భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నీలో ధీరజ్ రెండు స్వర్ణ పతకాలు సాధించడంపై జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ధీరజ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
విజయవాడకు చెందిన 24 ఏళ్ల ధీరజ్ ముందుగా మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల కుంకుమ్ మొహోద్‌తో కలిసి రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో బంగారు పతకం గెలిచిన ధీరజ్... ఆ తర్వాత రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో ధీరజ్ ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు.
మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో ధీరజ్–కుంకుమ్ (భారత్) ద్వయం 5–1 (37–36, 37–36, 39–39) సెట్ పాయింట్ల స్కోరుతో కిమ్ జె డియోక్–ఒహ్ యెజిన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించి బంగారు పతకం గెల్చుకుంది. నాలుగేళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నీలో రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత జోడీకి పసిడి పతకం లభించడం విశేషం.
Heartiest congratulations to Dhiraj Bommadevara from Vijayawada on creating history at the Archery World Cup by winning the Men’s Singles Gold Medal. Winning two gold medals in a single day, including the Mixed Doubles title, is a remarkable achievement that has made Andhra… pic.twitter.com/QWlyRJkLi9
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2026


