breaking news
YS Jagan Mohan Reddy
-
ఆళ్లనాని మృతిపై వైఎస్ జగన్ సంతాపం
-
డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తారా? లేదా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తారా.. లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియ మీద విశ్వసనీయత పోతే నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘లక్షల మంది అభ్యర్థులు న్యాయమైన అవకాశం కోసం తమ జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని ఈ పరీక్షల కోసం వెచ్చిస్తారు. కష్టపడి చదివి నిజాయితీగా ఉద్యోగం పొందడం కోసం వారి కుటుంబాలు కష్టపడి సంపాదించిన డబ్బును కూడా వెచ్చిస్తారు. కానీ, వ్యవస్థ విఫలమై దానిని నిరాశ పరిచినప్పుడు, దాని ప్రభావం కేవలం ఫలితాలపైనే కాదు.. మొత్తం నియామక ప్రక్రియపైనే అభ్యర్థులకు ఉండే నమ్మకం పోతుంది. చివరకు వారు తీవ్ర నిరాశకు గురవుతారు. చంద్రబాబూ.. న్యాయంగా పరీక్షలు నిర్వహించి, అర్హులకు అవకాశం ఇవ్వడం అన్నది మీ ఇష్టాయిష్టాలు కావు. అది ప్రభుత్వం బాధ్యత. వాళ్లు పడిన కష్టానికి న్యాయం చేయాలన్న బాధ్యత, జవాబుదారీతనం అవసరమని మీకు అనిపించడం లేదా? ప్రస్తుతం బయట పడిన డీఎస్సీ కుంభకోణానికి మీరు బాధ్యత వహిస్తారా.. లేదా?’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డు వినీత్ కుటుంబసభ్యులు
కృష్ణా: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం ఎయిర్‌పోర్టులో పోరంకి మహిళలు మంగళవారం ప్రత్యేకంగా కలుసుకున్నారు. విషయంలోకి వెళితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బొడ్డు వినీత్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే వినీత్ మృతి కేసును అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తమకు అండగా ఉండాలని వైఎస్ జగన్‌కు వినీత్ తల్లి సునీల, ఆమె కుటుంబసభ్యులు వినతిపత్రం అందించారు. దీనిని పరిశీలించిన వైఎస్ జగన్ వినీత్ కుటుంబసభ్యులకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. -
ఆళ్ల నాని మృతి పట్ల YS జగన్ దిగ్భ్రాంతి
-
ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాని మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. నాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. ఈ కష్టకాలంలో వారికి ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, మాజీ మంత్రి ఆళ్ల నాని (57) మంగళవారం విశాఖ నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత వైఎస్సార్సీపీ సర్కారులో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
DSCఅక్రమాలపై మరోసారి బాబుపై జగన్ ప్రశ్నల వర్షం
-
జగన్ పర్యటనలో ఆ జనాన్ని చూస్తే నాకు.. సాకే శైలజానాథ్ రియాక్షన్
-
దేశ భవిష్యత్తును నిర్మించేది ఇంజనీర్లే: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లందరికీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంజనీరింగ్ అంటే కేవలం భవనాలు, రహదారులు, వంతెనలు నిర్మించడం మాత్రమే కాదని.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ దేశ భవిష్యత్తును నిర్మించడమని అన్నారాయన.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అసాధారణ ప్రతిభను స్ఫూర్తిగా పేర్కొంటూ.. దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్రను గుర్తు చేశారు. ఇంజనీరింగ్ రంగం అభివృద్ధి, ఆవిష్కరణలకే పరిమితం కాకుండా.. సమాజ పురోగతికి, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కీలకంగా నిలుస్తోందని జగన్ పేర్కొన్నారు.‘‘ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం’’ అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి అసాధారణ ప్రతిభతో భారతదేశ అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. దేశ మౌలిక వసతుల అభివృద్ధి నుంచి ఆధునిక సాంకేతికత వరకు ఇంజనీర్ల సేవలు ఎంతో కీలకమని జగన్ అన్నారు. దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న ప్రతి ఇంజనీర్‌కు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం అని తన అసాధారణ ప్రతిభతో నిరూపించిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.… pic.twitter.com/7X4XOlDVbT— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2026మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు. 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జన్మించిన ఆయన ఇంజనీరింగ్ రంగంలో విశేష సేవలందించారు. నీటి పారుదల, జలవనరుల నిర్వహణ, వరద నియంత్రణ వంటి రంగాల్లో ఆయన చేసిన కృషి విశేష గుర్తింపు పొందింది. మైసూరు దివాన్‌గా పనిచేసిన సమయంలో పారిశ్రామిక, విద్యా, ఆర్థిక రంగాల అభివృద్ధికి కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1955లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15ను ఏటా ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. ఈ డీఎస్సీ వార్ ఆగదు -
డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తారా? లేదా?... చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
-
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ మరోసారి ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల మీద విశ్వసనీయత పోతే.. నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయంటూ సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘‘లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితాన్ని.. కుటుంబాల కష్టార్జితాన్ని ఉద్యోగ పరీక్షల కోసం ఖర్చు చేస్తున్నారు. వారికి కావాల్సింది ఒక్కటే.. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా.. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం. వ్యవస్థే విఫలమైతే దెబ్బతినేది కేవలం పరీక్ష ఫలితాలు కాదు.. మొత్తం నియామక ప్రక్రియపై యువత పెట్టుకున్న నమ్మకం.చంద్రబాబూ.. న్యాయం చేయడం మీకు ఒక ఆప్షన్ కాదు.. ప్రభుత్వపరంగా మీ బాధ్యత. కష్టపడి చదివిన అభ్యర్థుల శ్రమకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై లేదా?.వారి భవిష్యత్తుకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం మీకు లేదా? డీఎస్సీలో బయటపడిన స్కాంకు మీరు బాధ్యత వహిస్తారా? లేదా? నిరుద్యోగుల కలలతో ఆడుకోవడం కాదు..వారి కష్టానికి న్యాయం చేయండి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 𝗪𝗵𝗲𝗻 𝗲𝘅𝗮𝗺𝘀 𝗹𝗼𝘀𝗲 𝗰𝗿𝗲𝗱𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝘆, 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝗴𝗲𝘁 𝗰𝗹𝗶𝗽𝗽𝗲𝗱!Lakhs of aspirants sacrifice prime years of their lives and their families’ hard-earned money for a fair chance. When the system fails them, it doesn’t just affect the results, it shatters… pic.twitter.com/hyYMHwsYEK— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026 -
ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు
-
పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు
-
జగన్ పాదయాత్రపై చింతమనేని సవాల్ అబ్బయ్య చౌదరి అదిరిపోయే కౌంటర్
-
క్రికెట్, ఆర్చరీ, హాకీ క్రీడాకారులకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత క్రీడారంగానికి ఈ వారం స్వర్ణమయమైనదని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు సాధించిన విజయాలు ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు. హృదయపూర్వక అభినందనలుఈ సందర్భంగా.. అద్భుతమైన ప్రదర్శనతో ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదే విధంగా.. రికర్వ్ ఆర్చరీ ప్రపంచకప్‌ను గెలుచుకున్న తొలి భారత పురుష ఆర్చర్‌గా చరిత్ర సృష్టించిన ఏపీకి చెందిన ధీరజ్ బొమ్మదేవరను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక AHF జూనియర్ ఆసియా కప్ 2026 టైటిళ్లను గెలుచుకుని దేశ కీర్తిని చాటిన భారత జూనియర్ పురుష, మహిళల హాకీ జట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మేరకు ‘మన క్రీడాకారుల పట్టుదల, కఠోర శ్రమ, అంకితభావం కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తున్నాయి. భవిష్యత్తులోనూ మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించాలి. భారతదేశ కీర్తిపతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా భారత క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.ఆసియా కప్ మనదేకాగా దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మహిళల ఆసియా టీ20 కప్-2026 ఫైనల్లో భారత జట్టు.. శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఇక అంతకుముందు చైనా వేదికగా సాయంత్రం జరిగిన జూనియర్ హాకీ ఆసియా కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు చైనాపై.. పురుషుల జట్టు సౌత్ కొరియాపై గెలిచి చాంపియన్‌గా హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. మరోవైపు.. ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్ బొమ్మదేవర స్వర్ణం సాధించాడు. -
Surekha : వైఎస్ జగన్ పై అభిమానంతో రాజీనామా చేశా
-
వైఎస్ జగన్ అడిగింది లోకేష్‌కు అర్థం కాలేదా?
ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చర్చల సవాళ్లను వదలి, ఇక బెదిరింపుల పర్వంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎంత షాడో ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నప్పటికీ లోకేష్ వ్యాఖ్యలు దుందుడుకుతనంగా ఉండడం బాగోలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నిర్దిష్టమైన అభియోగాలతో, ఆధారాలతో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రెస్మీట్లో మాట్లాడారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందిన వైనం, కొందరు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించడం తదితర విషయాలను జగన్ ప్రస్తావించారు.దానికి సమాధానంగా లోకేష్ ఏమి మాట్లాడారో చూడండి. డీఎస్సీపై జగన్ విషం కక్కుతున్నారట. వారి ఉపాధ్యాయుల జోలికి వస్తే చర్యలు తప్పవట. నియామకాలు ఆపాలని 300 కేసులు వేసినా కోర్టు తప్పుపట్టలేదట. డీఎస్సీకి, ఏపీపీఎస్సీ తేడా తెలుసా అని మరోసారి జగన్‌ను లోకేష్ పిచ్చి ప్రశ్న వేశారు. ఇక్కడే ఈయన బలహీనత తెలిసిపోతుంది. జగన్ అడుగుతున్నదేమిటి? లోకేష్ చెబుతున్నదేమిటి? కోర్టులు డీఎస్సీలో అక్రమాలు జరగలేదని ఎక్కడ చెప్పాయో తెలియదు. మీ పత్రిక విలేకర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారని, దారుణమైన ఆరోపణ చేశారు.నిజంగా అలాంటిది ఒక్కటి జరిగినా ఈపాటికి ఎన్ని కేసులు పెట్టి ఉండేవారో కదా! రెడ్ బుక్ పేరుతో ఎంతమందిపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టించింది ప్రజలకు తెలియదా! టీచర్ల జోలికి ఎవరు వెళ్ళారు? ఎవరు దాడులు చేశారు? టీచర్లను రెచ్చగొట్టి ఏవైనా తప్పుడు కేసులు పెట్టించి, ప్రశ్నించే మీడియాను భయపెట్టడం ద్వారా డీఎస్సీ స్కామ్ వివరాలు బయటకు రాకుండా చూడాలన్నది మంత్రిగారి ఉద్దేశం ఏమో తెలియదు. కాని ఆ వ్యూహం అన్నిసార్లు పనిచేయదు కదా!స్పోర్ట్స్ కోటా అవకతవకల గురించి అడుగుతుంటే, వివరణ ఇవ్వకుండా టీచర్ల ఎంపిక మొత్తాన్ని వైఎస్సార్సీపీ తప్పుపడుతున్నట్లు లోకేష్ ప్రకటన చేయడం ఏమిటి? పనిలో పని స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా చెప్పారు. కోర్టులో అసలు కేసే విచారణ లేకుండా చేసుకుని, ఇలా క్లీన్ చిట్ అని మాట్లాడడం ప్రజలను ఫూల్స్‌ను చేయడం కాదా? లోకేష్ చెబుతున్నట్లు డీఎస్సీపై జగన్ విషం కక్కలేదు. పరీక్షలలో జరిగిన అక్రమాలపై నిలదీస్తున్నారు. ఈ అక్రమాలు అర్హులైన కొందరు అభ్యర్ధుల పాలిట విషతుల్యంగా మారాయని చెప్పారు.అది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అసలు పరీక్షలు రాయకుండానే టీచర్ పోస్టులు ఇవ్వాలని జీఓలు ఇవ్వడం, ఆ తర్వాత పని పూర్తి అయ్యాక పరీక్షలు లేకుండా టీచర్ల ఎంపిక జరగరాదని ఉత్తర్వులు ఇవ్వడం నిజమా? కాదా? ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒక వ్యక్తి చేతిలోనే ఎందుకు పెట్టారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వస్తే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటాలో 372 మందికి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చి, తదుపరి గేట్లు మూసేశారా?లేదా? అసలు క్రీడలే జరగలేదు కాని, కొందరు అందులో భాగస్వాములైనట్లు నకీలీ సర్టిఫికెట్లు తెచ్చారా? లేదా? అధికారులు మీడియా అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలే పరిస్థితిని ఎదుర్కుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వారు అధ్బుతంగా సమాధానం చెప్పారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు?అక్రమాలు జరిగాయని అధికారులు ఒప్పుకున్నారని వైఎస్ జగన్ అంటున్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతుందని ఒకసారి, పరీశీలిస్తామని మరోసారి, తమకు కుల సర్టిఫికెట్లతో సంబంధం లేదని, రెవెన్యూ శాఖ పరిధిలోనివని ఇంకొకసారి అధికారులు చెప్పారా? లేదా? అధికారులు ఏడుసార్లు వెరిఫై చేశామని అన్నారు. అయినా ఇన్ని ఇన్ని అవకతవకలు ఎలా జరిగాయి? అవన్ని బయటకు వచ్చాయి కదా! ఇవన్ని ఎందుకు! జగన్ వేసిన ప్రశ్నలకు వరసగా జవాబులు ఇవ్వగలిగితే సరిపోతుంది కదా!ఇదీ చదవండి: క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్‌కు అగ్నిపరీక్ష!అభ్యర్థులు పలువురు తమకు అన్యాయం జరిగిందని, ఆధారాలతో సహా మీడియాకు చెబుతున్నారే! వారిని అధికారులు పిలిచి ఎందుకు విచారణ చేయడం లేదు?వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికే భయపడుతన్నట్లు కనిపించడం లేదా! పరీక్షలు లేకుండా టీచర్ల పోస్టులు ఏమిటని వేరే కేసులో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం చూడలేదా? కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ డీఎస్సిలో తప్పు జరగలేదని చెబుతూనే మొత్తం ప్రక్రియ అంతా అధికారులే చేశారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఊహించినట్లుగానే ఈ మొత్తం ఎపిసోడ్‌ను అధికారుల మీద నెట్టివేయడం కాదా? అంతకుముందు లోకేష్‌ను అభినందిస్తున్నానని పలు సభలలో చెప్పిన చంద్రబాబు ఈసారి అధికారుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు?పవన్ కళ్యాణ్ ఉద్యోగ పత్రాల పంపిణీ కార్యక్రమంలో లేకపోయినా ఎందుకు ఆయన కూడా ఉన్నట్లు చెప్పుకోవల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు దీనిపై స్పందించ లేదు? జనసేన, టీడీపీ మధ్య డీఎస్సీ అక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయా? లేదా? వాటిని అదుపు చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నించాయా?లేదా? అసలు ఏ తప్పు లేకపోతే సాక్షి మీడియాను నియంత్రించాలని ఎందుకు చూస్తున్నారు. సాక్షి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాతో పాటు, కొంతమంది స్వతంత్రంగా వీటిపై చేసే విశ్లేషణల వీడియోలను పోలీసుల ద్వారా ఎందుకు తొలగింపచేస్తున్నారు? డీఎస్సీ స్కామ్‌పై సాక్ష్యాలతో సహా కథనాలు ఇచ్చిన ఒక ప్రముఖ టీవీకి చెందిన సంపాదకుడు ఎందుకు రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోందా? లేదా?ఇవన్ని గమనిస్తే డీఎస్సీలో ప్రభుత్వం తప్పు చేసిందన్న అభిప్రాయం బలపడడం లేదా? ప్రభుత్వానికి ఎల్లో మీడియా ఎంత వంత పాడుతున్నా, టీచర్ల పేరుతో ర్యాలీలు తీయించినా, డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థులు వెనక్కి తగ్గడం లేదు కదా! అన్నిటిని మించి జగన్ చేసిన ఒకే ఒక్క సవాల్.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండింటిపైన సీబీఐ విచారణ జరపాలన్నదానిపై ఎందుకు నోరు మెదపడలేకపోతున్నారు?తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని లోకేష్ భయపడుతున్నట్లు అవడం లేదా? విషం కక్కారా? లేక అమృతం తాగారా? అన్నది కాదు సమస్య. అక్రమాలు జరిగాయా? లేదా? అన్నది తేల్చాలా? ఆ ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? మొదట బుకాయింపు, ఆ తర్వాత తడబాటు, తదుపరి సెంటిమెంట్, ఇప్పుడు భయంతో డబాయింపు, కేసుల బెదిరింపు, మొత్తం అధికారులపై నెట్టేసి కుమారుడిని రక్షించే యత్నం... ఇవన్ని ఏమి చెబుతున్నాయి. అన్ని వేళ్లు లోకేష్ వైపు చూపుతున్నాయని జగన్ చెబుతున్నది వాస్తవమే అనిపించదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైరల్ అవుతున్న YS జగన్ ట్వీట్
-
తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
-
విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపై ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ పవిత్ర పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. ఈ మేరకు ఈ ఉదయం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.#GaneshChaturthi— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026అంతకు ముందు.. ఓ సందేశంలో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే వైఎస్ జగన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని చుట్టేసిన వినాయకుడు -
ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం... మెగా డీఎస్సీ వ్యవహారంపై చంద్రబాబు బాధ్యత వహించాలి... వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
-
ఒక టీచర్ పోస్టు.. ఆరు మలుపులు!
సాక్షి, అమరావతి: ఒక ఉపాధ్యాయ పోస్టు నియామకంపై అధికారుల వివరణలు మారుతున్నాయని, ప్రతి కొత్త వివరణ టీచర్ అభ్యర్థుల్లో మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆ పోస్టుకు సంబంధించిన టెట్ మార్కులు, ఏడు దశల అర్హత పరిశీలన, డీఈవో ప్రకటన, అభ్యర్థి మళ్లీ టెట్ రాయడం వంటి అంశాలను వరుసగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.తొలి మలుపు: 65 మార్కులతో ఏడు దశల పరిశీలన అభ్యర్థికి 65 టెట్ మార్కులు ఉన్నట్లు చూపించి, ఏడు దశల పరిశీలన అనంతరం ఉపాధ్యాయ పోస్టు ఇచ్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాతే నియామకం జరిగిందని చెబుతున్నప్పుడు, ఆ పరిశీలనలో అభ్యర్థి అర్హతను ఎలా నిర్ధారించారో వెల్లడించాలని ప్రశ్నించారు. రెండో మలుపు: అనర్హుడని డీఈవో ప్రకటన అదే అభ్యర్థి అనర్హుడని డీఈవో నిర్ధారించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. అర్హత లేకపోతే ఏడు దశల పరిశీలనలో ఆ విషయం ఎందుకు బయటపడలేదని నిలదీశారు. ‘‘ఆ ఏడు దశల్లో అసలు ఏం వెరిఫై చేశారు?’’ అన్నది టీచర్ అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అని పేర్కొన్నారు.మూడో మలుపు: ఉద్యోగం ఎలా వచ్చిందో అభ్యర్థికే తెలియదా? తనకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలియదని సదరు అభ్యర్థే చెప్పినట్లు వైఎస్ జగన్ ప్రస్తావించారు. నియామకం పొందిన అభ్యర్థి నుంచి కూడా అలాంటి సమాధానం వచ్చిందంటే, పోస్టు భర్తీ ప్రక్రియపై తలెత్తిన సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.నాలుగో మలుపు: తెరపైకి 2018 టెట్ 77 మార్కులు తాజాగా అధికారులు మరో వివరణ ఇచ్చారని, అభ్యర్థి 2018లో రాసిన టెట్‌లో 77 మార్కులు సాధించినట్లు ధ్రువీకరించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆ మార్కులు అప్పటి నుంచే రికార్డుల్లో ఉంటే నియామక సమయంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. 77 మార్కులతో అర్హత ఉందని ఇప్పుడు చెబుతున్నప్పుడు ముందుగా అనర్హుడని డీఈవో ఎందుకు ప్రకటించారని అడిగారు. ఈ వివరణ ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఐదో మలుపు: ఎస్జీటీ పోస్టుకు ‘రాంగ్ పేపర్’? 77 మార్కులు పేపర్ 2బీలో వచ్చినవిగా చెబుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పేపర్ కాగా, ఎస్ జీటీ పోస్టుకు పేపర్–1ఏ అవసరమని గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో అభ్యర్థి ఏడు దశల అర్హత పరిశీలనను ఎలా దాటారని ప్రశ్నించారు.ఆరో మలుపు: ఉద్యోగం వచ్చాక మళ్లీ టెట్ ఎందుకు? ఉద్యోగం పొందిన తర్వాత కూడా అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాసినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. 2018లో సాధించిన 77 మార్కులే ఎస్జీటీ పోస్టుకు అర్హత కల్పించాయని అధికారులు చెబుతున్నట్లయితే, అభ్యర్థి మరోసారి టెట్‌కు హాజరు కావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు సమాధానం చెప్పాలి ఒకే పోస్టుపై వరుసగా వస్తున్న ఈ వివరణల మధ్య నియామక ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగిందని ఎలా చెప్పగలరని సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం డీఎస్సీ కుంభకోణానికి దారితీయలేదా అని నిలదీస్తూ, దీనికి నైతిక బాధ్యత వహించరా అని నిలదీశారు. అభ్యర్థుల సందేహాలను తీర్చేలా మార్కులు, వర్తించే టెట్ పేపర్, అర్హత పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
పిడుగుపాటుతో నలుగురి మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాల్లో పిడుగుపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పండుగ వేళ నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం తనను కలచివేసిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని, తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. అసలు చంద్రబాబు ఇచ్చే వివరణలే మరిన్ని ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు వైఎస్ జగన్. డీఎస్సీలో అక్రమాల ట్విస్టులను వివరిస్తూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ట్విస్ట్ 1: 65 మార్కులు → 7 దశల వెరిఫికేషన్..65 మార్కులు టెట్‌లో వచ్చినా టీచరు పోస్టు ఇచ్చారు.అంతకుముందు ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్ ఎలా పూర్తి చేశాడు?ట్విస్ట్ 2: ఆ అభ్యర్థి అనర్హుడని డీఈవో తేల్చారుమరి ఆ 7 దశల్లో అసలు ఏం వెరిఫై చేసినట్టు?ట్విస్ట్ 3: ఉద్యోగం వచ్చింది... కానీ ఎలా వచ్చిందో అతనికే తెలియదు!మరి ఏడుసార్లు చేసిన వెరిఫికేషన్‌లో ఏం తేల్చారు?ట్విస్ట్ 4: సడన్‌గా తెరపైకి వచ్చిన 77 మార్కులు2018లో రాసిన టెట్‌లో అతనికి 77 మార్కులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు.ఆ 77 మార్కులు అప్పటికే రికార్డుల్లో ఉంటే..అంతకుముందే వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?డీఈవో అతన్ని అనర్హుడిగా ఎందుకు ప్రకటించారు?ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఈ వివరణ ఎందుకు బయటకు వచ్చింది?ట్విస్ట్ 5: “రాంగ్ పేపర్” ట్విస్ట్77 మార్కులు వచ్చినట్లు చెబుతున్నది పేపర్ 2లోకానీ SGT పోస్టుకు అవసరమైన టెట్ కేటగిరీ Paper-I-A.మరి అవేమీ చూడకుండానే అతను 7 దశల వెరిఫికేషన్‌ను ఎలా దాటాడు?ట్విస్ట్ 6: ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ టెట్ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాశాడు.2018లో వచ్చిన 77 మార్కులతోనే అతనికి అర్హత ఉంటే..మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రశ్నలు:ఇదేనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ?ఇలాంటి వ్యవహారాలే డీఎస్సీ స్కామ్‌కు అవకాశం కల్పించలేదా?చంద్రబాబూ.. ఇప్పటికైనా ఈ స్కాంలకు మీరు నైతిక బాధ్యత వహిస్తారా? లేదా? 𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄… pic.twitter.com/MP38UWEkxD— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2026 -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: రేపు(సోమవారం, సెప్టెంబర్ 14వ తేదీ) వినాయక చవితి పర్వదినం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్
-
ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ?
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియలో ఏడు దశల వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ మెగా డీఎస్సీ స్కామ్‌పై ఆయన మరోసారి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘వెరిఫికేషన్.. నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్’ అంటూ జగన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందని చెప్పారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ నిలదీశారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కారు ఆటలాడుతోందని అన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల కెరీర్లు మీకు అపహాస్యంగా మారాయా అని మండిపడ్డారు. ‘ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడంలేదు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలింది. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారు? ఇది స్కామ్ కాదా? దీనికి మీరు నైతిక బాధ్యత వహించరెందుకు’ అని వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుని నిలదీశారు. స్కిల్ కేసులో క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం చంద్రబాబు చేసిన స్కామ్‌లో ఆయనే సొంతంగా క్లీన్ చిట్ ఇప్పించుకుని భుజాలు ఎగరేసుకుంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఫేస్బుక్లో ఈమేరకు ఒక పోస్టు చేశారు. ‘అధికారులను బెదిరించి తనపై ఉన్న కేసుల పని పూర్తి చేసుకుని క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం. తన మీద కేసులు తానే కొట్టేయించుకుంటున్నాడు. ఎందుకంటే అవన్నీ నిజం కాబట్టి. ఇప్పుడు కూడా డీఎస్సీ కేస్‌ని నిర్వీర్యం చేసే పని చేస్తున్నాడు. అయినా స్కిల్ కేసులో తనకు క్లీన్చిట్ వచ్చిందని చెప్పుకోవడం ఎంతటి దౌర్భాగ్యం’ అని వైఎస్ జగన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. -
జగన్ వెంట లక్షలాది సైనికులు.. YSRCPని ఎవరూ కదిలించలేరు
-
7 దశల్లో వెరిఫికేషన్ చేసి ఏం సాధించారు? DSCలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పై జగన్ ఫైర్
-
ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, తాడేపల్లి: ఏపీ మెగా డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరోసారి స్పందించారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.“వెరిఫికేషన్? నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!” అంటూ జగన్ ట్వీట్ చేశారు. ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే.. అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలిందని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలిందని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho… pic.twitter.com/NShMVPrVmh— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2026కేసు–1: మెరిట్ లిస్టులో పేర్లు పరిశీలిస్తే.. అసలు పేర్లే కనిపించ లేదు. కేసు–2: ఖో-ఖో అధికారులను సంప్రదిస్తే ఆ సర్టిఫికెట్ నకిలీదని చెబుతున్నారు. కేసు–3: నాగార్జున యూనివర్సిటీలో ఆరా తీస్తే అసలు ఆ స్పోర్ట్స్ ఈవెంటే జరగలేదని తేలింది. మరి 7 దశల్లో వెరిఫికేషన్ చేశామన్న ప్రభుత్వం.. ఆ తనిఖీలు ఎక్కడ చేశారు?, ఏం తనిఖీ చేశారు? అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహించామని ఎలా చెప్పగలరు? అని అన్నారు. ఈ లోపాలే డీఎస్సీ అక్రమాలకు అవకాశం కల్పించలేదా? దీనికి నైతిక బాధ్యతను మీరు తీసుకోరా?” అంటూ చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రశ్నించారు. #MegaDSCScam హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆ జీవోల మాయ ఏంటో అసలు! -
ఇప్పుడు సమాధానం చెప్పు లోకేష్
-
డీఎస్సీ పారదర్శకమైతే జీవోలు ఎందుకు మార్చారు?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానమా? దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు? అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీలో అక్రమాలకు ద్వారాలు తెరవలేదా..? జరిగిన పరిణామాలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా..?’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై సూటి ప్రశ్నలు సంధించారు. నియామకాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశం ఉంటే.. అర్హత పరీక్ష అవసరం లేదంటూ జీవోలు ఎందుకు జారీ చేశారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత పరీక్ష ఆధారిత నియామక విధానాన్ని తిరిగి తీసుకొచ్చేలా నిబంధనలు ఎందుకు మార్చారని నిలదీశారు. ఈ పరిణామాలను నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియగా ఎలా పరిగణిస్తారని జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ కుంభకోణానికి ఈ విధానాలు అవకాశం కల్పించలేదా? అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తాను మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు? » డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు? » అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా? » నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించడంపై చంద్రబాబు సమాధానం చెప్పరా? -
‘డీఎస్సీ అక్రమాలకు సీఎంగా బాబు నైతిక బాధ్యత వహించరా?’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబూ.. డీఎస్సీ నియామకాలను నిజంగా నిష్పక్షపాతంగా..పారదర్శకంగా నిర్వహించాలన్నదే మీ ఉద్దేశమైతే అర్హత పరీక్ష అవసరం లేకుండా జీవోలు ఎందుకు జారీ చేశారు?. క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు?.డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు?. డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానం.. దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు?అర్హత పరీక్ష నిబంధనను తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా?.నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించిన దానిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా?’అంటూ ధ్వజమెత్తారు. .@ncbn Garu, if your intention was to conduct a fair and transparent recruitment, why were GOs issued dispensing with the requirement of a qualifying examination? And after the DSC process was completed, why were the policies amended in a manner that restored the old… pic.twitter.com/vzDTCvOwGE— YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2026ఇదీ చదవండి : ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్ -
ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫేస్బుక్లో వీడియో రిలీజ్ చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ వీడియో విడుదల చేశారు. డీఎస్సీ పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసి.. ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.కాగా, నిన్న(గురువారం) ప్రెస్మీట్లో మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ మరోసారి ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు.ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని.. వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
జగన్ పాదయాత్రపై చింతమనేని నోటి దూల
-
బాబుకు బిగ్ షాక్.. అడ్డంగా దొరికిన కొడుకు.. పక్కా ఆధారాలతో ఏకిపారేసిన జగన్
-
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్‌లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
కాక్రోచ్లు ఊరికే రావు..! మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్‌లే
అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం.– మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయని, చంద్రబాబు స్కామ్‌ల చరిత్రలో అదో ఆణిముత్యం.. చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో మరోసారి ఎండగట్టారు. ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని, వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు ఏడు సార్లు వెరిఫికేషన్ చేశామని అధికారులు చెబుతున్నారని.. మరి అన్ని నకిలీ (ఫేక్) సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవని అధికారులు చెప్పలేకపోయారన్నారు. జరగని పోటీలు, టోర్నీలతో సర్టిఫికెట్లు జారీ చేశారని.. అవి బోగస్ అని స్వయంగా అసోసియేషన్లు వెల్లడించినా వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం పట్టించుకోకుండా తమవారికి అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత గేట్లు మూసేసిందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అసలు ఏ పరీక్షా లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద స్కామ్ అని స్పష్టం చేశారు. ఇదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారని, అయితే మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్ వేయడమే కాకుండా, మిగిలిన పోస్టులకూ నియామకాలు చేపట్టలేదని వెల్లడించారు. ఇది ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేయడం కాదా? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు కల్పిస్తేనే కాక్రోచ్లు పుట్టుకొస్తాయని, తప్పు చేసిన వారి మెడలు వంచేందుకు తానూ కాక్రోచ్‌గా మారతానని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాబుకు బీపీ పెరిగి బెదిరిస్తున్నారుడీఎస్సీ 2025 కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత కూడా ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలరా? అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్కామ్ రూపాలన్నీ అనకొండలా అనిపిస్తున్నాయి. అందుకే ఇవి బయటకు వచ్చే కొద్దీ చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది. ఎవరైనా తప్పులు, ఆధారాలు బయటపెడితే వారిపై కేసులు పెడతాం, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. జర్నలిస్టుల మీద సైతం కేసులు పెడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిలదీయకూడదంటూ అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులేది?మెగా డీఎస్సీ స్కామ్ ఎలా జరిగిందో సాక్ష్యాలు, ఆధారాలతో చూపించా. దీనిపై నేను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా చంద్రబాబుగానీ ఆయన సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రిగానీ సూటిగా సమాధానం చెప్పలేదు. అవన్నీ స్కామ్ పునాదులు. నేను అడిగిన ఆ నాలుగు ప్రశ్నలు చాలా సింపుల్. వాటిని మరోసారి గుర్తు చేస్తున్నా.1? రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ.. ఈ రెండిటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? పారదర్శకతకు ఎందుకు పాతరేశారు? ఇది స్కామ్‌కు ద్వారాలు తెరిచినట్లు కాదా? అని అడిగితే చంద్రబాబు నోరు విప్పలేదు.2? స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? అతడికి మొదటి ర్యాంకు వచ్చినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అతడి పేరును సెకండ్ మెరిట్ లిస్ట్‌లో ఎందుకు తీసేశారు? అతడి డీఎస్సీ క్యాండిడేట్ లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారు? అతడిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు? తనను పిలవలేదని డీఎస్సీ కన్వీనర్‌కు నవీన్ లేఖ కూడా రాశాడు. నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? ఇదంతా స్కామ్‌ను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నం కాదా? డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలను కూడా అమ్ముకున్నారని కొంతమంది అభ్యర్థులు చెప్పడం ఇటీవల సోషల్ మీడియాలో చూస్తున్నాం.. మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి ఇది మరింత బలాన్ని ఇవ్వడం లేదా?3? స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి గతంలో ఉన్న 2 శాతం కోటాను 3 శాతానికి పెంచడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ పరీక్షా రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా భర్తీ చేసుకోవడానికి జీవో నెం.4, జీవో నెం.47 ఎందుకు తీసుకువచ్చారు? ఈ జీవోలతో గేట్లు ఎత్తి 372 మందిని రిక్రూట్ చేసి, పనైపోయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.25, జీవో నెం.56తో గేట్లు మూసేశారు. ఎందుకు ఇంత అడ్డగోలు జీవోలు ఇచ్చారు? అసలు పరీక్షే లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మీ ఇష్టం వచ్చినట్లు ఇస్తారా? ఎందుకు జీవోలు ఇచ్చారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు?4? టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఏకంగా ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చిన తరువాత కూడా కేసును ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే వరకూ కేసును నీరుగార్చారు.అంత క్లియర్‌గా ఆడియో కాల్లో నెంబర్ కనిపిస్తుంటే ఆ వ్యక్తిని కనిపెట్టడం కష్టమా? కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం గుర్తు తెలియని (సస్పెక్ట్) వ్యక్తి అని రాశారు. కేసు నమోదుకు ఆలస్యం ఎందుకు అయ్యిందంటే..? ఉన్నతాధికారులతో సంప్రదించడం వల్ల అని రాసుకొచ్చారు. చంద్రబాబు, ఆయన తనయుడు మాత్రం.. అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించామని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో చూస్తే రిమాండ్‌కు పంపలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇవన్నీ సింపుల్ ప్రశ్నలు. ఆరేళ్ల పిల్లాడికైనా అర్థం అవుతాయి. ఇవే మెగా డీఎస్సీ కుంభకోణానికి పునాదులు. ఇప్పుడు బయటకు వస్తున్న ఉదాహరణలన్నీ వీటికి సంబంధించిన కోణాలే. వెన్నుపోటు పార్టీ నాయకుడికి తనను, తన తనయుడిని కాపాడుకోవడమే ప్రధానం.అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం...! ఒక అక్రమాన్ని తవ్వుతుంటే, మరొకటి బయట పడుతోంది. బాబు కుంభకోణాల చరిత్రలో డీఎస్సీ స్కామ్ ఆణిముత్యంగా నిలిచిపోతుంది. నిరుద్యోగ యువకులను నట్టేట ముంచిన స్కాం ఇది. స్పోర్ట్స్ కోటా పేరుతో చేసిన అక్రమాలు చూస్తే.. వీడు మనవాడా! డబ్బులు ముట్టాయా! అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం అన్నట్లుగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారు. జరగని పోటీలు జరిగినట్లుగా, ఆ పోటీల్లో పాల్గొని అద్భుతంగా ఆడినట్లుగా, తప్పుడు సర్టిఫికెట్లతో పోస్టులు ఇచ్చారు.పైస్థాయి నుంచి ఆదేశాలతో కింది స్థాయి వరకూ కుమ్మకై, ఒక పద్ధతి ప్రకారం (మోడస్ ఆపరాండీ) ఈ పోస్టులన్నిటినీ భర్తీ చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రతి కేస్ స్టడీ చెబుతోంది.జూడోలో పరీక్ష లేకుండా పోస్టులు..మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అసలు పరీక్షలే లేకుండా 372 మందిని నియమిస్తే.. ఒక్క జూడో కింద 39 మందికి ఎలాంటి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చారు. వీరిలో కొందరు సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్ షిప్ 2013 ఖమ్మంలో జరిగినట్లుగా, అందులో పాల్గొని గెలిచినట్లుగా ధ్రువీకరిస్తూ ఏపీ జూడో అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్లు పెట్టారు. తీరా చూస్తే అసలు ఆ తేదీల్లో (2013 అక్టోబర్ 19–21 మధ్య) ఆ ఛాంపియన్షిప్ ఖమ్మంలో జరగలేదని, తెలంగాణ జూడో అసోసియేషన్, ఖమ్మం జిల్లా జూడో అసోసియేషన్ చాలా స్పష్టంగా రాతపూర్వకంగా చెప్పాయి. ఇంతకీ ఈ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే.. చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు స్వయనా తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్. దీని అర్థం.. దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని, మళ్లీ ఆ దొంగ సర్టిఫికెట్లకు మన రాష్ట్రంలోని పెద్దలే ధృవీకరణ కూడా చేసి ఇచ్చారని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. సాఫ్ట్‌బాల్ పేరిట మరో 38 మందికి ఇలానే పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆయన సంతకం చేసిన 21 సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలిచ్చేశారు.పైనుంచి ఫోన్.. అంతా సెట్బసవేశ్వరరావు అనే మరో అభ్యర్థి 49వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ గుడివాడలో జరిగిందని, అందులో పాల్గొన్నానని సర్టిఫికెట్ పెట్టాడు. కానీ అతడి సర్టిఫికెట్ ఫేక్ అని ఆంధ్రా ఖోఖో అసోసియేషన్ అధికారికంగా శాప్‌కు లేఖ ఇచ్చింది. అయినా సరే దానిని పక్కన పడేసి, ఫేక్ సర్టిఫికెట్ పెట్టిన వాడికి ఉద్యోగం ఇచ్చేశారు. ఎందుకంటే పైనుంచి ఫోన్.. అంతా సెట్ అయిపోయింది ఉద్యోగం ఇచ్చేయమని! ప్రగడ కళ్యాణి అనే అభ్యర్థి కబడ్డీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్ 2003 నాగార్జున యూనివర్శిటీలో ఆడినట్లుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో, పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆ యూనివర్శిటీలో ఆ గేమ్స్ జరగలేదని, సౌత్ వెస్ట్ జోన్ కబడ్డీ పోటీలు మాత్రమే జరిగాయని తేలింది. అయినా సరే 7 అంచెల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నారు! టెట్ క్వాలిఫై కాకున్నా ఉద్యోగాలు..మరికొన్ని కేసుల్లో అయితే టెట్ పాసవకుండానే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక కేటగిరీలో టెట్ మార్కులు చూపించి, మరో కేటగిరీ టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇంకొన్ని కేసుల్లో.. అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్లో ఉద్యోగం ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఈడిగ ప్రభాకర్ అనే అభ్యర్థికి ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు. అతడి రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్జీటీ పోస్టుకు టెట్‌లో 75 మార్కులు రావాలి. కానీ ఆయనకు 65 మాత్రమే వచ్చాయి. ఇదే విషయాన్ని కర్నూలు డీఈవో కూడా ఒప్పుకున్నారు. మరి ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఎవరు చెబితే ఇచ్చారు? దీనిని కవర్ చేసుకోవడానికి తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ప్రభాకర్‌కు టెట్‌లో 77 మార్కులు 2018లో వచ్చాయని అధికారులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్లి టెట్ డేటా చూస్తే ఆ 77 మార్కులు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2 బీ కేటగిరీకి సంబంధించిన మార్కులని తేలింది. అవి చూపించి ఆయనకు టెట్ 1 ఏ కేటగిరీలో ఉన్న పోస్టు ఎలా ఇచ్చారు? సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్రువీకరించి ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ ఉద్యోగాలు పొందిన 21 మంది వివరాలు ‘ఈడబ్ల్యూఎస్’ మరో పెద్ద రాకెట్..ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్లు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి. ఇతర కులాలకు చెందిన వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉద్యోగాలిచ్చారు. కడప, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లాలో రసూల్ 2008, 2012, 2018లో బీసీ–ఈ కేటగిరీ కింద డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పుడు మాత్రం ఓసీ–ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉద్యోగం ఇచ్చారు. 1 : 1 రేషియోలో అధికారులు వెరిఫికేషన్ చేశాక కూడా పోస్టు ఎలా ఇచ్చారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7 సార్లు వెరిఫై చేశామని చెబుతున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎలా జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా ఎలా పోస్టులు ఇచ్చారు? ఎవరు చెబితే ఈ పని చేశారు? డీఎస్సీ స్కామ్ పునాదుల నుంచి ఈ కేస్ స్టడీస్ అన్నీ బయటకు వస్తున్నాయి. ‘ఏపీపీఎస్సీ’లోనూ ఇదే చేయాలనుకున్నారు!ఇంకా నిర్ఘాంతపోయే అంశం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఏపీపీఎస్సీలోనూ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలిచ్చేయాలని చూశారు. అటవీ శాఖలో 814 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, అందులో 40 పోస్టులు స్పోర్ట్స్ కోటా పేరిట పరీక్ష లేకుండా, కేవలం ఇలాంటి సర్టిఫికెట్లతో భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4ను వీళ్లు వాడుకున్నారు. అంటే డీఎస్సీ కుంభకోణం బయటకు రాకపోయి ఉంటే ఏపీపీఎస్సీలోనూ ఈ 40 పోస్టులు ఇచ్చేసేవారు. డీఎస్సీ అక్రమాలు బయటపడటంతో ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో మిగతా 774 పోస్టుల భర్తీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. 40 మంది జాబితా బయటపెట్టాల్సి వస్తుందని కాదా? అని నేను అడుగుతున్నా. ప్రభుత్వం, వ్యవస్థలపై నమ్మకం ఎలా ఉంటుంది?పోటీ పరీక్షల కోసం లక్షల మంది పిల్లలు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు ఇంత కష్టపడుతుంటే చివరికి స్కామ్‌లు చేసి, లంచాలు తీసుకుని నచ్చిన వాళ్లకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఇక ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్చాలంటే ఎలా జరుగుతుంది? పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. లేదంటే కాక్రోచ్లు రాక తప్పదు. వీరి మెడలు కూడా వంచక తప్పదు. కచ్చితంగా అదే జరుగుతుంది.అందుకే సీబీఐ విచారణ అవసరంఅసలు పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడమే ఓ స్కామ్. జీవోలు ఇవ్వడం.. స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు నింపడం.. ఆ తరువాత జీవోలను రద్దు చేయడం ఇదంతా పెద్ద స్కామ్! అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం. కాక్రోచ్లు ఊరికే రావు. వ్యవస్థలను పాలకుడు ఇలా దగ్గరుండి చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు.తప్పులు ఒప్పుకోక తప్పలేదు..!తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారులతో మాట్లాడించారు. ఐఏఎస్అధికారుల ప్రెస్‌మీట్ తర్వాత అంతిమంగా తేలింది ఏమిటంటే...⇒ టెట్ పాస్ అర్హత లేకపోయినా, పోస్టులు ఇచ్చామని ఒప్పుకోక తప్పలేదు.⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవి అని చెప్పలేకపోయారు.⇒ వెరిఫికేషన్ ఒక బోగస్ అని చెప్పకనే చెప్పారు.⇒ టోర్నమెంట్లు జరగకుండానే సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు.⇒ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు.⇒ లోకేశ్ తోడల్లుడు అధ్యక్షుడిగా ఉన్న జూడో అసోసియేషన్‌లో పోటీలు జరగకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు. ⇒ కులాలు మార్చి కూడా పోస్టులు ఇచ్చామని అంగీకరించక తప్పలేదు.చక్రం తిప్పిన శాప్..మరికొన్ని కేసుల్లో శాప్ స్వయంగా చక్రం తిప్పింది. విశాఖపట్నంలో ఏ పరీక్షా లేకుండా స్పోర్ట్స్ కోటాలో సీహెచ్ యోగేశ్వరరావు అనే అభ్యర్థికి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగం ఇచ్చారు. ఆయన చెల్లికి కూడా ఇచ్చారు. కుటుంబం మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నట్లున్నారు! నల్గొండలో జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2009లో యోగేశ్వరరావుకు ఫస్ట్ ప్లేస్, ఆయన చెల్లి మోహినిదేవికి సెకండ్ ప్లేస్ వచ్చినట్లు సర్టిఫికెట్లు చూపించారు. అయితే విజేతల జాబితాలో వీళ్లు లేరని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ రోజు పోటీలో గెలుపొందిన క్రీడాకారుల వివరాలు, పేర్లతో కూడిన రికార్డులను కూడా బయటపెట్టింది. అంటే ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకుని, ఆ మేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని అర్థం అవుతోంది. కానీ ఇచ్చిన ఈ ఉద్యోగాలన్నీ ఏడు సార్లు వెరిఫికేషన్ అయిన తరువాత, ప్రతీ దానిని స్రూ్కటినీ చేసి, స్క్రీనింగ్ చేసి, తనిఖీ చేసి ఇచ్చామని అధికారుల చేత చంద్రబాబు చెప్పిస్తున్నారు. -
అబద్ధాలు.. డ్రామాలు.. డైవర్షన్లు
అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా.మా హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారో చెక్ చేసుకోండి... ఎక్కడా తేడా చూడలేదు.మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు.సాక్షి, అమరావతి: ‘డైవర్షన్..డ్రామాలు..అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బతుకు.. అధికారులను బెదిరించి.. భయపెట్టి..ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను కొట్టేయించుకుంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. పైగా తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాడు. తమ అవినీతి, అక్రమాలు, స్కామ్‌లు బయటపడిన ప్రతీసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పచ్చి అబద్ధాలు చెబుతూ డ్రామాలు ఆడడం చంద్రబాబుకే చెల్లింది‘ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. కుంభకోణాలు చేస్తూ.. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలిస్తుండటంపై సాక్ష్యాధారాలతో ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగుతారు. ఇలా అయితే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఎలా ఏర్పడుతుంది. లంచాలు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చుకుంటూ పోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వ్యవస్థలో మార్పు రావాలి. డీఎస్సీ స్కామ్‌పై పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి, ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంది.’ అని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..పరీక్ష రాయకుండానే ఉద్యోగాలిస్తే ప్రశ్నించకూడదా? నువ్వు పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇస్తానంటున్నావు. నీకు నచ్చిన వారికి డబ్బులు తీసుకొని స్కామ్‌లు చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నావు. అర్హత ఉండాలి కదా? ఎలాంటి అర్హత లేకుండా నీకు నచ్చాడని, నీకు డబ్బులు ఇచ్చాడని నీ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే ఎలా? ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పవుతుందా? ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు పారదర్శకంగా ఒక పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందాలి. అలా ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలిచ్చే సమయంలో ఒకటి రెండు తప్పిదాలు జరిగితే పొరపాటు చేశావ్ లే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కావాలనే పెద్ద మోసం చేసినట్టు స్పష్టంగా కన్పిస్తోంది. ఏ పరీక్ష రాయకుండానే 372 పోస్టులు ఇచ్చేందుకు స్కెచ్ వేశావు. ఉద్యోగాలకు పరీక్షలు రాయనవసరం లేదని ఏకంగా నువ్వు జీవోలు ఇచ్చావు. ఇదే రీతిలో మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకోవాలనుకున్నావ్. ఇది తప్పు కాదా? పైగా ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా? డైవర్షన్.. డ్రామాలు.. అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బ్రతుకు చంద్రబాబు అనే వ్యక్తి అబద్ధాల మీద అబద్ధాలు..డైవర్షన్ మీద డైవర్షన్..ఒక డ్రామా చేస్తాడు. డీఎస్సీ స్కామ్–1 కానీ, డీఎస్సీ స్కామ్–2 కానీ ఇవన్నీ కూడా ఆధారాలతో సహా నేను చూపించాను. పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చిత్తశుద్ధితో సమాధానాలు చెప్పాలి. కానీ మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు. పైగా అధికారులతో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏం చెప్పించారు.. ఏడుసార్లు వెరిఫికేషన్ తర్వాతే ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మేము ఆధారాలతో బయటపెడుతున్నాం.. కాబట్టి దిక్కుతోచని, తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్పులను ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. నిరుద్యోగ జీవితాలతో చెలగాటాలా? డీఎస్సీ కుంభకోణంపై పోరాటం ఇంత పెద్దది కాకపోతే..జగన్ అనే వ్యక్తి ప్రశ్నించకపోతే డీఎస్సీ మాదిరిగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌కు వర్తింపచేసేవారు. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన వీళ్లు ఏపీపీఎస్సీలో కూడా పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు అమ్మేసుకోవాలని చూశారు. అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4నే ఇక్కడ వర్తింపచేయాలని చూశారు. డీఎస్సీలో అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేశారు. ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే తమ బాగోతం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని నిలిపివేశారు. లక్షలమంది పిల్లలు పోటీ పరీక్షల కోసం జీవితాలను ఫణంగా పెట్టి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చుచేస్తారు. ఇంత కష్టపడితే చివరకు స్కామ్‌లతో ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు లంచాలు తీసుకుని నియామకాలు చేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెడుతూ సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నా. అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా. పాలకులుగా ఉన్న మనం ఏం చేస్తా ఉన్నాం. పరిపాలన అంటే ఇదేనా?ఎలాంటి ఆరోపణ లేకుండా లక్షల ఉద్యోగాలిచ్చాం.. మా ప్రభుత్వ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్ద పీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. చెక్ చేసుకోండి..సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడా తేడా చూడలేదు. ప్రభుత్వం అనేది ఉద్యోగార్థుల్లో నమ్మకం కల్గించేలా ఉండాలి. అర్హత లేని వారికి ఉద్యోగాలు అమ్ముకునే విధానాన్ని ఒప్పుకుంటే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద వారికి నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే డీఎస్సీ స్కామ్‌పై పారదర్శకంగా సీబీఐ విచారణకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. మా డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయంలో ఇప్పటికే వివిధ రూపాల్లో పోరాటాలు చేశాం. మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని రకాల వేదికలపైనా పోరాటాలు కొనసాగిస్తాం. నిజంగా సిగ్గుతో వాళ్లు తలదించుకోవాలి.. డీఎస్సీ స్కామ్‌పై మీరు లేవనెత్తిన అంశాలపై బీజేపీ, జనసేన ఎందుకు స్పందించడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఈ ప్రశ్నను మీరు వాళ్లను అడగాలి. డీఎస్సీ స్కామ్ విషయంలో జగన్ ఏమైనా విషయాలు తప్పుగా చెబుతున్నారా. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడా ? జగన్ చెప్పే విషయాలు లాజికల్‌గా లేవా ? అని వాళ్లను ప్రశ్నించాలి. జగన్ చెప్పే విషయాలన్నీ కరెక్ట్ అని అనిపిస్తా ఉన్నప్పుడు నోరు మెదపాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఉన్న ఎవరికైనా ఖచ్చితంగా రావాలి. సాక్ష్యాలు, ఆధారాలతో పక్కాగా దొరికిపోయిన తర్వాత కూడా జనసేన, బీజేపీ నేతలు ప్రశ్నించకుండా ఇలాంటి చంద్రబాబును సపోర్టు చేస్తున్నందుకు, ఇలాంటి వ్యవస్థను బలపరుస్తున్నందుకు వాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ.. చంద్రబాబు తనపై నమోదైన కేసులు కొట్టేయించుకుంటూ తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టించి, ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను మూయించుకుంటున్నారు ఇది జగమెరిగిన సత్యం. ప్రభుత్వం తన చేతుల్లో ఉంది. అధికారులందరూ ఆయన కింద పని చేస్తున్నవారే. తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. డీఎస్సీ పై నమోదైన కేసులను కూడా ఇదే రీతిలో నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వంలో రిపోర్టింగ్ అథారిటీ ఎవరు.. చంద్రబాబు నాయుడే. అందుకే తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయించుకుంటూ తనకు క్లీన్ చిట్ వచ్చిందని తనకు తానుగా చెప్పుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. -
మీలాంటి వాళ్ల వల్లే కాక్రోచ్ లు పుట్టకొస్తారు.. కూటమిపై విరుచుకుపడ్డ YS జగన్
-
జగన్ దెబ్బకు బాబుకు బీపీ హై వెలుగులోకి కీలక ఆధారాలు
-
7 స్టెప్స్ వెరిఫికేషన్.. ఇది వీళ్ల బండారం..జగన్ సంచలన వ్యాఖ్యలు
-
రాజీనామా చేసే వరకు వదిలిపెట్టను జగన్ మాస్ వార్నింగ్
-
అసలు సూత్రదారులు వీళ్లే..! ఆధారాలతో బయటపెట్టిన YS జగన్
-
ఎవరికీ పోస్టు ఇవ్వాలో మంగళగిరి నుంచి ఫోన్.. లైవ్ వీడియో ప్లే చేసి ఏకిపారేసిన జగన్
-
బాబు జైలుకెళ్లి మూడేళ్లు... వెళ్తూ వెళ్తూ జగన్ సెటైర్లు అదుర్స్
-
జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాలి.. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ రాజీనామా చేయాలి అనే డిమాండ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వినిపించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. స్కామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెట్టారు.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిస్తున్నాయి. అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారు?. టెట్ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ఒప్పుకున్నారు. స్పోర్ట్ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారు. జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. లంచాలు తీసుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది కూడా బోగస్సే. అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలివ్వడమే పెద్ద స్కాం....ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు. దొడ్డిదారిన జీవో నెంబర్ 4 తేవాలని చూశారు. మా హయాంలో క్లియరెన్స్ పొందిన 814 పోస్టుల్లో.. పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారు. డీఎస్సీ స్కాం బయటకు రావడంతో ఆగిపోయారుచంద్రబాబు, లోకేశ్‌లు వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఆయన దగ్గర పని చేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. నిరుద్యోగ యువత కోసం కోర్టులోనూ పోరాడుతున్నాం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యపైనా వైఎస్ జగన్ స్పందించారు. లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. డీఎస్సీ స్కామ్‌పై ఇంతరాద్ధాంతం జరుగుతుంటే.. బీజేపీ, జనసేన మౌనంగా ఉండడంపై వైఎస్ జగన్ స్పందించారు. జగన్ అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన స్పందించకపోవడంపై వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నందుకు.. ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పుచేసుకున్నందుకు వాళ్లు సిగ్గుపడాలని వైఎస్ జగన్ అన్నారు. -
15లక్షలకు DSC జాబ్ లు అమ్ముకున్నారు..! సంచలన వీడియో బయటపెట్టిన YS జగన్
-
దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌లో వాస్తవాలు బయటపడుతున్నా.. దాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏడుసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టామని అధికారుల ద్వారా చెప్పిస్తూ ఇప్పుడు కవర్అప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెట్ పాస్ కాకుండానే కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నంకు చెందిన యోగేశ్వరరావుకు స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు ఆయన సోదరికి కూడా ఉద్యోగం ఇచ్చారని, కుటుంబం మొత్తానికీ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లా పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కీలకంగా వ్యవహరించిందన్నారు.యోగేశ్వరరావు, మోహినీదేవి పేర్లు తాము నిర్వహించిన ఈవెంట్లో లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టం చేసిందని జగన్ తెలిపారు. అయినప్పటికీ వారు పోటీల్లో పాల్గొన్నట్లు చూపించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రగడ కల్యాణి విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం జరిగిందన్నారు. ఆమె కబడ్డీ పోటీలో పాల్గొన్నట్లు పేర్కొన్నప్పటికీ.. 2003లో నాగార్జున యూనివర్సిటీలో సౌత్‌జోన్ కబడ్డీ పోటీలు జరిగాయని, కాబట్టి ఆమె సమర్పించింది నకిలీ సర్టిఫికెట్‌గా తేలిందని ఆయన చెప్పారు.ఈడిగ ప్రభాకర్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఆయన టెట్‌కు క్వాలిఫై కాలేదని, కనీస విద్యార్హత కూడా లేదని డీఈవో స్వయంగా వెల్లడించారని తెలిపారు. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.మరోవైపు ‘ఏడుసార్లు వెరిఫికేషన్ అయ్యాకే ఉద్యోగాలు ఇచ్చాం’ అని అధికారులు డీఎస్సీ స్కాం గురించి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నలు తలెత్తిన తర్వాత.. కొందరు అభ్యర్థులు చాలాసార్లు టెట్ రాసి ఉండొచ్చని, అందువల్ల ఉద్యోగం వచ్చి ఉండొచ్చంటూ కవర్అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు ఆ వెరిఫికేషన్ కూడా బోగస్ అని ఆయన అభివర్ణించారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు, అర్హతలు, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.ఇదీ చదవండి: ఆధారాలు చూపిస్తే అక్రమ కేసులా? -
DSC స్కాంలో కీలక పాత్ర ఎంపీ భరత్ ది.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
DSC స్కాం పార్ట్ 2.. వెలుగులోకి కీలక ఆధారాలు
-
కాక్రోచ్లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో.. డీఎస్సీ స్కామ్ అనేది ఓ ఆణిముత్యమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో డీఎస్సీ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.డీఎస్సీ స్కామ్‌ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. కొడుకు నారా లోకేశ్‌ను కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి స్కామ్‌ల వల్లే కాక్రోచ్లు(కాక్రోచ్ జనతా పార్టీ.. జెన్‌జీ ఉద్యమంను ఉద్దేశించి) పుట్టుకొస్తున్నాయి అని వైఎస్ జగన్ అన్నారు.వ్యవస్థలు చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. ఇలాంటి స్కామ్‌లతో కాక్రోచ్లు రాక తప్పదు. ఆఖరికి నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు అని వైఎస్ జగన్ కామెంట్ చేశారు.డీఎస్సీ కుంభకోణంలో పై నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు అని ఖమ్మం(తెలంగాణ)లో జరగని ఈవెంట్లతో ఉద్యోగాలిచ్చిన కేసును ఆధారాలతో సహా చూపించారు. ఆ జూడో అసోషియేషన్ అధ్యక్షుడు ఎవరో కాదు.. చంద్రబాబు దగ్గరి బంధువు.. నారా లోకేశ్ తోడల్లుడు.. టీడీపీ ఎంపీ భరత్ అని చెప్పారు. సాఫ్ట్ బాల్ విషయంలోనూ ఇదే జరిగిందని.. దాని అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవి అని గుర్తు చేశారు. వీటి ఆధారంగా దొంగ సర్టిఫికెట్లు గుర్తించినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. కుంభకోణం జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: డీఎస్సీ స్కాంతో బాబుకి హైబీపీ -
DSC స్కాంలో తవ్వేకొద్ది అక్రమాలు.. ఒక్కొక్కటి బయటపడుతుంటే బాబుకు బీపీ పెరుగుతోంది
-
డీఎస్సీ స్కామ్‌తో చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. సుదీర్ఘంగా ఈ కుంభకోణంపై కొత్త విషయాలతో మాట్లాడారాయన.డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. స్కామ్ జరిగిందని ఎవరైనా ఆధారాలు చూపిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. వాళ్లను జైల్లో పెడుతున్నారు. జర్నలిస్టులు కొందరు వాస్తవాలు బయటపెడితే.. వాళ్లపైనా తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించాం. నా ప్రశ్నలకు చంద్రబాబు, నారా లోకేశ్ దగ్గరి నుంచి సమాధానమే లేదు అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ.. పర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?. ఇక్కడే డీఎస్సీ స్కామ్‌కు ద్వారాలు తెరిచారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా బుల్డోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్‌ర్యాంకర్ పేరు ఎందుకు లేదు?. సెకండ్ లిస్ట్‌లో అతని పేరు ఎందుకు మాయమైంది?. అతని డీఎస్సీ లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు. ఎందుకు అతన్ని వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు?. కోర్టుకు ఆ ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు?. స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశారు అని వైఎస్ జగన్ అన్నారు. స్పోర్ట్ కోటాలో పరీక్షే లేకుండా 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారు. అందుకోసం ప్రత్యేక జీవోలు రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ అయ్యాక ఆ జీవోలు మార్చేశారు. డీఎస్సీ ఉద్యోగాల కోసం జరిగిన బేరసారాల ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయి. తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నం కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
Watch Live: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. మెగా డీఎస్సీ కుంభకోణం గురించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్2025 మెగా డీఎస్పీలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి.డీఎస్సీ అక్రమాలు బయటికొచ్చే కొద్దీ బాబులో బీపీ పెరుగుతోంది.నా ప్రశ్నలకు బాబు, లోకేష్ సమాధానం చెప్పలేదుప్రశ్నిస్తే తప్పుడు కేసులతో భయపెడుతున్నారు.రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నాపత్రం తయారీ2025 మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీప్రశ్నించిన జర్నలిస్టులపై కూడా అక్రమ కేసులు పెట్టారు.మా ప్రశ్నలకు సమాధానం చెప్పరు.. బుల్డోజ్ చేస్తారుఫస్ట్ ర్యాంకర్‌ను వెరికేషన్‌కు ఎందుకు పిలవలేదు?డీఎస్సీపై ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించాంపర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?ఎస్ఈఆర్టీలో వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది?మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంకర్ పేరును ఎందుకు మార్చారు?ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?కోర్టుకు ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు.జీవో నంబర్ 4, 47తో గేట్లు తెరిచారు.ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చాయి.డిఎస్సీ స్కామ్‌ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు.ఇలాంటి స్కామ్‌ల వల్లే కాక్రోచ్లు పుట్టుకొస్తున్నాయి.బాబు స్కామ్‌ల హిస్టరీలో ఇదొక ఆణిముత్యంతప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు.నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.పై నుంచి కింది స్థాయి వరకూ అంతా కుమ్మక్కయ్యారుకొడుకును కాపాడాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు.వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు.2013 జూడో సీనియర్ పోటీలో ఖమ్మంలో జరిగినట్లుగా ఏపీ జూడో అసోసియేషన్ సర్టిఫికెట్లు ఇచ్చింది.ఖమ్మంలో అసలు సీనియర్ పోటీలు జరగలేదని తెలంగాణ అసోసియేషన్ తేల్చి చెప్పింది.విశాఖలో అన్నాచెల్లెళ్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చేశారు.దొంగ సర్టిఫికెట్లు చూపినట్లు ఆధారాలున్నాయి.ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు.. లోకేష్ తోడల్లుడు భరత్.డీఎస్సీ-2025, మెగా డీఎస్సీ కాదు, నిరుద్యోగులను, నిజాయితీపరులైన అభ్యర్థులను దగా చేసిన డీఎస్సీ అని చాలా రోజులుగా చెప్తున్నాం.గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నారు.ఇవిచూసిన తర్వాత ఎవరైనా ఈస్కాం నుంచి తప్పించుకోగలుగుతారా? ఎందుకంటే అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి.మెగా డీఎస్సీ కుంభకోణాన్ని తవ్వేకొద్దీ, ఈ స్కాం తాలూకు రూపాలు చాలా కనిపిస్తున్నాయి.మరోవైపు సోషల్‌మీడియాలో కూడా నిలదీయకూడదంటూ అక్కౌంట్లను బ్లాక్ చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు. ఈ డీఎస్సీ స్కాం ఎలా జరిగిందో అనేక సార్లు ఇదే వేదికపై నుంచి నేను సాక్ష్యాలు, ఆధారాలు చూపించాను.నేను అడిగే ప్రశ్నలు చాలా సింపుల్. ఇందులో అర్థంకాకపోవడానికి కూడా ఏమీ లేదు.గతంలోనైనా, ఎప్పుడైనా, రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఈ రెండింటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? ఎందుకు పారదర్శకతకు పాతర వేశారు? అని అడిగా? ఇది స్కాంకు ద్వారాలు తెరిచినట్టుకాదా? అని అడిగా? కాని చంద్రబాబు నోరు విప్పలేదు.డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలనుకూడా అమ్ముకున్నారని ఇటీవలే కొంతమంది అభ్యర్థులు చెప్పడం, మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి మరింత బలాన్ని ఇవ్వడంలేదా?స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి, అదివరకే ఉన్న 2% స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షే లేకుండా, డైరెక్ట్‌గా జీవో 4,47లతో గేట్లు ఎత్తారు.పని అయిపోయాక, మళ్లీ జీవో నంబర్ 23, 25, జీవో నంబర్ 56 లతో, గేట్లు మూసేశారు. ఎందుకు ఈ జీవోలు ఇచ్చారు? ఎందుకు పని అయిపోయిన తర్వాత, ఆ జీవోలను ఉపసంహరించారు? కారణం ఏంటి?టీచర్ పోస్టులకోసం డబ్బులు తీసుకున్నారంటూ ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చినా, దీనిపై విచారణ ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్ఐఆర్ నమోదయ్యింది మొదలు, స్టేషనల్ బెయిల్ ఇచ్చి పంపడం వరకూ, ఎందుకు కేసును నిర్వీర్యం చేశారు? పైగా రిమాండ్‌కు పంపాం అంటూ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇవే బేసిక్‌గా మెగా డీఎస్సీ స్కాంకు సంబంధించి పునాదులు.ఇప్పుడు బయటకు వస్తున్న కేస్‌స్టడీస్ అన్నీకూడా, వీటికి సంబంధించిన కోణాలే. తవ్వుతున్న కొద్దీ ఒక్కో అక్రమం, ఒక అక్రమాన్ని తవ్వుతుంటే ఇంకో అక్రమం బయటకు వస్తోంది.బాబుగారి స్కాంల హిస్టరీలో మరో ఆణిముత్యం ఇది. నిరుద్యోగ యువకులను నట్టేటా ముంచి స్కాం ఇది.స్పోర్ట్స్‌కోటా పేరుతో వీళ్లు చేసిన అక్రమాలు చూస్తే, వీడు మనవాడా? ఇతను దగ్గరనుంచి డబ్బులు ముట్టాయా… అయితే ఇచ్చేయ్ టీచర్ పోస్టు.. అన్న పద్ధతిలో ఈ రిక్రూట్మెంట్ చేశారు.జరగని పోటీలు జరిగినట్టుగా, ఆ పోటీల్లో వీళ్లు అద్భుతంగా ఆడినట్టుగా తప్పుడు సర్టిఫికెట్లతో సైతం పోస్టులు ఇచ్చేశారు.పై స్థాయి నుంచి ఆదేశాలతో, కింది స్థాయి వరకూ కుమ్మక్కై, ఒక మోడస్ ఆపరండీ ప్రకారం ఈ పోస్టులన్నింటినీ భర్తీచేశారు.సీబీఐ విచారణ జరగాల్సిన అవసరాన్ని ప్రతి కేస్ స్టడీకూడా చెప్తోంది.స్పోర్ట్స్‌లో కోటా భర్తీచేసిన వాళ్ల జాబితా చూస్తే ‘జూడో ఆట’తో మొత్తం 39 మందికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా టీచర్ పోస్టులు ఇచ్చారు.సాఫ్ట్‌బాల్ పేరిట, 38 మందికి ఇలానే పరీక్ష రాయకుండానే, టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.మరికొన్ని కేసుల్లో అయితే, శాపే చక్రంతిప్పింది.విశాఖపట్నంలో ఏ ఎగ్జామ్ రాయకుండానే ‘యోగేశ్వర్రావు’ అనే అభ్యర్థికి స్పోర్ట్స్ కేటగిరీలో ఎస్జీటీ టీచర్ పోస్టు ఇచ్చారు.ఈయన చెల్లెలికి కూడా ఇలానే స్పోర్ట్స్ కేటగిరీలో పోస్టు ఇచ్చారు.కాని వీళ్లు విజేతల జాబితాలో లేరని తెలంగాణ ఖో – ఖో అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్తూ, ఆరోజు పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను విడుదలచేశారు.అంటే, ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో కనుక్కుని. ఆమేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారని అర్థం అవుతోంది.కాని ఏడుసార్లు వెరిఫికేషన్ చేయించామని చంద్రబాబు అధికారులతో చెప్పిస్తున్నారు.కొన్ని కేసుల్లో, అభ్యర్థులు టెట్ పాస్ కాకుండానే ఉద్యోగాలు ఇచ్చారు.ఒక కేటగిరీలో టెట్ అర్హత ఉంటే, మరో సబ్జెక్ట్‌కు సంబంధించి టీచర్ పోస్టు ఇచ్చారు.ఇంకొన్ని కేసుల్లో అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్లో పోస్టు ఇచ్చారు.కర్నూలు జిల్లాలో ‘ఈడిగ ప్రభాకర్’ అనే అభ్యర్థికి, ఏ పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు.తన రిజర్వేషన్ కేటగిరి ప్రకారం ఎస్జీటీ పోస్టుకు టెట్లోలో 75 మార్కుల రావాలి.కాని, 65 మార్కులు వచ్చినా, స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్ట్ ఇచ్చారు.ఈ విషయాన్ని కర్నూలు డీఈఓ కూడా ఒప్పుకున్నారు. మరి ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఎవరు చెప్తే ఇచ్చారు?ఈడిగ ప్రభాకర్‌కు టెట్‌లో 77 మార్కులు 2018లో వచ్చాయని ఈ కేసును ఇక్కడ కప్పిపుచ్చే ప్రయత్నంచేశారు.కాని వీరు చూపిన హాల్ టికెట్ నంబర్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్లి, టెట్ డేటా చూస్తే,ఈ 77 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2B కేటగిరీకి సంబంధించిన మార్కులు.మరి ఇతనికి టెట్ 1ఏ-లో ఉన్న, ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు?ఈడబ్యుఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్టు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి.ఇతర కులాలకు చెందిన వాళ్లకు ఈడబ్యుఎస్ కింద పోస్టులు ఇచ్చారు. కడప, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులన్నీ వెలుగులోకి వస్తున్నాయి.కడప జిల్లాలో రసూల్ అనే వ్యక్తి బీసీ-ఈ కేటగిరీ అయితే, 2009, 2012, 2018లో బీసీ-ఈ కిందే డీఎస్సీ పరీక్షలకోసం అప్లై చేస్తే, ఇప్పుడు మాత్రం అతనికి ఓసీ- ఈడబ్ల్యూఎస్ కింద పోస్టు ఇచ్చారు.1:1 రేష్యోలో అధికారుల వెరిఫికేషన్ ఏశాక, దాన్ని దాటి పోస్టులు ఎలా ఇవ్వగలిగారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7సార్లు వెరిఫైచేశామని చెప్తున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎందుకు జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా, పోస్ట్‌లు ఎలా ఇచ్చారు? ఎవరు చెప్తే ఈ పనిచేశారు?నిరుద్యోగ యువతకోసం న్యాయస్థానాల్లోనూ పోరాడుతున్నాం.అర్హత లేనివారికి ఎవరు చెబితే పోస్ట్ ఇచ్చారు?అసలు ఏ పరీక్షా లేకుండానే పోస్ట్‌లు ఇవ్వడం పెద్ద స్కాం.నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు- వైఎస్ జనన్చంద్రబాబు దగ్గర పనిచేసే అధికారులు నిస్పక్షపాతంగా విచారణ చేయగలరా?ఏ పరీక్షా లేకుండా గర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వడమే పెద్ద స్కాంమరి అక్రమాలు జరిగాయని ఒప్పుకున్న తర్వాత, చంద్రబాబుగారి ప్రభుత్వమే అధికారంలో ఉండగా, ఆయన కింద పనిచేసే అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా?చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, ఆయన కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా?అందుకే డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం.మరి కాక్రోచ్లు ఊరికే రావు. వ్యవస్థలను చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. నాలాంటి వాడుకూడా కాక్రోచ్ అవుతాడు.మరో నిర్ఘాంతపరిచే విషయం ఏంటంటే, పరీక్షలు లేకుండానే, టీచర్ పోస్టులు కట్టబెట్టిన వీళ్లు, ఏపీపీఎస్సీలో కూడా పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు.అటవీశాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే. అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీఓ నంబర్-4నే మీరు వాడుకున్నారు.డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రికక్రూట్మెంట్ను మధ్యలో ఆపేశారు.ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే తమ బాగోతం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని నిలిపేశారు.లక్షలమంది పిల్లలు పోటీ పరీక్షలకు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు.ఇంత కష్టపడితే చివరకు స్కాంలతో ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు లంచాలు తీసుకుని పోస్టులు ఇస్తున్నారు.ప్రభుత్వంమీద, వ్యవస్థలమీద మరి నమ్మకం ఎవరికైనా ఎలా ఉంటుంది? -
కురుక్షేత్రానికి సిద్ధం కండి.. క్యాడర్ కు జగన్ బిగ్ టాస్క్
-
చంద్రబాబు హామీలు.. మోసాలు.. ఇంటింటా ఇదే చర్చ
వచ్చే సెప్టెంబర్‌లో పాదయాత్ర చూస్తుండగానే కళ్లు మూసి తెరిచేసరికి దాదాపు రెండున్నర ఏళ్లు గడిచాయి. ఇప్పుడు సెప్టెంబరు నెలలో ఉన్నాం. మళ్లీ కళ్లు మూసి తెరిచేలోగా ఏడాది గడిచి మళ్లీ సెప్టెంబరు వస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా యాత్ర జరుగుతుంది. చంద్రబాబు చేసిన మోసమే ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చనీయాంశమైంది. జగన్ మోసం చేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఆ టైంలో కనీసం నాలుగువేళ్లు నోట్లోకి పోయాయి. కానీ, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. ఇవాళ నోట్లోకి ఏదీ పోవడం లేదు. చంద్రబాబు పుణ్యాన మా బతుకులు బస్టాండ్ అయిపోయాయి అన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది.‘‘జగన్ ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. జగన్ ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు.’’‘‘చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్.’’‘‘స్థానిక ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం.’’‘‘ప్రజలకు మంచి చేసి.. ఫలాన మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి పాలకుడికి ఉండాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలు తోడుగా నిలబడతారు. కానీ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దౌర్జన్యాలు చేయడం, డైవర్షన్స్ చేస్తూ ఉండడాన్ని దేవుడు కరుణించడు. ప్రజలు హర్షించరు’’ – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని, ఇది ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హామీలు, మోసాలపైనే ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని, వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా నిలబడాలని, పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు నిజాయితీగా జరిగితే విజయం తప్పకుండా వైఎస్సార్సీపీదే అని స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ గాదె మధుసూదన్‌రెడ్డి, పలువురు నేతలు సమావేశానికి హాజరయ్యారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..కార్యకర్తలు గర్వపడేలా మన పాలనమన 5 ఏళ్ల పాలన, బాబు రెండున్నర ఏళ్ల పాలనలో ఎంతో తేడా ఉంది. దీనిపైనే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదేళ్ల మన పరిపాలనలో ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ఫలానావాడు మా నాయకుడు, ఫలానా పార్టీ మా పార్టీ అని గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితి. మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలు ఇస్తారు. చంద్రబాబు లాంటి వాళ్లు అయితే ఏకంగా ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచిపెడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మ్యానిఫెస్టో, అందులో ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో కనిపిస్తాయి. అలాంటి పరిస్థితిని మార్చిన పాలన మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ, అందులో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే అని గర్వంగా చెప్పగలుగుతాం. అంతగా మాట ఇస్తే ఆ మాటపై నిలబడాలి అని తాపత్రయపడ్డాం. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఎప్పుడు ఇస్తాము అని ముందుగానే షెడ్యూల్ ప్రకటించి, ఒక్క పథకం కూడా మిస్ కాకుండా బటన్లు నొక్కి అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుందా? అన్న సందేహాలను పటాపంచలు చేశాం. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి, ప్రతి 50, 60 ఇళ్లకు ఒక వలంటీర్‌ను తీసుకొచ్చి, ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. ఇది వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది.వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు.. మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా మారాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు, మూడో తరగతి నుంచి టోఫెల్ పీరియడ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ అమలు చేయడం, నాడు–నేడు మనబడితో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చడం, ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లోనూ డిజిటలైజ్డ్ బోధన తీసుకొచ్చేలా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ చేయడం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగాయి. గోరుముద్ద అనే పేరుతో పిల్లలు ఏం తింటున్నారో, తినే ఆ తిండి బాగుందా లేదా అని పట్టించుకునే ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవరైనా ఉంటారో లేదో తెలియదు కానీ జరిగింది ఒక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్‌బుక్స్.. ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషుతో బుక్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం మనది. ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబ్‌లు పెట్టింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పేదవాడికి ఇంకా తోడుగా ఉండేలా చాలా మార్పు చేశాం. మనం రాకముందు ఆరోగ్యశ్రీ పరిధి 1,000 ప్రొసీజర్లు. మనం వచ్చిన తర్వాత 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ప్రతి పేదవాడికి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించాం. నాడు–నేడుతో హాస్పిటల్స్ రూపురేఖలు మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు అందుబాటులో ఉంచాం. అదీ మన చరిత్ర. ఇంకా ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత జాతీయస్థాయిలో 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 4 శాతం మాత్రమే. ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టడం అన్నది కూడా గతంలో ఎప్పుడూ చూడని విషయం. గ్రామస్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామస్థాయిలోనే ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ప్రతి డాక్టర్‌కు నాలుగైదు ఊళ్లు కేటాయింపు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు 104 అంబులెన్సులో పర్యటన. అలా ఆయా గ్రామాలు, అక్కడి వారితో డాక్టర్‌కు సాన్నిహిత్యం. అత్యుత్తమ వైద్య సేవలు. ఊరిలో పేషెంట్‌ను పేరు పెట్టి పిలవగలిగే పరిస్థితిలోకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇది కూడా గతంలో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. నష్టాల్లో ఉన్న రైతు. రైతు బ్రతుకంతా ఎప్పుడూ కష్టమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి నుంచి, రైతును పట్టించుకునే నాధుడు ఉండడు అన్న పరిస్థితి నుంచి, మొట్టమొదటిసారిగా రైతును చెయ్యి పట్టుకొని నడిపించాలని తపన పడింది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అందుకోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఆ ఆర్బీకేలో అసిస్టెంట్‌గా అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్. ప్రతి ఎకరా ఈ–క్రాపింగ్. వాటన్నింటి ద్వారా ప్రతి అడుగులోనూ రైతును చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం. ఆ ఆర్బీకేల్లో పంటల గిట్టుబాటు ధరల ప్రకటన. ఆ మేరకు పోస్టర్లు. ఏరోజైనా రైతుకు రేటు రాకపోతే వెంటనే ఆర్బీకేలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా యాక్టివేట్ చేస్తే, వెంటనే జాయింట్ కలెక్టర్, మార్క్ ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జోక్యం చేసుకోవడం, ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేయడం, అలా మార్కెట్లో పోటీని సృష్టించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయడం అన్నది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సచివాలయంలో మన కళ్ళ ముందే దాదాపు పది మంది కళకళలాడుతూ సేవలు అందించే కార్యక్రమం. ప్రతి 50,60 ఇళ్లకు ఒక వలంటీర్. ఇళ్లకే వెళ్లి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు, ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్ప. వ్యవస్థలో కనీవిని ఎరుగని మార్పులు మన హయాంలోనే జరిగాయి.చంద్రబాబు పచ్చి దగామనం ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. మనం ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు. అప్పుడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఏమిటి? జగనైతే అమ్మఒడి కింద ఎంత మంది పిల్లలు ఉన్నా ఒకరికే రూ.15 వేలు ఇస్తున్నాడు. మేమైతే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే, అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు ఇస్తామని చెప్పాడు. ఇంకా అంతటితో కూడా ఆగిపోలేదు. రైతు కనపడితే ఏమన్నాడు? జగన్ రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తే, తాను రూ.26 వేలు ఇస్తానన్నాడు. అంతటితో ఆగిపోలేదు. 45 ఏళ్ళు దాటిన మహిళలకు చేయూత కింద జగన్ ఇచ్చేది కేవలం రూ.18,750 అయితే, తాము 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. అలా నీకు రూ.48 వేలు, నీకు రూ.48 వేలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇంకా దాంతోనూ ఆగిపోలేదు. 20 ఏళ్ల పిల్లోడు కనపడితే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పాడు. అలా జగన్ కంటే అన్నీ ఎక్కువే ఇస్తానని నమ్మించాడు. ఆఖరికి వలంటీర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు.దౌర్జన్యంతో పాలకులు రాజ్యం చేయలేరుఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దౌర్జన్యంతో ఎప్పుడూ కూడా పాలకులు రాజ్యం చేయలేరు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో నా పాదయాత్రకు ముందు నంద్యాల ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికల్లో విపరీతంగా పోలీసుల ద్వారా అధికార దుర్వినియోగం చేశారు. దాంతో నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 34 వేల ఓట్లతో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైంది? మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబునాయుడు తన పార్టీలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? దాని తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏం జరిగింది? ఒక సునామీ వచ్చింది. దేవుడు చంద్రబాబుకి ఎలా మొట్టికాయలు వేశాడో చూశాం. అదే నంద్యాలలో దాదాపు 40 వేల ఓట్లతో మనం గెలిచాము. చంద్రబాబు మన పార్టీ నుంచి చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు. సరిగ్గా ఆ సంఖ్యలోనే ఆ పార్టీ గెలిచింది. మన దగ్గర నుంచి వెళ్లిన వాడు ఎవడూ గెలవలేదు ఒకడు తప్ప. అందరూ ఓడిపోయినారు.’’జరగబోయేది కురుక్షేత్రంఇప్పటి ఈ ఎన్నికల కంటే కూడా రేపు పొద్దున జరగబోయే కురుక్షేత్రం ముఖ్యం. ఈ ఎన్నికల్లో చిన్న ప్రాణులను ఓడించడం కోసం చంద్రబాబు చేసిన అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి అన్నది ఆ ఎన్నికల్లో రావాలి. అలాంటి కసి కార్యకర్తలకు రావాలి. ఆ కార్యకర్తకు పార్టీ అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతుంది. ఇది కార్యకర్తల కోసం జరుగుతున్న ఎన్నికలు. మనం కార్యకర్తలకు తోడుగా ఉండాల్సిన ఎన్నికలు. ప్రజలకు తోడుగా కార్యకర్త నిలబడతాడు. కార్యకర్తకు తోడుగా పార్టీ నిలబడుతుంది అన్న సంకేతం ఈ ఎన్నికల ద్వారా మనం ఇవ్వాలి.స్థానిక ఎన్నికలపైనా చంద్రబాబు డ్రామా.. కుట్రఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే చంద్రబాబు ఆ ఎన్నికలు పెడతాడో లేదో తెలియదు. కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిజంగా స్థానిక ఎన్నికలు పెట్టే వాడే అయితే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చే వాడు కాదు. దీనికి సంబంధించి నాడు మన హయాంలో ఇచ్చిన జీఓను కోర్టు కొట్టేసింది. అయినా అంతకన్నా ఎక్కువ పదవులు మనం బీసీలకు ఇచ్చాం. ఆ జడ్జిమెంట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఆ బీసీ రిజర్వేషన్లు తెలంగాణాలోనూ కొట్టేశారు. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అవకాశం ఉందని తెలిసినా, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు డ్రామా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగకూడదు. వాయిదా పడాలన్నదే ఆయన కుట్ర. మరొకటి ‘సర్’. (ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ) వీళ్ళే అంటున్నారు ఇక్కడ 44 లక్షల ఓట్లు లేవు అని. అయితే పాత జాబితాలతో ఎన్నికలు పెడతాడా? దానికి ఏ కోర్టయినా ఒప్పుకుంటుందా? మరి చంద్రబాబు ఎన్నికలు పెట్టాలని ఇవన్నీ చేస్తున్నాడా? పెట్టకూడదని చేస్తున్నాడా? ఇది మేకపోతు గాంభీర్యం కాకపోతే ఇదంతా ఏమిటి? సరే, ఏదైనా కానీ, చంద్రబాబుగారు స్థానిక ఎన్నికలు పెడతాడని అనుకుని, ముందుకు పోదాం.ఎన్నికలు సాఫీగా జరిగే వీలు లేదుచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు సాఫీగా జరుగుతాయని నేను అనుకోవడం లేదు. చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. చంద్రబాబుని ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్. ఇది కాక రెడ్‌బుక్ రాజ్యాంగం. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలు సాఫీగా జరుగుతాయని అనుకోవడం లేదు.సాఫీగా జరిగితే మనదే విజయంఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం. చంద్రబాబు ఒకవేళ ఓడించే కార్యక్రమం, అధికార దుర్వినియోగం చేసే కార్యక్రమం, పోలీసులు జులుంను ఉపయోగించే కార్యక్రమం చేస్తే ఎవరిని ఓడించడం కోసం? ఆ చిన్న ప్రాణాన్ని ఓడించడం కోసం. ఆ చిన్న ఎంపీటీసీ స్థానం, ఆ చిన్న సర్పంచ్ స్థానం, ఆ చిన్న వార్డ్ మెంబర్ స్థానంలో ఉన్న వ్యక్తులను ఓడించడం కోసం. అందుకే అటువంటి చిన్న ప్రాణాలకు తోడుగా ఉండాలి. -
బీసీల ఉద్ధారకుడు వైఎస్ జగనే
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘ఉత్తరాంధ్రలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో 60 నుంచి 70 శాతం మంది బీసీలే. వారి సంఖ్యను కలిపేసి రాష్ట్రంలో బీసీల నిష్పత్తిని చూపిస్తున్నారు. అసలు అన్ని కులాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కప్పిపుచ్చి, ఒక్క బీసీలకే 34 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే కల్పించినట్లు మసిపూసి మారేడుకాయ చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 20 ఏళ్ల పాలనలో బీసీలకు ఎన్నికలకు ముందు తాయిలాలు తప్ప వారి అభివృద్ధికి చేసింది శూన్యం. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా బీసీల సర్వతోముఖాభివృద్ధి ఎలా చేయాలో చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. బీసీల ఉద్ధారకుడు ఆయన మాత్రమే. బీసీల కోసం చంద్రబాబు చేసింది శూన్యం. టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకొనే నైతికహక్కు చంద్రబాబుకు లేనేలేదు’ అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన బుధవారం న్యూఢిల్లీలో ‘సాక్షి’తో మాట్లాడారు. బీసీల కృతజ్ఞత సభ అంటూ నర్సీపట్నంలో పుష్పాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేయించుకున్నంత మాత్రాన బీసీల ఉద్ధారకులు అయిపోరని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో, రాజకీయ సభల్లో ఇచ్చే హామీల కన్నా, అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించారనేదే ఒక పార్టీ తమది బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి ప్రామాణికం అవుతుందని చెప్పారు. అలా చెప్పుకోదగిన ప్రయోజనమేదైనా చంద్రబాబు చేశారేమో చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో బీసీలకు ఏయే ప్రయోజనాలు కల్పించారో చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయన్నారు.చట్టసభల్లో బీసీలకు జగన్ పెద్దపీటవిభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు చట్టసభల్లో పెద్దపీట వేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పారు. ఒకేదఫా నలుగురు బీసీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారని గుర్తుచేశారు. అది చాలా గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఆ స్థాయిలో బీసీలను రాజ్యసభకు పంపారా? అని ప్రశ్నించారు. ‘శాసనమండలిలో 2023లో 18 స్థానాలు ఖాళీ అయితే, 11 మంది బీసీ నాయకులకు ఎమ్మెల్సీలుగా జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు.మొత్తం 44 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల్లో 19 మంది బీసీ నాయకులే. గతంలో ఎప్పుడూ బీసీలకు అంత పెద్దసంఖ్యలో ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్రెడ్డి 25 లోక్‌సభ స్థానాలకుగాను 11 చోట్ల బీసీలకే టికెట్ ఇచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 48 చోట్ల బీసీ అభ్యర్థులనే నిలబెట్టారు. మొత్తం బీసీలకు 59 సీట్లు అంటే దాదాపు చట్టసభల్లో 30 శాతం రిజర్వేషన్లు ఆయన చెప్పకుండానే ఇచ్చారు’ అని వివరించారు. ఇలా బీసీలకు చట్టసభల్లో అగ్రస్థానం కల్పించి, తమ అభిప్రాయాలను, నిర్ణయాలను గళమెత్తి చెప్పడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కేబినెట్లో బీసీ మంత్రులెందరు? తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే పూర్వం ఎన్.టి.రామారావు బీసీ పట్ల కాస్త ఉదారంగా ఉండేవారని చెప్పారు. కానీ చంద్రబాబుకు మాత్రం ఎన్నికల్లో భారీ హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనబెట్టేసే చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులిచ్చారో చూస్తే అసలు విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 11 మంది బీసీలకు మంత్రి పదవులిచ్చారని గుర్తుచేశారు. బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఏది? రాష్ట్రంలోని బీసీలకు ఏంకావాలో చూడాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏనాడూ లేదని విమర్శించారు. ఉదాహరణకు బీసీల్లో ఒకరైన లక్షలాదిమంది మత్స్యకారులు సుదీర్ఘమైన సముద్రతీరం ఉన్న ఈ రాష్ట్రాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారంటే చంద్రబాబు తన 20 ఏళ్ల పాలనలో వారి అభివృద్ధికి ఏం చేసినట్లని ప్రశ్నించారు. వారికోసం ఒక్క ఫిషింగ్ హార్బర్‌ను కూడా నిర్మించలేదన్నారు. జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తలపెట్టారని గుర్తుచేశారు. వాటిలో కొన్ని నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కొన్నింటిని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆపేశారని విమర్శించారు. బీసీల విద్యకు జగన్ ప్రాధాన్యం తరతరాలుగా వ్యవసాయం, చేతివృత్తుల్లోనే ఉన్న బీసీలు పారిశ్రామికీకరణ తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో వారిని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి ఉన్న ఏకైక మార్గం విద్య మాత్రమేనన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ, పేద కుటుంబాల్లోని పిల్లలకు విద్యను దూరం చేసే పాలసీలనే అమలుచేస్తున్నారని విమర్శించారు. అందుకు భిన్నంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మాత్రమే పేద కుటుంబాల్లోని విద్యార్థులకు విద్యను చేరువచేసే ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి వంటి సంక్షేమ పథకాలను చేపట్టారని గుర్తుచేశారు. వారి పేదరికం ఏరోజూ వారి చదువుకు అడ్డుకాకుండా చేయగలిగిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కుతుందన్నారు. చంద్రబాబు ఆ పథకాలను నీరుగారుస్తూ తిరోగమన విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. బీసీల అభివృద్ధి జగన్ పాలనతోనే తెలిసిందిఅంతవరకు బీసీలకు చిన్నచిన్న తాయిలాలతోనే చంద్రబాబు పాలన సాగిందని, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి ఇంత చేయవచ్చా అని తెలిసిందని చెప్పారు. రాష్ట్రంలో గూడులేని నిరుపేదల్లో ఎక్కువమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలేనన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 12 వేల ఎకరాలను సేకరించి, దాదాపు 30 లక్షలమంది మహిళలకు ఇచ్చిన ఇళ్లపట్టాల్లో ఎక్కువ లబ్దిపొందింది బీసీ సామాజికవర్గాలేనని చెప్పారు. మరి చంద్రబాబు గత రెండేళ్ల పాలనలో పేదవారి కోసం ఒక్క సెంటు భూమి అయినా సేకరించారా? అని ప్రశ్నించారు. ధనవంతులైన పారిశ్రామికవేత్తలకు మాత్రం రూపాయికి, పావలాకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. తాము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదని, కానీ భూపంపిణీ విధానమే సరైంది కాదని చెబుతున్నామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలను కూడా వ్యాపార, వాణిజ్య, ఐటీ, పారిశ్రామికరంగాల్లో ప్రోత్సహించే చర్యలనే ఏ ప్రభుత్వమైనా చేపట్టాలన్నారు. ఆ పనిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్రెడ్డి చేసి చూపించారని చెప్పారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో బీసీలే కాదు అన్ని సామాజికవర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనే మాట వినిపిస్తోందని తెలిపారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారుమళ్లీ ఇప్పుడు స్థానికసంస్థల ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ఇంకా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాయమాటలను మళ్లీ నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. చంద్రబాబు గారడీ మాటలపై బీసీలను చైతన్యం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తొలుత ఐదు రీజియన్ల వారీగా, తర్వాత దఫాలో 25 జిల్లా కేంద్రాల్లో, 175 నియోజవర్గాల వారీగా ఈ సభలు నిర్వహిస్తామని వివరించారు. బీసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందీ, చంద్రబాబు పాలనలో ఏం మోసం జరిగిందీ వివరిస్తామన్నారు. ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలో, బీసీల నుంచి ఎలాంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాలో నిర్ణయిస్తామని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. -
కళ్లార్పకుండా ‘కహానీలు’
సాక్షి, అమరావతి : తాను చేయని పనిని చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు ఎక్కడలేని ‘తెలివితేటలు’ ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో భూముల రీసర్వే, 22–ఏ భూములకు విముక్తి, పట్టాదారు పాసుపుస్తకాల ఘనత తనదేనని నోటికొచ్చినట్లు అలవోకగా అబద్ధాలు వల్లెవేస్తున్నారు. తాను వ్యతిరేకించిన కార్యక్రమాన్ని తానే ప్రారంభించినట్లు, తాను 22–ఏలో పెట్టిన భూములకు తానే విముక్తి కల్పించినట్లు నిస్సిగ్గుగా అవాస్తవాలు మాట్లాడుతూ కళ్లార్పకుండా కహానీలు చెబుతుండడంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ బాబు తెచ్చారా?.. రాష్ట్రంలో భూముల రీసర్వే మొదలైంది 2020 డిసెంబర్ 21న. అప్పటి ఉమ్మడి కృష్ణాజిల్లా తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సర్వే కోసం దేశ చరిత్రలో తొలిసారిగా 14 వేల మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. 3,240 జీఎన్ఎస్ఎస్ రోవర్లు, వందలాది డ్రోన్లు, నాలుగు హెలికాప్టర్లు, రెండు విమానాలు, 70 కార్స్ స్టేషన్ల నెట్‌వర్క్‌తో అనేక వ్యయ ప్రయాసలతో ఏర్పాటుచేశారు. మొత్తం 2.47 కోట్ల సర్వే నంబర్లలోని భూమిని కొలిచి కొత్తగా 86,80,246 ఎల్పీఎం (ల్యాండ్ పార్శిల్ మ్యాప్) నంబర్లు జారీ చేశారు. 13,500 గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. సర్వే నెంబర్ల స్థానంలో ఎల్పీఎం నెంబర్లు వచ్చింది అప్పుడే. 30 లక్షల మంది రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన భూహక్కు పత్రాలు ఇచ్చారు. పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్, ప్రతి భూమికీ జియో హద్దులు, ప్రతి పార్సిల్కూ ఐడీ నంబరు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్.. ఇలా ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్న ప్రతిదీ అప్పటిదే. 2022 సెపె్టంబర్లో జారీ అయిన పాస్ పుస్తకాలపై ఆ క్యూఆర్ కోడ్ ఇప్పటికీ ఉంది. రైతుల చేతుల్లో ఆ సాక్ష్యం ఉండగా చంద్రబాబు కళ్లార్పకుండా చెబుతున్న అబద్ధాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.రీ సర్వే ఆపేస్తానని.. క్రెడిట్ దోపిడీ..రీసర్వే వల్ల రైతులకు నష్టమని, మీ భూములు ఎక్కడున్నాయో తెలుసుకుని ఆక్రమించడానికే ఈ సర్వే అని.. ఇక మీ భూములు మీవి కావని, తాము అధికారంలోకి రాగానే రీసర్వేను ఆపేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు ఊరూవాడా హోరెత్తించారు. అయితే, అధికారంలోకి వచ్చాక ఏడాది పాటు రీసర్వేను నిజంగానే నిలిపివేశారు. ఆ తర్వాత అదే చంద్రబాబు రాష్ట్రంలో రీసర్వే అద్భుతంగా జరిగిందని కేంద్రానికి లేఖ రాసి రూ.500 కోట్ల రాయితీని సిగ్గులేకుండా తెచ్చుకున్నారు. ఆ డబ్బు వచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన పనికి. ఇలా ఢిల్లీలో గొప్పలకు పోవడం.. రాష్ట్రంలో బురదజల్లడం చంద్రబాబుకే చెల్లింది. నిజానికి.. చంద్రబాబు వచ్చాక ఒక్క గ్రామంలో కూడా రీసర్వే పూర్తికాలేదు.రాజముద్ర వేసి తానే చేశానంటే సరా?.. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో ఇచ్చానని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. పుస్తకంలో రైతుకు ఉపయోగపడేది బొమ్మ కాదు, క్యూఆర్ కోడ్, జియో హద్దులు, ఎల్పీఎం నంబరు. ఆ మూడూ ఎక్కడివో బాబుకు బాగా తెలుసు. లోగో మార్చడం సంస్కరణ కాదు. అలాగే, స్టిక్కర్ మార్చి చరిత్ర సృష్టించినట్లు డప్పు కొట్టుకోవడం ఆయన అవివేకం. జగన్ హయాంలో పాతిన సర్వే రాళ్లపై నవరత్నాల లోగో ఉందని, సీఎం ఫొటో ఉందని ఆయన ఇప్పటికీ విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. నిజానికి అది వాటర్‌మార్క్ లోగో మాత్రమే. సర్వే ఎప్పుడు జరిగిందో, ఏ ప్రామాణికతతో జరిగిందో శాశ్వతంగా గుర్తుండేందుకు వేసిన ముద్ర. అది తప్పయితే ఇప్పుడు పింఛన్ల పంపిణీ పాంప్లెట్ల నుంచి ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలోనూ చంద్రబాబు ఫొటో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు?.22–ఏ నుంచి 16 లక్షలు ఎకరాలు తీసేశారా? మరోవైపు.. 16 లక్షల ఎకరాలను 22–ఏ జాబితా నుంచి తొలగించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు అసలు వాటిని అందులో పెట్టింది తానేననే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే.. 2024లో అధికారంలోకి రాగానే రాజకీయ కక్షతో 20 లక్షల ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో పెట్టింది సాక్షాత్తు చంద్రబాబే. అందులో 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనాధీనం భూములు ఉన్నాయి. అనేక విచారణల తర్వాత ఆ భూములన్నీ సక్రమమేనని ప్రభుత్వం నిగ్గుతేల్చింది. ఈ నేపథ్యంలో.. తప్పు ఒప్పుకోవడం మానేసి, ఇప్పుడు వాటిని తొలగిస్తూ తానే విముక్తి కల్పించానని సిగ్గులేకుండా డబ్బా కొట్టుకుంటున్నారు. ఇక జగన్ హయాంలో ఏకకాలంలో వేల గ్రామాల్లో సర్వే బృందాలు దూసుకుపోతే, ఇప్పుడు నెలకు వంద గ్రామాల్లో కూడా జరగడం లేదు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్వే బృందాలను కుదించి, రైతును మళ్లీ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుతున్నారు. పైగా.. ఇప్పుడు ఆటో మ్యుటేషన్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నా అది రీ సర్వేలో భాగంగానే గతంలోనే మొదలైందన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. మార్చిలోగా అన్ని భూ సమస్యలకు పరిష్కారమా? ఇదిలా ఉంటే.. మార్చిలోపు రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేస్తానని చంద్రబాబు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. గడచిన రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క భూ సమస్యను పరిష్కరించలేక ప్రతీ సమావేశంలోనూ అధికారులపై నిందలు వేస్తున్నారు. పీజీఆర్ఎస్లో ఏడు లక్షలకు పైగా భూ సమస్యలపై అర్జీలు వస్తే 6.20 లక్షలు పరిష్కరించేసినట్లు ప్రకటించుకున్నారు. అందులో ఒక్క శాతం సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోయినా అయినట్లు మెసేజ్‌లు పంపారు. అయితే, మార్చికల్లా చంద్రబాబు చూపే పరిష్కారం కూడా ఇలాగే ఉంటుందని జనం ఆయన మాటలు విని నవ్వుకుంటున్నారు. ఇలా ప్రతీనెలా ‘మీ భూమి–మీ హక్కు’ పేరుతో ఓ సభ.. అదే అబద్ధాల ప్రసంగం చేయడం ఆయనకు అలవాటుగా మారింది. కానీ, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరిగే పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. పైగా.. ఒక్కటీ పరిష్కారం కావడంలేదు. అయినా చంద్రబాబు మాటలు కోటలు దాటుతూనే ఉన్నాయి. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. -
బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్
-
సెప్టెంబర్‌లోనే నా పాదయాత్ర రాసిపెట్టుకోండి హిస్టరీ రిపీట్ చేద్దాం
-
ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్ జగన్ (ఫొటోలు)
-
2019 హిస్టరీ రిపీట్ చేద్దాం.. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం
-
YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్
-
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదంటే అక్టోబర్‌లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.బుధవారం పర్చూర్ నియోజకవర్గ కేడర్‌తో జరిగిన భేటీలో.. పాదయాత్ర 2.0పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2027 సెప్టెంబర్‌లో లేదంటే అక్టోబర్‌లో యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారాయన. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగనుందని చెప్పినట్లు తెలుస్తోంది. 2029లో ఏపీలో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ జగన్‌కు పాదయాత్రలు కొత్త కాదు. 2017లో ఆయన చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ వైఎస్సార్సీపీ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి యాత్రను ప్రారంభించారు. సుమారు 341 రోజులపాటు సాగిన ఆ యాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచారు. ఆనాడు మొత్తం 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,516 గ్రామాల మీదుగా ప్రయాణిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. ప్రజా సమస్యలపై నేరుగా..పాదయాత్రలో భాగంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు, వివిధ సామాజిక వర్గాలతో జగన్ నేరుగా మమేకమయ్యారు. టీడీపీ ప్రభుత్వ పాలనలోని సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుంటూనే.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న నవరత్నాలు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు. యాత్ర ముగిసే సమయానికి దాదాపు రెండు కోట్ల మంది ప్రజలతో మమేకమైనట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. 2019లో అధికారంలోకి..ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన కొద్ది నెలలకే 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆయన రాజకీయ జీవితంలోనే కీలక ఘట్టంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి పాదయాత్ర ప్రకటన చేయడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. -
మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులు, అరెస్టులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ పార్టీ కేడర్‌తో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వెనుక ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. ఆ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, దానిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో జరిగే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనిపించాలి’’ అని అన్నారు. ఓట్లపై కూడా అనుమానాలు..ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపైనా జగన్ ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీదే విజయం. సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదాం. స్థానిక ఎన్నికల్లో మీరు గట్టిగా నిలబడాలి” అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రోజుకో డ్రామా.. డైవర్షన్ పాలిటిక్స్చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం జరుగుతోందని ఆరోపించారు. ‘‘రోజుకో డ్రామా.. రోజుకో నటన.. డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.స్థానిక ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావని, అవి ప్రధానంగా కార్యకర్తల ఎన్నికలని జగన్ అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యకర్తలే అండగా ఉంటారని, అలాంటి కార్యకర్తలకు పార్టీ కూడా అండగా నిలవాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.నంద్యాల ఉప ఎన్నికను గుర్తుచేస్తూ..పర్చూర్ కేడర్ వద్ద తన గత రాజకీయ అనుభవాలను కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. 2017లో తాను పాదయాత్ర ప్రారంభించడానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగిందని గుర్తుచేశారు. తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైఎస్సార్సీపీ 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని అన్నారు. 2014–19 మధ్య తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టానని, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. నాడు తమ పార్టీ నుంచి తీసుకెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల సంఖ్యకే చంద్రబాబు పార్టీ పరిమితమైందని వ్యాఖ్యానించారు.మంచి చేసి ఓటు అడగాలి..పాలకులు ప్రజలకు మంచి చేసి, ఆ పనులను చూపించి ఓట్లు అడగాలని జగన్ అన్నారు. అలా చేసినప్పుడే దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభిస్తాయని పేర్కొన్నారు. ఎల్లవేళలా అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు హర్షించబోరని అన్నారు. ‘‘జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. ఆ సంగ్రామంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలి.. పోరాడాలి’’ అని వైఎస్సార్సీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: అర్హతే లేనివారికి టీచర్ పోస్టులా? -
పర్చూరుపై జగన్ ఫోకస్.. నేతలతో కీలక భేటీ
-
కాకినాడ నిరుద్యోగులపై కేసులు.. వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
నేడు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9న (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారితో అక్కడ పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. -
‘బాబూ.. జాబులేవి?’ అని అడగడమే నేరమా?
సాక్షి, అమరావతి: ఇచ్చిన హామీలను నెరవేర్చా లని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. ఆయన ట్వీట్లో ఇంకా ఏమన్నారంటే... నిరుద్యోగ యువతపై కేసులా? మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్యామ్, టి.రాజా, ఎం. గంగ సూరిబాబు, రాజేష్‌తో పాటు 20 మంది పోలీసు నిరుద్యోగులు చేసిన నేరమేమిటి? ‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడమేనా నేరం? ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అడగడం కూడా తప్పా? ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా ఆంధ్రప్రదేశ్‌లో నేరంగా మారిందా?. అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చంద్రబాబూ?ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఈ లెక్కన ఏడాదికి రూ.7,200 కోట్లు, మూడేళ్లకు రూ.21,600 కోట్లు చెల్లించాలి. కానీ ఇటు ఉద్యోగాలు ఇవ్వకుండా, అటు నిరుద్యోగ భృతి చెల్లించకుండా యువతను మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతోంది.మెగా డీఎస్సీలో రోజుకొక మోసం బయటపడుతుంటే సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేశ్ ఇద్దరూ అణచివేత, నిర్బంధం, బెదిరింపులకు దిగుతున్నారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతూ.. పారదర్శకంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్న అర్హులైన నిరుద్యోగులను నేరస్తులుగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం యువత పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానానికి, అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?. యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ చంద్రబాబు గౌరవించలేదు వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నియామకాల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిబంధనలకు విరుద్ధమైన నియామకాలు పరిపాటిగా మారాయి. అవినీతి, రాజకీయ పైరవీలతో ఉద్యోగాలను పంచుకోవడంపైనే వెన్నుపోటు పార్టీ దృష్టి తప్ప.. రాష్ట్ర యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ గౌరవించలేదు. ప్రతిభకు పట్టం కట్టి, అర్హులకు నిష్పక్షపాతంగా ఉద్యోగాలు కల్పిం చాలన్న చిత్తశుద్ధి ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదు. నిరుద్యోగ యువతపై నమోదు చేసిన కేసులన్నింటినీ తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. -
హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్ జగన్
తాడేపల్లి : ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ’ఎక్స్’ వేదికగా కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు వైఎస్ జగన్. ‘కాకినాడలో మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులపై కక్షపూరితంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. శ్యామ్, టి.రాజా, ఎం.గంగా సూరిబాబు, రాజేష్‌తో పాటు 20 మంది పోలీస్ ఉద్యోగ అభ్యర్థులపై కేసులు నమోదు చేయడం దారుణం. ‘‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడం, ఉద్యోగాల భర్తీ కోరడమే వారు చేసిన నేరమా?, ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా నేరంగా మారిందా?, అధికారంలోకి రావడానికి యువతకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు. . మూడేళ్లకు రూ.21,600 కోట్ల నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా..యువతను మోసం చేసిన ప్రభుత్వం..ఇప్పుడు ఉద్యోగాలు అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తోంది. మెగా డీఎస్సీ స్కాంలో రోజుకో కొత్త ఆధారం బయటపడుతున్నా..సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేష్ అణచివేత, సెన్సార్షిప్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ ఇస్తూ నిజమైన నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ అడిగితే మాత్రం కేసులా?, ఇది కూటమి ప్రభుత్వ యువత వ్యతిరేక, ప్రజాస్వామ్య విరుద్ధ వైఖరికి నిదర్శనం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా రిక్రూట్మెంట్ స్కాంలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల్లో అక్రమాలు పరిపాటిగా మారుతున్నాయి. యువత ఆశలు, ఆకాంక్షలను గౌరవించడం టీడీపీకి ఎప్పుడూ చేతకాలేదు. పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించడం కంటే.. అవినీతి, రాజకీయ మాయాజాలానికే ప్రాధాన్యం ఇస్తోంది.నిరుద్యోగ యువతపై నమోదు చేసిన అన్ని కేసులను తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు. I strongly condemn the cruel, vindictive and authoritarian action of the TDP-led coalition government under Chief Minister @ncbn in filing police cases against unemployed youth who peacefully protested in Kakinada demanding a Mega Police Recruitment Notification.Cases were…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 8, 2026 డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు -
రేపు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (09.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నారు. -
ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ‘డైవర్షన్’ రాజకీయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా సెంటిమెంట్ రాజకీయాలను పండించడానికి ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల కార్యక్రమాలను అమలు చేశారా అన్న అభిప్రాయం కలుగుతుంది. తొలుత వెలుగొండ ప్రాజెక్టు నుంచి , ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల నిర్వహించారు. ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కాని ఆ సందర్భంగా ఆయన అనుసరించిన పద్దతులు, చేసిన ప్రసంగాలు చూస్తే , డైవర్షన్ రాజకీయాలలో భాగమేనా అన్న సందేహం కలుగుతుంది. స్థానిక ఎన్నికలు కూడా దృష్టిలో ఉండవచ్చు. కాగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు క్రెడిట్ చోరీ ఎలా చేశారో అంకెలతో సహా జగన్ వివరించారు. ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వకు గ్రావిటీ ద్వారా కాకుండా, అప్పటికే అమలులో ఉన్న పుష్కర లిఫ్ట్ ద్వారా నీటిని తోడి ఈ కాల్వలో పోసి అదేదో ప్రాజెక్టు పూర్తి అయినట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారని జగన్ విమర్శించారు. దీనిని గమనిస్తే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడానికి తంటాలు పడుతున్నట్లు అవుతుంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అరకొరగా నెరవేర్చి ,సూపర్ సిక్స్ అంటూ సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దానిని ప్రజలు విశ్వసించడం లేదు. అంతా ఆశ్చర్యంగా ఇదేమిటి ఇలా చెబుతున్నారేమిటా అని చర్చించుకుంటున్నారు. మరో వైపు రెడ్ బుక్ పేరుతో పోలీసుల ద్వారా అరాచకాలు సాగుతున్న వైనం ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తోంది. ఉద్యోగులు తమను ప్రభుత్వం మోసం చేసిందన్న ఆగ్రహంతో ఉన్నారు.విశాఖలో డేటా సెంటర్ల పేరుతో జరిగే కాలుష్య విధ్వంసంపై మేదావులు గళమెత్తుతున్నారు. అమరావతిలో మాత్రం వేల కోట్ల అప్పులు తెచ్చి అదిక అంచనాలతో నిర్మాణాలు జరుగుతున్న తీరుపై ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. జగన్ మావిగన్ (విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం) కారిడార్ అభివృద్దిని ప్రతిపాదించడంతో ఇరుకున పడ్డ చంద్రబాబు దానిని ఆవిగన్గా (అమరావతి, విజయవాడ, గుంటూరు) మార్చుకున్నారు. అయినా ఖర్చు మాత్రం కేవలం 29 గ్రామాల పరిదిలోనే చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. డిఎస్సి అక్రమాలతో సహా ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు చికాకుగా మారాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోతోందన్న భావన ఏర్పడింది. ఈ నేపధ్యంలో వాటిని కొంతమేర పక్కదారి పట్టించి ప్రజలలో ప్రాజెక్టులకు సంబందించి ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలిగించడమే లక్ష్యంగా ఈ నీటి విడుదల కార్యక్రమాలు పెట్టుకున్నారని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం వాస్తవం ఉన్నట్లు అనిపిస్తుంది. లేకుంటే వెలిగొండలో నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం చేయకుండా, హడావుడిగా నీటిని విడుదల చేశారు. ఆ ప్రాజెక్టు మొత్తం తన ఘనతేనని ఆయన చెప్పుకున్నారు. దానిపై జగన్ వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయారు.ఇక ఆ వెంటనే పోలవరం ఎడమ కాల్వకు నీరు అంటూ మరో ప్రోగ్రాం నిర్వహించారు. నిజంగానే పోలవరం ప్రాజెక్టు అందరూ ఆశించినట్లు పూర్తి చేసి,నీటి విడుదల జరిగి ఉంటే అంతా సంతోషిస్తారు. కాని గతంలో చంద్రబాబు హయాంలో పెట్టిన పుష్కర స్కీమ్ మోటార్లను వాడి కాల్వలో నీటిని పారించారట. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుకార్చినట్లు అవుతుందన్న భయం ప్రజలలో ఏర్పడుతోంది. మార్కాపురం వద్దకాని, అనకాపల్లి జిల్లా పాయకరావు పేట వద్ద కాని, ఆయన పంచెకట్టుతో రావడం, సాశ్టాంగ నమస్కారం చేయడం, సభికులతో గోదావరి నీళ్లు వచ్చాయి అంటూ గట్టిగా చెప్పించడం, రకరకాల సెంటిమెంట్లను చొప్పించడం వంటివి చేశారు. నిజంగా ఎడమ కాల్వను ఆయనే నిర్మాణం చేపట్టి ఉంటే చెప్పుకోవచ్చు. కాని ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాల్వలు తవ్వించడంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లనే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక దశకు చేరిందన్నది వాస్తవం. కాకపోతే చంద్రబాబుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తడం ఇష్టం ఉండదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే ఎడమ కాల్వకు మోటార్ల ద్వారా నీరుఎత్తిపోయవలసిన అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న వస్తుంది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అంటే అంతగా ఆసక్తి లేని చంద్రబాబు, గత టరమ్ లో పట్టిసీమ లిఫ్ట్ ను పెట్టి హడావుడి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వించిన కుడి కాల్వ ద్వారా నీటిని విజయవాడ వద్ద కృష్ణానదికి తీసుకువెళ్లారు. అప్పట్లోనే పట్టిసీమ కాకుండా పోలవరానికి ఆ డబ్బు ఖర్చు చేసి సత్వరమే ప్రాజెక్టును సిద్దం చేయాలని అనేక మంది సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదు.ఇప్పుడు తాను ఏర్పాటు చేసిన లిఫ్ట్ ల ద్వారానే నీటిని తరలిస్తున్నానని చెప్పుకోవచ్చేమో కాని, దానివల్ల జరిగే నష్టం గురించి తెలుసుకోవాలి. ఈ సీజన్ లో పట్టిసీమ ద్వారా నీటిని తరలించి కృష్ణా డెల్టాకు సాగుకు అందిస్తున్నామని గొప్పగా ప్రకటించారు. పూజలు కూడా చేశారు.కాని ఆ తర్వాత గోదావరిలో నీరు తగ్గడంతో పట్టిసీమ నుంచి నీరు రావడం తగ్గిపోయింది. దాంతో కృష్ణా డెల్టాలో సైతం పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రస్తుతం పుష్కర మోటార్లను వాడి నీటిని విడుదల చేశారు. కాని ఈ నీరు పూర్తిగా రైతులకు అందడానికి ఇంకా సమయం పడుతుంది. మోటార్లపైనే ఎప్పటికీ ఆధారపడడం అంత మంచిది కాదని అనుభవం చెబుతోంది. అలాగే ఉత్తరాంద్ర సుజల స్రవంతికి నీరు ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. కాకపోతే జనాన్ని ప్రస్తుతానికి మభ్య పెట్టడానికి ఉపయోగపడవచ్చు. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ పోలవరంపై డ్రామాలు ఆపాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. పురుషోత్తపట్నం పంపులతో నీటిని ఎత్తిపోస్తే ప్రాజెక్టు నుంచి ఇచ్చినట్లు ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించారు. ఈ పంపులు కొత్తవి కావని, ఇప్పటికే ఉన్నవే కదా అని అంటూ, అయినా ఈ డ్రామా ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నీళ్లు పురుషోత్తమపట్నానివి అయితే, కాల్వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించినదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో చంద్రబాబు కొత్తగా చేసిందేమిటని అన్నారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లా? లేక 41.15 మీటర్లకే పరిమితమా? అని జగన్ సూఠిగా అడిగారు.ఈ అంశంపై చంద్రబాబు స్పందించగలిగితే బాగుంటుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పై ప్రేమ అంతా ప్రసంగాలకే పరిమితమా అని జగన్ ఎద్దేవ చేశారు. ఒక వేళ 41.15 మీటర్ల వద్దే పోలవరం ప్రాజెక్టు నిలిచిపోతే ఈ కాల్వల ద్వారా ఆశించిన ప్రయోజనం నెరవేరడం కష్టం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.మరో వైపు పోలవరం నిర్వాసితుల కాలనీలలో అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కాగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎడమ కాల్వ నీటి విడుదలపై కామెంట్ చేస్తూ 26 నెలల్లో ఎడమ కాల్వ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. పవన్ కళ్యాణ్ కు నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన ఉంటే ఇలా వ్యాఖ్యానిస్తారా అని నిపుణులు అంటున్నారు. రెండేళ్లలో టైమ్ లో భూ సేకరణ, ఆ తర్వాత కాల్వ తవ్వకం, తదితర నిర్మాణాలు సాద్యమవుతాయా అని వారు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే అమరావతి వ్యయం జనానికి కన్పించకుండా, ఉత్తరాంధ్ర, రాయలసీమలను నిర్లక్ష్యం చేయడం లేదని ప్రచారం చేసుకోవడానికి ఈ నీటి విడుదల కార్యక్రమాలు నిర్వహించారా అన్నది చర్చగా ఉంది. అదే లక్ష్యం అయితే ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే అవుతుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా? -
ఉమ్మడి జిల్లాకు పనిచేయడం అదృష్టం
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో చరిత్ర కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చివరి చైర్ పర్సన్‌గా పనిచేయడం తన అదృష్టమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో రూ. 60లక్షల వ్యయంతో ఆధునికీకరించిన జెడ్పీ అతిథి గృహం, సమావేశ మందిరాన్ని ఉప్పాల హారిక సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కృష్ణాజిల్లాను మూడు జిల్లాలుగా విభజించారన్నారు. 16 మండలాలతో నూతనంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైందన్నారు. కొత్తగా ఏర్పడబోయే పాలక వర్గానికి సమావేశ మందిరంతో పాటు అతిథి గృహాన్ని ఆధునికీకరించి అన్ని వసతులతో భవనాలను ప్రారంభించామన్నారు. జిల్లాలు సరిహద్దులు మాత్రమే మారాయని, అంతా కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అదికారి కృష్ణంరాజు, రమణ, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీదేవి, జెడ్పీటీసీలు వేముల సురేష్ అన్నవరం ఎలిజిబెత్ రాణి, కొమర వెల్లి గంగాభవాని, జెడ్పీ ఉపముఖ్యకార్య నిర్వహణాధికారి ఆనంద కుమార్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: మీరు నిజమైన రైతులేనా! -
చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు
-
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్‌రెడ్డి
వైఎస్సార్ జిల్లా: డీఎస్సీని సక్రమంగా నిర్వహిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. టెట్ రాయకుండానే టీచర్ ఉద్యోగం రావడం ఏమిటని ప్రశ్నించారు. సాఫ్ట్ బాల్ సంఘం వ్యక్తి భార్యకు ఉద్యోగం రావడం ఏమిటి? అని అన్నారు.‘‘నిజాలు బయటకు వస్తే మీరు దోషులుగా నిలబతారనే భయం మీకు ఉంది. అసమర్థ విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగాయి. ఏదో ఒక రోజు మీరంతా చట్టం ముందు నిలబడాల్సిందే. చర్చకు రమ్మని మాపై సవాలు విసరడం కాదు. ఫిర్యాదు చేసిన 30,000 మందితో చర్చ పెట్టు. నీకు నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే వాటికి సమాధానం చెప్పు. వాస్తవాలు చెప్తూ తప్పుని ఎత్తిచూపితే సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేస్తున్నారు. వాళ్లు చెప్పుకునే గొప్పలు మాత్రమే ప్రజల్లోకి వెళ్లాలని ఈ కుట్ర. వాళ్ల తప్పులు బయటకు రాకూడదని మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు’’ అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు టీడీపీటీడీపీ నాయకులు పోలీసులను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారు. విచ్చలవిడిగా సంపాదించిన డబ్బు వారి వద్ద ఉందని తెలిపారు. మేము వైఎస్సార్సీపీ, వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలు చూపి ముందుకు వెళ్తున్నాం. కార్యకర్తలంతా సమష్టిగా ఎన్నికలలో పనిచేయాలి. ప్రభుత్వం అన్ని రకాలా విఫలమైంది. సాగు, తాగు నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పతి చేస్తుంటే మన ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుంది.రాయలసీమలో ఒక్క రిజర్వాయర్‌కూ నీళ్లు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వేధించిన అందరం సమష్టిగా ఎదుర్కొందాం. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటాం’’ అని తెలిపారు. -
సాత్విక్-చిరాగ్ జోడీకి వైఎస్ జగన్ అభినందనలు
చైనా మాస్టర్స్ సూపర్-750 టైటిల్ నెగ్గిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ రెడ్డి-చిరాగ్ శెట్టికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. "చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్స్‌గా నిలిచినందుకు మీకు అభినందనలు. మీ కమ్‌బ్యాక్ నిజంగా ఒక అద్భుతం. మీ పట్టుదల, దృడ సంకల్పం, పోరాట స్ఫూర్తి యావత్ దేశానికి గర్వకారణం. రాబోయే సంవత్సరాల్లోనూ మీ జోడీ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు.Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on becoming the first Indians to win the China Masters Super 750 title with a spectacular comeback. Your grit, resilience, and fighting spirit have made the entire nation proud. Wishing you both many more… pic.twitter.com/Rm9Ia0Vzew— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2026ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో హెజి టింగ్-రెన్ గ్జియాంగ్ జోడీపై విజయం సాధించింది. చైనా గోడను బద్దలుకొట్టిన ఈ జోడికి ఇదే తొలి చైనా మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో వరుసగా రెండుసార్లు (2023, 2025లో) రన్నరప్‌గా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో దఫాలో మాత్రం చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కాగా, ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్-750 టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలోనూ ఈ జంట ఫైనల్‌కు చేరింది.Read: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా! -
నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు.. లోకేష్ బండారం బట్టబయలు
-
DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?
-
వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!
-
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై అన్ని ప్రశ్నలకూ చంద్రబాబు సమాధానం చెప్పాలి... వైఎస్ జగన్ డిమాండ్
-
బాబూ.. దేనికి భయం?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాల వ్యవహారానికి సంబంధించి రోజురోజుకూ మరిన్ని ఆధారాలు బయట పడుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. వాటన్నింటిపై వెల్లువలా తలెత్తే అన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. అంతా పారదర్శకంగా జరిగిందన్నప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీ కెందుకింక భయం? అని ప్రశ్నించారు. డీఎస్సీ స్కామ్‌పై ప్రతిపక్షంతో పాటు గళం విప్పిన కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను మెటా ద్వారా ఎందుకు బ్లాక్ చేయిస్తున్నారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయితీగా, పారదర్శకంగా జరిగాయని అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబుకు సవాల్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..వెలుగులోకి కొత్త ఆధారాలు, వాస్తవాలు ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ డీఎస్సీలో తీవ్ర అక్రమాలను బయట పెడుతూ, సీఎం చంద్రబాబు వెన్నుపోటు పార్టీ సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి, నిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు అంగీకరించాల్సిన ప్రభుత్వం.. స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తోంది. మరో వైపు ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసే మార్గాన్ని వెన్నుపోటు పార్టీ ఎంచుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై గొంతెత్తుతున్న ప్రతిపక్షంతో పాటు, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులకు సంబంధించిన సామాజిక పోస్టులు, ఖాతాలను మెటా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నియంత్రిస్తున్నారు. ‘చట్టపరమైన ఆదేశాలు’ అంటూ వాటిని తొలగించడం లేదా జియో బ్లాక్ చేయడం జరుగుతోంది. ఆ ఆంక్షల బారిన పడిన ఖాతాలు, పేజీలు, ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్‌స్టాగ్రామ్‌లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్‌తో పాటు డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నిస్తున్న ఇతర వ్యక్తిగత హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యవహారం కేవలం డీఎస్సీ స్కామ్తోనే ఆగిపోవడం లేదు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అమలు కాని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎన్నికల హామీలు, నిరంకుశత్వం, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్నారు. ఇది పరిపాలన కాదు. నియంతృత్వ సెన్సార్షిప్! వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. ప్రశ్నలు రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నాయనే కారణంతో ప్రతిపక్షం, మీడియా, సామాజిక కార్యకర్తలు, పౌరుల గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు.ప్రజలకు సమాధానం చెప్పండిచంద్రబాబు గారూ.. మీరు భయపడుతున్నది ప్రశ్నలకా? లేక వాటి సమాధానాలకా? డీఎస్సీ నియామకాల్లో ప్రతిరోజూ కొత్తగా వెలుగు చూస్తున్న ఆధారాలు ఒకవేళ అవాస్తవమైతే.. ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. ఆ పని చేయడం లేదు. ఇంకా సీబీఐ విచారణను కూడా ఎందుకు తిరస్కరిస్తున్నారు? అక్రమాలను బయట పెడుతున్న వారి గొంతు ఎందుకు అణచి వేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు చెరిగిపోవు. ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి. ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి. రాజ్యాంగబద్ధంగా పాలించండి.ఉత్తీర్ణులు కాకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలా?డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష ‘టెట్’లో ఉత్తీర్ణులు కాకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి.. మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా భర్తీ కోసం కొత్తగా జీవోలు జారీ చేశారు. ఆ నియామకాలు పూర్తి చేయగానే, ఆ జీవోలు రద్దు చేశారు. అయినప్పటికీ ఆ జీవోల ద్వారా నియమితులైన అభ్యర్థులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అంటే అక్రమ నియామకాలకు ముందు గేట్లు తెరిచి.. ఆ నియామకాలు పూర్తయ్యాక వాటిని మూసివేశారు. ఇదంతా అవినీతిని సూచించడం లేదా? అందుకే నియంతృత్వ సెన్సార్‌షిప్‌లో భాగంగా నియంత్రించిన ప్రతి సామాజిక మాధ్యమ ఖాతాను, పోస్టును, కంటెంట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే అందరూ లేవనెత్తుతున్న ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పాలి.స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండిచంద్రబాబుకు.. ఆయన ప్రభుత్వానికి నేను ఒక సవాల్ చేస్తున్నా. డీఎస్సీ–2025 నియామకాలు నిజాయతీగా, పారదర్శకంగా జరిగాయని మీరు అనుకుంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించండి. స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజానిజాలు తేల్చండి. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా బయట పడుతున్నందున, వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలి. అంతే కాకుండా వెంటనే సామాజిక మాధ్యమాల ఖాతాలు పునరుద్ధరించండి. వాటి సెన్సార్షిప్ను ఆపండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సీబీఐ విచారణకు ఆదేశించండి. అంతా పారదర్శకంగా జరిగినప్పుడు, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు మీకెందుకింకా భయం?’ అని వైఎస్ జగన్ నిలదీశారు. -
సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్
-
బాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: హలో ఇండియా.. అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. డీఎస్సీ కుంభకోణం, కొన్ని సామాజిక మాధ్యమ ఖాతాలను కనపడకుండా చేయడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. డీఎస్సీ 2025 నియామక కుంభకోణంలోని అంశాలు రోజురోజుకూ బయటపడున్నాయని చెప్పారు.‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తూ తీవ్రమైన అక్రమాలను బయటపెడుతున్నాయి. దీనిపై నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు నిజానిజాలు వెలుగులోకి రావడానికి సీబీఐ విచారణకు అంగీకరించాల్సింది పోయి, టీడీపీ కూటమి ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తును నిరాకరిస్తోంది. ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్న గొంతులను అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది.మెటా సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డీఎస్సీ నియామక కుంభకోణంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్ష పార్టీలు, మీడియా వేదికలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తుల పోస్టులు, ఖాతాలను పరిమితం చేయడం, తొలగించడం లేదా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల్లో కనిపించకుండా చేయడం జరుగుతోంది. ఇందుకు మెటా “చట్టపరమైన అవసరాలు” కారణంగా పేర్కొంటోంది’’ అని వైఎస్ జగన్ తెలిపారు.‘సోషల్’ ఖాతాలపై ఆంక్షలు ఈ ఆంక్షలకు గురైన ఖాతాల పేజీల్లో ఫేస్బుక్లో సాక్షి టీవీ, ఇన్‌స్టాగ్రామ్‌లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగన్అన్న కనెక్ట్స్‌తో పాటు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్న ఇతర వ్యక్తిగత ఖాతాలు కూడా ఉన్నాయని వైఎస్ జగన్ చెప్పారు. ‘‘ఇది కేవలం డీఎస్సీ కుంభకోణంతో ఆగిపోవడం లేదు. అవినీతి, వైఫల్యాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలులో వైఫల్యం, అధికార దుర్వినియోగం లేదా అధికార అహంకారంపై టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్ర శ్ని స్తోందిప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు ప్రశ్నలు అడిగేవారి గొంతును అణచివేస్తున్నారు. ఇది పాలన కాదు. ఇది సెన్సార్షిప్. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నాయి. రాజకీయంగా అసౌకర్యంగా ఉన్న ప్రశ్నలు అడుగుతున్నారనే కారణంతో ప్రతిపక్షాన్ని, మీడియాను, కార్యకర్తలను లేదా పౌరులను నోరు మూయించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు’’ అని వైఎస్ జగన్ తెలిపారు.దేనికి భయపడుతున్నారు?చంద్రబాబు నాయుడు దేనికి భయపడుతున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నలకా? సమాధానాలకా? అని అన్నారు. ‘‘డీఎస్సీ నియామకంలో ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్న ఆధారాలు తప్పు అని మీరు చెబుతున్నట్లయితే, ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. సీబీఐ విచారణను ఎందుకు నిరాకరిస్తున్నారు? ఈ ఆరోపణలను బయటపెడుతున్న వారి గొంతులను ఎందుకు అణచివేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు పరిమితం చేస్తున్నారు?ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలను తొలగించలేరు. ఒక ఖాతాను నిరోధించినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి, ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి, రాజ్యాంగబద్ధంగా పాలించండి. డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?’’ అని నిలదీశారు.అవినీతి వాసనను వెదజల్లుతున్నాయి క్రీడా కోటాకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి, నియామకాల తర్వాత ఆ క్రీడా కోటా ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేశారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ‘‘అయినా ఆ ఉత్తర్వుల కింద నియమితులైన అభ్యర్థులు ఇప్పటికీ ఉద్యోగాల్లో కొనసాగడం, నియామకాలకు ముందు మార్గాలను తెరిచి, నియామకాల తర్వాత మార్గాలను మూసివేయడం. ఇవన్నీ అవినీతి వాసనను వెదజల్లుతున్నాయి.ఈ సెన్సార్షిప్ చర్యల్లో పరిమితం చేసిన ప్రతి ఖాతా, పోస్టు, కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని కోరుతున్నాను. డీఎస్సీ 2025 నియామకాలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరిగాయని మీరు చెబుతున్నట్లయితే, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని చంద్రబాబు నాయుడిని, ఆయన ప్రభుత్వాన్ని నేను సవాల్ చేస్తున్నాను.స్వతంత్ర దర్యాప్తు నిజానిజాలను తేల్చనివ్వండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఆరోపిత అక్రమాలకు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. ఖాతాలను పునరుద్ధరించండి. సెన్సార్షిప్ను ఆపండి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి. దాచాల్సిందేమీ లేకపోతే, దేనికి భయపడుతున్నారు?’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Hello India!The DSC 2025 recruitment scam is unravelling day by day, with fresh evidence and facts surfacing from different parts of the state, exposing serious irregularities and raising questions that the @ncbn -led TDP coalition government must answer. Instead of answering… pic.twitter.com/bVD6zHDFDC— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2026 -
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: టీచర్స్ డే సందర్భంగా గురువులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన భవిష్యత్తుకు నిజమైన శిల్పులు ఉపాధ్యాయులే. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో కలలను రేకెత్తించి.. విలువలను పెంపొందిస్తూ మంచి భవిష్యత్తును నిర్మించుకునే.. ఆత్మవిశ్వాసాన్ని కల్పించేది గురువులే’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. చిన్నారులను జ్ఞానవంతులుగా, సాధికారులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న ప్రతి గురువుకీ హృదయపూర్వక అభినందనలు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.On the occasion of #TeachersDay, I extend my heartfelt greetings and gratitude to all our teachers.Teachers are the architects of our future. Beyond imparting knowledge, they inspire dreams, instil values and give our children the confidence to shape a better tomorrow.My…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2026 -
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్
-
అక్షరాస్యతపైనా అబద్ధాలా?
సాక్షి, అమరావతి : అక్షరాస్యతపై చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘వాస్తవ పరిస్థితులను, గణాంకాలను వక్రీకరిస్తున్నారు. అధికారిక గణాంకాలు ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా స్పష్టం చేస్తుంటే.. విద్యా శాఖ మంత్రి మాత్రం 82.1 శాతం అంటూ ప్రచారం చేయడం వెనుక ఉన్న లెక్కల మతలబు ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఇంకా పూర్తికాని 2026 సంవత్సరానికి అక్షరాస్యత గణాంకాలు ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..2026 ఏడాది అక్షరాస్యత గణాంకాలు ఏ సంస్థా విడుదల చేయలేదు ‘సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో తప్పుడు సమాచారంతో ప్రచారం చేసుకుంటోందో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. 2024లో 72.6 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 2026లో 82.1 శాతానికి పెరిగిందని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. కానీ 2026 కేలండర్ సంవత్సరానికి సంబంధించిన అక్షరాస్యత గణాంకాలను ఇప్పటి వరకు ఏ అధికారిక సంస్థా విడుదల చేయలేదు. అసలు 2026 సంవత్సరమే ఇంకా పూర్తి కాలేదు. మరి 82.1 శాతం అనే లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ఎస్ఎస్వో నిర్వహించిన సర్వే ఆధారంగా పీఎల్ఎఫ్ఎస్ (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే) 2023–24 వార్షిక నివేదికను రూపొందించారు. జూన్ 2023 నుంచి జూన్ 2024 మధ్య కాలానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏడు సంవత్సరాలు పైబడిన వారి అక్షరాస్యత రేటు 72.6 శాతం. 2018–19లో 69.1 శాతంగా ఉన్న ఈ రేటు 2023 – 24 నాటికి 72.6 శాతానికి చేరింది. అలాగే, జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య ఎన్ఎస్ఎస్వో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన పీఎల్ఎఫ్ఎస్ కేలండర్ ఇయర్ 2025 వార్షిక నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారు. ఈ అధికారిక నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏడు సంవత్సరాలు పైబడిన వారి అక్షరాస్యత రేటు 71.4 శాతం మాత్రమే.యూడైస్ గణాంకాల ప్రకారం వైఎస్ జగన్ హయాం(2023–24)లో, చంద్రబాబు హయాం (2025–26)లో రాష్ట్రంలో విద్యార్థుల వివరాలు టీడీపీ ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు అధికారిక గణాంకాలు ఇంత స్పష్టంగా అందుబాటులో ఉన్నప్పటికీ, 82.1 శాతం అంటూ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం. మరో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుండగా, ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు పెరుగుతోందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన యూడైస్ (యూడీఐఎస్ఈ) గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకురావాలి? ప్రభుత్వ పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు చెప్పుకోవడంలోనే నిమగ్నమైంది. విద్యాశాఖ మంత్రి ‘రెడ్‌బుక్ పాలన’పై సమయం వెచ్చించడం మానుకుని, తన శాఖపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టడం మంచిది’ అని వైఎస్ జగన్ హితవు పలికారు. -
మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. డీఎస్సీ–2025 కుంభకోణం తీగ లాగితే అక్రమాల డొంకలు కదులుతున్నాయని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో జరిగింది మెగా డీఎస్సీ కాదు, యువగళం డీఎస్సీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని.. చంద్రబాబు, లోకేశ్‌ల పాపాలు ఒక్కటొక్కటిగా బట్టబయలవుతున్నాయని చెప్పారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, అది నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ అని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘అధికార బలం, అనుకూల మీడియా సాయంతో చేసిన పాపాలను ఎంతకాలం కప్పిపుచ్చగలరు? టెట్ పరీక్షలో పాస్ అవ్వని వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా లోకేశ్‌కే దక్కుతుంది. రాజకీయ పార్టీలు కాదు.. స్వయంగా ప్రజలే శోధించి డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. డీఎస్సీ అంటే తెలుగుదేశం అని ప్రగల్భాలు పలికిన వాళ్లకు ప్రజలు చెంపపెట్టు లాంటి నిజాలు చూపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో మొదలైన డీఎస్సీ అక్రమాల డొంక చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకూ పాకింది’ అని నిప్పులు చెరిగారు. నారా లోకేశ్ తన ‘యువగళం’ కోటా కింద, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అర్హత లేని తమ వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ–2025లో ఎంపికైన అభ్యర్థుల టెట్ స్కోర్, కేటగిరీ, సబ్జెక్ట్ అర్హత, కేటాయించిన పోస్టును కంప్యూటర్ ఆధారంగా క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమా? అని నాని సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేశ్ నాయుడులకు నిజాలు బయటపెట్టే దమ్ముందా? అని నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో సమర్పించిన సర్టిఫికెట్లను, ముఖ్యంగా జరగని ఈవెంట్లకు సంబంధించినవిగా ఆరోపణలు వస్తున్న సర్టిఫికెట్లను పూర్తి స్థాయిలో వెరిఫై చేయించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాని ఇంకా ఏమన్నారంటే..టెట్ పాస్ కానివాడికి టీచర్ ఉద్యోగమా?» కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. నిన్నటిదాకా అసలు తప్పే జరగలేదన్న ఈ పాలకులు, ఇవాళ 16 వేల మందిలో ఒక్క తప్పు జరిగిందని తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రజలే శోధించి ఆధారాలతో సహా లోకేశ్ బండారాన్ని బద్దలు కొడుతున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం టీచర్ ఉద్యోగం రావాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఏ కోటాలో వచ్చినా ఈ నిబంధన వర్తిస్తుంది. » బీసీలకు 75 మార్కులు రావాల్సి ఉండగా, కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఒల్లూరు ప్రాథమిక పాఠశాలలో కేవలం 65 మార్కులు వచ్చిన ప్రభాకర్ అనే వ్యక్తికి ఎస్జీటీ ఉద్యోగం ఎలా ఇచ్చారు? 150 మార్కులకు కనీస అర్హత సాధించని అభ్యర్థి ఆన్లైన్ దరఖాస్తును కంప్యూటర్ ఎలా స్వీకరించింది? డీఈవోలు, ఐఏఎస్ అధికారులు ఎదురెదురుగా కూర్చుని స్క్రూటినీ చేశామని చెప్పారు కదా.. మరి ఈ అనర్హుడిని ఎలా ఎంపిక చేశారు? పైనుంచి వచ్చిన బలమైన ఒత్తిళ్లు కాక దీనికి కారణమేంటి?బోర్డర్ మండలాల్లో స్పోర్ట్స్ కోటా దందా » ఎవరూ రారు, చూడరు అనే ధీమాతో కర్ణాటక సరిహద్దున ఉన్న కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఏకంగా 24 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లను నియమించారు. ఒక్క ఒల్లూరు స్కూల్లోనే ఐదుగురు స్పోర్ట్స్ కోటా వాళ్లే పాఠాలు చెబుతున్నారు. 41 ఏళ్ల వయసులో 2009–10 నాటి జూడో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే, 42 ఏళ్లకు టీచర్ కొలువు ఇచ్చేశారు. జూడో ఆడేవాళ్లే లేని రాష్ట్రంలో 30–40 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు?» ఇంత జరుగుతుంటే ఎంఈవో, డీఈవో ఆఫీసుల్లో కాకుండా ‘గోతులదొడ్డి’ స్కూల్లో చీకట్లో రహస్య విచారణలు ఎందుకు జరుపుతున్నారు? ఇవాళ శాప్ ఒక దొంగల బండిలా మారింది. శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేట్ బీఈడీ కళాశాల కేంద్రంగా ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దందా నడిచింది. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు రాత పరీక్ష నిబంధనను ఎత్తేస్తూ జీవో 4, జీవో 47 తెచ్చారు. మేము నిలదీశాక మళ్లీ జీవోలు మార్చారు. గుర్రపు స్వారీ (ఈక్వెస్ట్రియన్), ఫెన్సింగ్, రైఫిల్ షూటింగ్ వంటి సంపన్నుల ఆటలను ఏకేటగిరీలో పెట్టి.. సామాన్యులు ఆడే కబడ్డీ, బాడీబిల్డింగ్, చెస్, క్యారమ్స్లను బికేటగిరీకి నెట్టేశారు. అసలు జరగని టోర్నమెంట్లకు ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చిన వారికి కొలువులు కట్టబెట్టారు.సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి » సంబంధిత శాఖ మంత్రిగా లోకేశ్ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు? హోం మంత్రితో ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఈ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతోనూ అబద్ధాలు చెప్పించి.. వారిని అక్కడి నుంచి పంపించేసింది. ఒక్క తప్పిదం లేకుండా డీఎస్సీ పూర్తి చేశామన్న వారు ఇప్పుడేమంటారు? టెట్ పాస్ కాని అభ్యర్థి అప్లికేషన్‌ను ఎందుకు రిజెక్ట్ చేయలేదు?» ‘16 వేల మందిలో ఒక్క తప్పు మాత్రమే జరిగిందని చేతులు దులుపుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకోం. జీవో–15 ప్రకారం టెట్ క్వాలిఫై కాకుండా టీచర్ ఉద్యోగం ఇవ్వడం ఉల్లంఘనే. చిత్తూరు జిల్లాలో ఓసీ అభ్యర్థికి టెట్‌లో 90 మార్కులు రావాల్సి ఉండగా, 79 మార్కులొచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కట్టబెట్టారు. » తూర్పుగోదావరి జిల్లాలో తెలుగులో టెట్ రాస్తే, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థుల టెట్ స్కోర్లు, కేటగిరీలను కంప్యూటర్ క్రాస్ వెరిఫికేషన్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా? తక్షణమే ఈ ‘దగా డీఎస్సీ’పై సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి. నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. » శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ఒక పెద్ద దొంగల బండి లా మారింది. అక్కడ ముద్ర పడితే చాలు అర్హత లేకున్నా కొలువులు ఇచ్చేస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ బీఈడీ కాలేజీ కేంద్రంగా సాగిన ఈ స్పోర్ట్స్ కోటా దందాను పూర్తిగా నిగ్గు తేల్చాల్సిందే.యువగళం కోటా వాళ్లకు రూల్స్ మినహాయింపుపాతికేళ్లు, ముప్పై ఏళ్లుగా నిబద్ధతతో పాఠాలు చెబుతూ సమాజానికి ఎంతో మంది ప్రయోజకులను అందించిన సీనియర్ టీచర్లనేమో టెట్ పాస్ కావాలని వేధిస్తారు. కానీ మీ యువగళం కోటాలో అర్హత లేకపోయినా, టెట్ తప్పినా అడ్డగోలుగా ఉద్యోగాలు కట్టబెడతారా? లోకేశ్ రాజకీయాల్లో ఒక కామెడీ పీస్‌గా మారిపోతున్నారు. డబ్బులిచ్చి సర్వేలు రాయించుకుంటూ 82 శాతం అక్షరాస్యత వచ్చిందని పోస్టులు పెట్టుకోవడం హాస్యాస్పదం.రెండేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ అందక, చదువు భారమై సుమారు నాలుగైదు లక్షల మంది పేద విద్యార్థులు చదువులు మానేశారు. వీళ్లకు ఇవ్వడానికి నిధులు ఉండవు గానీ, యోగా మ్యాట్లకు, ప్రతినెలా సీఎం పెన్షన్ ఇచ్చేందుకు తిరిగే ఆర్భాటాలకి రూ.కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇస్తామని ఊదరగొట్టిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక స్పందించడమే లేదు. రూ.40 వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారని ఉద్యోగులు అడుగుతుంటే ఉలకడం లేదు. ఒకపక్క ఉద్యోగుల జీతాల భారం అంటూనే, పాత డీఎస్సీ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి రెండో డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపి, ఉద్యోగుల బకాయిలు చెల్లించి, డీఎస్సీ అక్రమాలపై పూర్తిస్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలి. -
అంతరిక్షంలో భారత్ ‘ఆకాశ నేత్రం’
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భూమిని చిత్రీకరించగల అధునాతన ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్–05 (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. 2,367 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ–17 రాకెట్ ద్వారా నిర్దేశిత సబ్–జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2.55 గంటలకు జీఎస్ఎల్వీ–ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లింది. 27 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఈ ప్రయోగం చేపట్టారు. రాకెట్ నింగిలోకి ఎగిసిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. శుక్రవారం ప్రయోగంతో దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత ఇస్రోకు విజయం లభించింది. ఈ ఏడాది జనవరి 12న 16 ఉపగ్రహాలతో ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ62 రాకెట్.. మూడో దశలో ఏర్పడిన సమస్య కారణంగా వాటిని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయింది. వ్యూహాత్మక సమాచారం మన సొంతం ఈ ఉపగ్రహం ద్వారా భూమికి సంబంధించిన దాదాపు రియల్‌టైమ్ చిత్రాలను పొందవచ్చు. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా దేశ అవసరాలకు ఈ చిత్రాలు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా దేశానికి అవసరమైన ‘వ్యూహాత్మక సమాచారం’ అందించడంలో ఈఓఎస్–05 కీలకంగా వ్యవహరించనుంది. ఈ ఉపగ్రహాన్ని మిషన్‌లో భాగమైన ఓ సీనియర్ శాస్త్రవేత్త ‘ఆకాశ నేత్రం’గా అభివర్ణించారు. ప్రయోగ వివరాలు వెల్లడిస్తున్న మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్, ఇస్రో చైర్మన్ నారాయణన్ తదితరులు ఇప్పటివరకు అనేక భూ పరిశీలన ఉపగ్రహాలు తక్కువ భూ కక్ష్య (ఎల్ఈఓ) నుంచి పనిచేస్తున్నాయి. అయితే ఈఓఎస్–05 సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రోనస్ కక్ష్యలో పనిచేయనుంది. ఈ ఎత్తులో ఉపగ్రహం భూమి భ్రమణ వేగంతో సమానమైన వేగంతో పరిభ్రమిస్తుంది. 2,367 కిలోల బరువున్న ఈఓఎస్–05 జీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లోనే అత్యంత బరువైనది. ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని, సౌర ఫలకాలు విజయవంతంగా తెరుచుకున్నాయని ఇస్రో తెలిపింది. చాలా సంతోషంగా ఉంది జీఎస్ఎల్వీ–ఎఫ్17 రాకెట్ అధునాతన ఈఓఎస్–05 జియో ఇమేజింగ్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా, కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది శ్రీహరికోట నుంచి చేపట్టిన 107వ ప్రయోగం. జీఎస్ఎల్వీకి ఇది 19వ మిషన్. జీఎస్ఎల్వీ తొలి ప్రయోగం (డీ1)లో 1,536 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. అప్పటి నుంచి నిర్మాణ బరువును తగ్గించడం, ప్రొపల్షన్ వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా జీఎస్ఎల్వీ సామర్థ్యాన్ని ఇస్రో క్రమంగా పెంచింది. ఇప్పుడు 2,367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియను చేపట్టి ఉపగ్రహాన్ని అవసరమైన ఎత్తుకు చేర్చి జియో ప్లాట్ఫామ్లో ప్రవేశపెడతాం. ఈ విజయం ఇస్రోతో పాటు ఇందులో భాగస్వాముల సమష్టి కృషి ఫలితం. ఈఓఎస్–05 జీవితకాలం తొమ్మిదేళ్లు. ఇది ‘గూఢచారి ఉపగ్రహం’ అంటూ వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. దేశ అవసరాల కోసం భూ పరిశీలన, ఇమేజింగ్ సేవలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. 2027 మార్చి నాటికి ప్రధాని మోదీ నిర్దేశాల మేరకు ఆరు ప్రయోగాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం – ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ రియల్‌టైమ్‌లో చిత్రాలను అందిస్తుంది ప్రత్యేకంగా రూపొందించిన ఈఓఎస్–05 ఉపగ్రహం దాదాపు రియల్‌టైమ్‌లో చిత్రాలను అందించగలదు. జీఎస్ఎల్వీ ద్వారా జీటీఓ లేదా సబ్–జీటీఓ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇది అత్యంత బరువైనది. – మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్ మోదీ అభినందనలు ఈఓఎస్–05 మిషన్ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది దేశానికి గర్వకారణమైన సందర్భమని పేర్కొన్నారు. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేసే దేశ తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం భారత అంతరిక్ష రంగం సాధించిన అద్భుత విజయమని తెలిపారు. జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: జీఎస్ఎల్వీఎఫ్17 రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, సాంకేతిక బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ట్వీట్ చేశారు. నిరంతరం సరికొత్త విజయాలతో అంతరిక్ష పరిశోధనల్లో మన భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు చూపుతున్న అపారమైన సామర్థ్యం, కృషి, సాధిస్తున్న విజయాలు దేశప్రజలందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఇస్రో మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు. 2021 ప్రయోగానికి ప్రత్యామ్నాయం! కాగా, జీఎస్ఎల్వీ–ఎఫ్17/ఈఓఎస్–05 మిషన్... 2021లో విఫలమైన జీఎస్ఎల్వీ–ఎఫ్10/ఈఓఎస్–03 మిషన్‌కు ప్రత్యామ్నాయంగా చేపట్టినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రయోగంలో రాకెట్ ప్రయాణం ప్రారంభమైన 307 సెకన్ల వద్ద ఆన్‌బోర్డ్ కంప్యూటర్ ప్రయోగాన్ని నిలిపివేసింది. అనంతరం జరిపిన పరిశీలనలో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్‌లో ఏర్పడిన లోపం కారణంగానే ఆ మిషన్ విఫలమైనట్లు ఇస్రో గుర్తించింది. -
వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం
దేవరపల్లి: మార్కెట్లో గత నెల రోజుల నుంచి క్రమేపీ పొగాకు ధరలు పెరగడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లో రూ.63 పెరిగి శుక్రవారం కిలోకు గరిష్ట ధర రూ.328 లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. దీనికి కృతజ్ఞతగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం పొగాకు వేలం కేంద్రాల పరిధిలోని పలువురు రైతులు దేవరపల్లి వేలం కేంద్రం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ గత నెల ఐదో తేదీన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. జగన్ పర్యటనకు ముందు కిలో రూ.265గా ఉన్న ధర శుక్రవారం నాటికి రూ.328కు చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు కష్టకాలంలో వైఎస్ జగన్ అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. జగన్ అడుగుపెడితే ధర పెరుగుతుందనే నమ్మకం నిజమైందన్నారు. ఈ కార్యక్రమంలో పొగాకు రైతు సంఘం ప్రతినిధులు సుంకవల్లి శ్రీనివాస్, నరహరిశెట్టి రాజేంద్రబాబు, రైతులు కూచిపూడి సతీష్, గన్నమని జనార్ధనరావు, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, కుసులూరి వెంకట సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్
-
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్‌లో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ వరుసగా ఎన్నో సాక్ష్యాలు బయటకు వస్తున్నా ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ‘కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థి టెట్‌లో క్వాలిఫై కాకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు?వన్ టు వన్ ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి..’ అని స్పష్టం చేశారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆధారాలను ట్యాగ్ చేస్తూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. అందులో ఏమన్నారంటే... ఇంకా దాక్కుంటారా..? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ.. మోసాల్లో మెగా, నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట దగా అని తేలిపోతుంటే మీరు, మీ సుపుత్రుడు దాక్కోవడం ఎందుకు? ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో రాజీనామా చేయించకుండా.. అధికార బలంతో అబద్ధాలు చెబుతూ, పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ కుమారుడిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆ అదృశ్య శక్తి లోకేశ్ కాదంటారా? కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? వన్ టు వన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి.చంద్రబాబూ..! ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా, మీ అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా? మీ కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, మీ కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం. ఈ దారుణమైన స్కామ్‌ను కప్పిపుచ్చలేరు ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే.. వీటి వెనుక మీరు, మీ సుపుత్రుడు ఉన్నారు కాబట్టే మీరు సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీలు చేయించి మీకు డబ్బా కొట్టించుకోవడం ద్వారా నిజాయితీపరులైన ఉద్యోగార్థులను దెబ్బ తీసిన ఈ దారుణమైన స్కామ్‌ను కప్పిపుచ్చలేరు. పారదర్శకంగా పరీక్షలు, నిష్పక్షపాతంగా ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థులు, యువకులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని మరోమారు భరోసా ఇస్తున్నాం. లీకేజీ వ్యవహారం నుంచి స్పోర్ట్స్ కోటా వరకు.. టెట్ అర్హతల నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు.. మొత్తంగా మెగా డీఎస్సీ వ్యవహారాన్ని, జీవో నంబర్ 4 ఆధారంగా నడిచిన నియామకాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని మరోమారు డిమాండ్ చేస్తున్నా.మీ అక్రమాలను ఏపీపీఎస్సీకి పాకించారు..మరో నిర్ఘాంతపరిచే విషయం ఏమిటంటే.. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన మీరు, మీ అక్రమాల విధానాన్ని డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీకి కూడా పాకించడం. మా హయాంలో ఫైనాన్స్ క్లియరెన్స్ పొందిన అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్ 4నే మీరు వాడుకున్న మాట వాస్తవం కాదా? డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేయడంతోపాటు ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా నిలిపివేయడం వాస్తవం కాదంటారా? .@ncbn గారూ… మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ మోసాల్లో “మెగా”, నిజాయితీపరులైన అభ్యర్థుల… pic.twitter.com/8dkiPMnKjk— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026 -
GSLV ప్రయోగం విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి,తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ చారిత్రాత్మక ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, సాంకేతిక బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం వల్ల దేశంలో వాతావరణ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వ్యవస్థలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరం సరికొత్త విజయాలతో అంతరిక్ష పరిశోధనల్లో మన భారతీయ శాస్త్రవేత్తలు చూపుతున్న అపారమైన సామర్థ్యం, కృషి దేశప్రజలందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఇస్రో మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు. Congratulations to @isro on the successful #GSLVF17 launch carrying #EOS05 from Sriharikota. I commend the scientists and engineers whose dedication and precision made this achievement possible. The mission strengthens weather monitoring, disaster management and national… https://t.co/PODbu2k2HQ— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026 -
బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్
-
10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత
-
విజయసాయి మాట ఎందుకు మార్చారు?
మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ఏదో తెలియని ఆందోళనతో, ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమి చెప్పాలో అర్థంకాకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుంది. వైఎస్సార్సీపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విజయసాయి సడన్‌గా ఎంపీ పదవి వదలుకోవడం, పార్టీని సైతం వీడడం సంచలనం అయింది. ఇందులో ఏమి మతలబు ఉందా అన్న చర్చ జరిగింది. కాని ఆయన మాత్రం తాను వ్యవసాయం చేసుకుంటానని, రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పట్లో ప్రకటించారు. చాలామంది ఆయన మాటకు కట్టుబడి ఉంటారేమోలే అని సరిపెట్టుకున్నారు.కాని కొంతకాలం గడిచే కొద్ది ఆయనలో మార్పు రావడం ఆరంభం అయింది. తొలుత అక్కడక్కడ కామెంట్లు చేయడం, తదుపరి వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం, ప్రత్యేకించి వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు గుప్పించడం అందరిని విస్మయపరిచింది. రాజకీయ పార్టీలలో నేతల మధ్య తెలియని స్పర్ధ ఉంటుంది. అయినా పార్టీలో ప్రధాన నాయకుడిని చూసి సర్దుకుపోతుంటారు. పైగా విజయసాయికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్ద లభించిన ప్రాధాన్యత చాలా ఎక్కువే. పార్టీలో పలువురికి దీనిపై కాస్త అసంతృప్తి ఉన్నా ఎవరూ పైకి మాట్లాడలేదు.ప్రత్యేకించి విశాఖపట్నం ఇన్‌చార్జీగా ఉన్న సమయంలో ఈయనపై ఎల్లోమీడియా విపరీతమైన వ్యతిరేక వార్తలు ఇచ్చేది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడుకూడా ఈయన టార్గెట్‌గానే ఉండేవారు. ఈయన బందువులు విశాఖలో స్థలం కొనుగోలు చేసినా ఎల్లోమీడియాలో ఆరోపణలు వచ్చేవి. చివరికి ఆయనపై ఎంత నీచమైన అభియోగాలు మోపింది అందరికి తెలుసు. టీడీపీ మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ విజయసాయి మీడియా సమావేశాలు పెట్టేవారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా మొదటి పేజీతో పాటు, లోపలి పేజీలో పెద్ద ఎత్తున పరచిందంటే అందులో ఉన్న మతలబు అర్థం చేసుకోవచ్చు.ఆ రకంగా చూస్తే విజయసాయి తనకు ఇంత ప్రచారం ఆ మీడియాలో వస్తోందని సంతోషిస్తున్నారేమో తెలియదు కాని, అది పులిమీద స్వారీలాంటిదే అని తెలుసుకోగలగాలి. నిజంగానే ఆయన చెబుతున్నట్లు కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత కూడా తన విధానాలపై ప్రచారం చేసుకుంటే ఫర్వాలేదు. అధికారంలో ఉన్న టీడీపీ, జనసన, బీజేపీ కూటమి విధానాలను వ్యతిరేకిస్తారో, మద్దతు ఇస్తారో చూడాల్సి ఉంది. ఒకవేళ మద్దతు ఇస్తే ఆయన అసలు లక్షణం బయటపడుతుంది.ప్రభుత్వ విధానాలలోని మంచి, చెడులపై వ్యాఖ్యానిస్తే తప్పు కాదు. కూటమి ప్రభుత్వంపై కాకుండా వైఎస్సార్‌సీపీపైనే దృష్టి కేంద్రీకరిస్తే, టీడీపీకి పరోక్ష మద్దతు ఇవ్వడానికే ఈ రెండేళ్లుగా రాజకీయం నడిపారని జనం అనుకుంటారు. అంటే టీడీపీ ట్రాప్‌లో విజయసాయి పూర్తిగా చిక్కుకున్నట్లు అవుతుంది. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిపైన కాని, ఆయన సమీప బంధువులపై కాని కూటమి ప్రభుత్వం పలు కేసు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి యత్నించింది. దానికి తోడు విశాఖలో ఈయన అనుచరులు భూ దందాలకు పాల్పడ్డారని పదే, పదే ప్రచారం చేశారు. అప్పటికే మద్యం కుంభకోణాన్ని సృష్టించి అందులో పలువురిని అరెస్టు చేశారు. విజయసాయి పేరు కూడా కేసులో చేర్చారు.ఈ కేసుల బెడద, ఎల్లోమీడియా దాడి భరించలేకే ఈయనలో బాగా మార్పు వచ్చిందా అన్నది కొందరి అనుమానం. ఆ కేసులో ఉన్న ఇతర నిందితులు కొందరితో ఆయన వివాదపడుతున్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. మొత్తం మీద ఏ రకంగా మేనేజ్ చేసుకున్నారో కాని చంద్రబాబు ప్రభుత్వం ఐదో నిందితుడుగా ఉన్న ఆయన జోలికి వెళ్లలేదు. ఆ క్రమంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేయడం, దానిని టీడీపీ చేజిక్కించుకోవడం వంటివి జరిగాయి.ఇవి కూడా చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?ఈ నేపథ్యంలో విజయసాయి తాజాగా చేసిన ప్రకటనలు సహజంగానే అందరికి సందేహాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మత మార్పిడులను జగన్ ప్రోత్సహించారంటూ దారుణమైన ఆరోపణ చేయడం ఆయనకే చెల్లింది. అదే నిజమైతే ఈయననే మార్చి ఉండాలి కదా అన్న విమర్శకు బదులు లేదు. జగన్ అధికారంలో ఉండగా, అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఈపాటికి కూటమి ప్రభుత్వం ఎంత యాగీ చేసేదో కదా! పైగా హిందూ ధర్మపరిరక్షణకు అవసరమైన అనేక చర్యలు జగన్ తీసుకున్నారు. విజయసాయి చేసిన ఈ విమర్శపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈసారి బహరంగ లేఖ పేరుతో సజ్జలపై విరుచుకుపడే యత్నం చేశారు. ఆయన పార్టీలో నెంబర్ వన్‌గా ఉన్నారంటూ జగన్‌ను తగ్గించే యత్నం చేశారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందో లేదో ఆయనకు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు ఆ ఫీలింగ్ ఉంటే అప్పుడే బయటకు వచ్చి ఉండవచ్చు లేదా ఓపెన్ అయి ఉండవచ్చు. అలాకాకుండా ఎన్నికలలో ఓటమి ఎదురయ్యాక మాట్లాడడమే అభ్యంతరం అనిపిస్తుంది. సజ్జలపై కేసులు రాలేదని ఆయన చెబుతున్నారంటే దాని అర్థం టీడీపీతో కుమ్మక్కైనట్లు కాదు.నిజానికి సజ్జలపైన, ఆయన కుమారుడు భార్గవపైన పలు కేసులను ప్రభుత్వం పెట్టింది. వాటిలో పలు పిచ్చి కేసులు ఉన్నాయి. లుక్ అవుట్ నోటీసుల వరకు వెళ్లింది. అయితే వాటన్నిటిపైన న్యాయపోరాటం చేసి స్టేలు తెచ్చుకున్నారు. అంతే తప్ప విజయసాయి మాదిరి భయపడి పోలేదని అనుకోవాలి. ఒకప్పుడు విజయసాయికి ఉన్న ధైర్యం ప్రస్తుతం లేకుండా పోయిందని అనుకోవాలి. వైఎస్సార్సీపీ కార్యకర్తల మాదిరి పోరాడే శక్తిని ఆయన కోల్పోయారని భావించాలి. సజ్జల వల్ల తాను పార్టీని వీడడం లేదని గతంలో చెప్పిన విజయసాయి మాట మార్చి, ఏకంగా తనపై భౌతిక దాడి జరిగిందని, 74 సార్లు అవమానాలు జరిగాయని ఆరోపించేవరకు వెళ్ళడం ఆశ్చర్యం కలిగిస్తుంది.అది నిజమే అయితే, ఆనాడే ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి ఉండాల్సింది కదా! అప్పుడే పదవులను వదలుకుని ఉండాలి కదా!అధికారం కోల్పోయాక చేసే ఆరోపణలకు విలువ ఏమి ఉంటుంది. ఆయన ప్రతిష్ట దెబ్బతినడం తప్ప. తనను ఎన్నో విధాలుగా వేధించిన ఎల్లో మీడియాకు అస్త్రంగా మిగలడం తప్ప. ఆయన వ్యాఖ్యలు చిన్నపిల్లల చేష్టల మాదిరిగా కనిపిస్తున్నాయి.గతంలో చంద్రబాబుపై, టీడీపీపై విజయసాయి కొన్ని అభ్యంతర పోస్టులు పెట్టడం ద్వారా పార్టీని ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా సీనియర్ నేత కనుక ఎవరూ మాట్లాడలేదు. తనతో పాటు విజయసాయిపై కూడా అక్రమ కేసులు పెట్టారన్న సానుభూతి ఉండబట్టే కదా జగన్ ఈయనను రెండుసార్లు ఎంపీని చేశారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిని చేశారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. కాని వివిధ పరిణామాల నేపథ్యంలో పార్టీలో మార్పులు జరుగుతుంటాయి. ఆ సంగతి ఆయనకు తెలియదా! అయితే ఇప్పటికీ జగన్‌కు నమ్మక ద్రోహం చేయనని అనడం మంచిమాటే. కాకపోతే టీడీపీ ట్రాప్‌లో పడి, వారు రాసిచ్చే స్క్రిప్టు చదివే దశకు విజయసాయి వెళితే అది మరింత బురద ఊబిలో కూరుకుపోతున్నట్లే అవుతుందేమో! ఆ సంగతి ఆయన గ్రహిస్తే మంచిదే!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవ పరిస్థితులను.. గణాంకాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాజా అక్షరాస్యత రేటుపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలే ఇంకా వెలువడలేదని, అలాంటప్పుడు పెరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక ప్రకారం.. ఏపీలో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి అక్షరాస్యత రేటు 72.6 శాతంగా ఉంది. 2018-19లో ఇది 69.1 శాతంగా ఉన్నట్లు వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతా ద్వారా వాస్తవాలను బయటపెట్టారు.2025లోనూ తగ్గిందే..2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన పీఎల్ఎఫ్ఎస్ వార్షిక నివేదికలో ఏపీ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా నమోదైందని జగన్ వెల్లడించారు. ఈ నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారని తెలిపారు. దీంతో 2024లో 72.6 శాతం ఉన్న అక్షరాస్యత.. 2025లో 71.4 శాతానికి తగ్గిందని, మరి 2026లో 82.1 శాతానికి ఎలా చేరిందో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.𝗜𝘁’𝘀 𝘀𝗵𝗼𝗰𝗸𝗶𝗻𝗴 𝘁𝗼 𝘀𝗲𝗲 𝘁𝗵𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝘁 𝗼𝗳 𝗺𝗶𝘀𝗶𝗻𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝗽𝗿𝗼𝗽𝗮𝗴𝗮𝗻𝗱𝗮 𝗯𝘆 𝘁𝗵𝗲 𝗽𝗿𝗲𝘀𝗲𝗻𝘁 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁.The Minister of education claims that the literacy rate increased from 72.6% in 2024 to… pic.twitter.com/6yzdtMCVjV— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026‘ఇది తప్పుడు ప్రచారం’..2026 సంవత్సరం ఇంకా పూర్తికాకముందే ఆ ఏడాది అక్షరాస్యత గణాంకాలను కూటమి ప్రభుత్వం ఎలా ప్రకటించిందని జగన్ ప్రశ్నించారు. స్పష్టమైన అధికారిక గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ తప్పుడు లెక్కలు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు..ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి మరో ఆందోళనకరమైన అంశాన్ని జగన్ ప్రస్తావించారు. కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్ (UDISE) గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.‘విద్యాశాఖపై దృష్టి పెట్టండి’..విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకోవడంపై కాకుండా శాఖ పనితీరుపై శ్రద్ధ పెట్టాలని జగన్ సూచించారు. ‘రెడ్‌బుక్ పాలన’పై దృష్టి పెట్టడం కంటే విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడంపై ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని ఎద్దేవా చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో తీసుకొచ్చిన విధాన మార్పులపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయని పేర్కొన్న జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అక్షరాస్యతపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అసలు మోదీ, పవన్ ఎవరబ్బా? -
ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్
-
కర్నూలు జనసంద్రం
కర్నూలు (టౌన్): కర్నూలు నగరం గురువారం జనసంద్రంగా మారింది. ఎస్టీబీసీ కళాశాల మైదానం మొదలు వైఎస్సార్ సర్కిల్, నరసింగరావు పేట, చిరంజీవి పార్కు, ప్రకాష్ నగర్, నేతాజీ థియేటర్, సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ కళాశాల వరకు ఇసుక వేస్తే రాలనంతగా జనసందోహం సందడి చేసింది. తమ అభిమాన నాయకుడైన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలుకు విచ్చేశారని తెలియడంతో అశేష ప్రజానీకం తరలి వచ్చి రోడ్డుకిరువైపులా బారులు తీరింది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎస్వీ విజయమనోహరి దంపతుల కుమారుడు జనక్దత్తా రెడ్డి, రాజమండ్రి రుడా మాజీ చైర్మన్ షర్మిల, మేడపాటి అనిల్ రెడ్డి దంపతుల కుమార్తె హంసినీ శ్రేయల వివాహ రిసెప్షన్‌కు గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు హెలికాఫ్టర్‌లో ఎస్టీబీసీ కళాశాల మైదానానికి చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసిన సెయింట్ జోసఫ్ కళాశాల వరకు దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. ప్రజలు, మహిళలు, అభిమానులు వేలాదిగా అడుగడుగునా వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. జగన్‌తో సెల్ఫీ దిగేందుకు యువత పోటీ పడ్డారు. నేతలను, అభిమానులను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరిస్తూ.. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్ జగన్‌ను కలిసిన న్యాయవాదులుఅధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీకర్నూలు: చంద్రబాబు కూటమి ప్రభుత్వం న్యాయ పరంగా కర్నూలుకు తీరని నష్టం చేకూర్చిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కర్నూలుకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పాటు మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తను కర్నూలులో ఏర్పాటు చేసిందన్నారు. అయితే వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకు తరలించి రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కర్నూలులో న్యాయవాదుల సమాజానికి ఇప్పటి వరకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. వారి సమస్యలను ఓపికగా విన్న వైఎస్ జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు జి.స్వాములు, సువర్ణా రెడ్డి, హనుమంత రెడ్డి, నరేంద్రనాథ్ రెడ్డి, కోడుమూరు ప్రభాకర్, శివ, ఇతర న్యాయవాదులు ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్ బాధితునికి వైఎస్ జగన్ పరామర్శకర్నూలు (టౌన్): చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న విశ్వనాథ్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వీరాభిమాని. వైఎస్ జగన్‌ను దగ్గరి నుంచి చూడాలని, ఫొటో దిగాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో గురువారం కర్నూలు నగరానికి వస్తున్న వైఎస్ జగన్‌ను ఎలాగైనా కలవాలని నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో ఎస్టీబీసీ కళాశాలకు చేరుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ద్వారా విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ వెంటనే వీల్ చైర్లో ఉన్న విశ్వనాథ్ దగ్గరకు వెళ్లారు. అతనితో కలిసి ఫొటో దిగారు. ఆప్యాయంగా పలకరించారు. దీంతో ఇన్నాళ్లకు తన కోరిక తీరిందని విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్
-
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దెబ్బకు సీఎం చంద్రబాబు దిగొచ్చారు. ఎట్టకేలకు కరువుపై కేబినెట్లో చర్చ జరిపారు. ఇటీవలే ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీసిన సంగతి తెలిసిందే. దీంతో కరువుపై కేంద్రానికి లేఖ రాస్తానంటూ చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో దుర్భర పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు అంగీకరించారు.దేశమంతా 14 శాతం లోటు వర్షపాతం ఉండగా.. ఏపీలో మాత్రం 52 శాతం లోటు వర్షపాతం ఉన్నట్టు వెల్లడించారు. జలాశయాల్లో నీళ్లున్నా.. రైతులకు ప్రభుత్వం విడుదల చేయలేదు. నీళ్లివ్వలేమంటూ కేబినెట్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. విమర్శలు చేస్తున్నవారిపై ఎదురుదాడి చేయాలంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.ఏపీ కేబినెట్లో ప్రోటోకాల్‌పై హైడ్రామాఏపీ కేబినెట్లో ప్రోటోకాల్‌పై హైడ్రామాకు తెరతీశారు. అధికారులను సీఎం మందలించినట్టు లీకులు ఇచ్చారు. వెలిగొండ, పోలవరం ప్రకటనల్లో రామానాయుడు ఫొటో కానరాలేదు. రామానాయుడు ఫొటో తీసేసి నారా లోకేష్ ఫొటో ముద్రించారు. లోకేష్‌ని ప్రమోట్ చేయడానికి టీడీపీ ప్లాన్ చేసింది. విషయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు డ్రామా మొదలుపెట్టారు. తప్పంతా అధికారులపై నెట్టేసి తిట్టినట్టు లీకులు ఇచ్చారు. -
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. మానవాళికి కర్తవ్య బోధ చేసిన భగవద్గీతను ప్రసాదించి, మంచి తరఫున నిలిచి చెడును ఓడించిన భగవానుడు శ్రీకృష్ణుడని వైఎస్ జగన్ అన్నారు. శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నాని పేర్కొన్నారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకోవాలని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలన్నారు.‘‘ధర్మాన్ని నిలబెట్టి, సత్యానిదే అంతిమ విజయమని.. జగతికి చాటిన శ్రీకృష్ణ భగవానుడి కృపాకటాక్షాలతో.. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ.. ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.ధర్మాన్ని నిలబెట్టి, సత్యానిదే అంతిమ విజయమని జగతికి చాటిన శ్రీకృష్ణ భగవానుడి కృపాకటాక్షాలతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026ఇదీ చదవండి: జన్మాష్టమి రోజు ఈ పనులు చేయడం వెనుక ఇంత అర్థముందా? -
కర్నూలులో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్
-
కర్నూలులో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో ఉన్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులు జనక్-శ్రియాలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు.ఇక, వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జగనన్నకు ఘన స్వాగతం పలికారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్ రాకతో సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఇదీ చదవండి: బాబూ.. పోలవరంపై మీ డ్రామాలు ఆపండి: వైఎస్ జగన్ -
బాబు సాష్టాంగం నమస్కారం.. చెప్పని అసలు లెక్క ఇదే!
దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కొంత మేర అయినా సాకారం అవడం సంతోషమే. మార్కాపురం, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు నీరందించాలని ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే పరిస్థితి ఇంకా రావల్సి ఉంది. ప్రస్తుతానికి తామేదో చేసేశామని చెప్పుకోవడం కోసం కూటమి ప్రభుత్వం తంటాలు పడింది. దీనికి ఎల్లో మీడియా విపరీతమైన హైప్ ఇచ్చింది.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించిన వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నీరు వదలే అవకాశం రావడం అదృష్టమే. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన పేరు గుర్తుంచుకునేలా చేసిన కార్యక్రమం పెద్దగా ఏదీ లేదని చాలామంది అంటారు. అయితే గత ప్రభుత్వాలు చేసిన వివిధ పనులను తనవిగా ప్రొజెక్టు చేసుకోవడంలో ఆయనను మించిన వారు మరొకరు ఉండకపోవచ్చు. దానిని క్రెడిట్ చోరీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పెట్టారు. ఉన్నవి, లేనివి ఏవేవో అంకెలు చెబుతూ చంద్రబాబు ఉపన్యాసాలు చేస్తుంటారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అదే జరుగుతోంది.తానే శంకుస్థాపన చేశానని, తానే ప్రారంభిస్తున్నానని ఆయన చెబుతారు. అంతవరకు నిజమే. కాని అసలు పనిచేసింది ఎవరు అన్నది మాత్రం చెప్పరు. అందువల్లే కృష్ణా నది నుంచి నీటిని తరలించే బృహత్తర పథకంలో వెలిగొండ ప్రాజెక్టు వివిధ దశలకు సంబందించి తన పాత్రను వివరించలేకపోయారు. నిజానికి చంద్రబాబుకు వచ్చిన రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉంటే ఉమ్మడి ఏపీలో ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తి అయి ఉండేవి.1996 ఎన్నికలకు ముందు జనాన్ని మాయ చేయడం కోసం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాటిలో అత్యధికం అంతకుముందు ఎన్టీఆర్ ప్రభుత్వంలో వచ్చిన ప్రతిపాదనలే. చంద్రబాబు శిలాఫలకాలైతే వేశారు కాని, వాటిని ముందుకు తీసుకువెళ్లలేదు. భారీ ప్రాజెక్టులపై ఆయనకు గతంలో పెద్దగా నమ్మకం లేకపోవడమే కారణం. అవి సకాలంలో పూర్తి కావని, రాజకీయంగా లబ్ది చేకూరదన్నది ఆయన ఉద్దేశం.చంద్రబాబు 1998 ప్రాంతంలో ఏపీ ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. అందులో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. వైఎస్ అప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనకు పలు ఆందోళనలు చేశారు. ఆ నేపథ్యంలో చంద్రబాబుకు ఒక హెచ్చరిక చేస్తూ, నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే చరిత్ర హీనుడవుతావు.. అని వ్యాఖ్యానించడం సంచలనం అయింది. అయినా చంద్రబాబు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. బీజేపీతో కలిసి పోటీచేయడం ద్వారా 1999 ఎన్నికలలో గెలవలిగారు. వాజ్ పేయిపై జనంలో ఉన్న సానుభూతి కలిసి వచ్చింది.ఆ తర్వాత కూడా ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండేవి. దాంతో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో ఉమ్మడి ఏపీలో ప్రతి ప్రాజెక్టు స్థలాల వద్దకు వెళ్లి శంకుస్థాపన ఫలకం పక్కన మొక్కలు నాటి నిరసన తెలిపారు. వాటిలో వెలిగొండ కూడా ఒకటి. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి క్యాబినెట్ లోనే నీటిపారుదల ప్రాజెక్టుల రిపోర్టును అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సీవీఎస్ కె శర్మ ప్రవేశపెట్టారు. వాటి వివరాలు చూసిన ఆనాటి మంత్రి జేసీ దివాకరరెడ్డి ఇన్ని ప్రాజెక్టులకు అవకాశం ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. దానికి శర్మ సమాధానం ఇస్తూ, ఆయన ప్రాధాన్యతలు వేరు, ప్రాజెక్టులను మీరు చేస్తామంటున్నారు.. అందుకే నివేదిక సమర్పించాను అని బదులు ఇచ్చారట.తదుపరి వైఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం, పులిచింతలతో సహా వివిధ ప్రాజెక్టులు చేపట్టి, పూర్తి చేస్తామని ప్రకటించారు. తదనుగుణంగానే ఆయన భారీ ఎత్తున ప్రారంభించారు. అప్పట్లో పోలవరం ప్రాజెక్టును ఓ రకంగా చంద్రబాబు వ్యతిరేకించారు. ఆ ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఉన్నాయని అప్పట్లో ఒక టీవీ చానల్‌తో అన్న వీడియో ప్రస్తుతం సర్కులేషన్‌లోకి వచ్చింది. అలాగే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కాదన్న అభిప్రాయంతో దానిని చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి విదేశాల నుంచి కొండలు తొలిచే యంత్రాలను తెప్పించి సొరంగాల నిర్మాణం ఆరంబించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. దీనిని చంద్రబాబు కాదనగలరా అన్నది ఒక ప్రశ్న. వైఎస్ మరణంతో ఈ ప్రాజెక్టులలో జాప్యం జరిగిన మాట వాస్తవం. తదుపరి రాష్ట్ర విభజన, ఏపీకి 2014లో చంద్రబాబు సీఎం కావడం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా ఆయన వాడుకోలేకపోయారు. వెలిగొండపై పెట్టవలసినంత శ్రద్ద పెట్టలేకపోయారనిపిస్తుంది. కాకపోతే వ్యయ అంచనాలు పెంచేయడం ద్వారా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చారన్న విమర్శ వచ్చింది.ఇవి కూడా చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?వైఎస్ రాజశేఖర్‌రెడ్డి టైమ్‌లో సుమారు 20 కిలోమీటర్ల సొరంగం తీయడమే కాకుండా, రిజర్వాయిర్‌ను చాలావరకు ముందుకు తీసుకువెళ్లారు. చంద్రబాబు టైమ్‌లో కేవలం సుమారు ఆరు కిలోమీటర్లకే టన్నెల్ తవ్వారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ పది కిలోమీటర్ల టన్నెళ్లను పూర్తి చేసి, అవసరమైన ముఖ్యమైన కాల్వలను తవ్వించారు. తదుపరి వాటిని జాతికి అంకితం చేశారు. అయితే మానవత్వ కారణాలతో రిజర్వాయిర్ నిర్మాణం వల్ల నిర్వాసితులు అయ్యేవారికి పూర్తి స్థాయిలో పరిహారం, సహాయం అందించి వారు సెటిల్ అవడం కోసం నీళ్లను వదలే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జగన్ తిరిగి గెలిచి ఉంటే బహుశా 2024 జూన్, జూలైలలో ఆ పని కూడా అయిపోయేదేమో! కాని ఎన్నికలలో ఓటమి ఎదురవడంతో ఆగిపోయింది.కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లపాటు ముందుకు సాగలేదు. ఒక మిషన్ టన్నెల్లో విరిగిపోయిందని, ఆ కాంట్రాక్టర్ స్టే తెచ్చుకున్నారని చంద్రబాబు చెబుతున్నారు. కాని అది సాకేనేమో అనిపిస్తుంది. నిర్వాసితులకు 2024లోనే ఎందుకు పరిహారం ఇవ్వలేకపోయారు? గ్రామాలను ఖళీ చేయించలేదు? ఒక టన్నెల్ ద్వారా అయినా నీటిని ఇచ్చి ఉండవచ్చు కదా! అలా చేస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డికు, జగన్‌కు జనం క్రెడిట్ ఇస్తారన్న ఉద్దేశంతోనే ఆ పని చేయలేదన్నది వైఎస్సార్సీపీ విమర్శ. ఇప్పటికీ నిర్వాసితులు సెటిల్ కాకముందే నీటిని వదలడంతో ఎన్ని వందల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయన్నది తెలిసిన విషయమే.బాధితులు మంత్రిని, కలెక్టర్ తదితర అధికారులను నిలదీసిన, ఆగ్రహం వ్యక్తం చేసిన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సందర్భంలో ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌ల కృషిని కూడా అభినందించి ఉంటే, చంద్రబాబుకు వయసుకు తగ్గట్లుగా హుందాగా ఉండేది. అలా చేయకపోగా వైఎస్సార్సీపీపైన ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు చేయడం బాగోలేదు. 1996-2004 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసింది కేవలం పది లక్షలేనని, అది కూడా శంకుస్థాపన సభ ఏర్పాట్ల కోసమేనని జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఒక్కదానికి చంద్రబాబు సమాధానం చెప్పగలిగితే, ఆయన ప్రభుత్వం ఏ మేరకు పనిచేసింది అర్థం అవుతుంది. శ్రీశైలంలో కనీస నీటి మట్టంగా 834 అడుగులుగా నిర్ణయిస్తూ చంద్రబాబు జీఓ ఇచ్చారు. ఇదే కొనసాగి ఉంటే అసలు వెలిగొండకు నీరు వచ్చే అవకాశమే ఉండదట. వైఎస్ ప్రభుత్వం దానిని 854 అడుగులకు పునరుద్దరించడంతో వెలిగొండతో పలు రాయలసీమ ప్రాజెక్ట్‌లకు నీరు అందించగలిగే పరిస్థితి వచ్చిందన్నది నిజమా? కాదా? టన్నెల్ తవ్వడానికి భారీ యంత్రాన్ని తెప్పించింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాదని అనగలరా!ఇప్పుడు చంద్రబాబు చేయవలసింది వెలిగొండ రెండో దశ కూడా పూర్తి చేసి నిర్దిష్ట లక్ష్యం ప్రకారం సమారు ఐదులక్షల ఎకరాలకు నీరవ్వడం. అది చేసి, ఆ క్రెడిట్ తనదేనని చెప్పుకుంటే అభ్యంతరం లేదు. ఇది ఎంతవరకు జరుగుతుందన్నది చెప్పలేం. వెలిగొండ సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రత్యేకించి రప్పించి జగన్‌ను దూషింపచేయడం మరీ దారుణంగా ఉంది. ఇదే మాగుంట గతంలో జగన్ టన్నెళ్ల ప్రారంభోత్సవం చేసినప్పుడు ఎంపీగానే ఉన్న సంగతి మర్చిపోయారా! లేక చంద్రబాబు మెప్పుకోసం తన మాగుంట కుటుంబ పరువును రోడ్డున పడేశారా అని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు.మరో అంకం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేయడం. వైఎస్ చేపట్టిన భారీ ప్రాజెక్టులను ఊహజనితం అని ఆ రోజుల్లో చంద్రబాబు విమర్శించేవారు. కాని సాష్టాంగ నమస్కారం చేయడం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు ఊహాజనితం కాదని, వాస్తవమని చంద్రబాబుకు అర్థం అయి ఉండాలి. చంద్రబాబు వెలిగొండ చరిత్రలో చివరిలో అయినా ఒక భాగం అయ్యారు. అంతవరకు ఓకే. కాని చరిత్రను సృష్టించింది మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లే అన్నది పచ్చి నిజం. వెలిగొండ నీటిలో కనిపించేది వైఎస్ రాజశేఖరరెడ్డి నీడే అన్నది అర్థం అవుతూనే ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
బాబు పబ్లిసిటీపై YS జగన్ ఆగ్రహం
-
నేడు కర్నూలుకు వైఎస్ జగన్
కర్నూలు(టౌన్): మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, విజయమనోహరి దంపతుల కుమారుడు జనక్దత్తారెడ్డి, శ్రీయల వివాహ రిసెప్షన్‌కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు. ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి 11.40 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 12 గంటలకు సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించి 20 నిమిషాలు అక్కడే ఉంటారు. అనంతరం 12.35 గంటలకు తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళతారు. రిసెప్షన్‌కు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరవుతున్నారు. -
పోలవరంపై మీ డ్రామాలు ఆపండి బాబూ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి.. ఇప్పటికే ఉన్న పంపుల ద్వారా గోదావరి నీటిని ఎత్తి, వైఎస్సార్ హయాంలో నిర్మించిన పోలవరం ఎడమ కాలువలోకి వదిలి, తామేదో ‘పోలవరం నీళ్లు ఉత్తరాంధ్రకు తెచ్చేశాం’ అంటూ డప్పు కొట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అవి పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు కావని అందరికీ తెలిసినా ప్రచారం మాత్రం వేరే లెవల్లో చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న క్రెడిట్ చోరీపై ఈ మేరకు వైఎస్ జగన్ తన ‘ఎక్స్’« ఖాతా ద్వారా ధ్వజమెత్తారు. ‘నీళ్లు పురుషోత్తపట్నానివి.. కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించింది.. మరి ఇందులో తాను చేసిందేమిటి? క్రెడిట్ కోసమే బాబు ఆరాటం..’ అని ట్వీట్లో దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...బాబు పబ్లిసిటీ ఈవెంట్లుసాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ.. ఇవాళ పోలవరం ఎడమ కాలువ.. ఇంకోరోజు ఇంకోటి. మీరు మొదలు పెట్టని, మీరు పూర్తి చేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరే అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే. ఒకవేళ అరకొర పనులు చేసినా, అవి కూడా అంచనాలు పెంచేసి దోచేయడానికే. ఏ సాగునీటి ప్రాజెక్టును తీసుకున్నా మీ మోడస్ ఆపరెండీ, మీ ధోరణి, మీ నైజం ఇదే.అంతా నేనే చేశానని చెప్పుకోవడం మీకే చెల్లిందిపురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు. ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవి కాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా? అసలు పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79% పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తైతే, ఇప్పుడు.. పూర్తయిన ఆ పనుల మీద నిలబడి ‘‘అంతా నేనే చేశా’’ అని చెప్పుకోవడం చంద్రబాబు గారూ మీకే చెల్లింది!మీ డ్రామాలు రాష్ట్రానికి శాపంపోలవరం విషయంలో 2014–19 మధ్య మీరు చేసిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పిదాలు, అవినీతి, దోపిడీ.. ఇవన్నీ రాష్ట్రానికి శాపంలా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందుచూపు, సరైన ప్రణాళిక, ప్రాధాన్యతలు పాటించకుండా, పద్ధతీ పాడూ లేకుండా మీరు తప్పులు చేస్తే, ఆ చేసిన తప్పులను సరిదిద్దడానికి మా ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారు. చివరకు స్పిల్‌వే పనులు పూర్తి కాకుండానే, నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండానే, మెయిన్ డ్యాం పునాది పనుల్లో భాగమైన డయాఫ్రం వాల్ చేపట్టారు. మీరు చేసిన తప్పుల వల్ల, మీ నిర్వాకాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడం ఒక్కటే కాకుండా.. వరదల వల్ల వచ్చిన నీరు, అప్పటికి పాక్షికంగా చేసిన స్పిల్‌వే ద్వారా డైవర్ట్ కాక, ఎగువన అరకొరగా చేసిన కాఫర్ డ్యాంవల్ల, ఆ గ్యాప్‌ల ద్వారా నీరు చొచ్చుకుని వచ్చి, మెయిన్ డ్యాం కింద పునాదులు, అంటే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయి నష్టం కూడా జరిగింది. వీటన్నింటినీ సరిదిద్దుతూ ముందుగా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వే పనులు, కాఫర్ డ్యాంలను పూర్తిచేసి, ఆ తర్వాత మెయిన్ డ్యాం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకెళ్లాం. పోనీ ఇప్పుడైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రాజెక్టును మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారు.ముందు పోలవరం ఎత్తు సంగతి తేల్చండిఅన్నింటికంటే ముఖ్యంగా పోలవరం ఎత్తు సంగతి తేల్చండి చంద్రబాబు గారూ. పోలవరం ఎఫ్ఆర్ఎల్ 45.72 మీటర్లు అయితే, నీటినిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. తాము 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. మరి పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారు? నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి చంద్రబాబు గారూ?ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా?మరోవైపు ఉత్తరాంధ్రకు గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి వచ్చే నీళ్లతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిపోతుందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేంటి? ఈ స్కీమ్‌కు వైఎస్సార్ గారు 2009లోనే రూ.7,214.10 కోట్లతో పరిపాలనా అనుమతి ఇస్తే.. మారిన ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో మా ప్రభుత్వంలో రూ.17,050.20 కోట్లకు అంచనాలను సవరించి పరిపాలనా అనుమతి ఇచ్చాం. కీలకమైన ప్యాకేజ్–1, ప్యాకేజ్–2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశ వరకు తీసుకెళ్లాం. భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు కూడా ఏర్పాటు చేశాం. మరి మీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా? పనులపై దృష్టి పెట్టండిచంద్రబాబు గారూ.. పోలవరం విషయంలో డ్రామాలు మానండి. పనులపై దృష్టి పెట్టండి. 41.15 మీటర్లు కాకుండా, 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులో పోలవరాన్ని పూర్తి చేయండి. దీనివల్ల పూర్తిస్థాయి స్టోరేజీ సాధ్యపడుతుంది, తద్వారా పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడంతో పాటు పూర్తి గ్రావిటీతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు అందించగలుగుతాం. అప్పుడు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే గ్రావిటీతోనే పోలవరం ఎడమ కాలువతోపాటు కుడి కాలువలకు నీళ్లు పుష్కలంగా పంపగలం. మరి ఇది చేయకుండా ఇన్ని డ్రామాలు ఎందుకు? -
వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి, కడప: సంక్షేమ ప్రదాతగా, అభివృద్ధి విధాతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. తన మాతృమూర్తి, వైఎస్సార్ సతీమణి విజయమ్మ, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్న వైఎస్ జగన్.. తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం, పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. కొద్దిసేపు మౌనంగా కూర్చొని తండ్రిని స్మరించుకున్నారు. ఘాట్ ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలువైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ సుధీకర్‌రెడ్డి, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, చిన్నమ్మ వైఎస్ ప్రమీలమ్మ, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, డాక్టర్ మధుసూదన్, వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, సీఈసీ సభ్యుడు కె.సురేష్‌బాబు, జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ రామగోవిందరెడ్డి, పులివెందుల పరిశీలకులు పూల శ్రీనివాసరెడ్డి, కమలాపురం, కదిరి ఇన్‌ఛార్జిలు నరేన్ రామాంజులరెడ్డి, మగ్బూల్‌బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాజోలి వీరారెడ్డి, నిత్యానందరెడ్డి, సొహైల్ అహ్మద్, గోసుల శివభరత్‌రెడ్డి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్‌రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎస్ఐ పాస్టర్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ డి.థామస్ బెన్హర్, పాస్టర్లు మత్యుంజయ, నరేష్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు.అభిమానులతో పోటెత్తిన వైఎస్సార్ ఘాట్ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన వైఎస్సార్ అభిమానులతో వైఎస్సార్ ఘాట్ పోటెత్తింది. పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని పూలమాలలు, పుష్పగుచ్ఛాలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూడగానే అభిమానులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్ అమర్ రహే అంటూ చేసిన నినాదాలతో ఘాట్ ప్రాంగణం మార్మోగింది. ప్రార్థనలకు వచ్చే సమయంలో, తిరిగి వెళ్లే సమయంలో వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ, కరచాలనం చేస్తూ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. -
చంద్రబాబూ.. ఇలా డప్పు కొట్టుకోవడం ఏంటి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం నీటిని పోలవరం నీళ్లంటూ ప్రచారం చేసుకోవటంపై మండిపడ్డారు. పోలవరానికి ఎవరి హయాంలో ఏం చేశారో లెక్కలతో సహా ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ తన ట్వీట్లో.. చంద్రబాబూ..ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి పంపుల ద్వారా గోదావరి నీటిని ఎత్తి పోలవరం ఎడమ కాలువలోకి వదిలారు. దాన్ని చూపిస్తూ ‘పోలవరం నీళ్లు తెచ్చేశాం’ అంటూ డప్పు కొట్టుకోవడం ఏంటి?’ పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు ఇవి కావనీ మీకూ తెలుసు, అందరికీ తెలుసు. కానీ ప్రచారం మాత్రం వేరే లెవల్. నీళ్లు పురుషోత్తపట్నానివి… కాలువ వైయస్సార్ హయాంలో నిర్మించినది… క్రెడిట్ కోసం ఆరాటం మాత్రం మీదా? ఇదేం మ్యాజిక్?‘చంద్రబాబూ.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ… ఇవాళ పోలవరం ఎడమ కాలువ… ఇంకోరోజు ఇంకోటి. మీరు మొదలుపెట్టని, మీరు పూర్తిచేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరు అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే. ఒకవేళ అరకొర పనులు చేసినా, అవి కూడా అంచనాలు పెంచేసి దోచేయడానికే. ఏ సాగునీటి ప్రాజెక్టును తీసుకున్నా మీ మోడస్ ఆపరెండీ, మీ ధోరణి, మీ నైజం ఇదే.పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు, ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా? అసలు పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79% పనులు వైఎస్సార్‌గారి హయాంలోనే పూర్తైతే, ఇప్పుడు ఆ పనులన్నింటి మీద నిలబడి “అంతా నేనే చేశా” అని చెప్పుకోవడం చంద్రబాబు మీకే చెల్లింది!రాష్ట్రానికి శాపంలా మారాయి.. పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014–19 మధ్య మీరు చేసిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పిదాలు, అవినీతి, దోపిడీ… ఇవన్నీ రాష్ట్రానికి శాపంలా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘‘మందుచూపు, సరైన ప్రణాళిక, ప్రాధాన్యతలు పాటించకుండా, పద్ధతీపాడూ లేకుండా మీరు తప్పులు చేస్తే, ఆ చేసిన తప్పులను సరిదిద్దడానికి మా ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారు. చివరకు స్పిల్‌వేకు పనులు పూర్తికాకుండానే, నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండానే, మెయిన్డ్యాం పునాది పనుల్లో భాగమైన డయాఫ్రంవాల్ చేపట్టారు. మీరు చేసిన తప్పుల వల్ల, మీ నిర్వాకాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడం ఒక్కటే కాకుండా, వరదల వల్ల వచ్చిన నీరు, అప్పటికి పాక్షికంగా చేసిన స్పిల్‌వే ద్వారా డైవర్ట్ కాక, ఎగున అరకొరగా చేసిన కాఫర్ డ్యాంవల్ల, ఆ గ్యాప్‌ల ద్వారా నీరు చొచ్చుకుని వచ్చి, మెయిన్ డ్యాం కింద పునాదులు, అంటే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయి నష్టంకూడా జరిగింది.వీటన్నింటినీ సరిదిద్దుతూ ముందుగా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వే పనులు, కాఫర్ డ్యాంలను పూర్తిచేసి, ఆ తర్వాత మెయిన్ డ్యాం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లాం, ప్రణాళికా బద్ధంగా. పోనీ ఇప్పుడైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రాజెక్టును మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారు పోలవరం ఎత్తు సంగతి తేల్చండి అన్నింటికంటే ముఖ్యంగా పోలవరం ఎత్తు సంగతి తేల్చాలి.‘‘పోలవరం FRL 45.72 మీటర్లు అయితే, నీటినిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. తాము 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. మరి పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారు? నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి చంద్రబాబు?మరోవైపు ఉత్తరాంధ్రకు గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి వచ్చే నీళ్లతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిపోతుందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేంటి? ఈ స్కీంకు వైఎస్సార్ 2009లోనే రూ.7,214.10 కోట్ల పరిపాలనా అనుమతి ఇస్తే, మా ప్రభుత్వంలో మారిన ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో రూ.17,050.20 కోట్లకు అంచనాలను సవరించి పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చాం. కీలకమైన Package-1, Package-2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశ వరకు తీసుకెళ్లాం. భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు కూడా ఏర్పాటు చేశాం. మరి మీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా?చంద్రబాబు.. పోలవరం విషయంలో డ్రామాలు మానండి. పనులపై దృష్టిపెట్టండి. 41.15 మీటర్లు కాకుండా, 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులో పోలవరాన్ని పూర్తిచేయండి. దీనివల్ల పూర్తిస్థాయి స్టోరేజీ సాధ్యపడుతుంది, తద్వారా పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడంతోపాటు, పూర్తి గ్రావిటీతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు అందించగలుగుతాం. అప్పుడు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే గ్రావిటీతోనే పోలవరం ఎడమకాల్వతోపాటు, కుడికాల్వకు నీళ్లు పుష్కలంగా పంపగలం. మరి ఇది చేయకుండా ఇన్ని డ్రామాలు ఎందుకు?’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు..@ncbn గారూ… ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి, ఆ ఇప్పటికే ఉన్న పంపులతో గోదావరి నీటిని ఎత్తి, ఇప్పటికే ఉన్న పోలవరం ఎడమ కాలువలో వదిలి, దాన్ని చూపించి “పోలవరం నీళ్లు తెచ్చేశాం” అంటూ డప్పు కొట్టుకోవడం ఏంటి? పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు ఇవి కావనీ మీకూ… pic.twitter.com/Wplm9CrzTh— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2026 -
భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్
-
పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?
పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగానే సిద్దం అవుతోందా?వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రకటిస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే. కాని ఆ ప్రాజెక్టును తొలుత ప్రతిపాదించిన విధంగా కాకుండా నిర్ధిష్ట లక్ష్యంలో నాలుగో వంతుకే పరిమితం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటా అన్నది పెద్ద చర్చగా ఉంది. 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి గాను రూపొందించిన ఈ ప్రాజెక్టు తాజాగా కేంద్రం ప్రకటించిన ప్రకారం కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీరు అందించగలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దీనికి ఎవరు బాద్యత వహించాలి?. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తున నిర్మించాలని తొలుత భావించగా, ఇప్పుడు దానిని 41.15 మీటర్లకే పరిమితం చేయబోతున్నారన్నది వస్తున్న సమాచారం. దీనికి తొలిదశ అని పేరు పెట్టి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పార్లమెంటుకు ఇస్తున్న సమాచారం పరిశీలిస్తే,ఈ ఎత్తు వరకే కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎల్లో మీడియా మాత్రం దీనిని కవరప్ చేస్తూ ఇది తొలిదశ అయినా, తర్వాత కూడా పనులు సాగించుకోవచ్చని చెబుతోంది. కాని అందుకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలి? ఈ మొత్తం ఎపిసోడ్‌ను పరిశీలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014-2019 టర్మ్‌లో తీసుకున్న ఒక నిర్ణయమే ఈ పరిస్థితికి కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మించి ప్రజలకు అందించాలి. కాని చంద్రబాబు అప్పట్లో కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రమే నిర్మిస్తుందని చెప్పి కేంద్రాన్ని ఒప్పించారు.ప్రత్యేక హోదా డిమాండ్‌ను చంద్రబాబు వదలుకుని పోలవరం కాంట్రాక్టును తీసుకున్నట్లయిందని అప్పట్లో ప్రతిపక్షం విమర్శించేది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టైమ్‌లో ఈ ప్రాజెక్టుకు 45.72 మీటర్ల ఎత్తును కేంద్రంతో ఖరారు చేయించి, తదనుగుణంగా నిధులు మంజూరుకు ఒప్పించారని చెబుతారు. ఇందుకు తగినట్లుగా స్పిల్వేని ఆ స్థాయిలో నిర్మాణం చేయించారు. జగన్ ప్రభుత్వం రెండు దశలలో నిర్మాణం జరుగుతుందని చెబితే విపక్షంగా ఉన్న తెలుగుదేశం తీవ్ర విమర్శలు గుప్పించింది. రెండేళ్ల క్రితం కూటమి అదికారంలోకి వచ్చాక తొలిదశతోనే ప్రాజెక్టును ముగించే పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగించే అంశమే. 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు పూర్తి అయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల స్థాయిలో అయితే 119 టీఎంసీల నీటిని నిల్వ చేయగలుగుతారు. ఇదే జరిగితే తొలుత అంచనా వేసినట్లు ఏడు లక్షల ఎకరాలకు పైగా నీటిని అందించడం సాధ్యం కాదు. అలాగే కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంద్ర సుజల స్రవంతి పూర్తి స్థాయిలో నీళ్లు అందించడం సాధ్యం కాకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. అలాగే విద్యుత్ ప్రాజెక్టును కూడా వరద వచ్చినప్పుడే నడపగలుగుతారు. ఒరిజినల్‌గా పోలవరం నిర్మాణానికి సుమారు 55 వేల కోట్లు అవసరం అని అంచనా వేశారు. కాని ఇప్పుడు దానిని సుమారు 30వేల కోట్లకే పరిమితం చేస్తున్నారట. ఆ లెక్కన మరో 12 వేల కోట్లు ఇస్తే సరిపోతుందన్నది కేంద్రం అభిప్రాయంగా ఉంది. దీనివల్ల ఏపీకి బాగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తుది దశ నిర్మాణాన్ని రాష్ట్రం నిజంగా కొనసాగిస్తే అదనంగా అయ్యే వ్యయం సుమారు 25 వేల కోట్లు ఉంటుంది. కేంద్రం దీనిని ఇస్తామంటే మంచిదే. కాని రాష్ట్రమే భరించవలసిరావచ్చన్న సందేహాలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని నిర్వాసితుల కోసం ఖర్చు చేయవలసి ఉంది. రెండో దశలో మునిగిపోయే ప్రాంతాన్ని తగ్గించడంవల్ల ఈ వ్యయం తగ్గించుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది.అదే జరిగితే ప్రాజెక్టు పర్పస్ నిర్వీర్యం అవుతుందన్న ఆందోళన ఉంది. కేంద్రం రెండో దశకు కూడా నిధులు ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడా అధికారికంగా చెబుతున్నట్లు కనిపించడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తోంది. దీనివల్ల తమ భూభాగం మునుగుతుందన్నది ఆ రాష్ట్ర వాదన. నిజానికి ప్రాజెక్టును వైఎస్సార్ ప్రతిపాదించి, వివిధ అనుమతులు సాదించినప్పుడే వాటన్నిటిని లెక్కించి చాలావరకు పరిహారం ఇప్పించారు. తదుపరి ఆయన అనూహ్య మరణంతో మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఉమ్మడి ఏపీ విభజన జరిగింది. ఈ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుందని తెలిపినా, చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో కేంద్రం నుంచి తీసుకోవడం ఒక చారిత్రక తప్పిదంగా చెబుతారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ విమర్శలు చేస్తూ పోలవరాన్ని చంద్రబాబు అవినీతి ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. అంతేకాక కాఫర్ డామ్ పూర్తిగా నిర్మించకుండా రెండు గాఫ్ల్ పెట్టి డయాఫ్రం వాల్ నిర్మాణానికి పూనుకోవడం, భారీ వరదల కారణంగా ఆ వాల్ దెబ్బతినడం వంటి ఘటనలు జరిగాయి. చంద్రబాబు తాను చేసిన తప్పులను జగన్ ప్రభుత్వంపై నెట్టివేయడం చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాఫర్ డామ్ ఎడమవైపు పది అడుగుల వెడల్పు, ఏడు నుంచి ఎనిమిది అడుగుల లోతున జారిందని ఎల్లో మీడియానే రిపోర్టు చేసింది. దీనిని కొంత కవర్ అప్ చేసే యత్నం చేస్తూ కధనాన్ని ఇచ్చింది. అదే జగన్ టైమ్ లో ఇలాంటి ఘటన జరిగి ఉంటే, టీడీపీ, ఎల్లో మీడియా రచ్చ రచ్చగా ప్రచారం చేసేవి. కాగా డయాఫ్రం వాల్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని సెంటర్ ఫర్ లిబర్టి ప్రతినిధులు ఎబి వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి చెబుతున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలిదశ పూర్తి చేసి మమ అనిపించుకుంటారా? లేక పోలవరం ప్రాజెక్టు రెండో దశ కొనసాగించగలుగుతారా అన్న సందేహాన్ని నివృత్తి చేయవలసి ఉంది. చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై అంత నమ్మకం లేదు. ఇదే విషయాన్ని గతంలో ఆయన చెబుతుండేవారు. టీడీపీ నేతలుగా ఉన్న వడ్డి వీరభద్రరావు, ఎర్రా నారాయణస్వామి వంటివారు ఈ ప్రాజెక్టు కోసం నిత్యం పోరాడేవారు. అయినా వారిని చంద్రబాబు పట్టించుకునేవారు కాదు. భారీ ప్రాజెక్టుల వల్ల రాజకీయ లబ్ది వెంటనే ఉండదన్నది ఆయన భావనగా ఉండేది. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం మాత్రమే కాకుండా సుమారు 48 ప్రాజెక్టులను ఆ రోజుల్లో జలయజ్ఞం పేరుతో సంకల్పించారు. దానిపై టీడీపీ విమర్శలు చేస్తుండేది. విభజన తర్వాత మాత్రం అప్పటికే నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు తన కల అని చంద్రబాబు చెప్పడం ఆరంభించారు.నిజంగా ఆయన కలే అయితే చిత్తశుద్దితో 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయగలగాలి. చంద్రబాబు ఆ పని చేసి చూపిస్తారా!. లేక దీనితోనే మాయ చేస్తారా? అన్నది చూడాలి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
LIVE: YSRకు జగన్ నివాళులు
-
లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం
-
Idupulapaya: YSR ఘాట్ వద్ద జగన్ నివాళులు
-
YSR ఘాట్ వద్ద వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు
-
వైఎస్సార్‌ను తలచుకుంటూ వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, పలువురు నేతలు ఆయన్ని స్మరించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశారు. “మిస్ యూ ఆల్వేస్, డాడ్! యూ విల్ ఫరెవర్ బీ మై ఇన్స్పిరేషన్” అంటూ తండ్రిని తలచుకున్నారు.వైఎస్సార్ తనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని జగన్ పేర్కొన్నారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన జ్ఞాపకాలను స్మరించారు. అంతకు ముందు.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో, పార్టీ కేడర్‌తో కలిసి నివాళులర్పించిన విషయం తెలిసిందే.Miss you always, Dad! You’ll forever be my inspiration. pic.twitter.com/4e9pkYxlem— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2026ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన ఆయన.. ప్రజల మనసుల్లో ‘వైఎస్సార్’ను చిరస్థాయిగా నిలబెట్టింది. అయితే 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఆయన మృతికి నేటితో పదిహేడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌ను స్మరించుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో నివాళులర్పిస్తున్నారు.ఇటు వైఎస్సార్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆయన అడుగుజాడల్లోనే సంక్షేమానికి పెద్దపీట వేశారు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఏపీకి ముఖ్యమంత్రిగా పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, వివిధ వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.ఇదీ చదవండి: మరపురాని మహానేత -
నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు)
-
Kadapa : YSRకు వైఎస్ జగన్ ఘన నివాళి
-
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రార్థనలకు.. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.వైఎస్సార్ వర్థంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వైఎస్సార్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆశయాలు సాధిస్తాం.. జోహార్ వైఎస్సార్ అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇదీ చదవండి: మరపురాని మహానేత.. జల ప్రదాత వైఎస్సార్ -
పులివెందుల : భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ (ఫొటోలు)
-
స్థానిక సంస్థల ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకోండి
సాక్షి ప్రతినిధి, కడప: ‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్సీపీ నేతలు చాలెంజ్‌గా తీసుకోవాలి. ప్రతి చోటా నాయకులు కేడర్‌కు అండగా నిలవాలి. అధికార బలం, పోలీసులను అడ్డుపెట్టుకొని ఏకగ్రీవాలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలి’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వినతులు సమర్పించారు. వైఎస్ జగన్ వారి సమస్యలను ఓపికగా విన్నారు. వారికి భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే సిద్ధం కావాలి అనంతరం పార్టీ నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ ఛాలెంజ్‌గా తీసుకోవాలని వారికి చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని సూచించారు. ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీలో ఉండేలా ముందుగానే సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డులవారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు లొంగొద్దు అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ సూచించారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రతి కుటుంబానికి కలిగిన మేలును ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించండి ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు భిన్నంగా కూటమి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రజల మధ్యే ఉండాలని, వారి సమస్యలపై పోరాడాలని, వైఎస్సార్సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తు చేయాలని చెప్పారు. అలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం అతి సునాయాసమని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని నిరంతరం కొనసాగించాలని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసి, ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. పోలీసుల వైఖరిపై వైఎస్ జగన్ ఆగ్రహం వైఎస్ జగన్ భాకరాపురం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సమయానికి ఆయన్ని కలిసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే వారెవ్వరూ క్యాంపు కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు మెయిన్ గేట్లు మూయించి, అడ్డుకోవడంతో వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. గేట్లు తెరవాలంటూ వాహనంలో నుంచే ఆదేశించారు. పోలీసులు గేట్లు తెరవడంతో బయట గంటల తరబడి వేచి ఉన్నవారంతా కార్యాలయంలోకి వచ్చారు. పులివెందులలో ఘన స్వాగతం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంగళవారం పులివెందులలో ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 11.50 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరకున్న ఆయనకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజాద్‌బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి, చవ్వా దుష్యంత్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.అనంతరం జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పూల శ్రీనివాసులరెడ్డి, కల్లూరు నాగేంద్రరెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, రాజోలి వీరారెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.అంబటి సురేష్‌ను పరామర్శిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబటి సురేష్ కుటుంబానికి అండగా ఉంటాంటీడీపీ నేతల దాడులకు భయపడాల్సిన అవసరం లేదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం పట్టణంలో ఇటీవల టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసి, దాడి చేసిన వైఎస్సార్సీపీ కమలాపురం వాణిజ్య విభాగం అధ్యక్షుడు, ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన అంబటి సురేష్ , ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి నరేన్‌రెడ్డి వారిని వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. సురేష్ , ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్ ఘటన వివరాలను తెలుసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పుత్తా నరసింహారెడ్డి అనుచరులు ఆరోజు తనపై చేసిన దౌర్జన్యాన్ని వైఎస్ జగన్‌కు సురేష్ వివరించారు. కమలాపురంలో ఆర్వోబీ నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని గట్టిగా డిమాండ్ చేసినందుకే టీడీపీ ఎమ్మెల్యే పుత్తా అనుచరులు నడిరోడ్డుపైనే ఆటోలో కిడ్నాప్ చేసి, దాడి చేసి, ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్బంధించారని తెలిపారు. ఆటోలో తీసుకెళ్తూ తనపై దాడి చేశారని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కమలాపురం ఇన్‌ఛార్జి నరేన్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యాలయానికి బయల్దేరడంతో తనను విడిచిపెట్టారని సురేష్ తెలిపారు. సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు, దాడులు ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలు, ప్రజలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష కార్యకర్తలు, సామాన్య ప్రజలను బెదిరించే ప్రయత్నాలు జరిగితే పార్టీ వారికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. -
మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్
సాక్షి, అమరావతి: ‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదు.. కోట్లాది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరి. కాలువల ద్వారా జలసిరులు పారించి.. కరువును తరిమేసిన అపర భగీరథుడు వైఎస్సార్. నీటి చుక్కతో నవ్య చరిత్ర రాసిన జలప్రదాత వైఎస్సార్‌కు 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’అంటూ వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మరపురాని మహానేత .. జలప్రదాత డాక్టర్ వైఎస్సార్ అంటూ ఫొటోను ట్యాగ్ చేసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 2న ఉదయం పులివెందులలోని నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్‌వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం డాక్టర్ వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
రేపు కర్నూలుకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం(3వ తేదీ) కర్నూలులో పర్యటించనున్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరగనున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు చేసిందేమీ లేదు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు కోసం రెండుసార్లు శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. పైగా సాంకేతికంగా ఈ ప్రాజెక్టు ఏమాత్రం ఫీజుబులిటీ కాదని చంద్రబాబు పక్కన పెట్టేశారని గుర్తుచేశారు. కానీ నేడు ఈ ప్రాజెక్టు తన ఘనతే అంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. 1996లోనే కాదు ఆ తర్వాత కూడా ఈ ప్రాజెక్టు కోసం శంకుస్థాపనల డ్రామా ఆడిన చంద్రబాబు ఆ తర్వాత ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదని చెప్పారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ తర్వాత రెండుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు దీన్ని ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.2004లో డాక్టర్ వైఎస్సార్ సీఎం అయిన తర్వాత చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నరసరావుపేటలో శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ర్యాలీగా వెళ్తున్న సమయంలో స్థానిక కమ్యూనిస్టు నేతలు ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టాలని కోరారని తెలిపారు. పూల సుబ్బయ్య పేరు పెడితే ఏమైనా అభ్యంతరమా? అని వైఎస్సార్ పక్కనే ఉన్న తమను అడిగారని, తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో అక్కడికక్కడే పూల సుబ్బయ్య పేరు ఈ ప్రాజెక్టుకు పెడుతున్నట్టు ప్రకటించారని వివరించారు. ఆరోజు వైఎస్సార్ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టకపోతే ఈరోజు చంద్రబాబు ప్రారంభించే పరిస్థితి వచ్చేదే కాదన్నారు. వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం కింద 2004–09 మధ్య ఈ ప్రాజెక్టు పనుల్ని పరుగులు పెట్టించారని, మొత్తం 37.587 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మించాల్సి ఉండగా దాదాపు 20.333 కిలోమీటర్ల మేర నిర్మించారని చెప్పారు. వైఎస్సార్ మరణం తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. 2014–19 మధ్య చంద్రబాబు కేవలం 6.686 కిలోమీటర్ల మేర మాత్రమే సొరంగాలు పూర్తిచేశారని చెప్పారు. అనంతరం సీఎం అయిన వైఎస్ జగన్ మిగిలిన 10.568 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు పూర్తిచేయడమే కాకుండా డ్యామ్ పనులు కూడా చేపట్టారని తెలిపారు. సొరంగాల పనులు పూర్తిచేసిన వైఎస్ జగన్ 2024 మార్చి 6న వాటిని జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరిగాయన్నారు. ఈ ప్రాజెక్టు పేరు చెబితే ఈ ప్రాంత ప్రజలు దివంగత వైఎస్సార్‌తో పాటు ఆయన తనయుడు జగన్‌ను గుర్తుచేసుకుంటారని చెప్పారు. మాగుంట ఇంత దిగజారతాడనుకోలేదు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఇంత నీచానికి దిగజారతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని రాజమోహన్‌రెడ్డి చెప్పారు. వెలిగొండ ప్రారంబోత్సవ సభలో వైఎస్ జగన్‌ను ఉద్దేశించి మాగుంట మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మాగుంట కుటుంబానికి రాజకీయభిక్ష పెట్టింది దివంగత వైఎస్సార్ అని గుర్తుచేశారు. వైఎస్సార్‌తో పాటు ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ వల్ల రాజకీయంగా లబ్ధి పొందిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని తానెప్పుడూ ఊహించలేదని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు మాగుంట నోటి వెంట విన్నప్పుడు ఆయన రాజకీయంగా పతనమైపోయాడేమో అనిపించిందన్నారు. మాగుంట వ్యాఖ్యలను ప్రజలు ఏమాత్రం హర్షించరని చెప్పారు. రాజకీయంగా మాగుంటకు ఇది మాయనిమచ్చగా మిగిలిపోతుందని మేకపాటి పేర్కొన్నారు. -
గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా?
సాక్షి, అమరావతి: విశాఖపట్నం మారిక వలసలోని గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులను వారికి నచ్చిన చోట చదువుకోనివ్వాలని హితవు పలికారు. ఈ పాఠశాల తరలింపునకు నిరసనగా విద్యార్థులు, తల్లిదండ్రులకు బాసటగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులపై దమనకాండకు పాల్పడడం సరికాదన్నారు. ‘తల్లిదండ్రుల పోరాటానికి మద్దతుగా నిలిచేందుకు వస్తున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మీద అనుచిత ప్రవర్తనకు తెగబడతారా? పోలీసు బలంతో వారి గొంతు నొక్కేయడానికి ఈ స్థాయికి దిగజారుతారా? ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నాయకులను గృహ నిర్బంధం చేస్తారా? వారు చేసిన తప్పేమిటి?’ అని నిలదీశారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ హయాంలోనే గురుకులాలు ఏర్పాటు‘విశాఖపట్నం మారిక వలస వద్దనున్న గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలిచి, వారి తరఫున గొంతెత్తడం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే వారు చేసిన నేరమా? ప్రభుత్వం, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. మారిక వలస స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నా, వారి అభ్యంతరాలను వినే ఓపిక ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అసలు ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్సార్ హయాంలో ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సలహాలు, సూచనలతో దేశంలోనే ప్రతిష్టాత్మక ఎన్ఐటీ, ఐఐటీ లాంటి విద్యాసంస్థల్లో ఎస్టీ విద్యార్థులు ప్రవేశం పొందేలా స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కింద 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన బోధన అందించేలా ఏడు గురుకులాలను ఏర్పాటు చేశారు. క్వాలిఫైడ్ టీచర్స్‌ను పెట్టి, ఈ టీచర్లకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి వారి ద్వారా మంచి శిక్షణ ఇప్పించడం వల్ల గిరిజన విద్యార్థులు ఆయా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందారు.మా హయాంలో ఎన్నో సౌకర్యాలు సమకూర్చాం మా ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా వీటిలో మరిన్ని సౌకర్యాలను సమకూర్చి, మరింత అభివృద్ధి చేయడమే కాకుండా ఆన్లైన్ కోచింగ్, ఇంటరాక్టివ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా వారికి అందించే బోధనను మరింత మెరుగుపర్చాం. మంచి ఫలితాలను కూడా సాధించాం. ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందే గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.40 వేలతో పాటు వారికి ల్యాప్‌ట్యాప్‌లు కూడా ఇచ్చాం. ఇప్పుడు వీటన్నింటినీ పట్టించుకోకుండా బాగా నడుస్తున్న పాఠశాలల్లో విద్యార్థులను బలవంతంగా తరలించి ఎందుకు వారిని కష్టపెడుతున్నారు? విశాఖ లాంటి నగరంలో గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా? నెల్లూరు జిల్లాలోని కోటలో కూడా ఎస్సీ గురుకులం నుంచి వందల మంది విద్యార్థులను విద్యా సంవత్సరం మధ్యలోనే హడావిడిగా తరలించేశారు.గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?మొత్తం 4 గురుకులాల నుంచి దాదాపు 2 వేల మందికి పైగా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ, వారిని చెల్లాచెదురు చేసేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటారా? చంద్రబాబూ.. మీరు, మీ సుపుత్రుడి తలతిక్క పనులతో విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నారు. మీరు పెడతామంటున్న కొత్త వాటిలో ఇంటర్మీడియట్ నుంచి ప్రత్యేక శిక్షణ అంటున్నారు. కానీ జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షల్లో రాణించాలంటే ఆ పరీక్షలు రాసే వారికి పునాది కనీసం 8వ తరగతి నుంచే ఉండాలి కదా? అలాంటి కాన్సెప్ట్‌తో పెట్టిన స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను నిర్వీర్యం చేయడం సరికాదు. ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యంతరాలను విని, ఆ పిల్లలకు నచ్చిన చోట చదువుకోనివ్వండి. గిరిజన మహిళా నాయకుల పట్ల మీ అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పండి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
పులివెందుల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగావివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు మహిళలు, యువతులు వైఎస్ జగన్‌ను కలిసి రాఖీలు కట్టి తమ అభిమానం, ఆప్యాయతను చాటుకున్నారు. వారందరితో ఆత్మీయంగా మాట్లాడి వైఎస్ జగన్.. సోదరుడిలా ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ప్రజాదర్బార్‌కు వచ్చిన మరికొంత మంది తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, వాటికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వైఎస్ జగన్‌ను కలిశారు. -
ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు: వైఎస్ జగన్ కీలక సూచనలు
పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది. భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు.స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని అన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ‘‘వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలి. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలి.కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల మధ్యే ఉండాలి... వారి సమస్యలపై పోరాడాలి... వైఎస్సార్సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తుచేయాలి. అలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం కష్టం కాదు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం కొనసాగించాలి. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సిద్ధం కావాలి. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేసి, ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
YS జగన్ కు ఘన స్వాగతం
-
కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...
-
నీటి విడుదల ప్రారంభమైందో లేదో.. వెలిగొండలో అపశ్రుతి..!
-
నేడు, రేపు పులివెందుల లో వైఎస్ జగన్ పర్యటన
-
వెలిగొండ సొరంగంలో దూరి అడ్డంగా బుక్కైన చంద్రబాబు
-
పులివెందులలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు. ఇవాళ, రేపు (సెప్టెంబర్ 1,2) పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద వైఎస్ జగన్‌కు వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు.భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బసచేస్తారు. రెండో తేదీ ఉదయం 7.45కు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
నేడు, రేపు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు. 2న ఇడుపులపాయలో జరిగే దివంగత సీఎం వెఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. తొలుత.. సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బసచేస్తారు. రెండో తేదీ ఉదయం 7.45కు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
పులివెందులకు YS జగన్..
-
వెలిగొండ లెక్కలు బయటపెట్టే దమ్ముందా.. శ్రీకాంత్ రెడ్డి సంచలన కామెంట్స్
-
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి(మంగళవారం) నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న ఇడుపులపాయలో జరిగే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు.01.09.2026 షెడ్యూల్ ఇలా.. వైఎస్ జగన్ సెప్టెంబర్ 1న(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు.02.09.2026 షెడ్యూల్..సెప్టెంబర్ 2న ఉదయం పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.చదవండి: తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్టు బాబు అబద్ధాలు.. వెలిగొండలో క్రెడిట్ చోరీ -
విజయసాయి వ్యాఖ్యలపై మల్లాది విష్ణు కౌంటర్..
-
జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా...? బొప్పరాజు రియాక్షన్
-
వెలిగొండకు జగన్ అప్పుడే.. క్రెడిట్ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!
-
బాబూ... చెత్త ఎవరిది? సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు భలే ప్రకటనలు చేస్తుంటారు. వాటిని ఎల్లో మీడియా పరమ పవిత్రం అన్నట్లుగా ప్రముఖంగా ప్రచురించి ప్రచారం చేస్తుంటుంది. చంద్రబాబు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. అది ఏమిటంటే రాజకీయాలలో చెత్తను తొలగిద్దాం.. అని అన్నారు. మామూలుగా అయితే ఇది ఆహ్వానించదగిందే. కాని ఆయన లక్ష్యం వేరు. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన అనుకోవచ్చేమోకాని, వాటిని విన్నవెంటనే, పత్రికలలో చదివిన వెంటనే గుర్తుకు వచ్చేది అధికార పార్టీలో ఉండేవారు చేసే అక్రమాల గురించే కదా! ఆ విషయాన్ని ఆయన పట్టించుకోకుండా స్పీచ్‌లు ఇస్తుండడం విశేషం.మనం రాజకీయాలలో ఉన్నవారిని అలాంటి పదాలతో సంభోధించడం సరైన పద్దతి కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే. అసలు రాజకీయాలలో చెత్త అంటే ఏమిటో ఆయన ఒక నిర్వచనం ఇస్తే బాగుంటుంది కదా! ఎవరిపైన కేసులు ఉంటే వారు ఆ కోవలోకి వస్తారని అన్న భావనా? లేక ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే దానిని ఆ విధంగా పరిగణించాలన్న అర్థమా? ఎన్నికలలో డబ్బు ఖర్చు చేసేవారిపై వ్యాఖ్యలా?ఒక విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఈ స్పీచ్ ఇవ్వడానికి రెండు రోజుల ముందు జాతీయ స్థాయిలో ప్రజస్వామ్య సంస్కరణల వేదిక ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఏమి ఉంది? ఏపీలో 79 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయనే కదా! అంటే అత్యధిక సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల మీదే కదా! నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబుది నాలుగో స్థానం అని అందులో ప్రకటించారు. ఈయనపై 19 క్రిమినల్ కేసులు ఉంటే, కొన్ని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని రిపోర్టు చెబుతుంది. ఆయన శిష్యుడుగా గుర్తింపు పొందిన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు ఉన్నాయట. ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.వీటిలో పెక్కు రాజకీయపరమైన కేసులు ఉండవచ్చని వీరు వాదించవచ్చు. కాని ఎదుటి పక్షాలపై అలాంటి కేసుల ఆధారంగానే చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారే! అక్కడే వచ్చింది సమస్య. తాను ఎవరిపైన ఆరోపణ చేస్తే అందులో నిజం ఉందని అనుకోవాలన్నది ఆయన భావన. అదే తనపై ఎవరైనా ఆరోపణ చేస్తే ఎవరూ నమ్మకూడదన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివారిపై బురద వేయడమే పనిగా పెట్టుకున్నప్పుడు ఆ బురద తమపై కూడా పడే అవకాశం ఉంటుందని వారు గుర్తించాలి కదా! తనకు మీడియా బలం ఉంది కనుక తను చెప్పిందే జనంలోకి వెళుతుందని చంద్రబాబు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనకే నష్టం.ఇవి కూడా చదవండి: వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆయనను ఎద్దేవ చేస్తూ అనేక విషయాలను ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్‌తో పోస్టులు వస్తున్నాయి. గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీని అంటూ తన పార్టీని వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పిలిపించుకుంటున్నారు. మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు చాలా అనుచితంగా ఉంటున్నాయి. చంద్రబాబు తన హోదాను, సీనియారిటీని కూడా మర్చిపోయి ఏది పడితే అది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ప్రజలు నిజాయితీగా ఉంటే నాయకులు తప్పులు చేయరట. ఎన్నికలలో డబ్బు ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత ప్రజలదట. అది జరిగితేనే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందట. అంటే ఇప్పట్లో రాష్ట్రం స్వర్ణాంధ్ర కాదని పరోక్షంగా చెప్పినట్లు అనుకోవాలా? ఎంతసేపు ప్రజలను నిందిస్తున్నారే తప్ప, తాము డబ్బు పంచకుండా ఎన్నికలలో పోటీచేస్తామని మాటవరసకు చెప్పలేకపోతున్నారన్న విమర్శ వస్తోంది.సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే నేరుగా రాజకీయాలలో డబ్బు ప్రభావం తెచ్చిందే చంద్రబాబు అని స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అధినేత పీఏ వందల కోట్లు సంపాదించారని ఆయన ఏ ఆధారంతో చెప్పారో తెలియదు. కాని చిత్రం ఏమిటంటే స్వయంగా చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీబీటీడీనే రెండువేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు ప్రకటించింది. దాని గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా? స్కిల్ స్కామ్‌లో ఆయన పీఏ అరెస్టు కాకుండా అమెరికాకు పంపించిందెవ్వరో తెలియదా! స్కిల్ స్కామ్‌లో అప్పటి సీఐడీ చేసిన అభియోగాలపై ఎన్నడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాయింట్ వైజ్ వివరణ ఇచ్చి, తానేమి తప్పు చేయలేదని చెప్పి ఉండాలి కదా!ఈ స్కామ్‌లో ఏ అధికారులు అరెస్టు అయింది అందరికి తెలుసే. డీఎస్సీ, ఏపీపీఏస్సీ అంశాలను చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు ప్రస్తావిస్తూ తమ వాదన సమర్థించుకునే యత్నం చేస్తున్నా, జగన్ విసిరిన సవాల్, అంటే సీబీఐ విచారణకు సిద్దపడకపోవడం వారి బలహీనతగా కనిపించదా! నకిలీ మద్యంతో గత ప్రభుత్వంలో 30వేల మంది చనిపోయారని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం.విశేషం ఏమిటంటే కూటమి అధికారంలోకి వచ్చాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో ములకల చెరువు గ్రామం వద్ద టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్నే పెట్టిన విషయం బహిర్గతం అయింది. అలాంటివి ఏవైనా జగన్ టైమ్‌లో కనిపించాయా? అయినా ఈ ఆరోపణలు ఏమిటో! చంద్రబాబు స్పీచ్ ఇస్తున్న టైమ్‌లోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తీవ్ర ఆరోపణ చేశారే. ఈ రెండేళ్లలో 200 కోట్లు భూ దోపిడీ, ఇతరత్రా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరి వాటిపై విచారిస్తానని ఎందుకు చెప్పలేకపోయారు.అంతేకాదు. అదే ఎమ్మెల్యే తనకు ప్రతినెల మామూళ్లు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించినట్లు కూడా వార్తలు వచ్చాయే!విజయవాడ టీడీపీ ఎంపీ వర్గంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణల మాటేమిటి? గంజాయి, మట్టి, ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా అక్రమాలు చేస్తున్నదానిపై ఎన్ని ఆరోపణలు చేసింది ఆయనకు తెలియదా? వాటిపై చర్య తీసుకోకపోగా పార్టీ కమిటీ కొలికపూడిని పిలిచి మందలించిందని వార్తలు వచ్చాయే. ఇటీవలే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పోలీస్ స్టేషన్ అడ్డగానే దందాలు చేస్తున్నట్లు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారే. వారిద్దరు బహిరంగంగా మాట్లాడవద్దని సలహా ఇస్తే సరిపోతుందా!ఇక మహిళలను వేదించిన కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలను కనీసం పిలిచి కోప్పడ్డారా? ఒక మంత్రే తనను వేధించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ ఫిర్యాదు చేస్తే ఏమి చర్య తీసుకున్నారో ప్రజలకు తెలియచేసి ఉండాల్సింది కదా! ఇలా చెప్పుకుంటూ పోతే భారతం అంత అయ్యే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వ అద్వాన్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతుంది.ఇక మంత్రి లోకేష్ డీఎస్సీపై ఐదో సారి చర్చకు రమ్మన్నా రావడం లేదని సభలలో ఉపన్యాసాలు ఇచ్చి, జనం వాటినే నమ్మాలని తండ్రి మాదిరే అనుకుంటే ఎలా? జగన్ విసిరిన సీబీఐ సవాల్‌ను దమ్ముగా ఎదుర్కుని స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరగలేదని రుజువు చేసుకోవచ్చు కదా! చంద్రబాబు, లోకేష్‌లు తమను తాము పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ఎదుటివారిపై నిందలు మోపే ముందు, అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు అవి తమకు కూడా తగులుతాయేమో చూసుకుని మాట్లాడితే వారికే మంచిది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్
-
శిలాఫలకమే మీది.. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్‌ది
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ చరిత్రను మార్చేలా కొన్నాళ్లుగా సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారం, ఎల్లో మీడియా చేస్తున్న హడావుడి.. క్రెడిట్ చోరీ యత్నాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర చాలా స్పష్టం.. శిలాఫలకం మాత్రమే మీది.. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్ గారిది.. కీలక జంట సొరంగాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది.. ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ’ అంటూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు.. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టి.. నల్లమలసాగర్‌ను నింపి.. రైతులకు సాగునీరు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించాలని హితవు పలికారు. పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ ఆదివారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..నాన్న స్వప్నం సాకారం కావడం సంతోషంగా ఉంది..నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం.. మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం.. ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు వెలిగొండ ఒక సంజీవని. కానీ వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావుడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే. చంద్రబాబు గారూ వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం. శిలాఫలకం మాత్రమే మీది. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్ గారిది.. కీలక జంట సొరంగాల పూర్తి ఘనత మా ప్రభుత్వానిది.. ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ.1996 నుంచి 2004 వరకూ ఖర్చు చేసింది కేవలం రూ.పది లక్షలే.. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే.. చంద్రబాబు గారూ మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరు. 1996లో హడావుడిగా, అప్పట్లో ఎన్నికల ముందు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత 2004 వరకూ ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును ఒక్క అడుగూ ముందుకు తీసుకెళ్లలేదు. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చు చేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క వాస్తవమే చెబుతోంది.జలయజ్ఞంలో వెలిగొండకు సమగ్రరూపం ఇచ్చిన వైఎస్సార్వైఎస్సార్ గారు ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపమిచ్చారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్‌లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టి ప్రాజెక్టును సాకారం చేశారు. వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావు. వైఎస్సార్ గారు ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 2014–19 మధ్య మీ హయాంలో జరిగింది కేవలం 6.686 కిలోమీటర్లు. ఒక్క సొరంగానికి కూడా బ్రేక్‌త్రూ సాధించలేకపోయారు. మా ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తి చేశాం. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తిచేశాం. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశాం. హెడ్ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట్టి నీటి తరలింపునకు మార్గం అప్పుడే మేం సిద్ధం చేశాం. మరి మొత్తం ప్రాజెక్టును మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు? ఏ కాంట్రిబ్యూషన్ లేకుండానే మొత్తం క్రెడిట్‌ను కాజేయాలనుకోవడం మీ సహజ నైజానికి మరో నిదర్శనం కాదా?వెనుకబడిన ప్రాంతానికి తీవ్ర అన్యాయం..మరోవైపు మీరు అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. మేం చేపట్టిన పెద్దదోర్నాలలోని 131 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? వెనుకబడిన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మేం ప్రారంభించిన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు? ప్రభుత్వ రంగంలో పూర్తిచేయాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పేరుతో మీ వాళ్ల చేతుల్లో పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వెనుకబడిన ప్రాంతాలపై మీకున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? జంట సొరంగాలను మేం 2024లోనే సిద్ధం చేస్తే, 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు పూర్తిచేయలేదు? నల్లమలసాగర్‌కు నీటిని ఎందుకు తరలించలేదు? రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు, తాగునీటి ప్రయోజనాలను ఎందుకు ఆలస్యం చేశారు? మరోవైపు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా పూర్తిగా చెల్లించలేదు. ఇప్పటికే వందలాది కుటుంబాలు తమకు పునరావాస ప్యాకేజీ కింద అందాల్సిన డబ్బులు అందలేదని, అయినా బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారని, తమ ఊళ్లకు కరెంటు కట్ చేశారని, తాగునీటి సరఫరాను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా? చంద్రబాబు గారూ ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టండి. నల్లమలసాగర్‌ను నింపండి. రైతులకు సాగునీరు ఇవ్వండి. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించండి. పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తిచేయండి. -
‘వెలిగొండ’లో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండగా వెలిగొండ సొరంగాల తవ్వకాల పనులు జరిగింది కేవలం 6.686 కి.మీ...దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాల హయాంలో వెలిగొండ టన్నెళ్లలో తవ్వింది 30.901 కి.మీ...మరి ఎవరి హయాంలో వాయువేగంగా పనులు జరిగాయి? చంద్రబాబు క్రెడిట్ చోరీకి వేరే ఇంకేం సాక్షాలు కావాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు! విశాఖలో డేటా సెంటర్.. భూముల సమగ్ర రీ సర్వే,.. గత ప్రభుత్వం చేపట్టిన ఇతర కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకుంటున్న రీతిలోనే ఆయన దృష్టి తాజాగా ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. ఈ నెల 31న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాలు (ట్విన్ టన్నెల్స్) ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేస్తున్నానని.. మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తున్నానంటూ ‘ఎక్స్’ ద్వారా సీఎం చంద్రబాబు గొప్పగా అబద్ధాలు చెబుతుంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది. వాస్తవానికి వైఎస్సార్సీపీ హయాంలో రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెలిగొండలో అత్యంత సంక్లిష్టమైన, ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన జంట సొరంగాల(ట్విన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తి చేసి.. 2024 మార్చి 6న నాటి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు రూ.1,301.56 కోట్లతో పునరావాసం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. 96 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించి 2024 జనవరి నాటికే పునరావాసం కల్పించింది. మిగతా 7,225 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించి.. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే వైఎస్ జగన్‌కు పేరొస్తుందనే నిర్వాసిత కుటుంబాలకు 26 నెలలుగా పునరావాసం కల్పించకుండా.. నల్లమలసాగర్‌కు కృష్ణా జలాల తరలింపుపై చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తూ వచ్చిందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. నిర్వాసిత కుటుంబాలకు రూ.1,301.56 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.758 కోట్లను ఇటీవల బాబు సర్కార్ చెల్లించింది. బాబు సర్కారు జాప్యం వల్ల ప్రకాశం బ్యారేజీ మీదుగా 2024–25, 2025–26లో వరుసగా 848.96 టీఎంసీలు, 1,652.12 టీఎంసీల చొప్పున కృష్ణా వరద జలాలు సముద్రంలో కలిశాయని సాగునీటి రంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. టీడీపీ హయాంలో నాసిరకంగా ఫీడర్ కెనాల్ పనులు..గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఖరీఫ్ సీజన్లోనే కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు విడుదల చేసే అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు. జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన 5.2 కి.మీ.లలో గట్లు (ఎంబాక్‌మెంట్) పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2024లో కురిసిన వర్షాలకు టీడీపీ హయాంలో పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్ చానల్ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్‌వాల్, మిగతా చోట్ల కాంక్రీట్ లైనింగ్ పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. అస్మదీయ కాంట్రాక్టర్‌కు అధిక ధరలకు బాబు సర్కార్ కట్టబెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ముడుపులు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.‘కొండంత’ స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత వైఎస్సార్..⇒ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీ. పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్‌కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీళ్లు అందించాలని 1991–93లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు. ⇒ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్‌ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేల ఎకరాలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న పనులకు శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. ⇒ జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌కు అనుసంధానం చేసేలా 21.8 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేపట్టారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు.ఇంజినీరింగ్ అద్భుతం.. నల్లమలసాగర్ వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల(గ్యాప్)ను కలుపుతూ మూడు డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజ సిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటి రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్సార్ పూర్తిచేశారు.హామీని నిలబెట్టుకున్న వైఎస్ జగన్..⇒ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని తన పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వెలిగొండను పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. ⇒ 2014–19 మధ్య టీడీపీ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది (2021) పూర్తి చేయించారు. ⇒ రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి, టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ⇒ రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. తద్వారా రికార్డు సమయంలో 7.685 కి.మీల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేశారు. ⇒ శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ⇒ 2014–19లో టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమల సాగర్‌కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్‌కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు. ⇒ 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది. ⇒ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. ⇒ వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్ రూపొందించిన ప్రణాళికలో భాగంగా దొనకొండలో ఏర్పాటు చేసే మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు 2.58 టీఎంసీలు, పామూరు నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుపాక్చరింగ్ జోన్)కు 1.27 టీఎంసీల సరఫరాకు లైన్ క్లియర్ చేశారు. దొనకొండ, పామూరు ప్రాంతాల్లో పారిశ్రామికాభివృది్ధకి ఊతం ఇవ్వడం ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.అప్పుడూ ఇప్పుడూ బాబు సర్కార్ దోపిడీ..2014–19 మధ్య జరిగిన అక్రమాలను కడిగేసిన కాగ్⇒ ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు.. అదే ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండకు హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1996 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసమే వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.⇒ విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు సర్కార్ దోపిడీకి నిదర్శనం. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66. 44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం. ⇒ 2017.. 2018.. 2019.. ఇలా ఎప్పటికప్పుడు వెలిగొండ పూర్తి చేస్తామంటూ హామీలు ఇస్తూ వచ్చిన చంద్రబాబు రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు మరో కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో ఈ దోపిడీని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగి పారేసింది.


