బాలీవుడ్ బుల్లి తెర నటి మౌనీరాయ్ కూడా ఫ్రెంచ్ రివేరాలో జరుగుతున్న 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెరిశారు. ఇప్పటి వరకు అలియా భట్, అదితిరావు హైదరి, డయానా పెంటీ, నటి రుచి గుజ్జర్ తదితర తారాగణం అద్భుతమైన డిజైనర్‌వేర్‌లతో, అందచందాలతో ఆకట్టుకున్నారు. తాజాగా వారి సరసన మౌనీరాయ్ కూడా చేరారు.
చెప్పాలంటే ఈ వేదికపై భారతీయ సాంప్రదాయ వారసత్వ కళలు తళక్కుమనడం విశేషం. మన దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ వారసత్వాలు తరతరాలు తెలుసుకునేలా అత్యద్భతంగా ప్రదర్శించారు పలువురు సెలబ్రిటీలు. ఇక మౌనీరాయ్ కూడా ఈ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో పటోలా ప్రింట్ గౌనుతో తుళుక్కుమంది.
ఈ ప్రపంచ వేదికపైనే ఆమె సినిమా పోస్టర్ టీజర్‌ని కూడా విడుదల చేశారు . గుజారాతీ పటోలా ఎండ్రాయిడరీ వర్క్ చేసిన ఈ గౌనులో మౌనీరాయ్ అత్యంత స్టైలిష్‌గా కనిపించారు. దీన్ని డిజైనర్ పూజా షా రూపొందించారు. ఈ డ్రైస్‌పై ఎంబ్రాయిడరీ చేయడానికి కళాకారులకు ఏకంగా 300 గంటల సమయం పట్టిందట. ఈ డ్రెస్ ‘ది హౌస్ ఆఫ్ పటోలా’ అనే దుస్తుల లేబుల్‌కు చెందినది.
వీపు భాగం లేకుండా పూర్తి నిడివి గల గౌనుని చేతులు లేని సిల్హౌట్ శరీరానికి హత్కుకుపోయే ఫిట్, స్క్వేర్ నెక్లైన్తో కలర్ఫుల్గా ఎంబ్రాయిడరీ చేశారు. అందుకు తగ్గట్టుగా కాటుక కళ్లు, స్మడ్జ్ చేసిన వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలు, గూలాబీ రంగు లిప్ షేడ్‌తో అందంగా కనిపించింది.
(చదవండి: కేన్స్‌లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్ లుక్..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?)


