#Mega158: చిరు-బాబీ మూవీ 'మెగా' లాంచ్‌ | Mega158 Launch: Chiranjeevi, Bobby Movie Pooja Ceremony | Sakshi
Sakshi News home page

చిరంజీవి- బాబీ సినిమా ప్రారంభం

May 21 2026 11:37 AM | Updated on May 21 2026 11:56 AM

Mega158 Launch: Chiranjeevi, Bobby Movie Pooja Ceremony

'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత చిరంజీవి- బాబి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం #Mega158 (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా గురువారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు చిరంజీవి సోదరులు పవన్‌ కల్యాణ్‌, నాగబాబు హాజరయ్యారు. పవన్‌ కల్యాణ్‌ ముహూర్తపు సన్నివేశానికి కొబ్బరికాయ కొట్టి క్లాప్‌ ఇచ్చారు. 

ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్‌, దిల్‌రాజు, బండ్ల గణేశ్‌, వివి. వినాయక్‌, మెహర్‌ రమేశ్‌, వశిష్ట తదితరులు హాజరయ్యారు. మెగా డాటర్స్‌ సుస్మిత కొణిదెల, నిహారిక సైతం ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనుంది. తను కూడా పూజా కార్యక్రమంలో తళుక్కుమని మెరిసింది. కేవీఎన్‌ ‍ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించనున్నాడు. ఆంటోని రూబెన్‌ ఎడిటర్‌గా వ్యవహరించనున్నాడు.

 

 

 

చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లు పొగరుగా ప్రవర్తించారు: డ్యాన్సర్‌

Advertisement
 
Advertisement
Advertisement