సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మ వారి ఆలయంలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. పెద్ద రాజగోపురం వద్ద రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళ పోస్ట్ చేసింది. సెల్‌ఫోన్‌పై నిషేధం ఉన్నా కొందరు దర్జాగా రీల్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కార్యాలయం ఎదురుగా రీల్స్ చేస్తున్నా గుర్తించకుండా చోద్యం చూస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు.
గతంలోనూ కొందరు పలుమార్లు అమ్మవారి మూల విరాట్‌ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరుస వివాదాలతో దుర్గగుడి ప్రతిష్ట దెబ్బతింటుంది. మహిళ ఇన్ స్టా రీల్‌తో ఆలయ భద్రత లోపం మరోసారి బయటపడింది.


