
కొద్దిమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు సాహసయాత్రలు అంటే ఎంతో ఇష్టం. వారిలో పరిణీతిచోప్రా ఒకరు. ఆమె స్కూబా డైవర్. పాడి ( ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్)కు బ్రాండ్ అంబాసిడర్. తన సముద్ర సాహసయాత్రలను ఆమె ‘ధ్యానం’గా అభివర్ణిస్తుంది. ఎన్నో చేపలు, ఎన్నో తాబేళ్లు, పరిచిత, అపరిచిత సముద్ర జీవులు...అండర్‌వాటర్‌డైవింగ్ అనుభవాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది పరిణీతి చోప్రా‘యాత్రలు అంటే ఇష్టం. సాహసయాత్రలు అంటే మరీ ఇష్టం’ అంటుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఆమె తన సాహసయాత్రాల తాలుకు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. మోడల్, నటి లిసా హెడన్‌కు సర్ఫింగ్ అంటే ఇష్టం. ‘ఆర్ట్ ఆఫ్ సర్ఫింగ్’లో పట్టా పుచ్చుకుంది. తనకు ఇష్టమైన సర్ఫింగ్ కోసం దేశవిదేశాలలో ఎన్నో ప్రదేశాలకు వెళుతుంటుంది

బ్యాటిల్‌ఫీల్డ్ టూరిజం
సరికొత్తగా ఆదరణ పొందుతున్న ట్రావెల్ ట్రెండ్స్‌లో బ్యాటిల్‌ఫీల్డ్ ట్రెండ్ ఒకటి. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశం కోసం ఎంతోమంది యోధులు పోరాడిన ఎన్నో ప్రదేశాలు, వాటి విశేషాలు తెలుసుకోవడానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారు. తుపాకుల మోతతో ప్రతిధ్వనించిన కొండలు, లోయలు, యోధులు నివసించిన ఊళ్లు చూడడానికి ఇష్టపడుతున్నారు. చరిత్ర, సాహసం, దేశభక్తిని మిళితం చేసే ట్రావెల్ ట్రెండ్ ఇది. బ్యాటిల్‌ఫీడ్డ్ టూరిజాన్ని ఇష్టపడేవారి కోసం రక్షణ మంత్రిత్వశాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ ‘భారత్ రణభూమి’ యాప్‌ను రూపొందించింది. 2025 ట్రావెల్ ట్రెండ్స్‌లో రిజెనరేటివ్ టూరిజం (టూరిజం ప్లస్ సస్టేనబుల్ టూరిజం), స్లీప్ టూరిజం (తగినంత నిద్ర కోసం), ఫెస్టైవ్ టూరిజం (పండగల సందర్భంగా ప్రముఖ ఆలయాల ప్రయాణం)... ఇలాంటి ఎన్నో పాపులర్ అయ్యాయి.