ఫాదర్స్‌ డే.. వైఎస్సార్‌ను స్మరించుకున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan remembers YSR on Fathers Day | Sakshi
Sakshi News home page

ఫాదర్స్‌ డే.. వైఎస్సార్‌ను స్మరించుకున్న వైఎస్‌ జగన్‌

Jun 21 2026 9:23 AM | Updated on Jun 21 2026 11:45 AM

YS Jagan remembers YSR on Fathers Day

సాక్షి, తాడేపల్లి: నేడు ఫాదర్స్ డే. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రి దివంగత మహానేత వైఎస్సార్‌ను స్మరించుకుంటూ వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో తాను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వైఎ‍స్సార్‌ అని కొనియాడారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్‌ వేదికగా..‘నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వైఎస్సార్‌ గారు. ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి. నిస్వార్థంగా సేవ చేయాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ, ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇస్తున్నాయి. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను స్మరించుకుంటూ.. శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement