హార్మూజ్‌పై పట్టుకు ఇరాన్‌ ప్లాన్‌.. అథారిటీ ఏర్పాటు | Iran builds new system of control in Hormuz checkpoints | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌పై పట్టుకు ఇరాన్‌ ప్లాన్‌.. అథారిటీ ఏర్పాటు

May 21 2026 9:49 AM | Updated on May 21 2026 9:51 AM

Iran builds new system of control in Hormuz checkpoints

ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్‌ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేస్తూ దీవుల వద్ద చెక్‌పాయింట్‌లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నౌకలపై రుసుములు విధిస్తోంది. జలసంధిలో ఇరాన్‌ సరికొత్తగా పర్షియన్‌ గల్ఫ్‌ స్ట్రైట్‌ అథారిటీ ఏర్పాటు చేసింది. కొత్త “Hormuz Safe” ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఇరాన్‌ ఆర్థిక లాభాలు పొందుతోంది. దీని వల్ల ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ప్రభావితం అవుతోంది.

హార్మూజ్‌ జలసంధిపై తన నియంత్రణను బలపరచడానికి ఇరాన్ కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. జలసంధి నిర్వహణ బాధ్యతలను పర్షియన్‌ గల్ఫ్‌ స్ట్రైట్‌ అథారిటీ (Persian Gulf Strait Authority) అనే ఈ సంస్థను అప్పగించింది. ఇందులో భాగంగా చెక్‌పాయింట్లు అమలు చేస్తోంది. నౌకలపై ట్రాన్సిట్ అనుమతులు జారీ చేసి, రుసుములు వసూలు చేస్తోంది. ముఖ్యంగా టోల్ ఫీజులు వసూలు చేయడం, నౌకల కార్గో వివరాలు, జెండా, గమ్యం వంటి సమాచారం సేకరించడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని నౌకలకు రెండు మిలియన్ డాలర్ల వరకు టోల్ ఫీజులు విధిస్తున్నారు. దీని ద్వారా ఇరాన్ $10 బిలియన్ ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఇరాన్ ఈ సంస్థ ద్వారా హార్మూజ్‌ జలసంధిపై తన భౌగోళిక ప్రభావాన్ని పెంచుకోవడం, ఆర్థిక లాభం పొందడం, అమెరికా ఆంక్షలను తప్పించుకోవాలని ప్లాన్‌ చేసింది.

ఇదే ఉదాహరణ.. 
కాగా, Agios Fanourios-I అనే ట్యాంకర్ ఇరాక్ క్రూడ్ ఆయిల్‌తో వియత్నాం వైపు బయలుదేరింది. కానీ ఏప్రిల్ చివరి నుండి దుబాయ్ తీరంలో నిలిపివేయబడింది. మే 10న ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మాత్రమే హార్మూజ్‌ గుండా ప్రయాణం కొనసాగింది. సాధారణంగా 5 గంటల్లో పూర్తయ్యే ప్రయాణం, ఇరాన్ జోక్యం వల్ల 2 రోజులు పట్టింది. మరోవైపు.. ఈ జలమార్గం గుండా కేవలం కొద్ది సంఖ్యలో నౌకలు మాత్రమే ప్రయాణించాయి. అమెరికాకు చెందిన సిన్‌మాక్స్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ విశ్లేషణ ప్రకారం.. ఏప్రిల్ 18 నుండి మే 6 మధ్య 60 కంటే తక్కువ నౌకలు మాత్రమే ఈ జలసంధి గుండా ప్రయాణించగలిగాయి. యుద్ధానికి ముందు, సాధారణంగా ఒక రోజులో సుమారు 120 నుండి 140 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించేవి, వాటిలో దాదాపు సగం చమురు ట్యాంకర్లే ఉన్నాయి.

ప్రభావం

  • ప్రపంచ చమురు సరఫరా: హార్మూజ్‌ గుండా 20% గ్లోబల్ ఆయిల్ వెళ్తుంది.

  • మార్కెట్ కలకలం: ఆలస్యం, రుసుములు, అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.

  • ప్రాంతీయ ఉద్రిక్తతలు: గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి.

  • ప్రపంచ ప్రతిస్పందన: UK, France వంటి దేశాలు 40 దేశాల సమావేశం ఏర్పాటు చేసి, యూరోపియన్ ఎస్కార్ట్ ప్లాన్‌పై చర్చిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement