వాషింగ్టన్: యుద్ధంలో ఇరాన్ వాయుసేన ను చావుదెబ్బ తీశామని గొప్పలు చెప్పకునే అమెరికా సైతం రణరంగంలో భారీస్థాయిలో ఆయుధాలు, యుద్దవిమా నాలను కోల్పోయిందని అమెరికా చట్టసభలు వెలువర్చిన ఒక నివేదిక ద్వారా వెల్లడైంది. అమెరికా చట్టసభల లైబ్రెరీలో భాగమైన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్‌స్)లోని విదేశాంగ, యుద్ధ, వాణిజ్యవిభాగంలోని విషయనిపుణులు, పరిశోధకులు, న్యాయవాదులు సంయుక్తంగా పారదర్శకంగా ఈ నివేదికను రూపొందించారు.
నివేదిక ప్రకారంఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట ఫిబ్రవరి 28న అమెరికా మొదలెట్టిన ఇరాన్ యుద్ధంలో మొత్తంగా 42 యుద్ధవిమా నాలను ట్రంప్ బలగాలు కోల్పోయాయి.
ఇందులో ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధవిమానాలు, ఎఫ్–35ఏ లైట్నింగ్–2 యుద్ధవిమానం, ఏ–10 థండర్‌బోల్ట్–2 భూతలదాడుల యుద్ధ విమానం, కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన విమానం, ఈ–3 సెంట్రీ అవాక్స్ నిఘా, పర్యవేక్షణ కమాండ్ విమానం, ఎంసీ–130జే కమాండో–2 ప్రత్యేక ఆపరేషన్ల విమానం, హెచ్‌హెచ్–60 డబ్ల్యూ జోలీ గ్రీన్2 హెలికాప్టర్, 24 ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు, ఎంక్యూ–4సీ ట్రైటన్ డ్రోన్లు ఉన్నాయి. యుద్ధవిమా నాలు, వాహనాలు, మందుగుండు, సాయుధ ఉపకరణాలు మొత్తంగా కలిపి ఇప్పటిదాకా రూ.2.81 లక్షల కోట్ల విలువైన రక్షణరంగ ఆస్తులను కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది.


