బాలయ్య అల్లుడికి వైఎస్‌ జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ | YS Jagan Political Counter To Nara Lokesh And CBN | Sakshi
Sakshi News home page

బాలయ్య అల్లుడికి వైఎస్‌ జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

May 21 2026 1:14 PM | Updated on May 21 2026 3:10 PM

YS Jagan Political Counter To Nara Lokesh And CBN

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్ట్రాంగ్‌ ‍కౌంటరిచ్చారు. Yes Lokesh.. Both Are Not Same అని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉందని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. ఇంత దారుణమైన పరిపాలన చంద్రబాబు ఓవైపు చేస్తూ.. మరోవైపు తన కొడుకు చేత Both are not the same అని పబ్లిక్‌ మీటింగ్స్‌లో డైలాగ్స్‌ చెప్పించడం ఏంటని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 

  • ‘మిస్టర్‌ లోకేష్‌.. Yes, both can never be same. వెన్నుపోటుతో పార్టీని, పార్టీ గుర్తును దోచేయడం  మీ హిస్టరీ. ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతు సంపాదించి, ప్రభుత్వంలోకి రావడం మా హిస్టరీ. both can never be same

  • ప్రజలకు ద్రోహం చేయడం, నమ్మించి ముంచడం మీ క్యారెక్టర్‌. ఆరు నూరైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్‌.

  • పనులు చేసి చూపించడం మా స్టైల్‌. పబ్లిసిటీతో క్రెడిట్‌ చోరీకి పాల్పడ్డం మీ స్టైల్‌. both can never be same

  • విద్యా, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజలచెంతకే పాలన, గృహనిర్మాణం, మహిళా సాధికారిత, మహిళా రక్షణలో “దిశ’’లాంటి విప్లవాత్మక కార్యక్రమలు మాకున్న చరిత్ర. వాటన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. both can never be same

  • ఐదేళ్లలో పారదర్శకంగా అర్హులైన పేదలకు ఇంటివద్దకే డీబీటీ కింద రూ.2.73 లక్ష కోట్లు ఇవ్వడం మా గవర్నెన్స్‌, రెండేళ్లలో 3.6లక్షలకోట్లు అప్పులు చేసి, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లను గాలికి వదిలేసి  దోచేయడం మీ గవర్నెన్స్‌. both can never be same

  • బాబు అంటే మోసం, జగన్‌ అంటే నమ్మకం. both can never be same అని అన్నారు. 

అలాగే, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని, నలుగురిని కనమంటున్నాడు. అలా కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబూ నువ్వు ఎందుకు కనలేదు? ఒక్కరితోనే ఎందుకు ఆపావ్‌? నీ కొడుకు లోకేష్‌ కూడా ఒక్కడితోనే ఎందుకు సరిపెట్టాడు? నీకొడుకైనా నువ్వు చెప్తున్న దాన్ని పాటించాలి కదా?.  నువ్వు వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా మూలనపడేశావు.

మెడికల్‌ కాలేజీలకు, నాడు -నేడు స్కూళ్లకు డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదుకాని, అమరావతిలో బిల్డింగుల అద్దాలకు రూ.2,540 కోట్లు. ముగ్గురు నలుగురిని కంటే, వారికి కనీసం మంచి భోజనమైనా పెట్టే పరిస్థితి కుటుంబాలకు ఉంటుందా? వారి చదువులు ఏం కావాలి? వారి నాణ్యమైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుంది?. ముగ్గురు, నలుగుర్ని కనాలంటూ మహిళలను పిల్లలు కనే యంత్రాలుగా చూడ్డం, వారిని చులకన చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఇలా మాట్లాడటం తప్పు. మహిళలు బాగుంటనే కుటుంబాలు బాగుంటాయి’ అని చెప్పుకొచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement