
గనుల్లో దిగుదాం... పర్యాటకం లోతులు చూద్దాం
యుద్ధభూమి చూద్దాం. కాలర్ ఎగరేద్దాం
పర్యాటకంలో కొత్తపుంతలు
నిన్న మొన్నటివరకు పర్యాటకం అంటే ఊటీ కొడైకెనాల్.. కాశ్మిర్.. కులూమనాలి వెళ్ళేవాళ్ళు.. మరికొందరు చారిత్రక ప్రాంతాలకు వెళ్లి రాచరిక నిర్మాణాలు అయిన కోటలు ... సరస్సులు చూసేందుకు రాజస్థాన్.. హంపి వంటి ప్రాంతాలకు వెళ్తారు.. మరికొందరు ఐతే నేచర్.. ప్రకృతిలో సేదదీరుతాం అంటూ వాగులు వంకలు జలపాతాలు చూసేందుకు వెళ్తుంటాయారు.. ఇంకొందరు మరింత కిక్కు కావాలబ్బా అంటూ సముద్రతీర ప్రాంతాలైన విశాఖ.. గోవా ..కేరళ వంటి చోట్లకు వెళ్తారు .. మరికొందరు సాహసకృత్యాలు చేసేందుకు పారా గ్లైడింగ్ .. స్పీడ్ బోట్ వంటివి చేస్తుంటారు.. ఇక టెంపుల్ టూరిజం ఎప్పట్నుంచో ఉన్నదే.. దేశంలోని ప్రఖ్యాత ఆలయాలు అన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. ఒక్కో రాష్ట్రం తన ప్రత్యేకతను నిలుపుకోవడానికి.. పర్యాటకులను ఆకట్టుకోవడానికి కొత్తకొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నాయి. తమిళనాడు టెంపుల్ టూరిజం అంటూ జనాన్ని ఆకర్షిస్తుండగా కేరళ ప్రకృతిని చూద్దాం రండి అంటోంది,. కాశ్మిర్ అయితే మంచుకొండలు చూపిస్తాం అని రారమ్మంటోంది.
గనుల్లో దిగుదాం... పర్యాటకం లోతులు చూద్దాం
మరి అలాంటి అవకాశం ... ప్రకృతి అందాలు లేని జార్ఖండ్ (Jharkhand) ఏం చేస్తుంది.. జనాలను .. పర్యాటకులను ఎలా ఆకర్షిస్తుంది.. అనుకుంటున్నారా వాళ్లకూ ఒక ఐడియా వచ్చింది.. జార్ఖండ్ అంటేనే గనులు.. పరిశ్రమలకు ఆలవాలం. ఇనుము.. మాంగనీస్ వంటి గనులన్నీ అక్కడే ఉన్నాయి. నేలను తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్లిపోయే టెక్నాలజీ... నైపుణ్యం అక్కడి ప్రజల సొంతం. అందుకే సరిగ్గా ఆ పాయింట్ మీదనే పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనీ జార్ఖండ్ ప్లాన్ వేసింది. రాష్ట్రంలోని కేంద్రప్రభుత్వ రంగసంస్థ అయినా సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ సంస్థతో జార్ఖండ్ టూరిజం శాఖ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ఆసక్తి ఉన్న పర్యాటకులను బొగ్గు.. ఇనప గనుల్లోకి..(mining tourism) తీసుకెళ్తుంది. మైనింగ్ కార్యకలాపాలను దగ్గరుండి చూపిస్తుంది. ఆనందపు లోతులను మనకు అనుభవేకం చేస్తుంది. మామూలుగా అయితే గనుల్లోకి మనలను పంపరు కానీ టూరిజం శాఖ అన్ని భద్రతా చర్యలు తీసుకుని ఇనుము.. బొగ్గుగనుల్లోకి తీసుకెళ్లి మనకు ఆ మొత్తం ప్రక్రియ చూపిస్తుంది .. ఆసక్తి ఉన్న పర్యాటకులు జార్ఖండ్ వెళ్లి గనుల్లో అలా తిరిగిరావచ్చు.

మరింత ఎత్తులో సిక్కిం టూరిజం ... యుద్ధభూమిపై రణనినాదం
అందరూ వెళ్ళేదారిలో వెళ్ళితే సక్సెస్ రాదన్న సూత్రాన్ని గుర్తెరిగిన సిక్కిం ఇప్పుడు ఏకంగా వార్ జోన్ లోకి తీసుకెళ్తోంది. గతంలో చైనా సైనికులతో మన భారత సైనికులు తలపడి వీరత్వాన్ని చూపిన డోక్లామ్ వద్దకు తీసుకెళ్తాం.. మన వీరుల సింహనాదాన్ని వినిపిస్తాం రండి అని సిక్కిం పిలుస్తోంది. హిమాలయాలను తాకే కొండ శిఖరాలవద్ద భారత చైనా సైనికులమధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. చైనీయులను మనవాళ్ళు తుక్కుతుక్కుకింద కొట్టి సరిహద్దుల ఆవలకు తరిమేసిన ప్రదేశమే ఈ డోక్లామ్ .. అక్కడికి తీసుకెళ్తాం అని సిక్కిం పిలుస్తోంది.'రణ భూమి దర్శన్' అంటూ దీనికి ప్రత్యేక ప్యాకేజి సైతం సిద్ధం చేసింది..
ఆ మధ్య కాశ్మిర్లోని పెహల్గామ్ వద్ద పాకిస్తాన్ దాడి చేసిన ప్రదేశము కూడా ఇప్పుడు పెద్ద పర్యాటక ప్రాంతం అయింది.
మరింకెందుకు ఆలస్యం ఆనాడు మన వీర సైనికులు పరాక్రమం చూపిన ప్రాంతాలు చూసేయండి.. విజయగర్వంతో తిరిగిరండి..
-సిమ్మాదిరప్పన్న