అత్తమామలను చంపిన అల్లుడికి ఉరి | Sensational verdict by Warangals first additional district judge | Sakshi
Sakshi News home page

అత్తమామలను చంపిన అల్లుడికి ఉరి

May 21 2026 4:29 AM | Updated on May 21 2026 4:29 AM

Sensational verdict by Warangals first additional district judge

వరంగల్‌ మొదటి అదనపు జిల్లా జడ్జి సంచలన తీర్పు

వరంగల్‌ లీగల్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడానికి అమె తల్లిదండ్రులు (అత్తమామలు) కారణమని భావించి వారిని చంపిన అల్లుడికి వరంగల్‌ మొదటి అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి జె. మైత్రేయి బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజుకు వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు చెందిన బానోతు దీపిక ప్రేమించుకున్నారు. 2023లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. 

అయితే పెళ్లయినప్పటి నుంచే దీపికను నాగరాజు గృహహింసకు గురిచేయడంతో భరించలేని ఆమె 2024లో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అందుకు దీపిక తల్లిదండ్రులే కారణమని కక్ష పెంచుకున్న నాగరాజు.. ఆ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. 2024 జూలై 10న అర్ధరాత్రి దాటాక 16 చింతల తండాకు చేరుకొని నిద్రిస్తున్న దీపికతోపాటు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా బానోతు శ్రీను మృతి చెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement