‘బండి భగీరథ్ లొంగిపోలేదు..పోలీసులే అరెస్ట్ చేశారు’
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో తన కుమారుడిని విచారణ నిమిత్తం తానే పోలీసులకు సరెండర్ చేశానని అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.బండి భగీరథ్ లొంగిపోలేదు. పోలీసులు అరెస్టు చేశారు. అప్పా జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీ చేసేటప్పుడు భగీరథ్ చిక్కాడు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. రోడ్డు మధ్యలో అతడ్ని కస్టడీలోకి తీసుకున్నామని మా పోలీసులు చెప్పారు. నేను మా పోలీసుల మాట నమ్మాలా.. రాజకీయ నాయకుల మాట నమ్మాలా. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులు పోలీసులు సోదాలు చేసినప్పుడు తండ్రీకొడుకులు ఎక్కడున్నారు. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ల పిల్లవాడ్ని వాళ్లింట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి అప్పచెబుతారు. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే.. సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులుగా పోలీసులు సోదాలు చేసినప్పుడు బండి సంజయ్, భగీరథ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మైనర్ బాలిక విషయంలొ రాజకీయాలు చేయడం ఏంటి అని మండిపడ్డారు.
భర్తను హత్య చేసిన భార్యకు కేవలం రూ. 500 ఫైన్, ఎందుకలా?
భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్తను కత్తితో పొడిచి చంపేసింది భార్య. ఈకోర్టును విచారించిన కింది కోర్టు ఆమెకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను తెలంగాణా హైకోర్టు రద్దు చేసి కేవలం రూ. 500 జరిమానాగా తగ్గిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అసలేం జరిగింది? కేసు నేపథ్యం ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలోకేసు నేపథ్యంకోర్టు రికార్డుల ప్రకారం.. భార్య పిల్లలు, పుట్టింట్లో ఉండగా భర్త తన పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని అత్తగారింటికి వచ్చాడు. ఇక్కడ దంపతుల మధ్య అకస్మాత్తుగా ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత బైటికెళ్లిపోయాడు. కాసేపటికి ఒంటిపై బట్టలు లేకుండా (దిగంబరంగా) తిరిగి వచ్చాడు. అంతేకాదు భార్యను, ఆమె కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు దిగాడు. ఈ తీవ్ర ఘర్షణ మధ్యలో ఆగ్రహం తట్టుకోలేక ఆ మహిళ కత్తి తీసుకుని అతడిని పొడిచింది. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు.మొదట పోలీసులు ఈ కేసును ఐపీసీ సెక్షన్ 302 (IPC Section 302) కింద హత్యగా నమోదు చేశారు. అయితే, విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. ఇది కావాలని అనుకుని ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కాదని తేల్చింది. చంపాలనే ఉద్దేశం ఆమెకు లేదని భావించి, దీనిని సెక్షన్ 304 పార్ట్-II కిందకు మార్చింది. దీని కింద ఆమెకు నాలుగేళ్ల కఠిన శిక్ష, రూ. 500 జరిమానా విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 300లోని 'ఎక్సెప్షన్ 4' (Exception 4 to Section 300 IPC) ను పరిగణనలోకి తీసుకుని ఆమె జైలు శిక్షను రద్దు చేసింది.ఎక్సెప్షన్ 4 అంటే ఏమిటి?ముందస్తు ప్రణాళిక లేకుండా, ఆవేశంలో, అప్పటికప్పుడు జరిగిన గొడవ వల్ల ఒక వ్యక్తి మరణిస్తే.. అలాగే నిందితుడు ఎలాంటి అక్రమ ప్రయోజనం పొందకుండా, క్రూరంగా లేదా అసాధారణంగా ప్రవర్తించకుండా ఉంటే, ఆ మరణాన్ని 'హత్య' (Murder) గా పరిగణించకూడదు. మహిళ పథకం ప్రకారం కాకుండా, ఆ క్షణంలో జరిగిన గొడవ వల్ల తీవ్ర ఆవేశంతో (Heat of passion) ఆ ఘర్షణలో అలా ప్రవర్తించిందని కోర్టు పేర్కొంది. కత్తితో పొడవడం వల్ల ప్రాణాలు పోతాయనే కనీస జ్ఞానం (Knowledge) ఆమెకు ఉంటుందని భావించి సెక్షన్ 304 పార్ట్-II కింద నేరాన్ని సమర్థించినప్పటికీ.. ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా శిక్ష విషయంలో మానవతా దృక్పథంతో ఉదారత చూపవచ్చని కోర్టు అభిప్రాయపడింది.జైలు శిక్ష పూర్తిగా ఎందుకు రద్దైంది?క్రింది కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షపై మహిళ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఆ సమయంలో ఘటన జరిగిన పరిస్థితులను, ఆమె ఎదుర్కొన్న మానసిక క్షోభను హైకోర్టు నిశితంగా పరిశీలించింది. ఆమెకు ఇకపై ఎలాంటి అదనపు జైలు శిక్ష విధించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. క్రింది కోర్టు విధించిన రూ. 500 జరిమానాను ఆమె అప్పటికే చెల్లించి ఉండటంతో, కేవలం ఆ జరిమానానే శిక్షగా మార్చి ఆమెను విడుదల చేసింది.అంటే, గొడవలో హత్య చేయడం ఎల్లప్పుడూ క్షమించదగినదేనా? కానే కాదు... గొడవల్లో లేదా వాదనల్లో జరిగే ప్రతి హింసను భారతీయ చట్టం క్షమించదు. ఉద్దేశం, ప్రణాళిక, ఉపయోగించిన ఆయుధం యొక్క స్వభావం, దాడి తీవ్రత, నిందితుడు క్రూరంగా ప్రవర్తించాడా లేదా వంటి అంశాలను న్యాయస్థానాలు నిశితంగా పరిశీలిస్తాయి. ఒకవేళ కోర్టుకు చంపాలనే స్పష్టమైన ఉద్దేశం లేదా ముందస్తు ఏర్పాట్లు ఉన్నట్లు ఆధారాలు దొరికితే.. అది ఐపీసీ సెక్షన్ 302 కింద 'హత్య'గానే పరిగణించబడుతుంది. దానికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష వంటి కఠినమైన శిక్షలు ఉంటాయి.
పెట్రోల్, డీజిల్ కొరత వచ్చిందా? ఓఎంసీ వర్గాలు ఏమన్నాయంటే?
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) వర్గాలు గురువారం తెలిపాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలో ఎగుమతులు, దిగుమతుల అంతరాయాలపై ఆందోళనలు నెలకొన్న వేళ ఇంధన కొరత ఉందని చాలా మందిలో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓఎంసీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రష్యా నుంచి వస్తున్న ముడి చమురు సరఫరాలో ఎలాంటి తగ్గుదల లేదని తెలిపింది.ఓఎంసీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ ఇప్పటికీ పెట్రోలియం ఉత్పత్తుల్లో ‘మిగులు’ స్థితిలోనే ఉంది. సీజనల్ డిమాండ్, మార్కెట్ ధరల మార్పుల వల్ల కొన్ని రిటైల్ ఔట్లెట్లలో ఇంధన అమ్మకాలు పెరుగుతున్నాయి. “భారత్ నెట్ ఎగుమతిదారు కావడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల్లో మిగులు స్థితిలో ఉంది. పెట్రోల్/డీజిల్/ఎల్పీజీ కొరత లేదు” అని ఓఎంసీ వర్గాలు తెలిపాయి. నెట్ ఎగుమతిదారు అంటే దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా చేసే దేశం లేదా సంస్థ.ముడి చమురు దిగుమతులపై ఓఎంసీ వర్గాలు మాట్లాడుతూ.. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రష్యా నుంచి సరఫరాలు స్థిరంగానే ఉన్నాయని తెలిపాయి. కొన్ని ఇంధన బంకుల్లో అమ్మకాలు పెరగడానికి పంట కోత సీజన్లో డీజిల్ డిమాండ్ పెరగడం సహా పలు కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటరుకు రూ.5 అధిక ధర తీసుకుంటుండడంతో వినియోగదారులు ప్రభుత్వ రంగ ఇంధన విక్రేతల వద్ద కొంటున్నారని కూడా వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలు ఎక్కువగా ఉండటంతో సంస్థాగత, వాణిజ్య కొనుగోలుదారులు కూడా ప్రభుత్వ రంగ ఇంధన బంకుల వైపు మారుతున్నారని వర్గాలు తెలిపాయి.అవసరాల మేరకే వాహనాల్లో నింపుకోవాలి.. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా రిటైల్ ఔట్లెట్లలో పెరుగుతున్న డిమాండ్ మధ్య సరిపడా ఇంధన లభ్యత ఉండేలా తమ సరఫరా కేంద్రాలు, ఫీల్డ్ బృందాలు సమన్వయంతో పని చేస్తున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) తెలిపింది.“దేశవ్యాప్తంగా మా రిటైల్ ఔట్లెట్లలో సరిపడా ఉత్పత్తుల లభ్యత ఉండేలా మా సరఫరా కేంద్రాలు, టీమ్స్ సమన్వయంతో నిరంతరం పని చేస్తున్నాయి. వినియోగదారులు తమ సాధారణ అవసరాల మేరకే వాహనాల్లో ఇంధనం నింపుకోవాలి” అని ఐఓసీఎల్ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొంది. భయంతో అధికంగా ఇంధనం కొనుగోలు చేయొద్దని కోరింది. మారుతున్న డిమాండ్ ధోరణుల వల్ల రవాణా వ్యవస్థపై ఒత్తిడి ఉన్నప్పటికీ, నిరంతర ఇంధన సరఫరా కొనసాగించే బాధ్యత తమదేనని కంపెనీ తెలిపింది.“పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సజావుగా కొనసాగించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. అయితే వాణిజ్య అమ్మకాలు, ప్రైవేట్ పెట్రోల్ బంకుల నుంచి రిటైల్ ఔట్లెట్ల వైపు డిమాండ్ మారడంతో రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. దాన్ని పరిష్కరించేందుకు మా టీమ్ ప్రయత్నిస్తోంది” అని కంపెనీ తెలిపింది.
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
నా వయసు 32 సంవత్సరాలు. నాకు పెళ్లై 10 సంవత్సరాలు అయ్యింది. పెళ్లైన మొదటి నుంచే నా భర్తకు నా మీద అనుమానం ఉండేది. రెండు సంవత్సరాలుగా ఎక్కువైంది. ఆయన రాత్రంతా పడుకోకుండా మెలకువగానే ఉంటారు. నేను బయటికి వెళ్లి వచ్చినా, బాత్రూమ్కి వెళ్లి వచ్చినా, ఎక్కడికి వెళ్లినా గొడవ చేస్తారు.పెద్దలు సంపాదించిన ఆస్తి ఉండటం వల్ల ఆయనకు పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయం పూటంతా ఇంట్లోనే ఉంటారు. రాత్రి పూట మాత్రం పడుకోకుండా నన్ను గమనిస్తూ ఉంటారు. అలాగే మా బంధువులు, నా అన్నదమ్ములు ఎవరైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా అనుమానిస్తారు. ఎవరితోనూ మాట్లాడనివ్వరు. కొన్నిసార్లు ఇంటికి తాళం వేసుకుని కూడా వెళ్తారు. ఆయనను హాస్పిటల్‌కి తీసుకువెళ్లడం కూడా చాలా కష్టంగా మారింది. మా అత్తమామలు కూడా ‘సర్దుకుపోమ్మా’ అని మాత్రమే అంటున్నారు. కానీ నా వల్ల ఇక కావడంలేదు. కేవలం కౌన్సిలింగ్ ద్వారా ఆయనను మార్చవచ్చా? ఎందుకంటే ఆయన మందులు వేసుకోవడానికి ఒప్పుకోరు. ఆయనను హాస్పిటల్‌కి తీసుకువచ్చి చికిత్స చేయించడానికి ఏదైనా మంచి సలహా ఇవ్వండి.– స్వర్ణ, నల్గొండమీ భర్త ప్రవర్తన కేవలం మామూలు పొసెసివ్ నేచర్’ మాత్రమే కాదు. ఇది ఒక తీవ్రమైన మానసిక సమస్య అయ్యే అవకాశం ఉంది. ఆధారాలు లేకపోయినా భార్యపై అనుమానం ఉండడం, రాత్రుళ్లు మెలకువగా ఉండడం, హింసించడం, ఎవరితో మాట్లాడనివ్వకపోవడం, బయటకు వెళ్లనివ్వకుండా ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లడం వంటి లక్షణాలు‘అనుమానం జబ్బు’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్’ అనే మానసిక సమస్యలో భాగంగా కనిపించవచ్చు. ఇలాంటి సమస్యలు మెదడులో వచ్చే కొన్ని రసాయన మార్పులవల్ల రావచ్చు. అలాగే చిన్నతనంలో జరిగిన ట్రామా లేదా మనుషులపై నమ్మకం కోల్పోయే అనుభవాల వల్ల కూడా ఈవిధమైన సమస్యలు పెరగవచ్చు. ఇది కేవలం కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే తగ్గిపోయే సమస్యకాదు. కొన్నిసార్లు ఇలాంటి అనుమానాలు తీవ్రమై హింస, కొట్టడం, లేదా ప్రాణహాని వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు చికిత్స అవసరం. ‘హాస్పిటల్‌కి వెళ్దాం’ అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు. అందుకే మొదట ‘స్ట్రెస్ ఎక్కువగాఉంది’ ‘నిద్ర సరిగ్గా రావట్లేదు కాబట్టి ఒకసారి డాక్టర్‌కు చూపించుకుందాం’ అనే విధంగా తీసుకురావడానికి ప్రయత్నించండి. హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత డాక్టర్లు మాట్లాడి అవసరమైన మందులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. మందులు కొంతకాలం క్రమంగా వాడితే, తర్వాత కౌన్సిలింగ్‌కు కూడా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మందులు లేదా కౌన్సిలింగ్‌కు పూర్తిగా నిరాకరిస్తూ, హింసాత్మకంగా ప్రవర్తిస్తే, అవసరమైతే కుటుంబ సభ్యుల సహాయంతో బలవంతంగానైనా హాస్పిటల్లో చేర్చి చికిత్స చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు నిరుత్సాహ పడకండి. మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ తరపువాళ్లు, అలాగే మీ అత్తగారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి. సరైన వైద్యంతో ఈ సమస్య నుంచి మీ భర్తను పూర్తిగా బయట పడేయవచ్చు. షేక్ స్పియర్ రాసిన ఒథెల్లో నాటకంలో కూడా క«థ ఇలాంటిదే. అందుకే ఈ సమస్యను ‘కాంజుగల్ పారనోయియా’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్’ అని అంటారు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
ఇద్దరిదీ తప్పే!.. ఏడవలేక నవ్విన హార్దిక్ పాండ్యా!
కోటిలింగేశ్వరా..శిరసా నమామి
స్టాక్ మార్కెట్లోకి హైదరాబాద్ ఈవీ కంపెనీ
అభిమాని కల నిజం చేసిన హీరో రామ్..!
భర్తను హత్య చేసిన భార్యకు కేవలం రూ. 500 ఫైన్, ఎందుకలా?
AP: భానుడి భగభగలు.. అల్లాడిపోతున్న జనం
ఫండ్స్ పెట్టుబడులకు థర్డ్‌పార్టీ చెల్లింపులు
AIతో నెలకు లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
పొగరు Vs ఆత్మవిశ్వాసం, ఏంటి తేడా?
బామ్మ చేతి ఐస్‌క్రీమ్ ..! తయారీ నుంచి..
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
ఇద్దరిదీ తప్పే!.. ఏడవలేక నవ్విన హార్దిక్ పాండ్యా!
కోటిలింగేశ్వరా..శిరసా నమామి
స్టాక్ మార్కెట్లోకి హైదరాబాద్ ఈవీ కంపెనీ
అభిమాని కల నిజం చేసిన హీరో రామ్..!
భర్తను హత్య చేసిన భార్యకు కేవలం రూ. 500 ఫైన్, ఎందుకలా?
AP: భానుడి భగభగలు.. అల్లాడిపోతున్న జనం
ఫండ్స్ పెట్టుబడులకు థర్డ్‌పార్టీ చెల్లింపులు
AIతో నెలకు లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
పొగరు Vs ఆత్మవిశ్వాసం, ఏంటి తేడా?
బామ్మ చేతి ఐస్‌క్రీమ్ ..! తయారీ నుంచి..
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
ఫొటోలు
వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు
చిరంజీవి 158వ మూవీ లాంచ్ (ఫోటోలు)
తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)
‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
సింప్లీ సూపర్బ్ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఆధ్యాత్మికతలో అంబానీలు.. బెంగళూరు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సెంటర్లో సందడి (ఫొటోలు)
మెలోనీతో కలిసి మోదీ పలు ప్రాంతాల సందర్శన (ఫోటోలు)
సినిమా
రికార్డు సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం డ్రాగన్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ బర్త్‌డే సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి డ్రాగన్ గ్లింప్స్ వదిలారు. సాధారణంగా గ్లింప్స్ అనగానే చాలా తక్కువ నిడివితో ఉన్న వీడియోను వదులుతారు. కానీ డ్రాగన్ యూనిట్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఏకంగా నాలుగు నిమిషాల నిడివితో గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో కథ గురించి, హీరో ఉన్న సామ్రాజ్యం గురించి చూపించారు. అలాగే విలన్స్‌ను హైలైట్ చేశారు.గ్లింప్స్ రికార్డుఎన్టీఆర్ను క్రూరమైన పాత్రలో చూపించారు. 'పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ గ్లింప్స్ వీడియో అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. కేవలం 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ రాబట్టింది. అన్ని భాషల్లో కలుపుకుని ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఏ గ్లింప్స్ వీడియోకు 24 గంటల్లో ఇంత పెద్ద మొత్తంలో వ్యూస్ రాలేదంటూ పోస్టర్ వదిలింది. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సినిమాడ్రాగన్ విషయానికి వస్తే.. రుక్మిణి వసంత్ కథానాయికగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అషుతోష్ రానా, అన్షుమాన్ పుష్కర్, సిద్దాంత్ గుప్తా, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీ 2027 జూన్ 11న విడుదల కానుంది. Records were never safe from #DRAGON 🐉🔥#DragonGlimpse pic.twitter.com/6omRXL8JCb— Dragon (@DragonMovieOffl) May 20, 2026 చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లకు పొగరు: డ్యాన్సర్
#Mega158: చిరు-బాబీ మూవీ 'మెగా' లాంచ్
'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి- బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం #Mega158 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా గురువారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు చిరంజీవి సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి కొబ్బరికాయ కొట్టి క్లాప్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, దిల్‌రాజు, బండ్ల గణేశ్, వివి. వినాయక్, మెహర్ రమేశ్, వశిష్ట తదితరులు హాజరయ్యారు. మెగా డాటర్స్ సుస్మిత కొణిదెల, నిహారిక సైతం ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనుంది. తను కూడా పూజా కార్యక్రమంలో తళుక్కుమని మెరిసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నాడు. #KVNTeluguDebut - #Mega158 is going to be THE BIGGEST LAUNCH EVER in INDIAN CINEMA with three towering personalities coming together💥⚡MEGASTAR @KChiruTweetsxPOWER STAR @PawanKalyanxMEGA POWER STAR @AlwaysRamCharanWatch #ChiruBobby2 Pooja Ceremony Live now❤️🔥--… pic.twitter.com/nt2oA36JN7— KVN Productions (@KvnProductions) May 21, 2026 A new wave of charm joins the MEGA storm 🌪️❤️🔥Welcoming the lovely #AnaswaraRajan to the world of #Mega158 💥#KVNTeluguDebut - #ChiruBobby2 Launched Grandly 🔥A @dirbobby Film 🪓Megastar @KChiruTweets #VenkatKNarayana @MusicThaman @vijaykartikdop @AntonyLRuben @artkolla… pic.twitter.com/xBmHzSlpFH— KVN Productions (@KvnProductions) May 21, 2026 చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లు పొగరుగా ప్రవర్తించారు: డ్యాన్సర్
ఆ ఇద్దరికీ పొగరు.. ఆ ఒక్క హీరోయిన్ మాత్రం!
సెలబ్రిటీలు సెట్లో ఎలా ఉంటారనేది వారితో కలిసి పనిచేసినవారికే ఎక్కువ తెలుస్తుంది. ఎంతోమంది తారలతో కలిసి పని చేసిన బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్ రుబీనా ఖాన్.. ఆ అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కొందరు గొప్ప స్టార్స్ అయినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, మరికొందరు మాత్రం పొగరు, అహంకారం చూపించేవారంటోంది.నేలపై కూర్చుని కబుర్లుఆమె మాట్లాడుతూ.. 'సంజయ్ దత్, అజయ్ దేవ్‌గణ్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి వంటి పలువురు సెలబ్రిటీలు ఎన్నడూ తాము పెద్ద స్టార్స్ అని అహంకారం చూపించలేదు. డ్యాన్సర్లను ఫ్రెండ్స్‌లా చూసేవారు. మాధురి దీక్షిత్ అయితే మాలాంటి డ్యాన్సర్లతో నేలపై కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పేది, జోక్స్ వేస్తుండేది. తాను పెద్ద సూపర్ స్టార్, మేము కేవలం డ్యాన్సర్స్ మాత్రమే అని ఎన్నడూ అనుకోలేదు.డ్యాన్సర్ రుబీనా ఖాన్మొదట్లో గర్వం..అయితే హీరోయిన్లు మమతా కులకర్ణి, దివ్య భారతి మాత్రం కెరీర్ ప్రారంభంలో కొంత గర్వం చూపించేవారు. అలా అని వారిని నేను తప్పుపట్టడం లేదు. డ్యాన్స్ చేసేటప్పుడు తోపులాటకు గురవకుండా ఉండేందుకు డ్యాన్సర్లను కాస్త దూరంగా నిలబడమని అడిగేవారు. అదే సమయంలో వాళ్లను కాస్త విసిగించాలని మేము కావాలనే తప్పులు చేస్తూ టేక్స్ తీసుకునేవాళ్లం. అలా కొన్నిసార్లు కావాలనే తుంటరి పని చేసేవాళ్లం.అరికాళ్లకు బొబ్బలుప్రేమ్ సినిమా షూటింగ్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అందులోని ఓ పాటను తీవ్రమైన ఎండలో చిత్రీకరించారు. కాళ్లకు చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయాలి. ఆ సాంగ్ పూర్తయ్యే సమయానికి మా డ్యాన్సర్లందరికీ కాళ్లకు బొబ్బలు వచ్చాయి. అప్పట్లో మా పారితోషికం ఎలా ఉండేదంటే.. సాధారణ దుస్తులకు ఒక రేటు, పొట్టి బట్టలకు మరో రేటు ఉండేది. ఏం మారలేదుదుస్తుల సైజు చిన్నవైనప్పుడు కొన్నిసార్లు డబుల్ పారితోషికం ఇచ్చేవారు. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో రోజుకు రూ.175 ఇచ్చేవారు. ఈ రేటు ఏమంత మారలేదు. 25 ఏళ్ల క్రితం ఏదైనా వాణిజ్య ప్రకటనలో డ్యాన్స్ చేస్తే రూ.3500 ఇచ్చేవారు. ఇప్పటికీ కొన్ని నిర్మాణ సంస్థలు పైసా పెంచకుండా అంతే మొత్తాన్నిస్తున్నాయి' అని రుబీనా చెప్పుకొచ్చింది.చదవండి: ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: మిస్కిన్
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
సౌత్‌లోని స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. యాక్షన్, ఎమోషన్స్.. అన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేయగలడు. తక్కువకాలంలోనే అగ్ర హీరోగా ఎదిగాడు. అయితే అలాంటి ధనుష్ కంటే కూడా ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా గొప్ప నటుడు అంటున్నాడు తమిళ దర్శకుడు మిస్కిన్. ధనుష్ కంటే అతడు వంద రెట్లు నయమని పేర్కొన్నాడు. కస్తూరి రాజా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం హబిబి. మీరా కతిరవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను మే 17న చెన్నైలో రిలీజ్ చేశారు. ఎవరో కూడా తెలీదుఈ కార్యక్రమానికి మిస్కిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కస్తూరి రాజా చాలా బాగా నటిస్తాడు. మొదటిసారి ఓ సినిమాలో అతడిని చూసినప్పుడు ఆయన ఎవరనేది కూడా నాకు తెలీదు. కానీ, ఎక్కడో చూసినట్లుగా అనిపించేది. ఈయన ధనుష్ కంటే అద్భుతంగా నటిస్తాడు. అలా అని నాకు ధనుష్ అంటే ఇష్టం లేదనుకోకండి!నచ్చేవి కావుమొదట్లో కస్తూరి రాజా (దర్శకుడిగా) చేసిన సినిమాలు నాకస్సలు నచ్చేవి కావు. అన్నీ పనికిరాని సినిమాలే చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను తన సినిమాలకు ఎంచుకునేవాడు. నెమ్మదిగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు. బాగానే డబ్బు సంపాదించాడు. కొన్నిసార్లు నేను నా ఆత్మసంతృప్తి కోసం ఏదైనా సినిమా చేసినప్పుడు నష్టాలు వచ్చేవి. అలాంటప్పుడు వెంటనే నా అప్పు తీర్చుకునేందుకు, జేబు నింపుకునేందుకు కమర్షియల్ మూవీ చేసి ఆ లోటు భర్తీ చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా కస్తూరి రాజా, ఈషా, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన హబిబి చిత్రం మే 28న విడుదల కానుంది.చదవండి: సినీ ఇండస్ట్రీలో ఖుష్బూ చిన్న కూతురు
క్రీడలు
హార్దిక్ పాండ్యాను శిక్షించిన బీసీసీఐ
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. తాజాగా మరో ఓటమిని మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. ముంబై ఘోర ప్రదర్శనలకు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యానే ప్రధాన కారణమని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్న వేళ.. హార్దిక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.నిన్న (మే 20) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓవరాక్షన్ చేసినందుకు బీసీసీఐ అతన్ని శిక్షించింది. ముంబై బౌలింగ్ సమయంలో (ఇన్నింగ్స్‌లో 10వ ఓవర్) హార్దిక్ కోపంతో స్టంప్స్‌పై ఉన్న బెయిల్స్‌ను బలంగా కొట్టాడు. ఈ చర్యను ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్.. హార్దిక్‌పై జరిమానా విధించారు.ఈ ఘటనపై ఐపీఎల్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. "హార్దిక్ పాండ్యా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించాడు. మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా మైదాన ఉపకరణాలను దుర్వినియోగం చేయడం ఈ నిబంధనకు సంబంధించింది" అని వెల్లడించింది. ఈ తప్పిదానికి గానూ జరిమానాతో (10 శాతం మ్యాచ్‌లో ఫీజ్) పాటు ఒక డిమెరిట్ పాయింట్ కూడా హార్దిక్ ఖాతాలో చేరింది.కాగా, హార్దిక్ ఈ సీజన్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఫామ్ లేమితో పాటు ఫిట్నెస్ సమస్యలతోనూ ఇబ్బంది పడ్డాడు. వెన్ను నొప్పి కారణంగా వరుసగా మూడు మ్యాచ్‌లకు దూరమైన అతడు.. తాజాగా కేకేఆర్ మ్యాచ్‌తో మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో కూడా ముంబైకి ఓటమి తప్పలేదు.వర్షం అంతరాయం కలిగించిన ఆ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకు పరిమితమైంది. అనంతరం స్వల్ప టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో బౌలర్లు చేతులెత్తేశారు. హార్దిక్ రెండు ఓవర్లలో కేవలం 13 పరుగులే ఇచ్చినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. ఇదే సమయంలో అతడి అసహనం బయటపడింది. అందుకే అతడు స్టంప్స్‌పై ఉన్న బెయిల్స్‌ను బలంగా కొట్టాడు.అంతిమంగా కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మనీశ్ పాండే (45), రోవ్‌మన్ పావెల్ (40) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి కేకేఆర్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
టెస్ట్‌ల్లోకి కోహ్లి రీఎంట్రీ..? క్లూ ఇచ్చిన కీలక వ్యక్తి
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ రీఎంట్రీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విరాట్ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి ఏడాది దాటిపోయినా.. అభిమానుల్లో మాత్రం ఇంకా అతన్ని వైట్ డ్రెస్‌లో చూడాలనే ఆశ కనిపిస్తూనే ఉంది. తాజాగా విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ చేసిన వ్యాఖ్యలు కోహ్లి టెస్ట్ క్రికెట్ రీఎంట్రీపై చర్చకు మరింత ఊతమిచ్చాయి.రాజ్‌కుమార్ శర్మ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలామంది విరాట్ మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో నేనే అతన్ని ఒప్పించగలనని వారి నమ్మకం. వారు కోరుకున్న విధంగానే ఈ విషయాన్ని విరాట్ వద్ద ప్రస్తావించాను. చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏమవుతుందో చూద్దామని అన్నాడు. ఈ వ్యాఖ్యలతో అభిమానులు విరాట్ కంబ్యాక్‌పై ఆశలు పెంచుకున్నారు. కొందరైతే "కింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్" అంటూ సోషల్‌మీడియాలో హడావుడి మొదలు పెట్టారు.ఇదిలా ఉంటే, ఇటీవల కొన్ని సందర్భాల్లో విరాట్ తన టెస్ట్ పునరాగమనంపై పరోక్ష సంకేతాలు ఇచ్చాడు. పరస్పర నమ్మకం, గౌరవం, విలువ తగ్గిన వాతావరణంలో కొనసాగాలని తనకు ఆసక్తి లేదని చెప్పకనే చెప్పాడు. వీటిని బట్టి చూస్తే విరాట్ టెస్ట్ కంబ్యాక్ అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి.2025 మే 12న టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్.. 123 టెస్ట్‌ల్లో 9230 పరుగులు చేశాడు. విదేశీ గడ్డపై భారత జట్టును దూకుడుగా నడిపించిన నాయకుడిగా, ఆధునిక యుగంలో అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. అయితే అతని రిటైర్మెంట్ నిర్ణయం అప్పట్లో అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచాన్నే షాక్‌కు గురిచేసింది.టెస్ట్ క్రికెట్లో కోహ్లీ సాధించిన విజయాలు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన అతడు.. కొద్ది కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అనంతరం కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి భారత జట్టును ప్రపంచ నంబర్ వన్‌గా నిలబెట్టాడు. కెప్టెన్‌గా 68 టెస్టుల్లో భారత జట్టును నడిపించిన కోహ్లీ.. 40 విజయాలు అందించి దేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు.
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ ఘనంగా బోణీ కొట్టింది. డెర్బీ వేదికగా నిన్న (మే 20) జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (45) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించింది. మిగతా ప్లేయర్లలో ఇజ్జీ షార్ప్ 26 (నాటౌట్), మ్యాడీ గ్రీన్ 23, ఇసబెల్లా గేజ్ 12, బ్రూక్ హ్యాలిడే 14, కెప్టెన్ అమేలియా కెర్ 8, జెస్ కెర్ 5, జార్జియా ప్లిమ్మర్ డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, ఛార్లోట్ డీన్ తలో 2 వికెట్లు తీయగా.. లిన్సే స్మిత్, డేనియెలా గిబ్సన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అలైస్ క్యాప్సీ (74 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించింది. ఆమెకుయ ఫ్రేయా కెంప్ (31 నాటౌట్) సహకరించింది. మిగతా ప్లేయర్లలో హీథర్ నైట్ 19, సోఫీ డంక్లీ 8, మియా బౌచర్ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్ 2, జెస్ కెర్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో రెండో టీ20 మే 23న జరుగనుంది.
పడిలేచిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందా..?
ఐపీఎల్ 2026లో కేకేఆర్ ప్రస్తానం ఆసక్తికరంగా కొనసాగుతోంది. సీజన్ తొలి 6 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈ జట్టు, అనూహ్యంగా తదుపరి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. చివరి లీగ్ మ్యాచ్‌లో (మే 24) ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ తేడాతో గెలిచి.. రాజస్థాన్ ముంబై ఇండియన్స్ చేతిలో, పంజాబ్ కింగ్స్ లక్నో చేతిలో ఓడితే కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.పైన అనుకున్నట్లుగా అన్నీ జరిగి కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరితే పెను సంచలనమవుతుంది. సీజన్ ప్రారంభంలో వివాదాలు (ముస్తాఫిజుర్ రహ్మాన్), గాయాలతో సతమతమైన ఈ జట్టు.. ఓ దశలో నైరాశ్యంలోకి కూరుకుపోయి, గెలుపు లేకుండానే సీజన్‌ను ముగించేలా కనిపించింది. అయితే ఆ జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు హోప్ కోల్పోకుండా తమవంతు ప్రయత్నాలు చేసి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నారు. ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానే తన కుర్రాళ్లలో అనునిత్యం స్పూర్తి నింపుతూ, పతనావస్థలో ఉన్న జట్టును తిరిగి గెలుపు ట్రాక్ ఎక్కించాడు.అన్నీ కలిసొచ్చి కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరితే, ఆపై టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందునుంచీ ఈ జట్టు బలహీనంగా ఏమీ లేనప్పటికీ.. బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో తడబాట్ల వల్ల వరుస పరాజయాలు ఎదుర్కొంది. ఎప్పుడైతే పేసర్ కార్తీక్ త్యాగి, స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లైన్లోకి వచ్చారో, అప్పుడే కేకేఆర్ ఫేట్ మారడం మొదలైంది. ఈ త్రయం దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. వీరికి అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కెమరూన్ గ్రీన్ లాంటి పేసర్లు కూడా తోడైతే కేకేఆర్ బౌలింగ్ యూనిట్ తిరుగులేని శక్తిగా మారిపోతుంది.బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో కేకేఆర్ సీజన్ ప్రారంభం నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తూ వస్తుంది. అంగ్కృష్ రఘువంశీ, రింకూ సింగ్ దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో రాణిస్తూ వస్తున్నారు. కేకేఆర్ విజయాల ట్రాక్ ఎక్కిన తర్వాత ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా లైన్లోకి వచ్చాడు. రోవ్‌మన్ పావెల్ అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై గెలుపులో పావెల్ కీలకపాత్ర పోషించాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన మనీశ్ పాండే మంచి ఫామ్‌లో ఉండటం కేకేఆర్‌కు అదనంగా కలిసొచ్చే విషయం. మొత్తంగా రహానే, గ్రీన్ ఫామ్ మాత్రమే కేకేఆర్‌ను కలవరపెడుతుంది. వీరు కూడా లైన్లోకి వచ్చి తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సత్తా చాటితే కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
బిజినెస్
ఏఐ బూమ్ ఒక బుడగ.. అయినా నష్టం లేదు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హడావిడి ఒక ‘బుడగ’ (బబుల్) లాంటిదేనన్న ఆందోళనలపై అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భిన్నంగా స్పందించారు. ఒకవేళ ఇది బబుల్ అయినప్పటికీ దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ఏఐ కంపెనీలు విఫలమైనప్పటికీ ఈ రంగంలోకి వస్తున్న భారీ పెట్టుబడులు శాశ్వత సాంకేతిక ప్రయోజనాలను అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ప్రస్తుతం ఏఐ రంగంలోకి వస్తున్న మూలధన పెట్టుబడిదారులుగానీ, విధాన రూపకర్తలుగానీ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.పెట్టుబడులు.. ఫలితాలు..‘ఏఐలో వస్తున్న మార్పులు ఒక బుడగగా మారినప్పటికీ మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బబుల్ మార్కెట్లో వస్తున్న భారీ పెట్టుబడులు చాలావరకు మెరుగైన ఫలితాలందించేందుకు మళ్లిస్తున్నారు’ అని బెజోస్ పేర్కొన్నారు.ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఏఐ మౌలిక సదుపాయాలపై భారీ వ్యయం జరుగుతోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఈ ఏడాది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏకంగా 700 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో మార్కెట్ స్థిరత్వంపై చర్చ నడుస్తోంది.మార్కెట్లో ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా బలహీనమైన వ్యాపార నమూనాలు ఉన్న స్టార్టప్‌లు కూడా సులభంగా నిధులను ఆకర్షిస్తున్నాయనే వాస్తవాన్ని బెజోస్ అంగీకరించారు. ‘ఈ తరుణంలో మంచి ఆలోచనలకు, చెడు ఆలోచనలకు మధ్య తేడాను ఎలా గుర్తించాలో పెట్టుబడిదారులు ఇంకా నేర్చుకోలేదు. అది పెద్ద తప్పేం కాదు, ఎందుకంటే కొన్ని మంచి ఆలోచనలు సాధించే భారీ విజయాలు.. ఓడిపోయిన మిగతా అన్ని సంస్థల నష్టాలను భర్తీ చేస్తాయి’ అని బెజోస్ విశ్లేషించారు.పారిశ్రామిక చక్రాలు..పారిశ్రామికంగా ఇలాంటి చక్రాలు(ఇండస్ట్రియల్ సైకిల్స్) చాలా అవసరమన్నారు. ఇవే సాంకేతికతను వేగంగా ముందుకు నడిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. దీనికి ఉదాహరణగా 1990ల నాటి బయోటెక్నాలజీ బూమ్‌ను ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో మార్కెట్ మితిమీరిన ఉత్సాహం వల్ల కొందరు పెట్టుబడిదారులు ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ.. ఆ కాలంలో కనుగొన్న ఎన్నో మందులు నేటికీ మానవాళికి ఉపయోగపడుతున్నాయని వివరించారు.ఇదీ చదవండి: భారత్‌లో మరో స్టోర్‌కు సన్నాహాలు!
భారత్‌లో మరో స్టోర్‌కు సన్నాహాలు!
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్ వైపు శరవేగంగా దూసుకెళ్తోంది. దేశంలో ప్రీమియం స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని తన రిటైల్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరిస్తోంది. ముంబై, ఢిల్లీల్లో ఇప్పటికే స్టోర్లను విజయవంతంగా నడుపుతున్న యాపిల్ తాజాగా ఐటీ హబ్ బెంగళూరులో తన రెండో అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.యాపిల్ తన అధికారిక కెరీర్ పేజీలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వివరాలను ఉంచడంతో ఈ విస్తరణ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. కంపెనీ తన వెబ్సైట్లో బెంగళూరు ఈస్ట్ పరిధిలో పలు ఉద్యోగ ఖాళీలను జాబితాను విడుదల చేసింది. ఇందులో కస్టమర్-ఫేసింగ్ ఎగ్జిక్యూటివ్‌లు, టెక్నికల్ స్పెషలిస్టులు, మేనేజ్మెంట్ స్థానాలకు సంబంధించిన లీడర్షిప్ పాత్రలు ఉన్నాయి. ఉద్యోగ ప్రకటనలో బెంగళూరు ఈస్ట్ అని స్పష్టంగా పేర్కొనడం వల్ల.. ఈ కొత్త స్టోర్ ప్రముఖ ఐటీ కారిడార్ అయిన వైట్‌ఫీల్డ్-మహదేవపుర ప్రాంతంలోని ఫీనిక్స్ మార్కెట్‌సిటీ మాల్లో ఏర్పాటయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.దేశవ్యాప్తంగా విస్తరణ..గత కొన్ని నెలలుగా యాపిల్ దేశంలోని ప్రధాన నగరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముంబైలోని బోరివలిలో రెండో స్టోర్, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడాలో మరొక స్టోర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు వచ్చిన కొద్ది నెలలకే బెంగళూరు ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం గమనార్హం. మరోవైపు, హైదరాబాద్‌లోనూ కొద్ది నెలల క్రితం ఇలాంటి ఉద్యోగ పోస్టింగ్‌లు కనిపించాయి. తాజా అంచనాల ప్రకారం హైదరాబాద్ స్టోర్ 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బెంగళూరు రెండో స్టోర్ 2027 ప్రారంభంలో ప్రారంభం కావచ్చు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!
బంగారం ఎందుకింతలా పెరుగుతోంది?
దేశంలో బంగారం ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. పసిడి ధరలు నేడు (Today Gold Rate) వరుసగా మూడో రోజూ ఎగిసి హ్యాట్రిక్ కొట్టేశాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. గడిచిన మూడు రోజుల్లో దాదాపు రూ.4000 దాకా బంగారం ధరలు ఎగిశాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా ఈరోజు పెరుగుదలను నమోదు చేశాయి.ఈరోజు బంగారం ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలోని కొన్ని కీలక పరిణామాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ స్వల్పంగా బలహీనపడటంతో, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీనికి తోడు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు , ద్రవ్యోల్బణం భయాలు మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి.దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు పెరిగి 23,736 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 169 పాయింట్లు లాభపడి 75,484 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.19బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 105.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.58 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.08 శాతం పెరిగింది.నాస్డాక్ 1.54 శాతం పుంజుకుంది.Today Nifty position 21-05-2026(time: 09:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ
సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...
గుర్తు తెలియని వ్యక్తులు నా బ్యాంకు ఖాతాలో 500 రూపాయలు జమ చేశారు. వాళ్లు సైబర్ నేరగాళ్ళు, ఆ నగదు ఆన్లైన్ మోసం ద్వారా వచ్చింది కాబట్టి నా బ్యాంకు ఖాతా కూడా సీజ్ చేస్తున్నాము అని పంజాబ్ సైబర్ క్రైమ్ వారు నా అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. అలా ఫ్రీజ్ చేసేవరకు ఈ 500 నా అకౌంట్లోకి వచ్చాయి అన్న విషయం కూడా నాకు తెలియదు. పంజాబ్ పోలీసులను సంప్రదించగా, వారు చెప్పిన విధంగానే అన్ని పత్రాలను, అఫిడవిట్‌ను – నా వ్యక్తిగత వివరాలతో సహా సమర్పించాను. ఇది జరిగి ఇప్పటికి పదినెలలు అవుతుంది కానీ ఇంతవరకు నా అకౌంట్‌ను రిలీజ్ చేయకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బ్యాంకువారిని అడిగితే పంజాబ్ కోర్టులో కేసు వేసుకోవాలి అని చెప్తున్నారు. పంజాబ్‌కి వెళ్లి కేసులు వేయడం చాలా కష్టం – అంత ఖర్చు పెట్టడం కూడా ఇబ్బంది. సలహా ఇవ్వగలరు. – చీమకుర్తి సునీల్ కుమార్, విజయవాడపంజాబ్ పోలీసులు మిమ్మల్ని నిందితుడిగా చూపిస్తూ ఏదైనా ఎఫ్.ఐ.ఆర్. చేశారా అనే విషయం ముఖ్యమైనది. మీ మీద నేరుగా నింద లేకుండా, మీ పేరును ఎటువంటి ఎఫ్.ఐ.ఆర్.లో నిందారోపితుడుగా చూపించకుండా ఉంటే మీరు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అయితే మీ బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్ హైదరాబాదులో కూడా ఉండాలి. పైన తెలిపిన అంశాలు మీ కేసులో ఉండి ఉంటే, బ్యాంకు వారు చెప్పినట్టుగా పంజాబ్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. పూర్వం కోర్టు పరిధి ఏది వస్తుంది అనే విభేదం కొంత ఉన్నప్పటికీ, అనేక హైకోర్టులు ఇలాంటి బ్యాంక్ ఫ్రీజింగ్ కేసులలో వేరే రాష్ట్రాల పోలీసుల ద్వారా ఫ్రీజ్ చేసిన అకౌంట్లను విడుదల చేయాల్సిందే అని తీర్పులు ఇచ్చాయి. కాబట్టి తెలంగాణ హైకోర్టును రిట్ పిటిషన్ ద్వారా ఆశ్రయించండి. అలా వెళ్ళేముందు మీ ఎకౌంటు ఫ్రీజ్ అయిన కారణానికి గల పత్రాలను, ముఖ్యంగా ఎఫ్.ఐ.ఆర్.ను– పంజాబ్ పోలీసులు బ్యాంకు వారికి పంపిన లేఖలను క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు చెప్పినట్లుగా 500 మాత్రమే మీ అకౌంట్‌కు వచ్చి ఉంటే – అంతమొత్తాన్నే మీ అకౌంట్లో ఫ్రీజ్ /లీన్ ఉంచి మిగతా నగదును వాడుకునేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చే ఆస్కారం ఉంది. లాయర్ గారితో ఈ విషయాలను మాట్లాడండి. ఇలాంటి గుర్తు తెలియని ట్రాన్సాక్షన్లు వచ్చిన వెంటనే బ్యాంకు వారికి లిఖితపూర్వకంగా చెప్పడం కొంతవరకు మిమ్మల్ని కాడుతుంది. - శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )చదవండి: 'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
కేన్స్‌లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్ లుక్..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?
ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్!. పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్ కానీ ఈ ప్రపంచ వేదికపై లింగ సమానత్వం, శరీర సౌందర్యం పట్ల సానుకూల దృక్పథం నుంచి రాజకీయ సందేశాలు, సంస్కృతి వరకు చర్చలకు దారితీసేలా వెలుగులోకి వస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్యాషన్ అనేది ఉద్దేశ్యంతో కూడిన వ్యక్తిగ భావప్రకటనగా మారింది. ఈ ఏడాది చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ వేదికపై భారతీయతను చాటిచెప్పేలా దుస్తులను ధరించి అదర్నీ ఆకర్షించారు. తాజాగా ఆ జాబితాలోకి మరో బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ కూడా చేరిపోయారు.ఈ రెడ్‌కార్పెట్‌పై ఆమె రాజస్థానీ సాంప్రదాయ దుస్తులతో మెరిసే అందర్నీ ఆశ్చర్యపరిచడం విశేషం. రుచి రాజస్థానీ మహిళలా 'ఘూంఘట్' ధరించే వచ్చింది. నిజానికి ఈ ఘూంఘట్'ని రాజస్థాన్‌లో మహిళలు తమ ముఖాన్ని లేదా తలని కప్పుకోవడానికి ఉపయోగించే ముసుగు లేదా వస్త్రాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ నటి రుచి సరికొత్త సందేశం ఇచ్చేలా ధరించడం విశేషం. ఆ స్టైలింగ్ వెనుక ఉన్న అర్థం..రాజస్థాన్ సాంస్కృతిక మూలాలకు సంబంధించిన స్టైలింగ్ వచ్చిన రుచి ఒక లోతైన సందేశాన్ని అందించేందుకు ఇలా రెడ్‌కార్పెట్‌పైకి వచ్చారట. రాజస్తాన్‌లోని అనేక గ్రామీణ ప్రాంతాలలో బలవంతపు ఘూంఘట్ పద్ధతులపై దృష్టిని ఆకర్షించడానికి ఈ ఆహార్యంలో వచ్చారామె. రుచి తన రూపం ద్వారా మనం సంప్రదాయాన్ని ఎంచుకోవడానికి, సామాజిక ఒత్తిడి కారణంగా బలవంతంగా పాటించాల్సి రావడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారామె. రుచి దుస్తులను రూపా శర్మ డిజైన్ చేశారు. ఇవి వారసత్వాన్ని, ప్రతికాత్మకతను సమతుల్యం చేశాయి. ఇక్కడ రుచి వీటిని ప్రతిఘటనకు చిహ్నంగా ధరించింది. ఒక మహిళ గౌరవం, సమానత్వం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ నుంచి రావాలే తప్ప ముఖం దాచుకోవడం నుంచి కాదని చెప్పేందుకే ఇలా ఆ వేదికపైకి వచ్చినట్లు పేర్కొందామె. ఈ కేన్స్ వేడుకలో తన ఉనికి ఒత్తిడిలో చిక్కుకున్న మహిళల గురించి ఒక్క చర్చనైనా ప్రారంభించగలిగితే, అప్పుడు ఈ నడకకు ఫ్యాషన్‌కు మించిన అర్థం ఉంటుందని అంటోందామె. తన ఘూంఘట్ లొంగిపోవడం కాదని, ఇది నిరసన అని తేల్చి చెప్పారామె. రాజస్థాన్‌కు చెందిన రుచి ఈ సమస్య తనకు వ్యక్తిగతంగా సంబంధించినదని అన్నారామె. సంస్కృతి మహిళలకు సాధికారత కల్పించాలి, వారిని తుడిచిపెట్టకూడదు. సంప్రదాయం కాలంతో పాటు పరిణామం చెందాలి. గౌరవం ఎప్పటికీ అదృశ్యం కావాలని కోరకూడదు అని అన్నారామె. కాగా రుచి గుజ్జర్ కేన్స్ ఇలా ప్రత్యేకమైన లుక్‌తో రావడం తొలిసారి కాదు. గతేడాది మెరిసే బంగారు, అద్దాలతో కూడిన లెహంగానూ, దానికి జతగా బరువైన కుందన్ ఆభరణాలతో కూడిన మోదీ చిత్రంతో ఉన్న లాకెట్లను ధరించి అందర్నీ విస్తుపోయేలా చేసిందామె. View this post on Instagram A post shared by Ruchi Gujjar (@ruchigujjarofficial) (చదవండి: 'కూతురు' అత్తారింటికి అప్పగించే వస్తువా? గాయని చిన్మయి శ్రీపాద ఫైర్)
'కూతురు' అత్తారింటికి అప్పగించే వస్తువా?
మాజీ మిస్ పూణే ట్విషా శర్మ మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నోయిడాకు చెందిన 33 ఏళ్ల ఈమె, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌ను వివాహం చేసుకున్న తర్వాత, మే 12న అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగా..ట్విషా కుటుంబం, ఆమె అత్తగారి కుటుంబాల మధ్య ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. అదీగాక ఈ విషాద ఘటనపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించారు కూడా. తాజాగా ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా ఈ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేసుపై తీవ్రంగా స్పందించారు. ఆమె ఎక్స్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. కూతుళ్ల పట్ల భారతీయ కుటుంబాల మనస్తత్వంపై విమర్శలు గుప్పించారు. వాళ్లు కూతుళ్లను ఒక వస్తువుల్లా చూస్తారని, ముఖ్యంగా అత్తారింటికి పంపే సరుకులా చూస్తారని అన్నారామె. కన్యాదానం తర్వాత కూతురు అత్తగారింట్లో మృతి చెందడం గౌరప్రదం కదా అంటూ ఆక్రోశించారు. పెళ్లితోనే తల్లిదండ్రులు కూతుళ్లను తిరిగి తెచ్చుకోకూడని ఓ వస్తువులాంటి వారు కదా అని వ్యగ్యంగా మాట్లాడారు. Twisha's death is proof that many Indian parents think their daughter is a commodity that is delivered to the in-laws and has no return policy. The girl can die at the In-laws. That is only honorable after Kanya Daan. Ok?— Chinmayi Sripaada (@Chinmayi) May 19, 2026 అలాగే బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో వెలుగుచూసిన వరకట్న వేధింపుల కేసులు, మరణాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్ట్‌లో వివాహానికి ముందే ఆర్థిక స్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ పెళ్లైన యువతుల గురించి ఎన్నో విషాద వార్తలు వస్తున్నాయి. పెళ్లైన ఈ యువ, విద్యావంతులైన మహిళల్లో చాలామంది, విషాదాలు జరగకముందే ఊపిరాడనంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయమని తమ తల్లిదండ్రులను వేడుకుంటున్నారు. కానీ భారతీయ సమాజం కూతుళ్లను పెళ్లయ్యాక వదిలేయడానికి ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఎవరి మాట వినొద్దు..మీరు జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోండి లేదంటే మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ముందుకురారు అని యువతకు హిత బోధ చేశారామె. View this post on Instagram A post shared by Bollywood Bubble (@bollywoodbubble) (చదవండి: థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమూ..)
'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్రామ నేపథ్యం నుంచి విదేశాలకు వలస వెళ్లి విజవయంతంగా స్థిరపడ్డాయి. వారిలో కొందరు తమ మూలాలను చూసుకునేందుకు వెనక్కి వచ్చి మరి భారతగడ్డపై అడుగుపెడుతుంటారు. పైగా తాము పుట్టి పెరిగిన ప్రాంతాలు, తమ పూర్వీకుల ఇళ్లను చూసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. నిజంగా నాడు వాళ్లు అభివృద్ది చెందాలని కష్టపడి ఉండకపోతే..తాము అక్కడ ఉండే వాళ్లం కాదన్న ఆలోచన ఉబ్బితబ్బిబైలా చేయడమే కాదు సగర్వంగా అనిపిస్తుంది. అలాంటి భావోద్వేగాన్నే పొందాడు ఈ భారత సంతతి వ్యక్తి. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అసలేం జరిగిందంటే..గోల్డ్ వాటర్ వ్యవస్థాపకుడు విజయ్ తిరుమలై అమెరికాలో రోడ్‌షోకు వెళ్లేమందు వార్షిక చిత్తిరై ఉత్సవం నిమిత్తం ఆలయ పునరుద్ధరణ పనుల కోసం తన తండ్రి గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ తన నాన్న, మామయ్యలు పెరిగిన ఇల్లు తదితరాలను గుర్తు చేసుకుంటూ..ఆ టైంలో ఇక్కడ కరెంట్ లేదు, నీటి సరఫరా లేదని చెప్పారు. అయినప్పటికీ బాల్యంలో ఇక్కడే పాలిటెక్నిక్ చదవి ఈ చుట్టుపక్కలే ఆడుకుంటూ ఎంజాయ్ చేశారని అన్నారు. ఇక తన కుటుంబం ఏ స్థాయికి చేరుకుందో గుర్తుచేసుకుంటూ..తన కజిన్స్ , ఇతర కుటుంబసభ్యులు అమెరికాలో బే ఏరియా, టొరంటో తదితర ప్రాంతాల్లో స్టార్టప్‌లు, బిగ్టెక్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడ్డారని అన్నారు. తమ కెరీర్ ప్రారంభంలో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ..మమ్మల్ని మంచి స్థాయిలో స్థిరపడేలా పెంచినందుకు మా తల్లిదండ్రులకు, పెద్దలకు సదా కృతజ్ఞతలని పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే తమ పూర్వీకుల ఇంటి ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ఇంటిలోనే తన తండ్రి, మామయ్యల బాల్యం సాగిందని చెప్పారు. అయితే నెటిజన్లు వలసలు, త్యాగాల ఫలితం ఉన్నత స్థాయికి ఎదగడంతో ముడిపడి ఉన్న కుటుంబ చరిత్రను ఈ ఇల్లు గుర్తు చేస్తుందని అన్నారు. మరొక నెటిజన్ శెభాష్ విజయం..ఒక తరం అభివృద్ధి చెందడం కోసం ఇంకో తరం కష్టపడి త్యాగాలు చేస్తుంది. ఇది అద్భుత కుటుంబ కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.Yesterday took some time off ( before i head off for a US road show) to visit my dad's village for the annual festival ( Chittirai) to the temple where we do our part for renovations etcThis is the house my dad and my uncles grew up, no electricity, no running water, nothing,… pic.twitter.com/S8ZohHFMLM— Vijay Thirumalai (@vijaythirumalai) May 18, 2026 (చదవండి: ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..)
అంతర్జాతీయం
విమానాల కూల్చివేత కేసు.. రావుల్ కాస్ట్రోకు అమెరికా షాక్
అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. 1996 నాటి అమెరికా పౌర విమానాల కూల్చివేత కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రో (94) పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో అధికారికంగా విచారణ ప్రారంభమైంది.ఈ చార్జ్‌షీట్ విడుదలైన కొద్ది గంటల్లోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా ప్రజలను ఉద్దేశించి ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. క్యూబాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న కాస్ట్రో కుటుంబ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇదే విషయంపై అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మయామిలో మాట్లాడుతూ.. "30 ఏళ్ల కిందట హత్యకు గురైన నలుగురు అమెరికన్ల కుటుంబాలు ఇప్పటికి న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి. వారు సాధరణ పౌరులు. వారి వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. శరణార్థులను కాపాడానికి వెళ్లిన మా పౌరులను పొట్టన పెట్టుకున్నారు. అందులో రావుల్ కాస్ట్రోది కీలక పాత్ర. అతడి అరెస్ట్ కోసం త్వరలోనే ఒక వారెంట్ జారీ చేస్తాం. కాబట్టి అతడు తనంతట తాను అమెరికాకు వస్తాడని ఆశిస్తున్నాము. లేకపోతే ఇతర మార్గాల్లో మేమే రప్పిస్తామని" ఆయన పేర్కొన్నారు.అసలు 1996లో ఏమి జరిగిదంటే?'బ్రదర్స్ టు ది రెస్క్యూ' మయామి కేంద్రంగా పనిచేసే ఒక మానవతావాద సంస్థ. అప్పటిలో క్యూబాలోని కమ్యూనిస్ట్ దారుణాలను తట్టుకోలేక చిన్న పడవల్లో సముద్రం గుండా అమెరికాకు పారిపోయే క్యూబన్ శరణార్థులను ఆకాశం నుండి గుర్తించి, వారిని రక్షించడం ఆ సంస్థ పని. ఈ సంస్థకు చెందిన మూడు చిన్న సివిలియన్ విమానాలు 1996 ఫిబ్రవరి 24న ఫ్లోరిడా జలసంధి మీదుగా ప్రయాణించాయి. అయితేఅంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తుండగా క్యూబాకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు వాటిపై దాడి చేసి కూల్చివేశాయి. ఈ ఘటనలో కార్లోస్ కోస్టా, అర్మాండో అలెజాండ్రే జూనియర్, మారియో డి లా పెనా, పాబ్లో మోరల్స్ అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు అమెరికా పౌరులు ఉన్నారు. ఆ సమయంలో రావుల్ కాస్ట్రో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్నారు. అతడి ఆదేశాల మేరకే అమెరికా సివిలియన్ విమానాలను కూల్చివేశారని అమెరికా న్యాయశాఖ నిర్ధారించింది. దీంతో ఇన్నాళ్ల తర్వాత కాస్ట్రోపై అభియోగాలు నమోదు చేసింది.
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌లో తనకు తనకు విశేష ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశముందని వెల్లడించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కూడా ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారునెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన ఒక యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నాకు మాత్రం 99 శాతం ప్రజాదరణ ఉంది. నేను అక్కడ ప్రధానమంత్రిగా పోటీ చేసినా గెలవగలను" అని ట్రంప్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా ఇరాన్‌తో ఒప్పందం గురించి విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఎలాంటి తొందర లేదని ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించడమే తమ లక్ష్యమని, ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అహ్మదినెజాద్ను అధికారపీఠంపై కూర్చోబెట్టాలని చూశారు
వాషింగ్టన్: వెనుజువెలాలో మదురో దంపతుల అధికారభవనంపైకి మెరుపుదాడిచేసి వాళ్లను బంధించి అధికారపీఠం నుంచికూల దోసిన అమెరికా ప్రభుత్వం అదే తరహాలో ఇరాన్‌లోనూ అధికార మార్పిడికి యత్నించి విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను వెలువర్చింది. 2005 నుంచి2013 ఏడాదిదాకా ఇరాన్‌కు అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేర్చిన మొహ్మూద్ అహ్మదినెజాద్కు తిరిగి అధికారాన్ని అప్పగించాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నించాయని నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీసహా పలువురు కీలక నేతలను వైమానిక దాడులతో అంతమొందించడం తెల్సిందే. వెనువెంటనే అహ్మదినెజాద్ ను గద్దెనెక్కించాలని అమెరికా ప్రయత్నించి నా అందుకు సానుకూలవాతావరణంలేక మిన్నకుండిపోయిందిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అహ్మదినెజాద్ పరిపాలనాధోర ణిని ఏమాత్రం మెచ్చని నాటి ఖమేనీ ఆ తర్వాత ఆయనను గృహనిర్బంధంచేశారు. దీంతో శత్రువుకు శత్రువు మిత్రువు అనే చందంలో ఖమేనీ అంటే మెచ్చని అహ్మది నెజాద్‌ను అమెరికా, ఇజ్రాయెల్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ మేరకు ఆయనతో రహస్యంగా సంప్రతింపులు జరిపినట్లు తెలుస్తోంది. గృహనిర్బంధంలో ఉన్న అహ్మదినెజాద్ను విడిపించేందుకే ఫిబ్రవరి 28న ఆయనను బంధించి ఇంటి మీదా అమెరికా దాడులుచేసి ఇంటిని ధ్వంసంచేసింది. అయితే ఈ దాడిలో అహ్మదినెజాద్ గాయపడ్డారని, తర్వాత ఆయన ఎవరికీ కన్పించకుండాపోయారని వార్తలొచ్చాయి.
బక్రీద్ కానుక.. 1400 మందికి పైగా ఖైదీల విడుదల!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జైళ్లులలో మగ్గుతున్న 956 మంది ఖైదీలను విడుదల చేయాలని నహ్యాన్ ఆదేశించారు.సమాజంలో క్షమాగుణాన్ని,సోదరభావం, సామాజిక సమరసతను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వివిద కేసుల్లో శిక్ష అనుభవిస్తూ జరిమానాలు లేదా ఆర్థికపరమైన బకాయిలు చెల్లించలేక జైళ్లలోనే ఉంటున్న ఖైదీల అప్పుల మొత్తాన్ని యూఏఈ అధ్యక్షుడే స్వయంగా చెల్లించనున్నారు. దీంతో బయటకు వచ్చిన ఖైదీలు ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. మరోవైపు అజ్మాన్ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్-నుఐమి కూడా తన పరిధిలోని జైళ్ల నుండి 230 మంది ఖైదీలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి సైతం 227 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో మొత్తం 1400కు పైగా ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. కాగా ప్రతీ ఏడాది రంజాన్, రంజాన్, బక్రీద్, జాతీయ దినోత్సవాల సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఒక ఆనవాయితీగా వస్తోంది.
జాతీయం
నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం : సైంటిస్టుల హెచ్చరిక
శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగంతో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతలు ఎగసి వాతావరణ మార్పులు సర్వసాధారణమవుతున్నాయి. గ్లోబల్ వారి్మంగ్ ధాటికి వర్షాలు తగ్గి పంటదిగుబడి దారుణంగా పడిపోయి ప్రజలకు ఆకలికష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. వాతావరణ మార్పులు అనేవి ఒక్క మానవాళికే కాదు జలచరాలకూ కొత్త పెనుసమస్యగా దాపురించిందని అంతర్జాతీయ అధ్యయనం ఒకటి హెచ్చరికలు చేసింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో నదీజలాల ఉపరితల ఉష్ణోగ్రతలు హెచ్చుతున్నాయని దీంతో నదీజలాల నుంచి ఆక్సిజన్ నెమ్మదిగా అదృశ్యమవుతోందన్న ప్రమాదహెచ్చరికలను చైనాలోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలసహితంగా వెల్లడించారు. 1985 ఏడాది నుంచిచూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 21,000 ప్రధాన నదుల్లో ఆక్సిజన్ స్థాయిలు నెమ్మదిగా తగ్గుతున్నాయని అధ్యయనంలో తేలింది. 1985 ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ముఖ్యమైన నదీజలాల్లో ఆక్సిజన్ 2.1 శాతం తగ్గిందని వెల్లడైంది. ఉష్ణోగ్రతలు ఇలాగే అత్యధిక స్థాయిల్లో కొనసాగితే నదీజలాల్లో ఆక్సిజన్ క్షీణత మరింత పెరిగే ఆస్కారముంది. ఆక్సీజన్ తగ్గిపోతే ప్రాణవాయువును పీల్చి బతికే జలచరాల మనుగడే ప్రశ్నార్థకమంగా మారే ప్రమాదముంది. ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘సైన్సెస్ అడ్వాన్సెస్’జర్నల్‌లో శుక్రవారం ప్రచురితమయ్యాయి. ఆమ్లజని గాఢత తగ్గుతూ పోతే వచ్చే శతాబ్దంచివరినాటికి తూర్పు అమెరికా మొదలు భారత్ దాకా ఉష్ణమండల ప్రాంతాలు దేశాల్లో నదుల్లో చేపల వంటి జలచరాల సంఖ్య దారుణంగా పడిపోతాయి. అప్పుడు నదీజలాల్లో వెతికినా ఒక్క చేప కూడా దొరకదని అధ్యయనం ముందస్తు ప్రమాదఘంటికలు మోగించింది. సాధారణంగా భౌతిక, రసాయన శాస్త్ర భావనల ప్రకారంచూసినా వేడి నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మానవప్రేరేపిత వాతావరణ మార్పుల ప్రభావం అతిగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో ఆయువు పోయాల్సిన ఆమ్లజనికి మనిషే స్వయంగా ఆయువు తీస్తున్నాడని నివేదిక ఘాటు వ్యాఖ్యలుచేసింది. ప్రస్తుతమున్న క్షీణతరేటును పరిగణనలోకి తీసుకుంటే ఈ శతాబ్దంచివరినాటికి నదుల్లో ఆక్సిజన్ 5 శాతం తగ్గిపోయే అవకాశముంది. నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం మత్స్యకారులకు, మత్స్యసంబంధ వృత్తులతో జీవనం సాగించే జనాభాకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో కీలక రచయిత, నంజియాంగ్ సిటీలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఎన్విరాన్మెంటల్ విభాగ శాస్త్రవేత్త క్వీ గువాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘నదుల్లో ఆక్సిజన్ తగ్గిపోతే దానిని డీఆక్సిజనరేషన్గా పిలుస్తాం. ఇది చేపల సంతతిపై, వాటి మనుగడపై దుష్ట్రభావం చూపిస్తుంది. నాణ్యమైన ఆక్సిజన్ లేకపోతే జలచరాల ఉనికి ప్రమాదంలో పడుతుంది. చేపలు, రొయ్యలు, ఇతరత్రా చలజరాల దిగుబడి తగ్గిపోతే మత్స్యకారులతోపాటు మత్స్యరంగం అభివృద్ధి సైతం కుంటుబడుతుంది. ఇదీ చదవండి: సరస్వతీ మాత విగ్రహం కోహినూర్ కన్నా ముఖ్యంఇది పరోక్షంగా ఆయా దేశాల జీడీపీపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆక్సిజన్ క్షీణతరేటు విపరీతంగా పెరిగిపోతే నదీమతల్లులు చివరకు జలచరాల మృత్యుకుహరాలుగా రూపాంతరంచెందుతాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, చీసాపీక్ బే, లేక్ ఎరీ లాంటి ప్రాంతాల్లో చేపలు కనీసం శ్వాసించే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు మత్స్యసంపదకు ఆలవాలమైన ప్రాంతాలన్నీ డెడ్ జోన్లుగా మిగిలిపోతాయి’’అని శాస్త్రవేత్త హెచ్చరించారు. గంగానది మరింత దారుణం ‘‘పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సగటు మరింత పెరుగుతున్న ఈ రోజుల్లో గంగానదిలో ఆక్సిజన్ పాళ్లు ఏకంగా 20 రెట్లు ఎక్కువ వేగంతో క్షీణిస్తున్నాయి. తూర్పు అమెరికా, ఆర్కిటిక్, భారత్, దక్షిణ అమెరికాలోని నదుల్లో ఈ శతాబ్దం చివరినాటికి ఆక్సిజన్ దాదాపు 10 శాతం క్షీణించనుంది. బ్రెజిల్‌లోని అమెజాన్ వంటి ఉష్ణమండల నదుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1980 నుంచి చూస్తే అమెజాన్ నదిలో ఆక్సీజన్లేని డెడ్జోన్ ప్రాంతాల్లో రోజుల సంఖ్య ప్రతి దశాబ్దానికి అదనంగా 16 రోజులు పెరుగుతూ పోతోంది’’అని శాస్త్రవేత్త క్వీ గువాన్ తెలిపారు. అందరి ఆయువును నిలబెట్టే ఆక్సీజన్‌ను నదుల్లో నిలుపుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని శాస్త్రవేత్తలు హితబోధ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఇదీ చదవండి: 60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్ స్టార్ట్
‘ఎబోలా’ కలకలం: అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్
న్యూఢిల్లీ: ఆఫ్రికా ఖండంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ‘ఎబోలా’ వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ తరుణంలో దేశీయంగా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కఠినమైన నిఘా, స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎయిర్‌పోర్టుల్లో కఠిన నిఘాడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. ఎబోలా ప్రభావిత దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ ల నుండి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ వద్ద ఆరోగ్య పరిస్థితిని నివేదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ కారణంగా వందలాది కేసులు, 130 కి పైగా మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ, అధిక జనాభా కలిగిన నగరాల్లో వైరస్ వ్యాపించకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.21 రోజుల పర్యవేక్షణ.. ఆ లక్షణాలు ఉంటే ప్రమాదమే! ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసం, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి లేదా అకస్మాత్తుగా రక్తస్రావం కావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే స్వయంగా అధికారులకు సమాచారం అందించాలి. విమానాశ్రయంలో దిగిన తర్వాత 21 రోజుల పాటు ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించుకోవాలి. ఈ మూడు వారాల వ్యవధిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యులను సంప్రదించి, తమ అంతర్జాతీయ ప్రయాణ వివరాలను పూర్తిగా వెల్లడించడం చట్టపరంగా తప్పనిసరి.వ్యాక్సిన్లు పనిచేయవు..ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ ప్రారంభ లక్షణాలు సాధారణ ఇన్ఫ్లుఎంజా, టైఫాయిడ్, మలేరియాను పోలి ఉండటం వల్ల దీనిని గుర్తించడం వైద్యులకు సవాలుగా మారింది. అంతేకాకుండా, అందుబాటులో ఉన్న ప్రామాణిక ఎబోలా వ్యాక్సిన్లు ‘జైర్’ స్ట్రెయిన్‌ను అడ్డుకోవడానికి రూపొందించినవి కావడంతో, ప్రస్తుత కొత్త వేరియంట్‌పై ఇవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో, నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ని ప్రధాన కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్‌పోర్టుల్లో అనుమానిత లక్షణాలు ఉన్నవారిని నేరుగా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు.
మదరసాల్లో ‘వందేమాతరం’ నిర్బంధం
కోలకతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న, గుర్తింపు పొందిన మదరసాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ ఉదయం జరిగే అసెంబ్లీ ప్రార్థనల్లో ‘వందేమాతరం’ ఆలపించడాన్ని తప్పనిసరి విధిగా మార్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన అధికారిక నోటీసు సరికొత్త చర్చకు తెరలేపింది. తరగతులు ప్రారంభం కావడానికి ముందే విద్యార్థులందరూ తప్పనిసరిగా జాతీయ గేయాన్ని పాడేలా చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలుజాతీయ గేయమైన ‘వందేమాతరం’నకు రూపకల్పన జరిగిన 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఆదేశాల అనుగుణంగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఉదయపు ప్రార్థనల సమయంలో వందేమాతరం ఆలపించేలా చూడాలని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే జాదవ్‌పూర్ విద్యాపీఠ్ వంటి పలు ప్రముఖ విద్యాసంస్థలు ఈ నిబంధనను అమలు చేయడం ప్రారంభించాయి. West Bengal: Directorate of Madrasah Education has made the singing of “Vande Mataram” mandatory during assembly prayers before classes in all government, aided, and recognised madrasahs across the state with immediate effect pic.twitter.com/6MK8h0D3YR— IANS (@ians_india) May 20, 2026రాష్ట్ర గేయంపై సందిగ్ధతగత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర పాఠశాలల్లో ‘బాంగ్లార్ మాటి బాంగ్లార్ జల్’ (రాష్ట్ర గేయం) పాడటాన్ని నిర్బంధం చేసింది. అయితే, తాజా ఉత్తరవుల్లో కేవలం వందేమాతరం గురించి మాత్రమే ప్రస్తావించడంతో, పాత నిబంధన కొనసాగుతుందా లేదా అనే అంశంపై పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్లో సందిగ్ధత నెలకొంది. విద్యాశాఖ అధికారులు సైతం కొత్త ఆదేశాలలో రాష్ట్ర గేయం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని, కేవలం వందేమాతరం ప్రార్థనను చేర్చాలని మాత్రమే సూచించినట్లు స్పష్టం చేశారు.సమయాభావంపై ఉపాధ్యాయుల ఆందోళనఈ కొత్త నిబంధన వల్ల పాఠశాలల్లో సమయపాలన దెబ్బతినే అవకాశం ఉందని కొందరు పాఠశాలల అధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ జాతీయ గీతమైన ‘జనగణమన’ పాడటం తప్పనిసరి, దానికి తోడు ఇప్పుడు ‘వందేమాతరం’ చేరింది. ఒకవేళ రాష్ట్ర గేయాన్ని కూడా కొనసాగిస్తే, విద్యార్థులు వరుసగా మూడు పాటలు పాడాల్సి వస్తుందని, దీనివల్ల ఉదయపు ప్రార్థనల సమయం ఎక్కువై తరగతులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
తమిళనాట మళ్లీ గీతాలాపన వివాదం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ ‘గీతాలాపన’ వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం గురువారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార ఉత్సవంలో అధికారిక గీతాల ఆలపన క్రమం తీవ్ర దుమారానికి దారితీసింది. సంప్రదాయకంగా పాడే ‘తమిళ్ తాయ్ వాజ్తు’ (తమిళ మాత వందనం)కు ముందే ‘వందేమాతరం’ ఆలపించడంపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నాయి. ఇటు తమిళ అస్తిత్వం, అటు జాతీయ ప్రొటోకాల్ మధ్య నడుస్తున్న ఈ రాజకీయ యుద్ధం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.విజయ్ సర్కార్‌పై డీఎంకే, సీపీఐ ఆగ్రహంతాజా మంత్రివర్గ విస్తరణలో భాగంగా 23 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ కార్యక్రమంలో ‘వందేమాతరం’ మొదటి స్థానంలో, జాతీయ గీతం ‘జనగణమన’ రెండో స్థానంలో ఆలపించగా, ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను మూడో స్థానానికి పరిమితం చేశారు. దీనిపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తీవ్రంగా మండిపడింది. తమిళ గుర్తింపును, సంస్కృతిని కాపాడటంలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) విఫలమైందని డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై విమర్శించారు. అటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ గీతానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రస్తుత మార్పు గత సంప్రదాయాలను ఉల్లంఘించడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ ఆదేశాల మేరకే ఈ తప్పు జరిగిందని ఆయన ఆరోపించారు.కౌంటర్ ఇచ్చిన బీజేపీ: అది ‘నేషనల్ ప్రొటోకాల్’ప్రతిపక్షాల విమర్శలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతే తీవ్రంగా స్పందించింది. ప్రమాణ స్వీకార ఉత్సవాల్లో ఇతర గీతాల కంటే ముందు ‘వందేమాతరం’ ఆలపించడం అనేది ‘నేషనల్ ప్రొటోకాల్’ (జాతీయ నియమావళి) అని బీజేపీ నాయకురాలు తమిళసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ‘తమిళ మాతను ఎవరూ అవమానించలేరు, తమిళ మాత ఎల్లప్పుడూ జాతీయవాదాన్ని గౌరవిస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. డీఎంకే దేశ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతోందని, అందుకే ప్రజలు వారికి గతంలోనే బుద్ధి చెప్పారని ఆమె కౌంటర్ ఇచ్చారు.కేరళలోనూ ఇదే సెగ.. దేశవ్యాప్తంగా చర్చఈ వివాదం కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు, పొరుగు రాష్ట్రమైన కేరళలోనూ ఇటువంటి చర్చకు దారితీసింది. అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేబినెట్ ప్రమాణ స్వీకారంలో ‘వందేమాతరం’ పూర్తి వెర్షన్‌ను ఆలపించడంపై సీపీఐ(ఎం) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక బహుళత్వ సమాజంలో ఇది సరైనది కాదని, ఆ గీతంలోని కొన్ని భాగాలు మతపరమైన అంశాలతో కూడి ఉన్నాయని లెఫ్ట్ పార్టీలు ఆరోపించాయి. అయితే లెఫ్ట్ పార్టీల వ్యాఖ్యలు జాతీయ గీతాన్ని అవమానించడమేనని, తుష్టీకరణ రాజకీయాల్లో భాగమేనని కేరళ బీజేపీ నేతలు తిప్పికొట్టారు. మొత్తానికి ‘వందేమాతరం’ చుట్టూ ముసురుకున్న ఈ వివాదం దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
ఎన్ఆర్ఐ
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
క్రైమ్
బతికి ఉంటే ఇబ్బంది పెడతాడని.. భర్తను చంపేసింది
హైదరాబాద్: కుటుంబ కలహాలతో వేరుగా ఉంటున్న భార్య ఇంటికి పిల్లలను చూడటానికి వచ్చిన భర్తను తమ్ముడు, అతని స్నేహితుడితో కలిసి భార్య విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. వికారాబాద్ జిల్లా హజీపూర్ గ్రామానికి చెందిన గురు వెంకటేశ్ (31) బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటూ హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య, పిల్లలు వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్.. పిల్లలను చూసేందుకు రైతు బజార్ సమీపంలోని డబుల్బెడ్రూం నివాసాల్లో భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు.భర్తను చూసిన స్వప్న ఇక్కడికెందుకు వస్తున్నావు అంటూ తమ్ముడు పాండుతో కలిసి మూడో అంతస్తు నుండి కిందకు తీసుకువస్తూ దాడి చేశారు. అంతటితో ఆగకుండా పాండు తన స్నేహితుడు జగదీష్‌ను పిలిపించుకుని ముగ్గురూ కలిసి మూకుమ్మడిగా దాడిచేశారు. స్పృహ తప్పి పడిపోవడంతో..బతికి ఉంటే మళ్లీ ఇబ్బంది పెడతాడని దాడి చేసి తీవ్రంగా కొట్టి గ్రౌండ్‌ఫ్లోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు గమనించారు. మృతుడి సోదరుడు గురు తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతుని భార్య స్వప్న, ఆమె తమ్ముడు పాండు, అతని స్నేహితుడు జగదీష్‌లపై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు? నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారిస్తున్నట్లు తెలిసింది.
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్‌గా కూడా చాలాకాలం సేవలు అందించారు.
యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య
యర్రగొండపాలెం: తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా నరికి పొలాల్లో ఉన్న బోరు బావిలో పడేసిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీవైఎస్పీ కె.నాగరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెంచు కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు (21) ఈ నెల 13వ తేదీ రాత్రి ఓ 15 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూస్తే బాలికతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆవేశంలో ఇంట్లో ఉన్న అట్లపెనం తీసుకొని యువకుడి తలపై మోదడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు కూడా ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాసన వస్తుండటంతో నిందితులు మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ముక్కలుగా నరికి అక్కడికి సమీపంలోని ప్రైవేటు స్కూలు వెనుక వైపు పొలాల్లో ఉన్న ఒక బోరుబావిలో పడేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆంజనేయులు కనిపించకుండా పోయాడని అతని బావ చెల్లె వెంకటరావు ఈ నెల 16న ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ కె.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు సెల్ ఆధారంగా బాలిక ఇంటి వద్ద అదృశ్యమైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్నబాలిక తల్లిదండ్రులకు పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు. వారి కుమార్తెను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ కె.అజయ్‌కుమార్, ఎస్సై ఎం.దేవకుమార్‌లను ఆయన అభినందించారు. బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా డీవైఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మృతుడు ఆంజనేయులు బంధువులు పోలీస్ స్టేషన్లో గొడవకు దిగారు. వెంటనే బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీయాలని, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అత్తమామలను చంపిన అల్లుడికి ఉరి
వరంగల్ లీగల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడానికి అమె తల్లిదండ్రులు (అత్తమామలు) కారణమని భావించి వారిని చంపిన అల్లుడికి వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి జె. మైత్రేయి బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజుకు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు చెందిన బానోతు దీపిక ప్రేమించుకున్నారు. 2023లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. అయితే పెళ్లయినప్పటి నుంచే దీపికను నాగరాజు గృహహింసకు గురిచేయడంతో భరించలేని ఆమె 2024లో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అందుకు దీపిక తల్లిదండ్రులే కారణమని కక్ష పెంచుకున్న నాగరాజు.. ఆ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. 2024 జూలై 10న అర్ధరాత్రి దాటాక 16 చింతల తండాకు చేరుకొని నిద్రిస్తున్న దీపికతోపాటు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా బానోతు శ్రీను మృతి చెందాడు.
వీడియోలు
నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు
బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి
బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి
మరో వివాదంలో సీఎం విజయ్
సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
తూప్రాన్ లో భారీ అగ్నిప్రమాదం.. కంటైనర్ తో పాటు 8 కొత్త కార్లు దగ్ధం
అమిత్ షా తో పవన్ కళ్యాణ్ మీటింగ్.. జగన్ రియాక్షన్
నాగర్ కర్నూల్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో దగ్ధమైన షాపులు
పెట్రోల్ ఇక దొరకదు! సంక్షోభం రాకముందే జాగ్రత్త..
నేను తలుచుకుంటే.. వాళ్లు బ్రతికి ఉండేవాళ్లా?


