రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): ఎగువన కురిసిన వర్షాల కారణంగా ధవళేశ్వర వద్ద వరద ఉధృతి ప్రమాదకరంగా మారింది. గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

గోదావరి నీటిమట్టం 12.60 అడుగులకు చేరగా, 11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరొకవైపు కోనసీమలో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల కాజ్‌వేలపైకి వరద నీరు వచ్చి చేరింది. దాంతో చాకలిపాలెం-కనకాయలంక కాజ్‌వేపై వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.

గోదావరి వరద ఉగ్రరూపం
ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లో గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా . ఎద్దువాగు, గుండేటి వాగుల పొంగి ప్రవహిస్తున్నాయి. వేలేరు నుంచి సీతారామనగర్‌కు రాకపోకలు నిలిచపోయాయి. దాంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.


