అభిమాని కల నిజం చేసిన హీరో రామ్..! | Tollywood Hero Ram Pothineni Meet His Fan at her Home | Sakshi
Sakshi News home page

Ram Pothineni: రియల్ హీరో అనిపించుకున్న రామ్..!

May 21 2026 4:47 PM | Updated on May 21 2026 4:53 PM

Tollywood Hero Ram Pothineni Meet His Fan at her Home

aటాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని కలను నిజం చేశారు. ఎప్పటికైనా తనను కలవాలని ఆరాటపడుతున్న వీరాభిమాని కోరికను నెరవేర్చాడు. 18 ఏళ్లుగా 'ఫ్రీడ్రిచ్ అటాక్సియా' అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న అమ్మాయి ఇంటికి వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానితో మాట్లాడిన రామ్ తనకు ధైర్యం చెప్పారు. అప్యాయంగా పలకరించిన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో రామ్ చేసిన పనిపై టాలీవుడ్ సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సమాజిక మాధ్యమాల్లో  వైరలవుతోంది.

ఇక ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ సినిమాల విషయానికొస్తే ఆయన తొలిసారి మెగా ఫోన్ పట్టనున్నారు. రామ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌ చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీలో రామ్‌ వీర పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం స్పెషల్‌గా మేకోవర్‌ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement