుండే టీ, కాఫీ ఎస్టేట్లు, భూతల స్వర్గంలా పొగమంచు కమ్మిన ప్రాంతాలవైపు ఆకర్షితులవుతున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు హిల్ స్టేషన్స్ తమ డెస్టినేషన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలకూ డిమాండ్ ఉందని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. 5 రోజుల నుంచి వారం రోజుల పాటు సాగే టూర్ రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు శీతాకాలంలో దట్టమైన పొగ మంచు, పచ్చని చెట్ల మధ్య సాగే ప్రయాణం.. రహదారులు, గుహల్లోంచి దూసుకుపోయే అద్దాల రైలు ప్రయాణం, రంగురంగుల పూల తోటలు, టీ, కాఫీ ఎస్టేట్స్, వంజంగి కొండపై నుంచి కనిపించే పొగ మంచు పొరలు కన్నులకు విందుగా అనిపిస్తుంది. దేశంలోనే అతి పెద్ద గుహలలో ఒకటైన బొర్రా గుహలు ఇక్కడ చూడొచ్చు. సుమారు 80 మీటర్ల లోతు గుహలో దిగొచ్చు. విశాఖపట్నంలో కైలాసగిరి, ఆర్కే బీచ్, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మండువేసవిలో దట్టమైన మేఘాలు.. ప్రిన్సెస్ ఆఫ్ ది హిల్‌గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్ తమిళనాడులోనే ఉంది. దట్టమైన అడవులు, ఎత్తయిన పర్వతాల నడుమ సాగే ప్రయాణం, సరస్సులు, జలపాతాలు, పిల్లర్ రాక్, బ్రయంట్ పార్క్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఈ పర్వతాలపై మండే వేసవిలో సైతం దట్టమైన మేఘాలు మనల్ని కమ్మేస్తాయి. కొడైకెనాల్ల్లో ప్రయాణం చేస్తుంటే.. మేఘాల్లో తేలిన ఫీల్ ఉంటుంది. శీతాకాలంలో అయితే మంచు దుప్పటి కప్పేస్తుంది. ముచ్చటగొలిపే మున్నార్.. కేరళలోని మున్నార్ అంటే మూడు నదులు అని అర్థం. ప్రసిద్ధ ఎరవికులం జాతీయ పార్క్ మున్నార్ సమీపంలోనే ఉంటుంది. టీ ఎస్టేట్స్, మట్టుపెట్టి డ్యాం, ఆహ్లాదరకమైన గ్రీనరీ, ఎత్తయిన కొండలు చూడొచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం నచ్చుతుంది. కేరళలోని మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం వయనాడ్. పడమర కనుమలు, వివిధ రకాల పక్షలు, జంతువులు, కొండల మధ్య ప్రయాణం ఆకట్టుకుంటుంది. చెంబ్రా, బాణాసుర సాగర్ డ్యాం పర్యాటకులకు డెస్టినేషన్‌గా నిలుస్తాయి. కూర్గ్‌లో ట్రెక్కింగ్.. కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎటు చూసినా కాఫీ, మిరియాలు, యాలుకల తోటలతో సుమనోహరంగా ఉంటుంది. వైల్డ్ లైఫ్, అబ్బే జలపాతం, నగర్‌హోళె నేషనల్ పార్క్‌లు చూడదగ్గ ప్రదేశాలు. అదే సమయంలో నంది హిల్స్‌పై నుంచి సూర్యోదయం చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. బెంగళూరు సమీపంలోని ఈ కొండల్లో భోగనందీశ్వరాలయం ఉంటుంది. నంది కోట ప్రధాన ఆకర్షణ.క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్.. తమిళనాడులోని ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్‌గా పిలుస్తారు. స్థానికంగా ఉండే బొటానికల్ గార్డెన్, నీలగిరి కొండలు, పర్వతాల మధ్య సరస్సులు, పచ్చని తోటలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఊటీని కొత్త జంటలు హనీమూన్ డెస్టినేషన్‌గా పిలుచుకుంటారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఊటీకి సమీపంలోనే కూనూర్ ఉంటుంది. ఇక్కడ డాలి్ఫన్ నోస్, ల్యాంబ్స్ రాక్, టీ ఎస్టేట్స్ చూడొచ్చు. ఐదు రోజుల ప్రయాణం అద్భుతం.. ఈ సీజన్లో హిల్ స్టేషన్స్ చూడటానికి బాగుంటాయని ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేద్దామని అడిగారు. కొడైకెనాల్ డెస్టినేషన్. మధ్యలో కొన్ని దేవాలయాలు, ఇతర ప్రదేశాలను సందర్శించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వెళ్లి రావడానికి 5 రోజులు పట్టింది. కొడైకెనాల్ ప్రయాణం మేఘాల్లో తేలినట్లుంది. మధ్యాహ్నం 12 అయినా అక్కడ రెండు మీటర్ల దూరంలో ఉన్న మనిషి కనిపించే పరిస్థితి లేదు. ఈ టూర్ మంచి అనుభూతినిచ్చింది. – సాయి హర్ష, మణికొండఆహ్లాదం.. ఆధ్యాత్మికం రెండూ..ఈ సీజన్లో వెకేషన్,ఆధ్యాత్మికం కలిపి మిక్సడ్ టూర్ ప్లాన్స్ ఉంటున్నాయి. గోవా, రామేశ్వరం, ఊటి, కొడైకెనాల్, పాండిచ్చేరి, మున్నార్, మదురై, అరుణాచలం, శభరిమలై వంటి ప్రదేశాలకు ఎక్కువ మంది ప్యాకేజీలు అడుగుతున్నారు. కొన్ని కుటుంబాలు వాహనం మాట్లాడుకుంటున్నారు. – భాస్కర్‌రెడ్డి, శ్రీసాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ -
ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్.. ఇండిగో స్థానం ఇది!
విమానంలో ప్రయాణించాలంటే ఏ విమానయాన సంస్థ బెటర్ అనేది తెలుసుండాలి. అలాగే కేబిన్లు, సేవల నాణ్యత తోపాటు..విమానాలు ఎంత ఆలస్యంగా వస్తున్నాయన్నది కూడా అన్నింటికంటే ముఖ్యం. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీ ప్రతి ఏటా దీనికి సంబంధించి ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఏడాది మెత్తంలో ఎన్ని సార్లు ఆలస్యంగా కస్టమర్లను గమ్యస్థానాలకు చేర్చింది, సౌకర్యం, సేవలు, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ వంటి అంశాల ఆధారంగా అత్యుత్తమమైనవి, చెత్త సర్వీస్ అందించిన ఎయిర్‌లైన్స్‌గా జాబితా చేసి ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది మాత్రం కస్టమర్ ఫీడ్‌బ్యాక్, కార్యచరణ సామర్థ్యం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్లకు ర్యాంకుల ఇచ్చింది.ఇందులో జనవరి నుంచి అక్టోబర్ వరకు గల డేటాను బేస్ చేసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. ఇలా ర్యాంకులు ఎందుకంటే.. కేవలం ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్‌లైన్స్‌ని ప్రోత్సహించడమేనని ఎయిర్ హెల్ప్ సీఈవో టామ్జ్ పౌల్జిన్ చెబుతున్నారు.2024 సంవత్త్సరానికి అత్యంత చెత్త విమానయాన సంస్థలు..100. స్కై ఎక్స్‌ప్రెస్101.ఎయిర్ మారిషస్102. తారోమ్103. ఇండిగో104. పెగాసస్ ఎయిర్‌లైన్స్105. ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్106. బల్గేరియా ఎయిర్107. నౌవెలైర్108. బజ్109. తునిసైర్2024 సంవత్సరానికి అత్యుత్తమ విమానయాన సంస్థలు..10. ఎయిర్ సెర్బియా9. వైడెరో8. ఎయిర్ అరేబియా7. లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్6. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్5. ప్లే (ఐస్లాండ్)4. అమెరికన్ ఎయిర్‌లైన్స్3. యునైటెడ్ ఎయిర్‌లైన్స్2. ఖతార్ ఎయిర్వేస్1. బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ఈసారి బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ 2018 నుంచి ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించి.. ఖతార్ ఎయిర్వేస్ను వెనక్కు నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఈ ఏడాది గణనీయమైన కార్యాచరణ అంతరాయాలను ఎదుర్కొన్నప్పటికీ..మంచి పనితీరును కొనసాగించి మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక కెనడియన్ క్యారియర్ ఎయిర్ ట్రాన్సాట్ 36వ స్థానంలో నిలవగా, డెల్టా ఎయిర్ లైన్స్ 17వ స్థానానికి పడిపోయింది. అలాగే జెట్‌బ్లూ, ఎయిర్ కెనడా దిగువ 50 స్థానాల్లో నిలిచాయి. అలాస్కా ఎయిర్‌లైన్స్ కూడా 88వ స్థానానికి పరిమతమయ్యింది.ఇండిగో స్పందన:భారత్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వే ఫలితాలపై స్పందించింది. సదరు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హెల్ప్ ఇచ్చిన ర్యాంక్‌ని ఖండిచింది. తమ సంస్థ కస్టమర్లకు మంచి ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని స్పష్టం చేసింది. కస్టమర్ పిర్యాదులు కూడా తక్కువేనని పేర్కొంది ఇండిగో. భారత ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకారం..తొమ్మిది నెలల కాలంలో 7.25 కోట్లకు పైగా ప్రయాణికులను తీసుకెళ్లడమే గాక 61.3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. అంతేగాక నెలవారీగా కస్టమర్ పిర్యాదులను, సమయాపాలన డేటాను ప్రచురిస్తామని కూడా ఇండిగో స్పష్టం చేసింది. గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హెల్ప్ విశ్వసనీయత లేని విధంగా ర్యాంకులు ఇచ్చిందని, తమ విమానయాన సంస్థ డేటాని పరిగణలోనికి తీసుకుని ఇచ్చిన ర్యాంకు మాత్రం కాదని ఆరోపించింది. (చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
ఇది సిమ్లా యాపిల్ కాదు... కల్పా యాపిల్
యాపిల్ చెట్టు ఎన్ని కాయలు కాస్తుంది? మనం మామిడి చెట్టును చూస్తాం, జామచెట్టును చూసి ఉంటాం. కానీ యాపిల్ చెట్టుతో మనకు పరిచయం ఉండదు. యాపిల్ కోసం సిమ్లాకే కాదు... కల్పాకు కూడా వెళ్లవచ్చు. అందుకే ఓసారి హిమాచల్ ప్రదేశ్‌లోని ‘కల్పా’ బాట పడదాం. మన పక్కనే ఉన్నట్లుండే హిమాలయాలను చూస్తూ విస్తారమైన యాపిల్ తోటల్లో విహరిద్దాం. ‘రోజూ ఒక యాపిల్ పండు తింటే డాక్టర్‌ను చూడాల్సిన అవసరమే ఉండదు’ అని యాపిల్‌లో ఉండే ఆరోగ్య లక్షణాలను ఒక్కమాటలో చెప్తుంటాం. కల్పా గ్రామంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తారు. అస్సాం టీ తోటల్లో మహిళలు వీపుకు బుట్టలు కట్టుకుని ఆకు కోస్తున్న దృశ్యాలు కళ్ల ముందు మెదలుతాయి. యాపిల్ తోటల్లో అమ్మాయిలు బుట్టను చెట్టు కొమ్మల మధ్య పెట్టి యాపిల్ కాయలు కోస్తుంటారు. కిన్నౌర్ కైలాస్ పర్వత శ్రేణుల దగ్గర విస్తరించిన గ్రామం కల్పా. యాపిల్ పండుని చెట్టు నుంచి కోసుకుని తింటూ రంగులు మార్చే హిమాలయాలను చూడడం ఈ ట్రిప్‌లోనే సాధ్యమయ్యే అనుభూతి. తెల్లటి మంచు పర్వత శిఖరాల్లో కొన్ని ఉదయం ఎర్రగా కనిపిస్తాయి. మధ్యాహ్నానికి ఆ శిఖరం తెల్లగానూ మరో శిఖరం ఎరుపురంగులోకి మారుతుంది. సూర్యుడి కిరణాలు పడిన పర్వత శిఖరం ఎర్రగా మెరుస్తుంటుంది.సాయంత్రానికి అన్నీ తెల్లగా మంచుముత్యాల్లా ఉంటాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రకృతి ఇంతే సౌందర్యంగా ఉంటుంది. మంచుకొండలు చేసే మాయాజాలాన్ని చూడాలంటే శీతాకాలమే సరైన సమయం. గోరువెచ్చని వాతావరణంలో విహరించాలంటే మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లాలి. కల్పా చాలా చిన్న గ్రామం. సిమ్లా టూర్లో భాగంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత చిన్న కల్పా గ్రామంలో ప్రాచీన దేవాలయాలున్నాయి. బౌద్ధవిహారాలు కూడా ఉన్నాయి. (చదవండి: నోరూరించే కేఎఫ్‌సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!) -
వనరుల బంగారం.. బయ్యారం
బయ్యారం ఊళ్లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా కనిపిస్తాయి. అయితే ఆ గుడులు ఇప్పుడు వాడుకలో లేవు.బయ్యారం.. ప్రకృతి వనరుల భాండాగారం..సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమాలకు ఆలవాలం! ఆ ఊరి గురించే ఈ కథనం.. తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లాలో.. మూడు వైపుల నీళ్లు, ఒకవైపు గుట్టలను హద్దులుగా చేసుకుని ఉంటుంది బయ్యారం. ఇక్కడి పెద్దచెరువు కట్టపై తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో ఉన్న శిలాశాసనం కాకతీయుల వంశవృక్షాన్ని, వారి పాలనాదక్షతను తెలియజేస్తుంది. కాకతీయ వంశస్థురాలైన మైలమాంబ.. తన తల్లి బయ్యమాంబ పేరున ప్రజల సంక్షేమార్థం ఈ చెరువును తవ్వించినట్లు ఈ శాసనం తెలుపుతోంది. సాగునీటి రంగంపై కాకతీయుల పరిజ్ఞానానికి నిదర్శనంగా బయ్యారం చెరువు నిలిచింది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఉన్న మీడియం ప్రాజెక్టుల్లో మొదటగా నీరు నిండి అలుగు పోసేదిగా బయ్యారం పెద్దచెరువు రికార్డులో ఉంది. ఇది 15,000 ఎకరాలకు సాగునీరును అందిస్తోంది. చెరువు మట్టి మహత్యంబయ్యారం చెరువు మట్టి మహిమ అంతా ఇంతా కాదు. గతంలో బెంగుళూరు పెంకులు, ఇప్పుడు అలంకరణ వస్తువులు, టైల్స్ తయారీకి ఈ మట్టే కీలకం. మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లోని టైల్స్ ఫ్యాక్టరీల్లో తయారయ్యే డెకరేటివ్ టైల్స్ మన దేశంలోనే కాకుండా విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి దట్టమైన అడవులను దాటుకుంటూ వచ్చే వరద నీరు ఈ చెరువులో చేరుతుంది. నీటి ప్రవాహంతోపాటు వచ్చే ఒండ్రు మట్టి చెరువు అడుగుకు చేరి రేగడి మట్టిగా మారుతుంది. దీంతో తయారయ్యే పెంకులు, డెకరేటివ్ టైల్స్ నాణ్యతకు మరోపేరుగా నిలుస్తున్నాయి. అయితే ఆర్సీసీ కప్పుతో పోటీ పడలేక పెంకు ప్యాక్టరీలు మూత పడే దశకు చేరుకున్నాయి. వాటి స్థానంలో డెకరేటివ్ టైల్స్ తయారీ మొదలుపెట్టారు. ఇక్కడ తయారయ్యే జేడీ డచ్, హెచ్‌బీటీ, ఎస్సెమ్మార్, మోడర్న్ బ్రాండ్, ప్లోయింగ్ బిట్స్, సెంటర్ టైల్స్ ఇలా కస్టమర్లు ఏ విధమైన డిజై¯Œ కావాలన్నా ఇట్టే తయారుచేసి ఇస్తారు. బయ్యారం చెరువు మట్టితో తయారు చేసిన పెంకులు, టైల్స్, కటింగ్ డిజైన్లను బొగ్గు, ఊకతో కాలుస్తారు. అప్పుడు ఎర్రటి అందమైన వర్ణం వస్తుంది. వందలు, వేల ఏళ్లు గడచినా ఇది చెక్కు చెదరదు. వీటికి దేశంలోని పలు ప్రాంతాలతోపాటు మలేషియా, జపాన్ వంటి దేశాల్లోనూ డిమాండ్ ఉంది.ఇనుపరాతి గుట్టతెలంగాణకే తల మానికంగా బయ్యారం ఇనుపరాతి గుట్ట ఉంది. దాదాపు 42వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ గుట్టలో దొరికే ఇనుపరాతి ముడిసరుకు నాణ్యమైనదిగా చెబుతున్నారు నిపుణులు. ఈ ముడిసరుకును గతంలో పాల్వంచ, విశాఖ ఉక్కు పరిశ్రమలకు సరఫరా చేసేవారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఖనిజాలుబయ్యారం పరిసరాల్లోని నామాలపాడు, ఇతర ప్రాంతాల్లో ఖనిజవనరులు పుష్కలంగా ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా బైరటీస్, డోలమైట్, అభ్రకం, బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వానికి గతంలో నివేదిక కూడా పంపినట్లు సమాచారం. ఉద్యమాలకు నెలవునాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ పోరు దాకా.. సామాజిక స్పృహకు, ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు నెలవుగా ఉంది బయ్యారం. 1948లో నిజాం వ్యతిరేక పోరులో ఈ ప్రాంతానికి చెందిన 30 మంది పోరాట వీరులు నిజాం సైన్యం తూటాలకు అసువులు బాశారు. వారి స్మృత్యర్థం స్థూపం కూడా ఉందిక్కడ. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ బయ్యారం ముందుంది. మలి దశ ఉద్యమంలోనూ చైతన్య శీలురు, కవులు, కళాకారులతో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. ∙ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్బండారి వీరన్న, సాక్షి, బయ్యారంమురళీ మోహన్, ఫొటోగ్రాఫర్ -
నేటి ఆధునిక గృహాలలో నాటి ప్యాలెస్ కళ
మహారాజా ప్యాలెస్‌ల నుండి ఇకత్ డిజైన్ల వరకు ఆధునిక ఇళ్లలో భారతీయ కళల ప్రభావం అంతర్లీనంగా ఉంటోంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్‌ల వరకు, మనదైన వారసత్వం ఇంటీరియర్ డిజైన్‌లో కొంగొత్త నిర్వచనాన్ని చూపుతుంది.భారతీయ కళలు మ్యూజియంలు, గ్యాలరీలకు మించి విస్తరిస్తున్నాయి. ఇవి మనం నివాసం ఉండే ప్రాంతాలనూ ప్రభావితం చేస్తున్నాయి. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్‌ల వరకు, భారతీయ వారసత్వంలోని ఈ అంశాలు ఆధునిక ఇంటీరియర్ డిజైన్‌ను సరికొత్తగా చూపుతున్నాయి. భారతీయ కళ, సంప్రదాయాన్ని గౌరవించే సేకరణలు సమకాలీన గృహాలలోకి ప్రవేశించి, కలకాలం నిలిచేలా రిఫ్రెష్‌గా భావించే ఇంటీరియర్లను సృష్టిస్తున్నాయి. వారసత్వ ప్రేరేపిత డిజైన్లు సంప్రదాయంతో ఎంతో గొప్పగా ఉంటాయని రుజువు చేస్తున్నాయి. మహారాజ ప్యాలెస్–ప్రేరేపిత ఇంటీరియర్స్భారతీయ చరిత్ర మొత్తం వైభవంతో కూడిన కథలతో నిండి ఉంటుంది. హస్తకళతో పాటు ఎన్నో అంశాలకు ఉదాహరణలుగా నిలిచే రాజభవనాలు ఉన్నాయి. ఈ రీగల్–ప్రేరేపిత డిజైన్లు గ్రాండ్ మహారాజా ప్యాలెస్‌ల ఆర్చ్‌లు, మోటిఫ్‌లు, విలాసవంతమైన అలంకారాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే ఇవి నేటి కాలపు అందానికి ప్రతీకగానూ ఉంటాయి. చికన్కరి సొగసుఇంటీరియర్ నిపుణుడు, మెరినో ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్ లోహియా మరింత వివరిస్తూ, ‘రీగల్ శ్రేణిలో గజముద్ర, వసంత, సంస్కృతి వంటి డిజైన్ లు ఉన్నాయి. ప్రతి ఒక్క అంశమూ రాజ వైభవంతో అలరారుతుంటుంది. ఆ తర్వాత భారతదేశ విభిన్న కళారూ΄ాలలో చికన్కరీ ఎంబ్రాయిడరీ ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ డిజైన్లు అల్లికలతో ఉంటాయి. చేతితో తయారైన ఈ అల్లికలు సాగసుగానూ, అందుబాటులో ఉంటాయి. అలంకృత్ ఒక అలంకారమైన ఆభరణాన్ని పోలి ఉంటుంది. కర్ణిక భారతీయ చెవి΄ోగుల నుండి స్ఫూర్తిని పొందింది. సాంప్రదాయ హవేలీలలో కనిపించే ఈ తోరణాల కళ నేటి ఆధునిక ఇళ్లలోనూ కనిపిస్తుంది. వాస్తుశిల్పం కూడా ఆధునిక అమరికలో చక్కగా ఇమిడిపోయి గొప్ప వారసత్వ కళతో ఆకట్టుకుంటున్నాయి’ అని ఆయన వివరించారు.ఇకత్ వీవింగ్ డిజైన్స్ఇకత్ అనేది దాని అద్భుతమైన నమూనాలు, సజీవ రంగులకు ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన కళారూపం. కొత్త మెటీరియల్‌లలో ఈ నమూనాలను పునఃరూపకల్పన చేయడం ద్వారా, ఆధునిక డిజైన్ సేకరణలు అదే శక్తి, చైతన్యంతో నింపుతున్నాయి. ఇంటీరియర్ డిజైనర్ శ్రీ మనోజ్ మాట్లాడుతూ– ‘ఇకత్ హస్తకళకు కేంద్రంగా ఉండే ఒక థ్రెడ్‌వర్క్. సముద్రపు అలల నమూనాలను తలపిస్తోంది. ప్రశాంతతను కలిగిస్తుంది. తరంగ్ పుష్పం సున్నితమైన అందాన్ని మిళితం చేస్తుంది. ఈ డిజైన్లు ఒక గదికి శిల్పకళాపరమైన అందాన్ని తీసుకువస్తాయి. సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సౌందర్యాల మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపారు. (చదవండి: తప్పుని ఎత్తిచూపడం కంటే.. చక్కదిద్దడమే ఉత్తమం) -
రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు!
ఒడిశాలో చిల్కా సరస్సు. ఆసియా ఖండంలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఆ సరస్సు తీరాన ఉంది రంభా ప్యాలెస్. ఆ ప్యాలెస్ గురించి చెప్పాలంటే రెండు వందల ఏళ్ల వెనక్కి వెళ్లాలి. రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.అది 1791. మనదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ హవా నడుస్తున్న రోజులవి. ఇంగ్లిష్ ఇంజనీర్ థామస్ స్నోద్గ్రాస్, మన స్థానిక సహాయకులతో కలిసి నిర్మించిన ప్యాలెస్ అది. ఈప్యాలెస్ చక్కటి వెకేషన్ ప్లేస్. కోణార్క్ సూర్యదేవాలయానికి పూరీలోని జగన్నాథ ఆలయానికి కూడా 150 కిలోమీటర్ల దూరాన ఉంది. ఈ ΄్యాలెస్ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా 2018లో న్యూఢిల్లీకి చెందిన హాచ్ వెంచర్ కొన్నది. నిర్మాణాన్ని పునరుద్ధరించే బాధ్యతను శ్రీలంకకు చెందిన ఆర్కిటెక్ట్ చన్నా దాసవాతేకి అప్పగించింది. ఈ ఆర్కిటెక్ట్ ఆరేళ్ల పాటు శ్రమించి ప్యాలెస్ చారిత్రక వైభవానికి విఘాతం కలగకుండా పునరుద్ధరించాడు. జాతీయోద్యమంలో భాగంగా సాగిన ఉత్కళ్ మూవ్మెంట్ జ్ఞాపకాలను పదిలపరుచుకుని ఉందీ ప్యాలెస్. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఉన్నతాధికారులతో సమావేశమైన గుర్తులున్నాయందులో. ప్యాలెస్‌లో నివసించిన అనుభూతి కోసం పర్యాటకులు రాజస్థాన్ వెళ్తుంటారు. ఒకసారి ఒడిశా సంస్కృతి సంప్రదాయాలను కూడా ఆస్వాదించండి’ అంటూ ఈ ప్యాలెస్ సహ యజమాని ఒడిశా రాజవంశానికి చెందిన వారసుడు హిమాన్గిని సింగ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నారు. క్రిస్టమస్ వెకేషన్‌కి లేదా సంక్రాంతి వెకేషన్‌కి ప్లాన్ చేసుకోండి. -
భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం..ప్రకృతి అందాలకు నెలవు..!
భారతదేశంలో రైల్వేస్టేషన్ లేని రాష్ట్రం ఉందంటే నమ్ముతారా..?. అరచేతిలో ప్రపంచాన్ని చూసేలా టెక్నాలజీ శరవేగంగా దూసుకుపోతున్న రోజుల్లో ఇంకా అలాంటి రాష్ట్రం కూడా ఉందా..? అని ఆశ్చర్యపోకండి. అయితే ఆ ప్రాంతం ప్రకృతి ఒడిలో ఉన్న భూతల స్వర్గంలా అందంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి రాష్ట్రానికి పర్యాటకుల తాకిడి తప్పక ఉంటుంది కదా..! అంటారేమో..అయినప్పటికీ రైల్వే నిర్మాణ సాధ్యం కాలేదు. ఈ ఆధునాత కాలంలో టెక్నాలజీనే శాసించే స్థాయిలో ఉండి కూడా ఎందుకు ఆ రాష్ట్రంలో ఈ రైల్వే నిర్మాణం సాధ్యం కాలేదని సందేహాలు మెదులుతున్నాయి కదూ..! ఇంకెందుకు ఆలస్యం అది ఏ రాష్ట్రం, దాని కథాకమామీషు ఏంటో తెలుసుకుందామా..!.భారతదేశం అత్యంత ప్రశంసనీయమైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న దేశం. అలాంటి దేశంలో రైల్వే లైన్లు లేని రాష్ట్రం కూడా ఉందంటే.. నమ్మశక్యంగా లేదు కదా!. ఈ రాష్ట్రం మన హిమాలయాల ఒడిలో ఉంది. సినిమా వాళ్ల ఫేమస్ లోకేషన్ పాయింట్ కూడా ఇదే. మంచు కొండల్లో పాట అనగానే మనవాళ్లు చకచక వచ్చి వాలిపోయే రాష్టం. అదేనండి సిక్కిం. ఈ రాష్ట్రం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రకృతి రమ్యతకు ఎలాంటి వారైనా పరవశించిపోవాల్సిందే. అంతలా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రానికి ఎందుకు రైల్వే సౌకర్యం లేదంటే..అక్కడ ప్రతికూల వాతావరణమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ భూభాగంలో అనేక రకాల ప్రకృతి సవాళ్లు ఉన్నాయి. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మిచడం సాధ్యం కాలేదు.అదీగాక ఇక్కడ తరుచుగా కొండచరియలు విరిగిపడతాయి. అక్కడ ఆ ప్రమాదం అత్యంత సర్వసాధారణం. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇంతవరకు రైల్వే నిర్మాణం ఏర్పాట్లు చేయడం సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి క్రమంగా మారనుంది. ఇటీవలే మోదీ అక్కడ రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఈ సిక్కిం రంగ్పో స్టేషన్‌ను టూరిజం, డిఫెన్స్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని చెప్పారు రైల్వే మేనేజర్ అమర్జీత్ అగర్వాల్. ఇక్కడ సరస్సుల ప్రసిద్ధ ఆకర్షణ. తప్పక సందర్శించాల్సిన టూరిజం స్పాట్లు కూడా ఈ సరస్సులే. రత్నాల వలే భూమిలో పొదిగి ఉన్న ఆ సరస్సుల సహజ సౌందర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ రాష్ట్రంలో సందర్శించాల్సిన సరస్సులివే..క్రోస్ లేక్, ఉత్తర సిక్కింక్రోస్ లేక్, స్థానికంగా కల్పోఖ్రి సరస్సు అని పిలుస్తారు. ఇది ఉత్తర సిక్కింలో దాచిన రత్నం. 4,260 మీటర్ల ఎత్తులో టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. చోళము సరస్సు, ఉత్తర సిక్కించోళము సరస్సు, ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి. ఇది 5,330 మీటర్ల ఎత్తులో ఉత్తర సిక్కింలోని ఇండో-చైనా సరిహద్దులో ఉంది.కథోక్ సరస్సు, పశ్చిమ సిక్కింపశ్చిమ సిక్కింలోని ప్రసిద్ధ పట్టణం యుక్సోమ్ సమీపంలో ఉన్న కథోక్ సరస్సు ప్రశాంతమైన ప్రదేశం. ఈ అందమైన సరస్సు చుట్టూ పచ్చదనంతో నిండి ఉంది. ఇది సిక్కిం మొదటి చోగ్యాల్ (రాజు) చారిత్రక పట్టాభిషేకంతో ముడిపడి ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం.(చదవండి: శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని) -
ఎనిమిదో వింత పక్షి మ్యూజియం
పక్షి మ్యూజియం అంటే... రకరకాల పక్షుల రూపాలు, వాటి రెక్కలు, గుడ్లు, పొదిగిన పిల్లల రూపాలను ఒక చోట పొందు పరిచిన మ్యూజియం కాదు. పక్షి ఆకారంలో ఉన్న మ్యూజియం. జటాయు పక్షి ఆకారంలో ఉన్న ఈ మ్యూజియం పరిమాణం కూడా జటాయువులాగ భారీగానే ఉంటుంది. రెండు వందల అడుగుల పొడవు, నూట యాభై అడుగుల వెడల్పు, డెబ్బై అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ మ్యూజియం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ మ్యూజియం కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలో ఉంది. ఈ మ్యూజియాన్ని జటాయు ఎర్త్ సెంటర్ అంటారు. ఈ మ్యూజియం ఉన్న కొండ ప్రదేశాన్ని జటాయు నేచర్ పార్క్ అంటారు.జటాయు పురజటాయు నేచర్ పార్క్... కేరళ, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలోని జటాయుపురాలో ఉంది. రామాయణంలో సీతాపహరణం ఘట్టంలో కీలక పాత్ర జటాయువుది. ఆ ఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు కేరళవాళ్లు. నేచర్ పార్కులో 65 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్ మ్యూజియమ్ ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పక్షి ఆకారంలోని ఈ నిర్మాణం లోపల జటాయువు కథను తెలిపే ఘట్టాలను చూడవచ్చు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ పార్కుకు చేరడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోప్‌వే ఉంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది.రామాయణం గొప్పదనం ఇదేవెయ్యి అడుగుల ఎత్తులో జటాయువు పక్షిని నిర్మించడం, పక్షి ఆకారం లోపల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పవచ్చు. శిల్పకారుడు రాజీవ్ ఆంచల్ నిర్మించాడు. సీతాపహరణం సమయంలో రావణాసురుడిని అడ్డగించిన జటాయువును రావణాసురుడు సంహరించాడని రామాయణం చెబుతుంది. ఈ ఘట్టానికి వేదిక ఈ జటాయుపుర అని కేరళవాళ్లు చెప్పుకుంటారు. తెలుగు వాళ్లుగా మనం అనంతపురంలోని లేపాక్షిని జటాయువు మరణించిన ప్రదేశంగా చెప్పుకుంటాం. రామాయణం గొప్పదనం అది. దేశం అంతటా ప్రతి ఒక్కరూ కథను స్వాగతిస్తూ ఐడింటిఫై అవుతారు.జటాయుపుర... కేరళ రాజధాని త్రివేండ్రం నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూర్ రైల్వేస్టేషన్ నుంచి పాతిక కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ట్యాక్సీ తీసుకోవచ్చు. సొంతంగా వాహనాన్ని నడుపుకునే ఆసక్తి ఉంటే కొంత కాషన్ డిపాజిట్, వ్యక్తిగత వివరాలు తీసుకుని కారు అద్దెకిస్తారు. -
Copenhagen: చికుబుకు చికుబుకు బకనే!
డెన్మార్క్ రాజధాని కోపన్హేగన్కు చేరువలో ఉన్న పిల్లల వినోద కేంద్రం బకన్. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అమ్యూజ్మెంట్ పార్కు. నాలుగు శతాబ్దాలకు పైగా ఇది కొనసాగుతోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అమ్యూజ్మెంట్ పార్కులో పిల్లల వినోదానికి అన్ని రకాల ఏర్పాట్లూ ఉన్నాయి. పచ్చని చెట్లు చేమలతో కళకళలాడుతూ కనిపించే ఈ పార్కు విస్తీర్ణం 75 వేల చదరపు మీటర్లు. ఇందులో ఐదు రోలర్ కోస్టర్లు, నాలుగు లిటిల్ ట్రెయిన్స్, ఒక వాటర్ రైడ్ సహా పిల్లల కోసం 33 క్రీడాకర్షణలు ఉన్నాయి. సుదీర్ఘ చరిత్ర కారణంగా దీనిని చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఏటా ఈ పార్కుకు దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది వస్తుంటారు. ఇందులోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. రకరకాల రైడ్స్, ఇతర వినోద క్రీడా సాధనాలను ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం విడి విడిగా కూపన్లను కొనుక్కోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో పలురకాల క్రీడాసాధనాల కోసం డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే తరచుగా ఇక్కడకు వచ్చే కోపన్హేగెన్ వాసులకు సీజన్ పాస్‌లు కూడా తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి.నీటిబుగ్గతో మొదలైంది..ప్రస్తుతం ఈ పార్కు ఉన్న ప్రాంతానికి అతి చేరువగా ఒక నీటిబుగ్గ ఉంది. పదహారో శతాబ్దిలో కిర్‌స్టెన్ పీల్ అనే స్థానికుడు ఒకరు ఈ నీటిబుగ్గను గుర్తించాడు. కోపన్హేగెన్ శివార్లలో పచ్చని అడవి మధ్యనున్న ఈ నీటిబుగ్గ అనతి కాలంలోనే జనాలను ఆకర్షించింది. కోపన్హేగెన్ నగరంలో సరఫరా అయ్యే నీటి నాణ్యత అప్పట్లో బాగుండేది కాదు. అందువల్ల ఎక్కువమంది జనాలు ఈ నీటిబుగ్గ నుంచి నీరు తీసుకుపోవడానికి ఇక్కడకు వచ్చేవారు. పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉండటంతో 1583లో నీటిబుగ్గకు చేరువగా అడవిలోని కొంతభాగాన్ని శుభ్రం చేసి, పార్కుగా మార్చారు. ఆ తర్వాత డెన్మార్క్, నార్వే ప్రాంతాలను పరిపాలించిన రాజు ఫ్రెడెరిక్–ఐఐఐ 1669లో ఇక్కడి అడవిలో జంతువుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన కొడుకు క్రిస్టియన్–V ఈ పార్కును దాదాపు నాలుగు రెట్లు విస్తరించి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా రూపొందించాడు. అప్పట్లో ఇక్కడ రాచవంశీకులు, కులీనుల పిల్లలు మాత్రమే ఆడుకునేవారు. ఫ్రెడెరిక్–V కాలంలో 1756 నుంచి ఇందులోకి సాధారణ ప్రజలకు కూడా అనుమతి కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్కు కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు చేసుకుంటూ వస్తున్నా, ఏనాడూ దీని తలుపులు మూసుకోలేదు. ‘కోవిడ్–19’ కాలంలో కలిగిన తాత్కాలిక అంతరాయం మినహా ఇది నేటికీ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. -
మాధురీ నవ్వులతో పోటీ పడే ఇంటి కళ
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే నివాసం ఉంటున్న ఇల్లు కళ, సాంకేతికతల మేళవింపులా ఉంటుంది. దీనిని డిజైనర్ అపూర్వ ష్రాఫ్ రూపోందించారు.ముంబై అపార్ట్మెంట్లోని 53వ అంతస్తులో మాధురీ దీక్షిత్ ఇంటి నుంచి ఒక ట్యూన్ వినిపిస్తుంటుంది. అది ఆమె నడక, హుందాతనం, అందాన్ని కూడా కళ్లకు కట్టేలా చేస్తుంది అంటారు ఆ ట్యూన్ విన్నవాళ్లు. బాలీవుడ్లో 90ల నాటి సినిమా హిట్లలో తేజాబ్ లో మోహిని, దిల్ లో మధు, అంజామ్ లో శివాని, హమ్ ఆప్కే హై కౌన్ లో నిషా, దిల్ తో పాగల్ హై లో పూజ ... వంటి. ఇంకా ఎన్నో పాత్రలతో ఆమె నటన నేటికీ ప్రశంసించబడుతూనే ఉంటుంది. మాధురి ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే ముంబైలోని ఎతై ్తన భవనంలో తమ అధునాతన నివాసాన్ని రూపోందించడానికి ప్రఖ్యాత లిత్ డిజైన్ సంస్థకు చెందిన ఆర్కిటెక్ట్ అపూర్వ ష్రాఫ్‌ను పిలిచారు.సింప్లిసిటీఈ జంట కోరిన వాటిని సరిగ్గా అందించడంలో వారు చెప్పిన స్పష్టమైన సంక్షిప్త వివరణ ష్రాఫ్‌కు బాగా సహాయపడింది: ‘సమకాలీన సౌందర్యాన్ని మినిమలిస్ట్ అండర్ టోన్ తో మిళితం చేసేలా సరళ రేఖలు, అందమైన రూపాలు, హుందాతనాన్ని కళ్లకు కట్టే అభయారణ్యం...’ ఇవి ఇంటి యజమానుల శక్తివంతమైన వ్యక్తిత్వాలను చూపుతుందని వారిని ఒప్పించింది ష్రాఫ్. మాధురి, డాక్టర్ మాధవ్ ‘సింప్లిసిటీ’ని కోరుకున్నారు. ఇది ఇల్లులాగా అనిపించే టైమ్‌లెస్ టెంప్లేట్. మాధురి ఈ విషయాలను షేర్ చేస్తూ, ‘ప్రశాంతత, స్పష్టత, సౌకర్యాన్ని రేకెత్తించే వాతావరణాన్ని సృష్టించడం కూడా ఒక ఆర్ట్’ అంటారామె.హుస్సేన్ కళాకృతి40 సంవత్సరాల సినీ కెరీర్లో మాధురీ దీక్షిత్ లక్షలాది మంది ఆరాధకులతో పాటు, ఎంతో మంది ఊహాలోకపు రారాణి. వారిలో ఎమ్.ఎఫ్.హుస్సేన్ ఒకరు. భారతదేశపు ప్రసిద్ధ చిత్రకారుడు మక్బూల్ ఫిదా హుస్సేన్ మాధురి కోసం ప్రత్యేకంగా చిత్రించిన విసెరల్ వైబ్రెంట్ పెయింటింగ్‌లు ఇంటి డిజైన్ భాషకు అద్దంలా నిలిచాయి. విక్రమ్ గోయల్ వియా హోమ్ ద్వారా అలంకరించిన ప్రవేశ ద్వారం, హుస్సేన్ పవిత్రమైన గణేషులచే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మాధురి వినయపూర్వకమైన ్రపారంభాన్ని గుర్తుచేసే స్వాగతతోరణంలా భాసిల్లుతుంది. ఇంట్లో ప్రతిచోటా హుస్సేన్ కళాకృతి సంభాషణలనుప్రోత్సహిస్తుంది. మాధురి వాటి గురించి మరింత వివరింగా చెబుతూ ‘హుస్సేన్ జీ మా ఇంటి గోడలకు రంగులతో కళ తీసుకురావాలనుకున్నాడు. కానీ నేను వద్దాన్నాను. దీంతో నాకు అత్యుత్తమ చిత్రాలను చిత్రించి, ఇచ్చాడు. అతను ఉపయోగించిన రంగులను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ఆ కళ ఇలా బయటకు కనిపిస్తుంది’ అని వెల్లడించింది మాధురి. -
ఏటా పుష్కరమే..! బ్రహ్మ దేవుడి క్షేత్రం
బ్రహ్మదేవుడంటే... ఈ సమస్త భూమండలంలో ఆలయం లేని దేవుడనే అసంతృప్తిని రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ తీర్చింది. అజ్మీర్‌కి 11 కి.మీల దూరంలో పుష్కర్ సరస్సు ఒడ్డున బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది. పుష్కర్ సరస్సు చుట్టూ విస్తరించిన పట్టణం కావడంతో ఈ పట్టణానికి కూడా అదే పేరు స్థిరపడింది. రాజస్థాన్ అంటేనే ఎడారులు, ఒంటెలు. ఇక్కడ ఏటా జరిగే క్యామెల్ ఫెయిర్ ప్రపంచ ప్రసిద్ధి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే వేడుకకు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ ప్రదేశం పేరు పుష్కరే కానీ వేడుకలు పుష్కరానికొకసారి కాదు ఏటా జరుగుతాయి.పుష్కర్ మేళాప్రపంచ ప్రసిద్ధి చెందిన వేడుక కావడంతో ఇది క్యామెల్ ఫెయిర్‌గా వాడుకలోకి వచ్చింది. పుష్కర్మేళా సమయంలో ఈ సరస్సులో స్నానం చేయడానికి వచ్చే భక్తులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ వారోత్సవాల్లో రాజస్థాన్ సంప్రదాయ సంగీత ప్రదర్శనలను, నాట్య ప్రదర్శనలతో΄ాటు సాముగారడీలు, పాములనాడించేవాళ్లు కూడా వస్తారు. స్థానిక హస్తకళలు, దుస్తుల దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఈ సీజన్లో పుష్కర్ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. పగలు ఏదో ఒక సమయంలో 22 డిగ్రీలకు చేరుతుంది, కానీ సూర్యకిరణాలు మబ్బును చీల్చుకుని మనిషిని తాకి వెచ్చదనాన్నివ్వడం కష్టమే. రాత్రి టెంపరేచర్ ఎనిమిది డిగ్రీలకు పడి΄ోతుంది. పాశ్చాత్యదేశీయులకు అనువుగా ఉంటుంది. ఈ ఏడాది వేడుకలు నవంబర్ 9 నుంచి మొదలై 15 వరకు కొనసాగుతాయి. -
ప్రయాణం, ప్రయత్నం..ముగ్గురు మహిళా కళాకారుల విజయం..!
నీనా జాకబ్, దిపాలి గుప్తా, మానికా శ్రీవాస్తవ్.... ఈ ముగ్గురు కళాకారులు వారి కళాత్మక ప్రయాణాలు,సృజనాత్మక ప్రక్రియల గురించి తెలుసుకోవాలంటే బెంగుళూరు ఇంటర్నేషనల్ సెంటర్ ను సందర్శించాలి. సమాజంలో కళాభిమానాన్ని మెరుగుపరచడానికి ఔత్సాహిక కళాకారులకు సలహాలనూ అందిస్తున్నారు. వీరి కళలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న సంస్కృతులు ప్రతిబింబిస్తాయి.కళాత్మక ప్రయాణం... మానికా శ్రీవాస్తవ్ ఢిల్లీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నప్పుడు స్నేహితులు, బంధువుల కోసం ఆర్ట్‌వర్క్‌లను ప్రారంభించింది మానికా శ్రీ వాస్తవ్. ‘పెళ్లయ్యాక కూడా ఈ కళా ప్రయాణం ఏమీ ఆగిపోలేదు. క్లబ్బులు, కాఫీ షాపుల వంటి చోట్ల నా పనితనాన్ని చూపడం మొదలుపెట్టాను. 1990 ప్రారంభంలో ఢిల్లీలో నా మొదటి పెయింటింగ్ ప్రదర్శన జరిగింది. ఎక్కడ ఉన్నా, ప్రయాణాల్లోనూ, నా గది మూలల్లోనూ నా కళకు ఊపిరి΄ోస్తూనే ఉంటాను. ఆ ప్రయత్నం విదేశాల్లోనూ సోలో, గ్రూప్ షోలకు దారితీసింది. హ్యూస్టన్, దుబాయ్, బెంగళూరులోనూ ప్రదర్శనలు ఇచ్చాను. ఇన్నేళ్లలో ఏ రోజూ నా నుంచి సృజనాత్మక పని ఆగలేదు. 30ఏళ్లుగా ఈ పనిని కొనసాగిస్తూనే ఉన్నాను‘ అని గర్వంగా చెబుతుంది శ్రీవాస్తవ్.ప్రత్యేకమైన శైలి.. దిపాలి గుప్తాసింగపూర్లోని ప్రఖ్యాత ఇరానియన్ మాస్టర్ అలీ ఎస్మాయిల్ వద్ద శిక్షణ పొందింది దిపాలి గుప్తా 16 ఏళ్లుగా అక్కడే ఉంది. ‘చాలా ప్రయోగాల తర్వాత, నాదైన ప్రత్యేకమైన శైలిని అభివృద్ధి చేశాను. ఇది బోల్డ్, అసాధారణమైనది. చాలా వరకు సంప్రదాయ పెయింటింగ్ నియమాలను ఉల్లంఘిస్తారు. నేను కొల్లాజ్ టెక్నిక్‌ని ఇష్టపడతాను. అశాంతిగా ఉండే, చెదిరిన ప్రపంచాన్ని వివరించే వార్తాపత్రికలలోని సారాంశానికి ఒక రూ΄ాన్ని తీసుకువస్తాను. నా పనిలో ఎప్పుడూ ఒక అంతర్లీన సూక్ష్మ సందేశం ఉంటుంది’ అని వివరిస్తారు గుప్తా. కేరళకు చెందిన నీనా జాకబ్ తనను తాను సెమీ–అబ్స్ట్రాక్ట్ ఫిగ్రేటివ్ ఆర్టిస్ట్‌గా అభివర్ణించుకుంటుంది. ‘నా చిత్రణలో చాలా వరకు కాంతి, నీడల దోబూచులాట ఉంటుంది. సామాజిక మార్పుకు నడిపించే కళ అత్యంత శక్తిమంతమైనదని నమ్ముతాను. డ్రాయింగ్, స్కెచింగ్, ఫోటోలు తీయడం, గమనించడం నా పరిశోధనలో ఉంటాయి. ఒక్కోసారి నా కళలో ఎంబ్రాయిడరీని వాడాలనుకుంటాను. అలాంటప్పుడు దారాన్ని ఉపయోగిస్తాను. ప్రేక్షకులు కేవలం అందమైన చిత్రాన్ని ఆరాధించడం మాత్రమే కాదు. కళాకారుడి కథలో నిమగ్నమవ్వాలి. నా కుంచె రంగులను అద్దడానికే కాదు రాయడానికి కూడా ఉపయోగిస్తాను. ధ్యాన పదాలు, కవిత్వం కూడా నా కుంచె రాస్తుంటుంది. ఈ పని ద్వారా ఆధ్యాత్మికతకు చేరువవుతాను. నా సొంత శైలిని అభివృద్ధి చేయడానికి దారితీసే దశలు ఇవి’అని శ్రీవాస్తవ్ జతచేస్తుంది. దేశ, విదేశాల్లో జరిగే ప్రదర్శనలలో వీరి ఆర్ట్ ఫ్రేమ్స్‌కు ధర రూ. 10,000 నుండి లక్షల రూపాయల వరకు పలుకుతాయి. ఆ మొత్తాలను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకూ అందజేస్తుంటారు. కళ ద్వారా తమ మహోన్నతమైన మనసునూ చాటుకుంటున్నారు. (చదవండి: అత్యంత అందమైన రహదారి 'రోడ్ టు హెవెన్'..!) -
ఊరి దారిలో టూరిజం
చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలనుకున్నా, ఇంజినీరింగ్ అద్భుతాలను చూడాలనుకున్నా ఈఫిల్ టవర్కో, లండన్ బ్రిడ్జ్కో ప్లాన్ చేసుకోవచ్చు! లేదంటే బుర్జ్ ఖలీఫానో, సిడ్నీ ఒపేరా హౌస్నో సందర్శించొచ్చు! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనీ చుట్టి రావచ్చు, డిస్నీల్యాండ్‌తో అబ్బురపడొచ్చు!దూరభారం అనుకునేవాళ్లు తాజ్‌మహల్, ఎర్రకోటతో సరిపెట్టుకోచ్చు! కాని, చల్లటి గాలిలో, పచ్చటి నేలమీద సేద తీరాలనుకుంటే, ట్రెడిషనల్ లైఫ్ స్టయిల్ని పరిచయం చేసుకోవాలనుకుంటే, పలు యాసలను వినాలనుకుంటే, స్థానిక రుచులను ఆస్వాదించాలనుకుంటే మాత్రం పల్లెలే ద బెస్ట్ హాలీడే స్పాట్స్! ఇప్పుడు చిన్నా పెద్దా అందరి వీకెండ్స్‌ను, సెలవులను అవే ఆక్యుపై చేస్తున్నాయి! వీళ్లకు తమ ఇళ్లల్లో ఆతిథ్యం ఇచ్చేందుకు స్థానికులూ ఉత్సాహపడుతున్నారు. పరాయి ఊళ్లో సొంతింటి భావనను కలిగిస్తున్నారు!ఆ జర్నీనే రూరల్ టూరిజం. ఆ హాస్పిటాలిటీయే హోమ్ స్టేస్! ఆ ట్రెండ్ మీదే ఈ కథనం!సెలవుల్లో ఇదివరకైతే అమ్మమ్మ వాళ్లూరో, నానమ్మ వాళ్లూరో వెళ్లేవాళ్లు. చెట్లు– పుట్టలు, చేనులు– చెలకలు, చెరువులు– బావులు, కొండలు– గుట్టలు తిరగడం వల్ల ఆ ఊరి భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక వనరుల మీద తెలియకుండానే ఒక అవగాహన ఏర్పడేది. అలాగే అక్కడి సంస్కృతీ సంప్రదాయాలూ తెలిసేవి. అక్కడి పిల్లలతో ఆటలు, ఈతలు, సరదాలు, కబుర్లు, కాలక్షేపాలతో రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, ప్రత్యేకతలు, వైవి«ధ్యాలు అర్థమయ్యేవి. తెలివిడి వచ్చేది. నగరీకరణ పెరగడం, చదువుల ఒత్తిడి, మొదటి తరానికి, మూడో తరానికి కనెక్టివిటీ తగ్గడం వల్ల గ్రామీణ భారతం కథల్లో, సినిమాల్లో వినిపించే, కనిపించే ఫిక్షన్‌గా మారిపోయింది. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు రోబోటిక్ లైఫ్ స్టయిలే లా ఆఫ్ లైఫ్‌గా మారిపోయింది. ఫీడ్ చేసిన ప్రోగ్రామింగ్లా వారంలో అయిదు రోజులు ఆఫీస్ పనితో కుస్తీ, వీకెండ్ షాపింగ్ మాల్స్‌లో వ్యాహ్యాళి. ఏడాదికి ఒకసారో, రెండుసార్లో లాంగ్ డెస్టినేషన్ టూర్స్ తప్ప ఆ షరా మామూలులో మార్పు లేదు. కోవిడ్ పుణ్యమా అని సూర్యోదయాలు, సూర్యాస్తమయాలతో ఇంట్రడక్షన్ లేని, ట్రాఫిక్, టార్గెట్స్, ప్రాజెక్ట్స్‌తోనే డీప్ రిలేషన్షిప్లో పడిపోయిన నగర జనాభాలో కోవిడ్ ఒక రియలైజేషన్‌ను తెచ్చింది. పని, పొల్యూషనే కాదు ప్రకృతి, పల్లెలతో ఇంటరాక్షన్ చాలా అవసరమని, ఆ సమయం ఆసన్నమైందని! అందుకే కోవిడ్ ఇంట్రడ్యూస్ చేసిన (అంతకుముందు అరుదుగా ఉండే) వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. లాప్టాప్, బ్యాక్‌ప్యాక్‌తో పల్లెలకు చేరుకున్నారు. పచ్చని ఆవరణం, స్వచ్ఛమైన గాలితో సేదతీరారు. పని ఒత్తిడిని తగ్గించుకున్నారు. కొత్త ఉత్సాహాన్ని నింపు కున్నారు. ‘బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి? పప్పులు ఏ డబ్బాలో మాగుతాయి? పిండి ఏ మొక్క నుంచి రాలుతుంది? కూరగాయలను ఏ మార్కెట్లో తయారు చేస్తారు?’ లాంటి ప్రశ్నలు వేసే పిల్లలకూ పల్లెలతో ప్రత్యేక పరిచయం అవసరమని గుర్తించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టాక పల్లె సందర్శనను జీవనశైలిలో భాగం చేసుకున్నారు. వీకెండ్స్ నుంచి వెకేషన్స్ దాకా ప్రతి సందర్భాన్నీ రూరల్ టూర్‌కే రిజర్వ్ చేసుకోవడం మొదలుపెట్టారు. సకుటుంబ సమేతంగా! క్యాంప్‌లు వేసుకునేవాళ్లు, ట్రెకింగ్ని ఇష్టపడేవాళ్లు, పిల్లలకు పల్లె జీవితాన్ని చూపించాలనుకునే వాళ్లు, సాగు నేర్చుకోవాలనుకునే వాళ్లు, పని ఒత్తిడి నుంచి రిలాక్సేషన్‌ను కోరుకునేవాళ్లు, నిరాడంబర జీవనశైలిని అనుసరిస్తున్నవాళ్లు, గిరిజన సంస్కృతిని తెలుసుకోవాలనుకునేవాళ్లు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు.. ఎట్సెట్రా ఎట్సెట్రా అభిరుచికి తగినట్టుగా గ్రామీణ పర్యటనకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రావెల్ గ్రూప్స్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా మొత్తంగా రూరల్ టూరిజాన్ని ఓ ఒరవడిగా మార్చారు. వాళ్లందరికీ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలు, ఏజెన్సీ ఏరియాలు, వనాలు, నదీ, సముద్ర తీరప్రాంతాలు ఆతిథ్యమిస్తున్నాయి.ముందుగా ఉత్తరాంధ్రకు వెళితే.. శ్రీకాకుళం జిల్లాలో జీడి మామిడి, కొబ్బరి తోటలకు ఆలవాలమైన ఉద్దానం, సైబీరియా వలస పక్షుల విడిది కేంద్రాలు తేలుకుంచి, తేలినీలాపురాలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలివస్తుంటారు. పాఠశాల విద్యార్థులు కూడా స్టడీ టూర్ పేరిట ఈ ప్రాంతాల్ని సందర్శిస్తుంటారు. తేలినీలాపురంలో సైబీరియ¯Œ పక్షులకు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది. వారాంతాల్లో ఈ కేంద్రాలు టూరిస్ట్‌లతో బిజీగా ఉంటాయి. మన్యం పార్వతీపురం జిల్లా పరిధిలోని పాలకొండ ఏజెన్సీలో జలపాతాలకు, హిల్ వ్యూ పాయింట్లకు కొదువ లేదు. ఇది అరుదైన జంతుజాతులకూ నెలవు. దీనికి పరిశోధకుల తాకిడీ అధికమే!ఆంధ్రా ఊటీ అందాల అరకు..పచ్చటి లోయలు, అబ్బురపరచే గుహలు, అలరించే థింసా నృత్యాలు, వెదురు బొంగులో చికె¯Œ ఘుమఘుమలు, మైమరపించే కాఫీ కమ్మదనం, మేఘాలను ముద్దాడే పర్వతాలతో పర్యాటకులను కట్టిపడేసే అద్భుతమైన ప్రదేశం. కోవిడ్‌లో కూడా బాగా కట్టడి చేస్తే తప్ప సందర్శకుల తాకిడి ఆగని ప్రాంతం. అరకు వచ్చే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు స్థానిక గిరిజనులు రిసార్ట్స్ మాదిరి అతిథి గృహాలనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. మంచు ముసుగేసుకునే లంబసింగి, పాడేరు కూడా సందర్శకులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడికి అక్టోబర్ చివరివారంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కోస్తాకు వస్తే.. ఆంధ్రా కేరళగా పిలుచుకునే కోనసీమ రూరల్ టూరిజానికి అసలు సిసలైన కేంద్రం. ప్రకృతి అందాలు, పసందైన రుచులకు ఈ ప్రాంతాన్ని మించింది లేదు. సువిశాల గోదావరి, అది సముద్రంలో కలిసే అంతర్వేది, ఓడల రేవు, మడ అడవుల కోరంగి, ఫ్రెంచ్ కల్చర్‌తో ఆసక్తి రేకెత్తించే యానాం, పట్టునేత ఉప్పాడ, పూల వనాల కడియం, ప్రకృతి సోయగాల పాపికొండలు, ధవళేశ్వరం, మన్యప్రాంతాల రంపచోడవరం, మోతుగూడెం, మారేడుమిల్లి, సూర్యోదయాల గుడిసె, గలగలపాడే సెలయేరుల పింజరకొండ.. ఇలా అన్నింటినీ చుట్టిరావాల్సిందే.. పనసపొట్టు కూర నుంచి పులసల పులుసుదాకా, పూతరేకుల నుంచి కాకినాడ కాజా దాకా అన్నింటినీ రుచి చూడాల్సిందే! ఇంకా ఆంధ్రలో కృష్ణా పరీవాహక ప్రాంతాలు, హార్సిలీ హిల్స్, బెలూం కేవ్స్, గండికోట, కొండవీడు, ఉదయగిరి, ఒరవకల్లు, చంద్రగిరి, పెనుకొండ లాంటివాటినీ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. దక్షిణ భారతంలో కేరళ, ఉత్తర భారతంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య భారతంలో ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో మేఘాలయాలో రూరల్ టూరిజం ఎక్కువగా ఉంది. మనదేశంలో రూరల్ టూరిజం ద్వారా రూ. 4,300 కోట్ల అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇది గ్రామీణ భారతానికి, పట్టణ భారతానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందని, అందుకే దీన్నో ఇండస్ట్రీగా, భారీ ఆదాయ వనరుగా పేర్కొనవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు చేరితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని అభయారణ్యం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం, రామప్ప, పాండవులగుట్ట, వాజేడు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వస్తే రాచకొండ, భువనగిరి ఫోర్ట్, కొలనుపాక, వైజాగ్ కాలనీ, మెదక్‌లో నర్సాపూర్, ఏడుపాయల ప్లాన్ చేసుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నల్లమల ఉండనే ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రోజంతా గడపాలనుకునేవారికి ‘టైగర్ స్టే ప్యాకేజీ’ అందుబాటులోకి వచ్చింది. ఇదే దారిలో వటవర్లపల్లి సమీపంలో మల్లెలతీర్థం, ఆక్టోపస్ వ్యూపాయింట్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మన్ననూర్, ఈగలపెంట ఊళ్లల్లో తిరిగి అక్కడివారి జీవన శైలిని పరిశీలించవచ్చు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌లోని సుందర ప్రదేశాలనూ సందర్శించొచ్చు. వారాంతాల్లో సోమశిల, అమరగిరి, మంచాలకట్ట ప్రాంతాలూ రద్దీగా ఉంటున్నాయి. ఉత్తర తెలంగాణకు చేరితే.. వరంగల్ మినహా మిగిలిన ప్రాంతమంతా తెలంగాణ– ఆంధ్ర– మరాఠీ సంస్కృతి, గోదావరి ప్రవాహం, పచ్చని చేలతో భలే ఆకట్టుకుంటుంది. నిజామాబాద్‌లో నిజాంసాగర్, కందకుర్తి, శ్రీరాంసాగర్, పసుపు పంటల అంకాపూర్, ఆర్మూర్ ప్రాంతాలను చూడాల్సిందే.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకం ..ఇది వైవిధ్యాలకు నెలవు. పచ్చని ప్రకృతి, ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు, మహారాష్ట్ర ప్రభావం.. ఇవన్నీ కలిసి దీనికి స్పెషల్ అపియరెన్స్‌ను ఇస్తున్నాయి. ఈ వైవిధ్యాన్ని ఆస్వాదించడానికి, అబ్జర్వ్చేయడానికి జనాలు ఇక్కడికి వస్తుంటారు. చలికాలంలో జీరో డిగ్రీకి వెళ్లే తిర్యాణిలాంటి ప్రాంతాలను చూసేందుకు, ఆ మంచు వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు భ్రమణకాంక్ష కలవారు ఇక్కడికి క్యూ కడుతుంటారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్, కుంటాల, పొచ్చెర, సప్తగుండాలతో పాటు 30కి పైగా చిన్నా పెద్దా జలపాతాలు మరచిపోలేని అనుభూతులను పంచుతున్నాయి. వీటితోపాటు గోదావరి, కడెం, ప్రాణహిత, పెన్‌గంగా, వెన్‌గంగా తీరాలు, సమీప గ్రామాలు, జోడే ఘాట్, ఇం్రదవెల్లి, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన గిరిజన కోటలు, పూర్వయుగం నాటి ఆనవాళ్లున్న ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి దేశవిదేశాల అధ్యయనకారులూ వస్తుంటారు. ఇలా రూరల్ టూరిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో డెస్టినేషన్స్ ఉన్నాయి. గ్రామీణ పర్యాటకం ఎన్నో ప్రాక్టికల్ లెసన్స్‌ను నేర్పుతుంది. ప్రకృతి వనరుల మీద అవగాహన కల్పిస్తుంది. వాటి మీద గౌరవాన్ని పెంచుతుంది. శ్రమ విలువను చూపిస్తుంది. నిరాడంబర జీవన శైలి అవసరాన్ని తెలియజేస్తుంది. పరిణతినిస్తుంది. రూరల్ టూర్‌ని ఇంకా మొదలుపెట్టని వాళ్లు ఐటినరీ ప్రిపేర్ చేసేసుకోండి ఇక! ఇన్పుట్స్: కడారి రాజా, కిషోర్ కుమార్ పెరుమాండ్ల, పాదం వెంకటేశ్, తాండ్ర కృష్ణగోవింద్, ఆకుల రాజుపెద్దగా ఖర్చులేనిది..రూరల్ టూరిజాన్ని ఇష్టపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా! ఇలాంటి పర్యటనకు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ప్రకృతికి నష్టం చేయకుండా గ్రామీణ, నేచర్ బేస్డ్గా ఉండే పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే రాష్ట్రాల ఆర్థిక వృద్ధికీ మేలు కలుగుతుంది. – శ్యామ్‌సుందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్‌ఏఐ) తెలంగాణ చాప్టర్పల్లెల గురించి తెలియాలినాకు రకరకాల భాషలు, కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆర్కిటెక్చర్‌ను తెలుసుకోవడం, పరిశీలించడం ఇష్టం. అందుకే చాలా తరచుగా దేశీ, విదేశీ యానాలు చేస్తుంటా. వీకెండ్స్‌లో కచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంటా. కరోనా తర్వాత రూరల్ టూర్స్ పెరిగాయి. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రిటైర్డ్ ఎంప్లాయ్సే ఎక్కువగా రూరల్ టూర్స్‌ని ఇష్టపడేవాళ్లు! ఇప్పుడు ఫ్యామిలీస్, యూత్, స్కూల్ పిల్లలూ వస్తున్నారు. శుభపరిణామం. మనదేశ సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అర్థంకావాలంటే మన గ్రామాల గురించి తెలియాలి. కాబట్టి పల్లెటూళ్లకు వెళ్లాలి. – గిరిజ పైడిమర్రి, విహంగ (వైహెచ్‌ఏఐ) వైస్ ప్రెసిడెంట్ -
ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!
దసరా అనగానే నవరాత్రులు పండుగ హడావిడితో ప్రతి ఇల్లు ఆద్యాత్మకతకు నిలయంగా మారిపోతాయి. రోజుకో అమ్మవారి అలంకారంతో దేవాలయాల్లో భక్తుల సందడితో కిటకిటలాడగా..ఇళ్లన్ని అమ్మవారి ఆరాధనతో హోరెత్తిపోతుంటాయి. అయితే చాలామందికి ఈ సమయంలో అలా కాసేపు కొత్త ప్రదేశాలకి వెళ్లి.. అక్కడ పండుగ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఆధ్యాత్మిక ఆనందాన్ని, ప్రకృతి అద్భుతాలని తిలకించేలా చేసే ఈ కుట్రాలం టూర్‌కి వెళ్లాల్సిందే!.ఇది పర్యాటకులకు జాలువారే జలపాతాల అందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించే ఈ గొప్ప పర్యాటక ప్రదేశం విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.కుట్రాలం లేదా కుట్రాళం అద్భుతమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. దీనిని తరచుగా "స్పా ఆఫ్ సౌత్ ఇండియా" అని పిలుస్తారు. ఈ ప్రాంతం జలపాతాల హోరు తోపాటు అక్కడ కొలువై ఉన్న కుట్రాల నాదర్ స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నటరాజు అవతారమైన పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి.ఈ కుర్తాలంలోని శివలింగాన్ని అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించారని పురాణ కథనం. ఇక ఈ ఆలయాన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పాండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ఆలయం శిల్ప సంపద చూపురులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ కుట్రాల లేదా కుర్తాల నాదర్‌గా పిలవబడుతున్న పరమేశ్వరుడి తోపాటు అమ్మవారు వేణువాగ్వాదినీ దేవిగా పూజలందుకుంటోంది. ఆ అమ్మవారి తోపాటు పరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ కొలువై ఉన్న పరాశక్తి అమ్మవారి పీఠం 51 శక్తి పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వెలిసినప్పటికీ ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే నిర్వహించడం విశేషం.కుట్రాలంలో కొలువైన జలపాతాలు..పేరరువి జలపాతం (పేరరువి)ఎత్తు: సుమారు 60 మీటర్లు.కుత్రాలంలో అత్యంత ప్రసిద్ధ, అతిపెద్ద జలపాతం. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు.చిత్తరువి జలపాతం ఎత్తు: పేరరువితో పోలిస్తే చిన్నది.పేరరువి జలపాతానికి దగ్గరగా ఉంది, త్వరగా స్నానం చేయడానికి అనువైనది.ఐదు జలపాతాలు (ఐంతరువి)విశేషం: నీరు ఐదు పాయలుగా విడిపోయి జాలువారుతుంది. టైగర్ ఫాల్స్ (పులియరువి)అత్యంత చిన్న జలపాతం కావడం వల్ల పిల్లలకు, పెద్దలకు సురక్షితమైనది. పాత కుర్తాళం జలపాతం (పజయ కుర్తాళం)ప్రధాన జలపాతం నుంచి సుమారు 8 కి.మీ.చుట్టూ పచ్చని చెట్లతో, నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తోంది.షెన్బాగా జలపాతం (శెనబగాదేవి జలపాతం)చేరుకోవడానికి కొంచెం ట్రెక్కింగ్ అవసరం. సమీపంలోని దేవాలయం ప్రత్యేక ఆకర్షణ.హనీ ఫాల్స్ (తేనరువి)మూడు వైపుల నుంచి నీటి ప్రవాహంతో చూడచక్కగా ఉంటుంది.కొత్త జలపాతం (పుత్తు అరువి)తక్కువ రద్దీ, ప్రశాంతమైన అనుభూతిని అందిస్తోంది.ఫ్రూట్ గార్డెన్ ఫాల్స్ (పజతోట్ట అరువి)పండ్ల తోటలో ఉంది, జలపాతం123 కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌ను అందిస్తుంది.ఇక ఈ జలపాతాలన్నీ చిత్తార్, మణిముత్తారు, పచైయార్ మరియు తామిరబరణి వంటి నదుల ద్వారా ప్రవహిస్తాయి. ఇవి ఏడాది పొడవునా స్థిరమైన నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. ఎలా చేరుకోవాలంటే..తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగరం నుంచి కుట్రాలంకు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. కుట్రాలం ప్రాంతానికి సమీపంలోని రైల్వే స్టేషన్ పేరు తెన్కాశి. ఇక్కడినుంచి కుట్రాలం ప్రాంతానికి బస్సులు, ఆటోల సౌకర్యం ఉంది. ఇటు తెన్కాశి, కుట్రాలం ప్రాంతాల్లోనూ పర్యాటకులకు అన్ని సదుపాయాలు అందుబాటు ధరల్లోనే లభించడం విశేషం.(చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!) -
గంటకు 9 కిలోమీటర్లు.. మనదేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఇదే!
Nilgiri mountain train: బిజీ జీవితాన్ని పక్కనపెట్టి.. అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేయాలని ఉందా? ప్రకృతిని ఆస్వాదిస్తూ కన్నుల పండుగ చేసుకోవాలనిపిస్తోందా? అయితే మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ రైలు. ఇది గంటకు 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంత ఆలస్యంగా వెళ్లే రైలునెవరైనా ఎక్కుతారా? అని సందేహించకండి. పూర్తిగా తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుంటారు.మనదేశంలో విస్తృతమైన రైల్వే నెట్వర్క్ గురించి తెలిసిందే. కానీ అత్యంత నెమ్మదిగా వెళ్లడానికి ప్రసిద్ధి పొందిన ఈ రైలు తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఉంది. ఇది అంత నెమ్మదిగా నడిచినా మీకు ఏమాత్రం బోర్ కొట్టదు. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని అత్యద్భుతంగా మలుస్తుంది అక్కడి ప్రకృతి. మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు.. దట్టమైన అడవులు, పచ్చని తేయాకు తోటలు, ఎప్పుడూ నిలువెల్లా తడిసి మెరిసే రాతి కొండలు అబ్బుర పరుస్తాయి. ఇదంతా ఓకే.. కానీ ఆలస్యానికి కారణం మాత్రం.. అక్కడ ఉన్న వంతెనలు, సొరంగాలు. 100కు పైగా వంతెనల మీదుగా, 16 సొరంగాలలోంచి వెళ్తుంది. అత్యంత తీవ్రమైన ములుపులు వందకు పైనే ఉన్నాయి. మధ్యలో ఐదు స్టేషన్లు కూడా ఉన్నాయి. అందుకే 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఐదు గంటలు పడుతుంది. ఇది మనదేశంలో అత్యంత వేగవంతమైన రైలు కంటే సుమారు 16 రెట్లు నెమ్మది. కానీ మీరు దారి పొడవునా నీలగిరి కొండల అందాలను ఆస్వాదించవచ్చు. ఊటీ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం గంట తక్కువ సమయం తీసుకుంటుంది.రైలు ప్రయాణానికే కాదు.. ఈ మార్గం నిర్మాణానికో చరిత్ర ఉంది. ఈ మార్గాన్ని 1854లో ప్రతిపాదించారు. కానీ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ట్రాక్ నిర్మాణం చాలా కష్టమైంది. 1891లో మొదలుపెట్టి.. 1908లో పూర్తి చేశారు. ఇంతటి గొప్ప ట్రాక్‌మీద ప్రయాణించే రైలుకెంత ప్రత్యేకత ఉండాలో కదా! అందుకే ఈ రైలునూ అలాగే తయారు చేశారు. బోగీలన్నింటినీ కలపతో తయారు చేశారు. చదవండి: బాలపిట్టలూ బయటికెగరండిమేఘాలను ప్రతిబింబించే నీలి రంగు వేయడంతో వింటేజ్ భావన కలిగిస్తుంది. రైలులో నాలుగు బోగీలుంటాయి. ఫస్ట్ క్లాస్ బోగీలో 72 సీట్లు, సెకండ్ క్లాస్‌లో 100 సీట్లు ఉంటాయి. మొదట మూడు బోగీలే ఉండేవి. పర్యాటకులు పెరగడంతో అదనపు బోగీ ఏర్పాటు చేశారు. సెలవులు, వారాంతాల్లో బిజీగా ఉండే రైలులో ప్రయాణించాలంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కైలాస్నాథ్... చరణాద్రి శిఖరం
ఎల్లోరా గుహలు గురించి చాలామంది ఎన్నోసార్లు విని ఉంటారు, ఒకటి – రెండు సార్లయినా చూసి ఉంటారు కూడా. ఆ గుహల్లో ఒక శిలాగ్రంథం ఉంది. ఇది శివుడికి అంకితం చేసిన కైలాస్నాథ్ ఆలయం. కానీ రామాయణ, మహాభారత గ్రంథాలకు శిల్పరూపం ఈ ఆలయం. ఎల్లోరా గుహల్లో చెక్కిన ఏకరాతి ఆలయమే ఈ కైలాసనాథ్ ఆలయం.నంబర్ 16... కట్టిపడేసే గుహఎల్లోరా గుహలను ఏ కొండల్లో చెక్కారు? సమాధానం కొంచెం కష్టమే. ఎందుకంటే అవి మనకు ఎల్లోరా గుహలుగానే తెలుసు. ఆ గుహలను చరణాద్రి కొండల్లో చెక్కారు. సహ్యాద్రి శ్రేణుల్లో ఒక భాగం చరణాద్రి కొండలు. మహారాష్ట్ర, ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఎల్లోరా గుహలనగానే బౌద్ధ చైత్య, విహారాలే గుర్తొస్తాయి. కానీ ఈ గుహలు బౌద్ధ, హిందూ, జైన మతాల విశ్వాసాలకు ప్రతీకలు. ఒకటి నుంచి పన్నెండు వరకు బౌద్ధ గుహలు, 13 నుంచి 29 వరకు హిందూ గుహలు, 30 నుంచి వరకు 34 జైన గుహలు. కైలాస్నాథ్ ఆలయం 16వ గుహలో ఉంది. ఇవన్నీ ఏకకాలంలో చెక్కినవి కాదు.ఎల్లోరా గుహలు వందకు పైగా ఉన్నాయి. కానీ పర్యాటకులకు అనుమతి 34 వరకే. ఇవన్నీ ఒకేసారి చెక్కినవి కాదు. 8, 9,10 శతాబ్దాల్లో చెక్కిన గుహలు. కైలాస్నాథ్ గుహాలయాన్ని మాత్రం రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుని కాలంలో క్రీ.శ 756 – 773 మధ్యకాలంలో చెక్కారు. రాజు తీవ్రమైన అస్వస్థతకు గురైనప్పుడు రాణి ఆయన ఆరోగ్యం కోసం శివుడిని ప్రార్థించిందని, కైలాసాన్ని పోలిన ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కిందని చెబుతారు. రాజు ఆరోగ్యవంతుడైన తర్వాత కోకస శిల్పి పర్యవేక్షణలో కైలాస్నాథ్ ఆలయం రూపుదిద్దుకుంది. ఎల్లోరా పర్యాటకులు 33 గుహలకు కేటాయించినంత సమయం 16వ గుహలో గడుపుతారు. ఉత్తరాది ఆలయాలను చూసిన కళ్లకు ద్రవిడ శైలిలో చెక్కిన ఈ ఆలయం కనువిందు చేస్తుంది..గ్రంథాలకు శిల్పరూపంప్రత్యేకించి ఈ ఆలయం పొడవు 164 అడుగులు, వెడల్పు 109 అడుగులు, ఎత్తు 98 అడుగులు. ఏకరాతి ఆలయం అంటే చిన్నదో లేదా ఒక మోస్తరు ఆలయమో అనుకుంటాం. కానీ ఈ ఆలయాన్ని పూర్తిగా శిల్పసౌందర్యాన్ని ఆస్వాదిస్తూ తిలకించడానికి మూడు గంటలు కేటాయించాలి. భారతీయ శిల్పచాతుర్యానికి గీటురాయి ఇది. ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. ఒక్కో ΄పార్శ్వంలో ఒక్కో ΄పౌరాణిక గ్రంథాన్ని చూడవచ్చు. 14 కాండల రామాయణం ఒక గోడలో, 18 పర్వాల మహాభారతం మరో గోడలో శిల్పాల రూపంలో ఒదిగిపోయాయి. ఇన్ని ప్రత్యేకతలున్నప్పుడు యునెస్కో గుర్తించకుండా ఉంటుందా? ఎల్లోరాను 1983లోనే గుర్తించింది..ఈ సెలవుల్లో వెళ్లాలి!శిరిడీ, ఔరంగాబాద్, అజంతా, ఎల్లోరాలు సాధారణంగా వేసవి సెలవుల టూర్ ప్లాన్‌లో ఉంటాయి. కానీ వేసవిలో గుహల్లో పర్యటన కష్టం. గుహలోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ బయటకు రాగానే భరించలేనంత వేడితో సతమతమవుతాం. కాబట్టి దక్కనులో గుహల పర్యటనకు ఈ సీజన్ బాగుంటుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ట్రెక్కింగ్‌కి కేరాఫ్‌గా భువనగిరి కోట..!
హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగి ఇల్లు చేరాలంటే భువనగిరి కోట ఒక చక్కటి టూరిస్ట్ ప్లేస్. ఐదు వందల అడుగుల ఎత్తులో, నలభై ఎకరాల్లో విస్తరించిన నిర్మాణం ఇది. భువనగిరి కోటను నిర్మించిన రాజు పేరు త్రిభువన మల్ల విక్రమాదిత్య. ఈ కోట 11వ శతాబ్దం నాటిది. చరిత్ర పుటల్లో అతడి పేరుతోనే త్రిభువనగిరిగా ఉంటుంది. వ్యవహారంలో భువనగిరి, బోన్గిర్ అయిపోయింది. ఈ కోట ముందు సర్దార్ సర్వాయపాపన్న విగ్రహం ఉంటుంది. గూగుల్ మ్యాప్ డైరెక్షన్ కోట సమీపం వరకు మాత్రమే. ఎంట్రన్స్ ఎటు వైపు ఉందో తెలియక తిరిగిన రోడ్లలోనే చుట్టు తిరగాల్సి వస్తుంది. కాబట్టి స్థానికుల సహాయంతో ముందుకెళ్లాలి. టూరిస్ట్ ప్లేస్‌గా ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. ఎంట్రీ టికెట్, కెమెరాకి టికెట్ తీసుకోవాలి. వాటర్ బాటిళ్లు, తినుబండారాలు తగినన్ని వెంట తీసుకువెళ్లాలి. కోట సమీపంలో కూడా పర్యాటకులకు సౌకర్యాలు పెద్దగా లేవు. వాహనం పార్కింగ్‌కి కోట ముందు విశాలమైన ప్రాంగణం ఉంది. కానీ నీడ కోసం ఎటువంటి ఏర్పాటూ లేదు. తగినన్ని ఏర్పాట్లు లేవనే అసౌకర్యం నిజమే. కానీ వాహనాల హారన్ల మోతలు లేకుండా, పిన్ డ్రాప్ సైలెన్స్‌తో కూడిన వాతావరణం హైదరాబాద్ నగరవాసికి స్వర్గమనే చెప్పాలి. స్వచ్ఛమైన చల్లటి గాలి ఒంటిని తాకుతుంటే కలిగే హాయిని ఫీల్ అవ్వాల్సిందే, మాటల్లో వర్ణించలేం. పదిహేనేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల వాళ్లు కూడా ఈ ట్రెక్కింగ్ టూర్‌ను చక్కగా ఆస్వాదించగలుగుతారు.ఈ టూర్‌కి వెళ్లేటప్పుడు షూస్ చక్కగా ట్రెకింగ్‌కి అనువుగా ఉండాలి. అలాగే హైదరాబాద్– వరంగల్ హైవే మీద ఉన్న హోటళ్లలో తినేసి వెళ్లాలి. తిరుగు ప్రయాణంలోనూ ఆకలి తీర్చేది కూడా హైవే మీదున్న హోటళ్లే. ట్రెకింగ్ పూర్తయిన తర్వాత తిరుగుప్రయాణంలో చేసే భోజనంలో థాలి రుచి కూడా అంతే అద్భుతం. (చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!) -
Hyderabad: సెలయేటికి చలో..
చిన్ని చిన్ని ఆశ అంటూ పాతికేళ్ల క్రితం ఓ సినిమాలో హీరోయిన్ నీళ్లలో తడుస్తూ పరవశించి పాడినా, జల.. జల.. జలపాతం.. నువ్వు అంటూ ఇటీవల ఓ సినిమాలో హీరో కీర్తించినా.. ప్రకృతి అందాల్లో జలధారల ప్రత్యేకతే వేరు. అలాంటి నిలువెత్తు నీటి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే వాటర్ ఫాల్స్‌ని మించిన మార్గం లేదు. ఆ తెల్లని నీళ్ల సిరుల్ని కళ్లకు హత్తుకోవాలంటే.. మాన్సూన్ని మించిన సీజన్ లేదు. మిగిలిన అన్ని కాలాల్లోనూ పొడి పొడిగా సాదాసీదాగా కనిపించే ప్రాంతాలు.. వర్షాకాలంలో మాత్రం హర్షామోదాల కేరింతల నిలయాలుగా మారిపోతాయి. ఈ సీజన్లో నప్పే ట్రిప్స్‌గా జలధారల దారి పట్టేవారి కోసం మన నగరం నుంచి అందుబాటు దూరంలో ఉన్న కొన్ని జలపాతాల విశేషాలివి.. వాటర్ ఫాల్స్.. ఈ పేరు చెప్పగానే ప్రకృతి ప్రేమికులు ఎవరైనా వాటి అందాలను ఆస్వాదించేందుకు ఉవి్వళ్లూరుతారు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఆ జలపాతం కింద తడిసి ముద్దవ్వాలనుకుంటారు. నగరం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో పలు జలపాతాలు నగర వాసులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వర్షా కాలంలో కొండ కోనల్లో ప్రకృతి ఒడిలో గంగ పరవళ్లు.. సెలయేటి గలగలలు చెవులకు వినసొంపుగా వినిపిస్తాయి. భువనగిరికి దగ్గర్లో ఓ జలపాతం ఉంటుంది. చుట్టూ పచ్చదనం రాతి గుట్టలు ప్రకృతి ప్రేమికులకు కొత్త అనుభూతిని ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తుంది. బొగత.. మన ఘనత..తెలంగాణ వాసులు సగర్వంగా చెప్పుకునే అద్భుత అందాల ఘనతగా బొగత జలపాతాన్ని చెప్పుకోవచ్చు. భద్రాచలం నుంచి 120 కిమీ దూరంలో నగరం నుంచి 329 కిమీ దూరంలో ఉందీ వాటర్ ఫాల్స్. ఖమ్మం జిల్లాలో, రాష్ట్రంలో రెండో అతిపెద్ద జలపాతం ఇదే. తెలంగాణ నయాగరగా పేరుగాంచి మాన్సూన్లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. ఇక్కడకు చేరుకోడానికి సందర్శకులు కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. రాయకల్.. జలరాశుల్.. పోతపోసిన ప్రకృతి అందాల నిలయం రాయకల్ జలపాతం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పెద్దగట్లు, రాయకల్ జలపాతం ఉంటాయి. మార్గమధ్యంలో పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించొచ్చు. కొండమీది నుంచి రాసులు పోస్తున్నట్టు కిందకు దుమికే నీటి ధారలు రాయకల్ జలపాత దృశ్యం కనువిందు చేస్తుంది. మల్లెల తీర్థం.. అరణ్య మార్గం.. నగరానికి దాదాపు 185 కిమీ దూరంలో నల్లమల అరణ్యంలో ఉంది. ఈ జలపాతానికి చేరుకోడానికి, అడవి గుండా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంతమేర సాహసోపేతమైన ప్రయాణం అనే చెప్పాలి.రాజేంద్రనగర్.. వాటర్ ఫాల్స్.. నగరానికి కేవలం 13.9 కిమీ దూరంలో ఈ సుందరమైన జలపాతం శీఘ్ర విహారానికి అనువైనది. సందర్శకులు ఒక చిన్న రైడ్ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు.జలజల.. కుంటాల.. తెలంగాణలోనే ఎత్తైన జలపాతం. నగరం నుంచి 564.9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ఆదిలా బాద్‌లో ఉంది. దాదాపు 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతూ వీక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.వైజాగ్ వారి ఆతిథ్యం.. అందం ‘చందం’ నల్లగొండ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ కాలనీ ఉంది. దేవరకొండ నియోజకవర్గంలోని చందం పేట మండలంలో కృష్ణానది బ్యాక్ వాటర్ ఆనుకుని ఉన్న కుగ్రామం ఇది. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నలువైపులా నల్లమల అడవులు, గుట్టలతో కప్పి ఉంటుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు వైజాగ్‌కు చెందిన కొన్ని కుటుంబాలు స్థిరపడడంతో దీనికి వైజాగ్ కాలనీగా పేరొచి్చంది. వీకెండ్లో టూరిస్టుల కోసం కాలనీ వాసులే వసతి ఏర్పాట్లు చేస్తుంటారు. బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. కృష్ణానదిలో పట్టిన తాజా చేపల వంటకాలు ఇక్కడ ఫేమస్.ఎత్తిపోతల.. జలకళ.. సిటీకి 163.4 కిలోమీటర్ల దూరంలో చంద్రవంక నది సమీపంలో ఈ జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటుంది. సమీపంలోని మొసళ్ల పెంపక కేంద్రం కూడా సందర్శనీయమే. నాగార్జున సాగర్ డ్యామ్ వైపు ఎన్‌హెచ్ 56 నుంచి డ్రైవింగ్ చేయడం ద్వారా జలపాతాన్ని, డ్యామ్‌ను చూడవచ్చు.భీముని పాదం.. ఆనందానికి ఆ‘మోదం’ దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూఎత్తయిన కొండలు, పక్షుల కిలకిలలు. సాయంత్రం వేళ అడవి జంతువుల అరుపులు, వర్షా కాలంలో ఎత్తయిన గుట్ట మీది నుంచి పాదం మధ్యలో జాలువారే నీటి సిరులు.. అస్వాదించాలంటే భీమునిపాదం జలపాతం దగ్గరికి పోవాల్సిందే. మానుకోట జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతంగా దీన్ని చెప్పుకుంటారు.ఏడు బావుల.. వింతలా..బయ్యారం, గంగారం సరిహద్దుల్లో మిర్యాలపెంట సమీపంలో ఏడుబావుల జలపాతాలున్నాయి. పాండవుల గుట్టపై సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. జలపాతం నుంచి కిందికి పడే నీళ్లు కొద్ది దూరం ప్రవహించి తరువాత అదృశ్యమవడం. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా నీళ్లు పడుతూ కనువిందు చేస్తుంది.పచ్చని నెచ్చెలి.. చెచ్చెర..ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎన్నో జలపాతాలున్నా ఎక్కువ మందికి పరిచయం లేని జలపాతం చెచ్చెర. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని కౌరగామ్ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉందీ జలపాతం. ఎత్తయిన కొండల మధ్యలో 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకే జలపాతాన్ని చూడటం కనువిందే. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆకట్టుకుంటాయి. -
ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!
రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యింది. నవంబర్ 27న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ప్రదానం చేయనుంది. భారతదేశంలోని రాష్ట్రాలలో ఎన్నో గొప్ప విశిష్టత గల గ్రామలున్నాయి. వాటన్నింటిని వెనక్కినెట్టి రాజస్థాన్‌లోని ఈ గ్రామమే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎలా ఎంపికయ్యిందో వింటే ఆశ్చర్యపోతారు. ఈ గ్రామానికి ఉన్న స్పెషాలిటీ తెలిస్తే.. ఈ రోజుల్లో కూడా ఇలా నియబద్ధంగా ఎవరు ఉంటున్నారు అని ఆశ్చర్యపోతారు. రాజస్తాన్‌లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం పేరుకి తగ్గట్టుగానే చక్కటి జీవనశైలితో దేదీప్యమానంగా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలెవ్వరూ కూడా మాంసం, చేపలు, మద్యం ముట్టరట. ఇలా అందరూ నియమబద్ధంగా ఉండటం అంత ఈజీ కాదు గదా..!. అలాగే అక్కడ వేప కలపను ఎవ్వరూ కాల్చడం వంటివి చేయరట. అంతేగాదు కిరోసిన్ ఉపయోగించడం కూడా నిషిద్ధం. ఆ గ్రామంలో దేవ్‌నారాయణ్ ఆలయం ప్రసిద్ధ ఆలయంగా పూజలందుకుంటోంది. ప్రతి ఏడాది లక్షలాదిమంది పర్యాటకులు సందర్శించడానికి వస్తుంటారట. మసుదా ఉపవిభాగంలోని ఆరావళి కొండల మధ్య ఉన్న ఈ గ్రామం సుమారు మూడు వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ సిమ్మెంట్, కలపతో చేసిన పక్కా ఇళ్లు కూడా ఉండవు. అన్ని మట్టితో చేసిన ఇళ్లే ఉంటాయి. అయితే కొండపై వెలసిన దేవనారాయణుని అందమైన ఆలయం ఈ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక ఈ ఉత్తమ పర్యాటక గ్రామ పోటీని పర్యాట మంత్రిత్వ శాఖ నిర్వహించింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ గొప్ప సంస్కృతిని కొనసాగిస్తున్న గ్రామాలను గుర్తించి మరీ ఆ గ్రామాన్ని ఎంపిక చేశారు.. ముఖ్యంగా సమతుల్య జీవన విధానం, పర్యావరణం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఉత్తమ పర్యాట గ్రామలను ఎంపిక చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాటన్నింటి ఆధారంగానే 'దేవమాలి గ్రామం' ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యిందని మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ జనరల్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "రాజస్థాన్ గర్వించదగ్గ ఘట్టం!. ఈ గ్రామం సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది." అని సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. అలాగే కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ దేవమాలి గ్రామాన్ని అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అనేది రాజస్థాన్‌కి ఎంతో గర్వకారణం అన్నారు. (చదవండి: అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్‌తో పోరాటం మరోవైపు..!) -
ఎకో ఊటీ.. నీలగిరి సౌందర్యం
ఊటీకి టూరెళ్దామా? అంటే ఎగిరి గంతేసిన బాల్యం వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. మధ్యతరం ఊటీలో ఏముంది అవే టీ తోటలు, అదే దొడబెట్ట, అదే టాయ్ ట్రైన్, బొటానికల్ గార్డెన్, పాటలు చిత్రీకరించిన కూనూరు... అని పెదవి విరిచేశాయి. డెబ్బై, ఎనభైల దక్షిణాది సినిమాల్లో చూసిందే కదా ఊటీ అని తేల్చేయడమూ కరెక్టే. అయితే ఊటీ అంటే సినిమాల్లో చూసిన ఊటీ మాత్రమే కాదు. ఇంకా చూడాల్సిన ఊటీ చాలానే ఉంది. ముఖ్యంగా ఎకో టూరిజమ్‌లో ఊటీకి పాతిక కిలోమీటర్ల దూరాన నీలగిరుల్లో విస్తరించిన అవలాంచే సరస్సు వైపు అడుగులు వేద్దాం.మెల్లగా సాగే ప్రయాణం... ఊటీ ఎకో టూరిజమ్ అవలాంచె చెక్‌పోస్ట్ నుంచి మొదలవుతుంది. ఇరవై కిలోమీటర్ల ప్రయాణం మధ్యలో మూడు వ్యూ పాయింట్లు ఉంటాయి. షోలా ఫారెస్ట్ వ్యూ పాయింట్. మరికొంత దూరంలో భవానీ ఆలయం, లక్కడి. ఈ మూడు పాయింట్లను కలుపుతూ రౌండ్ ట్రిప్ ఇది. ప్రయాణం వేగంగా గమ్యానికి చేరాలన్నట్లు ఉండదు. ప్రదేశాన్ని ఆసాంతం కళ్లారా చూడడానికి రెండు గంటల సేపు సాగుతుంది. తిరిగి అవలాంచె చెక్‌పోస్టు దగ్గర దింపుతారు.పశ్చిమం నుంచి తూర్పుకు ప్రయాణం... అవలాంచె సరస్సు చేరడానికి సన్నటి రోడ్డు మీద సాగే ప్రయాణం. ప్రకృతి సౌందర్యంతో΄ాటు కొండ శిఖరాలను చూడవచ్చు. భవానీ ఆలయం నుంచి అరకిలోమీటరు దూరం నడిస్తే అందమైన జల΄ాతం, అప్పర్ భవానీ డ్యామ్ బ్యాక్ వాటర్స్ కనువిందు చేస్తాయి. భవానీ నది కేరళలోని పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ తమిళనాడుకి వచ్చి కావేరినదిలో కలుస్తుంది. గిరి జనపథం... ఊటీ ఎకో టూరిజమ్ జోన్లోకి ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. పర్యాటకుల వాహనాలు అవలాంచె చెక్‌పోస్ట్ దగ్గర ఆగిపోవాలి. అక్కడి నుంచి టూరిజమ్ డిపార్ట్మెంట్ వాహనంలోకి మారాలి. విడిగా ట్రిప్ కావాలనుకుంటే ఎనిమిది మందికి ఒక జీపు ఏర్పాటు చేస్తారు. ఈ టూర్లో నీలగిరుల్లో టోడా గిరిజన తెగ నివసించే ప్రదేశాలను కూడా చూడవచ్చు. వారి ఇళ్ల నిర్మాణం, దుస్తుల మీద వారు చేసే ఎంబ్రాయిడరీ ప్రత్యేకమైనవి. ఒక చేతిరుమాలైనా కొనుక్కుంటే ఆ కళకు ్రపోత్సాహంగానూ, టూర్‌కి గుర్తుగానూ ఉంటుంది.∙ -
Ananthagiri Hills: కూల్ వెదర్..హాట్ స్పాట్..
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నగర ప్రజలు, ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నారు. అందుకు అనువైన ప్రదేశంగా హిల్ స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. ట్రెక్కింగ్, రైన్ డ్యాన్స్, వాటర్ ఫాల్స్, ఫైర్ క్యాంప్, అడ్వెంచర్ గేమ్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. ఇటువంటి సందర్భాల్లో హిల్ స్టేషన్లలో ఫైర్ క్యాంప్‌తో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. దీనికి తగ్గట్లు రిస్సార్ట్స్, హోటల్ యాజమాన్యాలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. రానున్నది శీతాకాలం. కాబట్టి ఫిబ్రవరి వరకూ ఈ క్యాంపులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.ఔటర్ చుట్టూ.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వందల సంఖ్యలో ఫాం హౌస్‌లు, పదుల సంఖ్యలో స్టార్ హోటల్స్, రిసార్టులు ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. రానున్న శీతాకాలంలో సాయంత్రం మంచు కురిసే వేళలో వెచ్చగా ఫైర్ క్యాంప్ కల్చర్ వచ్చే ఐదు నెలలపాటు కొనసాగుతుంది. దీనికి తోడు పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం, ఇతర ఫంక్షన్లు వంటి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఎత్తైన హిల్ స్టేషన్లలో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, వాయు, శబ్ధ కాలుష్యాలకు దూరంగా, ఇతర ఆటంకాలు ఉండని చోటు కోరుకుంటున్నారు. చల్లని వాతావరణంలో.. క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని చలికాచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ స్వీట్ మెమొరీస్‌ను పదిలం చేసుకుంటున్నారు.ఆకర్షణగా అనంతగిరి హిల్స్.. హైదరాబాద్ సమీపంలో హిల్ స్టేషన్ అనగానే గుర్తుకొచ్చేది అనంతగిరి హిల్స్. పాల నురగలు కక్కుతూ జాలువారే వాటర్ ఫాల్స్, అనంత పద్మనాభస్వామి దేవాలయం, దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చని కొండలు, ఆ పక్కనే పదుల సంఖ్యలో అత్యాధునిక వసతులతో కూడిన రిసార్ట్స్. ఉదయం లేత సూర్యకిరణాలు తాకుతున్న వేళ ట్రెక్కింగ్, సాయంత్రం చల్లని వాతావరణంలో వెచ్చగా ఫైర్ క్యాంపు, ఆపై రెయిన్ డ్యాన్స్‌లు, వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్లు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో అనంతగిరి హిల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రిసార్ట్స్‌కు రోజుకు రూ.3వేల నుంచి రూ.10 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారాంతపు డెస్టినేషన్ హిల్ స్టేషన్‌గా అనంతగిరి వెలుగొందుతోంది.రెండు సీజన్లలో క్యాంప్ ఫైర్.. రానున్న శీతాకాలం ఎక్కువ మంది క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్ అడుగుతుంటారు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా క్రీడలు, అడ్వెంచర్ గేమ్స్, రోప్ వే సంబంధిత కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ప్యాకేజీలు మారుతుంటాయి. వేసవిలో వాటర్ స్పోర్ట్స్, రెయిన్ డ్యాన్స్, వర్షాకాలం, శీతాకాలంలో క్యాంప్ ఫైర్‌కు ఎక్కువ ఆదరణ ఉంటుంది. – పీ.గంగాథర్ రావు, హరివిల్లు రిస్సార్ట్స్ నిర్వాహకులు, వికారాబాద్ఆ వాతావరణం ఇష్టం..చల్లనివాతావరణంలో వెచ్చగా మంట కాగుతూ, పాటలు పాడుకుంటూ డ్సాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. కొడైకెనాల్, కూర్గ్, వయనాడ్, వికారాబాద్ తదితర ప్రాంతాలకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి రిసార్ట్స్ యజమానులే క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసేవారు. బయటకు వెళ్లినప్పుడు ఒత్తిడిని మర్చిపోయి, హాయిగా గడపాలని అనుకుంటాం. ఎత్తయిన కొండ ప్రాంతాల్లో రాత్రి వేళ చుక్కలను చూసుకుంటూ, స్వచ్ఛమైన వాతావరణంలో మనసుకు హాయిగా ఉంటుంది. – జి.సిద్ధార్థ, ఉప్పల్ -
బాజీరావు ఇల్లు
రణవీర్ సింగ్, దీపికా పడుకోన్ నటించిన బాజీరావ్ మస్తానీ సినిమా గుర్తందా? ఆ సినిమాలో బాజీరావు ఇల్లు శనివార్వాడా కళ్ల ముందు మెదులుతోందా? ఆ శనివార్ వాడా ఉన్నది పూణేకి సమీపంలోనే. ఆ సినిమాలో అనేక ప్రధానమైన సన్నివేశాల చిత్రీకరణ ఈ కోటలోనే జరిగింది. పూణేకి వెళ్లాల్సిన పని పడితే తప్పకుండా చూడండి. కోట ప్రధానద్వారం భారీ రాతి నిర్మాణం. ఏడంతస్థుల నిర్మాణంలో ఒక అంతస్థు మాత్రమే రాతి కట్టడం, ఆ తర్వాత ఇటుకలతో నిర్మించారు. కోటలోపల ప్రతి అంగుళమూ మరాఠాల విశ్వాసాలను, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంటుంది. 18వ శతాబ్దం నాటి ఈ నిర్మాణం భారత జాతీయ రాజకీయ క్లిష్టతలను కూడా ఎదుర్కొంది. 19వ శతాబ్దంలో కొంత భాగం అగ్నికి ఆహుతైపోయింది. నిర్మాణపరంగా, చరిత్ర పరంగా గొప్ప నేపథ్యం కలిగిన ఈ కోట పర్యాటకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. బాజీరావు మస్తానీ సినిమా తర్వాత పలువురి దృష్టి దీని మీదకు మళ్లింది. మహారాష్ట్ర టూరిజమ్ గార్డెన్లను మెయింటెయిన్ చేస్తోంది.కానీ పెరుగుతున్న పర్యాటకులకు తగినట్లు పార్కింగ్, రెస్టారెంట్ సౌకర్యం లేదు. ఈ కోటలో కాశీబాయ్ ప్యాలెస్, అద్దాల మహల్ పిల్లలను ఆకట్టుకుంటాయి. ఈ కోట లోపల తిరుగుతూ ఉంటే సినిమా దృశ్యాలు కళ్ల ముందు మెదులుతూ మనమూ అందులో భాగమైన భావన కలుగుతుంది. టీనేజ్ పిల్లలకు ఈ నిర్మాణాన్ని చూపించి తీరాలి. -
రూట్ బ్రిడ్జ్ యునెస్కో జాబితాలో...
మేఘాలయ రాష్ట్రంలో సర్వసాధారణంగా కనిపించే లివింగ్ రూట్ బ్రిడ్జీల గురించి మనకు తెలిసిందే. ఆ రాష్ట్రానికే మన దేశానికీ ప్రకృతి పరంగా గుర్తింపు తెచ్చిన ఈ రూట్ బ్రిడ్జ్‌లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వడం కోసం ప్రతినిధుల బృందం తరలి వచ్చింది. ప్రస్తుతం యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉన్న లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లను ప్రపంచ ప్రసిద్ధ వారసత్వ జాబితాలోకి చేరనుందని మేఘాలయ పర్యాటక మంత్రి పాల్ తెలియజేస్తున్నారు. 42వ యునెస్కో జనరల్ కాన్ఫరె ్స ప్రెసిడెంట్, రొమేనియా రాయబారి అయిన సిమోనా–మిరేలా మికులేస్కుతో లింగ్డో, జింగ్కీంగ్ జ్రీ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో గుర్తించడం కోసం సమావేశం జరి΄ారు. ఈ సమావేశంలో యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి కూడా ఉన్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో టెర్రకోట కళ
సంప్రదాయ టెర్రకోట కళనుప్రోత్సహించి కళాకారులను ఆదుకునేందుకు ఉత్తర్‌ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సిద్దమయ్యింది. గోరఖ్ పూర్ ప్రాంతానికి చెందిన ఈ అరుదైన కళను కాపాడటమే కాదు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో నాలుగు ప్రత్యేక స్టాల్స్‌లో కళాకారుల ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్ 25–29 వరకు జరగనున్న ఈ కార్యక్రమం ద్వారా టెర్రకోట కళను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది యూపీ సర్కార్.టెర్రకోట కళను ప్రోత్సహించే దిశగా 2018లోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయమే టెర్రకోట పరిశ్రమను పూర్తిగా మార్చేసిందని జాతీయ అవార్డు గ్రహీత, టెర్రకోట కళాకారుడు రాజన్ ప్రజాపతి అన్నారు. 2017కి ముందు కష్టాల్లో ఉన్న ఈ కళ ఇప్పుడు కొత్త ఎత్తుకు చేరుకుందని, ఈ ఒక్క ఏడాదే వివిధ రాష్ట్రాల నుండి రూ.7 కోట్లకు పైగా ఆర్డర్లు వచ్చాయని తెలియజేశారు.ప్రపంచ మార్కెట్లోకి...త్వరలో జరగనున్న వాణిజ్య ప్రదర్శనలో విభిన్న రకాల టెర్రకోట ఉత్పత్తులను ప్రదర్శిస్తారు, ఇది ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించడానికి కళాకారులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. సిఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కళను బ్రతికించేందుకు, కళాకారులను ఆదుకునేందుకు నిరంతర బ్రాండింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రభుత్వ ప్రయత్నాలూ కళకు చేదోడుఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ గోరఖ్‌పూర్ పర్యటన సందర్భంగా సిఎం యోగి టెర్రకోట గణేష్ విగ్రహాన్ని బహుమతిగా అందజేశారు. 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు టెర్రకోట విగ్రహాలను అందజేసారు. ఇలా ఈ కళకు ప్రచారం కల్పంచేందకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నది అక్కడి ప్రభుత్వం. ప్రభుత్వ ప్రయత్నాలు కళను ప్రోత్సహించమే కాకుండా దాని నాణ్యత, ఆకర్షణను కూడా నిర్ధారించాయి. దీని ఫలితంగా ప్రముఖులు, వారి సిబ్బంది గణనీయమైన కొనుగోళ్లు చేశారు. ప్రపంచ మార్కెట్ ఇప్పుడు అందుబాటులోకి రావడంతో గోరఖ్‌పూర్ టెర్రకోట క్రాఫ్ట్ అపూర్వమైన ప్రఖ్యాతిని సొంతం చేసుకుంటోంది. -
మస్కట్ పిలుస్తోంది!
సెప్టెంబర్ నెలలో రాజధాని నగరం మస్కట్ నగరంలో విహరించమని పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది ఒమన్ దేశం. చల్లటి వాతావరణంలో టూరిస్టుల తాకిడి తక్కువగా ఉన్న సమయం షాపింగ్‌కి అనువైన కాలం అంటూ ఈ వీసా సౌకర్యం కల్పిస్తోంది ఒమన్ టూరిజం. ఇక్కడ ఏమేమి చూడవచ్చు, ఏమేమి కొనవచ్చు! ఓ లుక్ వేద్దాం.మస్కట్ నగరంలో పురాతన కోటలున్నాయి, అద్భుతంగా నిర్మించిన మసీదులున్నాయి, కనువిందు చేసే ΄ార్కులు, సంస్కృతి సంప్రదాయాలు చరిత్రకు ఆలవాలంగా భారీ మ్యూజియాలున్నాయి. అల్ జలాయ్ ఫోర్ట్‌ను చూడాలి. 16వ శతాబ్దంలో ΄ోర్చుగీసు స్వాధీనంలోకి వెళ్లిన అరబ్బుల కోట ఒమన్ చరిత్రకు ప్రతిబింబం. ఇక ప్రార్థన మందిరాలను చూడాలంటే సుల్తాన్ ఖాబూస్ గ్రాండ్ మాస్క్. ఇది ఎంత పెద్దదంటే ఒకేసారి ఇరవై వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చన్నమాట. ఇక షాపింగ్ చేయాలంటే ముత్రాహ్ సౌక్‌ను తప్పకుండా చూడాలి. అరబిక్ సంప్రదాయం కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు ఉంటుంది. ముండూస్ (ఆభరణాల పెట్టె), టర్కీ కార్పెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, పోస్ట్ కార్డ్, పెర్ఫ్యూమ్, కర్జూరాలను కొనుక్కోవచ్చు. కశ్మీర్ కార్పెట్లు ఈ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణ.మ్యూజియం చేసే మ్యాజిక్: నేషనల్ మ్యూజియంలోకి వెళ్లిన తర్వాత మనకు తెలియకుండానే టైమ్ మెషీన్‌లోకి వెళ్లి΄ోతాం. ఎన్ని గంటలకు బయటకు వస్తామో చెప్పలేం. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది బైట్ అల్ జుబైర్ గురించి. ఇది ఓమన్ సంప్రదాయ వాస్తుశైలి నిర్మాణం. ఫర్నిచర్, హస్తకళాకృతులు, స్టాంపులు, నాణేల సుమహారం. ఇదీ సింపుల్‌గా మస్కట్ నగరం. ముంబయి నుంచి డైరెక్ట్ ఫ్లయిట్ ఉంది. రెండున్నర గంటల ప్రయాణం. -
రాణాల ప్రతాపానికి ప్రతీక
రాజ్ మహల్... తాజ్ మహల్ కాదు, రాజ్ మహలే. రాజస్థాన్‌లో చల్లటి నగరం ఉదయ్‌పూర్‌లో ఉందీ రాజ్‌మహల్. రాజస్థాన్ అనగానే విస్తారమైన ఎడారి, ఇసుక తిన్నెలు, ఎండకు మిలమిల మెరుస్తున్న ఇసుకలో సుదూర ప్రయాణం చేస్తున్న ఒంటె అడుగు జాడలు గుర్తొస్తాయి. దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఉదయ్‌పూర్. నగరంలో ఎటు వెళ్లినా ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది. కనుచూపు మేరలో ఆరావళి పర్వతాలు పచ్చగా ఉంటాయి. ఆ పచ్చదనానికి దీటుగా నగరంలో కోటలోపల ప్యాలెస్‌ల మీద కూడా చెట్లు ఉంటాయి. వాటిని చెట్లు అనకూడదు, మహావృక్షాలవి. కొండ శిఖరం, వాలును ఆసరాగా చేసుకుని నిర్మించిన ప్యాలెస్‌లో చెట్ల మొదళ్లు మూడో అంతస్థులో ఉంటాయి. రాజ్‌మహల్ పేరుతో నిర్మించినప్పటికీ సిటీప్యాలెస్గా వ్యవహారంలోకి వచ్చింది. ఈ ప్యాలెస్ గురించి చెప్పుకునే ముందు పద్మావత్ సినిమాలో చూసిన చిత్తోరగఢ్ను గుర్తు చేసుకోవాలి. మహారాణా ఉదయ్ సింగ్ (రాణాప్రతాప్ తండ్రి) పుట్టిన కోట అది. అది అన్యాక్రాంతమైన తర్వాత ఉదయ్‌సింగ్ ఈ నగరాన్ని నిర్మించి ఇక్కడి నుంచే పాలన కొనసాగించాడు. నగరం శత్రుదుర్భేద్యంగా ఉండాలి, అదే సమయంలో నీటికి ఇబ్బంది లేకుండానూ ఉండాలనే ఉద్దేశంతో కొండలు, సరస్సుల మధ్య నిర్మించాడు. అందుకే దీనిని లేక్ సిటీ, కశ్మీర్ ఆఫ్ రాజస్థాన్ అంటారు.వంట పాత్రలు... ఇనుప కవచాలుసిటీ ప్యాలెస్... పిచోలా సరస్సు ఒడ్డున ఉంది. సిటీ ప్యాలెస్ ఎక్స్టీరియర్ వ్యూ అది కూడా ఒక వైపు కవర్ చేయాలంటే పిచోలా లేక్‌లో బోట్ షికారు చేయాలి. రాణి వంట గది ప్యాలెస్ లోపల ఉంటుంది. సిసోడియా రాజ వంశీయులు సూర్యుడిని ఆరాధిస్తారు. రోజూ సూర్యుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. ప్యాలెస్లోపల అనేక చోట్ల సూర్యుడి లోహపు రూ΄ాలుంటాయి. శీతాకాలంలో మబ్బు పట్టి సూర్యుడు కనిపించని రోజుల్లో లేత కిరణాలు ఆ లోహపు సూర్యుడి ప్రతిమ మీద ప్రతిబింబిస్తాయి. ఆ ప్రతిబింబానికి నమస్కారం చేసి వంటకాలు నివేదన చేస్తారు. సూర్యుడికి నివేదించే వంటలను ప్యాలెస్ లోపలి వంటగదిలో రాణి స్వయంగా చేయడం ఆనవాయితీ. ప్యాలెస్ ద్వారాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయా అనిపిస్తాయి. తల పైకెత్తి చూడాలి. కొన్ని గదుల్లోకి మాత్రం నడుము వరకు వంగి వెళ్లాలి. శత్రువులు దాడి చేసినప్పుడు రక్షణ కోసం ఆ ఏర్పాటు. కొన్ని గదుల్లో యుద్ధ సామగ్రి ఉంటుంది. మహారాణా ప్రతాప్ భుజాల నుంచి మోకాళ్ల వరకు ధరించిన ఇనుప కవచం మన ఎత్తు ఉంటుంది. దానిని చూస్తూ ఆశ్చర్యపోయే లోపు గైడ్ పక్కనే ఉన్న గుర్రాన్ని చూపిస్తాడు. అది చేతక్ నమూనా. మహారాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు చేతక్. తెల్లగా ఉంటుంది. ఆ గుర్రం నమూనా తయారు చేసి చేతక్ ధరించిన కవచాన్ని ధరింపచేశారు. రాజు ఒక్క ఉదుటున ఆ గుర్రం మీదకు ఎక్కాలంటే రాజు ఎత్తు ఎంత ఉంటుంది! అనే సందేహాన్ని ఎదురుగా ఉన్న కవచం నివృత్తి చేస్తుంది. ప్యాలెస్‌లో రాణి గది ఎదురుగా ΄ాలరాతి బెంచ్ ఉంటుంది. రాజు మందిరానికి వచ్చినప్పటికి రాణి అలంకరణ పూర్తి కాకపోతే, అలంకరణ పూర్తయ్యే వరకు రాజు ఆ ఆసనం మీద కూర్చుని ఎదురు చేసేవాడని గైడ్ చెప్పినప్పుడు పర్యాటకుల పెదవుల మీద ఓ చిరునవ్వు విరుస్తుంది. ప్యాలెస్ లోపల కొంత భాగంలో రాజకుటుంబం నివసిస్తోంది. కొంత భాగంలోనే పర్యాటకులను అనుమతిస్తారు. -
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? టికెట్లు తీశారా? లగేజ్ సర్దారా?
బస్సెక్కి వెళ్లాలా? కారెక్కి వెళ్లాలా? ఏ రోజు వెళ్లాలి.. ఎప్పుడు రావాలి... సెలవు అడగాలా వద్దా? డబ్బులు సమకూరాయా లేదా? సంక్రాంతి వచ్చేసింది. కొందరు మాత్రం చివరి వరకూ ఏ విషయం తేల్చకుండా హడావిడిగా ప్రయాణం పెట్టుకుని ట్రబుల్స్‌లో పడతారు. వద్దు. సంక్రాంతికి ఊరెళ్లేందుకు హాయిగాప్లాన్ చేసుకోండి. సంతోషంగా పండక్కు పదండి. పండగని తెలుసు. వెళ్లాలనీ తెలుసు. కాని ఏదీ తెమల్దు. నెలా రెండు నెలల ముందు భార్యాభర్తలు కూచుని మాట్లాడుకుని కచ్చితంగా ఫలానా డేట్‌కు బయలుదేరి వెళ్దాం అనుకుని ఉంటే ట్రైన్ టికెట్లు ఉంటాయి. తత్కాల్లో చూసుకోవచ్చులే అనుకుంటారు. బస్సులు దొరుకుతాయిలే అనుకుంటారు. అంతగాకుంటే కారుంది కదా పోదాం అనుకుంటారు. అనుకోవడం ఎందుకు? ఖరారు చేసుకోకపోవడం ఎందుకు? చివరి నిమిషంలో హైరానా పడటం ఎందుకు? ఎప్పుడు? ఎక్కడకు? సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండుగ. అయినవారితో కలిసి చేసుకుంటే సంతోషాన్ని పెంచే పండగ. అయితే ఈ అయిన వారు ఎవరు అనేది ఒక్కోసారి స్పష్టత రాదు. భార్యకు పుట్టింటికి వెళ్లాలని ఉండొచ్చు. భర్తకు తన సొంతూరికి వెళ్లాలని ఉండొచ్చు. ఈ పండక్కు ఈ ఊరు... మరో పండక్కి ఆ ఊరు అని టక్కున నిశ్చయించుకుంటే సగం చింత ఉండదు. కాని తేల్చరు. మరికొన్ని కారణాలు ఉంటాయి. భర్త గమనించాల్సినవి భార్య పుట్టింటికి వెళితే ఎవరికో ఏవో కానుకలు ఇచ్చుకోవాలనుకోవచ్చు. తల్లిదండ్రులకు బట్టలు తీసుకెళ్లాలనుకోవచ్చు. మేనకోడలికి పట్టీలు తీసుకెళ్లాలనుకోవచ్చు. వీటికి బడ్జెట్ కేటాయించబడిందా? అవి లేక ఆమె ఏ విషయం తేల్చకుండా ఉందా? భార్య అత్తింటికి వెళితే అక్కడ పనులన్నీ నెత్తిన పడే ప్రమాదం ఉందా? మరో కోడలి ఎదుట ఆర్థిక స్థితిగతుల విషయంలో ఏమైనా చిన్నబుచ్చుకునే ప్రమాదం ఉందా? ఈ సంవత్సరం నేను ఈ నగ చేయించుకున్నాను అనంటే నేను ఏమీ చేయించుకోలేదు వంటి జవాబు చె΄్పాలనుకోవడం లేదా? అందుకే అత్తారింటికి వెళ్లడం గురించి ఆమె ఏ విషయం మాట్లాడటం లేదా? భార్య గమనించాల్సినవి పుట్టింటి నుంచి అల్లుడికి సరైన పిలుపు అందిందా? అక్కడకు వచ్చాక మంచి మర్యాదే దొరుకుతుందనే నమ్మకం ఉందా? తోడల్లుడు, బావమరిది... వీళ్లు ఆదరంగా చూసే వీలుందా? పండక్కు వస్తే భర్త ఏదైనా కానుక ఆశిస్తాడా? మంచి బట్టలైనా పెట్టాలని కోరుకుంటాడా? అలా కోరుకుంటున్నట్టయితే ఆ కోరిక నెరవేర్చే స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారా? తీరా వచ్చాక అలకలు ఏర్పడతాయా? అందుకే అతను అత్తగారిల్లు అనే మాట ఎత్తడం లేదా? టికెట్లు.. పాట్లు ► తాత్కాల్ను ఇలాంటి టైమ్‌లో నమ్ముకోలేము. ►ఆర్టీసి బస్సులు ఎన్ని స్పెషల్స్ వేసినా సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ►ప్రయివేటు ట్రావెల్స్ డబుల్ రేట్ చెప్తాయి. ఇంకా ఎక్కువే చెప్పాచ్చు. ►సొంత కారు ఉన్నా పండగ ముందు రోజు బయలుదేరితే టోల్గేట్ల దగ్గరే సమయం సరిపోతుంది. ►ముందే టికెట్లు బుక్ చేసుకోకపోవడం వల్ల తత్కాల్ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు భరించలేక భార్యాభర్తలు టికెట్లు తీసుకుని పిల్లలకు తీసుకోకుండా ఫైన్లు కట్టి లేదా ఒళ్లు కూచోబెట్టుకుని ప్రయాణం చేస్తూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండటం అవసరమా? ►మరో విషయం ఎలాగోలా చేరుకుంటే ఎలాగోలా వెనక్కు రావచ్చు అనుకుంటారు. కాని తిరుగు ప్రయాణానికి అసలు టికెట్లు దొరకవు. దాంతో సెలవు పొడిగించుకుని, సద్ది బంధువుగా మారి ఇబ్బంది పడటం అవసరమా? ఇప్పుడైనాప్లాన్ చేయండి ఆదివారం భోగి, సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ. శనివారం ప్రయాణం అనుకోకండి. గురువారం ఉదయం నుంచి రైళ్లు, బస్సులు, కారు ప్రయాణంప్లాన్ చేసుకుంటే చాలా సమస్యలు తీరుతాయి. పోనీ శుక్రవారం తెల్లవారు జాము నుంచి బయల్దేరండి. డబ్బు ఈ ఒక్కసారికే దుబారా అనుకుంటే కారు, ప్రయివేటు బస్సులో ప్రయాణం ఎంజాయ్ చేసేలా వెళ్లండి. పండగ మూడ్‌తో వెళ్లండి. వెళ్లే ముందు భార్య తరపు ఇంటికి వెళ్లినా, భర్త తరపు ఇంటికి వెళ్లినా మన ఆర్థిక స్థితి మనది... మన ఆనంద స్థితి మనది... వేరొకరితో పోటీ వద్దు... తల్లిదండ్రులను అత్తామామలను ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా గడిపి వద్దాం అనుకుని బయలుదేరండి. -
మనదేశంలో చూడదగ్గ 'బెస్ట్ ఆఫ్‌బీట్' పర్యాటక ప్రదేశాలు!
కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం చాలామందికి. అందుకని విదేశాలకు చెక్కేస్తుంటారు. కానీ మన గడ్డపైనే ఎంతో విలక్షణమైన ప్రదేశాలు, కట్టిపడేసే సహజమైన ప్రకృతి దృశ్యాలు, మిస్టరీ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వెరైటీ వంటకాలకు నెలవైన ప్రదేశాలతో సహా వైవిధ్యభరితంగా, ఆహ్లాదంగా ఉండే సుందర ఉద్యానవనాలు ఎన్నెన్నో ఉన్నాయి. స్వదేశానికి మించిన గొప్ప పర్యాటక ప్రదేశం మరొకటి లేదు అనేలా బెస్ట్ ఆఫ్‌బీట్ ప్రదేశాలు ఎన్నో మన నేలలోనే ఉన్నాయి. అంతేగాదు ఈ ఏడాది 'బెస్ట్ ఆఫ్‌బీట్' ప్రదేశంగా ఓ ప్రసిద్ధ లోయ గోల్డ్‌ని దక్కించుకుంది కూడా. ఇంతకీ మన సొంత గడ్డలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఏంటంటే.. ప్రకృతి అందానికి ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్.. ప్రతిష్టాత్మకమైన ఔట్లుక్ ట్రావెలర్ అవార్డ్ 2023లో బెస్ట్ ఆఫ్‌బీట్ ప్రదేశంగా ఉత్తర కాశీలో కుప్వారా జిల్లాలోని లోలాబ్ వ్యాలీ బంగారు పతకాన్ని దక్కించుకుంది గెలుచుకుంది. వాడి ఈలో లాబ్ లేదా లోలోవ్ అని పిలిచే ఈ లోలాబ్ వ్యాలీ అద్భుతమైన ప్రకృతి అందానికి, ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. పైగా దీన్ని భారత్‌లో దాగున్న అద్భతమైన రత్నంగా ఈ ప్రదేశాన్ని అభివర్ణిస్తారు. యాపిల్ తోటలు, మెలికలు తిరిగిన నదులతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కుప్వారాకు ఉత్తరంగా 9 కిలోమీటలర్ల దూరంలో ఈ ఐకానిక్ ప్రదేశం ఉంది. ఈ లోలాబ్ వ్యాలీ ఎంట్రీ గేట్ నుంచే అద్భతమైన ప్రకృతి దృశ్యాలు ప్రారంభమవుతాయి. విశాలమైన పర్వత శ్రేణులతో ఓవల్ ఆకారపు లోయ నుంచి జర్నీ మొదలవుతుంది. పర్యాటకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్న కలరూస్ గుహలకు ఆకర్షితలవుతారు. ఇక్క నుంచి నేరుగా రష్యాకు చేరుకునేలా మార్గం ఉందని, పైగా ఈ గుహ లోపల భారీ నీటి వనరులను దాచి పెట్టారని స్థానిక ప్రజలు కథకథలుగా చెప్పుకుంటుంటారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా తన వంతుగా ఈ లోయని మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దింది. విద్యుత్ సౌకర్యం లేని గ్రామానికి నెలవు.. ఈ ఆదునిక కాలంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు లేనేలేవు కదా! కానీ ఇదే కాశ్మీర్లో శ్రీనగర్‌కి 80 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ సౌకర్యం లేని చత్పాల్ అనే విచిత్రమైన గ్రామం ఉంది. పర్యాటకులు తప్పనసరిగా చూడాల్సిన గొప్ప పర్యాటక ప్రదేశం. ఇక్కడ మంత్ర ముగ్దుల్ని చేసే పైన్ అడవులు సూర్యరశ్మిని ముద్దాడే హిమాలయాల అద్భుతాలను తిలకించాల్సిందే. ఈ గ్రామంలో ప్రత్యేకంగా చూసేందుకు ఏమీ ఉండదు కానీ అక్కడ ప్రకృతి రమ్యత పర్యాటకులను పులకించిపోయేలా చేస్తుంది. కొద్ది దూరంలో ఉన్న తిమ్రాన్ గ్రామంలోని పాఠశాల, ఆపిల్, వాల్నట్ తోటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అక్కడ స్థానికులు పర్యాటకులతో స్నేహపూర్వకంగా ఉండటమే గాక అక్కడ వారందించే సుగంధభరితమైన టీ చాలా రుచిగా ఉంటుంది. తొలి సముద్ర జాతీయ ఉద్యానవనం.. చూడదగ్గ మరో పర్యాక ప్రదేశం గుజరాత్‌లోని నరరా మెరైన్ నేషనల్ పార్క్. ఇది భారత్‌లోని తొలి సముద్ర జాతీయ ఉద్యానవనంగా చెబుతారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు కొద్ది దూరంలో ఉంది. ఇది మూడు పార్క్‌లుగా విభజించబడి, 42 చిన్న ద్వీపాల మాదిరి విస్తరించి ఉంది. ఇక్క పగడాలు, ఆక్టోపస్, ఎనిమోన్స్, పఫర్ ఫిష్, సముద్ర గుర్రాలు, పీతలు వంటికి నెలవు. కళాకారులకు నిలయం.. హిమచల్ ప్రదేశ్‌లోని ఆండ్రెట్టా పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ప్రదేశం. ఇది పారాగ్లైడింగ్‌కి ప్రసిద్ధి. అంతేగాదు ఈ ఆండ్రెట్టాని కళాకారుల కాలనీ అని కూడా అంటారు. దీన్ని 1920లలో ఐరిష్ థియేటర్ ఆర్టిస్ట్ నోరా రిచర్డ్స్ స్థాపించారు. ఇక్కడ కుమ్మరి దగ్గర నుంచి హస్తకళకారుల వరకు ఎందరో కళకారులు ఉంటారు. వారందరి నైపుణ్యాలను తిలకించొచ్చు, నేర్చుకోవచ్చు కూడా. ఇక్కడ శోభా సింగ్ ఆర్ట్‌గ్యాలరీ మరింత ప్రసిద్ధి. దేవాలయల భూమి.. తమిళనాడులో ఉన్న తరంగంబాడి మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఈ పేరుని అనువదిస్తే 'గాన తరంగాల భూమి' అని అర్థం. గతంలో ట్రాన్క్విబార్ అనిపిలిచేవారు. ఇది అనేక బీచ్ టౌన్లు కలిగిన ప్రదేశం. ఇది చరిత్రలో నిలిచిన పట్టణం. గత కాలం గురించి లోతుగా తెలుసుకోవాలనుకునేవారికి ఇది మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఉన్న డానిష్ కోట మరింత ఆకర్షిస్తుంది. దీన్ని 1620లలో నిర్మించారు. ఈ కోటని డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలు స్థావరంగా ఉపయోగింకున్నట్లు చెబుతారు చరిత్రకారులు. ఇక్కడ తప్పక సందర్శించాల్సింది న్యూ జెరూసలేం చర్చి. దీన్ని భారతీయ యూరోపియన్ నిర్మాణాల కలయికతో ఆకట్టుకునేలా నిర్మించారు. ఆనంద నగరం సందక్ఫు.. ఇది పశ్చిమబెంగాల్లో ఉంది. ఎత్తైన శిఖరాలనకు నిలయం ఈ ప్రాంతం.ఇది భారత్ నేపాల్ సరిహద్దులో ఎంది. ఎవరెస్ట్, కాంచనజంగా, లోట్సే మకాలులను కప్పి ఉంచే అద్భుతమైన పర్వత దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఈ దృశ్యం బుద్ధుడి ఆకృతిని తలపించేలా ఉందని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. హన్లే డార్క్ స్కై రిజర్వ్.. లద్దాఖ్‌లో ఉంది హన్లే డార్క్ స్కై రిజర్వ్. విలక్షణమైన ప్రకృతి దృశ్యాలు చూడాలనుకునేవారికి ది బెస్ట్ ప్లేస్ ఇది. ఈ రిజర్వ్‌లో కాంతి పొల్యూషన్‌ని చూడొచ్చు. ఇక్కడ ఆకాశం పూర్తి చీకటితో నిర్మలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నిశితంగా చూడొచ్చు. ఇక్కడ దాదాపు వెయ్చి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణలో భారతీయ ఖగోళ అబ్జర్వేటరీ ఉంది. అలాగే హన్లేలో సరస్వతి పర్వతంపై సుమారు 4 వేల మీటర్ల ఎత్తులో టెలిస్కోప్ ఉంది. ఇది ప్రపంచంలోని ఎత్తైన అబ్జర్వేటరీలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: చలో టూర్) -
Year End : చలో టూర్
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసికి నయాసాల్ జోష్ వచ్చేసింది. ఏటా డిసెంబర్ చివరి వారంలో ఏదో ఒక నచ్చిన ప్రదేశానికి వెళ్లి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికే సిటీజనులు ఈ ఏడాది వేడుకలకు సైతం ‘చలో టూర్’ అంటూ చెక్కేస్తేన్నారు. క్రిస్మస్ సెలవులు కూడా కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో జరుపుకొనేందుకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు. ఈసారి గోవాతో పాటు కశ్మీర్‌ను సైతం ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో కంటే ప్రస్తుతం కొంత మేరకు కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొడంతో పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. దీంతో సిటీ టూరిస్టులు గోవాతో పాటు కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు బారులు తీరుతున్నారు. మరోవైపు విదేశీ టూర్లలో బ్యాంకాక్, మలేసియా, మాల్దీవులు, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. వారం రోజులుగా సుమారు 20 శాతానికి పైగా విదేశీ ప్రయాణాలు పెరిగినట్లు పలు ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు సైతం బాగా పెరిగినట్లు థామస్ కుక్, కాక్స్ అండ్ కింగ్స్, తదితర సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా సుమారు లక్ష మంది ప్రయాణికులు అదనంగా బయలుదేరి వెళ్లనున్నట్లు అంచనా. బ్యాంకాక్ వైపు బారులు.. ● నగరం నుంచి సింగపూర్, మలేషియా.మాల్దీవులు, బ్యాంకాక్, దుబాయ్‌లకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ ఐదింటిలోనూ బ్యాంకాక్‌కు వెళ్లే వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో చార్జీలు బాగా పెరిగాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్లి వచ్చేందుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండే చార్జీలు ఇప్పుడు ఏకంగా రూ.60 వేల వరకు పెరిగినట్లు ట్రావెల్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వారం. పది రోజుల నుంచే బ్యాంకాక్‌కు బుకింగ్‌లు బాగా పెరిగినట్లు బంజారాహిల్స్‌కు చెందిన ఒక సంస్థ ప్రతినిధి తెలిపారు. ‘కౌలాలంపూర్ పెట్రోనాట్స్ దగ్గర ఏటా నూతన సంవత్సర వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. రంగరంగుల బాణాసంచా కాల్చుతారు. దీంతో ఆకాశమంతా హరివిల్లులు విరబూస్తాయి. ఆ వేడుకలను చూసేందుకు ఇంటిల్లిపాది వెళ్తున్నాం’ అని ఎల్బీ నగర్‌కు చెందిన సత్యవతి తెలిపారు. ఒక్కొక్కరికి రూ.70 వేల వరకు ఫ్లైట్ చార్జీలు అయినట్లు చెప్పారు. గతంలో మలేసియాకు వెళ్లి వచ్చేందుకు రూ.39 వేల వరకు మాత్రమే చార్జీలు ఉండేవని విస్మయం వ్యక్తం చేశారు. ● అలాగే హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు కూడా పెద్ద సంఖ్యలోనే వెళ్తున్నారు. దుబాయ్‌కు వెళ్లి రావడానికి ఫ్లైట్ చార్జీలు రూ.75 వేలకు పెరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేవాళ్లు మలేసియాతో పాటు సింగపూర్‌ను కూడా ఎంపిక చేసుకుంటున్నారు. ఈ రెండు దేశాల తర్వాత మాల్దీవులకు వెళ్తున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది. ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకల కోసమే చాలామంది మాల్దీవులకు పయనమవుతున్నారు. దుబాయ్‌లో షాపింగ్‌కు ఇది అనుకూలమైన సమయం కావడంతో ఎక్కువ మంది దుబాయ్‌కు వెళ్తున్నట్లు ఐఆర్సీటీసీ అధికారి ఒకరు చెప్పారు. సోలో జర్నీయే సో బెటర్.. మరోవైపు హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే ఒంటరి పర్యాటకుల సంఖ్య కూడా ఈ ఏడాది బాగా పెరిగింది. సుమారు 28 శాతం ఇలా ఒంటరిగా విదేశీ టూర్లకు వెళ్తున్నట్లు అంచనా. తమకు నచ్చిన పర్యాటక స్థలాల్లో ఏకాంతంగా గడపాలనే కోరిక, ఎలాంటి బాదరాబందీ లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికై నా తేలిగ్గా ప్రయాణించేందుకు అవకాశం ఉండడంతో చాలా మంది సోలో జర్నీయే సో బెటర్ అనుకుంటున్నారు. సోలోగా వెళ్తున్న వారిలోనూ ఎక్కువ మంది బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్‌లతో పాటు శ్రీలంకకు వెళ్తున్నారు. విదేశాలతో పాటు దేశంలోని బెంగళూర్, గోవా, జైపూర్, కొచ్చిన్, గౌహతి, విశాఖ నగరాలకు సైతం సోలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండడం గమనార్హం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు 20 శాతం అదనంగా పెరిగాయి. ఇందుకు దేశంలోని వివిధ నగరాల్లో ఉడాన్ పథకం కింద ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి రావడం, విదేశీ విమాన చార్జీలు కొంతమేర తగ్గుముఖం పట్టడం పర్యాటక ప్రియులకు చక్కటి అవకాశంగా మారింది. శివారులో హుషారుగా.. ఒకవైపు న్యూ ఇయర్ వేడుకలను విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో జరుపుకునేందుకు కొందరు నగర వాసులు ఉత్సాహం చూపిస్తుండగా.. మరికొందరు నగర శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్‌లు, రిసార్ట్లు, వ్యక్తిగత గృహాలను అద్దెకు తీసుకుని న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్నారు. పబ్‌లు, క్లబ్‌లలో కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌పై పోలీసుల పరిమితుల నేపథ్యంలో వ్యక్తిగత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి కొత్త సంవత్సర వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. శివరాంపల్లి, శామీర్‌పేట, భువనగిరి, కొల్లూరు వంటి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో ఉన్న శివారు ప్రాంతాల్లోని విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు న్యూ ఇయర్ వేడుకల కోసం అద్దెకు ఇస్తున్నారు. దీంతో చాలా మంది ఫాంహౌస్‌లలో పార్టీలు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటి యజమానులు రోజుకు అద్దె రూ.5 వేలు చెబుతున్నారు. -
గూగుల్‌లో ఎక్కువగా వెతికిన పర్యాటక ప్రాంతాలివే
ప్రస్తుతమున్న రోజుల్లో గూగుల్ వాడకం బాగా పెరిగింది. ఎలాంటి సందేహాలు ఉన్నా క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. 2023కి త్వరలోనే ఎండ్‌కార్డ్ పడనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్ లిస్ట్‌ను గూగుల్ రిలీజ్ చేసింది. మరి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాలేంటి? టాప్ 10 లిస్ట్ ఏంటన్నది చూసేద్దాం. వియత్నాం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో వియత్నాం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రకృతి సోయగాలు,బీచ్‌లు,రుచికరమైన ఆహారం, చారిత్రక అంశాలతో మనసు దోచే ఈ ప్రాంతం టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. నవంబర్ నుంచి ఏప్రిల్ సీజన్లో వియత్నంలో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గుహకు నిలయమైన సోన్డూంగ్, ఫోంగ్ న్హా-కే బ్యాంగ్ నేషనల్ పార్క్, హాలాంగ్ బే, న్హా ట్రాంగ్, కాన్ దావో, ఫు క్వాక్, హోయ్ యాన్,నిన్ బిన్ ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు. View this post on Instagram A post shared by Vietnam 🇻🇳 Travel | Hotels | Food | Tips (@vietnamtravelers) గోవా 2023లో మోస్ట్ సెర్చ్డ్ డెస్టినేషన్స్‌లో భారత్‌లోని గోవా రెండో స్థానంలో నిలవడం విశేషం. బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన గోవా ట్రిప్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇక్కడి బీచ్‌లు, చర్చ్‌లు, పచ్చదనం సహా ఎన్నో అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం సలీం అలీ బర్డ్ శాంక్చురీ,దూద్‌సాగర్ జలపాతాలు, బామ్ జీసస్, సే కేథడ్రల్ చర్చిలు, బోమ్ జీసస్ బసిలికా, ఫోర్ట్ అగ్వాడా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. బాలి భూతల స్వరంగా పిలిచే బాలి ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్య లో బాలి దీవి ఉంటుంది. 17 వేల దీవులు ఉన్న ఇండోనేషియాలో బాలి ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిఉస్తుంది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అందుకే బాలిని దేవతల నివాసంగా పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, ఉబుద్ ప్యాలెస్,ఉలువతు ఆలయం, లొవియానా వంటి ప్రాంతాలు ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు. చదవండి: 2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా? View this post on Instagram A post shared by Bali - The Island of the Gods (@bali) శ్రీలంక గూగుల్ సెర్చ్‌లో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్‌లో శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచింది.అందమైన ద్వీప దేశాల్లో శ్రీలంక ఒకటని చెప్పుకోవచ్చు. పురాతన శిథిలాలు, దేవాలయాలు, అందైన బీచ్‌లు, తేయకు తోటలు.. ఇలా ఎన్నో పేరుగాంచిన పర్యాటక ప్రదేశాలు శ్రీలంకలో ఉన్నాయి. ఇక్కడ సిగిరియా రాక్ ఫారెస్ట్,యాలా నేషనల్ పార్క్,మిరిస్సా బీచ్,ఎల్లా హిల్ స్టేషన్, బౌద్ధ దేవాలయం, డచ్ స్టైల్లో నిర్మించిన ఇళ్లు, హెరిటేజ్ మ్యూజియంలు, రెయిన్ ఫారెస్ట్లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. థాయ్‌లాండ్ అందమైన ప్రకృతికి థాయ్‌లాండ్ పెట్టింది పేరు. ల్యాండ్ ఆఫ్ స్మైల్స్‌గా దీనికి పేరుంది. ఇక్కడ దట్టమైన అడవులు, థాయిలాండ్ ఫుకెట్, కో ఫై ఫై, క్రాబీ, కో స్యామ్యూయ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. థాయ్ టూర్లో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఉన్న ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం. అంతేకాకుండా ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి. వీటితో పాటు కశ్మీర్, కూర్గ్, అండమాన్ నికోబార్ దీవులు,ఇటలీ, స్విట్జర్లాండ్ కూడా టాప్-10 డెస్టినేషన్ లిస్ట్‌లో ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. -
వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావొచ్చు
ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను చుట్టేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పని ఒత్తిడితో విసిగిపోయి ఉన్న వారికి ఈ విహార యాత్రలు, ప్రయాణాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. మన దేశంలో అయితే ఏ ప్రాంతానికి అయినా వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. అయితే వీసాతో పని లేకుండా భారతీయులను మా దేశానికి రండి అంటూ ఆహ్వానం పలుకున్నాయి కొన్ని దేశాలు. అవేంటో చూసేయండి. మలేషియా ఎంత చూసినా తనివి తీరని భౌగోళిక సౌందర్యం మలేషియా. పచ్చని అడవులు, అందమైన ద్వీపాలు,అడవులు.. ఇలా ఎంతో అందమైన పర్యాటక ప్రదేశంగా మలేషియాకు పేరుంది. ఇకపై అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరం లేదు. సుమారు 30 రోజుల పాటు అక్కడ సేద తీరవచ్చు. బొలీవియా: ఇక్కడ సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. సమోవా: దీనిని 'కార్డెల్ ఆఫ్ పాలినేషియా' అని కూడా పిలుస్తారు, సమోవా అనేది ఉత్కంఠభరితమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీప దేశానికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. శ్రీలంక: భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు ఇటీవలె శ్రీలంక అనుమతి ఇచ్చింది. కెన్యా: సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. మారిషస్: భారతీయులకు అతి గొప్ప ఆతిథ్యమిచ్చే ఆహ్లాదకరమైన దేశాల్లో మారిషస్ ఒకటి. అందమైన బీచ్‌లు, అడ్వెంచర్లు ఎన్నో ఉన్న ఈ దేశానికి మీకు వీసా అవసరం లేదు. మారిషస్‌ను వీసా లేకుండా, మీరు గరిష్టంగా 90 రోజులు పర్యటించవచ్చు. ఫిజీ: అందమైన దృశ్యాలు, పగడాలు, దీవులకు పెట్టింది పేరు ఫిజీ దేశం. ఈ దేశానికి భారతీయ పర్యాటకుల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీసా లేకుండా 120 రోజులు అంటే సుమారు నాలుగు నెలలు హాయిగా గడపొచ్చు. భూటాన్: భారతదేశానికి అత్యంత సమీపంలో, పొరుగు దేశంగా ఉన్న భూటాన్‌కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇది ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.రోడ్డు, విమానం, రైలు ద్వారా కూడా భూటాన్ చేరుకోవచ్చు. బార్బడోస్: బార్బడోస్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.ప్రశాంతమైన దీవుల్లో సెలవులను గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. కాస్ట్లీ హోటళ్లు, తీర ప్రాంతాలు ఇక్కడి స్పెషల్. భారతీయ పౌరులు బార్బడోస్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీరు ఇక్కడ వీసా లేకుండా 90 రోజుల వరకు గడపవచ్చు. వీటితో పాటు జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా,టాంజానియా, జోర్డాన్,లావోస్ కాంబోడియా,వంటి దేశాలకు కూడా వీసా లేకుండా చుట్టిరావొచ్చు. -
ప్రయాణ పాఠాలతో.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న యువకుడు!
ప్రయాణ ప్రేమికుడైన అనునయ్ సూద్ 30 దేశాల వరకు వెళ్లివచ్చాడు. చిన్న వయసులోనే ట్రావెలింగ్ అండ్ ఫోటోగ్రఫీ రంగంలో పెద్ద పేరు తెచ్చుకున్నాడు నోయిడాకు చెందిన అనునయ్ సూద్. వ్లోగ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్లు అందుకున్నాడు. ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా స్విట్జర్లాండ్ టూరిజం, విజిట్ సౌదీ, న్యూజిలాండ్ టూరిజం... మొదలైన సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు... ‘నాకు ట్రావెలింగ్ అంటే ఎందుకు ఇష్టం అంటే ట్రావెల్ చేయకుండా ఉండలేను కాబట్టి’ నవ్వుతూ అంటాడు అనునయ్ సూద్. ఇంజినీరింగ్ చేసిన అనునయ్ కొంత కాలం ఉద్యోగం చేశాడు. జీతం రాగానే ఆ బడ్జెట్లో ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేసేవాడు. ప్రయాణ మాధుర్యాన్ని మరింతగా ఆస్వాదించడానికి ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్స్‌లో పనిచేశాడు. సాహసకృత్యాలను ఇష్టపడే వారి కోసం ట్రెక్ ఆర్గనైజింగ్ కమ్యూనిటీని స్టార్ట్ చేశాడు. ఈ కమ్యూనిటీలో గైడ్, టీమ్ లీడర్‌గా వ్యవహరించాడు. అనునయ్ ప్రతి ప్రయాణాన్ని కొత్త జీవితంతో పోల్చుతాడు. ప్రయాణ జ్ఞాపకాలను ఛాయాచిత్రాలలో భద్రపరిచే క్రమంలో ట్రావెల్ ఫొటోగ్రఫీలో కూడా నైపుణ్యం సాధించాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీపై ఉన్న ఇష్టాన్ని మిళితం చేసి డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా విజయం సాధించాడు. ఆ తరువాత ‘మెటా–సోషల్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాడు. ‘మెటా–సోషల్’ అనేది పెర్ఫార్మెన్స్ అండ్ మార్కెటింగ్ సొల్యూషన్ కంపెనీ. ‘ట్రావెలింగ్‌పై నాకు ఉన్న ఇష్టాన్ని కమర్షియలైజ్ చేసుకోవాలనుకోలేదు’ అంటున్న అనునయ్ ‘ప్రాజెక్ట్ ఘర్’ పేరుతో హోమ్‌స్టే సర్వీస్ వెంచర్‌ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకు 30 దేశాల వరకు వెళ్లి వచ్చిన అనునయ్ ‘ఫొటోగ్రఫీ విజన్, ట్రావెలింగ్‌పై ఫ్యాషన్ ఉంటే సాధారణ ప్రదేశాల నుంచి కూడా అసాధారణ అందాలను వీక్షించవచ్చు. ట్రావెల్ ఫొటోగ్రఫీపై మనకు విజన్ ఉంటే ఖరీదైన కెమెరాలతో పనిలేదు’ అంటున్నాడు అనునయ్ సూద్. కొత్తదారులలో... ప్రయాణ క్రమంలో ప్రకృతి నుంచి, సామాజిక బృందాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉంటాయి. దృష్టి విశాలం కావడానికి, చురుగ్గా ఉండడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయాణాలు ఉపయోగపడతాయి. కొత్త దారులు కొత్త ఆలోచనలకు దారి తీస్తాయి. – అనునయ్ సూద్ (చదవండి: ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !) -
హైదరాబాద్‌లో అడ్వెంచర్స్.. వీకెండ్లో చిల్ అవ్వండి
హైదరాబాద్‌లో అంటేనే నోరూరించే కమ్మని వంటకాలు, అనేక పర్యాటక ప్రదేశాలకు ఫేమస్. వీకెండ్ వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చి రిలాక్స్ అవుతుంటారు. అడ్వెంచర్ యాక్టివిటిస్కి కూడా హైదరాబాద్ అడ్డాగా మారుతుంది. ఒకప్పుడు పారాగ్లైడింగ్ అంటే గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా ఎన్నో అడ్వెంచర్ స్పాట్స్, అది కూడా తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. బంగీ జంపింగ్ లైఫ్‌లో ఒక్కసారైనా బంగీ జంపింగ్‌ను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొండలు, బ్రిడ్జి వంటి ఎత్తైన ప్రదేశాల నుంచి తాళ్లతో శరీరాన్ని కట్టుకొని కిందకు దూకండి చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బంగీజంపింగ్ చేయాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అడ్వెంచర్ యాక్టివిటి కోసం మన హైదరాబాద్‌లోనే చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. వాటిలో రామోజీ ఫిల్మ్ సిటీ,లియోనియా రిసార్ట్, డిస్ట్రిక్ గ్రావిటి పార్క్ వంటి ప్రాంతాల్లో అందుబాలో ఉంది. దీని ధర సుమారు రూ.3500 నుంచి 4500 వరకు ఉంటుంది. 12 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా బంగీ జంప్ చేయొచ్చు. దీనికోసం ముందుగానే బీపీ, హార్ట్‌రేట్ వంటివి చెక్ చేస్తారు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులకే బంగీ జంపింగ్ అనుమతిస్తారు. పారాగ్లైడింగ్ రెక్కలు కట్టుకొని ఆకాశలో ఎగురుతూ భూమిపై ఉన్న ప్రకృతి అందాలను చూడాలంటే పారాగ్లైడింగ్ బెస్ట్ ఛాయిస్.ఆకాశంలో పక్షలతో పోటీ పడి ఎగురుతూ భూమి పై అందాలను ఆస్వాదించవచ్చు. అయితే పారాగ్లైడింగ్ అన్ని చోట్ల వీలు పడదు. ఇందుకు కొంత ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులతో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి. హైదరాబాద్‌లో కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర్లో అందుబాటులో ఉంది. ధర రూ.3500 జిప్‌లైన్ చాలా ప్రాంతాల్లో జిప్‌లైన్ కోసం 50 మీటర్ల నుంచి ఎత్తులో బ్యూటిఫుల్ నేచర్‌ను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్‌లో శామీర్‌పేట్‌లోని డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్, ఎక్సోటికా బొటిక్ రిసార్ట్ వంటి ప్రాంతాల్లో జిప్‌లైన్ యాక్టివిటి అందుబాలో ఉంటుంది. ధర రూ. 700-1000 వరకు ఉంటుంది. వీకెండ్స్‌లో ధర మారుతుంది) స్కై డైవింగ్ ఎత్తుగా ఉండే ప్రాంతాల నుంచి గాల్లోకి దూకే సాహసక్రీడను స్కై డైవింగ్ అంటారు. వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతూ చేసే స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇండోర్‌లో కూడా పొందచ్చు. అది ఎక్కడంటే..గండిపేట సమీపంలో గ్రావిటీజిప్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఈ ఇండోర్ స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందిచ్చు. ఇందుకోసం ఇండోర్ స్కైడైవింగ్ కోసం 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేక సిలిండర్ రూపొందించారు. ధర సుమారు రూ. 3300 నుంచి 4300 వరకు ఉంటుంది. (వీకెండ్స్‌లో ధర మారుతుంటుంది) ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ కోసం సిటీలో చాలా ప్రాంతాలు ఉన్నా అనంతగిరి హిల్స్ బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. వీకెండ్ వస్తే చాలు ఇక్కడికి ఫ్రెండ్స్‌తో ఎక్కువగా హైదరబాదీలో ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఇందుకోసం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. క్లౌడ్ డైనింగ్ సాధారణంగా రెస్టారెంట్లో ఎవరైనా భోజనం చేస్తారు. కానీ ఆకాశానికి, భూమికి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో భోజనం చేస్తే ఆ ఫీలింగే వరే. గాల్లోకి ఎగిరిపోయి అక్కడి నుంచి కిందకు చూస్తూ భోజనం చేస్తే ఆ థ్రిల్లింగ్ చెప్పక్కర్లేదు. ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే హైదరాబాద్‌లోని క్లౌడ్ డైనింగ్‌కు వెళ్లాల్సిందే. ఇది హైటెక్ సిటీ సమీపంలో ఉంటుంది. ఈ క్లౌడ్ డైనింగ్.. భూమికి 160 ఎత్తుల అడుగులో ఉంటుంది. దాదాపు అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ భోజనం చేయాలంటే.. రూ.5,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !
శ్రీలంకకు వాయుమార్గం, జలమార్గాల్లో వెళ్లవచ్చు. అక్కడి రోడ్లు నల్లగా నున్నగా మెరుస్తూ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన దేశ ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. విమాన ప్రయాణం, పడవ ప్రయాణం, రోడ్డు ప్రయాణం తర్వాత మిగిలింది రైలు ప్రయాణమే. శ్రీలంక ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే ట్రైన్లో ప్రయాణించాల్సిందే. గంటకు పాతిక కిమీమీటర్ల వేగంతో ప్రయాణించే టాయ్ ట్రైన్ జర్నీ ఆద్యతం అలరించడమే కాదు, ఆ దారిలో వచ్చే చిన్న చిన్న గ్రామాలు స్థానికుల సౌకర్యాలతో కూడిన నిరాడంబరమైన జీవనశైలిని కళ్లకు కడుతుంది. బౌద్ధ ప్రాశస్త్య్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ నుంచి వెళ్లిన మా మహిళా విలేకరులమందరం ‘నాను వోయా’లో టాయ్ ట్రైన్ ఎక్కాం. పిల్లలతో ప్రయాణం టాయ్ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్లకు డిమాండ్ ఎక్కువ. ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. మిగతా తరగతులు కూడా రద్దీగా ఉంటాయి. మేము వెళ్లిన రోజు ఒక స్కూల్ నుంచి దాదాపుగా డెబ్బై మంది పిల్లలు మాతో ప్రయాణించారు. వాళ్లు జురాసిక్ పార్క్ సినిమా చూడడానికి వెళ్తున్నారు. ‘ఎల్లా’ కంటే ముందు ఒక స్టేషన్లో దిగేశారు. ఆ పిల్లల పేర్లన్నీ భారతీయతతో ముడిపడినవే. సంస్కృత ద్రవిడ సమ్మేళనంగా ఉన్నాయి. అయితే నకారాంతాలుగా లేవు, అన్నీ అకారాంతాలే. పిల్లల స్కూల్ డ్రస్ మీద వాళ్ల పేర్లు కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. వాటిని మనసులో చదువుకుని పైకి పలుకుతుంటే ఏదో సొగసుదనం ఉంది. పిల్లలు చక్కటి ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. రైలు ప్రయాణించే దారిలో వచ్చే స్టేషన్ల పేర్లను మేము తడుముకుంటూ చదువుతుంటే మా ఉచ్చారణను సరిదిద్దుతూ మా ప్రయాణానికి మరింత సంతోషాన్నద్దారా పిల్లలు. మబ్బుల్లో విహారం నాను వోయా స్టేషన్ క్యాండీ నగరానికి 70 కిమీల దూరంలో, నువారా ఎలియాకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిల్స్టేషన్ల మధ్య సాగే ప్రయాణం అది. దట్టంగా విస్తరించిన అడవుల మధ్య టక్‌టక్‌మని శబ్దం చేస్తూ వెళ్తుంది రైలు. ఆకాశాన్ని తాకడానికి పోటీ పడి పెరిగినట్లున్న వృక్షాల తలలను చూడడానికి తల వంచిన కిటికీలో నుంచి పైకి చూసే ప్రయత్నం అయితే చేస్తాం, కానీ మనకు మొదళ్లు కనిపించిన వృక్షాల తలలను చూడలేం. లోయలో నుంచి పెరిగి వచ్చిన వృక్షాల తలలను మాత్రమే చూడగలం. పచ్చటి ప్రకృతి చిత్రం చూస్తూ ఉండగానే మసకబారుతుంది. ఏంటా అని పరికించి చూస్తే మందపాటి మబ్బు ప్రయాణిస్తూ ఉంటుంది. రైలును తాకుతూ వెళ్లే మబ్బు కిటికీ లో నుంచి దూరి మనల్ని చల్లగా తాకి పలకరిస్తుంది. ఈ దారిలో కొండల మధ్య జలపాతాలు కూడా ఎక్కువే. జలపాతం సవ్వడి వినిపించనంత దూరంలో కనువిందు చేస్తుంటాయి. హాయ్ హాయ్‌గా... రైలు అర్ధచంద్రాకారపు మలుపుల్లో ప్రయాణించేటప్పుడు కిటికీలో నుంచి బయటకు చూస్తే లెక్కలేనన్ని చేతులు స్మార్ట్ ఫోన్లు, హ్యాండీకామ్‌లతో ఫొటో షూట్ చేస్తూ కనిపిస్తాయి. ఈ రైల్లో స్థానికులు వారి అవసరార్థం ప్రయాణిస్తారు. పర్యాటకులు ప్రకృతి పరవశం కోసమే ప్రయాణిస్తారు. ప్రతి విషయాన్ని స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయాలనే పాశ్చాత్య పర్యాటకులు ఈ రైల్లో ఎక్కువగా కనిపిస్తారు. వాళ్లు ముందుగానే ఫస్ట్ క్లాస్‌లో బుక్ చేసుకుంటారు. కొండలను కలుపుతూ వేసిన వంతెనలు, కొండను తొలిచిన సొరంగాల మధ్య సాగే ఈ ప్రయాణం మన తెలుగు రాష్ట్రంలో విశాఖ– అరకు ప్రయాణాన్ని, ఊటీ టాయ్ ట్రైన్ జర్నీని తలపిస్తుంది. బ్రిటిష్ పాలకులు నిర్మించిన రైలు మార్గం ఇది. అప్పటి నుంచి నిరంతరాయంగా నడుస్తూనే ఉంది. పర్యాటకులు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరపాటులో చేసే ప్రయాణం కాదిది. దృష్టి మరలిస్తే చూడాల్సిన వాటిలో ఏం మిస్సవుతామోనన్నంత ఉత్సుకతతో సాగే ప్రయాణం. మన స్టేషన్ త్వరగా రావాలని కూడా ఉండదు. రైల్లో ఒక బోగీలో వాళ్లకు మరో బోగీలో ఉన్న వాళ్లు ‘హాయ్’ చెప్పుకుంటూ చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ ప్రయాణిస్తారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: రావణ్ ఫాల్స్... ఎల్లా!) -
ఇదు శ్రీలంక: రావణ్ ఫాల్స్... ఎల్లా!
శ్రీలంకలో హిందూమహాసముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంది ఈ జలపాతం. దట్టమైన అడవుల మధ్యలో ప్రవహించిన నీటిపాయలు వంద అడుగుల కిందనున్న భూభాగం మీదకు అలవోకగా జారిపడుతూ ఉంటుంది. శ్రీలంక పర్యాటక ప్రాధాన్యం గల దేశం కావడంతో ప్రతి ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటకులకు అనువుగా మలుచుకుంటుంది. పర్యాటకులు జలపాతాన్ని వీక్షించడానికి, జలపాతం బ్యాక్‌డ్రాప్‌లో ఫొటో తీసుకోవడానికి వీలుగా వాటర్‌ఫాల్స్ దగ్గర చక్కటి ప్లాట్పామ్ ఉంది. రావణుడి గుహలు రావణ్ జలపాతం... ఎల్లా అనే చిన్న పట్టణానికి దగ్గరగా, ఎల్లా రైల్వేస్టేషన్‌కి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. దాంతో ఈ జలపాతానికి రావణ్ ఎల్లా అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ జలపాతం వెనుకవైపు గుహలున్నాయి. రావణాసురుడు... సీతాదేవిని అపహరించిన తర్వాత కొంతకాలం ఈ గుహల్లో దాచి ఉంచాడని, అందుకే ఈ గుహలకు రావణుడి గుహలనే పేరు వచ్చిందని చెబుతారు. సముద్రమట్టానికి నాలుగున్నర వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహల్లోకి వెళ్లడానికి వెడల్పాటి మెట్లు, మెట్ల మధ్యలో రెయిలింగ్ వంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ గుహలకు ఏడు కిలోమీటర్ల దూరాన బందరవేలా గుహలున్నాయి. పాతిక వేల ఏళ్ల కిందట ఆ గుహల్లో మనుషులు జీవించినట్లు ఆధారాలు దొరికాయి. ట్రెకింగ్ ఆసక్తి ఉన్న వాళ్లు ఈ ప్రదేశాల కోసం రెండు రోజులు ఉండేటట్లు టూర్ ప్లాన్ వేసుకోవాలి. జ్ఞాపికలే పెద్ద వ్యాపారం శ్రీలంకలో ప్రతి టూరిస్ట్ పాయింట్ దగ్గర సావనీర్ షాప్లుంటాయి. చిన్నదో పెద్దదో కనీసం ఒక్క స్టాల్ అయినా ఉంటుంది. డిజైనర్ దుస్తుల నుంచి శ్రీలంక గుర్తుగా తెచ్చుకోవడానికి జ్ఞాపికలు కూడా ఉంటాయి. పర్యాటకులు తమ టూర్ గుర్తుగా దాచుకోవడానికి, అలాగే స్నేహితులు, బంధువుల కోసం కూడా సావనీర్లను ఎక్కువగా కొంటారు. ప్రైస్ ట్యాగ్ చూడగానే భయం వేస్తుంది. కానీ శ్రీలంక రూపాయలను మన రూపాయల్లోకి మార్చుకున్నప్పుడు ధరలు మరీ ప్రియం అనిపించవు. మరో సౌకర్యం ఏమిటంటే షాపుల్లో మన కరెన్సీ కూడా తీసుకుంటారు. దుస్తుల విషయానికి వస్తే... ఫ్లోర్ లెంగ్త్ ఫ్రాక్‌ల వంటి మోడరన్ దుస్తులు బాగుంటాయి. కానీ కొలతలు భారతీయులకు అమరవు. పాశ్చాత్యుల పొడవుకు తగినట్లుంటాయి. శ్రీలంక వాసులు కూడా పొడవుగా, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వారికీ చక్కగా అమరుతాయి. ఇక మనం అక్కడ కొనుక్కోగలిగిన దుస్తులు చీరలు, శాలువాలు, పిల్లలకు టీ షర్ట్లే. ఉన్ని శాలువాలు మంచి నేత పనితనంతో అందంగా ఉంటాయి. ఏనుగు బొమ్మలు ముద్రించిన టీ షర్ట్లుంటాయి. మక్కబుట్టకు ఉప్పుకారం చిరుతిండ్లు అమ్మే వాళ్లయితే మన ముఖాలు చూసి భారతీయులను గుర్తు పట్టేస్తారు. పాశ్చాత్యులు ఇష్టపడే రుచులు, భారతీయుల ఇష్టాలను గ్రహించి వ్యాపారం చేస్తారు. మనం మొక్క జొన్న కండెకు ఉప్పు, కారం పట్టించి తింటామని వాళ్లకు తెలుసు. మనల్ని చూడగానే ‘ఇండియన్స్’ అంటూ మసాలా రాయమంటారా అని అడుగుతారు. తమిళులు– సింహళీయులకు మధ్య పోరు గురించి తెలిసిన వారిగా మనకు కొంత జంకు, భారతీయులను స్వాగతిస్తారో లేదోననే భయం ఉంటుంది. కానీ, శ్రీలంక వాళ్లు భారతీయులను ఆత్మీయంగా చూస్తారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: క్యాండీ మ్యూజియంలో భారత బౌద్ధం!) -
ఇదు శ్రీలంక: క్యాండీ మ్యూజియంలో భారత బౌద్ధం!
ఐదు వేల వస్తువులను చూడటానికి రెండు కళ్లు చాలవు. చుట్టి రావడానికి కనీసం రెండు గంటల సమయం కావాలి. పదిహేడు దేశాలను ఒక్క చోట ప్రతిక్షేపించిందీ మ్యూజియం. అందులో మన దేశమూ ఉంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు. మనదేశంలో చూడలేకపోయిన బౌద్ధక్షేత్రాల ప్రతీకలను ఇక్కడ చూద్దాం. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మ్యూజియం... శ్రీలంకలోని క్యాండీ నగరంలో ఉంది. క్యాండీలోని నేషనల్ మ్యూజియం భవనంలోనే ఉంది. ఇంటర్నేషనల్ మ్యూజియంలో శ్రీలంక, ఇండియా, జపాన్, చైనా , భూటాన్ దేశాలతోపాటు మొత్తం 17 దేశాల బౌద్ధ విశేషాలున్నాయి. ఇండియా గ్యాలరీ ఏర్పాటు బాధ్యతలను మన విదేశీ వ్యవహారాల శాఖ పూర్తి చేసింది. నిర్వహణ బాధ్యతను పదేళ్ల కిందట ‘శ్రీ దలాడ మలిగవ’కు అప్పగించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మ్యూజియం ఇది. బౌద్ధానికి చెందిన ఫొటోలు, శిల్పాలు, ప్రతీకాత్మక శిల్పాలు, చిత్రాలు, నేషనల్ మ్యూజియంలో క్యాండీ రాజులు (17,18 శతాబ్దాల నాటివి) ఉపయోగించి ఆయుధాలు, ఆభరణాలు, దైనందిన జీవనం ఉపయోగించిన వస్తువులు, చారిత్రక శకలాలు... అన్నీ కలిసి ఐదు వేలకు పైగా ఉంటాయి. క్యాండీ రాజ్యం 1815లో బ్రిటిష్ రాజ్యంలో విలీనం అయినప్పుడు రాసుకున్న ఒప్పంద పత్రం ప్రతిని కూడా చూడవచ్చు. మ్యూజియంలోపల బ్రిటిష్ ఆనవాళ్లు మరేవీ కనిపించవు. కానీ మ్యూజియం ఏర్పాటులో కీలకంగా పని చేసిన సిలోన్ గవర్నర్ సర్ హెన్రీ వార్డ్ విగ్రహం ఉంది. తెలుగు– సింహళ బంధం ఇండియా విభాగంలో మన అమరావతి బౌద్ధ స్థూపం నమూనా కూడా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బౌద్ధం విలసిల్లిందని చెప్పడానికి దోహదం చేసే ఆధారాలను, ఆనవాళ్లను చూడవచ్చు. సాంచి స్థూపం నమూనా, సారనాథ్ స్థూపం దగ్గర అశోకస్తంభం మీద గర్జించే సింహం నమూనా శిల్పం, ఎల్లోరా గుహలు వాటిలోని శిల్పాలు, అజంతా గుహలు– అందులోని వర్ణ చిత్రాలు, అశోకుని ధర్మచక్రం, మనం జాతీయ చిహ్నం నాలుగు సింహాల ప్రతిమలను చూడవచ్చు. ఇంకా... చైనా బుద్ధుని విగ్రహాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మిగిలిన అన్ని దేశాల బుద్ధుడి ప్రతిమల్లోనూ ఏకరూపత ఉంటుంది. కానీ చైనా బుద్ధుడు భిన్నంగా ఉంటాడు. పెంగ్షుయ్ వాస్తులో భాగంగా లాఫింగ్ బుద్ధ మనకు పాతికేళ్ల కిందటే పరిచయమై ఉన్నాడు కాబట్టి ఆ రూపాన్ని బుద్ధుడిగా స్వీకరించడానికి పెద్దగా ఇబ్బంది పడమన్నమాట. ఇక ఆశ్చర్యంతోపాటు ఒకింత అయోమయానికి గురి చేసేది భవిష్యత్తు బుద్ధుడి ఊహాశిల్పం. ఆ బుద్ధుడు మల్టీటాస్కింగ్‌కి ప్రతీకగా ఉంటుందా శిల్పం. మ్యూజియంతోపాటు ఈ భవనంలోనే కొన్ని గదుల్లో సావనీర్ విభాగం ఉంది. శ్రీలంక గుర్తుగా కప్పులు, ఫ్రిజ్ మ్యాగ్నట్ల వంటివి చాలా రకాలున్నాయి. అప్పటి అతిథిభవనం! ఈ మ్యూజియం రెండస్థుల భవనం. మ్యూజియంగా మార్చకముందు ఈ భవనం గెస్ట్‌హౌస్‌గా రాజ్యాతిథుల విడిదిగా ఉండేది. రాణివాస మహిళలకు కూడా కొంతకాలం ఇందులో నివసించినట్లు చెబుతారు. క్యాండీ రాజ్యం ఆర్కిటెక్ట్‌ల నైపుణ్యానికి సగౌరవంగా అభివాదం చేయాల్సిందే. మ్యూజియం భవనం, యునెస్కో గుర్తించి వరల్డ్ హెరిటేజ్ సైట్ టూత్ రిలిక్ టెంపుల్, రాజుల ప్యాలెస్‌లు ఒకే క్లస్టర్లో ఉంటాయి. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం!) -
ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం!
శ్రీలంక దీవి హిందూ మహా సముద్రంలో చిన్న భూభాగం. ఇందులో సముద్ర మట్టానికి పదహారు వందల అడుగుల ఎత్తులో ఉంది కాండీ నగరం. ఈ నగరంలో ప్రధానంగా చూడాల్సిన ప్రదేశం బుద్ధుడి దంత అవశిష్టంతో నిర్మించిన ఆలయం. ఈ ఆలయాన్ని టూత్ రిలిక్ టెంపుల్ గా వ్యవహారిస్తారు. ఈ ఆలయం కంటే ముందు ఇక్కడ ఉన్న నేషనల్ మ్యూజియాన్ని తప్పక చూడాలి. రిలిక్ టెంపుల్ చుట్టూ ప్రాచీన రాజకుటుంబాల ప్యాలెస్‌లున్నాయి. ఆలయంతోపాటు రాజప్రాసాదాలు కూడా ఏటవాలు పై కప్పుతో మనదేశంలో కేరళలోని నిర్మాణాలను తలపిస్తాయి. శ్రీలంకలో తరచూ వర్షాలు కురుస్తుంటాయి, కాబట్టి నీరు సులువుగా జారిపోవడానికి ఒకప్పుడు ఎర్రటి బంగ్లా పెంకు కప్పే వాళ్లు. ఇప్పుడు ఆకుపచ్చ రంగు రేకులు కప్పుతున్నారు. ఇక ఈ నగరంలో మరో విశిష్ఠత ఏమిటంటే... పోర్చుగీసు, బ్రిటిష్ పరిపాలనలో ఉండడంతో కొన్ని ప్రదేశాలు కలోనియల్ కాలనీలను తలపిస్తున్నాయి. యూరప్ నిర్మాణశైలిలో ఉన్న క్వీన్స్ హోటల్‌ను చూసి తీరాలి. ఇక బ్రిటిష్ వాళ్లు హిల్ స్టేషన్లను ఎంత చక్కగా వేసవి విడుదులుగా మలుచుకున్నారో చెప్పడానికి కాండీ నగరం ఒక నిదర్శనం. నిర్మాణ పరంగా, చారిత్రక ప్రాధాన్యతలెన్ని ఉన్నప్పటికీ ఈ నగరానికి ఇంతటి పర్యాటక ప్రాముఖ్యత ఏర్పడడానికి కారణం బుద్ధుడి అవశిష్టమే. బౌద్ధమే ప్రధానం.. బుద్ధుడి దంతాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆ దంత అవశిష్టం మన భారతదేశం నుంచి శ్రీలంక చేరడం కూడా రసవత్తరమైన నాటకీయతను తలపిస్తుంది. బుద్ధుడు మహా పరినిర్వాణం చెందిన తర్వాత ఎముకలు, దంతాలు ఇలా ఒక్కొక్క దేహభాగాలను ఒక్కొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆలయాలను నిర్మించారు. అలా ఈ దంతాన్ని కళింగ రాజులు సొంతం చేసుకున్నారు. ఈ దంతం ఎక్కడ ఉంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే విశ్వాసం అప్పట్లో ఉండేది. యువరాణి హేమమాలిని, యువరాజు దంత ఈ దంతాన్ని రహస్యంగా లంకాపట్టణానికి తెచ్చారు. హేమమాలిని తల మీద శిఖలో దాచి తెచ్చిందని చెబుతారు. ఆ దంతాన్ని అనూరాధపురను పాలించిన రాజు సిరిమేఘవన్నకు ఇచ్చింది హేమమాలిని. మొదట ఆ దంతాన్ని మేఘగిరి విహార (ఇసురు మునియ) లో భద్రపరిచారు. క్రమంగా రాజుల్లో ఈ దంతాన్ని కలిగి ఉండడం ఆధిక్యతకు చిహ్నంగా భావించారు. శ్రీలంకలో రాజులు ఆ దంతం తమ రాజ్యంలో ఉండడం తమకు గొప్ప అన్నట్లు భావించేవారు. దాంతో ఎవరికి వారు ఆ దంతం తమ రాజ్యంలోనే ఉండాలని ఒకింత పోటీ పడేవారు కూడా. ఆలయ సౌందర్యం! ఆనాటి రాజులు బౌద్ధ స్థూపాలు, ఆలయాల నిర్మాణానికి తమవంతుగా సమృద్ధిగా నిధులు కేటాయించేవారు. కాండీలోని ఆలయనిర్మాణం అత్యంత సుందరంగా, అంతకు మించిన సంపన్నతతో ఉంది. ఆలయం ఆర్కిటెక్చర్ గొప్పతనానికి చేతులెత్తి మొక్కాల్సిందే. ఈ తలుపులను ఒకరు తెరవడం సాధ్యం కాదు. తిరుమల వేంకటేశ్వర ఆలయం మహాద్వారం తలుపుల్లాగ భారీగా ఉంటాయి. ఉలి నైపుణ్యం గోడలు, స్తంభాల్లోనే కాదు తలుపు గడియల్లో కూడా చూడవచ్చు. నెమలి పింఛం ఆకారంలో ఉన్న గడియ కనీసం రెండు కిలోల బరువుంటుంది. సరదాపడి పైకి తీద్దామన్నా ఒక చేతితో కదిలించలేం. మనకు ఆలయాల్లో ప్రవేశద్వారాలే తెలుసు, కానీ ఇక్కడ ప్రవేశ భవనమే ఉంది. తొలి భవనంలో అడుగు పెట్టగానే గర్భగుడి కోసం చూస్తాం. కానీ అదంతా ప్రవేశ మార్గమే. అసలు ఆలయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి బుద్ధభగవానుడి దర్శనం చేసుకునే వరకు మనల్ని మనం మరిచిపోతాం. ఇప్పటి వరకు మనం చూడని మరోలోకంలో ఉన్న భావన కలుగుతుంది. ఆలయం పై కప్పు జామెట్రికల్ డిజైన్లు కూడా తేలికరంగులతో కంటికి హాయినిస్తూ నిర్మాణకౌశలానికి అద్దం పడుతుంటాయి. ప్రకృతి మనకు కలువలను ఎన్ని షేడ్లలో ఇస్తోందో ఈ ఆలయంలో చూడాల్సిందే. ఆలయ అలంకరణలో తెల్లని పూలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. బౌద్ధావలంబకులు కూడా (భిక్కులు కాదు) బుద్ధుని దర్శనానికి శ్వేత వస్త్రాలు ధరించి వస్తారు. చంటిబిడ్డలకు కూడా తెల్లని వస్త్రాలే వేస్తారు. వర్షం పడినా చలి ఉండదు! కాండీ నగరం మొత్తం కనిపించే వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఆగి నగరసౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ ఒక సరస్సును, ఒడ్డున ధవళ బుద్ధుడిని మిస్ కాకూడదు. కాండీ నగరంలోని సరస్సు... మనదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముసోరి సరస్సును తలపిస్తుంది. కాండీ రిలిక్ టెంపుల్ నిర్మాణం దక్షిణ భారత ఆలయ నిర్మాణశైలిని తలపిస్తుంది. ఇక్కడ వర్షం సీజన్‌తో పని లేకుండా రోజూ ఏదో ఒక సమయంలో చిరుజల్లయినా పడుతుంది. అందుకే గొడుగు దగ్గర ఉండడం అవసరం. ఇక్కడ మనకు ఒకింత ఆశ్చర్యకలిగించే విషయం ఏమిటంటే వర్షం కురుస్తుంది, కానీ చలి ఉండదు. వర్షం జల్లు ఆగిన వెంటనే ఉక్కపోత కూడా ఉంటుంది. మొత్తానికి శ్రీలంకలో ఉన్నది ఎండాకాలం, వర్షాకాలం రెండు సీజన్లేనని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: సీతా ఎలియా) -
ఇవిగివిగో... అవిగవిగో!
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించింది 24 సంవత్సరాల ఆకాంక్ష మోంగ. కన్సల్టెన్సీ జాబ్‌ను వదిలేసి ఫుల్‌టైమ్ ట్రావెలర్‌గా మారింది. పుణెకు చెందిన ఆకాంక్ష ట్రావెల్ అండ్ ఫొటోగ్రఫీ విభాగంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్‌ను ప్రేక్షకులకు వేగంగా చేరువ చేయడానికి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి’ అంటుంది ఆకాంక్ష. డిజిటల్ క్రియేటర్లు నిలువ నీరులా, గోడకు కొట్టిన మేకులా ఉండకూడదు అనే స్పృహతో యువ క్రియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్‌పైనే కాదు టూల్స్ గురించి కూడా అవగాహన చేసుకుంటున్నారు. క్రియేటర్–ఫ్రెండ్లీ టూల్స్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అప్డేట్స్ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కంటెంట్ మేకింగ్‌లో మరింత క్రియేటివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.... రెండు నెలల క్రితం ‘మీ షార్ట్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లండి’ అంటూ యూట్యూబ్ కొత్త క్రియేషన్ టూల్స్‌ను తీసుకువచ్చింది. అందులో ఒకటి కొలాబ్. ఈ టూల్‌తో సైడ్–బై–సైడ్ ఫార్మట్‌లో ‘షార్ట్’ను రికార్డ్ చేయవచ్చు. క్రియేటర్లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి మల్టిపుల్ లే ఔట్ ఆప్షన్లు ఉంటాయి.గత నెలలో జరిగిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ కార్యక్రమంలో క్రియేటర్స్‌కు ఉపకరించే కొత్త టూల్స్‌ను ప్రకటించింది కంపెనీ. ‘క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు కొత్త టూల్స్ తీసుకురానున్నాం. క్లిష్టం అనుకునే వాటిని సులభతరం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసే టూల్స్ ఇవి. క్రియేటివ్ పవర్‌కు దగ్గర కావడానికి ఉపకరిస్తాయి’ అన్నాడు యూ ట్యూబ్ సీయీవో నీల్ మోహన్.యూ ట్యూబ్ ప్రకటించిన కొన్ని టూల్స్.... డ్రీమ్ స్క్రీన్ యూట్యూబ్ షార్ట్స్ కోసం రూపొందించిన న్యూ జెనరేటివ్ ఫీచర్ ఇది. దీని ద్వారా తమ షార్ట్స్‌కు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడానికి వీలవుతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే పాప్ట్ ఇస్తే సరిపోతుంది. ‘డ్రీమ్ స్క్రీన్’ ద్వారా క్రియేటర్లు తమ షార్ట్స్‌కు న్యూ సెట్టింగ్స్ జ నరేట్ చేయవచ్చు. యూట్యూబ్ క్రియేట్ వీడియోలు క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఉపకరిస్తుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ కాప్షనింగ్, వాయిస్ వోవర్, యాక్సెస్ టు లైబ్రరీ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, రాయల్టీ–ఫ్రీ మ్యూజిక్... మొదలైనవి క్రియేటర్లకు ఉపయోగపడతాయి. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పని లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు. క్రియేటర్ల నోట ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం దీన్ని ఫీచర్‌గా మలచనున్నారు. ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ వినిపిస్తున్నప్పుడు ఈ బటన్లను సింక్‌లోని విజువల్ క్యూతో హైలైట్ చేస్తుంది. ఏఐ ఇన్సైట్స్ యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూస్తున్న కంటెంట్ ఆధారంగా వీడియో ఐడియాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలౌడ్ ఆటోమేటిక్ డబ్బింగ్ టూల్ ద్వారా కంటెంట్‌ను ఎక్కువ భాషల్లో క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి క్రియేటర్లు ‘రీల్స్’లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం. ఆ ఆడియోనూ ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసి అవసరమైన సందర్భంలో వాడుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు. ‘ప్రస్తుతం పాపులర్ ఏమిటి?’ అనేది తెలుసుకోవడానికి కొత్త డెడికేటెడ్ సెక్షన్ క్రియేటర్లకు ఉపకరిస్తుంది’ అని చెబుతుంది కంపెనీ.‘రీల్స్’ను ఎడిట్ చేయడాన్ని సులభతరం చేయడానికి వీడియో క్లిప్‌లు, ఆడియో, స్టిక్కర్స్, టెక్ట్స్‌ను ఒకేచోటుకు తీసుకువచ్చింది. తమ కంటెంట్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి కొత్తగా తీసుకువచ్చిన ‘రీల్స్ ఇన్సైట్స్’తో యాక్సెస్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్తగా యాడ్ చేసిన ‘టోటల్ వాచ్ టైమ్’ మెట్రిక్, ‘యావరేజ్ టైమ్’ మెట్రిక్‌తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. రీల్స్‌లో ‘స్ట్రాంగర్ హుక్’ క్రియేట్ చేసి వీడియోను ఆకట్టుకునేలా చేయడానికి ఇది ఉపకరిçస్తుంది. అయిననూ... టెక్నాలజీ మాత్రమే సర్వస్వం, విజయ సోపానం అనుకోవడం లేదు యువ క్రియేటర్లు. ‘టెక్నాలజీ అంటే టూల్స్ మాత్రమే కాదు క్రియేటర్ పనితీరు. ప్రత్యేకత. సృజనాత్మకత’ అనే విషయంపై అవగాహన ఉన్న యువ క్రియేటర్లు నేల విడిచి సాము చేయడం లేదు. కంటెంట్, టెక్నాలజీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. -
ఇదు శ్రీలంక: సీతా ఎలియా
శ్రీలంకలో పరిపాలన విభాగాలుగా బ్రిటిష్ వాళ్లు అనుసరించిన ప్రావిన్స్ విధానమే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘సీతా ఎలియా’ అనే చిన్న గ్రామం శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్‌లో ఉంది. శ్రీలంకలో అందమైన హిల్ స్టేషన్ నువారా ఎలియాకు కిలోమీటరు దూరంలోనే ఉంది సీతా ఎలియా. ఎలియా అనే పదానికి సింహళలో వెలుతురు, కాంతి అనే అర్థాలు చెబుతారు. రామాయణ కాలంలో సీతాదేవి వనవాసం చేసిన అశోక వాటిక ఇదని చెబుతారు. ఇక్కడి ఆలయాన్ని ‘సీతా అమ్మన్ టెంపుల్’ అంటారు. అశోకవాటిక సీతాదేవిని రావణాసురుడు తన రాజ్యం శ్రీలంకకు అపహరించుకుని వెళ్లి అతడి రాజమందిరంలో ఆమెకు బస ఏర్పాటు చేస్తాడు. రావణాసురుడి రాజమందిరంలో నివసించడానికి సీతాదేవి అంగీకరించకపోవడంతో పైగా ఆమె ఎప్పుడూ అశోక చెట్టు కిందనే ఎక్కువ సమయం గడపడాన్ని గమనించిన రావణాసురుడు ఆమె ప్రకృతి ప్రేమికురాలని, ఆమెకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకుంటోందని గ్రహించి ఈ ప్రదేశంలో బస ఏర్పాటు చేసినట్లు చెబుతారు. రావణాసురుడి భార్య మండోదరి కూడా ఈ వనానికి వచ్చి సీతాదేవిని కలిసేదని కూడా చెబుతారు. అశోకవాటిక నిజానికి మనసులోని శోకాన్ని దూరం చేసే అందమైన ప్రదేశమే. ప్రకృతి సౌందర్యానికి నెలువెత్తు నిదర్శనం. రావణాసురుడు మంచి కళాభిరుచి కలిగిన వాడని, సీతాపహరణం తప్ప మరేరకమైన అవగుణం లేదని చదివే వాళ్లం. అశోకవాటికను చూసినప్పుడు నిజమేననిపించింది. సీత అభిరుచిని గ్రహించడంతోపాటు ఆమె కోసం ఇలాంటి అందమైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం... రావణాసురుడి కళాహృదయానికి అద్దం పడుతోంది. ఇక్కడి సెలయేరు నిరంతరం ప్రవహిస్తుంటుంది. సెలయేటి తీరాన సీతాదేవి స్నానం చేసేదని చెప్పడానికి ఆనవాలుగా సిమెంటు నిర్మాణం ఉంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీలంకకు వచ్చిన హనుమంతుడు... సీతాదేవిని కలిసింది ఇక్కడే. ఆ ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ సెలయేటి తీరాన శిల్పాలున్నాయి. భారతీయులు కట్టిన ఆలయం అశోకవాటికలో ఉన్న సీతా అమ్మన్ ఆలయం దక్షిణ భారత నిర్మాణశైలిలో ఉంది. తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస కూలీలుగా వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆలయం లోపలి విగ్రహాల శిల్పనైపుణ్యం అద్భుతంగా ఉంది. కానీ ఆలయగోపురం మీద ఉన్న విగ్రహాలు శిల్పశాస్త్ర గణితానికి లోబడి ఉన్నట్లు అనిపించదు. విగ్రహం ఎత్తును అనుసరించి తల, మెడ, భుజాలు, దేహం, కాళ్ల పొడవులకు శాస్త్రబద్ధమైన కొలతలుంటాయి. శిల్పాన్ని చెక్కడానికి అవే ప్రధాన ఆధారం.ఆ తర్వాత ఎవరి విగ్రహాన్ని చెక్కుతుంటే సాహిత్యంలో వర్ణించిన ఆ వ్యక్తి దేహాకృతి, రూపలావణ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఆలయ గోపురం మీదున్న విగ్రహాలను చూస్తే శాస్త్రబద్ధమైన పొంతన సరిగ్గా కుదరలేదనిపిస్తుంది. మరి కొంత పరిశీలనగా చూస్తే మాత్రం... శ్రీలంక వాసుల దేహసౌష్ఠవం ప్రభావం ఈ శిల్పాల మీద ఉన్నట్లనిపిస్తుంది. అయితే కూలీలుగా వలస వెళ్లిన వాళ్లు తమకున్న పరిమితమైన వనరుసలతో చేసిన ప్రయత్నాన్ని గౌరవించకుండా ఉండలేం. యూ ట్యూబర్ల షూటింగ్ ఇక్కడ పర్యటనకు వచ్చే వాళ్లలో భారతీయులే ఎక్కువ. నేను వెళ్లినప్పుడు ఒక ఉత్తరాది మహిళ తన స్మార్ట్ ఫోన్లో ఆ ప్రదేశాన్ని షూట్ చేస్తూ కామెంటరీ ఇస్తూ కనిపించింది. మరికొంత మంది ఆకాశాన్నంటుతున్న మహావృక్షాలను, సెలయేటి జలప్రవాహ శబ్దాన్ని రికార్డు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రదేశం సౌందర్యాన్ని అచ్చంగా కళ్లకు కట్టాలంటే డ్రోన్ కెమెరాతో షూట్ చేయాల్సిందే. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: శ్రీగంగారామ మహా విహారాయ!) ఈ లింక్‌పై క్లిక్‌చేసి వాట్సాప్ ఛానెల్‌ని ఫాలోకండి -
ఇదు శ్రీలంక: శ్రీగంగారామ మహా విహారాయ!
ఈ విహారం శ్రీలంక రాజధాని కొలంబో నగరంలో ఉంది. వ్యవహారంలో ‘గంగారామయ టెంపుల్’ అంటారు కానీ సింహళంలో ‘శ్రీగంగారామ మహా విహారాయ’ అంటారు. మనం ‘విహారం’ అనే పదాన్ని వాళ్లు ‘విహారాయ’ అంటారు. బోధిచెట్టు, విహార మందిరం, సీమ మలక (సన్యాసుల సమావేశ మందిరం)... మూడు నిర్మాణాల సమూహం. మూడింటితోపాటు రెలిక్ కాంప్లెక్స్‌కి కూడా కలిపి ఒకటే టికెట్. శ్రీలంక రూపాయల్లో నాలుగు వందలు. ‘శ్రీ జినరత్న భిక్కు అభ్యాస విద్యాలయ’ పేరుతో రసీదు ఇచ్చారు. ఇది వర్షిప్ అండ్ లెర్నింగ్ సెంటర్. ఈ విహారం ఉన్న ప్రదేశాన్ని ‘జినరత్న రోడ్’ అంటారు. అతిపెద్ద పర్యాటక ప్రదేశం కావడంతో మన ఉచ్చారణలో స్పష్టత లేకపోయినప్పటికీ స్థానిక టాక్సీల వాళ్లు సులువుగా గుర్తించి తీసుకువెళ్తారు. ఇది బెయిరా సరస్సు ఒడ్డున ఉంది. అశోకుడి ధర్మచక్రం గంగారాయ మహా విహారాయలో కూడా తొలి ప్రాధాన్యం బోధివృక్షానిదే. అనూరాధపురాలో ఉన్న శ్రీ మహాబోధి వృక్షం నుంచి సేకరించిన మొక్కను ఇక్కడ నాటినట్లు చెబుతారు. ఈ బోధివృక్షం మొదట్లో చెట్టు వేళ్ల మధ్య అవుకాన బుద్ధ విగ్రహం ఉంది. ఆ పైన రెయిలింగ్‌తో కూడిన బేస్మెంట్ మీద అశోకుని ధర్మచక్రం. నోరు తెరిచి గర్జిస్తున్న నాలుగు సింహాల విగ్రహం ఉంది. లోపలికి వెళ్తే బుద్ధుడు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాడు. ఆవరణలో బుద్ధుడి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టలేం. బుద్ధుడికి మకరతోరణంలా అమర్చిన ఏనుగు దంతాలను గమనించడం మర్చిపోకూడదు. నిలువెత్తు దంతాలవి. మనం ఆ దంతాల పక్కన నిలబడితే దంతాలే మనకంటే ఎత్తు ఉంటాయి. ఇక మ్యూజియంలోకి అడుగుపెడితే అది మరో ప్రపంచం. కనువిందు చేసే ప్రదేశమంటే ఇదేననిపిస్తుంది. అల్మరాల్లో పాలరాతి బుద్ధుడి విగ్రహాలు వరుసగా పేర్చి ఉన్నాయి. వాలుగా కూర్చుని ఉన్న భంగిమలో అర అడుగు విగ్రహాలు షోరూమ్‌లో అమ్మకానికి పెట్టినట్లున్నాయి. కింది వరుసలో నిలబడిన బుద్ధుడి రాతి విగ్రహాలు, వాటి మధ్యలో నాలుగడుగుల ఒకింత పెద్ద విగ్రహాలు... ఒక థీమ్ ప్రకారం అమర్చి ఉన్నాయి. మరో ర్యాక్‌లో కూడా బుద్ధుడి విగ్రహాల అమరిక అలాగే ఉంది కానీ మధ్యలో పెద్ద నటరాజు విగ్రహం ఉంది. బహుశా శ్రీలంకలో శైవం ప్రాచుర్యంలో ఉండడంతో బుద్ధుడిలో ఈశ్వరుడిని కూడా చూస్తున్నట్లుంది. మరకత బుద్ధుడు ఒకటిన్నర అడుగుల ఎత్తు, అడుగు వెడల్పు ఉన్న జాతి పచ్చ రాయిలో చెక్కిన విగ్రహం అది. ఏకరాతిని బుద్ధుడి రూపంలో చెక్కి, సర్వాలంకార భూతుడిని చేశారు. ఒంటి నిండా ఆభరణాలతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది. మరికొన్ని షెల్ఫుల్లో అరడుగు రూబీ (కెంపు) బుద్ధుడి విగ్రహాలు, గోమేధికం బుద్ధుడి విగ్రహాలున్నాయి. బుద్ధుడు ఆహారం తీసుకోనప్పుడు దేహం శుష్కించి పోయిన రూపాన్ని ప్రతిబింబించే విగ్రహం ఒక ఆశ్చర్యం. డొక్క ఎండిపోయిన లోహపు బుద్ధుడి విగ్రహం అన్నమాట. ముఖంలో సన్నని గీతలు కూడా డీటెయిల్డ్‌గా కనిపిస్తాయి. ఒక అల్మరాలో ఒక ఇత్తడి పాత్రలో ఇరవయ్యవ శతాబ్దం నాటి నాణేలున్నాయి. నాణేల్లో ఎక్కువ భాగం ఇత్తడివే. బ్రిటిష్ కాలంలోనూ స్వాతంత్య్రానంతరం మనదేశంలో చెలామణిలో ఉన్న నాణేలను పోలి ఉన్నాయవి. శయన బుద్ధుడు, చైనా బుద్ధుడు, సునిశితమైన చిత్రాలతో ఐదున్నర అడుగుల పింగాణి కూజాలు, అల్మెరాల్లో వెండి– బంగారు పాత్రలు, తొండం ఎత్తి ఘీంకరిస్తున్న ఏనుగులు, పడగెత్తిన వెండి నాగుపాములు కూడా లెక్కకు మించి ఉన్నాయి. లోహపు మారేడుదళం, పూలసజ్జలను చూస్తుంటే సాంస్కృతికంగా మన దక్షిణ భారత దేశానికి – శ్రీలంకకు మధ్య అవినాభావ బంధం ఉందనిపిస్తుంది. జినరతన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విభాగంలో ఉన్న లైబ్రరీ విశాలమైనది. ప్రపంచంలోని బౌద్ధ సాహిత్యం అంతా ఇక్కడ ఉంది. బెయిరా సరస్సులో రెలిక్ ప్రధాన విహారానికి ఒకవైపు నిలువెత్తు బ్రాస్వాల్ మీద బుద్ధుడి జీవితంలో దశలు, జాతక కథల కుడ్యశిల్పాలున్నాయి. రోడ్డు దాటి సరస్సు వైపు వస్తే అందులో బుద్ధుడి రెలిక్ కాంప్లెక్స్ ఉంది. అది సాంస్కృతికతను ఒడిసి పట్టిన అత్యంత అధునాతన నిర్మాణం. ఇక్కడ ఉంచిన రెలిక్ ఏమిటన్నది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయారు. రెలిక్ అని మాత్రమే చెబుతున్నారు. ఆవరణలో బుద్ధుడి విగ్రహాల వరుస ఉంది. మరో విషయం... ప్రపంచంలో అత్యంత భారీ విగ్రహంగా రికార్డు సాధించిన బోరోబుదూర్ బుద్ధుడి విగ్రహానికి ప్రతీకాత్మక రూపం ఇక్కడ ఉంది. బోరోబుదూర్ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, కాబట్టి ఇప్పుడు ఇక్కడి రూపాన్ని చూసి సంతృప్తి చెందవచ్చు. బౌద్ధం నడిపించిన సమాజం శ్రీలంక. మనుషులు అత్యంత స్నేహపూర్వకంగా, మితభాషులుగా కనిపించారు. మరో విషయం ఇక్కడ సావనీర్ షాప్‌లో బుద్ధుడి జ్ఞాపికలతోపాటు ముత్యాల ఆభరణాలు కూడా ఉన్నాయి. అయితే దుకాణదారులు వాటి నాణ్యత విషయంలో స్పష్టత ఇవ్వలేకపోయారు. జాగ్రత్తగా కొనుగోలు చేయడం మంచిది. – వాకా మంజులారెడ్డి సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి (చదవండి: ఇదు శ్రీలంక: కేలనియా మహా విహారాయ!) -
ఇదు శ్రీలంక: కేలనియా మహా విహారాయ!
శ్రీలంకకు రాముడు ఒకసారి వెళ్తే బుద్ధుడు మూడుసార్లు వెళ్లాడు. మూడవసారి శ్రీలంక పర్యటనలో బుద్ధుడు అడుగుపెట్టిన ప్రదేశం కేలనియా ఆలయం. శ్రీలంకలో చరిత్రను చారిత్రక ఆధారాలతో డాక్యుమెంట్ చేయడం కంటే సాహిత్యం ఆధారంగా, అది కూడా ధార్మిక గ్రంథాల ఆధారంగా గతంలో ఆ నేల మీద ఏం జరిగిందో తెలుసుకోవడమే జరిగింది. నాటి సంస్కృతిని సంప్రదాయాల ఆధారంగా చరిత్రను అంచనా వేయాల్సి వచ్చింది. చిత్రాల్లో బుద్ధుడు శ్రీలంకలో కేలనియా గంగా నది తీరాన కొలంబో నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది కేలనియా మహా విహారాయ. విశాలమైన ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో భారీ ధవళ బుద్ధుడి విగ్రహం. కేలనియా మహా విహారాయ అద్భుతమైన శిల్పకళానైపుణ్యంతో కూడిన నిర్మాణం. అంతకంటే ఎక్కువగా ఈ ఆలయం అద్భుతమైన చిత్రాలకు నెలవు. గోడలు, పై కప్పు నిండా పెయింటింగ్సే. ఒక్కొక్కటి ఒక్కో సంఘటనను ప్రతిబింబిస్తుంది. బుద్ధుడు శ్రీలంకలో అడుగుపెట్టడం, త్రిపీటకాలను బోధించడం, అష్టాంగమార్గాలను విశదపరచి సమ్యక్ జీవనం దిశగా నడిపించడం, స్థానిక రాజులు బుద్ధుడికి అనుచరులుగా మారిపోవడం, సామాన్యులు బుద్ధుడిని చూడడానికి ఆతృత పడడం, బుద్ధుడి మాటలతో చైతన్యవంతమై వికసిత వదనాలతో సన్మార్గదారులవడం... వంటి దృశ్యాలన్నీ కనిపిస్తాయి. మరొక ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ చిత్రాల్లో విభీషణుడి జీవితంలో ముఖ్యమైన విభీషణుడి పట్టాభిషేకం ఘట్టం కూడా ఉంది. విభీషణుడి రాజభవనం కేలనియా నది తీరాన ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఉందని చెబుతారు. ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం కూడా ఉంది. విభీషణుడిని సింహళీయులు విభీషణ్ దేవయా అని పిలుచుకుంటూ ప్రాచీనకాలంలో తమను పరిరక్షించిన దేవుడిగా కొలుస్తారు. విభీషణుడిని రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశం కేలనియా ఆలయ ప్రాంగణమేనని కూడా చెబుతారు. వాతావరణానికి అనువుగా నిర్మాణాలు! బౌద్ధ ప్రార్థనామందిరాల్లో డ్రెస్ కోడ్ ఉంటుంది. మన దుస్తులు భుజాలు, మోకాళ్లను కప్పేటట్లు ఉండాలి. అలా లేకపోతే ఆలయ ప్రాంగణంలో చున్నీ వంటి వస్త్రాన్ని ఇస్తారు. దాంతో భుజాలను కప్పుకోవాలి. మోకాళ్లు కనిపించే డ్రస్ అయితే ఆ వస్త్రాన్ని లుంగీలాగా చుట్టుకోవాలి. శ్రీలంక దీవి సతత హరితారణ్యాల నిలయం కావడంలో వర్షాలు అధికం. వర్షపు నీరు ఇంటి పై భాగాన నిలవ కుండా జారిపోవడానికి వీలుగా స్లాంట్ రూఫ్ ఉంటుంది. ఈ ఆలయం కూడా ఎర్ర పెంకుతో వాలు కప్పు నిర్మాణమే. దీనికి పక్కనే ఇదే ప్రాంగణంలో తెల్లగా మెరిసిపోతూ బౌద్ధ స్థూపం ఉంది. కేలనియా ఆలయంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బుద్ధుడి విగ్రహానికి తల మీద బంగారు రంగులో లోహపు త్రిశూలం ఉంది. బుద్ధుడి వెనుక నీలాకాశం, తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ పర్వతాలను పోలిన నేపథ్యం ఉంది. స్థానికులు బుద్ధుడిని శివలింగం పూలతో పూజిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించే ప్రమిదల పెద్ద పెద్ద స్టాండులు నూనె ఓడుతూ ఉన్నాయి. కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు కూడా. కార్తీక మాసంలో మనదేశంలో శివాలయాల్లో కనిపించే దృశ్యం అన్నమాట. ధార్మికత సాధనలో ఎవరికి తోచిన మార్గం వారిది. 2,500 ఏళ్ల నాటి జ్ఞాపకాలకు ఆనవాలు కేలనియా మహావిహారాయ. భారతదేశం– శ్రీలంకల మధ్య వికసించిన మైత్రిబంధానికి ప్రతీక ఈ ఆలయం. వీటికి ప్రత్యక్ష సాక్షి ఆలయ ప్రాంగణంలో బోధివృక్షం. సింహళీయుల ఆత్మీయత తాజాగా తెలంగాణ రాష్ట్రం– శ్రీలంకలను కలుపుతున్న బౌద్ధం పరస్పర సహకారంతో పరిఢవిల్లనుంది. మనవాళ్లను చూడగానే సింహళీయులు ‘ఇండియన్స్’ అని చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా చూస్తారు. తెలుగు వాళ్ల మీద కూడా వారికి ప్రత్యేకమైన అభిమానం వ్యక్తమవుతుంది. శ్రీలంకతో ప్రాచీన తెలుగుబంధం బుద్ధఘోషుడి రూపంలో ఏర్పడింది. ఈ ఆలయంలోని చిత్రాల్లో బుద్ధఘోషుడు తాను రాసిన విశుద్ధమగ్గ గ్రంథాన్ని శిష్యుడికి అందిస్తున్న పెయింటింగ్‌ని కూడా చూడవచ్చు. సింహళులు ఇష్టంగా అనుసరించే ధార్మికత బౌద్ధం పుట్టింది భారతదేశంలోనే కాబట్టి వారు భారతీయుల పట్ల ఆత్మీయంగా ఉంటారు. సోదర ప్రేమను పంచుతారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికులు తెలుగువారిని దక్షిణాది వారన్నట్లు తక్కువగా చూడడం ఎవరూ కాదనలేని సత్యం. శ్రీలంక సింహళీయులు మాత్రం బౌద్ధంతో మనతో బంధాన్ని కలుపుకుంటారు. సింహళీయుల ఆత్మీయత మనల్ని కట్టిపడేస్తుంది. – వాకా మంజులా రెడ్డి (చదవండి: రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం) -
రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం
సెప్టెంబర్‌లో నెలలో ఓ వారం రోజుల పాటు శ్రీలంకలో పర్యటించే అవకాశం వచ్చింది. నేను చూసిన శ్రీలంకకు అక్షరరూప పరంపర ఇది. మొదట మదుగంగలో రివర్ సఫారీ మదుగంగ... ఈ నది శ్రీలంక దీవిలో ప్రవహిస్తోంది. బాల్‌పిటియా అనే చిన్న పట్టణం నుంచి ఈ నదిలో రివర్ సఫారీ చేయవచ్చు. ఈ ప్రదేశం కొలంబో– గాలే హైవేలో వస్తుంది. బెన్తోట నుంచి అరగంట ప్రయాణ (18 కి.మీలు) దూరంలో ఉంది బాల్‌పిటియా. ఇక్కడ మదుగంగ నది విశాలమైన సరస్సును తలపిస్తూ ఉంటుంది. నీరు నిశ్చలంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం నుంచి పడవలో ప్రయాణం మొదలు పెడితే ఒకటిన్నర గంట నదిలో విహరించవచ్చు. నది మధ్యలో ఉన్న దీవులను చుట్టిరావచ్చు. మధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని, వినాయకుడి మందిరాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇది ప్రకృతి రమణీయతను, మాన్‌గ్రోవ్ (మడ అడవులు) బారులను చూడడానికి వెళ్లాల్సిన ప్రదేశం. నదికి మహా స్వాగతం మదు గంగ నది తీరమంతా మడ అడవులు దట్టంగా ఉంటాయి. చెట్ల కొమ్మల నుంచి పుట్టుకొచ్చిన వేళ్లు నదిలోని నీటి కోసం ఊడల్లాగ కిందకు వేళ్లాడుతుంటాయి. బాల్‌పిటియా దగ్గర మొదలైన రివర్ సఫారీ మొదట మదుగంగ నది హిందూమహాసముద్రంలో కలిసే ప్రదేశం వరకు సాగుతుంది. నిశ్చలంగా ప్రవహించిన నదికి హిందూ మహా సముద్రం అలలతో స్వాగతం పలుకుతున్న అద్భుతాన్ని చూసిన తరవాత దీవుల పరిక్రమ దిశగా సాగింది మా పడవ. ప్రకృతి ప్రపంచమిది శ్రీలంకలో ఎటు చూసినా పచ్చదనమే. అయితే ఈ నది మధ్య ఉన్న దీవులు ఇంకా దట్టమైనవి, ఇంకా పచ్చనైనవి. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించినట్లు దట్టమైన అడవులవి. ఈ దీవులు కొన్ని ప్రైవేట్ వ్యక్తులవి. కొన్ని సామాన్య జనావాసాలు. ఒక దీవిలో పూర్తిగా దాల్చిన చెక్కను చెక్కే వాళ్లే నివసిస్తున్నారు. మొత్తం ఇరవై కుటుంబాలు. దాల్చిన చెక్క చెట్ల నుంచి బెరడును సేకరించడం, సినమిన్ ఆయిల్ తయారు చేయడమే ఆ దీవిలో నివసించే వారి వృత్తి. పడవలన్నీ ఆ దీవి దగ్గర ఆగుతాయి. ఒక ఇంట్లోకి వెళ్లగానే ఒక చిన్న గది, పర్యాటకులు కూర్చోవడానికి చేసిన ఏర్పాటు ఉంది. మనం వెళ్లగానే ఒక వ్యక్తి సినమిన్ ఆకులు రెండింటిని మన చేతిలో పెట్టి వాసన చూడమంటాడు. ఆ తర్వాత ఒక కర్రను చూపించి బెరడును ఒలుస్తాడు. ఆ తర్వాత పర్యాటకులందరికీ గాజు కప్పుల్లో దాల్చిన చెక్క టీ ఇస్తారు. చేపల పట్టే అమ్మాయి టీ తాగిన తర్వాత వారి వద్దనున్న దాల్చిన చెక్కతోపాటు సినమిన్ పౌడర్ ప్యాకెట్లు, సినమిన్ ఆయిల్ సీసాలను మన ముందు పెడతారు. కావల్సినవి కొనుక్కున్న తర్వాత పడవ ఇతర దీవుల వైపు సాగుతుంది. ఈ మధ్యలో బుద్ధుని విగ్రహం దగ్గర కొంతసేపు ఆగవచ్చు. ఒక్కో దీవిని చుట్టి వస్తుంటే మనం ప్రకృతి ప్రపంచాన్ని చుట్టి వస్తున్న విజేతగా ఒకింత అతిశయంగా ఫీలవుతాం. అన్నట్లు చేపలతో ఫుట్ మసాజ్ సౌకర్యం కూడా ఒక దీవిలో ఉంది. చేపలు పట్టే అమ్మాయి మదుగంగలో ఒకమ్మాయి చిన్న తెడ్డు పడవలో చేపలు పడుతూ కనిపించింది. ‘నువ్వు ఆడపిల్లవి, ఈ పనులు నువ్వు చేసేవి కాదు’ అని అడ్డగించే వాళ్లు లేకపోతే అమ్మాయిలు ఏ పనిలోనైనా అద్భుతాలు సాధిస్తారనిపించింది. ఆ అమ్మాయికి హాయ్ చెప్పి, మనసులోనే సెల్యూట్ చేసుకుని ముందుకు సాగిపోయాం. తిరుగు ప్రయాణంలో ఒక దీవి దగ్గర గబ్బిలాలు భయం గొల్పాయి. దీవి నిండా చెట్లకు తలకిందుగా వేళ్లాడుతూ నల్లటి పెద్ద పెద్ద గబ్బిలాలు. ఇంకొద్ది సేపు చూడాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ ఆ దృశ్యం ఆహ్లాదంగా అనిపించక ముందుకు సాగిపోయాం. ఇక్కడ ముందుకు సాగిపోవడం అంటే బయలుదేరిన ప్రదేశం వైపుగా అన్నమాట. పడవ దిగేటప్పటికి రెస్టారెంట్లో వంట సిద్ధంగా ఉంది. రివర్ సఫారీకి బయలుదేరేటప్పుడే ఫుడ్ ఆర్డర్ తీసుకున్నారు. రకరకాల కూరగాలయలను కొబ్బరి పాలతో ఉడికించిన కూరలతో మంచి భోజనం పెట్టారు. చేపల కూర కూడా రుచిగా ఉంది. ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... మాన్‌గ్రోవ్ బారుల మధ్య నదిలో విహారం అద్భుతంగా ఉంటుంది. చెట్లు ఒక్కో చోట నదిని ఇరుకు చేస్తాయి. గుహలోకి వెళ్లినట్లు పడవ కొమ్మల మధ్య దూరి పోతుంది. నది మీద ఇనుప వంతెనలుంటాయి. వాటి దగ్గరకు వచ్చినప్పుడు దేహాన్ని బాగా వంచి పడవలో ఒదిగి కూర్చోవడం, చిన్నపిల్లల్లాగ భయంభయంగా వంతెన వెళ్లిపోయిన తరవాత పైకి లేవడం, ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... లండన్ బ్రిడ్జి ఫాలింగ్ డౌన్ అని పాడుకున్నట్లే... ఈ రివర్ సఫారీలో ‘కమింగ్ సూన్ కమింగ్ సూన్ వన్మోర్ బ్రిడ్జ్ ఈజ్ కమింగ్ సూన్’ అని పాడుకుంటూ పడవలో దాక్కోవడం... పర్యాటకులను చిన్న పిల్లలను చేస్తుంది. – వాకా మంజులారెడ్డి (చదవండి: పర్యాటకుల స్వర్గధామం కోనసీమ, ఆతిథ్యం నుంచి ఆత్మీయత వరకు..) -
గోదావరి అందాలు.. ఒక్కసారి చూస్తే మైమరిచిపోవాల్సిందే!
కోనసీమ అందాల సీమ. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని.. సప్త నదీపాయల మధ్య కొలువైన సీమ. పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే చేలు, కొబ్బరితోపులు, గోదావరి నదీపాయలు, వంపులు తిరుగుతూ పారే పంట కాలువలు, తెరచాప పడవలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, మడ అడవులు, గోదావరి మధ్య లంక గ్రామాలు, మండువా లోగిళ్లు, రైతుల మకాంలు.. వీటన్నింటికీ మించి ఆత్మీయత, మమకారంతో కలిసిన ఆతిథ్యం ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమ పర్యాటకులకు స్వర్గధామం. రైతులు, కూలీలు, మత్స్యకారులు, మహిళల జీవనం విధానం, కట్టూబొట్టూ, పండగలు, పబ్బాలు, జాతరలు.. ఇలా ఇక్కడ అన్నింటా ఒక ప్రత్యేక ముద్ర. ఇటీవల కాలంలో గోదావరి, సముద్ర తీరంలో వెలుస్తున్న రిసార్ట్స్, రైతుల పొలాల వద్ద ఫామ్ హౌస్‌లు, పర్యాటక రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి చర్యల కారణంగా కోనసీమకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ‘సప్త’వర్ణాల కోనసీమ.. పర్యాటకంగా కూడా ‘సప్త’రకాలుగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 27 ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా కథనం. ఆధ్యాత్మికంగా.. ఆధ్యాత్మిక రంగంలో కోనసీమ జిల్లాకు ప్రముఖ స్థానం ఉంది. లెక్కలేనన్ని ఆలయాలు, పురాణ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కోనసీమ సొంతం. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక విమానాలలో భక్తులు వస్తున్నారు. వీటితోపాటు అంతర్వేది లక్ష్మీ నర్శింహస్వామి, మందపల్లి శనీశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ విఘేశ్వరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. బౌద్ధులు.. రాజుల చారిత్రక ఆనవాళ్లు చారిత్రాత్మక ప్రదేశాలలో పర్యాటకానికి వస్తే రామచంద్రపురంలో 17వ శతాబ్ధం నాటి కోట ఉంది. మామిడికుదురు మండలం ఆదుర్రులో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ధం నాటి పురాతన బౌద్ధ స్థూపాలున్నాయి. కపిలేశ్వరపురం జమీందార్ల పురాతన భవనాలు, రాజుల కోటలను తలపించే మండువా లోగిళ్ల ఇళ్లు పర్యాటకులకు ముచ్చటగొల్పుతాయి. అగ్రి టూరిజం పర్యాటకంలో ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది అగ్రి టూరిజానికే. దేశంలో కేరళలో మొదలైన ఈ పర్యాటకం విస్తరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని ఐటీ వంటి రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు అగ్రి టూరిజం బాట పడుతున్నారు. ఇటువంటి వారికి కోనసీమ అగ్రి టూరిజం ఒక అద్భుతం. పచ్చని తివాచీ పరచినట్టు ఉండే వరిచేలు, కొబ్బరి, అరటి తోటలు, లంక గ్రామాల్లో పలు రకాల పంటలు, పాడి, ఆక్వా చెరువులు, తోటల్లోని రైతుల మకాం (వ్యవసాయ శాలలు) విశేషంగా ఆకర్షిస్తాయి. గోదావరి హొయలు గోదావరి నదీ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. నది మధ్యలో లంక గ్రామాలు, వాటిలో సాగయ్యే పంటలు, ఇసుక తిన్నెలు, చెంగుచెంగున ఎగిరే కృష్ణ జింకలు, తెరచాప పడవలు, పంటులు, హౌస్బోట్లపై సాగే ప్రయాణం, నదీపాయలపై వంతెనలు.. గోదావరి కాలువలకు లాకులు,ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి హొయలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మైమరపించే మడ అడవులు ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి అంతర్వేది సముద్ర తీరం వరకు నదీపాయలతోపాటు, మురుగునీటి కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో ఉన్న మడ అడవులలో పర్యాటకం అద్భుతమనే చెప్పాలి. నదీ, కాలువ పాయల మధ్య మడ అడవులు మీదుగా సాగే ప్రయాణం మధురానుభూతిని పంచుతుంది. ఆతిథ్యం అద్భుతం అతిథి మర్యాదంటేనే గోదావరి జిల్లాలు. మరీ ముఖ్యంగా కోనసీమ ఆహారం.. అతిథ్యానికి ఫిదా అవ్వాల్సిందే. పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీర్చే రకరకాల స్వీట్లు, హాట్లు, టిఫిన్లు, బిర్యానీలు, మాంసహార కూరలు ఎన్నో.. ఎన్నెన్నో. ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవా, మినప రొట్టి, చెరుకుపానకం, పెసరెట్టు ఉప్మా, పనస పొట్టు కూర, ముద్దపప్పు.. గుమ్మడి పులుసు, ఉల్లి గారెలు... నాటు కోడి కూర, చుక్కపీత ఇగురు.. పులసల పులుసు ఇలా ఎన్నో రకాల వంటకాలు పర్యాటకులను లోట్టలు వేయిస్తాయి. -
విశాఖ అందాలు..మంత్రముగ్ధులను చేసే సాగర కెరటాల హోయలు
విశాఖపట్నం: కై లాసగిరి కొండ అంచు నుంచి సాగర కెరటాల హోయలను చూస్తూ నైట్ స్టే చేస్తే.. కొండపై నుంచి విశాఖ అందాలను చూస్తూ నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఆరగిస్తుంటే.. ఊహించుకోడానికే ఎంతో బాగుంది కదూ.. సముద్ర తీరాన భారీ నౌకలో అతిథ్యం.. కారవాన్‌లో విహారం.. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేలా నేచ్యురల్ హిస్టరీ పార్కు.. సైన్స్ మ్యూజియం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేలా వినూత్న, బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి తోడు దిగ్గజ సంస్థలు విశాఖలో 7 స్టార్ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, షాపింగ్ మాల్స్ నిర్మాణాలకు పోటీ పడుతున్నాయి. విశాఖ కేంద్రంగా త్వరలోనే పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆతిథ్య రంగం మరింతగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్‌లో విశాఖలో అలరించే సరికొత్త ప్రాజక్టుల వివరాలతో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. ఎటు చూసినా అందమే.. ఎటు చూసినా ఆనందమే.. చూసే కనులకు మనసుంటే.. ఆ మనసుకు కూడా కళ్లుంటే.. అని చెప్పిన సినీ కవి మాటలు.. అచ్చుగుద్దినట్లు ప్రకృతి రమణీయతతో ఓలలాడే విశాఖకు సరిపోతాయి. విశాఖను చూసేందుకు దేశ, విదేశాల పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఒకవైపు విశాఖ అభివృద్ధితో పాటు మరో వైపు పర్యాటకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొన్ని కార్యరూపం దాల్చగా.. మరికొన్ని సమగ్ర నివేదిక దశలో.. ఇంకొన్ని ప్రణాళికల దశలో ఉన్నాయి. నగరం నుంచి భీమిలి వరకు సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడంతో పలు బీచ్‌ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. రుషికొండ బీచ్‌లో చేపట్టిన అభివృద్ధితో ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ లభించింది. విశాఖపై దిగ్గజ సంస్థల ఆసక్తి అతిథ్య రంగంలో విశాఖ ఇప్పటికే తనదైన ముద్ర వేస్తోంది. నగరంలో త్రీస్టార్ నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్లు అనేకమున్నాయి. విశాఖ కేంద్రంగా పరిపాలన కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల తాకిడి పెరుగుతుంది. తద్వారా హోటళ్లు, రిసార్టుల వ్యాపారం రెట్టింపవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి తగ్గట్టుగానే విశాఖలో దిగ్గజ అతిథ్య రంగ సంస్థలు ఒబెరాయ్, మేఫెయిర్ సంస్థలు 7 స్టార్ హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చాయి. ఒబెరాయ్ సంస్థ భీమిలి మండలం అన్నవరంలో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.350 కోట్ల వ్యయంతో విల్లా రిసార్టుల నిర్మాణం చేపడుతోంది. ఈ రిసార్టు పనులకు ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. అలాగే భీమిలి మండలం అన్నవరంలోనే మేఫెయిర్ సంస్థ 40 ఎకరాల్లో రూ.525 కోట్లతో 7 స్టార్ హోటల్‌తో పాటు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. వీటితో పాటు వీఎంఆర్డీఏ పార్కు వెనుక మైస్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. భవిష్యత్‌లో విశాఖ అతిథ్య రంగానికి ఉన్న డిమాండ్‌కు ఈ సంస్థల రాకే నిదర్శనం. వైద్య, ఆధ్యాత్మిక పర్యాటకంపై దృష్టి విశాఖలో వైద్య, ఆధ్యాత్మిక పర్యాటకంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సింహాచలం, కనకమహాలక్ష్మి దేవస్థానాలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. ప్రసాదం స్కీమ్‌లో భాగంగా సింహాచలం ఆలయం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక్కడ ప్రాచీన ఆలయాలను సర్క్యూట్‌గా చేసి స్పిరిచ్యువల్ టూరిజంను అభివృద్ధి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాలన ప్రారంభమైతే నగరానికి పెద్ద ఎత్తున పర్యాటకులు పెరిగే అవకాశాలు ఉంటాయి. తద్వారా విమాన సర్వీసులు కూడా రెట్టింపవుతాయి. అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరగడం ద్వారా మెడికల్, స్పిరిచ్యువల్ టూరిజంకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. పర్యాటకంలో విశాఖకు అవార్డుల పంట దొండపర్తి: పర్యాటకంలో విశాఖకు అవార్డుల పంట పండింది. రాష్ట్ర వార్షిక టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులను వివిధ కేటగిరీల కింద విశాఖలో ఉన్న హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, ట్రావెల్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. బెస్ట్ 5 స్టార్ హోటల్‌గా రాడిసన్ బ్లూ అవార్డును దక్కించుకుంది. అలాగే 4 స్టార్ విభాగంలో హోటల్ దసపల్లా, బెస్ట్ బడ్జెట్ హోటల్‌గా ఎలిగంట్ హోటల్, బెస్ట్ హరితా హోటల్‌గా అరకు హరిత వ్యాలీ రిసార్ట్, బెస్ట్ హోటల్ బేస్డ్ మీటింగ్ వెన్యూగా వరుణ్బీచ్ నోవోటెల్, బెస్ట్ రెస్టారెంట్ ఇన్ హోటల్‌గా గ్రీన్‌పార్క్‌లో మెకాంగ్ రెస్టారెంట్, బెస్ట్ స్టాండ్–అలోన్ రెస్టారెంట్‌గా టైకూన్ అండ్ హెరిటేజ్ రెస్టారెంట్, బెస్ట్ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్‌గా వైజాగ్ కన్వెన్షన్స్ అవార్డును సొంతం చేసుకున్నాయి. అలాగే బెస్ట్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్(డొమస్టిక్)గా ట్రావెల్ హోం, బెస్ట్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్‌గా ట్రావెల్ ఐక్యూ గ్లోబల్ సొల్యూషన్స్, మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్‌గా హాలిడే వరల్డ్, బెస్ట్ టూరిజం ప్రమోషన్ కొల్లాటిరల్ పబ్లిసిటీ మెటీరియల్‌గా విశాఖపట్నం పాకెట్ టూరిస్ట్ గైడ్, మోస్ట్ ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/బెస్ట్ టూరిజం వెబ్‌సైట్‌గా యో వైజాగ్‌కు అవార్డులు లభించాయి. అతిథ్య రంగానికి మహర్దశ విశాఖలో పరిపాలన ప్రారంభమైతే అతిథ్య రంగానికి మహర్దశ పడుతుంది. ప్రముఖుల రాకతో హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్ల వ్యాపారం బాగుంటుంది. తద్వారా అనేక సంస్థలు విశాఖలో హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి రూ.కోట్ల పెట్టుబడులతో ముందుకొస్తాయి. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటక, ఆతిథ్య రంగం అభివృద్ధి చెందితే దాని ప్రభావంతో అన్ని రంగాలు కూడా పుంజుకుంటాయి. – పవన్ కార్తీక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా.. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే విశాఖలో అతిథ్య రంగం పుంజుకుంది. ఒబెరాయ్, మేఫెయిర్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో 7 స్టార్ లగ్జరీ హోటళ్లు నిర్మాణానికి ముందుకొచ్చాయి. వీటితో పాటు మెడికల్, స్పిరిచ్యుటవల్ టూరిజంపై కూడా దృష్టి పెడుతున్నాం. విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే తద్వారా పెట్టుబడులు, దాంతో ఉద్యోగావకాశాలు విపరీతంగా పెరుగుతాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఆ దిశగా పర్యాటక శాఖ అడుగులు వేస్తోంది. – శ్రీనివాస్ పాని, రీజినల్ డైరెక్టర్, పర్యాటక శాఖ -
Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.!
బనశంకరి: కన్నడనాట సుందరమైన పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. కొంచెం ఓపిక చేసుకుని వెళితే జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన పర్యాటక యాత్రలు చేయవచ్చు. ఇదే కోవలోకి వస్తుందని హాసన్ జిల్లాలోని సకలేశపుర హిల్‌స్టేషన్. సకలేశపుర బెంగళూరు నుంచి 220 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది పశ్చిమకనుమల్లో కలిసిపోయిన ఒక చిన్న పర్వత ప్రాంతం. టూరిస్టులకు ఎంతో డిమాండ్ ఉన్న విహార స్థలంగా మారింది. ఈ ప్రాంత ఇటు బెంగళూరు అటు మైసూరుకు సమీపంలో ఉండటం వల్ల వారాంతాల్లో టూర్ కు చాలా అనువైన ప్రదేశం. సకలేశపుర పట్టణం సముద్రమట్టానికి 949 మీటర్లు ఎత్తున ఉండి బెంగళూరు, మైసూరు నుంచి తేలికగా ప్రయాణించేలా ఉంటుంది. పర్యాటకులకు ట్రెక్కింగ్‌కు తగినట్లుగా ఉంటుంది. పర్యాటకులు బిస్లే అభయారణ్యంలో యువత, దేశ విదేశాల నుంచి వచ్చే యువ పర్యాటకులు ట్రెక్కింగ్ చేసి ఆనందిస్తారు. ఆ అందాలకు అంతే లేదు సకలేశపుర సమీపంలో అద్భుతమైన ఆకుపచ్చదనం కప్పుకున్న ఎత్తైన కొండలు, కాఫీ తోటలు పరుచుకున్న లోయలతో పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే సన్నటి ఘాట్‌రోడ్‌పై మలుపులు తిరిగే ప్రయాణం మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది. దట్టమైన అడవులు, ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపించే ఎత్తైన వృక్షసంపద ఆహా అనిపిస్తాయి. జలపాతాల హోరు కొండల్ని చీల్చుకుంటూ రైలుపట్టాల ఏర్పాటుకోసం తవ్విన గుహలు, పాయల గుండా హోరెత్తుతుంటాయి. అప్పుడప్పుడూ శబ్దం చేస్తూ దూసుకొచ్చే రైళ్లు పర్యాటకులను పలకరిస్తాయి. Green Route is a railway segment along the Bengaluru - Mangaluru railway line from Sakaleshpura to Kukke Subramanya. It is 52 km long, with 57 tunnels and 109 bridges, and is also a Trekkers Paradise.♥️ 📸Credit: Insta: Rajography 🙏#VisitUdupipic.twitter.com/uqyFpHsVLd — Visit Udupi (@VisitUdupi) April 20, 2022 ఆ పేరెలా వచ్చిందంటే హాసన్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గల సకలేశపుర ఊరు చిన్నదే. కాఫీ, యాలకులు, మిరియాల తోటలతో పాటు అక్కడక్కడ టీ తోటలతో సంపన్న ప్రాంతంగా కనిపిస్తుంది. పర్వతారోహకులకు స్వర్గం వంటిది సకలేశపుర. ఒకప్పుడు మైసూరు రాజుల పాలనలో ఉండేది వీరికి ముందు హొయసళులు, చాళు క్యులు పరిపాలించారు. హొయసళుల కాలంలో ఈ ప్రాంతానికి సకలేశపుర అనే పేరువచ్చింది. హొయసళులు అక్కడకు వచ్చినప్పుడు ఒక శివలింగం విరిగిపడి ఉండటం గమనించారని, అంతా ఈశ్వర మహిమ అని పేరు వచ్చేలా సకలేశ్పుర అని పేరు పెట్టారని స్థానికులు చెబుతారు. కానీ మరికొందరు పట్టణనివాసులు వ్యవసాయం వల్ల ధనికులు కావడంతో ఈ పేరు పెట్టారని కూడా చెబుతారు. సదాశివాలయం నాగారం శైలిలో ఉండే గోపురంతో సదాశివాలయాన్ని ఏకకూట నిర్మాణశైలిలో నిర్మించారు. ఈ పుణ్యక్షేత్రంలోని గర్భగుడిలో పెద్ద శివలింగం ఉంది. రాతి గవాక్షాలతో కూడుకున్న ఒక పెద్ద గుడిలో అందంగా చెక్కిన నందివిగ్రహం ఉంచారు. అక్కడికి చేరుకోగానే అమ్మవారి గుడి వద్ద శివాలయం బయట రెండు వినాయకుడి విగ్రహాలు ఉండటం గమనించవచ్చు. Workers at a construction site in Sakaleshpura of Karnataka found this idol of Sri Vasudev. Idol was secured after few minor damages. pic.twitter.com/px36IHjjuu — Chiru Bhat | ಚಿರು ಭಟ್ (@mechirubhat) March 25, 2021 పర్వతాల శ్రేణులు సకలేశపుర ప్రవేశంలోనే కాఫీ, టీ తోటల పరిమళాలు పర్యాటకులను స్వాగతం పలుకుతాయి. ఇక్కడ బిస్లే రిజర్వు ఫారెస్ట్, పుష్పగరి వైల్డ్ లైఫ్ సాంచురీ చూడవచ్చు. అందమైన పడమటి కనుమల శ్రేణి మైమరిపిస్తుంది. కుమారపర్వతం, పుష్పగిరి, దొడ్డబెట్ట, పట్టబెట్ట పర్వతాలను ఎంతసేపు చూసినా తనివి తీరదు. సాహసక్రీడలను ఆస్వాదించేవారు కుమార పర్వతం అధిరోహణానికి వెళ్లవచ్చు. Manjarabad Fort is a 8-sided, star-shaped fort built by ‘Tiger of Mysore’ Tipu Sultan in 1792 w/ help of French architects Manjarabad— translated as ‘beautiful scene’— is a picturesque site in Sakaleshpura, Hassan (Western Ghats) Appaji, Megha, & I had an adventure to remember pic.twitter.com/HrnTNr4YDW — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) January 2, 2022 మంజూరాబాద్ కోట దగ్గరలో మంజురాబాద్ కోట ప్రధాన ఆకర్షణ. 1790లలో దీనిని టిప్పుసుల్తాన్ నిర్మించారు. ఆకాశం నుంచి చూస్తే ఇది నక్షత్ర ఆకారంలో కనిపిస్తుంది. టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత కచ్చితత్వంతో నిర్మించడం అబ్బురమే. కోటలోకి వెళ్తే రహస్య సొరంగాలు అబ్బురపరుస్తాయి. అప్పట్లో ఇక్కడ టిప్పు సైన్యం ఉండేది. మధురం రైలు ప్రయాణం సకలేశపుర నుంచి 59 కిలోమీటర్ల దూరంలో కుక్కె వరకు రైలు మార్గంలో సాహసయాత్ర మధురానుభూతి లభిస్తుంది. బెంగళూరు నుంచి సకలేశపుర –సకలేశపుర నుంచి కుక్కేకు రైలులో పరుగులు తీస్తుంటే పులకించే సంఘటనలు ఎదురవుతాయి. చిక్కని అడవి మధ్యలో పెద్దపెద్ద చీకటి సొరంగాల మధ్య నుంచి రైలు వెళ్తుంది. ఆ సమయంలో ప్రయాణికులు పిల్లా పెద్ద భేదం మరచి కేరింతలతో సందడి చేస్తారు. Railways introduces Vista-dome coaches on Bengaluru - Mangalore train route. Most beautiful journey. Sakaleshpura to Subramanya ghat is breathtaking! Don’t miss the train during Monsoon! #Karnataka pic.twitter.com/uyYRNiOboX — DP SATISH (@dp_satish) July 11, 2021 ఎలా వెళ్లాలి సకలేశపుర మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉంది. మంగళూరు, బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, టూరిజం విభాగం వాహనాలు వెళ్తాయి. రైలు సౌకర్యం కూడా ఉంది. -
చంటి బిడ్డతో ప్రయాణమా? మీకోసమే 'ట్రావెల్ విత్ కిడ్స్'
ప్రయాణాల మీద బోలెడు ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక వయసు వచ్చాకగానీ ఇల్లు దాటని తల్లులు ఎందరో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, డెంటిస్ట్‌లు సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు యంగ్ మదర్స్ కోసం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ అనే ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రయాణాలలో తల్లీపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు... సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు పర్యాటక ప్రేమికులు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండేవారు కాదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం సాక్షి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు ‘చంటి బిడ్డతో ప్రయాణమా!!’ అని ఆశ్చర్యపోవడమే కాదు ప్రయాణాలు వద్దంటే వద్దన్నారు చాలామంది. ఒక బిడ్డకు తల్లి అయిన నికితకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా చెన్నైకి చెందిన సాక్షి తన మూడు నెలల బిడ్డతో కలిసి మహాబలిపురానికి వెళ్లింది. చాలా కాలం తరువాత పర్యాటక ప్రదేశానికి వచ్చింది. మరోవైపు బెంగళూరుకు చెందిన నికిత మూడు నెలల పిల్లాడితో కలిసి మైసూర్‌కు వెళ్లింది. ‘బేబీతో ప్రయాణం కష్టమని చాలామంది భయపెట్టారు. ఇది నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కష్టం’ అంటుంది సాక్షి. చెన్నైలో ఉండే సాక్షి, బెంగళూరులో ఉండే నికితలు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకే రకమైన వృత్తి, అభిరుచులు వారిని సన్నిహిత స్నేహితులుగా మార్చాయి. సినిమాల నుంచి పర్యాటకం వరకు ఇద్దరు స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు వారి మధ్య చంటిబిడ్డలు ఉన్న తల్లుల ప్రస్తావన వచ్చింది. మహిళల కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. సోలో ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్లు... మొదలైన వారి కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. కాని మదర్స్ అండ్ కిడ్స్ కోసం మాత్రం లేవు. ఈ లోటును భర్తి చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ పేరుతో ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. తొలి ‘మదర్ అండ్ కిడ్స్’ ట్రిప్‌ను పాండిచ్చేరికి ప్లాన్ చేశారు. సాక్షికి పాండిచ్చేరి కొట్టిన పిండి. పాండిచ్చేరి ట్రిప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మంచి స్పందన లభించింది. ఈ ట్రిపుల్ ఆరుగురు తల్లులు వారి పిల్లలను తీసుకువెళ్లారు. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు సంబంధించి అయిదు ట్రిప్‌లు ప్లాన్ చేశారు. తమ వృత్తిలో బిజీగా ఉండే సాక్షి, నికితలు వీకెండ్స్‌లో ప్లానింగ్ చేస్తుంటారు. ‘చంటి బిడ్డలు ఉన్నారని ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. బయటి ప్రపంచలోకి వస్తే కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి’ అంటున్నారు సాక్షి, నికిత. ‘పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త అనుభూతిని సొంతం చేసుకునేలా చంటి బిడ్డల తల్లులను ప్రేరేపించడం ఒక లక్ష్యం అయితే, ప్రయాణాలలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన లక్ష్యం’ అంటుంది నికిత. ఈ ట్రావెల్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు సాక్షి, నికితలలో ఒకరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి వస్తారు. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ‘ట్రిప్ బుక్ చేసుకున్న వారి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీనిద్వారా తల్లుల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఇష్టయిష్టాలు, తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది’ అంటుంది సాక్షి. చెన్నై. బెంగళూరు, ముంబై, జైపుర్, కోచి, కోల్‌కతా... ఇలా ఎన్నో నగరాల నుంచి తల్లులు ఈ ట్రిప్‌లలో భాగం అవుతున్నారు. తన పిల్లాడితో కలిసి పాండిచ్చేరికి వెళ్లిన దీపిక ఇలా అంటుంది... ‘ట్రిప్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తిండి సహించేది కాదు. ఈ ప్రయాణంలో మాత్రం ఇంటి తిండిని మరిపించేలా చేశారు. ఈ ట్రిప్ ద్వారా ఎంతోమంది స్నేహితులయ్యారు’ ట్రిప్‌ల ద్వారా పరిచయం అయిన వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి కలుసుకోవడం, ఆ కుటుంబంలో వ్యక్తిలా మారడం మరో విషయం. ‘కిడ్–ఫ్రెండ్లీగా లేవని కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంటాం. అయితే పిల్లలు మొరాకో నుంచి ఈజిప్ట్ వరకు ఎక్కడైనా సరే తమ ఆనందాన్ని తామే వెదుక్కుంటారు. పిల్లలు పార్క్‌లు, జూలలలో మాత్రమే ఆనందిస్తారనేది సరికాదు’ అంటుంది సాక్షి. సింగిల్ మదర్స్ ఈ ట్రిప్స్‌పై ఆసక్తి ప్రదర్శించడం మరో కోణం. స్థూలంగా చెప్పాలంటే ‘ట్రావెల్ విత్ కిడ్స్’ తల్లుల పర్యాటక సంతోషానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకే రకంగా ఆలోచించే వారిని ఒక దగ్గరికి తీసుకువచ్చింది. కొత్త స్నేహితుల రూపంలో కొత్త బలాన్ని కానుకగా ఇస్తోంది. -
పర్యాటకులతో సందడిగా ఉండే ఆ బీచ్..హఠాత్తుగా మూతపడింది!
పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఆ బీచ్ సడెన్‌గా మూతపడింది. పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ఆ బీచ్ నిశబ్ధంలోకి వెళ్లిపోయింది. కారణం వింటే నిజంగా షాకవ్వుతారు. ఎప్పుడూ మళ్లీ ఇదివరుకటి రోజుల్లా ఆ బీచ్ ఉంటుందా అని చాలామంది పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. అసలు ఎందుకు ఆ బీచ్ క్లోజ్ అయ్యింది? మంచి ఆదాయాన్ని ఇచ్చేదే పర్యాటక రంగం. అందులోనూ పర్యాటకానికి పేరుగాంచిన బీచ్‌లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అలాంటి బీచ్ ఎందుకు అలా మూగబోయింది. దాగున్న రహస్యం ఏంటంటే.. థాయ్‌లాండ్‌లోని కో ఫై ఫై లేహ్ ద్వీపంలో కొండల మధ్య ఉన్న "మాయా బే బీచ్" మంచి పర్యాటక స్పాట్‌గా పేరు. పగడపు దీవులకు ప్రసిద్ధిగాంచింది. ఈ మాయా బే పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తుందంటే చుట్టూ ఉన్న దట్టమైన మొక్కలు, నీలిరంగులో స్పష్టంగా కనిపించే నీళ్లు, బంగారు ఇసుక చూస్తే.. భూతల స్వర్గంలా ఉంటుంది. ఎప్పుడూ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. అయితే ధాయ్ అధికారులు ఒక రోజు సడెన్‌గా మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏదో కొన్ని రోజులు అన్నుకున్నారు అక్కడున్న నగరవాసులు కానీ నిరవధికంగా ఏళ్ల పాటు మూతపడిపోయింది. రూ. 100 కోట్లకు పైగా ఆదాయం నిజానికి ధాయ్ అధికారులు ఈ బీచ్‌ని మూసేయడానికి ఇష్టపడలేదు. కానీ పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లుసంబంధిత ఆధారాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అధికారులకి. థాయ్‌లాండ్‌కి పర్యాటకంగా ఈ బీచ్ నుంచే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడకు పర్యాటకులు కారణంగా వేలాది బోట్లు వచ్చేవి. దీంతో కాలుష్యం ఏర్పడిందని, బీచ్ అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. పర్యాటకుల తాకిడి కారణంగా అక్కడ ఉండే పగడపు దిబ్బలకు నష్టం వాటిల్లింది. పెద్ద సంఖ్యలో పగడపు దిబ్బలు మాయం అయినట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో థాయిలాండ్ జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు,మొక్కల సంరక్షణ విభాగం అధికారులు బీచ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు మూత వేయబడుతుందని ప్రకటించారు. మొదట నాలుగు నెలలు అన్నారు అలా ఏకంగా నాలుగేళ్లు మూతపడిపోయింది. మళ్లీ ఇటీవలే గత మే నెల నుంచి రీ ఓపెన్ అయ్యింది. ఏదీ ఏమైనా..మంచి ఆదాయ మార్గమని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం మంచిదే కానీ దాంతో పర్యావరణ స్ప్రుహ ఉండటం అత్యంత ముఖ్యం అని చాటి చెప్పారు ఈ థాయ్ అధికారులు. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
పగలు పూజారి.. రాత్రిళ్లు బైక్ రేసర్!
ఒకేసారి రెండూ విభిన్న రంగాల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదేమో. కొందరూ మాత్రం వాటిని అలవోకగా సాధిస్తారు. వారు ఉన్న రంగానికి ఎంచుకున్న రంగానికి చాలా తేడా ఉంటుంది. చూసే వాళ్లు సైతం ఇది నిజమా అని ఆశ్చర్యపోయాలా సమర్థవంతంగా దూసుకుపోతారు. అభిరుచిని వదులోకోవాల్సి అవసరం లేదు మనం ఎందులో ఉన్న మన కలను నిజం చేసుకోవచ్చు అని తెలియజెప్పుతారు కొందరూ వ్యక్తులు. ఆ కోవకే చెందుతారు కేరళకు చెందిన ఓ పూజారి. వివరాల్లోకెళ్తే..కేరళలో కొట్టాయం జిల్లాకు చెందిన ఉన్ని కృష్ణన్ పగలు ఆలయంలో పూజరిగా విధులు నిర్వర్తిస్తుంటాడు. అతను ఓ సాధారణ పూజరి మాత్రమే కాదు. అతనిలో ఓ రైసర్ కూడా దాగున్నాడు. రాత్రిళ్లు ఎక్స్‌పల్స్ 200 మోటార్ బైక్‌పై రయ్ మంటూ దూసుకుపోతుంటాడు. అతను గ్లోవ్స్, బూట్లు, హెల్మెట్ ధరించి ఓ రైసర్లా దూసకుపోతుంటాడు. అతని గురించి తెలుసుకున్న స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. ఉన్నికృష్ణన్న్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యావంతుడు. Temple priest at dawn, dirtbike racer by dusk.Meet Unnikrishnan (34), melshanti of Pudhukkulamgara Devi temple in Kottayam, Kerala, an avid motorcross rider who recently raced in INRC 2023 in Coimbatore. A former IT engineer, this priest-racer is training for a race in Bengaluru pic.twitter.com/9c3TJ2WtKl— Petlee Peter (@petleepeter) August 14, 2023 2013 వరకు ఐటీ రంగంలో పనిచేశాడు కూడా. ఐతే అతడి మనసు ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే వెళ్తుండటతో ఇక ఈ రంగంలోకి వచ్చేశాడు. అదీగాక 2019లో పూజారి అయిన తన తండ్రి గతించడంతో ఉన్నికృష్ణన్ తన కుటుంబ సంప్రదాయ వృత్తిని తాను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 2021లో అధికారికంగా పుదుక్కులంగర దేవి ఆలయంలో పూజారిగా బాధ్యతలు తీసుకున్నాడు. 2023లో మోటార్ సైక్లింగ్‌లో లైసెన్స్ పొందడమే గాక కోయంబత్తూరులో జరిగిన ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రేసర్‌గా తన సత్తా ఏంటో చూపించాడు. నిజంగా ఉన్ని కృష్ణన్ చూస్తే..అభిరుచికి లిమిట్స్ ఉండవు. మనిషిలో తగినంత సామర్థ్యం, ప్రతిభ ఉంటే ఏ ఫీల్డ్‌లో ఉన్నా గెలుపు తీరాన్ని అందుకోగలడని అవగతమవుతోంది కదూ. (చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..) -
విధ్వంసంతో ఆస్తులే కాదు, ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి
వాతావరణంలో గత కొన్నాళ్లుగా వచ్చిన మార్పుల వల్ల, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాంటివి సాధారణం అయిపోయాయి. విస్తారంగా.. అంటే అనేక చోట్ల కురవాల్సిన వర్షం ఒకే చోట కురిస్తే ?అదీ.. కేవలం కొద్దిసేపట్లో, నాలుగైదు రోజుల్లోనే ఏడాదంతా పడాల్సిన వర్షమంతా పడితే? వాగులు, వంకలు నిండిపోతాయి. కొండచరియలు విరిగిపడతాయి. నదులు పొంగి పొర్లుతాయి. గత నెల రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వర్షాలు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దీని వల్ల వేల కోట్ల ఆస్తుల నష్టంతో పాటు వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ► జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో విహారయాత్రలు, తీర్థయాత్రలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పోవద్దు. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు చేయాలనుకునేవారు వర్షాకాలానికి ముందే ప్లాన్ చేసుకోండి. ► పొంగి ప్రవహిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్ట్లు మొదలైన వాటిపై పయనించొద్దు. ప్రవహించే నీటి గతిశక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీరు వాహనంలోకి ప్రవేశిస్తే దాని బరువు పెరిగి, మునిగిపోతుంది. ► అనేక రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలు, డ్యాంల నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. ఇప్పటికే అనేకం శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ తట్టు ప్రాంతాల్లో ఉన్నవారు క్షేమంగా ఉండాలంటే, చెరువు కట్టలు, బ్యాములు సరిగా నిర్వహించేలా ప్రజాప్రతినిశులపై ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే.. అథిదులు ఇంటికొచ్చాక పంట పండించలేము కదా, అలాగే వర్షకాలంలో మేలుకుంటే సరిపోదు, డ్యాములు, బ్రిడ్జిలు లాంటి నిర్వహణ ఏడాది పొడవునా జరగాలి. ► ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో వీటి స్థితిపై స్ర్టక్చరల్ ఆడిటింగ్ జరగాలి. అవి ధృడంగా ఉన్నాయని ఇంజనీర్లు సర్టిఫై చేయాలి. లేకపోతే వానాకాలంలో నిద్రలోనే జలసమాధి అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది ► నదుల్లోకి దిగొద్దు. మీరు దిగినప్పుడు నీరు తక్కువ ఉండొచ్చు. కానీ ఎగువ ప్రాంతంలో డ్యాం తెరవడం, భారీ వర్షం లాంటి కారణాల వల్ల క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగి ఉపద్రవం సంభవించవచ్చు. ► కొండమార్గాల్లో అంటే, ఘాట్రూట్లలో వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు. భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయి. ఒక పెద్ద బండరాయి క్షణాల్లో కిందకు వచ్చి అక్కడ పయనిస్తున్న వాహనాన్ని లోపలికి తీసుకొని వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ►ఎక్కడో కొండప్రాంతాల్లో కాదు.మహానగరాల్లో జలప్రళయం సాధారణం అయిపోయింది. చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకోవద్దు . స్మార్ట్ ఫోనుల్లో కంపాస్ అనేది ఉంటుంది . అందులో చెక్ చేసుకొంటే మీరున్న ప్రాంతం ఎత్తు ఎంతో , ఇట్టే తెలిసిపోతుంది . ► రాబోయే రోజుల్లో జలప్రళయాలు సాధారణం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవి నివాస యోగ్యం కావని ముందే హెచ్చరికలు జారీ చెయ్యాలి. ఇంట్లోకి నీళ్లు ప్రవేశిస్తే ఇంట్లోని సామాగ్రి మొత్తం పాడై వేలల్లో నష్టం జరుగుతుంది. పాములు, తేళ్లు, మొసళ్లు వంటివి ఇంట్లోకి వస్తే ప్రాణానికే ప్రమాదం. ► చెట్లు నాటడం, వన సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థలు, బ్రిడ్జిలు ఇతరత్రా మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాలు బాధ్యత . వాటిని ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదలకుండా ఏటా ఇంత అని టార్గెట్ పెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం తప్పని సరి చేస్తూ పార్లమెంట్ చట్టం తేవాలి . లక్ష్యాన్ని అందుకొని ప్రభుత్వాల పై రాజ్యాంగ పరమయిన చర్యలు ఉండాలి . ► అహ నా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ " నా కేంటి .. నా కేంటి " అంటుంటుంది . మనం పడవ లో పయనిస్తున్నాము . దానికి చిల్లు పడితే అందరం పోతాము . మనం బతకాలంటే మంది కూడా బతకాలి అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. ఆలా కాకపోతే ఒక వర్షాకాలం రాత్రికి రాత్రే ఒక భారీ డ్యాం పగిలి ఒక పెద్ద నగరం, అనేక గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త -
ఆహ్లాదం.. ఆధ్యాత్మికం.. ఉడుపి
బనశంకరి: కన్నడనాట అందమైన తీరప్రాంతం ఉడుపి. ఇక్కడ పురాతన దేవాలయాలనుంచి అందమైన బీచ్‌లు, దట్టమైన అడవులు, ప్రకృతి సోయగాల వరకు అన్నీ చూడదగ్గ ప్రదేశాలే. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ప్రాంతం ప్రధాన టూరిస్ట్ స్పాట్‌గా మారుతుంది. వర్షాకాలంలో కూడా చూడడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఉడుపి నగరం మంగళూరుకు 55 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు పశ్చిమ దిక్కున 422 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఇది ఉడుపి జిల్లా కేంద్రమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.అలాగే ప్రధాన పర్యాటక స్థలం ఈ నేపథ్యంలో ఉడుపి జిల్లా కర్ణాటకలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. సముద్ర రుచులు, సంప్రదాయ శాకాహార వంటకాలకు ఈ జిల్లా ప్రసిద్ధి. సువర్ణ నది– అరేబియా సముద్రం ఆనుకుని ఉండే కోడి బీచ్ ఇది సముద్రంలో సెయింట్ మేరీస్ ఐలాండ్స్ ఉడుపిలో మల్పె బీచ్ నుంచి కొన్ని కిలోమీటర్లు అరేబియా సముద్రంలో వెళితే సెయింట్ మెరీస్ దీవులను చేరవచ్చు. ఇది కూడా ప్రత్యేకమైన పర్యాటక స్థలం. మొత్తం నాలుగు ద్వీపాల సమూహాన్ని కోకోనట్ ఐలాండ్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఉండే బసాల్ట్ రాళ్లు ఎవరో పేర్చినట్లుగా చక్కగా అమరి ఉంటాయి. ఇటువంటి రాళ్లు భారతదేశంలో మరెక్కడా లేవు. పెద్ద పెద్ద అలలతో కూడిన సముద్రంలో చిన్న చిన్న పడవల్లో ఈ దీవికి చేరుకోవాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. ఇక మల్పే బీచ్ కూడా టూరిస్ట్‌స్పాట్. కోడి బీచ్.. సాగర సంగమం ఉడుపి నుంచి 36 కిలోమీటర్లు దూరంలో ఉండే కోడి బీచ్ కూడా ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే బీచ్‌కు తక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. దీంతో ఇక్కడ ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు. ఈ బీచ్‌కు మూడుదిక్కులా సముద్రమే ఉండటంతో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ సువర్ణా నది అరేబియా సముద్రంలో కలిసే సాగర సంగమం పాయింట్ కూడా ఉంది. సెయింట్ లారెన్స్ చర్చ్ సెయింట్ లారెన్స్ చర్చ్ ఉడుపి బస్టాండ్ నుంచి 18 కిలోమీటర్లు దూరంలోని అత్తూర్ చర్చ్ లేదా సెయింట్లారెన్స్ చర్చ్ కూడా సందర్శించాల్సిన ప్రాంతమే. ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ కావడం విశేషం.ఇక్కడ ఒక పాఠశాలతో పాటు అనాథాశ్రమం కూడా నిర్వహిస్తున్నారు. టిప్పు సుల్తాన్ కాలంలో ఇక్కడ ఒక కట్టడంలో క్రైస్తవులను బంధించారు. క్రైస్తవులు విడుదలైన తరువాత ఆ కట్టడాన్ని చర్చిగా నిర్మించుకొన్నారు. ఈ చర్చ్ మహిమ గల ప్రార్థనా మందిరంగా గుర్తింపు పొందింది. మల్పె బీచ్ నుంచి సముద్రంలోకి వెళ్తే కనిపించే సెయింట్ మేరీస్ ద్వీపం సుందర సముద్ర తీరాల విడిది శ్రీకృష్ణ ఆలయం.. 13 వ శాతాబ్దంలో నిర్మించిన శ్రీకృష్ణమఠం అని పిలిచే శ్రీకృష్ణుని ఆలయం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయాన్ని జగద్గురు శ్రీమద్వాచార్యులు స్థాపించారు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే నవగ్రహ కిండి అని పిలిచే 9 రంధ్రాలతో కూడిన కిటికీ నుంచి నల్లనయ్యను దర్శించుకోవాలి. ఈ ఆలయాన్ని తెల్లవారుజామునుంచి రాత్రి 9 గంటల వరకు దర్శించుకోవచ్చు. భక్త కనకదాసుకు శ్రీకృష్ణుడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా దర్శనమిచ్చాడని ప్రతీతి. మూకాంబికా అభయారణ్యం జిల్లాలోని కొల్లూరు సమీపంలో ఉండే మూకాంబికా అభయారణ్యం కూడా సందర్శించదగ్గ ప్రదేశం. పశ్చిమ కనుమలు ఉండే ఈ వన్యజీవి సంరక్షణ కేంద్రం జంతుప్రేమికులకు అమితంగా నచ్చుతుంది. మొత్తం పచ్చదనంతో నిండిన దట్టమైన అటవీప్రాంతంలో విహరించడం మంచి అనుభూతినిస్తుంది. అలాగే చుట్టుపక్కల మూకాంబికా దేవాలయం, అబ్బే వాటర్ ఫాల్స్, అరసినగుండి జలపాతం అలరిస్తాయి. తీరంలో మడ అడవుల్లో పడవల్లో విహారం కూడా చేయవచ్చు. -
కర్ణాటక వెళ్తే గెర్సొప్పా జలపాతం చూడాల్సిందే
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ జోగ్ (గెర్సొప్పా) జలాశయం ఎట్టకేలకు పరవళ్లు తొక్కుతోంది. నలభై రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో నదులు, వాగులు, వంకలు వట్టిపోయాయి. దీంతో రాష్ట్రంలో ప్రముఖ జలపాతాలు మూగనోము పట్టాయి. అయితే సుమారు వారంరోజులుగా రుతుపవన వర్షాలు ముమ్మరం కావడంతో నదులు, వాగులకు కొత్త జీవం వచ్చింది. దీంతో శరావతి నదికి ప్రవాహం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో జోగ్ వద్ద శరావతి ప్రవాహంతో జలపాతం నురగలు కక్కుతోంది. 253 మీటర్ల ఎత్తు నుంచి జలధారలు పడుతుంటే నీటి తుంపరలు రేగి సుందరమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. దేశంలోనే ఇది రెండవ ఎత్తైన వాటర్ ఫాల్స్‌గా పేరు గడించింది. One of the most beautiful Waterfalls in the World.Jog Falls, located in Shimoga district of Karnataka, India🇮🇳 pic.twitter.com/WtwEZzGNGW— Raghu (@IndiaTales7) September 14, 2022 పర్యాటకుల వరద జోగ్ సౌందర్యాన్ని చూడటానికి వేలాది పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జోగ్ పరిసరాలు కిక్కిరిశాయి. మొన్నటివరకు నీరు లేక బోసి పోయిన జోగ్ జలపాతం కొత్తందాలను చూసి సందర్శకులు మురిసిపోయారు. పైగా ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతూ, పొగమంచు కొమ్ముకోవడంతో ఆ ప్రాంతంగా ఆహ్లాదమయం అయ్యింది. ఎక్కడెక్కడి నుంచో కార్లు, బస్సులు, బైక్‌లపై సందర్శకులు వచ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. Jogh falls very less water.. pic.twitter.com/aNCYinrBhJ— prathap cta (@PrathapCta) September 2, 2017 Sound of Jog Falls. Meditative. River Sharavathi has been like this for millions of years. Water to #Bengaluru will completely kill this indescribable beauty. If no excess water, no waterfalls. #Shimoga #Karnataka #Monsoon2019 pic.twitter.com/nxNEYLSYVZ— DP SATISH (@dp_satish) July 21, 2019 -
ఈ పల్లెటూరును చూడటానికి విదేశాల నుంచి వస్తుంటారు.. ఏమిటంత స్పెషల్?
ఊళ్లలోని దృశ్యాలు సాధారణంగా అంత అందంగా ఉండవు. ఊరికి అవతల ఉండే పొలాలు, తోటలు కొంత అందంగా కనిపించినా, ఊళ్లలోని వీథుల్లోకి అడుగుపెడితే చెత్తచెదారాలు తారసపడతాయి. ఇరుకిరుకు ఇళ్లు కనిపిస్తాయి. మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఊళ్లలోని దృశ్యాలు అంత అందంగా ఉండవు. ఊళ్లలోని పరిస్థితులు అంత అద్భుతంగానూ ఉండవు. అయితే, అందాల తేరులాంటి ఊరు ఒకటి ఉంది. బహుశా అది ప్రపంచంలోనే అత్యంత అందమైన ఊరు. అలాగని అదేమీ అంత ఘనమైన గ్రామం కాదు, మారుమూలనున్న కుగ్రామం. ఆ ఊరును చూస్తే, ఊరు కాదు ఉద్యానవనం అనుకుంటారు ఎవరైనా! ఇంగ్లండ్‌లో ఉన్న ఆ ఊరి పేరు బర్టన్–ఆన్–ద–వాటర్. కొత్తగా వచ్చే పర్యాటకులు చూడటానికి థీమ్పార్కులా కనిపించే ఈ ఊళ్లోకి అడుగుపెడితే, డబ్బులు అడుగుతారేమోనని జంకుతారు గాని, ఈ ఊళ్లోకి ప్రవేశం ఉచితం. ఈ సంగతిని ఈ ఊరి అధికారిక వెబ్సైట్ స్పష్టంగా చెబుతుంది. దాదాపు నాలుగువేల జనాభా ఉండే ఈ ఊళ్లోని ఇళ్లన్నీ పాతకాలం పద్ధతిలో నిర్మించిన పెంకుటిళ్లే! ఇక్కడి దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయి. విండ్రష్ నది మధ్యలో ఉన్న ఈ గ్రామానికి చేరుకోవడానికి ఐదు వంతెనల మీదుగా దారులున్నాయి. రోడ్డు మార్గంలో లండన్ నుంచి ఇక్కడకు రెండుగంటల్లోగా చేరుకోవచ్చు. పరిశుభ్రమైన వీథులు, నది ఒడ్డున పచ్చిక బయళ్లు, చుట్టూ చెట్టూ చేమలతో నిండిన పరిసరాలతో బర్టన్–ఆన్–ద–వాటర్ భూతలస్వర్గాన్ని తలపిస్తుంది. ఇంగ్లండ్ వాసులతో పాటు, విదేశీ పర్యాటకులు కూడా ఈ ఊరిని చూడటానికి వస్తుంటారు. The charming village of Bourton-on-the-Water in Gloucestershire is known as the "Venice of the Cotswolds". Featured photo credit: Sussex-based photographer Daniel Beaumont pic.twitter.com/jDRiyzMCU5 — René Champion (@ReneChampion1) January 20, 2023 A Quiet Place Bourton-on-the-Water is a village and civil parish in Gloucestershire, England, that lies on a wide flat vale within the Cotswolds Area of Outstanding Natural Beauty. pic.twitter.com/NJLmFHJEP3 — Murphy (@cfmbetricky2) June 4, 2021 -
మూడు కొండలెక్కితేగానీ చేరుకోని ఆ ఆలయానికి..
హిందూ దేవుళ్లలో హనుమంతుని ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా హనుమంతుడిని భక్తిగా కొలుస్తారు. అలాంటి హనుమంతుని జన్మస్థలంగా భావించే నాసిక్‌లో అంజనేరి కొండల వద్ద ఉన్న ఆ స్వామి గుడిని సందర్శించడాని భక్తులు ఎన్నో ప్రయాసలు పడి వెళ్లాల్సి వస్తోంది. నిటారుగా ఉన్న ఆ రహదారి వెంబడి వెళ్లాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటలు పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయానికి త్వరితగతిన చేరుకునేలా రోప్‌వే నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో బ్రహ్మగిరి ట్రెక్కింగ్ పాయింట్ నుంచి అంజనేరి కొండల వరకు ఈ రోప్ వేని నిర్మించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏ1) పర్వరత్మల పథకం కింద ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టెండర్లను ఆహ్వానించింది. ఇక హనుమంతుని జన్మస్థలం అయిన అంజనేరి కొండలు వద్ద ఆ స్వామికి సంబంధించిన గుహ తోపాటు అంజనీమాత ఆలయం కూడా ఉంది. వీటిని యాత్రికులు, ట్రెక్కర్లు సందర్శిస్తారు. సుమారు 4 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు పర్వతాలు ఎక్కాలి. ఇక్కడకు 5.7 కి.మీ పొడవున్న రోప్‌వే మూడు పర్వతాల మీదుగా వస్తే పైకి వెళ్లే ప్రయాణం కొన్ని నిమిషాలకు తగ్గిపోతుంది. కాగా, 2024 నాటికి మొత్తం 18 రోప్‌వే ప్రాజెక్టులను కేంద్ర ప్లాన్ చేస్తునట్లు సమాచారం. (చదవండి: కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు సమాధానం ఇచ్చిన శాస్త్రవేత్తలు) -
భూగర్భ హోటల్..అక్కడికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!
ఇంతవరకు ఎన్నో లగ్జరీ హోటళ్ల గురించి విని ఉంటాం. ఆకాశంలోనూ, సముద్రం అడుగున ఉండే అత్యంత ఖరీదైన హోటళ్లను చూశాం. కానీ భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో హోటల్.. అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఐతే అక్కడకి వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఒకరకంగా సాహసంతో కూడిన పని. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే.. యూకేలో నార్త్ వేల్స్లో ఎరారీ నేషనల్ పార్క్‌లోని స్నోడోనియా పర్వతాల కింద ఉంది. భూగర్భంలో ఏకంగా 1,375 అడుగుల దిగువున ఉంది. అందుకే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతుగా ఉండే హోటల్‌గా గుర్తింపు పొందింది. దీని పేరు 'డీప్ స్లీప్ హోటల్'. ఈ హోటల్‌కు వెళ్లడమే ఓ అడ్వెంచర్. ఎరారీ నేషనల్ పార్క్‌లో పర్వతాల కింద ఉండే ఈ హోటల్లో క్యాబిన్లు, రూమ్‌ల సెటప్ అదిపోతుంది. ఈ హోటల్లోకి వచ్చేక అక్కడ ఉన్న ఆతిథ్యాన్ని చూసి.. అక్కడకి చేరుకోవడానికి పడ్డ పాట్లన్నింటిని మర్చిపోతారు. ఇందులో ట్విన్ బెడ్లతో కూడిన నాలుగు క్యాబిన్లు, డబుల్ బెడ్‌తో ప్రత్యేకు గుహలాంటి రూములు అతిధులను మత్రముగ్దుల్ని చేస్తాయి. ఇక్కడ ఏడాది ఏడాది పొడవునా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ..క్యాబిన్లకు థర్మల్ లైనింగ్ ఉండటంతో వెచ్చగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ అండర్ గ్రౌండ్ హోటల్లో బస చేసేందుకు వెచ్చగా ఉండే దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. ఆ హోటల్ కేవలం రాత్రి పూట బస చేయడానికి అతిథులను ఆహ్వానిస్తుంది. అదికూడా కేవలం శనివారం రాత్రి నుంచి ఉదయ వరకు మాత్రమే అక్కడ బస. ఈ హోటల్‌కి చేరుకోవడం అలాంటి ఇలాంటి ఫీట్ కాదు. ఓ సాహస యాత్ర. మొదటగా పర్యాటకులు పర్వతాల మీదకు కాలినడన శిఖరాన చేరకున్న తర్వాత హోటల్ నిర్వాహకులు భూగర్భంలోకి వెళ్లడానికి కావాల్సిన హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులకి సంబంధించి సంరక్షణ కిట్‌ని ఇస్తారు. వాటిని ధరించి గైడ్ సమక్షంలో బండ రాళ్ల వెంట ట్రెక్కింగ్ చేసుకుంటూ..మెట్ల బావులు, వంతెనలు దాటుకుంటూ కఠిన దారుల వెంట ప్రయాణించాలి. అలా ప్రయాణించక పెద్ద ఐరన్ డోర్ వస్తుంది. కానీ ఇక్కడకు పిల్లలకు మాత్రం 14 ఏళ్లు దాటితేనే అనుమతిస్తారు. ఇక ప్రైవేట్ క్యాబిన్లో ఇద్దరికి బస రూ. 36 వేలు కాగా , గుహ లాంటి గదికి గానూ రూ. 56 వేలు వెచ్చించాల్సి ఉంది. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకులు మాత్రం ఇంత పెద్ద సాహసయాత్ర చేసి ఆ హోటల్లో బస చేయడం ఓ గొప్ప అనుభూతి అంటున్నారు. అంతేగాదు తమ జీవితంలో మంచి నిద్రను పొందామని ఆనందంగా చెబుతున్నారు పర్యాటకులు. (చదవండి: ఈ టూర్ యాప్ మహిళల కోసమే.. ఇందులో ప్రత్యేకతలు ఏంటో చూసేయండి) -
ఈ యాప్ మహిళల కోసమే.. వాళ్లే ఆపరేటర్లు, గైడ్లు కూడా!
ఇంతవరకు ఎన్నో యాప్‌లు చూశాం. కానీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఉండే యాప్‌లు గురించి వినలేదు కదా. మహిళలు మాత్రమే ధైర్యంగా తమకి నచ్చిన ప్రాంతాలకు వెళ్లి గడిపేలా భద్రతతో కూడిన యాప్‌లు ఇంతవరకు రాలేదు. టూరీజంలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారు తమ స్నేహితులతో పూర్తి భద్రతతో వెళ్లేలా సరికొత్త యాప్‌ని రంగంలోకి తీసుకువచ్చింది ఓ రాష్ట్రం. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో వారికి టూరిస్టు గైడ్‌గా మహిళలే ఉంటారు. ఇదంతా ఎక్కడ? ఆ యాప్ ఎక్కడ అందుబాటులో ఉంటుందంటే.. వివరాల్లోకెళ్తే..ఒంటరిగా ఉండే మహిళలు లేదా కేవలం మహిళలు తమ స్నేహితులతో టూర్‌కి వెళ్లాలనుకున్నా.. ఏ మాత్రం భయపడకుండా భద్రంగా వెళ్లేందుకు ఓ సరికొత్త యాప్‌ని తీసుకొచ్చింది కేరళ రాష్ట్రం. ఈ మేరకు కేరళ రాష్ట్రం సందర్శన కోసం మహిళా స్నేహపూర్వక టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వారికి టూరిస్ట్ ఆపరేటర్లు, గైడ్లుగా మహిళలే ఉండేలా తగిన సౌకర్యాలతో కూడిన మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది కేరళ. అందులో భాగంగానే ఫ్రెండ్లీ టూరిజం విమెన్ ప్రాజెక్టును నోడల్ ఏజెన్సీ అయిన స్టేట్ రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ చేపట్టి.. అందుకోసం ఓ యాప్‌ను కూడా సిద్దం చేయమని కోరింది . ఈ యాప్‌లో సామాజిక సాంస్కతిక అంశాలతో సహా అన్ని స్థాన నిర్ధిష్ట సమాచారం, చిత్రాలు ఉంటాయి. అలాగే కేరళలోని వివిధ ప్రాంతాల విశేషాల గురించి ఆ యాప్‌లోనే ఉంటుంది. రాష్ట్రంలో మహిళా పర్యాటకులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వ విధాన ప్రాధాన్యత అని పర్యాటక శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలు సొంతంగా లేదా వ్యక్తిగతంగా గుంపులుగా దూర ప్రాంతాలకు వెళ్లడం ఓ ట్రెండ్‌గా మారిన ప్రంపంచంలో మనం జీవిస్తున్నాం అన్నారు. ఈ యాప్ సాయంతో మహిళలు హ్యాపీగా పర్యటించిలే గాకుండా వారికెలాంటి ఇబ్బంది తలెత్తదని మంత్రి రియాస్ ధీమగా చెప్పారు. సుమారు 1.5 లక్షల మంది మహిళలు.. ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి మహిళల జెండర్ ఇన్‌క్లూజివ్ టూరిజం కాన్సెప్ట్‌కు అనుగుణంగా గతేడాది అక్టోబర్‌లో రియాస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చొరవ తోపాటు పర్యాటక శాఖ అనేక రకాల మహిళా స్నేహపూర్వక పర్యాటక ఉత్పత్తులు, ప్యాకేజీలను విడుదల చేస్తోంది. సుమారు 1.5 లక్షల మంది మహిళలు పాల్గొనే లక్ష్యంతో యూఎన్ మహిళలతో సహా వివిధ సంస్థల మద్దతుతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యాటక రంగంలో సుమారు 10 వేల మంది మహిళా వెంచర్ల తోసహా దాదాపు 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. యాప్‌లో ఉన్న సౌలభ్యం.. ఈ యాప్‌లో మహిళలకు అనుకూలమైన పర్యాటక ఉత్పత్తులు, ప్యాకేజీలు, రిసార్ట్లు, హోటళ్లు, మహిళా సంస్థలు, గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్లు, మహిళా టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు హోమ్ స్టేలు, మహిళా టూర్ గైడ్ల తదితర అన్ని వివరాలు ఉంటాయి. అంతేగాదు ఈ యాప్‌లో మహిళల నేతృత్వంలోని హస్తకళలు, సావనీర్ ఉత్పత్తి, విక్రయ యూనిట్లు, విశ్రాంతి గదులు, క్యాంపింగ్ సైట్లు, లైసెన్స్ హౌస్బోట్లు, కారవాన్ పార్కులు, వివిధ ప్రదేశాలలో జాతి వంటకాల యూనిట్లు, పండుగలు, అనుభవపూర్వక సాహస ప్యాకేజీలు వంటి సౌకర్యాలు ఉంటాయి. యాప్‌లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేలా ఈ ఆర్టీ మిషన్ భారీగా కసరత్తు ప్రారంభించింది. ఆర్టీ మిషన్ చేపట్టిన ఫ్రెండ్లీ విమెన్ టూరిజం ప్రాజెక్టు కింద సుమారు 1800 మంది మహిళలు వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎన్నికైన మహిళలకి జూలై నుంచి క్షేత్ర స్థాయిలో శిక్షణ ఉంటుంది. (చదవండి: అటు అండమాన్.. ఇటు దుబాయ్... ఎక్కడికి వెళ్లడం సులభం? ఎంత ఖర్చవుతుందంటే..) -
అండమాన్ లేదా దుబాయ్.. ఎక్కడికి వెళ్లడం ఈజీ?
భారతదేశానికి చెందినవారు విదేశాలు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ముందుగా దుబాయ్ లేదా అండమాన్ వెళ్లాలని అనుకుంటారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే ముందుగా బడ్జెట్ గురించి ఆలోచించాల్సివస్తుంది. అటు అండమాన్ లేదా ఇటు దుబాయ్ వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడికైనా ప్రయాణమవుదామనుకుంటే ముందుగా బడ్జెట్ గురించి ఆలోచించాల్సివస్తుంది. అయితే అండమన్ చూసివద్దామనే ఆలోచనను ప్రస్తావించగానే.. చాలామంది అక్కడకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుతో చక్కగా దుబాయ్ వెళ్లివచ్చేయవచ్చని చెబుతారు. మరికొందరు మాత్రం దుబాయ్ వెళ్లడం చాలా చౌక అని కూడా అంటుంటారు. దీంతో ఈ మాటలు విన్నవారు కన్ఫ్యూజన్కు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము అండమాన్ వెళ్లాలో లేక దుబాయ్ వెళ్లాలో తెలియక తికమకపడతారు. ఈ ప్రశ్నలకు చెక్ పెడుతూ మీ సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. దుబాయ్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది? దుబయ్ లేదా అండమాన్‌కు సంబంధించిన టూర్ ప్యాకేజీకి ఎంతఖర్చవుతుందో బేరీజు వేసేందుకు మేక్ మైక్ ట్రిప్‌లో సమాచారం ఇలా ఉంది. దుబాయ్ వెళ్లేందుకు ఒక వ్యక్తికి సుమారు రూ. 31 వేలు అవుతుంది. ఈ ప్యాకేజీలో ఆరు రోజుల ప్లాన్ ఉంది. దీనిలో ప్రైవేట్ ట్రాన్స్ఫర్, మరినా యాచ్ టూర్ మొదలైనవి కలిసే ఉన్నాయి. 6 రోజుల అనంతరం ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చేందుకు వరకూ అయ్యే ఖర్చు దీనిలో కలిపే ఉంటుంది. హోటల్ అద్దె కూడా దీనిలో భాగమయ్యే ఉంటుంది. అయితే దుబాయ్ వెళ్లేందుకు ఫ్లయిట్ టిక్కెట్లు విడిగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.12 నుంచి 15 వేలు ఖర్చవుతాయి. అంటే రెండు వైపుల ఫ్లయిట్ ప్రయాణ ఖర్చులు చూసుకుంటే మొత్తంగా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకూ అవుతాయి. అంటే ప్యాకేజీ, ప్రయాణ ఖర్చులు కలుపుకుని చూసుకుంటే ఒక్కో వ్యక్తి దుబాయ్ వెళ్లి రావడానికి రూ. 60 వేలు అవుతుంది. అండమాన్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది? దుబాయ్ గురించిన సమాచారం తెలుసుకున్న తరువాత ఇప్పుడు అండమాన్ వెళ్లేందుకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకుందాం. రాబోయే ఆగస్టులో అండమాన్ వెళ్లాలనుకుంటే ఒక్కో వ్యక్తికి రూ. 42 వేలు ఖర్చవుతుంది. ఈ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, హెవ్లాక్, నీల్ ఐల్యాండ్ మొదలైనవి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు చొప్పున బస చేయవచ్చు. ఈ ట్రిప్ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది. దీనిలో ప్రైవేట్ ట్రాన్స్ఫర్, ఫెరీ మొదలైన ఛార్జీలు కలిపే ఉంటాయి. అయితే అండమాన్ వెళ్లేందుకు ఫ్లయిట్ ఛార్జీ విడిగా ఉంటుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు రూ. 30 వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే అండమమాన్ వెళ్లి వచ్చేందుకు రూ. 75 వేల వరకూ ఖర్చవుతుంది. ఈ ప్లాన్ కంపేరిజన్ను అనుసరించి చూస్తే.. అండమాన్ వెళ్లడం అనేది దుబాయ్ వెళ్లేందుకన్నా ఖర్చుతో కూడుకున్నదని తెలుస్తోంది. అయితే ఇది సీజన్‌తో పాటు ఎన్ని రోజులు అక్కడ ఉంటారు? అక్కడ ఉపయోగించుకునే లగ్జరీ సదుపాయాలు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. -
ఆటోకి మూడు చక్రాలే ఎందుకుంటాయంటే...
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఏదైనా వాహనం అవసరం అవుతుందనే సంగతి మనకు తెలిసిందే. కొంతమంది ఇందుకోసం తమ సొంతవాహనాన్ని వినియోగిస్తారు. చాలామంది ఈ విషయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే చాలా వాహనాలకు నాలుగు చక్రాలు ఉంటుండగా ఆటోకు మాత్రం మూడు చక్రాలే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆటోకు నాలుగు చక్రాలు ఎందుకు అమర్చలేదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? రండి... దీని వెనుకనున్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు చక్రాలతో కన్నా మూడు చక్రాలతో వాహనాన్ని రూపొందిస్తే ఖర్చు తగ్గుతుంది. అలాగే తక్కువ ఇంజినీరింగ్ వర్క్ సరిపోతుంది. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నదిగా రూపొందుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్ చేయడానికైనా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మూడు చక్రాల వాహనం వలన ఇంధన వినియోగం కూడా భారీగా అవదు. ఆటోను నడిపించేందుకు ఇంజనుకు తక్కువ శక్తి సరిపోతుంది. సాధారణంగా మూడు చక్రాల వాహనాన్ని ప్రయాణికులను తరలించేందుకు, లేదా సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. అటువంటప్పుడు వాహనాన్ని అన్నిరకాలదారులలో త్వరగా ముందుకు తీసుకువెళ్లవచ్చు. అయితే కొన్ని పరిస్థితులలో నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం అనువైనదికాదనిపిస్తుంది. మంచుతో కూడిన ప్రాంతాలలో లేదా కార్నరింగ్ ప్రదేశాలలో ఆటో డ్రైవ్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలాగే నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం తక్కువ సామర్థ్యం కలిగివుంటుంది. అలాగే తక్కువ సరుకును లేదా కొద్దిమంది ప్రయాణికులను మాత్రమే తరలించేందుకు అనువుగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే మూడు చక్రాల ఆటో వలన కొన్ని లాభాలు, మరికొన్ని నష్టాలు ఉన్నాయి.