శరత్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan Consoles YSRCP Leader Sharaths Family Over Phone | Sakshi
Sakshi News home page

శరత్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Jun 12 2026 7:26 PM | Updated on Jun 12 2026 7:51 PM

YS Jagan Consoles YSRCP Leader Sharaths Family Over Phone

పార్వతీపురం : పార్వతీపురం మండలం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షులు నంగిరెడ్డి శరత్ గుండెపోటుతో అకాల మరణం చెందడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శరత్‌ కుటుంబ సభ్యుల్ని ఫోన్‌లో పరామర్శించారు వైఎస్‌ జగన్‌.  

ఈ మేరకు శరత్‌ భార్య, తల్లితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. శరత్‌ కుటుంబానికి  వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంచితే.. రాజ్యలక్ష్మిపురంలో శరత్ కుటుంబాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు పరామర్శించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement