breaking news
Malasian airlines
-
కాక్‌పిట్ - క్యాబిన్ : మలేషియన్ ఎయిర్‌లైన్స్ చరిత్ర
మహిళా సాధికారత విషయంలో మలేషియా ఎయిర్‌లైన్స్ కీలక అడుగు వేసింది. పూర్తిగా మహిళా సిబ్బందితో తన తొలి విమానాన్ని ప్రారంభించింది. చెక్-ఇన్ కౌంటర్ల నుండి, కాక్‌పిట్ నుండి క్యాబిన్ వరకు, మొత్తం విమాన ప్రయాణంలోని ప్రతి దశలోనూ మహిళలేబాధ్యతల్లో ఉండటం విశేషం. తద్వారా పూర్తిగా మహిళా సిబ్బందితో తన తొలి విమానాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా మలేషియా ఎయిర్‌లైన్స్ చరిత్ర సృష్టించింది. సెక్యూరిటీ, పైలట్లు, కో-పైలట్లు , క్యాబిన్ క్రూ సహా పూర్తిగా మహిళా బృందమే ఉండటమే దీని విశేషం. కౌలాలంపూర్ నుండి కోటా కినాబాలుకు బయలుదేరిన విమానం (MH2610) ఎగిరింది.ఈ సమాచారాన్ని మలేషియన్ ఎయిర్‌లైన్స్ ఫేస్బుక్లో వెల్లడించింది. మహిళల శక్తి సామర్థ్యాలను, వృత్తి నైపుణ్యం,నాయకత్వం గుర్తించాలని పేర్కొంది.మలేషియా ఏవియేషన్ గ్రూప్ శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య 36 శాతంగా ఉంది. పురుషాధిపత్యం ఉన్న విమానయాన రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (IATA) 2025 మైలురాయిని అధిగమిండమనే కేవలం పురోగతిని మాత్రమే కాదు, ఆకాశానికి పరిమితులు లేవనే విషయాన్ని ఇది సూచిస్తుందని అని మలేషియా ఎయిర్‌లైన్స్ ఫేస్బుక్ పోస్ట్‌లో రాసింది. ఇది మరింతమందికి ప్రేరణ కావాలని అభిలషించింది. ఆశావహులైన విమానాన్ని నడపాలనుకునే వారు, తదుపరి తరం అమ్మాయిలు అడ్డంకులను అధిగమించి, తమ కలలను సాధించడంలో తమ చర్య ప్రోత్సాహాన్నిస్తుందని ఎయిర్‌లైన్ పేర్కొంది.ఇదీ చదవండి: Hair Dye: మెరిసిందని మురిసిపోవద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్ మలేషియా ఎయిర్‌లైన్స్ ప్రకారం, దేశీయ , అంతర్జాతీయ మార్గాల్లో 8,200 గంటలకు పైగా అనుభవం ఉన్న అనుభవజ్ఞురాలైన పైలట్ కెప్టెన్ నూర్సజ్రినా బింటి జుల్కిఫ్లి , ఇటీవల సర్టిఫికేషన్ పొందిన యువ పైలట్ సెకండ్ ఆఫీసర్ సితి నూర్ సయామిరా బింటి బహారుద్దీన్ బోయింగ్ 737-800 ను నడిపారు. -
భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్‌లైన్స్
మలేషియా ఎయిర్‌లైన్స్ కీలక మార్కెట్‌గా భావించే భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తోంది. దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాలకు ఈ ఎయిర్‌లైన్ సర్వీసులు నడుపుతోంది. సమీప భవిష్యత్తులో వీటి ఫ్రీక్వెన్సీ(సర్వీసుల సంఖ్య)ను పెంచబోతున్నట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఇజం ఇస్మాయిల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థకు భారత మార్కెట్ చాలా కీలకం. ప్రస్తుతం దేశంలో తిరువనంతపురం, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అమృత్సర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి తొమ్మిది నగరాలకు సర్వీసులు నడుపుతున్నాం. అందులో తిరువనంతపురం, అహ్మదాబాద్‌లకు సర్వీసు ఫ్రీక్వెన్సీలను పెంచాలని నిర్ణయించాం. కొత్తగా పెంచే ఫ్రీక్వెన్సీతో ఆ నగరాలకు వారానికి నాలుగు సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం మలేషియా ఎయిర్‌లైన్స్ దేశంలో వారానికి 71 విమానాలను నడుపుతోంది. ఆగస్టులో అమృత్‌సర్‌కు ఫ్రీక్వెన్సీ పెంచాం. 2025లో దేశంలో ఇతర నగరాలకు సర్వీసులు నడపాలనే అంశంపై చర్చలు సాగుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: నాలుగేళ్లుగా ఉన్న ఆంక్షలు ఎత్తివేత!విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2016లో ఉడాన్(ఉడే దేశ్కా అమ్ నాగరిక్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశీయ విమాన కంపెనీలకు ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. టైర్ 2, 3 నగరాల్లో ప్రజలు విమాన ప్రయాణాలు చేసేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తోంది. దాంతో విదేశీ కంపెనీలు కూడా భారత్‌తో తమ సేవలు విస్తరించాలని యోచిస్తున్నాయి. -
మలేషియా విమానం మాల్దీవ్స్ వైపు వెళ్లిందా?
మలేషియా నుంచి బయలుదేరి మధ్యలోనే మాయమైన ఎంహెచ్ 320 విమానం మాల్దీవ్స్ లో కనిపించిందా? విమానం మాయమైన మార్చి 6 నాడే మాల్దీవ్స్ లో చాలా తక్కువ ఎత్తునుంచి ఒక జంబోజెట్ విమానం వెళ్లినట్టు అక్కడి కుడా హువాధూ ద్వీసం ప్రజలు చెబుతున్నారు. ఈ కథనం స్థానిక హావీరు న్యూస్ లో ప్రచురితం అయింది కూడా. చాలా తక్కువ ఎత్తు నుంచి ఒక విమానం వెళ్లడం చూశామని చాలా మంది స్థానికులు చెబుతున్నారు. ఆ విమానం తెల్లగా ఉందని, దానిపైఎర్ర చారలు పెయింట్ చేశారని చెబుతున్నారు. మలేషియన్ విమానాల రంగు కూడా ఇదే. 'విమానం ఎంత కింద నుంచి వెళ్లిందంటే దాని తలుపులు, కిటికీలను సైతం గుర్తించగలిగాం. చెవులు పగిలిపోయేంత శబ్దం వచ్చింది' అని స్థానికులు అంటున్నారు. ఎన్నెన్నో ప్రశ్నలు? ఎంతెంతో కన్ఫ్యూజన్ రాడార్ల దృష్టి నుంచి తప్పించుకోవాలంటే విమానాలు చాలా తక్కువ ఎత్తున ఎగరాల్సి ఉంటుంది. అయిదు వేల అడుగుల కన్నా తక్కువ ఎత్తున వెళ్తేనే రాడార్ల డేగ కళ్ల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి మలేషియన్ పైలట్లు విమానాన్ని అంత తక్కువ ఎత్తునుంచి తీసుకువెళ్లారా? అందరూ భావిస్తున్నట్టు విమాన క్యాప్టెన్, కో పైలట్లే హైజాకర్లుగా మారి చేను మేసిన కంచెల్లా పనిచేశారా? లేక విమానంలోని పరికరాలు సరిగ్గా పనిచేయక, విమానాన్ని ఎదో ఒక రకంగా సురక్షితంగా దించేందుకు పైలట్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు విమానం కాక్ పిట్ లో ఉన్న వారు విలన్లా లేక హీరోలా? కో పైలట్ ఫారిక్ అబ్దుల్ హమీద్ ప్రేమలో పడ్డాడని, ఇంకో విమానంలో కో పైలట్‌గా ఉన్న నిద్రా రామ్లీ అనే అమ్మాయికి ప్రపోజ్ కూడ చేశాడని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడని, అలాంటి వాడు విలన్ గా మారాల్సిన అవసరం ఏముందని కూడా అతని మిత్రులు వాదిస్తున్నారు. మాకూ విమానం కనిపించిందోచ్! తమాషా ఏమిటంటే మాయమైన విమానం కోసం వెతుకుతున్న 26 దేశాల్లో మాల్దీవ్స్ లేదు. కాబట్టి విమానం మాల్దీవ్స్ దాటి మరే అజ్ఞాత ద్వీపానికైనా వెళ్లిందా? లేక సముద్రంలో కుప్పకూలిపోయిందా? మలేషియా, చైనా సహా 26 దేశాలు మలక్కా జలసంధి దగ్గర వెతకడం నీళ్లు లేని చోట గాలం వేయడం లాంటిదేనా? మరో వైపు థాయ్ లాండ్ ఏవియేషన్ అధికారులు కూడా సరికొత్తగా గొంతు విప్పి ట్రాన్స్‌పాండర్ ని ఆపేసిన కొద్ది సేపటి వరకూ తమ రేడార్లలో విమానం మినుకుమినుకుమని కనిపించిందని, విమానం ఆగ్నేయాసియాలోని మలక్కా జలసంధి వైపు వెళ్లిందని ప్రకటించింది. ఈ వివరాలను తాము ఇన్నాళ్ల వరకూ గమనించలేదని, పాత రికార్డులు తిరగేస్తే ఈ డేటా కనిపించి డంగైపోయామని వారంటున్నారు. దీంతో ఇప్పుడు అన్వేషణ చేస్తున్న వారు ఎటు వెతకాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు!