breaking news
Pawan Kalyan
-
నీకు గోవింద నామస్మరణ చేసే హక్కు లేదు.. పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన కారుమూరి
-
సినిమా పిచ్చి ఉన్నవాళ్లే పవన్ కళ్యాణ్ పార్టీలోకి..
-
చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు. మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కాని వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉందన్న భయం. మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి.. ఈ రెండు విషయాలు ఆయనే చెప్పగలరు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్దిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ది ఉంటే ఏమి చేసి ఉండాలి. నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ రెండేళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్లీ లెక్కలు ఇవ్వాలి కదా! ఆ పని చేయకుండా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.గతంలో అప్పులు చేసేవారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవల్సిందే. ఈ మూడు ప్రాంతాలలో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో, లేదో తెలియదు. కాని విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసేశారన్నమాట.ఒకవైపు ప్రపంచం అంతటా సంక్షోభం, ఎల్‌నినోలో ప్రభావం వంటివాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్పపేరే వస్తుంది. దానిని అంతా స్వాగతిస్తారు. కాని కేవలం ప్రజలను మభ్య పెట్టేరీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్‌ను టెక్నాలజీ, పరిశ్రమలు మౌలిక వసతులు, ఇంధనం విభిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో 49 ప్రాజెక్టులతో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఈ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లబ్ధిస్తుందని ఆయన అంటున్నారు. 2032 నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. ఇక తిరుపతి ఆర్థిక రీజియన్‌లో 11-12 లక్షల కోట్ల పెట్టటుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం అని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40 శాతం రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో చీని తోటలు ఎండిపోతున్నాయని, టాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరో వైపు చంద్రబాబు మాత్రం లక్ష కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇవ్వాలట. ఇవన్ని ఎప్పటికి జరిగేనో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజియన్లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు కాని, అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులకోసం ఇంతవరకు 40887 కోట్ల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్లలో పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్ని చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అందులో కూడా ఏవేవో లెక్కలు రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికలలో ఓటమిపాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో టీడీపీ మళ్లీ పవర్లోకి వచ్చింది. ఆ టరమ్‌లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసు ఎత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర, 2029నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టరమ్‌లో 2047 విజన్‌తో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టరమ్‌లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం, ప్రజలు వాటిని వినీ.. విని విసుగుచెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది..! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రియాంక తండ్రి ఫైర్
-
నా బిడ్డ గురించి సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం
-
‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం స్పందించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు సర్కార్‌పై మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల అన్యాయమైపోతే మహిళా హోంమంత్రి మనసు కరగలేదా? అంటూ ప్రియాంక తండ్రి మండిపడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని మా పాపను చదివించుకున్నాం. మా పాపను బతికించుకోవాలనే తపనలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. మా కడుపుకోత లోకేష్‌కు అర్థం కావడం లేదా?’’ అంటూ ప్రియాంక తండ్రి నిలదీశారు.‘‘ఆడపిల్లను చంపేసి హాయిగా తిరగొచ్చా.. మీ చట్టాలు సరిగా పనిచేస్తున్నాయా?. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కనీసం స్పందించలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పట్టించుకోలేదు. ప్రతినెల హైదరాబాద్ వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా?. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి గాని, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు. నా బిడ్డ అవయవదానం చేసే ఆలోచన లేదు. బతికించుకునే ప్రయత్నమే చేస్తున్నాం’’ అని ప్రియాంక తండ్రి పేర్కొన్నారు.కాగా, రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్ (జీసీఎస్) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. -
DSC స్కామ్ పై అదిరిపోయే స్కిట్.. లోకేష్, పవన్ ఫోటోతో మాస్ ర్యాగింగ్
-
చంద్రబాబు నిర్ణయాలు నచ్చక కాబినెట్ కు పవన్ డుమ్మా!?
-
అనిత వెస్ట్ అని పవన్ కల్యాణే... వెళ్తూ.. వెళ్తూ అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
మరోసారి కేబినెట్ భేటీకి పవన్ గైర్హాజరు
సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ మరోసారి గైర్హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడం ఇది వరుసగా మూడోసారి. గతంలో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన రాలేదు.గతంలో రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరవుతుండటం కూటమి సర్కార్‌లో అసలేం జరుగుతోంది?. అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలకు తావిస్తోంది. వరుసగా మూడు కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
రుషికొండ కోసం గగ్గోలు పెట్టావ్.. సింహాచలం కొండను గుండు చేస్తుంటే... పవన్ ని ఏకిపారేసిన బొలిశెట్టి
-
ఓజీ-2కు బ్రేక్.. సుజీత్ ప్లాన్ మారింది
దర్శకుడు సుజీత్ తదుపరి ప్రాజెక్ట్ విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పవన్ కల్యాణ్‌తో తెరకెక్కనున్న ఓజీ-2 కంటే ముందుగా నాని హీరోగా రూపొందనున్న 'బ్లడీ రోమియో' చిత్రాన్నే సుజీత్ ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.ఓజీ-2 ప్రకటన వెలువడిన తర్వాత నాని-సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్ వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా సుజీత్ కూడా ఓజీ-2 ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టడం, లొకేషన్ల పరిశీలన చేపట్టడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.అయితే తాజా పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. నాని ప్రస్తుతం చేస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో, తదుపరి ప్రాజెక్ట్‌గా 'బ్లడీ రోమియో'ను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం నాని తన కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.అక్టోబర్ నుంచి 'బ్లడీ రోమియో' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌ను ఢిల్లీలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అనంతరం లండన్‌లో కీలకమైన, భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం.వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత దర్శకుడు సుజీత్ పూర్తిస్థాయిలో ఓజీ-2 పనులపై దృష్టి సారించనున్నాడు. -
ఆ ముగ్గురిది ఓవరాక్షన్ అంటారేంటి.. అది ఆర్ట్.. ఆర్టిస్టులను అవమానిస్తారా ?
-
మోదీ ముందు యాక్టింగ్ అదుర్స్ కానీ.. జనాలు పిచ్చోళ్ళు కాదు బ్రో
-
బాబు, పవన్ తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు
-
అల భోగాపురంలో ఇలా భజన పరులు చిడతలు.. వెంకట్ రెడ్డి సెటైర్లు
-
పవన్, బాబు మోడీ భజన.. ఒకపక్క చిడతల అప్పారావు.. ఇంకోపక్క చిడతల పాపారావు
-
రాజకీయ డ్రామా కోసం 40 కోట్లు
-
మోదీ తల్లిని, భార్యను బాబు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ నీకు భాద అనిపించలేదా?
-
పోటాపోటీగా పొర్లు దండాలు..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: హూ ఈజ్ మోదీ.. అయామ్ ఫాదరాఫ్ లోకేశ్.. నౌ టెల్ మీ.. హూ ఈజ్ మోదీ.. తల్లిని చూడలేనివాడు దేశాన్ని చూస్తాడా.. గోద్రా నరహంతకుడు మోదీ దేశానికి ప్రధానిగా ఎలా పనికొస్తాడు అంటూ అప్పట్లో హూంకరించిన చంద్రబాబేనా ఈయన.. కొంపదీసి డూప్ చంద్రబాబు గట్రా స్టేజి మీద ఉన్నారా అని ఒక్క క్షణం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరైన జనానికి అనిపించింది. ఈ దేశానికి మోదీలాంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది.. అసలు మోదీ అవసరం దేశానికీ ఉంది.. ఆయన లేకపోతే దేశం లేదు.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీలాంటి నాయకుడిని చూడలేదు అంటూ బాబు ఉన్నఫళంగా మోదీ దండకం అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీని ఏదో మర్యాదకోసం... ప్రొటోకాల్ కోసం అభినందించడం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు పూర్వకంగా రెండు మాటలు మాట్లాడడం సహజమే.. కానీ శనివారం చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ ఒక్కొక్కరు ఒక్కో రేంజిలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ మోదీ భజన చేస్తుంటే... అసలు ఇది విమానాశ్రయ ప్రారంభమా ? మోదీ భజన కోసం ఇన్ని వేలమందిని తరలించారా అనే సందేహం అందరిలోనూ కలిగింది. లోకేశ్ చిడతల భజన చంద్రబాబు, పవన్ ఒక్కోరేంజిలో భజన చేయడంతో... ఇక లోకేశ్ కూడా తనవంతు పాత్ర గట్టిగానే పోషించేశారు. మోదీజీ విజన్.. చంద్రబాబు ఎగ్జిక్యూషన్ అంటూ పావుగంటసేపు చిడతలు వాయించేశారు. ఉన్న సమయమంతా మోదీని పొగడడానికి సరిపెట్టేశారు. రాష్ట్ర, దేశ ప్రగతికి మోదీ చేస్తున్న సేవలు.. ఆయన కృషి అంటూ మొదలెట్టి పలు పథకాలు.. రకరకాల ప్రాజెక్టుల పేర్లు చెబుతూ మోదీజీకి జై అనేలా ప్రజలను బతిమాలి మరీ జై కొట్టించారు. వచ్చీరాని మాటలు, అర్ధంలేని ప్రసంగాలతో తనదైన ‘ముద్ర’ను ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ముగ్గురూ ఒకరిని మించి ఒకరు ప్రధానమంత్రి మోదీని ఉబ్బించేసి తాము ఉబ్బిపోయి వేదిక దిగిపోయారు. పవన్‌కు కన్నీళ్లు వచ్చేశాయి సముద్రం ఒకరి కాళ్లదగ్గర మోకరిల్లదు .. పర్వతం ఎవరికీ సలాం చేయదు అంటూ విప్లవ డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ సైతం ఈ రోజు పదిపన్నెండు మెట్లు దిగి మోదీకి భజన కొట్టారు. ప్రభుత్వ వైఫల్యాల మీద యువత మోదీని తిడుతుంటే తనకు కన్నీళ్లొచ్చేశాయి అంటూ సెంటిమెంట్ పండించారు. మోదీని కొట్టేవాళ్లు దేశంలోనే లేరని, ఆయనకు నచ్చినన్నాళ్లు ప్రధాని పదవిలో ఉండచ్చని చెబుతూ ఆయనకు బోర్ కొడితే మాత్రమే పదవిని వదులుకోవాలన్నారు. అలాంటి ప్రధాని సారథ్యంలో పని చేయడం తనకు జన్మజన్మల పుణ్యఫలం అని చెబుతుంటే... గతంలో మనం ఢిల్లీ వాళ్ల ముందు తలవంచుతామా ? ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా అంటూ గొంతు చించుకుని అరచిన పవన్ కల్యాణ్ జనానికి గుర్తొచ్చారు. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.. పని చేస్తున్నందుకే మోదీజీకి ఈ నిందలు అంటూ పవన్ మ్రాన్పడిపోవడాన్ని చూసి సభికులు విస్తుపోయారు. నటనా చాతుర్యం బాగుందని కితాబిచ్చారు.యువత దుమ్మెత్తిపోస్తుంటే... దేశవ్యాప్తంగా జెన్‌జీ యువత అటు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తోంది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్ర«దాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో దేశంలో మోదీ ప్రభ కాస్త మసకబారుతోందన్న సూచనలు సైతం సమాజంలోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు తణమూల్ కాంగ్రెస్ నుంచి పలువురు ఎంపీలు బీజేపీలో కలుస్తుండడంతో ఈ అవకాశవాద చంద్రబాబును మోదీ పక్కనబెడతారు.. ఇక బాబుకు ప్రాధాన్యం తగ్గుతుందన్న వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు అత్యవసరంగా లోకేశ్‌ను సీఎంగా చేయాలన్న ఇంటిపోరు సైతం మొదలైంది. మోదీ అనుమతి లేకుండా లోకేశ్‌ను సీఎం చేయడంకుదరని పని. దీంతో అటు తృణమూల్ రూపంలో కేంద్రంతో తన ప్రాధాన్యాన్ని ముంచుకొచ్చిన ముప్పును తప్పించుకుంటూ ఇంకా మోదీకి విధేయత చూపడానికి బాబు ఎక్కడలేని తంటాలు పడ్డారు. మేకిన్ ఇండియా.. ఆత్మనిర్భర భారత్.. బులెట్ ట్రైన్, డిజిటల్ పేమెంట్స్.. రోడ్లు.. విమానాశ్రయాలు.. జాతీయ రహదారులు అంటూ పలు ప్రాజెక్టులు, పథకాల పేర్లు చెబుతూ వెనువెంటనే మోదీమోదీ అంటూ అరవాల్సిందిగా బాబు సభికులకు ప్రాథయపడ్డారు. ఒకానొకదశలో బాబు పూనకం వచ్చినట్లు గొంతు చించుకుని మోదీమోదీ అని అరవడాన్ని చూసి వీఐపీ గ్యాలరీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విస్తుపోయారు. ఉన్నఫళంగా ఈ స్థాయి పూనకానికి కారణం ఏమిటో అర్థంకాక ఒకరి మోకాలు ఒకరు చూసుకున్నారు. లోకేశ్‌ను సీఎంను చేసేందుకే ఇంత ప్రాపకమా అన్న విషయం తెలిసుకున్నాక ముక్కనవేలేసుకున్నారు.సీఎం పవన్ సారథ్యం అవసరం: శ్రీనివాస వర్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుల నాయకత్వం ఎంతో అవసరం అని కేంద్ర పరిశ్రమల శాఖ శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదిక మీద ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో దోహదపడుతోందన్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఘనత సాధించడానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్య మంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కాంబినేషన్ ఇలాగే ఉండాలని అభిలషించారు. పొరపాటున ఆయన ఇలా అన్నారేమో అనుకుని సభికులు కలవరపడ్డారు. ముఖ్యమంత్రి పవన్ అని కేంద్రమంత్రి అనగానే జనంలోంచి కాస్త గుసగుసలు.. కేకలు, అరుపులు వినిపించాయి... కానీ కేంద్ర మంత్రి ఏకంగా రెండుమూడు సార్లు పవన్‌ను ముఖ్యమంత్రి అని, చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి అని సంబోధించడం వెనుక బీజేపీ నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో మోదీ ఈయనతో ఇలా మాట్లాడించారా అనే గుసగుసలు వినిపించాయి.రాష్ట్రమంత్రులకు నో మైక్ విమానాశ్రయం ప్రారంభ వేదిక మీద కేవలం ప్రధాని మోదీ, లోకేశ్, పవన్ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, రామ్మోహన్ నాయుడు మాత్రమే ప్రసంగించారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ రాష్ట్ర మంత్రులు టీడీ జనార్దన్, జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్, హోం మంత్రి అనితకు మైక్ దక్కలేదు. ఆఖరుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కానీ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ప్రసంగించేందుకు అవకాశం దక్కలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ , గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సైతం వేదిక మీద ఆసీనులయ్యారే తప్ప మాట్లాడేందుకు మైక్ అందలేదు. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్‌వే’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రన్‌వేగా, యువత భవిష్యత్తుకు లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, సెమీకండక్టర్ పరిశ్రమలకు శనివారం ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు, శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి, శ్రీకూర్మనాథ స్వామి, పైడితల్లి అమ్మవారిని స్మరించారు. భోగాపురం వేదిక నుంచి సుమారు రూ.17,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. ఈ రోజు ప్రారంభమైన విమానయానం, రహదారులు, సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం, పోర్టులు, రైల్వేలు, కనెక్టివిటీ తదితర రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశను చూపుతాయని ప్రధాని పేర్కొన్నారు. సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన నేలపైనే కొత్త విమానాశ్రయం ఏర్పాటు కావడం గొప్ప విశేషమన్నారు. ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దేశంలో పౌర విమానయాన రంగం గత 12 ఏళ్లలో విశేషంగా అభివృద్ధి చెందిందని ప్రధాని వివరించారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు పెరిగిందన్నారు. ఉడాన్ పథకంతో సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించామని చెప్పారు. ఉడాన్ రెండో దశకు రూ.29 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కాశీలో ప్రారంభించిన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఇప్పుడు అమృత్‌సర్‌కు విస్తరించి, అక్కడి నుంచి 25కుపైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం కల్పించిందని తెలిపారు.బ్లూ ఎకానమీకి ప్రోత్సాహం దేశంలో బ్లూ ఎకానమీ బలోపేతానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తుందని చెబుతూ విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు తీర ప్రాంతాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల ఆధునికీకరణతో పాటు, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే సహా రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణంలో ఉన్నాయని, రైల్వే రంగంలో సుమారు లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. రైల్వే నెట్వర్క్ పూర్తిగా విద్యుదీకరణ కావడంతో పాటు, 70కుపైగా స్టేషన్లు ఆధునికీకరణ జరుగుతోందని వివరించారు.» పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టులు, విమానాశ్రయాల అనుసంధానంతో సమగ్ర లాజిస్టిక్స్ వ్యవస్థ ఏర్పడుతుందని, దీనివల్ల పరిశ్రమలు, రైతులు, వ్యాపార రంగానికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ఈ ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు సెమీకండక్టర్ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడం ఈ దిశగా కీలక ముందడుగని చెప్పారు.» సాఫ్ట్వేర్ రంగంతో పాటు తయారీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంతో భవిష్యత్ సాంకేతిక ఉద్యోగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.» కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్ల రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని, గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దీనికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నక్కపల్లిలో భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకు కేంద్రం పూర్తి మద్దతు అందిస్తోందని, దీనివల్ల దేశంలో ప్రముఖ ఔషధ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని తెలిపారు. » ఈ సందర్భంగా 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు, యువతులు ప్రదర్శించిన థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించడం గర్వకారణమని కొనియాడారు. భారత గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ఇది అద్భుత నిదర్శనమని పేర్కొన్నారు.ఇక ఉత్తరాంధ్ర వైపు వలసలు : చంద్రబాబుఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం, ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ద్వారా ఈ ప్రాంతంలో రివర్స్ మైగ్రేషన్‌కు నాంది పలికిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో ఒకటిగా నిలబెడుతుందని చెప్పారు. గత రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టుల ద్వారా రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని, వీటి ద్వారా 5.57 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముందని వెల్లడించారు. రూ.2,784 కోట్ల వ్యయంతో ఎనిమిది ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి బ్యారేజ్‌కు అనుమతులు, నిధులు లభించాయని చెప్పారు. ఆగస్టు 14న గోదావరి జలాలు అనకాపల్లికి చేరనున్నాయని, అలాగే వంశధార–గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా చేపడతామని వెల్లడించారు. పర్యాటకం, ఔషధ పరిశ్రమలు, అరుదైన ఖనిజాలు, జాతీయ రహదారులు, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాల అభివృద్ధితో ఉత్తరాంధ్ర దేశంలో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారానికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీ వంటి నాయకుడిని చూడలేదని చంద్రబాబు కొనియాడారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని, అలాగే 2028 నాటికి అమరావతి తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. » విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణికుల సౌకర్యాలు, చెక్–ఇన్ హాల్, ఆధునిక సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయం మాస్టర్ ప్లాన్, భవిష్యత్ ఏవియేషన్ హబ్, ఏరోసిటీ అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ప్రధానికి వివరించారు.థింసా నృత్యంతో స్వాగతంఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వం, ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రతిబింబించే ప్రదర్శనలను ప్రధాని సందర్శించారు. సంప్రదాయ థింసా నృత్యాలను తిలకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి పొందూరు ఖాదీ శాలువాతో సత్కారం చేయగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను బహూకరించారు.ప్రధానిని తిడుతుంటే కన్నీళ్లొచ్చాయి.. పవన్ కల్యాణ్‘భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కొందరు ఇష్టానుసారం తూలనాడుతుంటే గుండె కదిలిపోయింది. కన్నీళ్లు వచ్చాయి. బాధ పడ్డాను. దేశం కోసం నిస్వార్థంగా కష్టపడే వారికి ఇవా బహుమతులు అనిపించింది’అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో రూ.17,900 కోట్ల అభివృద్ధి పనులు మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి మోదీ. ఆయన వెనుక మనం ఉండాలన్నారు.ఏపీకి గ్రోత్ ఇంజన్ ఉత్తరాంధ్ర : లోకేశ్ కొందరు ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఎయిర్ పోర్ట్ వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ రోజు కేవలం ఒక ఎయిర్ పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు. మన మోదీ వికసిత్ భారత్, మన సీబీఎన్ విజన్ కలిసిన రోజు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దూసుకెళ్లే రోజు అని అన్నారు.అభివృద్ధికిది సింహద్వారం.. రామ్మోహన్నాయుడు ఒకప్పుడు అవకాశాల కోసం ప్రపంచం వైపు ఉత్తరాంధ్ర చూసేదని.. ఇప్పుడు ప్రపంచం మనవైపు చూసేలా భోగాపురం విమానాశ్రయం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని » ఎయిర్‌పోర్టు ప్రారంభంతో పాటు ప్రధాని మోదీ రాష్ట్రంలోని పలు రోడ్లు, పారిశ్రామిక సంస్థలను రిమోట్‌తో ప్రారంభించారు. » విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్–టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. » కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. » అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలు ప్రారంభం» కర్నూలు–ఐవీరెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, పెంచలకొన–యరపాడు మధ్యనున్న బ్రిడ్జికి శంకుస్థాపన.» ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లైన్ల బైపాస్ రోడ్లు ప్రారంభించారు. -
ఉబ్బలమడుగులో కొత్త వృక్షజాతి
తిరుపతి: సత్యవేడు నియోజకవర్గంలోని ఉబ్బలమడుగు పర్యాటక ప్రాంతంలో అరుదైన కొత్త వృక్షజాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూఫోర్బియేసీ కుటుంబానికి చెందిన ఈ వృక్ష జాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ అని పేరు పెట్టారు. దీన్ని అటవీశాఖ అధికారులు బుధవారం పవన్ కళ్యాణ్‌కు చూపించారు. కాంబాకం అటవీ ప్రాంతంలో ఈ మొక్క సహజంగా పెరుగుతుండటంతో ఆ ప్రాంతం పేరునే జాతి పేరుగా ఖరారు చేశారు. ప్రధాన అటవీ సంరక్షణాధికారి పి.వి.చలపతిరావు బృందం నిర్వహించిన పరిశోధనల్లో ఈ కొత్త జాతి వెలుగులోకి వచ్చింది. సుగంధ పరిమళం వెదజల్లే ఆకులు, ప్రత్యేక నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాలు ఈ మొక్క ప్రత్యేకతలు. క్రోటన్ అరోమాటికస్ జాతికి ఇది దగ్గరి బంధువు అయినా పూర్తిగా భిన్నంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అత్యంత పరిమిత ప్రాంతంలోనే లభిస్తుండటం, ఆవాసాలకు ముప్పు ఉండటంతో ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల జీవవైవిధ్య సంపదను మరోసారి చాటిందని, దీని పరిరక్షణకు మరింత కృషి అవసరమని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ కు పేరు పెట్టావ్.. ఇప్పుడు దీనికి నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావ్
-
జనసేన పార్టీ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులను పవన్ కల్యాణ్ రద్దు చేశారు. పార్టీ నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరు టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని పవన్ ఆదేశించారు. నూతన కమిటీలు ప్రకటించే వరకు మీడియాలో జనసేన పార్టీ పేరుతో పాల్గొనవద్దంటూ జనసేన పేర్కొంది. నూతన కమిటీ నియామకం తర్వాతే టీవీ డిబేట్లలో పాల్గొనాలని పేర్కొన్న పవన్ కల్యాణ్.. మీడియాలో జనసేన పేరు వాడకూడదంటూ ఆదేశాలు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. -
గొప్పల కోసం అప్పులు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న కూటమి
-
నెటిజన్ల ఫైర్.. ఎన్టీఆర్ గాయాలపై స్పందించని చంద్రబాబు, లోకేశ్
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల గాయాలపాలయ్యారు. తన భుజానికి గాయం తగలడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. దాంతో వైద్యులు ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.అయితే ఈ ఘటనపై ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఈ విషయం ప్రస్తుతం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. కానీ ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ లీడర్ ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ వెంటనే ట్వీట్లు చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ గాయాలపై మాత్రం మౌనం వహించడంతో వారికి మానవత్వం లేదా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులపై చూపిన ప్రేమాభిమానాల్లో కనీసం పదో వంతు కూడా అత్యంత దగ్గరి బంధువైన ఎన్టీఆర్‌పై చూపలేదని చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z
-
కూటమిలో చిచ్చు.. మాకే ఆహ్వానం లేదా!?
సాక్షిప్రతినిధి, విజయనగరం: మన ఊరిలో మీటింగ్ పెట్టి మనకు ఆహ్వానం లేకపోవడమా..? వంటలన్నీ మనతో చేయించి మనకు పళ్లెం వేయకపోవడమా? మనతో ఫంక్షన్ కుర్చలు సర్దించి మనను చివరకు గుమ్మం బయట నిలబెడితే ఎలా ఉంటుంది? అచ్చం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరిస్థితిలానే ఉంది. బయటకు చెప్పలేక.. ఎవరికీ చెప్పుకోలేక.. క్యాడర్ ముందు బిల్డప్ కొట్టుకోలేక.. అబ్బబ్బ ఈ కష్టాలు.. అవమానాలు పగవాడిక్కూడా రావద్దు సుమీ..! అన్న వ్యాఖ్యలు నెల్లిమర్ల నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు వస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనుండగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు పాల్గొంటున్నట్టు ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ జీఎమ్మార్ ఆహ్వాన పత్రికను విడుదల చేసింది. అందులో స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి పేరులేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎయిర్‌ఫోర్ట్ ప్రారంభానికి ముందు ప్రధాని పర్యటన ఏర్పాట్లు అంటూ రోజూ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లడం.. ఏర్పాట్లు.. పర్యవేక్షణ అంటూ హడావుడి చేయడం తప్ప ఆఖరుకు జీఎంఆర్ వారు వేసిన ఆహ్వాన పత్రంలో కూడా ఎమ్మెల్యే పేరు లేకపోవడం పార్టీ క్యాడర్‌ను ఆవేదనకు గురిచేస్తోంది. ఎయిర్‌పోర్టు రానీయండి.. వేలల్లో ఉద్యోగాలు..ఇక మీ జీవితాలు మారిపోతాయి.. ఇంటికో ఉద్యోగం.. రెండు చేతుల్లో డబ్బులు గలగలా అంటూ చెప్పుకొచ్చిన ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రంలో పేరు లేకపోవడం చూసి.. ఆమె స్థాయి ఇంతేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, దీనివెనుక స్థానిక టీడీపీ నేతల కుతంత్రం ఉందన్న వ్యాఖ్యలు జనసేన క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు లేని ప్రాధాన్యం లోకేశ్‌కు ఎలా ? ఎంతపెద్ద నాయకుడు వచ్చినా స్థానిక నాయకత్వానికి అయితే ప్రత్యేక ప్రొటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు వేదిక మీద సీట్లు ఉంటాయి. కానీ ప్రధాని కార్యక్రమానికి మాత్రం స్థానిక ఎమ్మెల్యే మాధవికి ప్రత్యేక ఆహ్వానం లేకపోవడం ఆమెను జీఎమ్మార్ లైట్ తీసుకున్నట్లే అంటున్నారు. ఇదిలా ఉండగా అసలు ఈ ప్రాంతానికి, ఆ ప్రాజెక్టుకు సాంకేతికంగా ఎలాంటి అనుబంధం లేని లోకేశ్, పవన్ కల్యాణ్ వంటివారికి ఎలా ప్రాధాన్యం ఇచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి. -
పవన్ కు బిగ్ షాక్.. Gen-Z తిరుగుబాటు.. జనసేనపై సోషల్ మీడియాలో వార్
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. బాబు,పవన్ పై CPI నారాయణ ఫైర్
-
కాక్రోచ్ దెబ్బకు బీజేపీ డౌన్! ఉద్యమంపై పవన్ కామెంట్స్ రగడ
-
చంద్రబాబుకు బిగ్ ఝలక్ ఇచ్చిన పవన్
-
సీఎం చంద్రబాబుకి ఝలక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఝలక్ ఇచ్చారు. కేబినెట్ సమావేశం సమయంలో పవన్ కళ్యాణ్ వేరే సమీక్ష నిర్వహించారు. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్‌కి పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. మంగళగిరిలోనే ఉన్నా కేబినెట్‌కు హాజరు కాలేదు. అదే సమయంలో అటవీ శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు కేబినెట్ని పవన్ కళ్యాణ్ లెక్కచేయరు. గత కేబినెట్ సమావేశానికి హాజరుకాని పవన్ కళ్యాణ్.. గతంలో సీఎం చంద్రబాబు సమీక్షలకు కూడా వెళ్లలేదు.దీంతో సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం వైనంపై అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతోంది -
బాబూ.. లక్ష్మీ కటాక్షమా.. ఓట్ల రాజకీయమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి సంబంధించి చేస్తున్న ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేవిగా ఉంటున్నాయా? లేక అంతా ఆమోదించేవిగా ఉంటున్నాయా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు చేసిన కొన్ని ప్రకటనలను గమనించండి. అమరావతికి లక్ష్మీ కటాక్షం-హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నాం.. అమరావతి అంటే విజయవాడ గుంటూరు, మంగళగిరి కలిసి ఉండేదే.. ఈ వ్యాఖ్యలను విశ్లేషించుకుంటే ఏమి అర్దం అవుతుంది?ఇంతకాలం అమరావతిని దేవతల రాజధాని అని ఆయన ప్రచారం చేశారు. దీనిపై వస్తున్న ప్రశ్నలను దృష్టిలో పెట్టుకున్నారేమో తెలియదు కాని ప్రజల రాజధాని అని కూడా అంటున్నారు. అంతవరకు సంతోషమే.దేశంలో మరే రాష్ట్రంలో తమది దేవతల రాజధాని అని ఏ ముఖ్యమంత్రి చెప్పి ఉండరు. ప్రజలను సెంటిమెంట్‌తో ఆకట్టుకోవడం కోసం ఆయన ఇలా చేస్తున్నారన్నది తెలుస్తూనే ఉంది. గత ఏడెనిమిదేళ్లుగా ఆయన ఈ మాట చెబుతూనే ఉన్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నామని చంద్రబాబు అన్నారట. ఇలా అనడంలోని ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు. భారత్.. రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ దేశంగా ఉంది. అన్ని మతాలను సమానంగా చూడాలి. చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉంటే ఒకరకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తుంటారన్న భావన రాజకీయ వర్గాలలో ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు మతపరమైన రాజకీయాలు చేయడానికి రకరకాల యత్నాలు చేశారు. చంద్రబాబు 2024లో మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అదే ప్రయత్నం సాగిస్తున్నారు.తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపించి, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టేందుకు కృషి చేశారు. తీరా అలాంటిదేమీ జరగలేదని తేలడంతో ఆయన సెల్ఫ్‌గోల్ వేసుకున్నట్లయింది. అయినప్పటికీ ఈ మధ్య మీమతం, మా మతం, మీ దేవుడు, మా దేవుడు అంటూ స్పీచ్‌లు ఇస్తూ ప్రజలను అటువైపు మళ్లించడానికి తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ఆయన ఇలా మతపర వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలుతోంది.ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత డెబ్బై ఐదేళ్లలో ఎన్నడూ మతాల ఆధారంగా కాకుండా ప్రభుత్వాల పనితీరు, విధానాల ఆధారంగానే ఓట్లు వేస్తూ వచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన అంశాలకు ప్రాధాన్యం పెరిగిన మాట వాస్తవమే. అందులోనూ మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ధోరణి మరింత హెచ్చింది. బీజేపీ మెప్పు కోసం చంద్రబాబు కూడా హిందూయిజాన్ని ప్రధాన అంశంగా మలచుకుని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అమరావతి రాజధానిలో జగన్నాధ రధయాత్రలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా స్వామివారి ఆశిస్సులను కోరుకోవడం, ప్రజలకు మేలు కలగాలని ప్రార్ధించడం సహజంగానే జరుగుతుంది. కాని హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మించడం ఏమిటో తెలియదు. ఈ మాటలు విన్న ఇతర మతాలవారికి అది ఎలాంటి భావన కల్గిస్తుందన్నది ఆయన ఆలోచించుకోవాలి!గతంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని పిలవరా అని అన్నప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. టీడీపీకి దూరంగా ఉన్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు అన్ని కులాలను, మతాలను తన వెంట తీసుకువెళ్లేలా వ్యవహరించాలి. దేశం కాని, రాష్ట్రం కాని మతపరమైనవిగా లేవన్న సంగతి గుర్తించాలి. స్థల మహత్యంతో అమరావతిని ఎవరూ కదలించలేరని అంటూ రాజకీయ లక్ష్యంగా ప్రసంగం చేసినట్లు అనిపిస్తుంది. ఆధ్యాత్మికత తోడుంటేనే ప్రశాంతత వస్తుందని ఆయనే చెబుతారు. కాని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆయనే రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారు.అమరావతికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషపడతారు. లక్ష్మీ కటాక్షం రాష్ట్రం అంతటికి రావాలని ఎవరైనా కోరుకుంటారు కాని, అమరావతికే కోరడం ఏమిటో తెలియదు. ఇప్పటికైతే అమరావతి ద్వారా ప్రభుత్వానికి లక్ష్మీ కటాక్షం ఎంత జరిగిందో అంటే.. ఎంత ఆదాయం వచ్చిందో తెలియదు కాని, అప్పు మాత్రం 47వేల కోట్లకు చేరింది. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడానికి లక్షకోట్లు ప్రస్తుతం ఖర్చు చేయవలసి ఉందని అంటారు. నిజంగానే లక్ష్మీకటాక్షం జరిగి, ప్రజల మీద భారం లేకుండా అమరావతి సొంతంగా సంపాదించుకుంటే చంద్రబాబు చెప్పింది నిజమేనని నమ్ముతారు. అలాకాకుండా వేల కోట్ల అప్పులు తెస్తూ దానినే లక్ష్మీ కటాక్షం అని అనుకోవాలంటే కష్టం అవుతుంది.అంతేకాదు... అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఈ రెండేళ్లలో కలిగిన లక్ష్మీ కటాక్షం పెద్దగా ఏమి లేదని బాధపడుతుంటారు. వారికి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చి ఉంటే కొంత కటాక్షం కలిగేదేమో. పైగా బలవంతపు భూ సేకరణ ద్వారా రైతుల వద్ద ఉన్న లక్ష్మీని కూడా ప్రభుత్వం లాక్కుంటోందన్న బాధ పలువురిలో ఉంది. కొందరు మహిళలను సైతం ప్రభుత్వం ఈ విషయంలో వేధించిన తీరు చూసి లక్ష్మీదేవి కూడా బాధపడి ఉండాలి. ప్రభుత్వం స్టార్ హోటళ్లకు ఎకరా ఎనిమిది కోట్లకు భూమి ఇస్తామని ప్రతిపాదించిందట. అదే టైమ్ లో భూముల సొంతదారులైన రైతులకు మాత్రం కోటి, రెండు కోట్లు కూడా ఇవ్వడం లేదని ఉండవల్లి రైతులు వాపోతున్నారు.చివరిగా మరో మాట.. మాజీ సీఎం జగన్ మావిగన్ అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలను ఒక కారిడార్‌గా తీసుకుని రాజధాని అభివృద్ది చేయాలని సలహా ఇస్తే దానిని చంద్రబాబు ఎద్దేవ చేశారు. కాని తాజాగా చేసిన ఒక ప్రసంగంలో అమరావతి అంటే విజయవాడ, మంగళగిరి, గుంటూరు కలిసి ఉన్నాయని అంటున్నారు. అవి ఇందులో భాగం అయితే రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు వంటివి మళ్లీ ఎందుకు నిర్మించాలి? వాటికోసం వేల ఎకరాల భూములు తీసుకుని రైతులను ఎందుకు బాధించాలి అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. మొత్తం తెచ్చిన అప్పు అంతా అమరావతి 29 గ్రామాలలోనే ఎందుకు వ్యయం చేస్తున్నారన్నదానికి సమాధానం చెప్పరు. అయితే జగన్ మావిగన్ ప్రతిపాదనను కాదనలేని స్థితికి చంద్రబాబు చేరుకున్నారని అనుకోవాలి. మతం మత్తు మందు వంటిదని కారల్ మార్క్స్ అంటారు. దానిని ఎంతవరకు అంగీకరిస్తారో తెలియదు కాని, మతం పేరుతో రాజకీయ లబ్ది పొందడానికి మాత్రం చంద్రబాబు వేస్తున్న వ్యూహాలు ప్రజలకు అర్థం కాకుండా ఉంటాయా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దేవుడు కొండపైనే TDP అరాచకాలు.. మహిళలకు ఏం జరిగిన వాలిపోతానన్న పవన్ ఎక్కడ..?
-
గుంటూరు మహిళపై దాడి.. అనిత, పవన్ కు ఇచ్చిపడేసిన మహిళా నేతలు
-
నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్
-
దేవాదాయ శాఖ నిధుల్లో గోల్ మాల్..? రోజు రోజుకు పెరుగుతున్న కూటమి అక్రమాలు
-
వేటలో ఉన్నావా పవన్? ఈ దుర్మార్గ ప్రభత్వానికి నువ్వు మద్దతా!
-
ప్రశ్నిస్తే జైలు.. పొగిడితే జేజేలా?
సోషల్ మీడియాలో పెడధోరణులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ వేస్తుందట. ప్రభుత్వం మీద వచ్చే నెగిటివ్ వార్తలపై నిఘా పెడతారట. అసభ్య పోస్గింగులను అరికట్టే నెపంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అడుగులు వేస్తోందా అన్న సందేహాన్ని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు.అసభ్య పోస్టులు ఎవరు పెట్టినా తప్పే. వాటిని కచ్చితంగా కంట్రోల్ చేయవలసిందే. కాని ఇప్పటికే అందుకు తగిన వ్యవస్థ ఏపీలో ఉంది. అయినా అది సరిపోవడం లేదని ప్రభుత్వం ఎందుకు అంటోంది? పోలీసు వ్యవస్థ సమర్థంగా ఆ దిశలో పనిచేయడం లేదని భావిస్తున్నారా? అసభ్య పోస్టింగ్‌లను ఎలాగైనా ఆపవచ్చు. అసలు సమస్య ఏమిటంటే కూటమి సర్కార్‌పై పెరుగుతున్న వ్యతిరేకత సోషల్ మీడియాలో ప్రతిబింబిస్తుండడం కావచ్చు. దానిని కంట్రోల్ చేస్తే వచ్చే ఎన్నికలలో నెగ్గగలమన్న ఆశ ఉండవచ్చు. నిజానికి సోషల్ మీడియాతోనే గెలుపు ఓటములు నిర్ణయం కావు. ప్రభుత్వం అనుసరించే విధానాలు, ఇచ్చిన హామీలు అమలు చేసే తీరు మొదలైనవి ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అయితే అసత్య ప్రచారాల వల్ల నష్టం జరగదా అంటే కాదని అనలేం. కాని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వైఎస్సార్సీపీకు చెందినవారు కాని, వారి సోషల్ మీడియా కాని అబద్దాలు చెప్పే అవకాశం తక్కువ. నిజాలు చెబుతుంటేనే పోలీసు వ్యవస్థను ఉపయోగించి వైఎస్సార్సీపీవారిపై ఎన్ని కేసులు పెడుతున్నది కనబడుతున్న తరుణంలో కోరికోరి ఎవరు సమస్య తెచ్చుకుంటారు? సోషల్ మీడియా పోస్టులలో పచ్చి బూతులు పెట్టిన కొందరిని టీడీపీ ఎంకరేజ్ చేస్తున్నదన్న ఆరోపణ ఉంది.జగన్ ప్రభుత్వ సమయంలో అలాంటివారిపై ఏవైనా చర్య తీసుకోబోతే ఇంకేముంది ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు, వాక్ స్వాతంత్రం, మీడియా స్వాతంత్రం పూర్తిగా పోయాయి అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారితో పాటు ఎల్లో మీడియా వారు ఎన్ని ఆరోపణలు చేసేవారు? బహుశా వారు ఆ సంగతులు మర్చిపోయి ఉండవచ్చు. అరాచక పోస్టులు పెట్టిన ఒక వ్యక్తితో మహానాడులో ప్రసంగమే ఇప్పించారే! అది ఏపాటి మర్యాద అవుతుంది? వైఎస్ జగన్ కుటుంబంపైన, వైఎస్సార్సీపీ నేతల కుటుంబాలపైన, ఆ పార్టీ మహిళా నాయకులపై ఎంత దారుణమైన వ్యాఖ్యలను టీడీపీ మద్దతుదారులు కొందరు ఎలా చేశారో అందరికి తెలుసు. వారిలో కొందరికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. మరికొందరు అంతకన్నా పెద్ద పదవులలోనే ఉన్నారు కదా! బహుశా తమ అనుభవం రీత్యా, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను అణచివేయడమే మార్గంగా భావించినట్లు ఉన్నారు.మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియాపైనే ఎక్కువగా చర్చ జరిపే పరిస్థితి వచ్చిందంటేనే ఈ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు సాధారణంగానే అభ్యంతరకరంగా ఉండే సోషల్ మీడియాపై కేసులు పెడుతుంటారు. కాని వారి బాధ్యత ఈ ప్రభుత్వం వచ్చాక మారిపోయింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్‌గా ఉండే ప్రభుత్వ లోటుపాట్లపైన, వైఫల్యాపైన ప్రశ్నిస్తారో వారందరిపై ఏదో రూపేణా కేసులు పెట్టడమే పోలీసుల విధిగా మారిపోయినట్లుంది. అందుకే ఏకంగా సుమారు 1500 కేసులు సోషల్ మీడియాపై పెట్టారు. ఆ కేసులో 1300 మందిని అరెస్టు చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని సీపీఎం కార్యదర్శి వి. శ్రీనివాసరావు వంటివారు గొంతెత్తి చెబుతున్నారు.రావణ్ అనే యూట్యూబర్‌పై దేశద్రోహ కేసు పెట్టి కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. టీడీపీ మద్దతుదారుగా భావించే మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా రావణ్‌పై ఆ చట్టాన్ని ప్రయోగించడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. వీరెవ్వరిని తప్పుపట్టని చంద్రబాబు ఈ కేసును వైఎస్సార్సీపీకి రుద్దాలని ప్రయత్నించడమే ప్రభుత్వ బలహీనతగా తీసుకోవాలి.ఒకప్పుడు కులమతాలను రెచ్చగొడుతూ టివీలో నిత్యం మాట్లాడే ఒక నాయకుడిమీద ఆనాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెడితే దానిపై ఆ రోజుల్లో తెలుగుదేశం ఇంతెత్తున ఎగిరిపడింది. ఈ రోజుల్లో కూడా రాజద్రోహం ఏమిటి అని ప్రశ్నించింది. కాని తాను అధికారంలోకి రాగానే సోషల్ మీడియాపై దాడి చేయడమే కాదు.. ఒక చిన్న యూట్యూబర్‌పై రాజద్రోహం కేసు పెట్టి కూటమి సర్కార్ తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సంతృప్తిపరచడానికా? లేక సోషల్ మీడియాను భయపెట్టడానికా అన్నది వేరే సంగతి.నిజానికి చంద్రబాబు ప్రభుత్వం దేనిమీద టాస్క్ ఫోర్స్‌లు వేయాలి? టీడీపీ, జనసేనలు కలిసి ఇచ్చిన ఎన్నికల హామీలు ఎన్ని అమలు చేశాం. ఇంకెన్ని చేయాలి? వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఎలాంటి పద్దతి అనుసరించాలి? అన్నవాటి మీద కదా! పెన్షన్ నాలుగువేలు చేయడం, మరికొన్నిటిని అరకొరగా అమలు చేయడం మినహా ఎన్నికల మానిఫెస్టోని తుంగలో తొక్కినట్లుగా వ్యవహరిస్తూ, సోషల్ మీడియాతో ఏదో ప్రమాదం ముంచుకువస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని అరికట్టాలట. ఇది తప్పు కాదు. కాని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎన్ని అబద్దాలు ప్రచారం చేశారో జనానికి తెలియదా?కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీసర్వే చేస్తుంటే, జగన్ ప్రజల భూములు కాజేస్తున్నారని చేసిన ప్రచారాన్ని ఏమంటారు?ఇప్పుడు అదే రీసర్వే తమ ఘనత అని ఎలా చెప్పుకుంటున్నారు? 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని, అందుకు వలంటీర్లు బాద్యులని చెప్పిన సంగతి నిజమా? అబద్దమా? కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అంటూ చంద్రబాబు అచ్చంగా వాటి గురించి పలుమార్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే సీనియర్ నేతలలో ఒకరైన చంద్రబాబు వీటిగురించి పదే, పదే మాట్లాడడం సరైనదేనా. తనకు ఫలానా కులం వారైనా ఓట్లు వేయరా అని అడిగిన వ్యక్తిని పక్కనబెట్టుకున్నదెవరు?ఒక సభలో మాట్లాడుతూ గతంలో శ్రీరాముడి తల తొలగించారని ఆరోపించడం సరైనదేనా? ఆ కేసులో పట్టుబడిన వ్యక్తి టీడీపీ మద్దతుదారు అని అప్పట్లో పోలీసులు వెల్లడించారే. ఆ వ్యక్తికి కూటమి అధికారంలోకి వచ్చాక ఐదు లక్షలు ఇచ్చారని వార్తలు వచ్చాయే! ఆదోనిలో శివాలయంలో ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించుకున్నాడని చంద్రబాబు చెప్పారు. దీనిపై చర్య తీసుకోవలసింది ఎవరు? పైగా అతను జనసేనకు చెందినవాడని వెల్లడైంది కదా! పదే, పదే ఇలాంటి విషయాలను ప్రస్తావించడం సమాజానికి మంచిదా? ఇవన్ని ఎందుకు! ఇతర మతాలను దూషిస్తున్న ఒక వ్యక్తి జోలికి ఎందుకు ప్రభుత్వం వెళ్లడం లేదు? ముఖ్యమంత్రి, లేదా కీలకమైన పదవులలో ఉండి మీ మతం, మా మతం, మీ దేవుడు, మా దేవుడు అంటూ మాట్లాడడం ద్వారా టీడీపీ నేతలు సమాజానికి ఏమి సందేశం ఇవ్వదలిచారు?తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి మతానికి అపచారం చేశారా? మంచి చేశారా? మతం గురించి ఇంతగా బాధపడుతున్నవారు అయోధ్య రామాలయంలో డోనేషన్ల స్కామ్ గురించి ఎందుకు పెదవి విప్పలేకపోతున్నారు. అది మతానికి జరిగిన నష్టం కాదా? కొద్ది రోజుల క్రితం ఒక సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను చెప్పిన విషయంపై సభలో ఉన్న మహిళలు చప్పట్లు కొట్టరా అని బాధపడ్డారు.. ఉచిత బస్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే సదుపాయం కల్పించామని ఆయన తన ప్రసంగంలో చెబుతుంటే ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో ఆయన అసంతృప్తి చెంది తాను మంచి పనిచేస్తే చప్పట్లు కొట్టరా అని అడిగారు. నిజంగా ఫ్రీబస్ స్కీమ్‌పై ఇచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు అమలు చేస్తున్నదేమిటి?తిరుపతి, అన్నవరం ఏ క్షేత్రానికి అయినా, రాష్ట్రంలో ఏమూల నుంచి ఏ మూలకైనా ఏ బస్ అయినా ఎక్కి వెళ్లవచ్చని కూటమి పార్టీలు ప్రచారం చేశాయా? లేదా? ఇప్పుడు అదేమాదిరి అమలు చేస్తున్నారా? లేక పలు షరతులు పెట్టారా? ఆడబిడ్డ నిధి, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీల మాటేమిటి? వలంటీర్లకు ఏమి చెప్పారు. ఆ తర్వాత ఎలా ఎగవేశారు? ఇలాంటివన్ని ప్రజలకు గుర్తున్నాయి కనుకే సభకు వచ్చినవారు చప్పట్లు కొట్టడం లేదేమో అన్న సంగతి చంద్రబాబు, ఇతర కూటమి నేతలు గుర్తిస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విజనరీ కాదు...పక్కా విధ్వంసకారుడు
-
నూర్ ఫాతిమా ఆగ్రహం.. "కొంచమైనా బుద్ధుందా?"
-
చేయని తప్పుకు గుడి మెట్లు కడిగావ్.. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావ్ నీ మొహం?
-
మహిళల భద్రతపైనా అదే హైడ్రామా
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మహిళల జోలికి వస్తే అదే చివరి రోజవుతుందని చెప్పే సీఎం చంద్రబాబు, మహిళల జోలికి రావాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలని పెద్ద పెద్ద మాటలు చెప్పే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మహిళల జోలికి వస్తే ఎంతటివారినైనా ఊరుకోమని చెప్పే హోంమంత్రి అనిత, మహిళా ఎమ్మెల్యేగా ఉన్న గళ్లా మాధవి... గుంటూరు నగరంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి, నీళ్ల కుళాయి విషయంలో తనకు రూ.10 వేల కప్పం కట్టలేదనే అక్కసుతో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేసి తీవ్రంగా కొడుతూ హింసించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో వెలుగులోకి రావడంతోనే... తొలుత విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, మహిళను వివస్త్రను చేసి కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో రావడం, ‘సాక్షి’ బయటపెట్టడంతో రాజకీయ డ్రామాకు తెర తీశారు. ఓపక్క 15న ఘటన జరిగితే, 16వ తేదీన బాధితులు తనను కలిశారని చెబుతున్న వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి.. ఇంత అమానుష ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోలేదు. 17వ తేదీ రాత్రి వరకు ఎందుకు తాత్సారం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజీ ప్రయత్నాలు చేసిన టీడీపీ నేతలు అవి ఫలించకపోవడం, వీడియోలు బయటకు రావడంతో ఇక చేసేదిలేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 15వ తేదీన సంఘటన జరిగితే, 18వ తేదీ వరకు హోంమంత్రి గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ ఈ విషయంపై స్పందించకపోవడం చూస్తుంటే వీరికి మహిళల భద్రత పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఇదేదో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన కాదు. జిల్లా కేంద్రమైన గుంటూరు నడిబొడ్డున ఇంత దారుణం జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? కనీసం హోంమంత్రికి సమాచారం లేదా? ఉన్నా టీడీపీ నేతలు చేసిన దారుణంపై స్పందించేందుకు మనసు రాలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏం చేసినా మనవారైతే ఓకే.. చిన్న చిన్న సంఘటనలకే నిందితులను రోడ్లపై తిప్పడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించడం వంటివి చేసే పోలీసు యంత్రాంగం.. రేంజ్ ఐజీ, జిల్లా ఎస్పీ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న కృష్ణబాబు కాలనీలో ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా కొట్టిన ఘటనకు పాల్పడిన నిందితుల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళను అంత దారుణంగా హింసించిన నిందితులను కనీసం ప్రెస్మీట్లో కూడా చూపించకుండా, దొంగచాటుగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం చూస్తుంటే పక్షపాత వైఖరి తేలుతోంది. ఎంతటి నేరం చేసినా వారు అధికార పారీ్టకి చెందిన వారైతే చాలు పోలీసులు సైతం ప్రత్యేక ప్రేమ చూపుతున్నారనేది స్పష్టమవుతోంది.ఇంత ఆలస్యమా? సంఘటన జరిగి మూడు రోజులు దాటిన తర్వాత మహిళల పట్ల అపార ప్రేమ ఉన్నట్లు, వారి భద్రత విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నట్లు నటించడంలో అధికార పార్టీ నేతలు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి నుంచి సీఎం చంద్రబాబు వరకు మూడు రోజులపాటు నిద్ర నటించి, వీడియోలు బయటకు రాగానే ఉలిక్కిపడి నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. తామేదో ఈ సంఘటనపై సీరియస్‌గా ఉన్నట్లు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. ఇందులో భాగంగా ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కూడా అరెస్టు చేయని పోలీసులు... వీడియోలు బయటకు రాగానే ఏకంగా ఏకంగా జిల్లా ఎస్పీ శనివారం రాత్రి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో కలసి బాధితురాలి ఇంటికి వచ్చ మరీ విచారణ చేయడం గమనార్హం. వీడియోలు బయటకు వచ్చేంత వరకు కనీసం దారుణ ఘటనకు కారకుడైన టీడీపీ నేత, ఆయన బంధువులను అరెస్టు చేయకపోవడం చూస్తుంటే ఈ అమానవీయ ఘటనపై ఏ స్థాయిలో స్పందించారో అర్థమవుతోంది. చివరకు సీఐను వీఆర్‌కు పంపి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వస్తున్నాయి. -
ఇక వెనక్కి తగ్గం.. కచ్చితంగా పోటీ చేస్తాం: నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి భవిష్యత్ సమీకరణాలపై మరోసారి చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ఐక్యతను కొనసాగించడమే లక్ష్యంగా నేతలు తరచూ సమన్వయ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త చర్చకు దారితీశాయి.“అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కోసం నాలుగు అడుగులు వెనక్కి వేశాం.. స్థానిక ఎన్నికల్లో అదే ఫార్ములా ఉండదు. పార్టీ బలం ఉన్న చోట తప్పకుండా పోటీ చేస్తాం” అంటూ మనోహర్ చేసిన వ్యాఖ్యలు జనసేన భవిష్యత్ వ్యూహామా? అనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి.రాష్ట్రంలోని జనసేన నేతలకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. నాయకత్వం బలంగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిని బలోపేతం చేయడమే లక్ష్యంగా నాలుగు అడుగులు వెనక్కి వేశామని.. అదే విధానాన్ని స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని భావిస్తే పొరపాటని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మరింత పెంచుకునేలా ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగిస్తూ ముందుకు సాగాలని సూచించారు.అసెంబ్లీ ఫార్ములా.. స్థానిక ఎన్నికల్లో వద్దు!అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పే ప్రధాన లక్ష్యంగా జనసేన సీట్ల విషయంలో భారీ రాజీకి వెళ్లింది. తక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలం పెంచుకునేందుకు కీలక అవకాశమని జనసేన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని జనసేన చూస్తోంది. అందుకే బలమైన ప్రాంతాల్లో పోటీకి సిద్ధం కావాలనే సంకేతాలను నేతలు ఇస్తున్నారు.పవన్ వ్యూహానికి భిన్నమా?మరోవైపు.. చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ముందుకు సాగాలని.. రాబోయే ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమిలో విభేదాలకు తావు లేకుండా, సమన్వయంతో ముందుకు సాగాలనే వైఖరిని ఆయన ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు కూటమిలో కొత్త చర్చకు కారణమయ్యాయి. ఇది కూటమి నుంచి దూరమయ్యే సంకేతమా? లేదంటే పార్టీ విస్తరణలో భాగమైన వ్యూహాత్మక అడుగులా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.జనసేనలో పెరుగుతున్న ఆశలుఅసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన కేడర్‌లో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వంలో భాగస్వామ్యం రావడంతో పాటు, పార్టీకి కేటాయించిన పదవులు, బాధ్యతలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో స్థానిక స్థాయిలో కూడా తమకు తగిన ప్రాతినిధ్యం దక్కాలని జనసేన నాయకులు కోరుకుంటున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ.. తమ పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందనే భావన జనసేనలో కనిపిస్తోంది.టీడీపీ ఆధిపత్యంపై కేడర్‌లో అసంతృప్తి?కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఆధిపత్యంపై జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే చర్చ సాగుతోంది. తమ పార్టీకి తగిన గుర్తింపు, అవకాశాలు దక్కడం లేదనే భావన కొందరు నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం కేడర్‌ను నొప్పిస్తూ.. కూటమి ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు.వివాదమా.. వ్యూహమా?నాదెండ్ల వ్యాఖ్యలను కూటమిలో విభేదాలుగా చూడాలా? లేక స్థానిక ఎన్నికల్లో పార్టీ బలం పెంచుకునే సహజ రాజకీయ వ్యూహంగా చూడాలా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా నాదెండ్ల వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలకం కానుంది. -
పవన్ చేసిన ఒక్క అవమానం.. కూతురిని రానివ్వక పోవడానికి అసలు కారణం..
-
పవన్‌కు బిగ్ షాకిచ్చిన బొలిశెట్టి సత్యనారాయణ
సాక్షి, విశాఖ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ. గతంలో అమరావతిలో బలవంతపు భూసేకరణను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారని సత్యనారాయణ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే మాటకి పవన్ కల్యాణ్ కట్టుబడి ఉండాలన్నారు. కూటమిలో ఉన్నాము కదా రైతులను ఉరితీసిన పరవాలేదు అనుకుంటే కుదరదు అంటూ హితవు పలికారు.జనసేన బహిష్కృత నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. అమరావతిలో బలవంతపు భూసేకరణపై ప్రజలకు పవన్ కల్యాణ్ వైఖరి చెప్పాలి. గతంలో చంద్రబాబు చేసింది తప్పు అయితే.. నేడు చేసేది కూడా తప్పే అవుతుంది కదా?. గతంలో కంటే నేడు దారుణంగా బలవంతపు భూసేకరణ జరుపుతున్నారు. అమరావతికి 33 వేల ఎకరాలు భూమి సరిపోతుందన్నారు. నేడు లక్ష 75 వేల ఎకరాలు భూమి సేకరిస్తున్నారు. ఈ భూమి అంతా ఎవరి ప్రయోజనాల కోసం? అని ప్రశ్నించారు.🚨అమరావతిలో రాజధాని అంటూ బలవంతపు భూసేకరణ చేస్తే...అక్కడ ఎవరు ఉన్నా...అడ్డుకొని తీరుతాం..!- జనసేన బహిష్కృత నేత బోలిశెట్టి సత్యనారాయణ గారు#APCapital Source: Media and Press Meet of #BolisettySatyanarayana Janasena Ex. Leader pic.twitter.com/4ERTGYjKQJ— UttarandhraNow (@UttarandhraNow) July 16, 2026ఇదే సమయంలో త్వరలోనే బలవంతపు భూసేకరణ పై సమావేశం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే, ఈ సమావేశానికి పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు ఉన్నది చట్టాలను గౌరవించడానికి... అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేస్తే కుదరదు. మొదటి విడత భూసేకరణలో 13వేల ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట రాదని ఎన్జీటీ తీర్పునిచ్చింది. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ జరుపుతున్నారు. రాత్రికి రాత్రి జీవోలు విడుదల చేస్తున్నారు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
అమరావతిలో నీ వాటా ఎంత..? లక్షా 75 వేల ఎకరాల భూసేకరణ ఎవరి కోసం?
-
బాబుకు పవన్ బిగ్ షాక్
-
సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. మరోసారి హోంమంత్రి అనిత శాఖలో పవన్ జోక్యం చేసుకున్నారు. పోక్సో చట్టం అమలుపై ఏపీ సీఎస్, డీజీపీకి పవన్ లేఖ రాశారు. సీఎంకు రాయకుండా సీఎస్, డీజేపీలకు పవన్ లేఖ రాయడం గమనార్హం.మరోవైపు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా పవన్ లేఖ రాశారు. ఏపీలో మాత్రం సీఎంకు కాకుండా అధికారులకు లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేసింది పవన్ లేఖ.తమ పాలనలో మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో విచారణ అలస్యమవుతుందని పవన్ కల్యాణ్ అంగీకరించారు. చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోక్సో కేసుల దర్యాప్తును 60 నుంచి 90 రోజుల్లోగా పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేయాలని పవన్ సూచించారు. ఈ అంశంలో తీసుకున్న చర్యలపై 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. -
రావణ్ ను ఉరితీస్తారా...!? పొన్నవోలు షాకింగ్ కామెంట్స్
-
రావణ్ ఎపిసోడ్.. పరువు పోగొట్టుకున్న బాబు, పవన్!
రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత సామర్థ్యం దేశంలో మరే పార్టీకి ఉండకవచ్చు. రావణ్ అనే యూట్యూబర్‌పై దేశద్రోహం కేసు పెట్టడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అయింది. అంతా ఇదేమి పద్దతి అని నొచ్చుకున్నారు. దీనివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తీరని అప్రతిష్ట వస్తే,ఎపి పోలీసు వ్యవస్థకు కళంకం ఏర్పడిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం పార్టీ వెంటనే వ్యూహం మార్చి వైఎస్సార్సీపీపై బురద చల్లడం ఆరంభించింది. ఎల్లో మీడియాతో పాటు, సోషల్ మీడియాలో తనకు ఉన్న పట్టు మేరకు విపరీతమైన వ్యతిరేక ప్రచారం సాగించింది.అదే టైమ్‌లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో వైఎస్ జగన్‌పైన, వైఎస్సార్సీపీపైన నిందలు వేయడం ఆరంభించారు. రావణ్ అరెస్టు చేశాక జరిగిన పరిణామాలలో జనసేన పరువు పోగొట్టుకుంటే, తీవ్రవాద నిరోధచట్టం కింద కేసులు, దేశద్రోహం కేసులు వంటివి పెట్టి తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. జనసేన క్యాడర్ కొంతమంది అరాచకంగా పోలీస్ స్టేషన్లపై దాడులు చేసినా వారిని అరికట్టలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం కనీసం కేసులు పెట్టలేదు. జనసేన వారిపై కేసులు పెడితే ఎక్కడ పవన్ కళ్యాణ్‌కు, ఆ పార్టీ వారికి కోపం వస్తుందన్న భయం కావచ్చు.జనసేన జనంలో పలచన అయినా ఫర్వాలేదులే అన్న వ్యూహం కావచ్చు. కాని న్యాయ వ్యవస్థ తగురీతిలో స్పందించి రావణ్ కు బెయిల్ ఇచ్చేస్తుండడంతో పవన్‌ను సంతృప్తి పరచడానికిగాను అన్నట్లు తీవ్రమైన నేరారోపణ చేస్తూ రావణ్‌పై కేసులు పెట్టింది. ఈ ఫిర్యాదు చేసింది జనసేనకు చెందిన ఒక స్థానిక నేత అయినా, దానిని ఆమోదించడం ద్వారా టీడీపీ కూడా భాగస్వామి అయినట్లయింది. చంద్రబాబు ఆధ్వర్యంలోనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీతో పాటు, వామపక్షాలు, ఆలోచనాపరులు, విజ్ఞులైనవారంతా స్పందించారు. న్యాయవాది జడ శ్రావణ్ ఇదంతా కుట్ర పూరితంగా చేస్తున్నారని విమర్శించారు.సామాజిక అంశాలపై కూడా స్పందించే నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు రావణ్ అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పలువురు సీనియర్ పాత్రికేయులు, యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న కొంతమంది ప్రభావశీలురు కూడా ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వీడియోలు చేశారు. రావణ్ చేసిన విషయాలలో తప్పు ఉంటే చర్య తీసుకోవద్దని ఎవరూ అనడం లేదు.కాని తప్పుడు కేసులు పెట్టడం, అది కూడా ఏకపక్షంగా చేయడంపైనే అంతా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ గతంలో నక్సల్సిజంకు సంబంధించి చేసిన అనుకూల ప్రకటనల వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.దీంతో రావణ్ విషయంలో తప్పుడు కేసు పెట్టిన విషయం జనం అందరికి తెలిసిపోయిందన్న ఆందోళనతో చంద్రబాబు సర్కార్ వ్యూహాత్మక ఎదురుదాడి చేయడం ఆరంభించింది. రావణ్ దేశద్రోహి అని, సమాజ విధ్వంసకుడు అని, హిందూ మత వ్యతిరేకి అని ఇలా పలు ఆరోపణలు సంధిస్తూ ప్రచారం చేయడానికి టీడీపీ, జనసేనలు యత్నించాయి. వారికి బీజేపీ కూడా జత కలిసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ పైన, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైన పలు విమర్శలు చేస్తూ టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టారు. చివరకు చంద్రబాబు కూడా ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. రావణ్‌కు జగన్ మద్దతు ఇస్తారా అంటూ టీడీపీ గంభీరంగా మాట్లాడే యత్నం చేసి దొరికిపోయిందని చెప్పాలి. నిజానికి రావణ్ ఎప్పుడూ వైఎస్సార్సీపీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఒకప్పుడు వపన్ కళ్యాణ్ అభిమాని.ఆ విషయం ఆయనే పలుమార్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై వ్యతిరేక వీడియోలు చేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పలు విమర్శలతో వీడియోలు చేసిన వ్యక్తి రావణ్. అయినా రావణ్‌పై కూటమి సర్కార్ తీవ్రమైన కేసులు పెట్టడం మీద జగన్ మానవత్వంతో స్పందించారు. తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కులాలు, మతాలకు అతీతంగా ఆయన వ్యవహరిస్తే సమాజ విధ్వంసకుడు రావణ్‌ను సమర్థిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.అయితే అదే టైమ్‌లో వామ పక్షాలు కూడా రావణ్‌పై ఉపా కేసులు పెట్టడంపై మండిపడ్డాయి. వారి జోలికి మాత్రం టీడీపీ, జనసేనలు వెళ్లలేదు. సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ చాలా ఘాటుగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇది తప్పుడు కేసు అని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీడీపీ మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్‌పై కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెట్టిందని ఆయన తెలిపారు. రావణ్‌పై పెట్టిన కేసులకు ఆధారంగా అక్కడక్కడ, ఆయా సందర్భాలలో మాట్లాడిన మాటలను కట్ చేసి, ముక్కలు, ముక్కలు అతికించి వీడియోల రూపంలో పోలీసులు పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఇతర మతాలను దారుణంగా అవమానించే రీతిలో మాట్లాడితే దానికి జవాబు ఇచ్చారే కాని రావణ్ స్వయంగా మతాలను దూషించలేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో ఏపీ పోలీసుల దుశ్చర్య ప్రజలకు మరింత స్పష్టంగా తెలిసింది. మరి ఏబీ వెంకటేశ్వరరావుపై ఎందుకు టీడీపీ విమర్శలు చేయలేకపోయింది. ఆయన అడిగినవాటికి ఎందుకు జవాబులు ఇవ్వడం లేదు. ఇప్పటికే సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగవ్వ, తదితర కేసులలో పోలీసులపై మచ్చపడింది. దానికితోడు రావణ్ పై తప్పుడు కేసు పెట్టారని ఒక రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించడంతో అటు చంద్రబాబు, పవన్‌లకు, ఇటు పోలీసు అధికారులకు బాగా డామేజీ అయిందని చెప్పాలి.చిత్రమేమిటంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్సార్సీపీకి చెందిన ఒక నేత పార్టీపై అసమ్మతితో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా రోజూ మాట్లాడుతుంటే వైఎస్ జగన్ ప్రభుత్వంపై దారుణమైన ఆరోపణలు చేస్తుండేవారు. దానిని ఎల్లో మీడియా లైవ్ కవరేజీ ఇచ్చి అదేదో పండగ మాదిరి సంబర పడేది. అంతే తప్ప ఆయన సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారని ఎక్కడా రాయలేదు.రాజద్రోహం కేసు పెట్టి ఆయనను అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీ నానా రచ్చ చేసింది. ఇప్పుడేమో అదే రాజద్రోహం కేసును రావణ్‌పై బనాయిస్తోంది. దాస్ అనే వ్యక్తి చేస్తున్న దారుణ ప్రసంగాలపై చర్య తీసుకుని ఉంటే కూటమి ఇప్పుడేమి చెప్పినా అర్థం ఉండేది. పవన్ కళ్యాణ్ తాను గతంలో నక్సలిజానికి, చెగువేరాకు ఎందుకు మద్దతు ఇచ్చింది చెప్పి తప్పు చేశానని ప్రకటించి ఉంటే ఆయనలో నైతికత ఉందన్న అభిప్రాయం కలిగేదన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏబీ వెంకటేశ్వరరావు చెప్పిన అంశాలకు ఏపీ పోలీసులు సమాధానం ఇస్తారా? ఆయనపై కూడా టీడీపీ దాడి చేస్తుందా? టీడీపీ, జనసేనలు ఈ అంశంపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే వారే సెల్ప్ గోల్ వేసుకున్నట్లవుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కబ్జాదారులకు ఎమ్మెల్యే అండ?.. జనసేనలో రచ్చ రచ్చ!
డాబాగార్డెన్స్: విశాఖ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేపై మాజీ కార్పొరేటర్ సంచలన ఆరోపణలు చేయడం జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. కబ్జాదారులకు మద్దతుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణకు సిఫార్సు లేఖ రాశారని ఆ పార్టీ నేత పీతల మూర్తి యాదవ్ బాంబ్ పేల్చారు. నగరంలో సుమారు రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ, జీవీఎంసీ ఆస్తులను కబ్జాదారులకు కట్టబెట్టేందుకు కొందరు అధికారులు తప్పుడు నివేదికలతో ఫైళ్లు కదుపుతుంటే, వారికి మద్దతుగా ఎమ్మెల్యే లేఖలు రాసినట్లు బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. సోమవారం జీవీఎంసీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో మూర్తియాదవ్ ఈ వ్యవహారంపై అధికారులకు వినతిపత్రం అందించి, సొంత పార్టీ ఎమ్మెల్యే తీరును ఎండగట్టడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారుల కన్ను విశాఖలో కొందరు అవినీతి అధికారుల స్వార్థం వల్ల విలువైన ప్రభుత్వ స్థలాలు ప్రైవేటుపరం అయిపోతున్నాయని మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆస్తులుగా ఉన్న స్థలాలను కాజేసేందుకు ప్రయతి్నస్తున్న ప్రైవేటు వ్యక్తులకు స్వయంగా కూటమి ప్రజాప్రతినిధి వత్తాసు పలుకుతూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులో దశాబ్దాలుగా జీవీఎంసీ వినియోగంలో ఉన్న సర్వే నెంబరు 6/2 లోని ఎకరా 25 సెంట్ల విలువైన స్థలంపై ప్రైవేటు వ్యక్తుల కన్ను పడిందని, వేలాది మందికి నీరందించే ఓవర్ హెడ్ ట్యాంకులు, కార్యాలయం, సులభ్ కాంప్లెక్స్ ఉన్న ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర నియోజకవర్గ పరిధిలోని ఈ స్థలం తన సన్నిహితురాలైన ఎన్.వల్లికి చెందినదని, ఆమెకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ నెల 9న మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణకు లేఖ రాయడంపై మూర్తియాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులను కాదని సిఫార్సులు ఇదే తరహాలో విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈస్ట్ పాయింట్ కాలనీలో కోర్టు కేసుల్లో గెలిచి జీవీఎంసీ దక్కించుకున్న వాల్తేర్ వార్డు టౌన్ సర్వే నెంబరు 124, 125/2 లోని 3,660 చదరపు గజాల పార్కు స్థలాన్ని సైతం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే ప్రయతి్నస్తున్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు. అక్కడ లెండి వనం, బాబా చావిడి పార్కులు ఉన్నాయని, గతంలో ఈ స్థలం జీవీఎంసీదేనని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, సదరు స్థలం తనకు తెలిసిన విజయలక్ష్మికి చెందినదంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ మంత్రికి మరో లేఖ రాయడం గమనార్హమన్నారు. ఆ కుటుంబం అమెరికా, జైపూర్‌లో సెటిల్ అయిందని, మానవతా దృక్పథంతో ఆ స్థలాన్ని వారికి అప్పగించడమో లేదా నష్టపరిహారం ఇవ్వడమో చేయాలని ఎమ్మెల్యే కోరడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలి ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా ఉద్యానవనాలను కాపాడాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదే పదే పిలుపునిస్తున్నప్పటికీ, సొంత పార్టీ ఎమ్మెల్యే దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటే స్థానిక ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటాన్ని కూడా మూర్తి యాదవ్ తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణమే జోక్యం చేసుకుని, ఎమ్మెల్యేల వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు అడ్డుకట్ట వేసి, రూ.150 కోట్ల విలువైన జీవీఎంసీ స్థలాలను, పార్కులను కబ్జాదారుల బారి నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడిపైనే మాజీ కార్పొరేటర్ ఈ స్థాయిలో బహిరంగంగా తిరుగుబావుటా ఎగరేయడం.. జన సేన పారీ్టలో రేగుతున్న అంతర్గత ముఠా తగాదాలను తేటతెల్లం చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే సొంత పార్టీ నేతల మధ్యే రూ.150 కోట్ల భూవివాదంపై ఇంతటి తీవ్రస్థాయిలో రచ్చకెక్కడం జిల్లా జనసేన శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. -
నేను మౌనంగా లేను, ఇది ఆరంభం మాత్రమే.. ప్రకాష్ రాజ్ సంచలన వీడియో
-
ప్రశ్న రావణ్ స్ఫూర్తి పవన్ కళ్యాణ్ ఫస్ట్ అరెస్ట్ చెయ్యాల్సింది పవన్ కళ్యాణ్‌నే
-
సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల సంతాపం
ఎస్. జానకి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తపరిచారు. మధురమైన అమృత గాత్రంతో తరతరాలుగా శ్రోతలను అలరించారు జానకమ్మగారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – రజనీకాంత్ఆమె పాడిన పాటలు ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి... కానీ ఆ ప్రేమను నేను ఎక్కడ వెతకాలమ్మా... భరించలేని దుఃఖంలో చాలామంది ఉన్నారు. వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. – కమల్‌హాసన్ జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనక జానకమ్మగారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ ఆ రోజులు, ఆ జ్ఞాపకాలు, మళ్లీ కళ్ల ముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మగారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. – చిరంజీవిగాన కోకిల, లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్. జానకమ్మగారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాదిమంది సంగీతాభిమానులను అలరించిన జానకమ్మగారు ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి చిత్రాలతో పాటు... నా చిత్రాలలోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాదరణ ΄÷ందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు దశాబ్దాల అనుబంధం ఉంది. తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేసిన జానకమ్మగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. – బాలకృష్ణ ప్రఖ్యాత గాయని శ్రీమతి ఎస్. జానకిగారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు గాయనీమణుల్లో ఒక ఆణిముత్యం లాంటివారు జానకిగారు. ఆమె గాత్రం ఎంతో మధురమైనది. ‘నిరీక్షణ, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, స్వాతి ముత్యం, జగదేక వీరుడు అతిలోకసుందరి, ప్రతిఘటన, అంతఃపురం’ లాంటి చిత్రాల్లో జానకిగారు పాడిన గీతాలను తెలుగు వారు ఎప్పటికీ మరచిపోరు. – పవన్ కల్యాణ్ -
ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కేసులు పెట్టిన YSRCP కార్యకర్త అనేవాడు తగ్గడు
-
పవన్‌కు ముంబైలో సర్జరీ పూర్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శనివారం ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. కుడి భుజానికి (రొటేటర్ కఫ్) జరిగిన ఈ సర్జరీ సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్య బృందం తెలిపింది.ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో పవన్ కల్యాణ్ రెండు భుజాల కండరాలు (రొటేటర్ కఫ్) తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కండరాలు పూర్తిగా చిట్లిపోవడంతో శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. అయితే రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, తొలిదశలో కుడి భుజానికే శస్త్రచికిత్స నిర్వహించారు. మరో భుజానికి దాదాపు రెండు నెలల తర్వాత మరో సర్జరీ చేయనున్నట్లు సమాచారం.పవన్ కల్యాణ్‌కు ఈ గాయాలు ఒక్కసారిగా ఏర్పడినవి కావని తెలుస్తోంది. దబాంగ్ రీమేక్ 'గబ్బర్ సింగ్' సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు భుజానికి గాయమైంది. అనంతరం 2019లో రాయలసీమ పర్యటనలో, ఎన్నికల టైంలో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా కూడా భుజాలపై ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకునే ముందు నిర్వహించిన సమగ్ర వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్ కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ఫిజియోథెరపీతో పాటు పునరావాస చికిత్స కొనసాగనుంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.@PawanKalyan— N Chandrababu Naidu (@ncbn) July 11, 2026 -
నువ్వు డిప్యూటీ సీఎం అయితే ఏంటి..? ముందు నిన్ను జైల్లో పెట్టాలి..!
-
ఫస్ట్ పవన్ పై కేసు పెట్టాలి.. రావణ్ UAPA కేసుపై CPI నారాయణ షాకింగ్ కామెంట్స్
-
కేబినెట్ మీటింగ్ కు డిప్యూటీ సీఎం డుమ్మా... పాపం భుజాలు నొప్పంటగా..
-
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకు అనర్హుడు..! ప్రశ్న రావణ్ పై పెట్టిన కేసు నిలవదు
-
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే: అంబటి
సాక్షి, తాడేపల్లి: పోర్టులు, భూములను తమ వారికి కట్టబెట్టటానికే చంద్రబాబు కేబినెట్ సమావేశమంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదుగురు మంత్రులు గైర్హాజరయ్యారంటే ఎంత నాన్ సీరియస్‌గా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేబినెట్ సమావేశంలో ప్రజలకు మేలు చేసే అంశాలపై చర్చించటం మానేశారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘కేబినెట్‌కి డీజీపీ వెళ్లి సోషల్ మీడియా కట్టడిపై మాట్లాడటం ఏంటి?. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో మా పార్టీ నేతలను తిట్టిస్తున్నారు. జుగుప్సాకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు. కానీ మావారిపై అక్రమ కేసులు పెట్టి 1,394 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా అంటే చంద్రబాబు భయపడిపోతున్నారు. అందుకే టాస్క్ ఫోర్స్ కూడా పెడుతున్నారు. గాదె సాయికృష్ణను దారుణంగా లాకప్ డెత్ చేస్తే ఈ డీజీపీ ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?. ఇలాంటి వాటిపై కేబినెట్లో చర్చించరా?. ఉండవల్లిలో పోలీసు కానిస్టేబుల్ తల పగలకొట్టిన టీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసు పెట్టలేదు?. ఉత్తుత్తి కేబినెట్లు కాకుండా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ కేబినెట్‌కి ఎందుకు రావటం లేదు?. ఆ కారణాలు ఏంటో సీఎం, డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి.’’ అని అంబటి నిలదీశారు.‘‘రావణ్‌కు అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తోందని ఉపా చట్టం ప్రయోగించారు. రావణ్ టీమ్‌లోని ఒక మహిళ జగన్‌ని కలిసి న్యాయ సహాయం కావాలని కోరారు. వైఎస్ జగన్ సరే అన్నారు.. అంతే తప్ప రావణ్‌కు మాకు ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ కార్యకర్తలు అడిగినా న్యాయ సహాయం చేస్తాం. తీవ్ర వాదుల మీద పెట్టాల్సిన చట్టాన్ని అమాయకులపై పెట్టటం ఏంటి?. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
పవన్ మాటలే కదా రావణి చెప్పింది నీలాగా చెప్పు చూపించలేదు కదా!
-
నేను ప్రశ్న రావణి కేసును వాదించడానికి ఎందుకు వచ్చానంటే...?
-
ఎందుకు మీకా పదవులు... చంద్రబాబు, పవన్ పై అంగన్వాడీల ఆగ్రహం
-
ఖాళీ కుర్చీలతో చంద్రబాబు కేబినెట్ సమావేశం!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీకి కొందరు మంత్రులు గైర్హాజరయ్యారు. దీంతో కీలక సమావేశంలో పలువురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని కుర్చీలు ఖాళీగా కనిపించాయి.ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి మరోసారి హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో ఆయన ముంబై వెళ్లనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. గత రెండు కేబినెట్ సమావేశాల్లోనూ నడుం నొప్పి, ఇతరత్ర కారణాలతో పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆ కారణంతోనే ఆయన సమావేశానికి రాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఇక మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. మంత్రి టీజీ భరత్ ఏమో అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మంత్రులంతా విదేశీ పర్యటనలు చేయొద్దని చంద్రబాబు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు వ్యక్తిగత కారణాలతో(బెంగళూరు పర్యటనలో ఉన్నట్లు సమాచారం) హాజరు కాలేదు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుపతికి కేంద్రమంత్రి రాక సందర్భంగా ప్రొటోకాల్ విధుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరు కూడా హాజరు కాలేదని తెలుస్తున్నా.. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయా కారణాలతోనే మంత్రులు గైర్హాజరయ్యారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు దాదాపుగా లేకున్నా.. మీటింగ్‌ను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉన్నా.. చంద్రబాబు పంక్చువాలిటీ పేరిట మంత్రివర్గ భేటీ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
రావణ్‌పై మరో కుట్ర.. ‘ప్రశ్న’పై సర్కార్ చర్యలు
సాక్షి, కాకినాడ: ప్రశ్న రావణ్‌పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రావణ్‌పై ఇప్పటికే ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా రావణ్ నిర్వహిస్తున్న ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు పోలీసులు లేఖ రాశారు.వివరాల మేరకు.. యూట్యూబర్ రావణ్ బ్యాంక్ ఖాతాలను సర్పవరం పోలీసులు ఫ్రీజ్ చేయించారు. అలాగే ఆయన నిర్వహిస్తున్న ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు పోలీసులు లేఖ రాశారు. రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాస్పద కంటెంట్ ప్రసారం చేస్తూ ప్రతి నెల సుమారు రూ.1.50 లక్షల ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ ఆదాయం వివరాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.వివాదాస్పద వీడియోలను తొలగించాలని, ఛానల్‌ను నిలిపివేయాలని పోలీసులు మెటా సంస్థను కోరారు. దీనిపై స్పందించిన మెటా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తామని, అయితే మొత్తం ఛానల్‌ను పూర్తిగా నిలిపివేయడం తమ పరిధిలో లేదని పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం.అయితే, ఈ వ్యవహారం 2025లో పిఠాపురం నియోజకవర్గం యండమూరు గ్రామంలో దళిత విద్యార్థుల సామాజిక బహిష్కరణ ఆరోపణల ఘటన నేపథ్యంలో మొదలైనట్లు తెలుస్తోంది. ఆ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఖరిని ప్రశ్నిస్తూ రావణ్ వీడియోలు చేసినట్లు సమాచారం. అప్పట్లో రావణ్‌పై పిఠాపురం జనసేన ఫైవ్‌మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో జూలై 2న రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ప్రస్తుతం రావణ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా కంటెంట్‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
బాబు, పవన్ ఒక్కసారి ఈ రోడ్లని చూడండి
-
దమ్ముంటే రా తేల్చుకుందాం రఘురామకు జడ శ్రవణ్ సవాల్
-
నేను కూడా పవన్ పై కేసు వేస్తున్న.. 2029 తరువాత చట్టం మారితే మీ బ్రతుకులు
-
పవన్ కళ్యాణ్ ఇంత దిగజారుడా! నిప్పులు చెరిగిన CPM నేత
-
బాబును నమ్ముకుంటే జనసేన మునిగినట్టే!: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని మరోసారి స్పందించారు. ఈ కేసుతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించిన ఆయన.. టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమ్మ కులానికి చెందిన రావణ్‌ను.. ఐడెంటిటీ మార్చి దళితుడిగా.. క్రిస్టియన్‌గా చూపించేందుకు టీడీపీ మీడియా, సోషల్ మీడియా తీవ్రంగా ప్రయత్నించిందటూ సంచలన వ్యాఖ్యలే చేశారాయన.రావణ్ పేరు రావణ్.. జోసఫ్ కాదు. అతను క్రిస్టియన్ కాదు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా అతడి ఐడెంటిటీని టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా మార్చేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్‌గా చూపించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించాయి అని అన్నారు. అరెస్ట్, బెయిల్‌పై ప్రశ్నలురావణ్ అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సెక్షన్లు చదివారు. అయితే జనసేన కార్యకర్తలు పెట్టిన కేసుల్లో బెయిల్ రావడానికి ఎవరు సహకరించారో చెప్పాలి. “జగన్ గానీ, మేము గానీ ఎవరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పలేదు. చంద్రబాబు పాత్ర లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ ఇకనైనా స్టోరీలు ఆపాలని.. ఈ బురద మాపై జల్లవద్దని నాని హితవు పలికారు.అతని వీడియోలే అన్నీ చెబుతాయిరావణ్ గత వీడియోలను పరిశీలిస్తే అతను ఎవరికీ అనుకూలంగా ఉన్నారో అర్థమవుతుందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు చేసే టీడీపీ ప్రభుత్వం.. రావణ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కొడాలి నాని ప్రశ్నించారు. “మావోయిస్టులకు మద్దతుగా పోస్ట్ పెట్టారని ఏడాది తర్వాత కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటి? ఇంతకాలం గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? టీడీపీ మద్దతు లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అంటూ పశ్నలు గుప్పించారు.జనసేనపై వ్యాఖ్యలుచంద్రబాబును నమ్ముకుంటే జనసేన మునిగిపోతుందని.. రావణ్ వ్యవహారమే అందుకు ఉదాహరణ అని అన్నారు.“పిఠాపురం పోలీస్ స్టేషన్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లడం లేదు. బిగ్‌బాస్ ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, డమ్మీ సీఎం పరిస్థితి ఇదే. యాక్టింగ్ సీఎం లోకేష్ మాటలే చెల్లుబాటు అవుతాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మతాల మధ్య చిచ్చు పెట్టొద్దుహిందూ, క్రిస్టియన్ వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయని కొడాలి నాని అన్నారు. ఒకే కుటుంబంలో రెండు మతాలకు చెందిన వారు ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చెప్పారు.ఆ మాటకు కట్టుబడి ఉన్నా2029 ఎన్నికల్లో పరుశురాముడి గొడ్డలితో జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీడీపీని రాజకీయంగా సమాధి చేస్తామని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఇచ్చే కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాని తుప్పు గొడ్డలి మాకు అవసరం లేదు అంటూ కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
రావణ్ పై దేశద్రోహం.. పవన్ చెప్పు చూపించిన రోజే!
-
శ్రీకాకుళం జనసేనకు బిగ్ షాక్.. YSRCPలోకి పవన్ వీరాభిమాని
-
చంద్రబాబు చెప్పాడా.. రిపోర్టర్ ప్రశ్నకు పెద్ది రెడ్డి అదిపోయే కౌంటర్
-
‘ప్రశ్న’కు పవన్ భయపడుతున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతోంది? సోషల్ మీడియాను అణచివేయాలన్న ఆలోచనతో టీడీపీ, జనసేన కూటమి నేతలు అనుసరిస్తున్న పద్దతులు ప్రమాదకరంగా మారుతున్నాయి. యూ ట్యూబర్ రావణ్ అనే ఆయనపై ఏకంగా దేశద్రోహం కేసు పెట్టిన తీరు సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. నిజంగా ఆయన అలాంటి తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు.కాని ఒక ప్రసంగంలో ఏదో మాట్లాడాడని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆయన పదే, పదే నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఉద్దేశంతో కేసు పెట్టడం, ఆ వెంటనే అరెస్టు చేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం, అవి అంతగా ఫలించకపోవడంతో ఏకంగా దేశద్రోహం కేసులో జైలుకు పంపించడం అంత సమంజసం అనిపించదు.రావణ్ చేసే వ్యాఖ్యలలో అభ్యంతరకర విషయాలు ఉంటే ఎవరూ సమర్ధించరు. కాని అదే టైమ్‌లో ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరించడం శోచనీయం. దళిత క్రైస్తవుల డిమాండ్లకు సంబంధించి ఏలూరులో జరిగిన సభలో ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు. పవన్ కళ్యాణ్ గతంలో ఆయా సందర్భాలలో చేసిన ఆవేశపూరిత ప్రకటనలను ఉటంకిస్తూ అదే తరహాలో మాట్లాడారు. పిఠాపురంలో జరిగిన ఒక కుల వివాదాన్ని ఆయన గట్టిగా ప్రస్తావించారు. అది పవన్‌కు కోపం తెప్పించి ఉండవచ్చు. ఆ వెంటనే జనసేన కార్యకర్తలను పురమాయించి కేసులు పెట్టించారు.రావణ్‌ను ముందుగా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ కోర్టువారు బెయిల్ ఇవ్వగానే సర్పవరం, మచిలీపట్నం, నక్కపల్లి పోలీసులు అరెస్టు చేయడం సంబంధిత కోర్టులు ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగాయి. పాయకరావు పేట నుంచి ఆయన బయల్దేరి వస్తుండగా, మళ్లీ పోలీసులు అరెస్టు చేసి ఈసారి కృష్ణా జిల్లా గన్నవరం తీసుకువచ్చారు. ఏకంగా దేశద్రోహం కేసుపెట్టారు. ఉగ్రవాదులపై పెట్టే సెక్షన్లు పెట్టారు. తద్వారా కోర్టు రిమాండ్ అంటే జైలుకు పంపించేలా చేశారు. ఈ ఘటనలన్నిటిని చూసినవారికి ఏమనిపిస్తుంది.రావణ్‌ను జైలులో ఎలాగైనా పెట్టాల్సిందేనని, పవన్ కళ్యాణ్, ఆయన పార్టీవారు కోరుకున్నారని, ఆ కక్ష తీర్చుకోవడానికి, అహం చల్లబరచుకోవడానికి ఇలా చేశారని అనిపించదా? మొదటే దేశద్రోహం కేసు పెట్ట లేదు. ఐదు రోజుల పాటు నిద్రహారాలు సరిగా లేకుండా అతనిని తిప్పిన తీరు కూడా దారుణంగా ఉంది. ఇక్కడ చిత్రమేమిటంటే శాంతిభద్రతల గురించి, దాడుల గురించి పదే పదే సుద్దులు చెప్పి ప్రభుత్వ పెద్దలు ఈ పోలీస్ స్టేషన్ల వద్ద జరిగిన గొడవను మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. జనసేన కార్యకర్తలు ఆయా స్టేషన్ల వద్ద నానా రచ్చ చేశారు.కొన్నిచోట్ల పోలీసులను కింద పడేశారు. గోడలు దూకి స్టేషన్లోకి వెళ్లి రావణ్‌ను కొట్టడానికి యత్నించారు. మరి ఇవేవి తప్పు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? వారిపై ఏమైనా కేసులు పెట్టారా? పెట్టి ఉంటే అవి ఏ తరహావో చెప్పాలి కదా!ఒక్కరినైనా ఎందుకు అరెస్టు చేయలేదు? అంటే టీడీపీ, జనసేనలకు చెందినవారు ఎలాంటి రౌడీయిజం చేసినా, అరాచకాలకు పాల్పడినా పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితి లేదని చెప్పదలిచారా? గత కొన్నాళ్లుగా దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ సహనం, సంయమనం లేకుండా కక్ష కట్టి ఒక యూట్యూబర్ పై ఈ రకమైన కేసులు పెట్టించడం పిచుకపై బ్రహ్మాస్త్రం వేసినట్లు అనిపించదా?ఈయన చేసిన విధంగా గతంలో పవన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదా అంటే పలుమార్లు ఆ తరహాలో మాట్లాడిన వీడియోలు అనేకం కనిపిస్తాయి. ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన తాను నక్సలైట్ అవ్వాలనుకున్నానని, తుపాకి పట్టుకోవడం గురంచి మాట్లాడారు. బీజేపీతో కలిసి లేనప్పుడు యుద్ధాల గురించి ఆయన ఏమి మాట్లాడారో కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. రావణ్ ఒక స్పీచ్‌లో ఏదేదో మాట్లాడారని, దానితో దేశ సమగ్రతకు భంగం కలిగించే పనులు చేసినట్లు, వివిధ వర్గాల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు.నిజానికి మతపరమైన, కులపరమైన విద్వేష వ్యాఖ్యలు చేసిన కొందరు నేతలు ప్రస్తుతం కూటమిలో ప్రముఖులుగా ఉన్నారు. అవన్ని ఎందుకు!ఒకప్పుడు టీడీపీ వారు దేశ ప్రధానిని ఎంతలేసి మాటలు అన్నారో అందరికి తెలుసు కదా! అవేవి తప్పుకాదా?వారికి ఏమీ కాలేదే! వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రావణ్ అప్పటి ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగానే విమర్శించేవారు. అయినా అప్పుడు కేసులు రాలేదు. రావణ్‌పై ఇంత తీవ్రమైన కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని వైఎస్ జగన్ ఖండించారు.రావణ్‌కు మద్దతుగా జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ఆయా కోర్టులలో వాదనలు చేశారు. దేశ ద్రోహం కేసు పెట్టడానికిగాను వీడియోలను మార్ఫింగ్ చేశారని రావణ్ భార్య అనూష ఆరోపించారు. ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతే తమ కుటుంబాన్ని చంపేయండని ఆమె ఆవేదనతో వ్యాఖ్యానించారు. రావణ్ నిజంగా దేశ ద్రోహానికి పాల్పడ్డారా? లేదా? అన్నది పోలీసులు ఎలా నిర్థారించుకున్నారో తెలియదు. జనసేన స్థానిక నాయకుడు ఒకరు కేసుపెట్టడం, వెంటనే పోలీసులు రంగంలో దిగిపోవడం జరిగింది.పోలీసులు అనుసరిస్తున్న తీరు మొత్తం పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట తెస్తుంది. అధికారంలో ఉన్నవారు చెప్పినా అది నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా? అన్నది తేల్చుకుని ఆ తర్వాత కేసు పెడితే బాగుంటుంది. రావణ్ అరెస్టు వల్ల ఆయనకు జరిగిన నష్టం ఎంతో చెప్పలేం కాని, పవన్ కళ్యాణ్ కైతే నైతికంగా చాలా అప్రతిష్ట వచ్చే పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం ఉంది. తనకు వ్యతిరేకంగా ఎవరైనా పన్నిన ట్రాప్ లో పవన్ పడి, ఇలాంటి అరెస్టులు చేయిస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పిన ఆయన, తన ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరో ఘటనలో కూడా పవన్‌కు నష్టమే జరిగింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆయన తప్పు చేసిన పోలీసు అధికారికి మద్దతు ఇచ్చిన తీరు తీవ్ర విమర్శలకు గురైది. సాయికృష్ణను రౌడీషీటర్ అని, పోక్సో కేసులో నిందితుడని, క్రిమినల్ అని పవన్ చెప్పడాన్ని ప్రజాస్వామికవాదులు ఆక్షేపిస్తున్నారు. ఎవరినైనా చంపే హక్కు పోలీసులకు ఉందని పవన్ భావిస్తున్నారా? అది ఏ రకంగా చట్ట సమ్మతం అని ప్రశ్నిస్తున్నారు.పవన్ వ్యాఖ్యలను సాయికృష్ణ తల్లి తీవ్రంగా ఖండించారు. తన కుమారుడిపై ఫోక్సో కేసును కోర్టు కొట్టివేసిందని, ఆ యువతి కూడా అలాంటిది జరగలేదని చెప్పినా ఇలా మాట్లాడడం న్యాయమా అని ఆమె అడిగింది. సాయికృష్ణ కూడా పవన్ అభమాని అని, తామంతా ఆయనకే ఓట్లు వేశామని, కాపులు ఆయనకు మద్దతు ఇచ్చినందుకు ఇలా అంటున్నారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పవన్ కాని, జనసేన పార్టీ కాని జవాబు ఇవ్వలేకపోయారు.ఈ రెండు ఘటనలలో టీడీపీ వ్యూహాత్మకంగా చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తూ పవన్‌ను వివాదంలో దించిందా అన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. క్రాంతికుమార్ అనే యువకుడు కూడా పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కూడా ప్రభుత్వం సకాలంలో చర్య తీసుకోలేదు. క్రాంతి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ వెళ్లాకే కదలిక వచ్చింది. విశేషం ఏమిటంటే క్రాంతి తండ్రి టీడీపీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి. అయినా పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు.తెలంగాణకు చెందిన జర్నలిస్టు కేవీఆర్‌ను కూడా కక్ష పూరితంగా అరెస్టు చేసి, ఎక్కడో మారుమూల ఉన్న బొబ్బిలి జైలులో పెట్టారు. అది చాలదన్నట్లుగా తమకు విధులకు అడ్డుపడ్డారని చెప్పిన ఆయన భార్యపై కూడా కేసు పెట్టారు. తన పట్ల ఏపీ పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఆమె కేసు పెట్టడంతో పోటీగా ఈ కేసు పెట్టారనుకోవాలి. జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్లపై దాడి చేసినా కేసులు లేవు. ఇవన్ని చూస్తుంటే ఏపీలో సోషల్ మీడియాను అణచివేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాపై సుమారు 1400 కేసులు పెట్టి దేశంలోనే ఒక రికార్డు సృష్టించుకుంది. ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు దిగితే చంద్రబాబు ప్రభుత్వం మరింత అప్రతిష్టపాలవుతుందని చెప్పక తప్పదు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మీ వీడియోలు బయట పెట్టమంటారా.. పవన్ కు మాస్ వార్నింగ్..
-
ఏవండో కానిస్టేబుల్ కొడుకు గారు.. గొంతు చించుకుని అరిచావ్ ఇప్పుడు మాట్లాడవే..
-
రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టడమేంటి.. పవన్‌కు రాచమల్లు వార్నింగ్
-
ఆ తల్లిలా నేను కూడా పవన్ పై కేసు వేస్తా.. ప్రశ్న రావణ్ పై దేశద్రోహం కేసు
-
కూటమి సర్కార్‌పై ప్రకాష్‌రాజ్ మరో ట్వీట్
సాక్షి, అమరావతి: కూటమి సర్కార్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ప్రతీకార రాజకీయాలు ఆపాలన్న ప్రకాష్‌రాజ్.. ‘‘మాపై రుద్దబడుతున్న ఈ కఠినమైన ఉపా చట్టాన్ని తొలగించండి అంటూ ట్వీట్ చేశారు.కాగా, యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకాష్‌రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్ వేదికగా టీడీపీ కూటమి ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. ‘ఉపా చట్టం కింద ఓ యూట్యూబర్‌ను రిమాండ్‌కు పంపుతారా? ప్రశ్నించడం ఏమైనా దేశద్రోహమా?’ అంటూ నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ‘ఇంకా ఇంకా దిగజారండి..’ అంటూ ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.మరో వైపు, విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కూటమి నేతల తీరును ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే అందరి వెనుక వైఎస్సార్సీపీ ఉందంటారా? రేపొద్దున కూటమి పార్టీల మధ్య విభేదాలొస్తే దాని వెనుక కూడా వైఎస్సార్సీపీ ఉందని ఆరోపిస్తారా?’ అంటూ ఆయన మండిపడ్డారు.ఏపీలో ప్రభుత్వ నిర్ణయాలపై లేదా అధికార కూటమిపై విమర్శలు వినిపించిన ప్రతిసారీ వాటివెనుక వైఎస్సార్సీపీ ఉందని ఆరోపించడం కూటమి నేతలకు అలవాటైపోయింది. సామాజిక కార్యకర్తలు, మేధావులు, సినీ ప్రముఖులు లేదా సాధారణ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, వారిని ప్రతిపక్షంతో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా సినీ నటుడు ప్రకాష్‌రాజ్ కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుంటే.. ఆయన వెనుక వైఎస్సార్సీపీ ఉందనే ప్రచారాన్ని కూటమి నేతలు చేస్తున్నారంటూ నాగేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నలకు ఫస్ట్ ఆన్సర్! పవన్ ను కడిగిపారేసిన రజనీ
-
ప్రశ్న రావణ్ పై పవన్ కళ్యాణ్ కు ఎందుకంత కక్ష అంటే.. నేను గన్నవరంలో కేసు పెట్టాడని కారణం కూడా అదే
-
సాయి కృష్ణ పరిస్థితే రావణ్ కి వస్తుందేమో అని నూరి ఫాతిమా షాకింగ్ కామెంట్స్
-
Big Question Full : రాజద్రోహం అసలు ఎవరిది...?
-
బడికెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులతో రోడ్డు కోసం దండం పెట్టేలా చేస్తున్న కూటమి ప్రభుత్వం!
-
రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు
-
అసలు టార్గెట్ రావణేనా..? రావణ్‌పై ఎవరి గేమ్..?
-
ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం... CPI నారాయణ అదిరిపోయే కౌంటర్
-
రావణికి జైలులో ప్రాణహాని.. కారుమూరి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్
-
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై కర్నూల్లో భారీ నిరసన
-
నమ్మక ద్రోహి.. పవన్ పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు
-
ఉపా కేసు పెట్టాల్సింది పవన్ పైనే.. లైవ్ లో వీడియో చూపిస్తూ
-
పవన్ కు రావణ్, జడ శ్రావణ్ అంటే ఎందుకంత భయం..
-
పవన్‌కళ్యాణ్ నమ్మక ద్రోహం
గన్నవరం: అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె కృష్ణా జిల్లా గన్నవరంలో పవన్‌కళ్యాణ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పలు బహిరంగ సభల్లో సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం గురించి పవన్‌కళ్యాణ్ ప్రస్తావించారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే తాము చేపట్టే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదేనని కూడా ఆయన హామీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు ముగిసిపోయినా సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరమన్నారు. ఐదు రోజులుగా దాదాపు ఐదు వందల మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించి యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేశారని, అందులో కనీసం పది శాతం శ్రద్ధ పెట్టినా తమ కుటుంబానికి న్యాయం జరిగి ఉండేదన్నారు. నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా తమ కళ్ల ముందే తిరుగుతున్నారని వాపోయారు. ఎందుకీ వివక్ష? అని నిలదీశారు. సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు తారుమారయ్యాయని ఏ ఆధారంతో పవన్ చెబుతున్నారని పార్వతి ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా మాట్లాడిన ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలని నిలదీశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక దివ్యాంగురాలికి మాట ఇచ్చి మర్చిపోవడం చీటింగ్ కాదా? అని ప్రశ్నించారు. ముద్దాయిలకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ క్లీన్చిట్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. చివరికి దివ్యాంగురాలైన తనను జనసేన నేతలు, వీర మహిళలతో బాడీ షేమింగ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. -
యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? కూటమి ప్రభుత్వంపై సెటైర్లు
నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ 'ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మొదలుపెట్టిన మీ ఆటను ముగించేది ప్రజలే" అని వ్యాఖ్యానించారు. నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇచ్చినా UAPA సెక్షన్‌తో రిమాండ్‌లోకి పంపడంపై మండిపడ్డారు. 'యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా?' అని, జనసైనికులు ఇప్పటికే ఏఐ వీడియోలతో క్యారెక్టర్ అససినేషన్ మొదలుపెట్టారని ఆరోపించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్‌కి తమిళ నేత వార్నింగ్)'వరసగా తప్పుడు కేసులు పెట్టి నాలుగుసార్లు కోర్ట్ బెయిల్ ఇస్తే UAPA వాడి ఒక యూట్యూబర్ ని రిమాండ్ లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? ఇది ప్రశ్నించే గొంతులని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్ర అని అందరికీ అర్థమైంది. తర్వాత ఏంటి? వ్యక్తిగత దూషణ. ఆల్రెడీ జనసైనికులు ఏఐ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. వాడి ఫోన్ మీ దగ్గరుంది. అందులో సమాచారాన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకు అండగా నిలుచున్న వాళ్లని, ఎన్నో ప్రశ్నించే గొంతులని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత దిగజారతారో ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మీ ఆట మొదలైంది. కానీ ఈ ఆటకి ముగింపు ప్రజలే ఇస్తారు. గేమ్ ఆన్' అని ప్రకాశ్ రాజ్ అన్నారు.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్)మీరు ఆట మొదలు పెట్టారు… ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు GAME ON #justasking pic.twitter.com/febENen78z— Prakash Raj (@prakashraaj) July 6, 2026 -
జగన్ అధికారంలోకి వచ్చాక.. వణికిపోతున్న TDP, జనసేన నేతలు
-
పవన్ కళ్యాణ్‌కు ఆ రూల్ వర్తించదా?!
ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం వాక్ స్వాతంత్రం గురించి, పరిమితుల గురించి మంచి ప్రసంగమే చేశారు. అది ఆహ్వానించదగిందే. కాకపోతే అదే సమయంలో పవర్లో ఉన్నవారికి కూడా అపరిమితమైన అధికారాలు ఏమీ ఉండవు అన్న సంగతి కూడా చెప్పి ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు ఒక అర్థం, పరమార్థం కలిగేది. సోషల్ మీడియాలోనే కాదు.. ఏ మీడియాలో అయినా అసభ్యతకు తావు లేదు. అలాగే రాజకీయ నేతల ప్రకటనలలో కూడా అసత్యాలు, అభ్యంతరకర పదజాలం ఉండకూడదు. ఎవరైనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఇది ఏపీ ప్రజలను, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిని బెదిరించినట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. చెప్పేటందుకే నీతులు అన్నట్లు నేతలు వ్యవహరించరాదు. పవన్ కళ్యాణ్ తనకు లేని అధికారాలను తీసుకుని సోషల్ మీడియాపై దాడి చేయబోతున్న సంకేతాలు ఇవ్వడం కూడా ప్రజాస్వామ్యబద్దం కాదు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై ఒక ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన అంటున్నారు. ఆధారసహితంగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన సూచించారు. ఇది ప్రభుత్వపరంగా చేస్తున్నారా? లేక పార్టీపరంగా చేస్తున్నారా? ఒక్క పవన్ కళ్యాణ్‌కే ఈ పవర్ ఉంటుందా.మిగిలిన మంత్రులకు కూడా ఉంటుందా? మరి హోం మంత్రి బాధ్యత ఏమిటి? ముఖ్యమంత్రి ఏమి చేస్తారు? ఇలాంటివి ఏ మంత్రి అయినా ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం ఒక జీఓ ఇవ్వవలసిన అవసరం లేదా! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు అనుమతించారా? ఇప్పటికే ఇలాంటి విభాగాలు పోలీసు శాఖలో ఉన్నాయి. సైబర్ క్రైమ్‌కు ప్రత్యేక శాఖ ఉంది. అయినా ఫర్వాలేదు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్దితో ఈ ప్రయత్నం చేస్తే స్వాగతించవచ్చు. కాని ఆయన చెబుతున్నదానికి, ఆచరిస్తున్నదానికి చాలా తేడా ఉంటున్నది. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలనో, సోషల్ మీడియావారినో భయపెట్టే యత్నంగా కాకుండా, జనసేన, టీడీపీలతో సహా ఏ పార్టీవారు, లేదా ఏ యూట్యూబర్ అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పగలిగి ఉంటే దానికి ఒక విశ్వసనీయత వచ్చేది.పవన్ కళ్యాణ్ ఇచ్చిన వీడియో ప్రసంగం చూశాక ఒక మాట అనిపిపిస్తుంది. నిజంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అనుభవించినంత స్వేచ్ఛ మరెవరికి దక్కలేదేమో అన్న భావన ఎవరికైనా కలగవచ్చు. పవన్ ఇప్పుడు చెబుతున్న సూక్తి ముక్కావళిని పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో ఆయన చేసిన విన్యాసాలన్నిటిని ప్రజలు గుర్తు చేసుకుని, అధికారంలోకి వస్తే మాత్రం ఇలా ప్రశ్నించేవారిని భయపెట్టాలని చూస్తారా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను ప్రస్తావించి ప్రశ్నించే హక్కు ఉందని ఆయన స్పష్టం చేయడం మంచిదే. తమ నిర్ణయాలతో విబేదించే హక్కు కూడా ఉందని ఆయన గుర్తించడం బాగానే ఉంది. కాని ఒకరిని తిట్టడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను అవమానించడం, హింసను ప్రేరేపించడం స్వేచ్ఛ కిందకు రావని ఆయన అన్నారు. దీనిని ఎవరైనా అంగీకరిస్తారు. ఇదే సందర్భంలో పవన్‌కు పౌరులు పలు ప్రశ్నలు సందిస్తున్నారు. ఓ వారం, పది రోజుల క్రితమే కదా! వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ, తొక్కి నార తీస్తా అని పవన్ అన్నారు! మరి అవి వాక్ స్వాతంత్రం పరిధిలోకి వస్తాయా? రావా? అన్నదానిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా అని అడుగుతున్నారు.తిరుమల లడ్డూలో జంతు కొవ్వు అంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు చంద్రబాబుకాని, పవన్ కాని ఎన్నడైనా చింతిస్తున్నట్లు ప్రకటన చేశారా? మరి అది వాక్ స్వాతంత్రం కిందే వస్తుందా? అధికారంలో ఉంటే ఏమి మాట్లాడినా, ఏమి చేసినా చెల్లుతుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి ఒక ఫ్రొఫెసర్‌ను ఉద్దేశించి ఎంత నీచమైన భాషను వాడినప్పుడు పవన్ కళ్యాణ్ మందలించి ఉండాల్సిందే. ఈ మద్యనే జగన్‌ను కూడా దూషించితే, పవన్ పరోక్షంగా సమర్థించినట్లు మాట్లాడారే. మహిళలను ఎవరైనా గౌరవించవలసిందే. అందులో రాజీ లేదు. కాని అదేదో ఒక పార్టీకి సంబంధించినంతవరకే కాదు కదా! మాజీ సీఎం జగన్ కుటుంబాన్ని, అలాగే వైఎస్సార్సీపీ మహిళా నేతలు పలువురిని దూషిస్తూ టీడీపీ, జనసేనలకు చెందిన వారు పోస్టులు పెడుతుంటే పవన్ వారించి ఉంటే, ఇప్పుడు ఏ వ్యాఖ్య చేసినా ఆయనకు నైతికంగా మద్దతు వచ్చేది.ఫ్రొఫెసర్ నాగేశ్వర్ ఎలాంటి అభ్యంతరకర భాషణ చేయకపోయినా ఆయనపైన, మరికొందరిపైన కేసు పెట్టిన జనసేన కార్యకర్తలను మందలించి ఉంటే పవన్ చెప్పే మాటలకు విలువ ఉండేది. విపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఎన్నిరకాల దూషణలు చేసింది సోషల్ మీడియాలో వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి కదా! వాటిని గుర్తు చేస్తున్న యూట్యూబర్లను అరెస్టు చేస్తున్నారే. వారిపై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారే! కక్ష కట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ రోజుల తరబడి తిప్పుతున్నారే! చంద్రబాబు పదే, పదే వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయడాన్ని పవన్ సమర్థిస్తారా?హింసకు తావు లేదని అన్నారు. అది నిజమే. కాని వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు, అమరావతికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లరాదని చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలు అంటున్నప్పుడు, టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడినప్పుడు అది రాజ్యాంగ విరుద్దం అని పవన్ కళ్యాణ్ మాట మాత్రం అనలేకపోయారే! విపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్టులో జనసేనకు చెందిన కొందరు అప్పటి మంత్రి రోజాపై పూలకుండీలతో దాడులు చేశారు. అప్పుడు ఎవరి పక్షాన పవన్ నిలబడింది అందరికి తెలిసిందే కదా! రోజాపై తీవ్రమైన అసభ్య భాష వాడిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిని అభినందించకుండా, మందలించి ఉంటే పవన్ నిబద్దతగా ఉన్నారని అంతా ఒప్పుకునే వారు కదా! జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాదితురాలికి కనీస సానుభూతి తెలిపి ఉంటే మహిళలకు పవన్‌పై ఒక నమ్మకం ఏర్పడేది కదా! జనసేన నేత ఒకరు నడిరోడ్డుపై పోలీసుల లాఠీ తీసుకుని ఆ మహిళను కొట్టినప్పుడు అది అరాచకం అని ఖండించి, చర్య తీసుకుని ఉంటే పవన్ ఇప్పుడు ఏమి చెప్పినా జనం అంతా అర్థం చేసుకునేవారు కదా! సుగాలి ప్రీతి తల్లిని జనసేన కార్యకర్తలు దూషిస్తున్న తీరుపై చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంపై పవన్ స్పందించాలి కదా.30వేల మంది మహిళలు మిస్ అయ్యారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు చూపి ఉండాల్సిందే! రాష్ట్ర అప్పులపై పది నుంచి 14 లక్షల కోట్ల అప్పు అంటూ చేసిన అసత్య ప్రచారం గురించి ఏమంటారు? ఇలాంటివి ఎన్నో ఉన్నాయే! అయినా అప్పట్లో ఆయనపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. ఆ రకంగా స్వేచ్ఛగా ఏది పడితే అది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడేవారు.నేరాలకు కులం లేదని చెబుతున్నప్పుడు అదే సూత్రం పోలీసు అధికారులు చేసే నేరాలకు కూడా వర్తిస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. వారు చేసే అకృత్యాలకు మద్దతు ఇచ్చేలా అధికారంలో ఉన్నవారు మాట్లాడడం ఏ రకంగా రాజ్యాంగబద్దమో తెలియదు. రాజ్యాంగంలోని అధికరణాలతో పాటు తాను గత పదేళ్లుగా ఎలా పాటిస్తున్నది, ఇకపై ఎలా ఉండబోతున్నది చెప్పి ఉంటే సరైన పద్దతి అనిపించేదేమో! పోనీ ఇంతవరకు జరిగిన వాటిలో పొరపాట్లు ఉంటే చింతిస్తున్నానని చెబుతూ, ఇకపై తన వైపు నుంచి ఎలాంటి తప్పులు జరగవని, అధికారాన్ని దుర్వినియోగం చేయనని, తప్పుడు కేసులు ప్రభుత్వం పెట్టినా ఒప్పుకోనని చెప్పి ఉంటే పవన్‌ను గ్రేట్ అని అంతా అని ఉండేవారు కదా!ఒక వైపు కీలక మంత్రి లోకేష్ రెడ్ బుక్ పేరుతో అరాచాకాలు సాగుతుంటే, వాటి గురించి ఒక్క మాట చెప్పడం లేదు. మరోవైపు ఆయనకు పోటీగా సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్ పెడతానని పవన్ బెదిరిస్తున్నారు. స్థూలంగా చూస్తే పవన్ కళ్యాణ్ పౌరుల హక్కులను రక్షిస్తానని చెబుతున్నారా? లేక ఏదో సాకుతో వారిని భయపెడుతున్నారా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టి రిమాండ్ కు పంపిస్తున్నావ్.. ఈ రోజు ప్రశాంతంగా నిద్రపో...
-
ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతే మమ్మల్ని చంపేయండి..
సాక్షి, అమరావతి: ‘ప్రశ్నించడమే ఆయన చేసిన నేరమా. మమ్మల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు. మాకు అర్థం కావడం లేదు. మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన తప్పుగా మాట్లాడారని కేసుల మీద కేసులు పెడుతున్నారు. వాటిన్నిటికీ ఆయన బెయిల్ తెచ్చుకుంటున్నారు. మళ్లీ కేసులు వేస్తున్నారు. మళ్లీ బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఎందుకండీ ఇంతలా వేధిస్తున్నారు. అవసరమా మీకు. ఒక మనిషి మాట్లాడితే తప్పు కాదు. ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు.. ఇవే కేసులు పవన్‌కళ్యాణ్ మీద కూడా వేయాలి కదా. ఆయన మాట్లాడిందే.. నా భర్త రావణ్ మాట్లాడారు’ అని ప్రశ్న యూట్యూబర్ రావణ్ భార్య బచ్చలకూర అనూష ఆవేదన వ్యక్తం చేశారు. మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు కేసులతో చంద్రబాబు ప్రభుత్వ వేధింపుల వల్ల తమ కుటుంబం అనుభవిస్తున్న క్షోభను ఆదివారం ఓ వీడియో ద్వారా అనూష వెల్లడించారు. ఒకేసారి చంపేయండి ‘మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. రోజుకో కేసు పెట్టి వేధించకండి. నాకు ఉన్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతోంది. వాళ్ల నాన్న కావాలని అడుగుతోంది. తన మొహం అయినా చూడండి. లేకపోతే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోతాం. ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అంటున్నారు. మీరు కేసులు పెట్టడం లేదు. మమ్మల్ని హింస పెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి సార్. లేదా.. ఒకేసారి చంపేయండి. అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీ పని చేసుకోవచ్చు. మిమ్నల్ని ప్రశ్నించడమే మా ఆయన చేసిన తప్పు అయితే ఆయనతో పాటు నన్ను, నా కూతుర్ని చంపేయండి. ఇంతకుమించి మేం ఏమీ చెప్పలేం. మార్ఫింగ్ వీడియోలు పెట్టడం చాలా తప్పు. అలాంటి వీడియోలు ఎక్కడైనా ఉంటాయా. మీరు చేసింది చాలా తప్పు’ అని అనూష కన్నీటి పర్యంతమయ్యారు. అది కల్పిత వీడియో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మార్ఫింగ్ (కల్పిత) వీడియో సృష్టించి తన భర్త రావణ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనూష లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలు, మతాలు పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. నా భర్తది కమ్మ కులం. నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్ పలానా పార్టీ.. పలానా వర్గం అని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ లక్ష్యం. వైఫల్యాలను ప్రశ్నించినందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో జరిగిన దారుణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే రావణ్‌ను వేధిస్తున్నారు. ఇదే సాంప్రదాయం కొనసాగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం తప్పదు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్‌కు అండగా నిలవాలి’ అని అనూష కోరారు. -
‘రావణ్ మీద పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో ఎందుకు పెట్టలేదు?’
కృష్ణాజిల్లా: పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి మండిపడ్డారు. ప్రశ్నించండి, విమర్శించండి , మర్యాద ఇచ్చి మాట్లాడండని పవన్ అంటున్నారని ఆమె చెప్పారు. తాము రెండేళ్లుగా పవన్ గురించి మర్యాదగానే మాట్లాడుతున్నామని, మర్యాదగానే ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మర్యాదగానే కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు.‘‘ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తారని పవన్‌కు జనం ఓట్లేశారు. పవన్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఇప్పటి వరకూ మాకు న్యాయం జరగలేదు. రావణ్ మీద పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో ఎందుకు పెట్టలేదు? ఒక్కరినైనా పిలిపించి సుగాలి ప్రీతి కేసులో విచారణ జరిపించారా? సుగాలి ప్రీతి కేసుపై పదే పదే ప్రశ్నిస్తున్నారని ఆ గొంతును నొక్కేయాలని చూస్తున్నారు. ఎందుకు నాకు మాటిచ్చి మర్చిపోయారో పవన్ సమాధానం చెప్పాలి. రావణ్ మీద పెట్టిన ఇంటరెస్ట్ సుగాలి ప్రీతి కేసుపై పెట్టుంటే పది శాతమైనా దర్యాప్తు జరిగి ఉండేది. మహిళల కన్నీళ్లే కూటమి ప్రభుత్వ పతనానికి నాంది. అన్ని కేసుల్లో పవర్ మీ చేతుల్లోకి తీసేసుకుంటున్నారు. సుగాలి ప్రీతి కేసులో పవర్‌ను పక్కన పెట్టేస్తున్నారు. జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులతో నాపై మాటల దాడి చేయిస్తున్నారు. వికలాంగురాలినైన నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు. నా కులాన్ని దూషిస్తున్నారు. రావణ్‌పై రాజద్రోహం కేసు పెట్టించి రిమాండ్ కు పంపిస్తున్నారు కదా.. ఈ రోజు మీరు ప్రశాంతంగా నిద్రపోండి పవన్. ప్రశ్నించండి అంటున్నారు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్న పవన్...! గవర్నర్ తో చర్చలు..
-
పైకి పవనిజం... లోపల బానిసిజం.. గబ్బర్ సింగ్ కు గట్టి షాక్
-
రావణ్ ను చంపే కుట్ర.. ఆ ఎమ్మెల్యేకు బందరులో ఏం పని..
-
నీకు ఓటు వేసి గెలిపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి..
-
రావణ్ మద్దతుదారులపై.. కోడి గుడ్లతో అటాక్ జనసేన గూండాల దాడి
-
పవన్-చంద్రబాబు.. కోర్టు ఏం చెబుతుందో అర్థమవుతోందా మీకు?
యూట్యూబ్, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలతో ప్రశ్న రావణ్‌పై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో నమోదైన రెండు కేసులకు సంబంధించి న్యాయస్థానం ఆయనకు ఉపశమనం కలిగిస్తూ బెయిల్ ఇవ్వగా.. జైలు నుంచి విడుదలయ్యే లోపే మచిలీపట్నంలో నమోదైన కేసును రంగంలోకి తెచ్చిన పోలీసులు.. పక్కా ప్లాన్‌తో రావణ్‌ని మళ్లీ అరెస్ట్ చేసి తరలించారు. ఈ వరుస అరెస్టుల పరిణామాల నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ వరస వీడియోలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.'నాలుగు రోజుల నుంచి రావణ్ నిరాహారదీక్షలో ఉన్నాడు. అసలు ఆలోచించరా? ఏంటీ నాటకం, దౌర్జన్యం. అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్లీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్లీ అరెస్ట్ చేశారు. మళ్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెబుతున్నదో అర్థమవుతోందా మీకు?' అని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ని ట్యాగ్ చేస్తూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.Arrest/ Bail ..Arrest /Bail.. Arrest/Bail.. and arrest again. Isn’t Courts telling you that you are wrong.. Citizens are witnessing your Vindictive politics.. @ncbn @PawanKalyan please stop this #justasking pic.twitter.com/xU4AxGwpKl— Prakash Raj (@prakashraaj) July 4, 2026 -
రావణ్ అరెస్ట్ పై పేర్ని ఫస్ట్ రియాక్షన్
-
గాదె సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విజయవాడ లాకప్‌డెత్ మృతుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటీకీ సాయికృష్ణ బూడిద ఇవ్వలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బూడిదైనా ఇప్పించాలని.. లేకపోతే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానన్నారు. తన కొడుకును హింసించిన వాళ్లు ఇంకా ఉన్నారని.. లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయలేదన్న సాయికృష్ణ తల్లి.. విచారణ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సాయికృష్ణ తల్లి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నన్ను చంపాలనే కుట్ర జరుగుతుంది. మేము కాపులంతా ఓట్లు వేసినందుకు పవన్ కళ్యాణ్ బాగా బుద్ధి చెప్పాడు. నా కొడుకు నీ అభిమాని.. వాడిని క్రిమినల్ అంటావా?. కేసు వెనుక పెద్దవాళ్లు ఉన్నారు. అందుకే ఇలా చంపారు. నా కొడుకుని తీసుకెళ్లిన వాళ్లను ఇంకా అరెస్ట్ చేయలేదు’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మెజిస్టీరియల్ విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. రెండు గంటల పాటు ఆమె నుంచి సమాచారం తీసుకున్నారు. కేసు విషయాలు అన్ని అడిగి తెలుసుకున్నారని విజయలక్ష్మి తెలిపారు. -
నువ్వు అంత పోటుగాడివా.? పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన ప్రెస్ మీట్
-
ఎలాగైనా.. రావణ్ పై పవన్ మాస్టర్ స్కెచ్
-
రావణ్ అరెస్ట్ కేసుపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు!
-
ఇంకెంత కాలం? పవన్ కళ్యాణ్ కు వంగవీటి రంగా కూతురు విజ్ఞప్తి
-
పవన్ ఎన్ని కేసులైనా పెట్టుకో గంటలో బయటకు తీసుకొస్తా!
-
రెండు సంవత్సరాలలో ఒక్కసారైనా ప్రశ్నించవా..? పోలీసులనే జనసేన నాయకులు కొడితే..
-
రావణ్ ని మాకు అప్పగించండి.. నక్కపల్లి పోలీసు స్టేషన్ వద్ద జనసేన నేతలు హల్ చల్
-
ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు
-
క్రెడిట్ మొత్తం వైఎస్ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది
సాక్షి, వైఎస్సార్: కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.2019లోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ(జిందాల్ సౌత్ వెస్ట్) సంస్థను వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పించిందని అవినాష్ రెడ్డి అన్నారు. 2022లో ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి జీవో జారీ చేయడంతో పాటు భూసేకరణ కూడా పూర్తిగా జగన్ హయాంలోనే జరిగిందని తెలిపారు. ప్రాజెక్టు కోసం 1100 ఎకరాల భూకేటాయింపు కూడా ఫేజ్–1లోనే చేపట్టినట్లు వివరించారు.2023 ఫిబ్రవరిలో సీఎం వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని అవినాష్ రెడ్డి గుర్తుచేశారు. అంతేకాకుండా పర్యావరణ అనుమతులు సహా అవసరమైన అన్ని క్లియరెన్సులు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకువచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని జేఎస్‌డబ్ల్యూ సంస్థ అధినేత జిందాల్ స్వయంగా వెల్లడించారాన్నారు. కడప సభలో ఈ ప్రాజెక్టుపై తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ అవినాష్ తప్పుబట్టారు.“ఫ్యాక్టరీని తానే తెచ్చానని చెప్పుకుంటూ క్రెడిట్ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు” అని విమర్శించారు. సభ స్టీల్ ఫ్యాక్టరీ కోసం కాకుండా.. కేవలం వైఎస్ జగన్‌ను దూషించడానికే పెట్టినట్లు ఉందని అన్నారు.అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాజెక్టుపై కూడా అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రజారాజధాని కాదని, అది ఒక వర్గానికి చెందిన రాజధానిగా మారిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అంగీకరించారని గుర్తుచేశారు. శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని.. అమరావతి కోసం సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ మాత్రం మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాలను కలిపే “మావిగన్” వంటి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రతిపాదించారని తెలిపారు. -
నాడు పవన్ చెప్పు చూపిన రోజే బుద్ధి చెప్పి ఉంటే.. ఏకిపారేసిన అడ్వకేట్ రజిని
-
నేను పవన్ కళ్యాణ్ ని దగ్గర నుండి చూశా..? డిప్యూటీ సీఎంకు క్రిమినల్ కు తేడా ఏంటి?
-
నేను జనసేనలో ఉన్నప్పుడు ప్రచారానికి వెళ్తే.. పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ...
-
రావణ్ అంటే పవన్ కు ఎందుకంత భయం..
-
పవన్ కళ్యాణ్ కు హోంమంత్రి పగ్గాలు..?
-
‘రావణ్‌పై మరో కేసు.. దాడికి జనసేన ప్లాన్?’
కృష్ణా జిల్లా: ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు బెయిల్ రాగానే మరో కేసు అంటూ పోలీసులు.. రావణ్‌ను అరెస్ట్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి మచిలీపట్నంలో బెయిల్ రాగానే రావణ్‌ను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు రావణ్‌ను మళ్లీ అరెస్ట్ చేశారు. కేసు నమోదైనట్టు చెబుతూ మచిలీపట్నం నుంచి పాయకరావుపేటకు తరలించారు. ఇప్పటికి మూడు కేసుల్లో రావణ్‌కు బెయిల్ వచ్చినప్పటికీ కొత్త కేసులతో పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.ఈ సందర్భంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతీ సందర్భంలో ఒక దాని వెంట మరో కేసు పెడుతున్నారు. బెయిల్ రాగానే పోలీసులు మరో స్టేషన్‌కు తీసుకెళుతున్నారు. రావణ్ నిజంగా తప్పు చేసుంటే చట్టప్రకారం అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. తప్పు చేశాడో లేదో తెలియదు బెయిల్ రాగానే అరెస్ట్ చేస్తున్నారు. జనసేనకు పట్టున్న ప్రాంతంలోని స్టేషన్‌కు తరలిస్తున్నారు. అక్కడ జనసేన కార్యకర్తలు వెంటాడి వేటాడి కొడుతున్నారు. ఇది మీకు హీరోయిజం కింద కనిపిస్తుందా?. గత ఐదేళ్లలో తాను మాట్లాడిన నీతి కబుర్లు పవన్‌కు గుర్తులేవా?.మచిలీపట్నంలో రావణ్ కు బెయిల్.. మళ్లీ మరో కేసులో అరెస్ట్రావణ్ పై అనకాపల్లి జిల్లా పాయకాపురంలోకూడా కేసు నమోదవ్వగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.వరుసగా 4 అరెస్ట్ లు మూడు బెయిల్ తో సాగుతున్న రావణ్ పరిస్థితి pic.twitter.com/88BW8b6dbd— greatandhra (@greatandhranews) July 3, 2026పవన్ సుద్ధ పూస కబుర్లు చెబుతున్నాడు. కసబ్‌కి కూడా పదేళ్ల తర్వాతే ఉరిశిక్ష వేశారు. జనసేన కార్యకర్తలను అదుపు చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌కు లేదా?. అధికారంలో ఉన్నామని విర్రవీగితే ప్రజాస్వామ్యంలో తొక్కి నార తీస్తారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని సీఎం, డిప్యూటీ సీఎంను కోరుతున్నాను. 2029లో ప్రభుత్వం మారి ప్రతిపక్షంలోకి వెళితే తూర్పుకు తిరిగి దండం పెట్టడమే’ అంటూ హెచ్చరించారు. -
పవన్ గుట్టు రట్టు.. రావణ్ పై దాడికి ప్లాన్.. జనసేన నేత ఆడియో లీక్
-
హోంమంత్రి అనిత శాఖలో పవన్ కల్యాణ్ జోక్యం
సాక్షి, విజయవాడ: ఏపీ మంత్రుల తీరు విడ్డూరంగా మారింది. హోంమంత్రి అనిత శాఖలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఈగల్ చీఫ్ రవికృష్ణ భేటీ అయ్యారు. రెండు రోజుల కిందటే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా కేసులు పెట్టించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ డిప్యూటీ సీఎంతో ఐజీ రవికృష్ణ సమావేశమయ్యారు.వేరే శాఖ మంత్రికి నివేదిక ఇవ్వడంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. హోంమంత్రి అనితను డమ్మీని చేసేశారంటూ చర్చ నడుస్తోంది. ఇటీవలే హోంశాఖ తన దగ్గర లేదంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు తర్వాత సోషల్ మీడియా కేసుల కోసం వింగ్ ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్.. హోంశాఖ వింగ్ ఏర్పాటు చేశారు. మంత్రుల పంచాయితీపై అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. -
తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన
-
చేతులెత్తేసిన పోలీసులు.. స్టేషన్లోకి దూసకెళ్లిన జనసేన కార్యకర్తలు
సాక్షి,కృష్ణా: మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసేన కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి రావణ్‌పై దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని స్టేషన్ పైకే దూసుకొచ్చిన జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.సాధారణంగా పోలీస్ స్టేషన్ పై దాడి జరిగితే ఉక్కుపాదంతో అణచివేయాల్సిన ఖాకీలు, ఇక్కడ మాత్రం పూర్తిగా 'లైట్' తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్లోకి దూసుకెళ్లిన జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులు అత్యంత సున్నితంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.లాఠీఛార్జ్ చేయకుండా, కేవలం రోప్‌లతో సర్దిచెప్పే ప్రయత్నం చేయడం పోలీసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చింది.సొంత పార్టీ నేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారంలో ఉన్నారనే ధీమాతోనే కార్యకర్తలు ఇంతలా రెచ్చిపోయారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలను, బారికేడ్లను సైతం లెక్కచేయకుండా స్టేషన్ వైపు దూసుకొచ్చినా ఖాకీలు మౌనప్రేక్షకులుగా ఉండిపోవడం శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోంది. అధికార పక్షానికి చెందిన వారైతే చట్టం చుట్టంగా మారిపోతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, ఆ ప్రాంతమంతా రణరంగంగా మారడానికి పోలీసుల అలసత్వమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అరవ శ్రీధర్‌పై చర్యలు ఏమయ్యాయో?
రైల్వేకోడూరు అర్బన్: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీధర్ ఎటువంటి అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని జనసేన పార్టీ అధిష్టానం ఆదేశించింది. తరువాత ఎమ్మెల్యేపై ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ముగ్గురితో కూడిన కమిటీని ఏర్పాటుచేసింది. నిర్ణయం తీసుకునేంతవరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆయనకు స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. అయితే గురువారం ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లిలో జరిగిన విబీజీ రామ్‌జీ ప్రారంభ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని వేదికపై ప్రసంగించడం చూస్తుంటే మహిళా ఉద్యోగి కేసు మూలనపడిపోయిందని ప్రతి ఒక్కరూ చర్చించుకుటున్నారు. దీనిపై స్వయంగా అధినేత పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉందంటున్నారు. -
రావణ్ అరెస్ట్.. ప్రశ్నిస్తే కేసులా పవన్?: సుగాలి ప్రీతి తల్లి
సాక్షి, కర్నూలు: ఏపీలో కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సుగాలి ప్రీతి కేసు, కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తే రావణ్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి తల్లి సుగాలీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్ల అవుతున్నా సుగాలి ప్రీతి కేసు విషయంలో నిందితుల పట్ల అరెస్టు, విచారణ చేయడం లేదు. ముద్దాయిలు విచ్చలవిడిగా తిరుగుతున్నా.. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రీతి కేసులో రెండు సంవత్సరాలుగా డిప్యూటీ సీఎం పవన్‌కు లేఖలు రాస్తున్నాం. కానీ ఎటువంటి సమాధానం లేదు. ఈ కేసు విషయమై డిప్యూటీ సీఎం పవన్‌ను ప్రశ్నించిన రావణ్‌పై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు.త్వరలో సుగాలి ప్రీతికి న్యాయం కోసం పవన్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి పోరాటం చేస్తాం.. ప్రశ్నిస్తాం. రావణ్‌పై అక్రమ కేసులు పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ ఎందుకు చూపించడం లేదు. ఎందుకు చొరవ తీసుకోవడం లేదు. అక్రమ అరెస్ట్, నిర్బంధంపై రావణ్‌కు మేము అండగా ఉంటాం. రావణ్‌కు ఎటువంటి హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. -
అంతర్జాతీయ మేస్త్రి సంగం అధ్యక్షుడు చంద్రబాబు: అమర్నాథ్ సెటైర్లు
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులకే ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీలో చంద్రబాబు ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నారు. జేఎస్‌డ్ల్యూ స్టీల్ ప్లాంట్ కోసం 2022లోనే అన్ని అనుమతులు, రాయితీలు, నీటి సదుపాయం, రైల్వే కనెక్టివిటీ వంటి పనులు పూర్తయ్యాయి. అధికారం వచ్చి రెండేళ్లు గడిచినా వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు. మేము తీసుకొచ్చిన పరిశ్రమలకే శంకుస్థాపన చేస్తే మీరు ఎప్పుడు పరిశ్రమలు తీసుకొస్తారు. ఉద్యోగాల కల్పన ఎప్పుడు చేస్తారు. జేఎస్డ్ల్యూకి కావాల్సిన అన్ని అనుమతులు రాయితీలకు జీవో ఇచ్చాం. సంస్థ ప్రారంభ సమయంలో ప్రభుత్వం మారింది.జిందాల్ సంస్థ రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలిపోయేలా చేశారు. ఒక యాక్టర్‌ను వాడుకొని జిందాల్‌ను ఇబ్బందులకు గురి చేశారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. అంతర్జాతీయ మేస్త్రి సంగం అధ్యక్షుడు చంద్రబాబు. ఎటువంటి అనుమతులు, భూమి లేకుండా 2019లో చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేశారు. రెండు సంవత్సరాలు పూర్తిగా వదిలేసి ఇప్పుడు మళ్ళీ తెరపైకి జేఎస్‌డ్ల్యూ స్టీల్‌ను తీసుకొచ్చారు. చంద్రబాబు శిలాఫలకాల ఏర్పాటుకు పెట్టింది పేరు. వేదిక ఏదైనా వైఎస్సార్సీపీని తిట్టడమే చంద్రబాబు లక్ష్యం. ప్రపంచ వేదిక అయినా జగన్నామస్మరణ చేస్తున్నారు..నా మాటలపై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఏ సైకో చెప్పాడని చింతమనేని మా ప్రభుత్వంలో మంత్రిని అలా అన్నాడు. బాలకృష్ణ మహిళల కోసం ఏ సైకో గాడు చెప్తే మాట్లాడారు. కృష్ణ జిల్లాలో మహిళా ప్రజా ప్రతినిధిపై దాడి చేయమని ఏ సైకో చెప్పాడు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్న సైకో ఎవడో అందరికీ తెలుసు. మహిళల పుట్టుక కోసం తప్పుగా మాట్లాడిన సైకోగాడు ఎవరో అందరికీ తెలుసు. టీడీపీ బీఎల్ఏలు ఓటర్ల ఇంటికి వెళ్తే ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల నుంచి టీడీపీ బీఎల్ఓలు ఎన్యూమరేషన్‌కు వెళ్లడం లేదు. వెన్నుపోటు, ద్రోహనికి ఈ దేశంలో పేటెంట్ చంద్రబాబు. పిల్లనిచ్చిన మామకి, జన్మనిచ్చిన సీమకి.. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి బాబు..కోవిడ్ ఉన్నా.. మా ప్రభుత్వంలో మంచి ఆదాయాలు వచ్చాయి. మొదట సంవత్సరం ఈ ప్రభుత్వానికి మైనస్ మార్కులు వచ్చాయి. చదువు కొనుక్కోవచ్చు కాబట్టి లోకేష్ విదేశాల్లో చదివారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉండి కులాల కోసం మాట్లాడవచ్చా. చంద్రబాబు క్రెడిట్ చోరీ మానుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు. మంత్రులు వారి శాఖల కోసం తప్ప మిగిలిన అన్ని శాఖల కోసం మాట్లాడుతారు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి వర్గం అట్టర్ ఫెయిల్యూర్.. రాష్ట్ర చరిత్రలో ఇది ఫెయిల్యూర్ క్యాబినెట్ అని విమర్శించారు. -
TDP గూండాల కు లోకేష్ సపోర్ట్.. పవన్ చెప్పిందే నిజమైంది!
-
బెయిల్.. అరెస్ట్.. రిపీట్
తెలుగు యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. పవన్ కల్యాణ్‌ను దూషించాడని ఆరోపిస్తూ జనసేన నేతలు వరుస ఫిర్యాదులు చేస్తుండడంతో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కోర్టులు వరుసగా అతనికి బెయిల్ ఇస్తుండగా.. ఒక్కో కేసును తెర మీదకు తెస్తూ నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేస్తుండడం గమనార్హం. ఈ పరిణామంపై రాజకీయ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సర్పవరం పీఎస్ కేసులో.. యూట్యూబర్ రావణ్‌కు గురువారం రాత్రి కాకినాడ మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్‌పై బయటికొచ్చిన రావణ్‌ను కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుడివాడ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తరలించారు. అంతకు ముందు.. బుధవారం రాత్రి కూడా ఇదే తరహా సీన్ రిపీట్ అయ్యింది. కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రావణ్ ఏ తప్పు చేయలేదని.. ప్రశ్నించడమే అతను చేసిన నేరమా? అని కొందరు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.ఈ పరిణామాలపై రావణ్ తరఫున వాదనలు వినిపిస్తున్న జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ భగ్గుమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి “అంతిమ దినం”లా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లో ఉన్నా, దాని అమలుపై మరోసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.పిఠాపురం మెజిస్ట్రేట్ వాదనలు విని రావణ్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కేవలం ఐదు నిమిషాల్లోనే సర్పవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు చూపిస్తూ మళ్లీ అరెస్ట్ చేయడం ఆందోళనకరమని ఆయన అన్నారు. కనీస సమాచారం కూడా కుటుంబానికి ఇవ్వకుండా అరెస్ట్ చేసి కాకినాడ కోర్టులో హాజరుపరిచారని ఆరోపించారు. మూడు గంటల పాటు వాదనలు విన్న తర్వాత కాకినాడ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. ఇది ప్రజాస్వామ్యంలో రెండవ విజయం అని ఆయన అభివర్ణించారు. అయితే బెయిల్ వచ్చినప్పటికీ మళ్లీ ఇతర కేసుల్లో అదుపులోకి తీసుకోవడం అన్యాయమని అన్నారు. రావణ్‌పై జరుగుతున్న చర్యలు రాజకీయ కక్షసాధింపుగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయకులను గౌరవించాల్సిన అవసరం లేదని, చట్టాలు, రాజ్యాంగం శాశ్వతమని పోలీసులు గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 కేసులు నమోదైనట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో జర్నలిస్టుల సంఘాలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై స్పందించకపోవడం పట్ల ఆయన ప్రశ్నించారు.రావణ్ ప్రయాణిస్తున్న వాహనంపై జనసేన శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశాయని.. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వ పెద్దలు ఖండించాలా? లేదా? అని ప్రశ్నించారు. తాను కూడా అవసరమైతే మళ్లీ మచిలీపట్నం వెళ్లి వాదనలు వినిపిస్తానని, ప్రభుత్వ చర్యలపై చివరివరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని పేర్కొన్నారు.“నన్ను జైలుకు పంపితే అది ప్రభుత్వానికి ఎదురుదెబ్బలా మారుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను వెనక్కి తగ్గబోనని జడ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. -
అమలులోకి వీబీ జీ రామ్‌జీ పథకం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వీబీ జీ రామ్ జీ పథకం ఏపీలో తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి నుంచి గురువారం ప్రారంభమైంది. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్’ ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనులకు ముగ్గురు నేతలూ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్ జీ మిషన్ కింద తొలుత చేపట్టారు. ఈ పథకం కింద స్థానిక లబ్దిదారులకు కేంద్రమంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం కలిసి వీబీజీ రామ్ జీ జాబ్‌కార్డులను అందజేశారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ వీబీ జీ రామ్ జీ ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం కింద సమాచార బుక్లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ విడుదల చేశారు. వీబీజీ రామ్ జీ పోర్టల్‌ను నేతలు ప్రారంభించారు. అనంతరం శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఏపీకి నేను మేనమామను.. దేశంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకే వీబీజీ రామ్ జీ కింద రూ.7.5 లక్షల కోట్లు వ్యయంచేయాలని నిర్ణయించాం. ఈ తొమ్మిది నెలల కాలానికి ఈ పథకం కింద ఏపీకి కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు విడుదల చేస్తాం. నన్ను మధ్యప్రదేశ్‌లో అంతా మామాజీ అని పిలుస్తారు.. ఇప్పుడు ఏపీకి కూడా నేను మేనమామనే అయ్యా. ఏ మేనమామ ఖాళీ చేతులతో రాడు. ఏపీకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్ల నిధులు ఇస్తాం. అలాగే, 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కేంద్రం కొనుగోలు చేస్తుంది. అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. సీఎం చంద్రబాబు, పవన్ మాట్లాడుతూ.. ‘వీబీ జి రామ్‌జీ పథకం రాష్ట్రం నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం చారిత్రాత్మకం. గతంలో ‘నరేగా’ కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వీబీజీ రామ్ జీ పథకం ఇక్కడి నుంచే ఆవిష్కృతమైంది. ఈ పథకంతో గ్రామాల రూపురేఖలు మారతాయి. పొలాలకు వెళ్లే డొంక రోడ్లు ఈ పథకం కింద నిర్మించవచ్చు. గాలేరు–నగరి నుంచి కోడూరుకు నీళ్లు తీసుకొస్తాం. ఇక అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అడిగిన వెంటనే సమస్యల్ని పరిష్కరించారు. ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం. కేంద్ర నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉంది.’ అని చెప్పారు. -
ఎమ్మెల్యే పులివర్తి నానిపై పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి కూటమిలో విభేదాలు ముదిరాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అక్రమాలపై డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ చేస్తూ.. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. పులివర్తి నాని భారీగా కమీషన్లు తీసుకుంటూ అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ మనోహర్ ఫిర్యాదు చేశారు.కాగా, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండాపోతోంది. అవినీతి, అక్రమాలతో పాటు కనిపించిన భూమినల్లా ఆక్రమిస్తూ సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్న పచ్చ మూకలు ఇప్పుడు న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం విస్తుగొలుపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ఆక్రమణలకు, అవినీతికి, దౌర్జన్యాలకు మారుపేరుగా మారిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని ఓ విశ్రాంత జిల్లా జడ్జిని అత్యంత జుగుప్సాకరంగా బూతులు తిడుతూ, అంతు చూస్తానంటూ బెదిరించడంపై న్యాయ వర్గాలు మండి పడుతున్నాయి.గౌరవ ప్రదమైన జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన న్యాయాధికారిని ఈ విధంగా బూతులు తిడుతూ మాట్లాడటంపై అటు విశ్రాంత న్యాయాధికారులు, ఇటు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని భూ ఆక్రమణలను ప్రశ్నించినందుకు రిటైర్డ్ జడ్జిని బూతులు తిడుతూ బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
ప్రశ్న రావణ్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు.. పవన్ కు బిగ్ షాక్
-
మిస్టర్ పవన్.. CBN ఇదే మీకు రిపీట్ అవుద్ది..నిప్పులు చెరిగిన EXIAS
-
జనసేన నాయకులు ఓవర్ యాక్షన్.. ప్రశ్న రావణ్ పై కోడిగుడ్లతో దాడి...
-
రెచ్చగొట్టద్దు.. బాబు పవన్ కు మాస్ వార్నింగ్
-
పవన్ కుమార్తెపై చంద్రబాబు కామెంట్స్
-
పాదరక్షలతో జనసేన ఎమ్మెల్యే దీక్ష?
తూర్పు గోదావరి జిల్లా: సనాతన ధర్మం గురించి జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఊగిపోతూ స్పీచులిస్తూంటారు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. వివరాలివీ.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాదరక్షలు ధరించి చండీ దీక్షలో ఉండటం సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. రాజానగరం మండలం దివాన్ చెరువులో బుధవారం జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీలో పార్టీ శ్రేణులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల పాల్గొన్నారు. అయితే, ఆ సమయంలో ఆయన పాదరక్షలు ధరించి ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దేవాలయాలకు వెళ్లిన సమయంలో పలు విమర్శలు గుప్పించే కూటమి నేతలు హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి రిసెప్షన్.. టాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
‘రావణ్‌కు ఏం జరిగినా పవన్‌దే బాధ్యత’
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రశ్న రావణ్‌కు పిఠాపురం మెజిస్ట్రేట్ వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఆయనను పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. 2025లో నమోదైన మరో కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకుని పిఠాపురం నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ..‘రావణ్ కేసులో న్యాయం గెలిచిన రోజు ఇది. సోషల్ మీడియా కేసుల్లో ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరైంది కాదని భావించిన మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. అయితే బెయిల్‌పై విడుదలైన వెంటనే మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజ్యాంగబద్ధం కాదు. ఇది వ్యక్తిగత ప్రాథమిక హక్కులను హరించడమేనని అవుతుంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామ కృష్ణంరాజు నా బాడీ షేమింగ్ చేస్తూ అహేళనగా మాట్లాడారు.. దానికి చట్టం లేదు?. కాళ్లకు కాళ్ళు.. కీళ్లకు కీళ్లు విరగొడతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది రాజ్యాంగబద్దమా?.పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని దుర్భాషలాడితే న్యాయబద్దమా? వాటిమీద కేసులు ఉండవా?. రఘురామ కృష్ణంరాజుకు రాజకీయ సమాధి కడతానంటే తప్పా? నా మీద కేసు కడతారా?. మీ కేసులకు భయపడేది లేదు. టైమ్ మీది కొట్టారు.. టైమ్ మాకు వస్తుంది. మేము కొడితే ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడటం ఖాయం. రావణ్ కోసం మళ్ళీ రేపు కోర్టులో వాదనలు వినిపిస్తా. రావణ్‌కు ఏం జరిగినా ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలి. సోషల్ మీడియా కేసుల్లో ముందుగా టీడీపీ, జనసేన నేతలను కంట్రోల్ చెయ్యమని సీఎం, డిప్యూటీ సీఎంను కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకంటే ముందు పిఠాపురం పోలీసులకు షాక్ తగిలింది. ప్రశ్న రావణ్ రిమాండ్‌ను మెజిస్ట్రేట్ రిజెక్ట్ చేశారు. దీంతో, వ్యక్తిగత పూచికతుపై రావణ్ విడుదలయ్యారు. ఈ క్రమంలో రావణ్ తరపున వాదనలు జడ శ్రవణ్ కుమార్ వినిపించారు. అనంతరం, విడుదలైన వెంటనే పోలీసులు.. 2025లో నమోదైన మరో కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
అరెస్టులతో వెంట్రుక కూడా పీకలేవ్ ఈడ్చి తంతే హైదరాబాద్ లో పడతావ్ జాగ్రత్త
-
దీక్షలోనూ రాజకీయాలేనా? పవన్ సత్యనిష్ఠపై ప్రశ్నలు
సాధారణంగా ఏ మతంలో అయినా కొన్ని పవిత్ర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అత్యంత నిష్ఠతో ఉండడానికి ప్రయత్నిస్తారు. అందులోనూ హిందూ మతంలో ఈ ధర్మాలు మరీ ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా రాజకీయాలకు దూరంగా ఉండడం, దీక్షను కడు శ్రద్ధతో నిర్వహించడం, అబద్ధాలు చెప్పకుండా ఉండడం, ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండడం వంటి వాటిని ఆచరిస్తుంటారు. కానీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీక్ష తీసుకున్నా, లేత పసుపురంగు లుంగీ, పైన కండువా వేసుకుని పూజాధికాలు చేసిన తర్వాత కూడా రాజకీయ ప్రకటనలు చేయడం, అందులోనూ అసత్య వచనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కనిపిస్తుండడం భక్తుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ దీక్ష తీసుకున్నారు. ఈ వస్త్రధారణలో ఆయన ఏటా నాలుగు నెలలపాటు ఈ దీక్ష చేపడుతుంటారట.. మంచిదే. అది ఆయన నమ్మకం, విశ్వాసం, దైవభక్తికి సంబంధించిన అంశంగా బావించవచ్చు. దీక్షలు తీసుకున్నవారు చాలా పవిత్రంగా ఉండడానికి యత్నిస్తారు. ఉదాహరణకు అయ్యప్ప దీక్ష చేసేవారు నల్ల దుస్తులు ధరించి, ఇరుముడి సహా రకరకాల సంప్రదాయాలు పాటిస్తారు. కేవలం శాఖాహారమే భుజిస్తారు. మద్యం వంటివాటిని స్వీకరించరు. కొందరు కాలినడకన శబరిమలైకి వెళతారు. విజయవాడ కనకదుర్గమ్మ భక్తులు భవానీ దీక్షను తీసుకుని అన్ని నియమాలను పాటిస్తారు. చాలామంది కాలి నడకన సుదూర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చి దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. శైవభక్తులు కూడా పాదయాత్రలు చేసుకుంటూ శ్రీశైలం వెళ్లి పూజలు చేసి దీక్షను విరమిస్తారు. హిందూ మతంలోనే కాదు.. ఇతర మతాలలో కూడా ఇలాంటి ఆచారాలు ఉంటాయి. తనకు తానుగా అన్ అపాలిజిటిక్ హిందూ అని, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తినని ప్రకటించుకున్న పవన్ కల్యాణ్ కూడా ఇదే తరహాలో నిబద్దతతో ఉంటారని మత విశ్వాసకులు భావిస్తారు. పవన్ కల్యాణ్ దీక్ష ఆరంభించిన తర్వాత జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దీనిని కూడా ఆక్షేపించనక్కర్లేదు. ఆయన పార్టీ అధినేత కనుక కొన్ని తప్పవని అనుకోవచ్చు. అయితే, ఆ సందర్భంలో ఆయన చేసే ఉపన్యాసంలో సత్యనిష్ఠత, నిబద్ధత , నిజాయితీ కొరవడితే అక్కడ ఉన్న సభికులకే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఒక తప్పుడు సంకేతం వెళ్లదా? ఆయన విమర్శకులు వీటిని ప్రస్తావించరా?అందుకే వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టి కూడా అబద్ధాలు చెప్పడం దురుదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడారు? అధికారం కోసం కులాలతో రాజకీయ క్రీడ ఆడుతున్నారని ఆయన వైసీపీపై విమర్శ చేశారు. కాపులను బూతులు తిట్టేవాళ్లుగా, క్రిమినల్స్ గా ప్రొజెక్టు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇందులోనే కులతత్వం కనబడుతోందన్న సంగతి ఆయన గుర్తించలేకపోయారు. ప్రత్యేకించి ఒక కులం గురించి వైసీపీ నేతలు ఎవరైనా విమర్శ చేసి ఉంటే దానిని ప్రస్తావించి చెప్పాలి కదా! అదేమీ లేకుండా జనరల్ గా మాట్లాడుతున్నారంటే ఆయనలో నిబద్ధత లేదనిపించదా! కాపులను క్రిమినల్స్ గా ఎవరూ చూపించలేదు. కాకినాడ సభలో గాదె సాయికృష్ణ గురించి మాట్లాడుతూ రౌడీ అని ఆరోపించింది ఆయనే. అలాగే మరో సభలో సాయికృష్ణపై పోక్సో కేసు ఉందని చెప్పింది పవన్ కల్యాణే. అది తప్పుడు కేసు అని, దానిని కోర్టు కొట్టేసిందని అతని మరదలే చెబుతున్నా, ఆ కేసు గురించి ప్రచారం చేసింది ఆయనే కదా! ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. సాయికృష్ణ పేద కాపు. అతను తప్పు చేస్తే శిక్షార్హుడు. అదే సీఐ నాగరాజు ధనిక కాపు కనుక, పోలీసు అధికారి కనుక ఆయన ఎంత ఘోరం చేసినా సమర్ధిస్తారా? అసలు లాకప్ హత్యలపై పవన్ కు ఒక విధానం ఉందా? అన్నది చర్చనీయాంశం. అంతే తప్ప ఇక్కడ కులం కోణం ఏమీ లేదు. జగన్ టైమ్ లో ఎన్నిసార్లు కులం కోణంలో చంద్రబాబు, పవన్ ఆరోపణలు చేశారో రికార్డులు చూస్తే తెలుస్తుంది. వైసీపీ వారు కాపు నాయకులతో తనను తిట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి కాకినాడలో వైసీపీ నేతలను గూండాలు, రౌడీలు, తొక్కి నార తీస్తా అంటూ అనుచిత భాష వాడిందే పవన్ కల్యాణ్. గతంలో వైసీపీ నేతలను ఉద్దేశించి అసభ్య భాష వాడిన విషయం, చెప్పు చూపించిన ఘటనలను ఆయన మర్చిపోయి ఉండవచ్చు. కాకినాడ స్పీచ్ తర్వాత మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ,అంబటి రాంబాబు, కన్నబాబు, త్రిమూర్తులు తదితరులు దానికి జవాబు ఇచ్చి పవన్ కల్యాణ్ గతంలో కులం పేరుతో ఎలా రాజకీయం చేసింది సోదాహరణంగా వివరించారు.అయినా అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే పవన్ కల్యాణ్ ఎదుటివారిపై బురద వేయడానికి యత్నించారు. అంతేకాదు..కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దుర్భాషలాడితే దానిని నిర్ ద్వంద్వంగా ఖండించి ఉంటే పవన్ కు మంచి పేరు వచ్చేది. అలాకాకుండా తాను ప్రోత్సహించను అంటూనే గత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఇంతకన్నా అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. మాజీ మంత్రి కన్నబాబు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మాజీ జర్నలిస్టు కూడా. ఆయన ఎప్పుడూ అపసవ్య భాష వాడరు. అయినా పవన్ ఆరోపణ చేయడం అంటే ఏదో రకంగా తన ఎమ్మెల్యే చేసిన తప్పును కప్పిపుచ్చుకునే యత్నమే కదా! తాను కుల రాజకీయాలు చేయలేదని ఆయన అంటున్నారు. ఇకపై కుల రాజకీయం చేయబోనని చెప్పి ఉంటే గౌరవంగా ఉండేది. అలా కాకుండా అసలు కులం గురించి తానెప్పుడు మాట్లాడనట్లు ఉపన్యాసం చెబితే వినే జనం చెవిలో పూలు పెట్టడమే కదా! ఆయన ఎన్నికల సమయంలో కాపులను ఎలా ఓట్లు అడిగింది, తనకు కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలు మద్దతు ఇస్తే ముఖ్యమంత్రి అయి చూపిస్తానని చెప్పిన సంగతులు, ఆంధ్ర భావన లేకపోతే మానే.. కుల భావన అయినా తెచ్చుకోవాలని కోరిన విషయాలన్నీ వీడియోల రూపంలో ప్రత్యక్షం అయ్యాయి. మరో వైపు బీసీ కులాలైనా, కాపులైనా ఎవరో అధికారం ఇవ్వాలని కోరుకూడదు, 50 శాతంగా వారు.. వేరే వాళ్లను అధికారం కోసం అడగడం ఏమిటి అని, కలిసి ఉంటే అధికారం వస్తుందని ఆయన సెలవిచ్చారు. మరి దానికి కట్టుబడి ఉండి ఆ దిశలో ప్రయయత్నించకుండా తెలుగుదేశంతో ఎందుకు కలిసి ప్రయాణం చేస్తున్నారని ఎవరైనా అడిగితే ఏం జవాబు ఇస్తారు. తెలుగుదేశంలో ఎవరి ఆధిపత్యం ఉన్నది ఆయనకు తెలియదా? కులం గురించి ఆలోచించే వ్యక్తిని అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి ఎందుకు వస్తారని పవన్ కల్యాణ్ అమాయకంగా ప్రశ్నించినా, కూటమి ప్రభుత్వ కక్ష, వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఆ పార్టీలో చేరింది అందరికి తెలుసు! మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. సంక్షేమ పథకాలతోనే అదికారం రాదని ఆయన అంటున్నారు. అలాంటప్పుడు ఆచరణ సాధ్యంకాని సంక్షేమ స్కీములను చంద్రబాబుతో కలిసి ఎందుకు ప్రకటించారో వివరించగలుగుతారా?వలంటీర్ల పొట్ట కొట్టేవాడిని కానని, వారికి ఐదువేలు కాదు.. పదివేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగవేయడం గురించి ఏమంటారు? వీటి సంగతి పక్కనబెడితే ఆధ్యాత్మిక వస్త్ర ధారణలో ఉన్నప్పుడైనా పవన్ కల్యాణ్ నిష్ఠతో, సత్యవచనాలకు కట్టుబడి ఉంటే మంచిది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
శవం ఇవ్వం.. బూడిద ఇవ్వం.. దమ్ముంటే అధికారిక ప్రకటన చేయండి!
-
తెర వెనుక అసలు కథ ఇదన్నమాట!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసే వ్యూహాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిపై ఎవరైనా పీహెచ్డీ చేస్తే కచ్చితంగా డాక్టరేట్ వస్తుందేమో! కొందరు విశ్లేషకులు చంద్రబాబువి వ్యూహాలు అంటారు.. మరికొందరు కుట్రలు అంటారు. ఆ వ్యూహాలలో ఎటు తిరిగి తనకే రాజకీయ ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతుంటారు. ఆయనకు బాండ్ బాజా వాయించే ఎల్లో మీడియా ఎటూ ఉంటుంది. సాయికృష్ణ కుటుంబాన్ని మేనేజ్ చేయడానికి చంద్రబాబు ఆడిన గేమ్ కాని, తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆయన చేసిన కామెంట్లు కాని గమనిస్తే ఈ విషయం అర్దం అవుతుంది.అలాగే ఈ ఉదంతంలో చర్చ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నడిచేలా కథ ఎలా సాగించారో విశ్లేషించడం కూడా ఆసక్తికరమే. సాయికృష్ణ కేసులో సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టును కొన్ని రోజుల పాటు జాప్యం చేయడం, దర్యాప్తులో కీలకమైన అంశాలు రాకుండా జాగ్రత్తపడడం కనిపిస్తుంది. అన్నిటిని మించి నాగరాజుతో ప్రభుత్వ పెద్దలు ఒక డీల్ కుదుర్చుకుని కూటమి పెద్దల పేర్లు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు బయటకు రాకుండా చూడడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఆరోపించింది. న్యాయం అన్నది అధికారం, పలుకుబడిని పట్టి ఉంటుందని కూటమి ప్రభుత్వం పలుమార్లు రుజువు చేస్తున్నట్లు అనిపిస్తుంది.కాపు యువకుడు సాయికృష్ణ పోలీసుల హింస కారణంగా మరణించిన ఘటనలో చంద్రబాబు తెలివిగా చర్చను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు తిప్పారనిపిస్తుంది. అదేదో జనసేనకు, వైఎస్సార్సీపీకి మధ్య వివాదం అన్నట్లుగా ప్రచారం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది. ఆ సంగతి అర్థం అవుతున్నా, పవన్ కళ్యాణ్ నిస్సహాయంగా ఆ ట్రాప్‌లో నుంచి బయటపడలేకపోతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. సాయికృష్ణ కేసు అన్నది నిజానికి కులానికి సంబంధించిన సమస్య కాదు. ఏపీలో జరుగుతున్న పోలీసుల రాక్షస కృత్యాలకు, చట్టాలు, రాజ్యాంగంతో నిమిత్తం లేకుండా సాగుతున్న రెడ్‌బుక్ అరాచకాలకు సంబంధించిన అంశం. మానవహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై ప్రజలలో వస్తున్న తీవ్ర వ్యతిరేకత. వీటన్నిటిని కప్పిపుచ్చి రాజకీయ కోణంలో కేసును మలుపు తిప్పి పవన్ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని కథ నడపాలని చంద్రబాబు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఈ ప్రక్రియలో రాజకీయ లబ్ది జరిగితే తనకు, అప్రతిష్ట వస్తే అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లేలా వ్యూహాం పన్నారా అన్న అభిప్రాయాన్ని కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలాగే సాగితే పవన్ కళ్యాణ్ ఒక బకరా అయ్యే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, వారు కొందరు కాపు నేతలను ఆశ్రయించడం తదితర అంశాల వల్ల, కులం కోణం కూడా సహజంగానే వస్తుంది. అది ఎవరూ కాదనలేని సత్యం.విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కుల రాజకీయాలే కాదు.. మత రాజకీయాలు కూడా చేసి ప్రజలను ఎంత రెచ్చగొట్టాలో అంతా చేశారన్నది నిర్వివాదాంశం. సాయికృష్ణ కేసులో తప్పని స్థితిలో సీఐ నాగరాజును అరెస్టు చేయవలసివచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఈ కేసులో సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని వచ్చి హింసకు శ్రీకారం చుట్టారు. దానిని నాగరాజు కొనసాగించారన్నది అభియోగం.ఆ టాస్క్ ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధీనంలో ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర పెద్దలకు సన్నిహితుడన్న పేరు ఉంది. ఆయనను కాపాడుకోకపోతే, ఆ కేసు ఆ పై అధికారులు, తదుపరి ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. దాంతో సీఐ నాగరాజును పూర్తిగా మేనేజ్ చేసిన తర్వాతే, సిసిటీవీ ఫుటేజి మాయం అయ్యాకే కేసును ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసి ఉంటారన్నది జై భీమ్ అధ్యక్షులు జడ శ్రవణ్ తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల అభిప్రాయంగా ఉంది. అందులో వాస్తవం ఉండే అవకాశం కనిపిస్తుంది.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల ప్రస్తావన లేకుండా, మానవ హక్కుల కోణంలో సాయి కుటుంబాన్ని పరామర్శించినా తొలుత విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయించారు. అయినా పరిస్థితి చేయి జారిపోతోందని భయపడి స్వయంగా చంద్రబాబే కుటుంబాన్ని తనవద్దకు పిలిపించుకుని రాయబారం చేశారు. అక్కడ ఏమి జరిగిందో కాని ఆ కుటుంబం స్వరం మార్చేసింది. ఇది ఒక కోణం అయితే క్యాబినెట్ సమావేశంలో యధాప్రకారం క్రిమినల్స్‌కు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోందని చంద్రబాబు అన్నారని ఎల్లో మీడియా రాసింది. అది నిజమే అయితే, ఆ క్రిమినల్ కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పరామర్శించారు? విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆ కుటుంబంతో ఎందుకు మాట్లాడి ఓదార్పు మాటలు చెప్పారు. జనసేన నేత ఒకరు డబ్బు ఆఫర్ ఎందుకు ఇచ్చారు? ఇవేవి ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు మాట్లాడతారు. ఇది ఇలా ఉంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ తలాతోక లేకుండా వైఎస్సార్‌సీపీవారిని దూషించి రెచ్చగొట్టడం చంద్రబాబు ప్లాన్‌లో భాగమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం.రౌడీ షీటర్ చనిపోతే ఏమిటన్నట్లు పవన్ మాట్లాడడం ఎంత దారుణంగా ఉంది. అతను కాపు కులం వాడైతే మాత్రం అని ఆయన భావిస్తున్న తీరు పద్ధతిగా ఉందా? సీఐ నాగరాజు లేదా, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఒక వ్యక్తి చచ్చేలా హింసించడం నేరం కాదని చట్టబద్దమైన పదవులలో ఉన్న చంద్రబాబు, పవన్‌లు చెప్పదలిచారా? లేక సాయికృష్ణ పేదవాడు కనుక, అతనికి అండ లేదు కనుక, కేవలం జనసేనలో ఒక సామాన్య కార్యకర్త కనుక పట్టించుకోనవసరం లేదనుకున్నారా! అదే సీఐ కూడా కాపు వ్యక్తి అయినా, బాగా డబ్బు ఉన్న వ్యక్తి అవడం, అతని మేనమామ ఒక మాజీ డీజీపీ కావడం వల్ల అతనికి పవన్ అండగా నిలబడుతున్నారా అన్న విమర్శ రాదా? సాయిపై కేసులు ఉంటే, మరి పోలీసులకు హత్యలు చేసే అధికారం ఉండదు కదా! అంటే వారు కూడా నేరం చేసినట్లే అవుతుంది కదా! ఆ ప్రస్తావన ఎందుకు క్యాబినెట్లో రాలేదు. తాను ఎందుకు సాయి కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడింది చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు?బాధిత సాయి కుటుంబంతో రాజీచేసుకుని, కేసులో నిందితుడుగా ఉన్న నాగరాజుతో కూడా డీల్ కుదుర్చుకోవడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందేమో! పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే స్పందించరేమిటని, కుల రాజకీయాలను తిప్పి కొట్టాలి కదా అని ఆయన అన్నారట. వైఎస్సార్సీపీ పవన్ కళ్యాణ్‌పై తొలుత ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు పైన, పోలీసు అధికారులపైన ఆరోపణలు చేసింది. దానికి జవాబుగా రౌడీలకు మద్దతు ఇస్తారా అని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా రౌడీ కుటుంబంతో భేటీ అయ్యారు. దానిని ప్రస్తావంచకుండా పవన్ కళ్యాణ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.కాకినాడలో పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీవారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ అనుచితంగా మాట్లాడారు. దానికి జవాబుగా టీడీపీ, జనసేనలలో ఉన్న రౌడీలు, గూండాల గురించి వివరాలను వైఎస్సార్సీపీ బయటపెట్టింది. టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో క్రిమినల్ కేసులు ఉన్నవారు 115 మంది అట. అందులో తీవ్రమైన అభియోగాలు ఉన్నవారి సంఖ్య 82. జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే పది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఏడుగురిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను దాచేసి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది చంద్రబాబు లక్ష్యం. కాని సోషల్ మీడియాలో అన్ని వివరాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాలపై మాత్రం టీడీపీ, జనసేనలు నోరు పెగల్చవు.ఈ కేసులో పవన్‌ను ఇరికించాలని జగన్ తన పార్టీ నేతలతో అన్నారని ఒక ఊహాగానాన్ని సృష్టించి దుష్ప్రచారం చేసిది. నిజానికి పవన్ పద్దతిగా వ్యవహరించకుండా చేసింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఒకప్పుడు పోలీసులు ఎలా నిందితులను కొడతారంటూ ప్రశ్నలు వేసిన పవన్‌తోనే, లాకప్ డెత్‌లకు బాధ్యులైన పోలీసులకు మద్దతుగా మాట్లాడించి ఆయన పరువు తీశారు. ఇక నాగరాజుపై అన్ని ఆరోపణలు వస్తే కొంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నారంటూ 'నాగరాజుకు జేజేలు' అన్న హెడింగ్ పెట్టి ఇలాంటి హత్యలను కూడా సమర్థించే దుస్థితిలోకి ఎల్లో మీడియా వెళ్లిందంటే వారికి ఉన్న ప్రయోజనం ఏమిటో జనం ఊహించుకోలేరా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Big Question Full : అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తోందా ?
-
గ్రేడ్–4, 5 సచివాలయ కార్యదర్శులకు వేధింపులు
సాక్షి, అనకాపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లాలో పంచాయతీ సెక్రటరీల స్థానిక కేడర్ కేటాయింపుల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. గ్రేడింగ్ విధానంలో దొర్లిన తీవ్ర అసమతుల్యతలు, జోనల్ విభజన లోపాల కారణంగా ఏజెన్సీలో ఉన్న సచివాలయ గ్రేడ్–5 కార్యదర్శులకు, మైదాన ప్రాంతంలో ఉన్న గ్రేడ్–4 కార్యదర్శులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సీనియారిటీ ఉన్నప్పటికీ అల్లూరి, అనకాపల్లి జిల్లాలో దాదాపు 400 మంది పంచాయతీ సెక్రటరీలు తమ సొంత జిల్లాలకు శాశ్వతంగా దూరమై... స్థానికతను కోల్పోయి.. తమ కుటుంబాలకు వందల కిలోమీటర్ల దూరంలో నివసించాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్రేడ్–4, గ్రేడ్–5లో సచివాలయ కార్యదర్శులు మాత్రమే ఉండడడంతో, తాజా వ్యవహారం వీరిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే పరిగణించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు విమర్శిస్తున్నాయి.అసలు సమస్య ఏమిటి?కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకారం స్థానిక కేడర్ కేటాయింపులు జరపాల్సిఉంది. అంటే ఉద్యోగి భవిష్యత్తులో ఏ జిల్లాలో, ఏ జోన్లో సేవ చేయాలో ఇప్పుడే నిర్ణయించడం జరుగుతుంది . ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఐదు గ్రేడ్లు (1,2,3,4,5) ఉన్నాయి. ఈ గ్రేడ్లకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం కొత్తగా 4 కేటగిరీలను ప్రతిపాదించింది. ఇందులో ఒకటి స్పెషల్ గ్రేడ్ (10,000 కంటే ఎక్కువ జనాభా లేదా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న పంచాయతీలు)కాగా, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నాయి. మొదటి 4, 5 గ్రేడ్లను కొత్తగా తీసుకువచ్చి గ్రేడ్–3లో విలీనం చేయాలి. అయితే ఈ ప్రక్రియలో ముందుగా చేయాల్సిన.. గ్రామ పంచాయతీల రీ–కేటగిరైజేషన్ (నాలుగుగా) చేయకుండా, పాత గ్రేడింగ్ ఆధారంగానే (ఐదు గ్రేడింగ్‌ల ప్రాతిపదికనే) కేటాయింపులు జరుగుతున్నాయని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. దీనివల్ల లోకల్ క్యాడర్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ విషయంలో భారీ అసమానతలు వస్తున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లికి సంబంధించి 180 మంది, అల్లూరికి సంబంధించి 228 మంది.. మొత్తం 400 మంది పంచాయతీ సెక్రటరీలు దీనివల్ల తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురవుతారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంత జరుగుతున్నా.. డిప్యూటీ సీఎం, ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయకుంటే ఉద్యమం తప్పదంటూ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. జోన్ల విధానంతో పరస్పర బదిలీలకూ సమస్యఉమ్మడి విశాఖ జిల్లా విడిపోయి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా మారాయి. కానీ గ్రేడింగ్ తగిన విధంగా జరగలేదు. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లాకు చెందిన ఉద్యోగులు అనకాపల్లిలో పనిచేస్తున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఉద్యోగులు అల్లూరిలో పనిచేస్తున్నారు. రీ–కేటగిరైజేషన్ లేకుండా లోకల్ కేడర్ ఫిక్స్ చేస్తే ఈ పోస్టింగులే శాశ్వతం అవుతాయన్నది సంబంధిత 400 మంది పంచాయతీ కార్యదర్శుల ఆవేదన. ఇక రెండు ప్రాంతాలూ వేర్వేరు జోనల్ పరిధిలోకి చేరడం వల్ల పరస్పర బదిలీలూ కష్టతరమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జోన్–1లో విశాఖ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం ఉండగా, జోన్–2లోకి అల్లూరి, తూర్పుగోదావరి, పోలవరం ప్రాంతం ఉండడం గమనార్హం. పైగా గతంలో గిరిజన ప్రాంతంలో 2 సంవత్సరాలు పనిచేస్తే తిరిగి మైదాన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు లోకల్ కేడర్ ఫిక్స్ అయితే.. చాలామంది ఉద్యోగ జీవితమంతా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండాల్సి రావచ్చని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.జూలై 5 వరకూ గడువిచ్చినా.. ప్రయోజనమేది?ప్రభుత్వ జీవో ప్రకారం ముందుగా గ్రామ పంచాయతీలను కొత్త గ్రేడ్లలోనికి మార్చాలి. తర్వాత పోస్టులను తిరిగి వర్గీకరించాలి. అనంతరం స్థానిక కేడర్‌కి కేటాయించాలి. అయితే ఈ మూడు దశల్లో మొదటి దశ పూర్తి కాకుండానే మూడో దశకు ప్రభుత్వం వెళ్లిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. నిజానికి ఉద్యోగ సంఘాల ఒత్తిడితో ఆప్షన్లు నమోదు చేసే గడువును జూలై 5 వరకు పెంచడం జరిగింది. అయితే అసలు సమస్య.. రీ–కేటగిరైజేషన్, జోన్లకు సంబంధించిన లోపాలు, గ్రేడింగ్ అసమానతలు సరిచేయకుండా.. ఆప్షన్ల ఎంపికకు గడువు పొడిగించినా ప్రయోజనం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు– ముందుగా గ్రామ పంచాయతీల రీ–కేటగిరైజేషన్ పూర్తి చేయాలి. – పాత గ్రేడింగ్ ఆధారంగా లోకల్ కేడర్‌ను ఖరారు చేయకూడదు.– జోనల్ విభజనలోని లోపాలను తొలుత సవరించాలి.– ఉద్యోగులు తమ సొంత జిల్లాల్లో పనిచేసేలా అవకాశం కల్పించాలి.– తుది స్థానిక కేడర్ కేటాయింపులను.. రీ–కేటగిరైజేషన్ తర్వాత మాత్రమే చేపట్టాలి.– ముందుగా రీ–కేటగిరైజేషన్ చేస్తే పాత గ్రేడ్–4, గ్రేడ్–5 మధ్య ఉన్న అసమానత తొలగిపోతుంది. వీటిలోని అందరూ కొత్తగా గ్రేడ్–3 లోకి వస్తారు. – దీంతో పోస్టుల పంపిణీ సమానంగా జరిగి లోకల్ కేడర్ కేటాయింపులు మరింత న్యాయంగా జరిగే అవకాశం ఉంటుంది.– జిల్లాల మధ్య సమతుల్యత ఏర్పడి ఆయా ఉద్యోగులు సొంత జిల్లాలకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి.


