సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో తన కుమారుడిని విచారణ నిమిత్తం తానే పోలీసులకు సరెండర్ చేశానని అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.
బండి భగీరథ్ లొంగిపోలేదు. పోలీసులు అరెస్టు చేశారు. అప్పా జంక్షన్‌లో పోలీసులు వాహనాల తనిఖీ చేసేటప్పుడు భగీరథ్ చిక్కాడు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. రోడ్డు మధ్యలో అతడ్ని కస్టడీలోకి తీసుకున్నామని మా పోలీసులు చెప్పారు. నేను మా పోలీసుల మాట నమ్మాలా.. రాజకీయ నాయకుల మాట నమ్మాలా. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే సరెండర్ చేశారని అనుకోవచ్చు.
ఐదు రోజులు పోలీసులు సోదాలు చేసినప్పుడు తండ్రీకొడుకులు ఎక్కడున్నారు. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ల పిల్లవాడ్ని వాళ్లింట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి అప్పచెబుతారు.
సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే.. సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులుగా పోలీసులు సోదాలు చేసినప్పుడు బండి సంజయ్, భగీరథ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మైనర్ బాలిక విషయంలొ రాజకీయాలు చేయడం ఏంటి అని మండిపడ్డారు.


