చంద్రబాబే పోలీస్‌.. చంద్రబాబే లాయర్‌ | YS Jagan Demand CBI Inquiry On Mega DSC Scam | Sakshi
Sakshi News home page

చంద్రబాబే పోలీస్‌.. చంద్రబాబే లాయర్‌

Jun 11 2026 12:06 PM | Updated on Jun 11 2026 12:32 PM

YS Jagan Demand CBI Inquiry On Mega DSC Scam

సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ పరీక్ష పేపర్‌ తయారీ దగ్గరి నుంచి.. ఫలితాల వెల్లడిదాకా ప్రతీ దశలోనూ నిబంధలను మీరి ప్రవర్తించారని.. ఇక్కడే అవకతవకలు జరిగాయని స్పష్టమవుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారాయన.

డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్‌ తయారీ, ప్రశ్నలు అప్‌లోడ్‌ చేయడం, డిజిటల్‌ నిర్వహణ ఇవన్నీకూడా అత్యంత గోప్యంగా జరగాలి.  కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు.  డీఎస్సీ క్వశ్చన్‌ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది. పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్‌ చూస్తారు.  కాని ఈ చంద్రబాబు ప్రభుత్వం  ఆ కన్వీనర్‌ను పక్కనపెట్టి, క్వశ్చన్‌ పేపర్ల తయారీ.. నిర్వహణ,  ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్‌కు అప్పగించింది. డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది, అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్‌..

రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్‌లోడింగ్‌ పని పనిని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో చేయించారు. ఎక్కడైనా పరీక్షల ఫలితాలను పారదర్శకంగా ప్రకటిస్తారు. కానీ బాబు పెట్టిన డీఎస్సీ మాత్రం ఎక్కడా డిస్‌ప్లే లేదు. సెలెక్టెడ్‌ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపారు. మార్కులు, కటాఫ్‌, ర్యాంకులు ఎక్కడా డిస్‌ప్లే చేయలేదు. ఆన్‌లైన్‌ పేరుతో మొత్తం ప్రక్రియ సెంట్రలైజ్‌ చేశారు. 1:1 రేషియోలో కాల్‌ లెటర్లు పంపారు.. 

.. నవీన్‌ అనే వ్యక్తి మెరిట్‌ సాధించాడు. అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదని ఉద్యోగం ఇవ్వలేదట. మెరిట్‌ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్‌ డేటాను మాయం చేసి, కాల్‌లెటర్‌ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడు?. నిజంగా మెరిట్‌ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు. తప్పు జరగకపోతే నవీన్‌ డేటా ఎందుకు తొలగించారు. అంటే తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?. ఒక కేండిడేట్‌కు ఫస్ట్‌ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్‌ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాడా?. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

 పేపర్‌ లీక్‌ దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారు. పేపర్‌ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్‌ యాక్సిస్‌ ఎవరి చేతుల్లో ఉంది. పేపర్‌ ఎంత మందికి లీక్‌ అయింది.. ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?. అన్నీ తేలాలి. ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నాం.రాష్ట్రంలో చంద్రబాబు పోలీస్‌.. ఆయనే లాయర్‌. అధికారం మీదే.. అధికారులు రిపోర్ట్‌ చేసేది మీకే. అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?. రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. చంద్రబాబు కొడుకు విద్యాశాఖ మంత్రి కాబట్టే థర్డ్‌ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకు వస్తాయి అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement