ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం | Air India flight grounded after sudden runway scare in Bengaluru | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

May 21 2026 5:24 PM | Updated on May 21 2026 6:05 PM

Air India flight grounded after sudden runway scare in Bengaluru

బెంగళూరు: ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేను విమాన చివరి భాగం(తోక) తగలడంతో  ఒక్కసారిగా కలవరం మొదలంది. ఢిల్లీ నుంచి నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం ల్యాండ్‌ అవుతుండగా ఇది చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 181 ప్రయాణికులు ఉన్నారు.  

ఎయిర్‌ ఇండియా విమానం AI2651లో ఇది చోటు చేసుకుంది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండింగ్‌ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించారు. 

ల్యాండింగ్ కోసం సమీపిస్తున్నప్పుడు విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ అస్థిరమైన ల్యాండింగ్ ప్రయత్నం తరువాత పైలట్ గో-అరౌండ్‌ (ల్యాండింగ్ ప్రయత్నాన్ని రద్దు చేసి మళ్లీ గాల్లోకి ఎగిరి, మరోసారి ల్యాండింగ్ ప్రయత్నం చేయడం) చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది చేస్తున్నప్పుడు విమాన చివరి భాగం నేలను తాకింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణీకులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి పీటీఐకి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement