హైదరాబాద్‌లో అడ్వెంచర్స్‌.. వీకెండ్‌లో చిల్‌ అవ్వండి

Best Adventure Activities In Hyderabad - Sakshi

హైదరాబాద్‌లో అంటేనే నోరూరించే కమ్మని వంటకాలు, అనేక పర్యాటక ప్రదేశాలకు ఫేమస్‌. వీకెండ్‌ వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చి రిలాక్స్‌ అవుతుంటారు. అడ్వెంచర్‌ యాక్టివిటిస్‌కి కూడా హైదరాబాద్‌ అడ్డాగా మారుతుంది.

ఒకప్పుడు పారాగ్లైడింగ్‌ అంటే గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ వేదికగా ఎన్నో అడ్వెంచర్‌ స్పాట్స్‌, అది కూడా తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. 

బంగీ జంపింగ్‌
లైఫ్‌లో ఒక్కసారైనా బంగీ జంపింగ్‌ను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొండలు, బ్రిడ్జి వంటి ఎత్తైన ప్రదేశాల నుంచి తాళ్లతో శరీరాన్ని కట్టుకొని కిందకు దూకండి చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బంగీజంపింగ్ చేయాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అడ్వెంచర్‌ యాక్టివిటి కోసం మన హైదరాబాద్‌లోనే చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. వాటిలో రామోజీ ఫిల్మ్‌ సిటీ,లియోనియా రిసార్ట్‌, డిస్ట్రిక్‌ గ్రావిటి పార్క్‌ వంటి ప్రాంతాల్లో అందుబాలో ఉంది. దీని ధర సుమారు రూ.3500 నుంచి 4500 వరకు ఉంటుంది. 12 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా బంగీ జంప్‌ చేయొచ్చు. దీనికోసం ముందుగానే బీపీ, హార్ట్‌రేట్‌ వంటివి చెక్‌ చేస్తారు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులకే బంగీ జంపింగ్‌ అనుమతిస్తారు. 

పారాగ్లైడింగ్‌
రెక్కలు కట్టుకొని ఆకాశలో ఎగురుతూ భూమిపై ఉన్న ప్రకృతి అందాలను చూడాలంటే పారాగ్లైడింగ్‌ బెస్ట్‌ ఛాయిస్‌.ఆకాశంలో పక్షలతో పోటీ పడి ఎగురుతూ భూమి పై అందాలను ఆస్వాదించవచ్చు. అయితే పారాగ్లైడింగ్ అన్ని చోట్ల వీలు పడదు. ఇందుకు కొంత ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులతో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి. హైదరాబాద్‌లో కొండపోచమ్మ రిజర్వాయర్‌ దగ్గర్లో అందుబాటులో ఉంది. ధర రూ.3500

జిప్‌లైన్‌
చాలా ప్రాంతాల్లో జిప్‌లైన్‌ కోసం 50 మీటర్ల నుంచి ఎత్తులో బ్యూటిఫుల్‌ నేచర్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేయొచ్చు. హైదరాబాద్‌లో శామీర్‌పేట్‌లోని డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్‌, ఎక్సోటికా బొటిక్‌ రిసార్ట్‌ వంటి ప్రాంతాల్లో జిప్‌లైన్‌ యాక్టివిటి అందుబాలో ఉంటుంది. ధర రూ. 700-1000 వరకు ఉంటుంది. వీకెండ్స్‌లో ధర మారుతుంది)

స్కై డైవింగ్‌
ఎత్తుగా ఉండే ప్రాంతాల నుంచి గాల్లోకి దూకే సాహసక్రీడను స్కై డైవింగ్‌ అంటారు. వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతూ చేసే స్కై డైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇండోర్‌లో కూడా పొందచ్చు. అది ఎక్కడంటే..గండిపేట సమీపంలో గ్రావిటీజిప్‌ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో ఈ ఇండోర్‌ స్కై డైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పొందిచ్చు. ఇందుకోసం ఇండోర్‌ స్కైడైవింగ్‌ కోసం 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేక సిలిండర్‌ రూపొందించారు. ధర సుమారు రూ. 3300 నుంచి 4300 వరకు ఉంటుంది. (వీకెండ్స్‌లో ధర మారుతుంటుంది)

ట్రెక్కింగ్‌
ట్రెక్కింగ్‌ కోసం సిటీలో చాలా ప్రాంతాలు ఉన్నా అనంతగిరి హిల్స్‌ బెస్ట్‌ లొకేషన్‌ అని చెప్పొచ్చు. వీకెండ్‌ వస్తే చాలు ఇక్కడికి ఫ్రెండ్స్‌తో ఎక్కువగా హైదరబాదీలో ట్రెక్కింగ్‌కు  వెళ్తుంటారు. ఇందుకోసం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. 

క్లౌడ్‌ డైనింగ్‌
సాధారణంగా రెస్టారెంట్‌లో ఎవరైనా భోజనం చేస్తారు. కానీ ఆకాశానికి, భూమికి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో భోజనం చేస్తే ఆ ఫీలింగే వరే. గాల్లోకి ఎగిరిపోయి అక్కడి నుంచి కిందకు చూస్తూ భోజనం చేస్తే ఆ థ్రిల్లింగ్‌ చెప్పక్కర్లేదు. ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ పొందాలంటే హైదరాబాద్‌లోని క్లౌడ్‌ డైనింగ్‌కు వెళ్లాల్సిందే. ఇది హైటెక్ సిటీ సమీపంలో ఉంటుంది. ఈ క్లౌడ్ డైనింగ్.. భూమికి 160 ఎత్తుల అడుగులో ఉంటుంది. దాదాపు అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ భోజనం చేయాలంటే.. రూ.5,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top