కృష్ణా నదిలో పడవ ప్రమాదం బాధాకరం : వైఎస్ జగన్ | YS Jagan Saddened by Krishna River Boat Tragedy | Sakshi
Sakshi News home page

కృష్ణా నదిలో పడవ ప్రమాదం బాధాకరం : వైఎస్ జగన్

Jun 14 2026 3:38 PM | Updated on Jun 14 2026 4:24 PM

YS Jagan Saddened by Krishna River Boat Tragedy

సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని కోనూరు వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదం విషాదకరమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఓ కుటుంబ వేడుకకు హాజరైన బంధువులు పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతి చెందడం, మరో ఇద్దరు గల్లంతవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ కోరారు. సహాయక బృందాలు, అధికారులు సమన్వయంతో పనిచేసి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement