మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. ఈ మూవీ రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రల్లో అభిమానులను మెప్పించనున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఏ క్రీడ ఆడాలన్నా పెద్దినే అనే స్పోర్ట్స్ కాన్సెప్ట్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పెద్ది మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెజ్లర్లతో సీన్ల గురించి వివరించారు. ఇసుకలో, ఎండలో షూటింగ్ చాలా కష్టంగా అనిపించలేదా అని బుచ్చిబాబ.. చెర్రీని ప్రశ్నించారు. దీనికి రామ్ చరణ్ బదులిస్తూ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే ఎలాంటి అలసట రాదన్నారు. అయితే కుస్తీలో చేయి పట్టి అదురు రావడంతో మా పాపను కూడా ఎత్తుకోలేకపోయానని తెలిపారు.
మీరు నిజమైన పహిల్వాన్లను పెట్టారని రామ్ చరణ్ అన్నారు. వాళ్లు నటించమంటే.. రియల్‌గా ఆడేస్తున్నారని రామ్ చరణ్ గుర్తు చేశారు. తర్వాత మళ్లీ సారీ చెబుతున్నారని తెలిపారు. ఎందుకంటే వాళ్లలో నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది వాళ్లలో ఉంటుందని చెర్రీ వివరించారు. యాక్టింగ్ చేయమంటే వారికి అది రాదని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌లో మెప్పించనుంది.


