వెన్నుపోటుకు రెండేళ్లు.. రేపు వైఎస్సార్‌సీపీ నిరసనలు | YSRCP Protest Over Chandrababu Two Years Backstabbing IN AP | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుకు రెండేళ్లు.. రేపు వైఎస్సార్‌సీపీ నిరసనలు

Jun 11 2026 1:42 PM | Updated on Jun 11 2026 2:48 PM

YSRCP Protest Over Chandrababu Two Years Backstabbing IN AP

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తాడేపల్లి: రేపు(శుక్రవారం) ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తెలిపారు. దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడిన ప్రతీ వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

అలాగే, చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతామన్నారు. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement