బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఓటీటీ స్ట్రీమింగ్పై మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ నెల 22 నుంచి ఓటీటీలో అన్‌కట్ వర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. రెండు ఓటీటీల్లోనూ ఒకేరోజు ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌తో జియోహాట్‌స్టార్‌లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ అన్‌కట్ వర్షన్ దాదాపు 3 గంటల 25 నిమిషాల పాటు ఉండనుందని మేకర్స్ రివీల్ చేశారు. దీంతో ధురంధర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


