
మహిళా సాధికారత విషయంలో మలేషియా ఎయిర్‌లైన్స్ కీలక అడుగు వేసింది. పూర్తిగా మహిళా సిబ్బందితో తన తొలి విమానాన్ని ప్రారంభించింది. చెక్-ఇన్ కౌంటర్ల నుండి, కాక్‌పిట్ నుండి క్యాబిన్ వరకు, మొత్తం విమాన ప్రయాణంలోని ప్రతి దశలోనూ మహిళలేబాధ్యతల్లో ఉండటం విశేషం. తద్వారా పూర్తిగా మహిళా సిబ్బందితో తన తొలి విమానాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా మలేషియా ఎయిర్‌లైన్స్ చరిత్ర సృష్టించింది.
సెక్యూరిటీ, పైలట్లు, కో-పైలట్లు , క్యాబిన్ క్రూ సహా పూర్తిగా మహిళా బృందమే ఉండటమే దీని విశేషం. కౌలాలంపూర్ నుండి కోటా కినాబాలుకు బయలుదేరిన విమానం (MH2610) ఎగిరింది.ఈ సమాచారాన్ని మలేషియన్ ఎయిర్‌లైన్స్ ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. మహిళల శక్తి సామర్థ్యాలను, వృత్తి నైపుణ్యం,నాయకత్వం గుర్తించాలని పేర్కొంది.
మలేషియా ఏవియేషన్ గ్రూప్ శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య 36 శాతంగా ఉంది. పురుషాధిపత్యం ఉన్న విమానయాన రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (IATA) 2025 మైలురాయిని అధిగమిండమనే కేవలం పురోగతిని మాత్రమే కాదు, ఆకాశానికి పరిమితులు లేవనే విషయాన్ని ఇది సూచిస్తుందని అని మలేషియా ఎయిర్‌లైన్స్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాసింది. ఇది మరింతమందికి ప్రేరణ కావాలని అభిలషించింది. ఆశావహులైన విమానాన్ని నడపాలనుకునే వారు, తదుపరి తరం అమ్మాయిలు అడ్డంకులను అధిగమించి, తమ కలలను సాధించడంలో తమ చర్య ప్రోత్సాహాన్నిస్తుందని ఎయిర్‌లైన్ పేర్కొంది.
ఇదీ చదవండి: Hair Dye: మెరిసిందని మురిసిపోవద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్

మలేషియా ఎయిర్‌లైన్స్ ప్రకారం, దేశీయ , అంతర్జాతీయ మార్గాల్లో 8,200 గంటలకు పైగా అనుభవం ఉన్న అనుభవజ్ఞురాలైన పైలట్ కెప్టెన్ నూర్సజ్రినా బింటి జుల్కిఫ్లి , ఇటీవల సర్టిఫికేషన్ పొందిన యువ పైలట్ సెకండ్ ఆఫీసర్ సితి నూర్ సయామిరా బింటి బహారుద్దీన్ బోయింగ్ 737-800 ను నడిపారు.