సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Meet Sai Krishna Family Members Updates | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్‌ జగన్‌

Jun 18 2026 5:23 PM | Updated on Jun 18 2026 8:20 PM

Ys Jagan Meet Sai Krishna Family Members Updates

సాక్షి, విజయవాడ: కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మిని పరామర్శించి ఓదార్చారు. సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున దారుణ ఘటన జరిగిందని.. సీపీ, ఏసీసీ, సీఐ కూడా ఇందులో ఉన్నారని.. డీజీపీకి కూడా దీంతో సంబంధం ఉందన్నారు. ‘‘మే 9న సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. తన కొడుకు ఎక్కడున్నాడని ఈ తల్లి పోలీసులను అడిగింది. కొడుకును  చూపించమని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లని రోజు లేదు. నీ కొడుకు ఫొటోకు దండ వేసుకోమని ఆ తల్లికి చెప్పారు. 

..బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను చెత్తబుట్టలో వేశారు. సాయికృష్ణ తల్లితో బేరసారాలు చేశారు. సాయికృష్ణ తల్లి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ కూడా వేసింది. బాధితులకు మేం సపోర్ట్‌గా నిలబడ్డాం’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

‘‘గత్యంతరం లేక సీఐని సస్పెండ్‌ చేశారు. చంపారని ఒప్పుకున్నారు కాబట్టే సీఐని సస్పెండ్‌  చేశారు. ఒకరి కాదు.. ఇద్దరి చావుకు సీఐ నాగరాజు కారణమయ్యాడు. చంద్రబాబు మాత్రం  అతన్ని కేవలం సస్పెండ్‌ మాత్రమే చేశారు. సీపీ, ఏసీసీ, డీజీపీపై మర్డర్‌కేసు పెట్టాల్సింది పోయి.. కేవలం సీఐ నాగారాజును సస్పెండ్‌  చేసి చేతులు దులుపుకున్నారు. సాయికృష్ణ తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి. కానీ  పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపేశారు. సాయికృష్ణ కేసుపై  సీబీఐ విచారణ జరగాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌  చేశారు.

‘‘కంటితుడుపుగా సీఐ  నాగారాజును మాత్రమే సస్పెండ్‌ చేశారు. ఈ క్రైమ్‌లో సీఐ ఒక్కడినే బాధ్యుడిని చేయడం కాదు. నేరంలో సీపీ, ఏసీపీ, డీజీపీకి కూడా భాగం ఉంది. వీళ్లందరిపై మర్డర్‌ కేసు  పెట్టి శిక్షించాలి’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 

LIVE: YS Jagan గాదె సాయికృష్ణ ఇంటికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement