ప్రస్తుతం కాలంలో పెళ్లి అంటే పెద్ద హంగూ ఆర్బాటం. ప్రీవెడ్డింగ్ షూట్, మెహిందీ, సంగీత్, బారాత్, వందలకొద్దీ అతిథులు, విందు భోజనాలు అబ్బో ఈ లిస్ట్ చాలా పెద్దదే. కానీ అలాంటివేమీ లేకుండానే కేవలం 9 మంది అతిథుల సమక్షంలో, ఎలాంటి వెడ్డింగ్ ప్లానర్ సహాయం లేకుండా ఒక భారతీయ వధువు తన డ్రీమ్ వెడ్డింగ్‌ను ఇటలీలోని ప్రసిద్ధ 'లేక్ కోమో' (Lake Como) తీరాన అద్భుతంగా ప్లాన్ చేసుకుంది. గత ఏడాది జరిగిన ఈ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి.
కింజల్ పటేల్, హెరిత్ వచ్హానీ జంట చేసుకున్న ఈ వివాహం... 'బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్'కి భిన్నంగా, . విలాసవంతమైన పెళ్లి అంటే ఖర్చు, హడావుడి మాత్రమే కాదు, అది మనసుకు నచ్చిన వారితో గడిపే ఒక ప్రశాంతమైన అనుభూతి అని నిరూపించింది.అంతేకాదు ఈ పెళ్లిలోని అసలైన విశేషం ఏంటంటే.. ఇంతటి లగ్జరీ వెడ్డింగ్‌ను వధువు కింజల్ సొంతంగా డిజైన్ చేసింది. ఏ వెడ్డింగ్ ప్లానర్‌ను పెట్టుకోకుండా, ప్రదీ వెండర్‌తో ఆమె స్వయంగా మాట్లాడి ప్లాన్ చేసుకుంది.
ఇటాలియన్ వైభవం.. పూల పరిమళాలు
ప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ 'హౌస్ ఆన్ ది క్లౌడ్స్' తీసిన పెళ్లి ఫోటోలు ఒక అందమైన పెయింటింగ్‌లా ఉన్నాయి. ఇటలీలోని చారిత్రాత్మక 'విల్లా బాల్బియానో' (Villa Balbiano) లాన్‌పై, ఆల్ప్స్ పర్వతాల నీడలో, లేక్ కోమో సరస్సు పక్కన వీరి పెళ్లి వేడుక జరిగింది.ప్రశాంతత, ఆత్మీయత, ఒక పెద్ద SUV కార్లో సరిపోయేంత మంది అతిథులతో వారు తమ పెళ్లిని జరుపుకున్నారు.
సాంప్రదాయక భారీ వూడెన్ మండపానికి బదులుగా.. లావెండర్, పెరివింకిల్ రంగుల హైడ్రాంజియా పూలు, ఆరెంజ్ జెర్బెరాస్, బర్డ్ ఆఫ్ పారడైజ్ వంటి విదేశీ పూలతో కిందనే అద్భుతమైన పూల బాటను డిజైన్ చేశారు. ఆకాశం నుండి చూస్తే, ఈ జంట కోసం ఆ తోటలోనే పూలు పూశాయా అన్నట్లుగా ఆ డెకరేషన్ మెరిసిపోయింది.
పింక్ శారీలో మెరిసిన వధువు
వధువు కింజల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన సెలెరియల్ పింక్ కలర్ లెహంగా స్టైల్ శారీని ఎంచుకుంది. ఇటలీ ఆకాశం కింద ఆమె దుస్తులపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్, వెనుకకు సాగిపోతున్న నెట్ వేల్ (veil) ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి. వరుడు హెరిత్ క్రీమ్ కలర్ షేర్వాణీలో హుందాగా కనిపించాడు. వారు పరస్పరం పూలమాలలు మార్చుకునే (వర్మాల) క్షణాలు ఎంతో ప్రశాంతంగా, మనోహరంగా సాగాయి.లేక్ కోమో నేపథ్యంలో క్రీమ్ కలర్ షేర్వాణీలో హుందాగా వరుడు హెరిత్ చిరునవ్వుతో వెనక్కి వంగడం, కింజల్ అతనికి దండ వేయడం...ఎలాంటి హడావిడి, గందరగోళం లేకుండా ప్రశాంతమైన, ఆనంద క్షణాలను ఆస్వాదించారు.
ఇదీ చదవండి : ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?
9 మంది అతిథులు మాత్రమే!
గత ఏడాది అక్టోబర్‌లో 'వోగ్ ఇండియా' (Vogue India) మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంట తమ నిర్ణయాన్ని పంచుకున్నారు. "పెళ్లి హడావుడిలో మాకు మే ఎక్కడో తప్పిపోవాలని అనుకోలేదు. మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే అత్యంత ఆత్మీయుల మధ్య, మేం ఎలా ఉంటామో అలాగే ప్రశాంతంగా ఈ క్షణాలను ఆస్వాదించాలనుకున్నాం" అని వారు చెప్పారు.
కేవలం 9 మంది కుటుంబ సభ్యులతో ఈ పెళ్లి జరగడం వల్ల వందల మంది అతిథుల మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, మూడు రోజుల అలసట వంటి ఒత్తిళ్లేవీ వారికి లేకుండా పోయాయి. పెళ్లి తర్వాత వారంతా 'పాసాలాక్వా' (Passalacqua) అనే చారిత్రాత్మక హోటల్‌లో ఒకరినొకరు చూసుకుంటూ, హాయిగా మాట్లాడుకుంటూ ప్రైవేట్ డిన్నర్‌ను ఆస్వాదించారు. కృత్రిమమైన భారీ బ్యాక్‌డ్రాప్‌ల కంటే కోట్లాది సంవత్సరాల నాటి ఆల్ప్స్ పర్వతాలు, లేక్ కోమో సరస్సే తమ పెళ్లికి గొప్ప వేదిక అని ఈ జంట నిరూపించింది.
అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రశాంతంగా భోజనం చేస్తూ పెళ్లిని ఆస్వాదించడం అంటే ఇవాల్టి రోజుల్లో అరుదైన విలాసమని చెప్పవచ్చు. ఒక వెడ్డింగ్ ప్లానర్ ఇవ్వలేని గొప్ప తృప్తిని, విజయాన్ని తన కలల పెళ్లిని తానే స్వయంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా సాధించానని కింజల్ గర్వంగా చెప్పింది.
ఇదీ చదవండి: బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్ తీసుకొని ప్రియుడితో పరార్


