తిరుమల : వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం తిరుమల భక్త జనసంద్రంగా మారింది.
వేసవి సెలవులు, పరీక్షల ముగింపు, ఫలితాల వెల్లడి నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు.
రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రెండు రోజుల్లో 1.63 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 86 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
వీరిలో 70 వేల మంది భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
భక్తుల రద్దీ మరో రెండు వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.


