డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం.. చివర్లో ట్విస్టు!
చెన్నై: ఇటీవల తమిళనాడులో కొలువుదీరిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం.. తన క్యాబినెట్‌ను విస్తరించడంతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులుగా చాన్స్ దక్కింది. ఫలితంగా కాంగ్రెస్ ‘సుదీర్ఘ’ ఘనతను సొంతం చేసుకుంది. ఇలా ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగస్వామ్యం కావడం తమిళనాడు చరిత్రలో 59 ఏళ్ల తర్వాతి ఇదే తొలిసారి. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో అది కాస్తా తమిళనాడు రాజకీయాల్లో అరుదైన ఘటనగా చేరిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన ఎస్. రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్‌లు విజయ్ మంత్రివర్గంలో చోటు దక్కడంతో దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకర కార్యక్రమం ఈరోజు(గురువారం, మే 21 వ తేదీ) జరిగింది. అయితే మంత్రిగా ఎస్ రాజేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ నామస్మరణలు చేయడం తమిళనాడులో కొత్త చర్చకు దారి తీసింది. ‘ ప్రజానాయకుడు కామరాజర్ వర్ధిల్లాలి, రాజీవ్ గాంధీ వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ వర్ధిల్లాలి’ అని ప్రమాణ స్వీకారం చివర్లో పేర్కొన్నారు. దీనిపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం చివర్లో చోటు చేసుకున్న ఈ ట్విస్టుతో గవర్నర్ ఒక్కసారిగా తేరుకున్న గవర్నర్.. ఇది ప్రమాణ స్వీకారంలో భాగం కాదంటూ రాజేశ్‌కుమార్‌కు గుర్తు చేశారు. VIDEO | Tamil Nadu Cabinet expansion: During the swearing-in ceremony, Congress MLA Rajesh Kumar, while taking oath as minister, hailed Kamaraj, Rajiv Gandhi and Rahul Gandhi; Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar remarked, "Not part of the oath."(Full video available… pic.twitter.com/dT7TkpcxY5— Press Trust of India (@PTI_News) May 21, 2026
"గాడ్ ఆఫ్ వార్" ప్రకటన రాలేదు.. ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణ వృథా
జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఒక భారీ సర్ప్రైజ్ ఉంటుందని ఎదురుచూశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్'ను అధికారికంగా ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే దానిపై సితార ఎంటర్టైన్మెంట్స్ తరఫున నిర్మాత నాగవంశీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆయన ఎక్స్ హ్యాండిల్లో మాత్రం ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. "త్వరలోనే సెట్స్‌పై కలుద్దాం" అంటూ పోస్టు పెట్టారు. అదే సమయంలో 'డ్రాగన్ గ్లింప్స్' వీడియోను కూడా ట్యాగ్ చేశారు. ఈ పరిణామంతో తారక్ అభిమానులు నిరాశ చెందారు. ఆయన పుట్టినరోజు నాడు 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ ప్రకటిస్తారని అభిమానులు ఆశించారు. దానికోసం వారు పదేపదే నాగవంశీ సోషల్‌మీడియా హ్యాండిల్‌ను తనిఖీ కూడా చేశారు. 'గాడ్ ఆఫ్ వార్' కోసం వందలాది పోస్టులు కూడా చేశారు. కానీ ఆ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డ్రాగన్ గ్లింప్స్ విడుదల సమయంలో మరో సినిమా ప్రకటించడం వల్ల ఆ ప్రాజెక్ట్‌పై ఉన్న బజ్ తగ్గిపోతుందనే ఆలోచనతో నాగవంశీ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. అందుకే 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్‌ను మరో మంచి రోజున ప్రకటించాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పుట్టినరోజు సందర్భంగా ఈ పెద్ద ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారు.
బాబు.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరివి హత్యా రాజకీయాలు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. శవ రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా?. వైఎస్సార్ విషయంలో ఏం జరిగిందో అసెంబ్లీలో క్లిప్పింగ్‌లు చూడాలని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారు. ఏబీఎన్, టీవీ-5, చంద్రబాబు మాఫియా ముఠాగా మారారు. అబద్ధాలు సృష్టించి దొంగ సాక్ష్యాలు తయారు చేస్తున్నారు. ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలు.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మా కుటుంబంలో ముగ్గురు బలైపోయారు. హత్యా రాజకీయాలకు మేము బాధితులం.మా తాత, తండ్రి, బాబాయి ముగ్గురు చనిపోయారు. మాపైనే తప్పుడు రాజకీయాలు చేయిస్తున్నారు. మా తాతగారు రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజారెడ్డి హత్య జరిగింది. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిగారిని చంపేశారు. వైఎస్సార్‌ను కేవలం పులివెందులకు కట్టడి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది ఇందులో ఉన్న రాజకీయ కోణం. రాజారెడ్డి కేసులో దోషులను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి, అధికార దుర్వినియోగం చేసి, వారిని రక్షించింది ఎవరు? మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. ఈ కేసులో నిందితులను జైలుకెళ్లకుండా కాపాడారు. ఎవరిది గొడ్డలి పారీ.. చంద్రబాబు చెప్పాలి. మా నాన్న విషయంలోనూ అదే జరిగింది. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారు. అవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగ్‌లు చూడాలి. తర్వాత నాలుగు రోజులకే వైఎస్సార్ ప్రమాదంలో చనిపోయారు. మేం బాధితులం. కాని, తిరిగి మాపైనే వీళ్లు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?మా చిన్నాయన వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబుగారి ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవమైతే, పైగా తానే హత్య చేశానంటూ సాక్షాత్తూ టీవీ లైవ్ షోల్లో చెలరేగిపోయి మాట్లాడిన దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కార్లలో తిరుగుతున్నాడు. పైగా చంద్రబాబుకు లాయర్ లూథ్రానే, దస్తగిరికీ లాయర్ లూథ్రానే. మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. రాజకీయ లబ్ధికోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం. వివేకానందరెడ్డి కేసులో జరుగుతున్నది ఇదే.చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు, బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చిపడేయలేదా? మరి ఎవరిది గన్ కల్చర్?. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో వాచ్‌మెన్‌ను బండరాయితో మోది చంపేశారు?. పాపం ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణగారు యాక్సిడెంట్లో చనిపోతే, పరామర్శ కోసం అని పోయి, కేటీఆర్‌తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడాడు. మరి ఎవరివి శవ రాజకీయాలు?. అంతెందుకు సొంత కూతుర్ని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆ పార్టీ గుర్తును లాక్కున్నది, ఆయన చనిపోయినట్టుగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు కాదా? మరి ఎవరివి కుట్ర రాజకీయాలు?.వేళ్లన్నీ చంద్రబాబు వైపే..వంగవీటి మోహనరంగాగారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు?. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహారదీక్ష చేస్తుంటే, అర్థరాత్రి నరికి చంపేశారు. ఈ ఘటనలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తాయి. ఈ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్‌మీద దాడిచేసిన కేసులో “మల్లెల బాబ్జీ’’ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్‌బాడీగా మారాడు. మల్లెల బాబ్జీ జేబులో ఒక లెటర్ దొరికింది. తనకు రూ.3లక్షలు ఇస్తానని చెప్పి, చివరకు రూ.30వేలే ఇచ్చారని సారాంశం. అసలు ఎన్టీఆర్‌మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా? అది నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులోనూ వేళ్లు అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి.పింగళి దశరథ్‌రామ్ ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రికను పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే, హైదరాబాద్ నుంచి బస్సుదిగి, రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడిచేసి చంపేశారు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్‌కు చెప్పేవాడని స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఒక పుస్తకంలో రాసినట్టు కూడా నాకు గుర్తు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో రాజకీయాలు చేసింది, చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేం.జగన్ నైజం ఇది.. జగన్ మంచివాడు కాబట్టే, మా తాతను చంపిన వాళ్లు కూడా ప్రశాంతంగా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయితే వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా? జగన్ నైజం ఎలాంటిది? మనస్తత్వం ఎలాంటిది చెప్పడానికి ఇది నిద్శనం. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని మా నాన్న నేర్పించాడు. చంద్రబాబులా కాదు. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబూ నీకు 77 సంవత్సరాలు వచ్చాయి. బహుశా ఇది చివరి ఎన్నికలేమో. ఇంకా ఈ చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గేయడం లేదా? అని ప్రశ్నించారు.
ముగిసిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్.. మంత్రులకు ప్రధాని కీలక ఆదేశాలు
గుజరాత్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
ట్రంప్ షేర్ లావాదేవీల కలకలం.. వైట్‌హౌస్‌ను కుదిపేస్తున్న వివాదం
మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదకరం : వైఎస్ జగన్
మారుతి సుజుకి కొత్త ధరలు.. జూన్ నుంచే అమల్లోకి!
వైట్ డ్రెస్‌లో మౌనీ రాయ్.. స్పెయిన్ వీధుల్లో ఆషిక..!
AP: బంగారు కిరీటం మాయం కేసు.. రూ. 30లక్షలకు తాకట్టు!
ధాన్యం కొనుగోళ్లపై వాస్తవాలు..విమర్శలు గుప్పించిన ఉత్తమ్
యువకుడి తలను నోట్లో కరుచుకుని నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన!
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
‘సీఎం సీటొద్దులే.. మంత్రిగా సరిపెట్టుకుంటా’
BCCI: రోహిత్ శర్మకు బై.. బై!.. వరల్డ్‌కప్ జట్టులోకి అతడు?
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
పాక్ మాజీ క్రికెటర్‌కు బంపరాఫర్.. ఐపీఎల్‌కు అర్హత!
టీఎంసీకి ఝలక్.. అభిషేక్ బెనర్జీనే కారణమా?
ఇళ్లల్లో నివసించకున్నా.. తాళం వేసినా.. అద్దెకిచ్చిన చర్యలే
అభిషేక్ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ
సరస్వతీ మాత విగ్రహం కోహినూర్ కన్నా ముఖ్యం
ముగిసిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్.. మంత్రులకు ప్రధాని కీలక ఆదేశాలు
గుజరాత్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
ట్రంప్ షేర్ లావాదేవీల కలకలం.. వైట్‌హౌస్‌ను కుదిపేస్తున్న వివాదం
మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదకరం : వైఎస్ జగన్
మారుతి సుజుకి కొత్త ధరలు.. జూన్ నుంచే అమల్లోకి!
వైట్ డ్రెస్‌లో మౌనీ రాయ్.. స్పెయిన్ వీధుల్లో ఆషిక..!
AP: బంగారు కిరీటం మాయం కేసు.. రూ. 30లక్షలకు తాకట్టు!
ధాన్యం కొనుగోళ్లపై వాస్తవాలు..విమర్శలు గుప్పించిన ఉత్తమ్
యువకుడి తలను నోట్లో కరుచుకుని నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన!
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
‘సీఎం సీటొద్దులే.. మంత్రిగా సరిపెట్టుకుంటా’
BCCI: రోహిత్ శర్మకు బై.. బై!.. వరల్డ్‌కప్ జట్టులోకి అతడు?
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
పాక్ మాజీ క్రికెటర్‌కు బంపరాఫర్.. ఐపీఎల్‌కు అర్హత!
టీఎంసీకి ఝలక్.. అభిషేక్ బెనర్జీనే కారణమా?
ఇళ్లల్లో నివసించకున్నా.. తాళం వేసినా.. అద్దెకిచ్చిన చర్యలే
అభిషేక్ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ
సరస్వతీ మాత విగ్రహం కోహినూర్ కన్నా ముఖ్యం
ఫొటోలు
డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్ (ఫోటోలు)
వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు
చిరంజీవి 158వ మూవీ లాంచ్ (ఫోటోలు)
తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)
‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
సింప్లీ సూపర్బ్ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
సినిమా
'పదేళ్లలో 55 ట్రాన్స్ఫర్స్'.. త్రిమూర్తులు టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. అప్పట్లో పెళ్లి, మనసిచ్చి చూడు లాంటి సూపర్ హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ కొన్నేళ్ల తర్వాత కనుమరుగైపోయాడు. మళ్లీ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల విరామం హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సినిమాకు కమల్‌తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాశీసింగ్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఓ కానిస్టేబుల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాట వినని రెబల్ కానిస్టేబుల్‌గా పాత్రలో వడ్డే నవీన్ కనిపించనున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అభిమాని కల నిజం చేసిన హీరో రామ్..!
aటాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని కలను నిజం చేశారు. ఎప్పటికైనా తనను కలవాలని ఆరాటపడుతున్న వీరాభిమాని కోరికను నెరవేర్చాడు. 18 ఏళ్లుగా 'ఫ్రీడ్రిచ్ అటాక్సియా' అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న అమ్మాయి ఇంటికి వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానితో మాట్లాడిన రామ్ తనకు ధైర్యం చెప్పారు. అప్యాయంగా పలకరించిన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో రామ్ చేసిన పనిపై టాలీవుడ్ సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాల విషయానికొస్తే ఆయన తొలిసారి మెగా ఫోన్ పట్టనున్నారు. రామ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీలో రామ్ వీర పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం స్పెషల్‌గా మేకోవర్ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.Tollywood actor Ram Pothineni showed his kind-hearted nature Fulfilling the dream of a die-hard fan battling the rare disease ‘Friedreich’s Ataxia’ for 18 years, Ram personally visited her home, spent time with her, and offered emotional support. #RamPothineni #Tollywood pic.twitter.com/7Fge86Xk58— Telangana Ahead (@telanganaahead) May 21, 2026
మరో ఓటీటీలో మెగా కోడలి సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ తేజ్ సతీమణి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం సతీ లీలావతి. పెళ్లి తర్వాత లావణ్య చేసిన మూవీ ఇదే కావడం విశేషం. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆదరణ లేకపోవడంతో కేవలం 12 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసింది. సన్ నెక్ట్స్ వేదికగా ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ సన్ నెక్ట్స్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం రెండు ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ అడియన్స్‌కు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ప్రేమ, పెళ్లి, విడాకుల అనే అంశాలతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.సతీ లీలావతి కథేంటంటే..లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ స్టార్ డైరెక్టర్. ఇంట్లో పెరెంట్స్ తరచూ గొడవలు పడడంతో చిన్నప్పటి నుంచి ఆమెలో ఓ భయం ఏర్పడుతుంది. ఆ భయం నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు(దేవ్ మోహన్)ని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో అతనితో స్నేహం ఏర్పడడం.. అది కాస్త ప్రేమగా మారి, నాన్న(నరేశ్) అనుమతిలో పెళ్లి కూడా చేసుకుంటుంది. మూడేళ్ల పాటు చక్కగా కాపురం చేసిన రామ్.. ఉన్నపళంగా విడాకులు కోరతాడు.ప్రస్తుతం తాను నర్స్ నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్)తో రిలేషన్లో ఉన్నానని.. విడాకులు ఇస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. విడిపోవడం ఇష్టంలేని లీలావతి..భర్తను కొట్టి ఇంట్లోనే బంధిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సేతు నేపథ్యం ఏంటి? నర్స్ నికోల అతని జీవితంలోకి ఎలా వచ్చింది? భర్తను దక్కించుకునేందుకు లీలావతి ఏం చేసింది? లాయర్ తమలపాకుల(వీటీవీ గణేష్)కు ఆమె చెప్పిన అబద్దం ఏంటి? ఆమెకు దొంగ(సప్తగిరి), నిర్మాత మొట్ట రాజర్(మొట్ట రాజేంద్రన్) ఎలాంటి సహాయం చేశారు? చివరకు లీలావతి-రామ్‌సేతు విడాకులు తీసుకున్నారా ? లేదా తిరిగి ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. Pellam. Problems. Pralayam 🔥And somehow all three feel the same 😭Get ready to witness a husband struggling to survive marriage 🤞🏼#SathiLeelavathi streaming now on JioHotstar! 💫#SathiLeelavathiOnJioHotstar @Itslavanya @ActorDevMohan @SatyaTatineni @ddp_offl #NaagaMohan… pic.twitter.com/P3ppgSd75k— JioHotstar Telugu (@JioHotstarTel_) May 21, 2026
'మా పాపను కూడా ఎత్తుకోలేకపోయా..': రామ్ చరణ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. ఈ మూవీ రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రల్లో అభిమానులను మెప్పించనున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఏ క్రీడ ఆడాలన్నా పెద్దినే అనే స్పోర్ట్స్ కాన్సెప్ట్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పెద్ది మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెజ్లర్లతో సీన్ల గురించి వివరించారు. ఇసుకలో, ఎండలో షూటింగ్ చాలా కష్టంగా అనిపించలేదా అని బుచ్చిబాబ.. చెర్రీని ప్రశ్నించారు. దీనికి రామ్ చరణ్ బదులిస్తూ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే ఎలాంటి అలసట రాదన్నారు. అయితే కుస్తీలో చేయి పట్టి అదురు రావడంతో మా పాపను కూడా ఎత్తుకోలేకపోయానని తెలిపారు.మీరు నిజమైన పహిల్వాన్లను పెట్టారని రామ్ చరణ్ అన్నారు. వాళ్లు నటించమంటే.. రియల్‌గా ఆడేస్తున్నారని రామ్ చరణ్ గుర్తు చేశారు. తర్వాత మళ్లీ సారీ చెబుతున్నారని తెలిపారు. ఎందుకంటే వాళ్లలో నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది వాళ్లలో ఉంటుందని చెర్రీ వివరించారు. యాక్టింగ్ చేయమంటే వారికి అది రాదని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌లో మెప్పించనుంది.
క్రీడలు
సీఎస్కేపై గుజరాత్ ఘన విజయం
అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు.Updates:సీఎస్కే ఏడో వికెట్ డౌన్రషీద్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి కాంబోజ్(19) అవుట్ కాగా.. నాలుగో బంతికి బ్రెవిస్(8) పెవిలియన్‌కు చేరాడు.శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) రూపంలో సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 123/6దూకుడుగా ఆడుతున్న దూబే10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. శివమ్ దూబే దూకుడుగా ఆడుతున్నాడు. 15 బంతుల్లో 41 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్2.3: సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఉర్విల్ పటేల్ (0). స్కోరు: 36-3(3.2)కార్తిక్ శర్మ 6, మాథ్యూ షార్ట్ 13 పరుగులతో ఉన్నారు. విజయానికి 194 పరుగులు కావాలి.2.2: సిరాజ్ బౌలింగ్‌లో రుతురాజ్ బౌల్డ్ (7 బంతుల్లో 16)సంజూ శాంసన్ డకౌట్ఇన్నింగ్స్ తొలి బంతికే చెన్నై తమ ఓపెనర్ సంజూ శాంసన్ (0) వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు. మాథ్యూ షార్ట్‌కు తోడుగా రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి వచ్చాడు.గుజరాత్ భారీ స్కోరు!ఓపెనర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84) అర్ధ శతకాలతో రాణించి బలమైన పునాది వేశారు. వీరికి తోడు వన్‌డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 57 నాటౌట్)తో దుమ్ములేపాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ గిల్‌ను అవుట్ చేయగా.. అన్షుల్ కాంబోజ్ సాయి వికెట్ దక్కిచుకున్నాడు. ముకేశ్ చౌదరి వాషింగ్టన్ సుందర్ (7)ను పెవిలియన్‌కు పంపగా.. రాహుల్ తెవాటియా (0) రనౌట్ అయ్యాడు.వాషీ అవుట్19.6: ముకేశ్ చౌదరి బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన వాషీ (7).మూడో వికెట్ డౌన్18.3: రాహుల్ తెవాటియా (0) రనౌట్. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్. స్కోరు: 207-3(18.3). వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు.సాయి సుదర్శన్ అవుట్18.2: అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్. 53 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసిన సాయి. రాహుల్ తెవాటియా క్రీజులోకి రాగా.. బట్లర్ 43 పరుగులతో ఉన్నాడు. గుజరాత్ డబుల్ సెంచరీ17.6: గుర్జప్నీత్ బౌలింగ్‌లో బట్లర్ ఫోర్ తీయగా.. గుజరాత్ డబుల్ సెంచరీ మార్కు అందుకుంది. స్కోరు: 201-1(18). బట్లర్ 43, సుదర్శన్ 78 పరుగులతో ఉన్నారు.పదిహేను ఓవర్లలో గుజరాత్ స్కోరు: 159-1జోస్ బట్లర్ 26, సాయి సుదర్శన్ 57 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్12.2: గిల్ రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్ ఇచ్చి.. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ పెవిలియన్ చేరాడు.మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న గిల్ ఖాతాలో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. స్కోరు: 129-1. జోస్ బట్లర్ క్రీజులోకి రాగా.. సుదర్శన్ 51 పరుగులతో ఉన్నాడు.సాయి సుదర్శన్ ఫిఫ్టీ11.1: నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్. ఈ సీజన్లో అతడికి ఇది వరుసగా ఐదో అర్ధ శతకం.పది ఓవర్లలో గుజరాత్ స్కోరు: 111-0ఓపెనర్లు గిల్ 30 బంతుల్లో 62, సుదర్శన్ 30 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.గిల్ అర్ధ శతకం6.6: నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్సర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న శుబ్‌మన్ గిల్. 23 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్. స్కోరు: 78-0.పవర్ ప్లేలో గుజరాత్ స్కోరు: 62-0 (6)గిల్ 18 బంతుల్లో 35, సుదర్శన్ 18 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు.హాఫ్ సెంచరీ5.1: అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ ఫోర్ బాదగా.. గుజరాత్ యాభై పరుగుల మార్కు అందుకుంది.తొలి ఓవర్లో గుజరాత్ స్కోరు: 8-0ముకేశ్ చౌదరి చెన్నై బౌలింగ్ ఎటాక్ మొదలుపెట్టగా.. గిల్ ఏడు, సాయి సుదర్శన్ ఒక పరుగుతో ఉన్నారు.టాస్ గెలిచిన చెన్నై ఐపీఎల్-2026లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందుగా టాప్-4లో అడుగుపెట్టగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి అర్హత సాధించింది. తమతో పాటు గుజరాత్ టైటాన్స్‌ను కూడా ప్లే ఆఫ్స్‌నకు తీసుకువెళ్లింది.మిగిలిన ఒక్క స్థానం కోసంఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ఐదు జట్లు (రాజస్తాన్, పంజాబ్, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ) అధికారికంగా రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై తమ లీగ్ దశలో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో అద్భుతం జరగాలని కోరుకుంటోంది. ఇందుకు పటిష్ట గుజరాత్ టైటాన్స్‌తో గురువారం తలపడేందుకు సిద్ధమైంది.తుదిజట్లలో మార్పులు ఇవీఅహ్మదాబాద్ వేదికగా ఇరుజట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. అకీల్ హొసేన్ స్థానంలో గుర్జప్నీత్ సింగ్, ప్రశాంత్ వీర్ స్థానంలో మాథ్యూ షార్ట్ వచ్చినట్లు తెలిపాడు.ఇక గుజరాత్ టైటాన్స్ సైతం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. సాయి కిషోర్ స్థానంలో ప్రసిద్ కృష్ణను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.గుజరాత్ వర్సెస్ చెన్నై తుదిజట్లుగుజరాత్సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్.చెన్నైసంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.
నిరాశపరిచారు: టీమిండియా సెలక్టర్లపై విమర్శలు
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే విమర్శించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లను విస్మరించడం ఎంతమాత్రం తగదన్నాడు. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ (జూన్ 6 నుంచి)తో బిజీ కానుంది. ఇందులో భాగంగా తొలుత స్వదేశంలో అఫ్గనిస్తాన్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది.గుర్నూర్ బ్రార్‌కు తొలిసారి పిలుపు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. గుర్నూర్ బ్రార్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణతో కలిసి పేస్ దళంలో చేరాడు. అయితే, మెజారిటీ మంది విశ్లేషకులు అఫ్గన్‌తో టెస్టుకు ఆకిబ్ నబీని తప్పక ఎంపిక చేస్తారని భావించారు.కానీ సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల సెలక్షన్ కమిటీ వ్యవహారశైలిపై హర్ష్ భోగ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ఈ జట్టులో ఆకిబ్ నబీ తప్పక ఉంటాడని నేను విశ్వసించాను. అతడి గురించి చర్చ కూడా జరిగింది.అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?అతడి బౌలింగ్‌లో తగినంత పేస్ ఉందా? లేదా? అన్న విషయంతో నాకు సంబంధం లేదు. బౌలింగ్ చేస్తున్న సమయంలో అతడు బ్యాలెన్స్ చేసుకుంటున్నాడా? లేదా? అన్నది కూడా నాకు అక్కర్లేదు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రెండేళ్లలో అతడు వందకు పైగా వికెట్లు కూల్చాడు. అలాంటి బౌలర్‌కు ప్రోత్సాహం అందించడం కనీస బాధ్యత. అతడిని ఎంపిక చేసి ఉంటే దేశీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లకు మంచి బూస్టప్ లభించేది.టెస్టుల్లో రాణించాలనే కసి మరింత పెరిగేది. అఫ్గన్‌తో టెస్టులో తుదిజట్టులో ఆకిబ్ నబీకి చోటు ఇవ్వకున్నా పర్లేదు. కానీ పదిహేను మంది సభ్యుల జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేయాల్సింది. అతడికి ఫిట్నెస్ సమస్యలు కూడా లేవు.ఏం మెసేజ్ ఇస్తు న్నారు?దేశీ క్రికెట్లో ఓ బౌలర్‌గా ఎంతగా రాణించాలో.. అంతా చేసి చూపాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తొమ్మిదో స్థానంలో మెరుగ్గా ఆడగలడు. అయినప్పటికీ అతడిని ఎంపిక చేయకపోవడం నిజంగా నిరాశాజనకం. ఈ సెలక్షన్ కమిటీకి ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉండి ఉంటాయి. కానీ వారి చర్యల ద్వారా ఇచ్చే సందేశం మాత్రం సరిగ్గా లేదు’’ అని హర్షా భోగ్లే యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2025-26 సీజన్లో పది మ్యాచ్‌లలో ఆకిబ్ నబీ జమ్మూ కశ్మీర్ తరఫున 60 వికెట్లు తీశాడు. తన జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు సీజన్లో ఆకిబ్.. 44 వికెట్లతో సత్తా చాటాడు.చదవండి: నితీశ్ రెడ్డి, ఇషాన్‌లకు లక్కీ ఛాన్స్.. పాపం పంత్!.. కొత్త ముఖాలు ఇవే
SRH vs RCB: ఉప్పల్‌లో మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇవే
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. శుక్రవారం (మే 22) జరిగే ఈ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్‌కు సొంతమైదానంలో ఇదే చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మార్పులు (డైవర్షన్లు) అమలు చేయనున్నట్లు సంబంధిత విభాగం వెల్లడించింది. ఇందుకు సంబంధించి మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్–II) పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ వాహనదారులకు అలెర్ట్లారీలు, రాకెట్ లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్స్, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, RMC వాహనాలు, JCBలు, ఐచర్ వాన్లు, ప్రైవేట్ బస్సులు మరియు ట్రాక్టర్లు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల నుండి రాత్రి 12:00 గంటల వరకు నాగోల్ నుండి హబ్సిగూడ (ఉప్పల్ జంక్షన్ మార్గం).. అదే విధంగా బోడుప్పల్ నుండి అంబర్పేట్ (ఉప్పల్ జంక్షన్, రామంతాపూర్ మార్గం) వరకు మోస్తరు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది.కాబట్టి ప్రజలు వీలైనంతవరకు ఈ మార్గాలను నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలి. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి RTC బస్సులు మరియు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించడం శ్రేయస్కరం.ట్రాఫిక్ డైవర్షన్ మార్గాలు:👉ఘట్కేసర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను మెహఫిల్ హోటల్ వద్ద HMDA ఉప్పల్ భగ్యాత్ ప్రవేశద్వారం వద్ద నాగోల్ – ఎల్.బి.నగర్ వైపు మళ్లించబడతాయి.👉ఎల్.బి.నగర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద U-టర్న్ తీసుకుని నాగోల్ U-టర్న్ – HMDA భగ్యాత్ – టయోటా U-టర్న్ – బోడుప్పల్ – చెంగిచెర్ల – IOCL చెర్లపల్లి / ఘట్కేసర్ వైపు మళ్లించబడతాయి.👉తార్నాక నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను హబ్సిగూడ X రోడ్ వద్ద నాచారం – NFC రోటరీ – IOCL చెర్లపల్లి – ఘట్కేసర్ వైపు మళ్లించబడతాయి.👉రామంతాపూర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను స్ట్రీట్ నం. 8 వద్ద హబ్సిగూడ X రోడ్ – నాచారం – NFC రోటరీ – IOCL చెర్లపల్లి – ఘట్కేసర్ వైపు మళ్లించబడతాయి.👉ఇక ఉప్పల్ జంక్షన్‌లోని ఎలివేటెడ్ కారిడార్ వర్క్ పనులు జరుగుతున్నందున వరంగల్ రహదారి మూసివేయడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనదారులను సర్వే ఆఫ్ ఇండియా వద్ద పిస్తా హౌస్ పక్క నుండి బీరప్ప గడ్డమీదుగా వరంగల్ రహదారి మీదుగా బోడుప్పల్, ఘట్కేసర్, వరంగల్ కు పంపించబడుతున్నవి. 👉అలాగే వరంగల్ నుండి హైదరాబాదు మరియు సికింద్రాబాద్ వచ్చే వాహనదారులను మే ఫీల్ హోటల్ వద్ద ఉప్పల్ బగాయతు మీదుగా నాగోల్ నుండి హైదరాబాదు మరియు సికింద్రాబాద్‌కు పంపించబడుచున్నవి.👉వరంగల్ నుండి హైదరాబాద్‌కు ఉప్పల్ మార్గం ద్వారా వచ్చే హెవీ వాహనాలు ఘట్కేసర్ వద్ద ORR ఎక్కి అబ్దుల్లాపూర్‌మెట్ – ఎల్.బి.నగర్ – దిల్సుఖ్నగర్ మార్గంలో ప్రయాణించాలి.👉హైదరాబాద్ నుండి వరంగల్ వైపు ఉప్పల్ మార్గం ద్వారా వెళ్లే వాహనాలు ఎల్.బి.నగర్ – హయత్‌నగర్ ద్వారా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ORR ఎక్కి వరంగల్ చేరుకోవాలి.ప్రేక్షకులకు సాధారణ సూచనలు:👉మ్యాచ్ సందర్భంగా మొత్తం (05) ప్రధాన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. వీటిలో (04) స్టేడియం బయట 500 మీటర్ల పరిధిలో సాధారణ ప్రజల కోసం ఉండగా, ఒకటి స్టేడియం లోపల (VVIP/VIP పాస్ హోల్డర్లకు మాత్రమే) కేటాయించబడింది.👉స్టేడియం బయట పార్కింగ్ (సాధారణ ప్రజలకు):ఉప్పల్ X రోడ్స్ నుండి హబ్సిగూడ వైపు: పెంగ్విన్ ,TGIALA👉ఉప్పల్ X రోడ్స్ నుండి రామంతాపూర్ వైపు:DSL ఓపెన్ ప్రదేశం (NSL భవనం ఎదురుగా)మోడర్న్ బేకరీ👉స్టేడియం లోపల పార్కింగ్ (పాస్ హోల్డర్లకు మాత్రమే):VVIP/VIP మరియు అనుమతిపత్రం కలిగినవారు మాత్రమే A గ్రౌండ్ పార్కింగ్ ఉపయోగించాలి. ప్రవేశం గేట్ 1A ద్వారానే ఉంటుంది.చెల్లుబాటు అయ్యే పాస్ లేని వాహనాలను EK మినార్ మరియు LG గోదాం చెక్‌పోస్టుల దాటి అనుమతించరు.పార్కింగ్ మార్గదర్శకాలు:👉ఎల్.బి.నగర్ నుండి ఉప్పల్ స్టేడియం:DSL ఓపెన్ ప్రదేశం, మోడర్న్ బేకరీ మరియు LG గోదాం జంక్షన్ నుండి కెమ్వేదా జంక్షన్ వరకు ఇండస్ట్రియల్ లేన్ రోడ్డు పక్కన పార్కింగ్ చేయాలి.👉హబ్సిగూడ నుండి ఉప్పల్ స్టేడియం:సర్వే ఆఫ్ ఇండియా వద్ద U-టర్న్ తీసుకుని EK మినార్ వద్ద పెంగ్విన్ పార్కింగ్ మరియు TG IALA పార్కింగ్‌లో వాహనాలు నిలిపివేయాలి.👉రామంతాపూర్ నుండి ఉప్పల్ స్టేడియం:DSL మాల్ వద్ద U-టర్న్ తీసుకుని DSL ఓపెన్ ప్రదేశం, మోడర్న్ బేకరీ మరియు LG గోదాం జంక్షన్ నుండి చం వేద జంక్షన్ వరకు పార్కింగ్ చేయాలి.పై మార్గాలు, తేదీలు, సమయాలను గమనించి ప్రజలు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకొని మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి. అలాగే, ప్రజలు RTC బస్సులు మరియు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించగలరు.
ఇద్దరిదీ తప్పే!.. ఏడవలేక నవ్విన హార్దిక్ పాండ్యా!
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన ముంబై.. మరో ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌తో హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన ఈ ఆల్‌రౌండర్.. కోల్‌కతాతో మ్యాచ్‌లో 26 పరుగులు చేయడంతో పాటు.. రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 13 పరుగులే ఇచ్చాడు. అయితే, వికెట్ మాత్రం తీయలేకపోయాడు.నిజానికి కేకేఆర్ ఇన్నింగ్స్‌లో పదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండో బంతిని రోవ్‌మన్ పావెల్ గాల్లోకి లేపాడు. అప్పుడు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రాబిన్ మింజ్, దీపక్ చహర్ అలా చూస్తూ ఉండిపోయారే తప్ప బంతిని అందుకునే ప్రయత్నం చేయలేదు.ఈ క్రమంలో చహర్ స్పందించి ముందుకు రాగా బంతి నేలమీద పడిపోయింది. దీంతో హార్దిక్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఏడవలేక నవ్వినట్లుగా చప్పట్లు కొడుతూ వ్యంగ్య రీతిలో స్పందించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కోల్‌కతా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. మనీశ్ పాండే (45), రోవ్‌మన్ పావెల్ (40) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకోగా.. ముంబై పదమూడింట తొమ్మిదో పరాజయం నమోదు చేసింది.𝐓𝐎𝐓𝐀𝐋 𝐌𝐈𝐒𝐂𝐎𝐌𝐌𝐔𝐍𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍 😱A shocking mix-up at deep-backward square leg as Deepak Chahar & Robin Minz both pull out of the catch. #TATAIPL Race to Playoffs 2026 👉 #KKRvMI | LIVE NOW ➡️ https://t.co/kVSpVvhylO pic.twitter.com/Gcg2H1ifmu— Star Sports (@StarSportsIndia) May 20, 2026
న్యూస్ పాడ్‌కాస్ట్
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
బిజినెస్
ఫండ్స్ పెట్టుబడులకు థర్డ్‌పార్టీ చెల్లింపులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో థర్డ్‌పార్టీ (ఇన్వెస్టర్ పేరిట మరొకరు) చెల్లింపులను అనుమతించే ప్రతిపాదనను సెబీ తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల కింద మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఇన్వెస్టర్ తన బ్యాంక్ ఖాతా నుంచే ఆ మొత్తాన్ని బదిలీ చేయగలరు. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి వచ్చిన సూచనలతో సెబీ ఈ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది.ఉదాహరణకు ఉద్యోగి తరఫున పెట్టుబడులకు యాజమాన్యం చెల్లింపులు చేయొచ్చు. వేతనం నుంచి ఈ మేరకు యాజమాన్యం మినహాయించుకుంటుంది. అలాగే, అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థలు (ఏఎంసీలు) మ్యూచువల్ ఫండ్ పంపిణీదారులకు కమీషన్‌ను నగదు రూపంలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల రూపంలో చెల్లింపులు చేసేందుకూ ఈ ప్రతిపాదన వీలు కల్పించనుంది. అలాగే, ఇన్వెస్టర్లు తమ చందాలో లేదా రాబడిలో కొంత మొత్తాన్ని సామాజికాభివృద్ధికి అందించే ప్రతిపాదనను కూడా సెబీ చేసింది. జూన్ 10 వరకు వీటిపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది.
ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!
ఒకప్పుడు నెలకు రూ.5 లక్షల జీతం తీసుకుంటూ.. పెద్ద కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయి జీవితంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తరువాత ఎదురైన ఇబ్బందులే అతన్ని జీవితంలో సక్సెస్ సాధించేలా చేశాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.గౌరవ్ కవాత్రా అనే వ్యక్తి 2018లో ఆయన ఒక చైనా మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నెలకు రూ.5 లక్షల జీతం ఉన్నప్పటికీ.. రూ. 2 కోట్ల హౌస్ లోన్ ఉండేది. ప్రతి నెల జీతం వస్తుండడంతో ఈఎంఐ చెల్లించడానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇలాంటి సమయంలో అనుకోకుండా.. సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది.అనుకోకుండా ఉద్యోగం పోవడంతో కవాత్రాకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. జీవితంలో అత్యంత కష్టమైన రోజులు ప్రారంభమయ్యాయి. కొత్త ఉద్యోగం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్నో తిరస్కరణలకు గురయ్యారు. నిరాశ, భయం, ఆర్థిక ఒత్తిడి కవాత్రాను మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో రాత్రిళ్లు నిద్రపోయేవాడు కాదు. తీవ్ర ఆందోళనతో రోజుకు 12 నుంచి 15 సిగరెట్లు తాగేవాడు. ఆ అలవాటును మానుకోవడానికి ఆయనకు ఎనిమిదేళ్లు పట్టిందని చెప్పారు.ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు.. తన కుమార్తె అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని కవాత్రా తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పొరుగువారు.. ఇంట్లో కూర్చొని ఉన్న తనను చూసినప్పుడు తాను మరింత అవమానంగా ఫీలయ్యేవాడినని చెప్పారు.అయితే.. ఈ అనుభవం అతని జీవితానికి ఒక పాఠం నేర్పింది. పెద్ద కంపెనీలో ఉద్యోగం, అధిక జీతం ఇవన్నీ శాశ్వత భద్రత కాదని కవాత్రా గ్రహించారు. నేను నా జీవితాన్ని ఒక కార్పొరేట్ లోగోకు బానిసలా మార్చుకున్నాను, అని ఆయన అన్నారు. డిగ్రీలు ఒక స్థాయి వరకు మాత్రమే ఉపయోగపడతాయని, కానీ నైపుణ్యాలు జీవితాంతం విలువనిస్తాయని ఆయన గుర్తించారు.ఈ సంక్షోభం తర్వాత.. ఆయన తనలో కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రజలను ఎలా నిర్వహించాలి, వ్యాపారాన్ని ఎలా నడపాలి వంటి విషయాలను నేర్చుకున్నారు. క్రమంగా ఆయన కన్సల్టింగ్ రంగంలో అడుగుపెట్టి తన కెరీర్‌ను తిరిగి నిర్మించుకున్నారు.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!ప్రస్తుతం ఆయన దేశంలోని అనేక పెద్ద ప్రాజెక్టులకు సలహాదారుగా పనిచేసినట్టు చెబుతున్నారు. రూ.6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సలహాలు ఇచ్చారని, 19 రాష్ట్రాల్లో 65 కంపెనీలతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి, ఇప్పుడు అనేక మందికి మార్గదర్శకుడిగా మారడం.. ఆయన ప్రయాణంలో గొప్ప విజయం అనే చెప్పాలి.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 196.63 పాయింట్లు లేదా 0.26 శాతం నష్టంతో 75,121.76 వద్ద, నిఫ్టీ 19.10 పాయింట్లు లేదా 0.081శాతం నష్టంతో 23,639.90 వద్ద నిలిచాయి.ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండో బోరాక్స్ & కెమికల్స్ లిమిటెడ్, గో ఫ్యాషన్ (ఇండియా) లిమిటెడ్, వీవర్క్ ఇండియా మేనేజ్మెంట్ లిమిటెడ్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఈప్యాక్ డ్యూరబుల్స్ లిమిటెడ్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్, డిజిడ్రైవ్ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, వండర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
థాయ్‌లాండ్‌లో హాయిగా.. ఇక కొన్ని రోజులే!!
బ్యాంకాక్: భారతదేశంతో సహా దాదాపు 90 దేశాల ప్రయాణికులకు గతంలో కల్పించిన 60 రోజుల వీసా రహిత (Visa-Free) బస సదుపాయాన్ని ఉపసంహరించుకోవాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024లో ప్రవేశపెట్టిన ఈ పొడిగించిన వీసా రహిత బస పథకాన్ని రద్దు చేయడానికి థాయ్ క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు 'న్యూస్ రిఫార్మ్' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.నిర్ణయానికి కారణాలు» ఇటీవలి కాలంలో విదేశీ పౌరులకు సంబంధించిన వరుస నేరాలే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. » విదేశీయులు పాల్గొంటున్న మాదకద్రవ్యాల నేరాలు, లైంగిక అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) కేసులు పెరిగిపోవడం.» సరైన అనుమతులు లేకుండా హోటళ్లు, పాఠశాలలతో కూడిన వ్యాపారాలను చట్టవిరుద్ధంగా నిర్వహించడం.» కొంతమంది సందర్శకులు ఈ పొడిగించిన వీసా రహిత పద్ధతిని తమ అక్రమ కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు థాయ్ అధికారులు గుర్తించారు.భారతీయ ప్రయాణికులకు ఏం మారనుందంటే..ఈ తాజా నిర్ణయంతో భారతీయ ప్రయాణికులు 2024లో తాత్కాలిక 60 రోజుల మినహాయింపు రాకముందు ఉన్న పాత నిబంధనల్లోకి మారిపోతారు. మునుపటి ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఇకపై థాయ్‌లాండ్‌లో గరిష్టంగా 30 రోజులు మాత్రమే వీసా లేకుండా ప్రవేశించడానికి, బస చేయడానికి అనుమతి ఉంటుంది.పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావంథాయ్లాండ్ జీడీపీలో పర్యాటక రంగం వాటా 10% కంటే ఎక్కువ. ఇది అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చోదకశక్తిగా ఉంది. ప్రభుత్వం ఈ సంవత్సరం సుమారు 3.35 కోట్ల మంది అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించాలని భావిస్తోంది. ఇది గత సంవత్సరం నమోదైన దాదాపు 3.3 కోట్ల మంది రాకపోకల కంటే స్వల్ప వృద్ధి. థాయ్‌లాండ్ పర్యాటక, క్రీడల మంత్రిత్వ శాఖ నుండి అందిన తాజా డేటా ప్రకారం, 2026 మొదటి త్రైమాసికంలో విదేశీ రాకపోకలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 2.3% నుండి 3.4% వరకు తగ్గాయి.
ఫ్యామిలీ
వెరైటీల్లో ఘనాపా టీ
‘టీ’ అంటే ‘టీ’ మాత్రమే కాదు. మన ఫ్రెండు. మన ఫ్యామిలీ మెంబర్. స్నిగ్ధ మంచందకు ‘టీ’పై ఉన్న ప్రేమ ‘టీ ట్రంక్’ స్టార్టప్‌తో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌ను చేసింది... భారతదేశపు మొట్ట మొదటి సర్టిఫైడ్ టీ సోమెలియర్గా గుర్తింపు సాధించారు స్నిగ్ధ మంచంద. చాలామందిలాగే ఆమెకు ‘టీ’ అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టంతో టీ గురించి అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఎక్కడా, ఎలాంటి సంస్థలూ కనిపించలేదు. దీంతో తానే ఒక ‘టీ స్కూల్’ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు! అక్కడితో ఆగిపోలేదు. ‘టీ ట్రంక్’ పేరుతో కంపెనీ ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేశారు స్నిగ్ధ.ఆ పేరు అందుకే...‘చిన్నప్పటి నుండి రకరకాల టీ ΄÷డులను సేకరించి, వాటిని నాన్నగారి పాతకాలపు ట్రంకు పెట్టేలో భద్రపరిచేదాన్ని. టీపై అప్పటి నుంచే ప్రేమ మొదలైంది కాబట్టి నా కంపెనీకి టీ ట్రంక్ అని పేరు పెట్టాను’ అంటారు స్నిగ్ధ. కంపెనీ ప్రారంభించిన తరువాత పెద్ద బ్రాండ్లతో పోటీ పడాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆఫ్‌లైన్ పంపిణీ రూట్‌ను నిర్మించడం ఎంత కష్టమో ఆమెకు తెలిసింది.‘మొదట్లో లిస్టింగ్ ఫీజులు, పంపిణీదారుల వైఖరితో మాకు ఇబ్బందిగా ఉండేది. దీంతో మా దృష్టిని ఈ– కామర్స్ వైపు మళ్లించాం. అక్కడ కూడా ఎన్నో సవాళ్లు ఎదురైనా, వాటిని త్వరలోనే అధిగమించి నేరుగా టీ ప్రియుల దగ్గరికి చేరుకున్నాం’ అంటారు స్నిగ్ధ.కోవిడ్ కల్లోలంలో....కంపెనీకి అసలుసిసలు సవాలు కోవిడ్ కల్లోల కాలంలో ఎదురైంది. ‘ఎంత కష్టమైనప్పటికీ కోవిడ్ సమయంలో మా ఉద్యోగులందరినీ కొనసాగించాలని, అందరికీ జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాను. మా ఉద్యోగులలో దాదాపు ప్రతి ఒక్కరూ వారి కుటుంబానికి పోషకులే. ఆ సమయంలో ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఇ–కామర్స్‌పై మరింత దృష్టి పెట్టాము. గత కొన్ని సంవత్సరాలుగా మేము డిజిటల్–ఫస్ట్ బ్రాండ్‌ను నిర్మిస్తున్నాం కాబట్టి మాకు అప్పటికే కస్టమర్ బేస్ ఉంది. గోవాలో ఉండడం వల్ల మేము గ్రీన్ బేస్‌లో ఉన్నాం. లాక్డౌన్ సమయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే మా ఈ–కామర్స్ ఆదాయాన్ని ఎనిమిది రెట్లు పెంచుకోవడానికి మేమందరం చాలా కష్టపడి పనిచేశాం’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు స్నిగ్ధ.ఆ ప్రశ్న అడగాల్సిందే!టీ ప్రియుల నుంచి ఒక ప్రశ్న కోరుకుంటున్నారు స్నిగ్ధ, ‘నేను తాగే టీ ఎక్కడి నుంచి వచ్చింది? అని టీ తాగే వాళ్లు అడిగితే బాగుంటుందని నేను అనుకుంటాను. వైన్లాగే టీ రుచికి సంబంధించి అది ఏ ప్రాంతానికి చెందిందో, దాని ప్రత్యేకత ఏమిటో అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఏదైనా కొన్న ప్రతిసారీ మీ డబ్బు ఒక రైతు జేబులోకి వెళ్తుందా లేదా ఒక పెద్ద బహుళజాతి సంస్థ జేబులోకి వెళ్తుందా అని నిర్ణయించే శక్తి మీకు ఉంటుంది’ అంటారు స్నిగ్ధ. ‘తొలిరోజుల్లోనే పెద్ద స్టార్టప్‌ల గురించి పగటి కలలు కనడం మానేసి, వాస్తవాలను అవగాహన చేసుకుంటూ చిన్న చిన్న అడుగులు వేస్తూ ప్రయాణం ప్రారంభించాలి’ అని ఔత్సాహికులకు సలహా ఇస్తున్నారు స్నిగ్ధ.ప్రతి సీజన్లో వెరై‘టీ’...వ్యాపారం సంగతి సరే, స్నిగ్థాకు ఇష్టమైన టీ ఏమిటి? ‘టీ ప్రియులు ప్రతి ఒక్కరూ సీజన్ ప్రకారం టీ మార్చుకోవాలి. ఉదాహరణకు... వేసవి ప్రారంభంలో నాకు ఇష్టమైనది మందార గ్రీన్ టీ. ఇందులో సోంపు గింజలు ఉంటాయి. ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. మా బోటానికల్ కలెక్షన్స్‌లో మందార పువ్వులు కూడా ఉన్నాయి. ఇవి స్వచ్ఛమైన పువ్వులు కాబట్టి వీటిలో కెఫిన్ ఉండదు. వీటిని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు’ అంటున్నారు స్నిగ్థ. ఇప్పుడు సీన్ మారింది!టీ వ్యాపారం అనేది తరతరాలుగా పురుషులే నడుపుతున్న వారసత్వ వ్యాపారం. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా మేము నిర్మించిన బ్రాండ్‌తో పరిస్థితులు మారాయి. ఇప్పుడు నాకు అతి పెద్ద మద్దతుదారులు, ప్రోత్సాహకులు టీ పరిశ్రమకు చెందిన పురుషులే. టీ ట్రంక్ మన భారతీయ టీల గురించి అవగాహన కలిగిస్తున్న తీరును టీ ఎస్టేట్ యజమానులు అభినందిస్తున్నారు.– స్నిగ్థ మంచంద
లబ్... డబ్బు లయ తప్పొద్దు!
ధరల భయం అంటే... కుటుంబ నిర్వహణ భయం. కుటుంబ నిర్వహణ భయం అంటే... గృహిణి భయం. భర్త సంపాదిస్తాడు సరే... సరిపెట్టాల్సిన బాధ్యత తనదే కదా. అందుకే ఇటీవల ఆదాయం ఉన్నా, లేకున్నా మహిళలు ‘ఫైనాన్షియల్ యాంగ్జయిటీ’తో బాధపడుతున్నారు. దీనిని ఎలా ఎదుర్కొనాలి? రెండు కేస్ స్టడీస్ చూడండి.కేస్ స్టడీ1లత హౌస్‌వైఫ్. వయసు 42 ఏళ్లు. భర్త ప్రైవేట్ ఉద్యోగం. ఇద్దరు పిల్లలు ఇంటర్, డిగ్రీ. నెల జీతం అరవై వేలు. అప్పుల్లేవు, సొంత ఫ్లాట్ ఉంది. కానీ లతకి ప్రతి నెలా ఒకటవ తారీఖు వచ్చిందంటే గుండె దడ. జీతం పడిన వెంటనే లెక్కలు మొదలైపోతాయి. వెచ్చాలు, మెయింటెనెన్సు, ఇంటర్నెట్ బిల్లు, ఓటీటీ బిల్లు, పాలబిల్లు... కరెంట్... వంటగ్యాస్... పిల్లల ఫీజు... భర్తకు పెట్రోలు ఖర్చు, అత్తగారికి మావగారికి పంపాల్సినవి... ‘డబ్బులు సరిపోతాయా... రేపటికి మిగులుతాయా’... దాంతో యాంగ్జయిటీ మొదలు.సింప్టమ్స్యాంగ్జయిటీ వల్ల అదుపులేని చర్యలు మొదలవుతాయి. కూరగాయలు తగ్గించి కొనడం, కొత్త చీర కొనుక్కోకపోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతి గంటకి చెక్ చేయడం, రేపు ఆయన ఉద్యోగం పోతే అని ప్రతి రోజూ ఊహించుకుని ఏడవడం. దాంతో అసిడిటీ, తలనొప్పి, షుగర్ లెవెల్స్ పైకి కిందకి. భర్త ‘అన్నీ నేను చూసుకుంటా కదా’ అన్నా ఆవిడ భయం తగ్గలేదు. ఎందుకంటే సమస్య డబ్బు కాదు, మైండ్ మీద కంట్రోల్ లేకపోవడం. భర్త ఇది చూసి చూసి కౌన్సిలర్‌తో మాట్లాడించాడు. «ధరలు పెరగడం అందరికీ ఉన్న సమస్యే. నీ ఒక్కదానికే కాదు’ అని ఆమెకు అవగాహన కల్పించారు. కౌన్సిలర్ సలహాలతో లత మారింది.లత చేసిన మార్పులు...మనీ డేట్... అంటే నెలకు ఒకసారి భర్తతో కూర్చుని ముప్పై నిమిషాలు లెక్కలు మాట్లాడుకుంది. ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత మిగిలింది... దాచడం, దాపరికం లేదు. ఈ పారదర్శకత వల్ల భయం తగ్గింది. ‘ఎమర్జెన్సీ ఫండ్’ పేరుతో బ్యాంకులో 50 వేలు ఎఫ్.డి. వేసి దానికి ‘హాస్పిటల్/జాబ్ ప్రాబ్లమ్ ఫండ్’ అని పేరు పెట్టుకుంది. ఆ డబ్బు ముట్టుకోకూడదు. ఆ పేరు చూడగానే బుర్రకి ధైర్యం. వర్రీ టైమ్ ఫిక్స్ చేసింది. అంటే రోజంతా డబ్బు గురించి ఆలోచించడం మానేసి సాయంత్రం 6 నుంచి 6:15 వరకు మాత్రమే ‘డబ్బు కష్టాలు’ ఆలోచించేది. టైం అయిపోగానే బలవంతంగా ఆపేసేది. మెల్లగా ఈ మంత్రం పని చేసింది. లత కోలుకుంది. మనం జాగ్రత్తగా ఉంటే అంత ఆందోళన చెందాల్సింది లేదు. అందరితో పాటుగా మనం కూడా ఆర్థిక గండాలను తట్టుకుంటూ ముందుకుపోవచ్చు అని భరోసా కలిగింది.కేస్ స్టడీ 2కవిత వర్కింగ్ ఉమన్. వయసు 35 ఏళ్లు. సింగిల్ విమెన్. తల్లిదండ్రులు, తమ్ముడి చదువు అన్నీ ఆవిడ సంపాదనే. నెల జీతం 80 వేలు. పైకి ‘లేడీ బాస్’. కానీ లోపల మాత్రం వణుకు. కవిత సమస్య ఏమిటంటే ‘గోల్డెన్ హ్యాండ్‌కఫ్స్ యాంగ్జయిటీ’. అంటే జాబ్ నచ్చకపోయినా మానేయలేని పరిస్థితి. బంగారు సంకెళ్లు. ‘నేను ఉద్యోగం మానేస్తే ఇల్లు గడవదు’ అనే ప్రెజర్. బయట పరిస్థితులు బాగా లేవు అనే ఆందోళన.సింప్టమ్స్స్లీప్ రివెంజ్... అంటే నిద్ర మీద పగ. రాత్రి 2 వరకు ఫోన్ చూడటం. ‘పగలంతా నాది కాదు, రాత్రైనా నాది అవ్వాలి’ అనే ఫీలింగ్. ఇంపల్స్ షాపింగ్... అంటే స్ట్రెస్‌లో రెండు వేలు మూడు వేలకు ఆన్ లైన్ షాపింగ్ చేసి, తర్వాత గిల్టీ ఫీల్ అవ్వడం. రిజెక్షన్ సెన్సిటివిటీ:... అంటే బాస్ చిన్న మాట అన్నా ‘నన్ను తీసేస్తారేమో’ అని ఏడవడం. ఫ్యూచర్ బ్లైండ్నెస్... ‘పెళ్లి, పిల్లలు వద్దు. డబ్బు సరిపోదు’ అని జీవితాన్ని పోస్ట్‌పోన్ చేయడం.కవిత కలీగ్ ఇదంతా గమనించింది. కవితను కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లింది. ‘అంతా నార్మల్‌గా ఉన్నా అనవసర ఆందోళనతో బాధపడుతున్నావు’ అని కౌన్సిలర్ చిన్న సూచనలు చేసింది.కవిత చేసిన మార్పులు...ఒన్ పర్సెంట్ రూల్... అంటే తన జీతంలో ఒన్ పర్సెంట్ అంటే 800 తన సంతోషం కోసం అప్పుడప్పుడు ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. కాఫీ, పుస్తకం, మూవీ... ‘నేను కేవలం ఏటీఎం కాదు, మనిషిని’ అని గుర్తుచేసుకోవడానికి స్కిల్ ఇన్సూరెన్స్... అంటే వీకెండ్లో రెండు గంటలు ఫ్రీలాన్స్ కోర్స్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ‘ఈ జాబ్ పోయినా నేను బతకగలను’ అనే ధైర్యం కోసం. జాబ్ కంటే స్కిల్ మీద నమ్మకం పెంచుకుంది. నో–బడ్జెట్ డే... నెలకు ఒక రోజు బడ్జెట్, లెక్కలు, ఫోన్లో బ్యాంక్ బేలెన్స్ చూడకూడదు. ఆ రోజు బుర్రకి హాలిడే. దీనివల్ల మిగతా 29 రోజులు బుర్ర కంట్రోల్లో ఉంటుంది. ఆరు నెలల తర్వాత కవిత మొదటిసారి మూడు రోజులు గోవా వెళ్లొచ్చింది. ‘అదే సంపాదన. ఆరు నెలలు కొంచెం కొంచెం దాచాను. నా వల్ల అయ్యింది’ అని ఏడ్చేసింది ఎయిర్‌పోర్ట్‌లో. డబ్బు భయం ‘పేదవాళ్ల’ సమస్య మాత్రమే కాదు. బ్యాంక్‌లో లక్షలు ఉన్నవాళ్లకు కూడా ఫైనాన్షియల్ యాంగ్జైటీ ఉంటుంది. ఇది పర్సు సమస్య కాదు, ‘పర్సనల్ సెక్యూరిటీ’ ఫీలింగ్ సమస్య. దీన్ని మందులతో కాదు, మనసుతో గెలవాలి.కుటుంబం ఏం చేయాలి?భర్త, భార్య, పిల్లలు... ఇంట్లో అందరికీ బేసిక్ లెక్కలు తెలియాలి. భారం ఒక్కరి మీద పడితే యాంగ్జైటీ వస్తుంది. ప్రతి సమస్యను అందరూ చర్చించుకుంటే ఏవి కొనసాగించాలో ఏవి వదులుకోవాలో అందరికీ తెలుస్తుంది. ఫైనాన్షియల్ యాంగ్జయిటీతో రోజూ ఏడుపు, గుండె దడ, నిద్ర లేకపోవడం రెండు వారాలకు మించి ఉంటే – సైకాలజిస్ట్‌ని కలవండి. డబ్బు ప్లానింగ్ రాకపోతే సెబి రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలవండి. ఇందులో సిగ్గు పడాల్సింది ఏమీ లేదు.
కనిపించని కథ...గాలి బలమెంత!?
వేసవిలో వేడికి చల్లని గాలి మేనికి తగిలితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అదే గాలి ఉదృతమైతే చెట్ల కొమ్మలు ఊగడం, తలుపులు కిటికీలు టపటప కొట్టుకోవడం, తేలిక΄పాటి వస్తువులు ఎగరడం.. ఇవన్నీ చూస్తుంటాం. కానీ, ‘గాలి కంటికి కనిపించదు, ప్రపంచాన్ని మాత్రం కదిలిస్తుంది..’ అంతటి శక్తిమంతమైనది. ఇలా మన కళ్ల ముందు కనిపించే వస్తువులను చూపుతూ, కనపడని గాలిని పరిచయం చేయవచ్చు. పిల్లల వయసును బట్టి, అనేకానేక విషయాలను ఉదహరిస్తూ ‘గాలి’బలం గురించి చెప్పవచ్చు. తెలుసుకోమనవచ్చు. వారికి తెలిసింది తమ క్రియేటివిటీతో చూపమనండి. 1. కనిపించని కథ... గాలి కంటికి కనిపించదు. అయితే చెట్ల కొమ్మలు ఎందుకు ఊగుతాయి, కర్టెన్ ఎందుకు కదులుతుంది, ఉక్క΄ోస్తున్నప్పడు ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది.. ఇవన్నీ చెప్పడంతోపాటు ఒక పేపర్ తీసుకుని నోటితో ఊది కదిలించమనండి. టేబుల్ ఫ్యాన్ ముందు రిబ్బన్ కట్టి ఎలా ఊగుతుందో చూపించండి. కారులో ఏసీ లేకుండా డోర్స్ అన్నీ లాక్ చేసి, కాసేపు ఉంటే ఏమవుతుందో చెప్పమనవచ్చు. ఈ విధానం వల్ల ఊపిరిని నిలిపే ్ర΄ాణవాయువును ఎన్నో రూపాలుగా కళ్ల ముందు ఆవిష్కరింపజేయవచ్చు అనే విషయం పిల్లలకు అర్ధమవుతుంది. 2. విండ్మిల్.. గాలి పటం... గాలి బలంగా ఉంటే విండ్మిల్ ఎలా తిరుగుతుందో చూపించవచ్చు. బెలూన్‌లో గాలి నింపి, బయటకు వదలమని చెప్పవచ్చు. గాలిపటం ఎందుకు ఎగురుతుంది? గాలి లేక΄ోతే ఏమవుతుంది? పక్షులు గాలిని ఎలా ఉపయోగిస్తాయి? పిల్లలతో చిన్న గాలిపటం డ్రా చేయించండి లేదా తయారు చేయించండి. 3. శుభ్రమైన గాలి... వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ గాలిని ఎందుకు కలుషితం చేస్తుంది. చెట్ల వల్ల గాలి ఎలా శుభ్రపడుతుంది? మొక్కల పెంపకం ప్రాధాన్యత, గాలి వేగం పెరిగితే ఏమవుతుంది? తుఫాన్లు ఎలా వస్తాయి, సుడిగాలులు ఎలా ఉత్పన్నమవుతాయి... గాలిపైన ఎవరెన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయదగితే అన్నీ చేయమనండి.4. ఊహలకు రూపం... గాలికి కోపం వస్తే.. ఊహాకథలు చెప్పమనండి. పాటలు పాడమనండి. ఒక చిన్న వ్యాసం రాయమనండి. పంచభూతాలను తమ సృజనాత్మక కోణంలో ఎలా చూపుతారో ఛాయిస్ వారికే ఇవ్వండి. ఈ విధానం వల్ల కాలుష్యకార కాలను పిల్లలు గుర్తించగలుగుతారు. పర్యావరణంలో తమ పాత్రను తెలుసుకోగలుగుతారు. సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. (‘ఫైవ్ ఎలిమెంట్స్’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన.. ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. మెయిల్ ఐడి sakshisummerkids@gmail.com) నిర్వహణ: నిర్మలారెడ్డి(చదవండి: సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...)
సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...
గుర్తు తెలియని వ్యక్తులు నా బ్యాంకు ఖాతాలో 500 రూపాయలు జమ చేశారు. వాళ్లు సైబర్ నేరగాళ్ళు, ఆ నగదు ఆన్లైన్ మోసం ద్వారా వచ్చింది కాబట్టి నా బ్యాంకు ఖాతా కూడా సీజ్ చేస్తున్నాము అని పంజాబ్ సైబర్ క్రైమ్ వారు నా అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. అలా ఫ్రీజ్ చేసేవరకు ఈ 500 నా అకౌంట్లోకి వచ్చాయి అన్న విషయం కూడా నాకు తెలియదు. పంజాబ్ పోలీసులను సంప్రదించగా, వారు చెప్పిన విధంగానే అన్ని పత్రాలను, అఫిడవిట్‌ను – నా వ్యక్తిగత వివరాలతో సహా సమర్పించాను. ఇది జరిగి ఇప్పటికి పదినెలలు అవుతుంది కానీ ఇంతవరకు నా అకౌంట్‌ను రిలీజ్ చేయకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బ్యాంకువారిని అడిగితే పంజాబ్ కోర్టులో కేసు వేసుకోవాలి అని చెప్తున్నారు. పంజాబ్‌కి వెళ్లి కేసులు వేయడం చాలా కష్టం – అంత ఖర్చు పెట్టడం కూడా ఇబ్బంది. సలహా ఇవ్వగలరు. – చీమకుర్తి సునీల్ కుమార్, విజయవాడపంజాబ్ పోలీసులు మిమ్మల్ని నిందితుడిగా చూపిస్తూ ఏదైనా ఎఫ్.ఐ.ఆర్. చేశారా అనే విషయం ముఖ్యమైనది. మీ మీద నేరుగా నింద లేకుండా, మీ పేరును ఎటువంటి ఎఫ్.ఐ.ఆర్.లో నిందారోపితుడుగా చూపించకుండా ఉంటే మీరు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అయితే మీ బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్ హైదరాబాదులో కూడా ఉండాలి. పైన తెలిపిన అంశాలు మీ కేసులో ఉండి ఉంటే, బ్యాంకు వారు చెప్పినట్టుగా పంజాబ్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. పూర్వం కోర్టు పరిధి ఏది వస్తుంది అనే విభేదం కొంత ఉన్నప్పటికీ, అనేక హైకోర్టులు ఇలాంటి బ్యాంక్ ఫ్రీజింగ్ కేసులలో వేరే రాష్ట్రాల పోలీసుల ద్వారా ఫ్రీజ్ చేసిన అకౌంట్లను విడుదల చేయాల్సిందే అని తీర్పులు ఇచ్చాయి. కాబట్టి తెలంగాణ హైకోర్టును రిట్ పిటిషన్ ద్వారా ఆశ్రయించండి. అలా వెళ్ళేముందు మీ ఎకౌంటు ఫ్రీజ్ అయిన కారణానికి గల పత్రాలను, ముఖ్యంగా ఎఫ్.ఐ.ఆర్.ను– పంజాబ్ పోలీసులు బ్యాంకు వారికి పంపిన లేఖలను క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు చెప్పినట్లుగా 500 మాత్రమే మీ అకౌంట్‌కు వచ్చి ఉంటే – అంతమొత్తాన్నే మీ అకౌంట్లో ఫ్రీజ్ /లీన్ ఉంచి మిగతా నగదును వాడుకునేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చే ఆస్కారం ఉంది. లాయర్ గారితో ఈ విషయాలను మాట్లాడండి. ఇలాంటి గుర్తు తెలియని ట్రాన్సాక్షన్లు వచ్చిన వెంటనే బ్యాంకు వారికి లిఖితపూర్వకంగా చెప్పడం కొంతవరకు మిమ్మల్ని కాడుతుంది. - శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )చదవండి: 'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
అంతర్జాతీయం
యాప్ద్బాంధవులు
సమస్యను అందరూ గుర్తిస్తారు. కానీ, దాని పరిష్కార మార్గాలను కొందరే కనుగొంటారు. వారు మార్గదర్శకులుగా నిలుస్తారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం, దాడులతో గాజా విధ్వంసమైంది. ఆ ప్రాంతమంతా సంక్షోభంలో నిండిపోయింది. ఆ సంక్షోభంలోనూ కొత్త దారులేస్తూ ఆశలు చిగురింపజేస్తున్నారు అక్కడి యువత. సాంకేతికతతో తమ దేశ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు కోల్పోయినందుకు నిరాశతో ఊసురోమని కూర్చోకుండా తామే కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. గాజా నగరంలోని ‘తాకత్’వర్క్ స్పేస్‌లో ఓ మూలన లాప్టాప్తో కూర్చుని సీరియస్‌గా పనిచేసుకుంటోంది 23 ఏళ్ల సజా అల్ ఘాల్. ఆమె మరో దేశంలోని కంపెనీ కోసం పనిచేయడంలేదు. పాలస్తీనా ప్రజల ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడానికి పనిచేస్తోంది. తన సొంత మొబైల్ యాప్‌ను డెవలప్ చేస్తోంది. ఆమె డెవలప్ చేస్తున్న యాప్ పేరు ‘వాసెల్నీ’(డబ్ల్యూఏఎస్ఈఎల్ఎన్ఐ). అంటే అరబిక్‌లో ‘నా గమ్యాన్ని చేరడంలో నాకు సహాయం చేయండి’అని అర్థం. యుద్ధం తరువాత పాలస్తీనాలో పెరిగిన రవాణా ఖర్చులను తగ్గించడానికి రూపొందించిన రవాణా యాప్. ఈ యాప్ వల్ల ప్రయాణాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. ఉదాహరణకు, ఉదయం 8 గంటలకు అల్–షిఫా నుంచి మధ్య గాజా నగరంలోని అస్–సరయాకు ఎవరైనా ఒక ప్రయాణాన్ని ప్రతిపాదించవచ్చు. ఆ తర్వాత అటుగా వెళ్లాల్సి ఉన్న ఇతర వ్యక్తులు కూడా అదే ప్రయాణంలో చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఖర్చును పంచుకోవచ్చు. జస్ట్ లైక్ క్యాబ్ షేరింగ్ అన్నమాట. తప్పిపోయిన వస్తువులు... సజా తరహాలోనే యుద్ధ సమయంలో సర్వసాధారణమైన మరో సమస్యపై దృష్టి పెట్టారు 26 ఏళ్ల ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గ్రాడ్యుయేట్ బహా అల్మల్లాహి. యుద్ధ సమయంలో ప్రజలు సర్వం కోల్పోయారు. వ్యక్తిగత వస్తువులు, అధికారిక పత్రాలు, ఫోన్లు, బ్యాగులు.. మరెన్నో. వాటి ఖరీదు ఎక్కువేం కాకపోవచ్చు. కానీ, వాటి విలువ ఎక్కువ. జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉన్న వస్తువులై ఉంటాయి. అలా పోగొట్టుకున్న వస్తువుల గురించి సోషల్ మీడియా వేదికల్లో విజ్ఞప్తులు వెల్లువెత్తుతుండటం బహా గమనించారు. పోగొట్టుకున్న, లేదా దొరికిన వస్తువుల కోసం ఒక ప్రత్యేక డిజిటల్ వేదికను సృష్టించాలనే ఆలోచన అతనికి వచి్చంది. అలా డెవలప్ అయ్యిందే ‘రజ్జా’లి’. అంటే అరబిక్‌లో ‘నాకు తిరిగివ్వండి’అని అర్థం. ‘మీకు ఏదైనా దొరికినా లేదా మీరేమైనా పోగొట్టుకున్నా.. దానికోసం ఇక్కడ వెతకండి’అని అన్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగలేదు. యుద్ధం నిరాశ్రయులను చేస్తుండటంతో గాజాలో వలసలు రోజురోజుకు పెరిగాయి. ఈ క్రమంలో కిక్కిరిసిన జనాల మధ్య తమ ఆతీ్మయులను కోల్పోతున్నారు. అలా తప్పిపోయిన పిల్లల కేసులను కూడా చేర్చడానికి భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పిల్లలు తప్పిపోతే, వెంటనే వారి ఫొటో వివరాలతో వెంటనే సమీప ప్రాంతాల ప్రజలకు తక్షణం తెలపడానికి ఈ యాప్ రూపొందించారు. అనేక అడ్డంకులు.. అయితే, యాప్‌ను రూపొందించడంతో సగం పని మాత్రమే పూర్తయ్యింది. వాటిని జనంలోకి విస్తతంగా తీసుకెళ్లడం అసలైన టాస్్క. ఉదాహరణకు, సజా రూపొందించిన వాసెల్నీ యాప్‌ను ఒక వ్యక్తి తెరిచి, అదే సమయంలో అదే మార్గంలో ప్రయాణించడానికి తక్కువ మంది ఉండటమో, అసలు లేకపోవడమో జరిగితే.. అతను ఆ యాప్‌పై విముఖత చూపే అవకాశం ఉంది. అందుకే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, డ్రైవర్లను ధృవీకరించడానికి స్థానిక అధికారుల ఆమోదం అవసరమని సజా అంగీకరిస్తున్నారు. పోగొట్టుకున్న పత్రాలను కనుగొనడానికి తన ప్లాట్‌ఫామ్‌ను విశ్వసించాలంటే అధికారిక సంస్థల సహకారం అవసరమని బహా చెబుతున్నారు. ఇదంతా వారికి ఆర్థిక భారంగా మారింది. ఎందుకంటే, కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలపై ఆధారపడుతున్నాయి. వీటి కొనుగోలు చాలా ఖరీదైన పని. శిక్షణా కేంద్రంగా.. అయితే కేవలం పనిచేసుకోవడానికి కొన్ని సదుపాయాలు, స్థలం మాత్రమే కల్పిస్తే సరిపోదని తొందర్లోనే అర్థమైంది. గాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ టెక్ ప్రపంచం నుంచి యుద్ధం వేరు చేసింది. రెండేళ్లలో టెక్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, గాజాలోని యువత ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగవంతమైన విజృంభణతో.. గాజాలో ప్రోగ్రామర్లు ప్రపంచ మార్కెట్ డిమాండ్లను అందుకోవడంలో వెనుకబడ్డారు. ఈ అంతరాన్ని పూడ్చే శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఫలితంగా, విశ్వవిద్యాలయాలు, స్థానిక, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యంతో ‘తాకత్’ఒక కార్యక్షేత్రం నుంచి శిక్షణనిచ్చే ఇంక్యుబేషన్ కేంద్రంగా రూపాంతరం చెందింది. వీరి నుంచే కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. తమ ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యల అనుభవాల నుంచే ఈ పరిష్కార మార్గాలు కనిపెట్టారు విద్యార్థులు. అయినప్పటికీ, ఈ ప్రాజెక్టులకు మోక్షం కలగాలంటే పెట్టుబడి అవసరం. డెవలపర్లు ప్రధాన ఆర్థిక, సాంకేతిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రతిభను ఆచరణలోకి తీసుకురావడానికి పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులకు ‘తాకత్’... యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తరువాత అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక, ఉన్నా.. విద్యుత్ అందుబాటులో లేకపోవడం, ఇంటర్నెట్ అంతరాయాలతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అవి విలాస వస్తువులుగా మారిపోయాయి. కేవలం విద్యుత్, ఇంటర్నెట్ ఉన్న చోటుకోసం నెలకు రెండొందల షెకెల్స్.. అంటే దాదాపు ఏడువేలు. అలాంటి వారికోసమే కో వర్కింగ్స్పేస్ స్థాపించారు సీఈఓ, ఇంజనీర్ అయిన షరీఫ్ నయీమ్. దాని పేరు ‘తాకత్’. ‘యుద్ధం ప్రారంభంలో మౌలిక సదుపాయాలు ధ్వంసవ్వడంతో చాలాకాలం పాటు కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలాది మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లు పనిచేసే అవకాశం కోల్పయారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు అంతర్జాతీయ కాంట్రాక్టులను పోగొట్టుకున్నారు. పవర్ లేక కొందరు ఆన్లైన్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. వారందరికీ పనిచేసుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో గాజాలో ‘తకాత్’స్థాపించాను’అని నయీమ్ చెబుతున్నారు. యుద్ధ సమయంలో గాజా నగరంలో ఏర్పాటైన ఇది క్రమంగా నుసైరత్, డెయిర్ అల్–బలాహ్ సహా అనేక ప్రాంతాలకు విస్తరించింది. గాజా నగరంలో తన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి, సుమారు 250 మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లకు వసతి కల్పించింది. – సాక్షి, నేషనల్ డెస్క్
42 యుద్ధవిమానాలను కోల్పోయిన అమెరికా
వాషింగ్టన్: యుద్ధంలో ఇరాన్ వాయుసేన ను చావుదెబ్బ తీశామని గొప్పలు చెప్పకునే అమెరికా సైతం రణరంగంలో భారీస్థాయిలో ఆయుధాలు, యుద్దవిమా నాలను కోల్పోయిందని అమెరికా చట్టసభలు వెలువర్చిన ఒక నివేదిక ద్వారా వెల్లడైంది. అమెరికా చట్టసభల లైబ్రెరీలో భాగమైన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్స్)లోని విదేశాంగ, యుద్ధ, వాణిజ్యవిభాగంలోని విషయనిపుణులు, పరిశోధకులు, న్యాయవాదులు సంయుక్తంగా పారదర్శకంగా ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ప్రకారంఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట ఫిబ్రవరి 28న అమెరికా మొదలెట్టిన ఇరాన్ యుద్ధంలో మొత్తంగా 42 యుద్ధవిమా నాలను ట్రంప్ బలగాలు కోల్పోయాయి. ఇందులో ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధవిమానాలు, ఎఫ్–35ఏ లైట్నింగ్–2 యుద్ధవిమానం, ఏ–10 థండర్‌బోల్ట్–2 భూతలదాడుల యుద్ధ విమానం, కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన విమానం, ఈ–3 సెంట్రీ అవాక్స్ నిఘా, పర్యవేక్షణ కమాండ్ విమానం, ఎంసీ–130జే కమాండో–2 ప్రత్యేక ఆపరేషన్ల విమానం, హెచ్‌హెచ్–60 డబ్ల్యూ జోలీ గ్రీన్2 హెలికాప్టర్, 24 ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు, ఎంక్యూ–4సీ ట్రైటన్ డ్రోన్లు ఉన్నాయి. యుద్ధవిమా నాలు, వాహనాలు, మందుగుండు, సాయుధ ఉపకరణాలు మొత్తంగా కలిపి ఇప్పటిదాకా రూ.2.81 లక్షల కోట్ల విలువైన రక్షణరంగ ఆస్తులను కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది.
విమానాల కూల్చివేత కేసు.. రావుల్ కాస్ట్రోకు అమెరికా షాక్
అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. 1996 నాటి అమెరికా పౌర విమానాల కూల్చివేత కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రో (94) పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో అధికారికంగా విచారణ ప్రారంభమైంది.ఈ చార్జ్‌షీట్ విడుదలైన కొద్ది గంటల్లోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా ప్రజలను ఉద్దేశించి ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. క్యూబాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న కాస్ట్రో కుటుంబ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇదే విషయంపై అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మయామిలో మాట్లాడుతూ.. "30 ఏళ్ల కిందట హత్యకు గురైన నలుగురు అమెరికన్ల కుటుంబాలు ఇప్పటికి న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి. వారు సాధరణ పౌరులు. వారి వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. శరణార్థులను కాపాడానికి వెళ్లిన మా పౌరులను పొట్టన పెట్టుకున్నారు. అందులో రావుల్ కాస్ట్రోది కీలక పాత్ర. అతడి అరెస్ట్ కోసం త్వరలోనే ఒక వారెంట్ జారీ చేస్తాం. కాబట్టి అతడు తనంతట తాను అమెరికాకు వస్తాడని ఆశిస్తున్నాము. లేకపోతే ఇతర మార్గాల్లో మేమే రప్పిస్తామని" ఆయన పేర్కొన్నారు.అసలు 1996లో ఏమి జరిగిదంటే?'బ్రదర్స్ టు ది రెస్క్యూ' మయామి కేంద్రంగా పనిచేసే ఒక మానవతావాద సంస్థ. అప్పటిలో క్యూబాలోని కమ్యూనిస్ట్ దారుణాలను తట్టుకోలేక చిన్న పడవల్లో సముద్రం గుండా అమెరికాకు పారిపోయే క్యూబన్ శరణార్థులను ఆకాశం నుండి గుర్తించి, వారిని రక్షించడం ఆ సంస్థ పని. ఈ సంస్థకు చెందిన మూడు చిన్న సివిలియన్ విమానాలు 1996 ఫిబ్రవరి 24న ఫ్లోరిడా జలసంధి మీదుగా ప్రయాణించాయి. అయితేఅంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తుండగా క్యూబాకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు వాటిపై దాడి చేసి కూల్చివేశాయి. ఈ ఘటనలో కార్లోస్ కోస్టా, అర్మాండో అలెజాండ్రే జూనియర్, మారియో డి లా పెనా, పాబ్లో మోరల్స్ అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు అమెరికా పౌరులు ఉన్నారు. ఆ సమయంలో రావుల్ కాస్ట్రో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్నారు. అతడి ఆదేశాల మేరకే అమెరికా సివిలియన్ విమానాలను కూల్చివేశారని అమెరికా న్యాయశాఖ నిర్ధారించింది. దీంతో ఇన్నాళ్ల తర్వాత కాస్ట్రోపై అభియోగాలు నమోదు చేసింది.
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌లో తనకు తనకు విశేష ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశముందని వెల్లడించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కూడా ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారునెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన ఒక యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నాకు మాత్రం 99 శాతం ప్రజాదరణ ఉంది. నేను అక్కడ ప్రధానమంత్రిగా పోటీ చేసినా గెలవగలను" అని ట్రంప్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా ఇరాన్‌తో ఒప్పందం గురించి విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఎలాంటి తొందర లేదని ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించడమే తమ లక్ష్యమని, ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
జాతీయం
‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఊహించని రీతిలో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార బీజేపీ అధికారిక ఖాతా కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు సృష్టించిన కొద్ది గంటల్లోనే, ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.బీజేపీని దాటేసిన క్రేజ్!కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం 8.7 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న బీజేపీ అధికారిక ఇన్‌స్టా ఖాతాను ఇది అధిగమించింది. కాంగ్రెస్ 13 మిలియన్ల ఫాలోవర్లతో ముందుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వెనుకబడి ఉంది. ఈ మైలురాయిని అందుకున్న కొన్ని గంటల్లోనే ‘సీజేపీ’ ఎక్స్ అకౌంట్‌ను భారత్‌లో బ్లాక్ చేశారు. ‘మేము ఊహించినట్టే జరిగింది’ అంటూ ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ స్పందించారు.సుప్రీం వ్యాఖ్యల నుండి పుట్టిన ఉద్యమంనిరుద్యోగం, పేపర్ లీకేజీలు, రాజకీయాలపై విసుగు చెందిన జెన్-జీ యువత ఆవేదన నుండి పుట్టిన పొలిటికల్ సెటైర్ మూవ్మెంట్ ఇది. గత వారం ఒక కోర్టు విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగులు, ఆన్లైన్ యాక్టివిస్టులను ఉద్దేశించి ‘బొద్దింకలు’,'పరాన్నజీవులు' అని వ్యాఖ్యానించారనే వార్తలతో ఈ ఉద్యమం మొదలైంది. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ, యువత ఈ వినూత్న పార్టీని స్థాపించారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, నకిలీ డిగ్రీల వారినే తానలా అన్నానని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు.సెలబ్రిటీల మద్దతు.. భారీ నెట్వర్క్బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, మాజీ ఆప్ సోషల్ మీడియా కార్యకర్త అయిన 30 ఏళ్ల అభిజీత్ దిప్కే ఈ వినూత్న మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ’ అనే నినాదంతో, కేవలం హాస్యం, మీమ్స్ ఆధారంగా యువతను ఇది విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వైవిధ్యమైన డిజిటల్ ప్రచారానికి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్, టీఎంసీ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా మద్దతు తెలపడం విశేషం.ఇది కూడా చదవండి: ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ!
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు హాట్ చర్చకు దారి తీసింది. గత ప్రభుత్వ హయాంలో అరెస్టై జైల్లో ఉన్న ప్రముఖ యూట్యూబర్ ‘సావుక్కు’ శంకర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. శంకర్‌పై గూండా యాక్ట్‌ను ఎత్తేయాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. దీంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సావుక్కు శంకర్(Savukku Shankar) అనే పేరు తమిళనాడులో రాజకీయాలు, మీడియా, ప్రజాస్వామ్య చర్చల్లోనూ తరచూ వినిపిస్తుంటుంది. సావుక్కు అంటే కొరడా అని అర్థం. విజిల్‌బ్లోయర్‌గా, సిస్టమ్‌కి బలైన వ్యక్తిగా ఆయన అక్కడి జనాలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన నోటి దురుసును విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఆయన ట్రాక్ రికార్డు చెప్పాలంటే.. గత ఐదేళ్ల కాలంలో ఏకంగా తొమ్మిదిసార్లు అరెస్ట్ అయ్యారు ఆయన. ఎవరీ సావుక్కు శంకర్.. ఆచిముత్తు శంకర్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి. విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగంలో క్లర్క్‌గా పని చేశారు. అయితే 2008లో తమిళనాట సంచలనం సృష్టించిన ఆడియో లీక్ కేసులో సస్పెండ్ అయ్యి.. దర్యాప్తు తదనంతరం ఉద్యోగం పొగొట్టుకున్నారు. ఆ స్కాంలో ఓ మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఆపై సావుక్కు అనే వెబ్సైట్, యూట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. అవినీతి, అధికార దుర్వినియోగం బయటపెట్టిన వ్యక్తిగా ఆయనకంటూ తమిళనాట ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమంలో ఆయన నోటి నుంచి నిజాలే వస్తాయని జనం భావించేంతగా పరిస్థితి చేరుకుంది. దీంతో వ్యవస్థ నుంచి ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలపై ఆయన చేసిన విమర్శలు, న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు.. ప్రజల్లో ఒక వర్గానికి ఆయనను ధైర్యవంతుడిగా చూపించాయి. అవినీతి వ్యతిరేకంగా పోరాడే యువత, ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నవారు ఈయనకు మద్దతుగా నిలిచేవారు. అదే సమయంలో.. మహిళలపై నోరు పారేసుకోవడం, వ్యక్తిగత దాడులు ఆయనపై కాస్త నెగెటివిటీని క్రియేట్ చేశాయి. డీఎంకే హయాంలో..2021లో స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శంకర్‌పై వరుసగా కేసులు నమోదయ్యాయి. గూండాస్ యాక్ట్ కింద పలుమార్లు అరెస్టు కావడం, ఎన్డీపీఎస్ కేసులు ఎదుర్కొన్నప్పటికీ, కోర్టులు మాత్రం ఆయన్ని నిర్దోషిగా తీర్పునిస్తూ డీఎంకే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేవి. అంతెందుకు 2024లో, మద్రాస్ హైకోర్టు ఆయనపై ఉన్న ఓ సంబంధించి నిర్బంధాల్ని రద్దు చేసింది. దీంతో.. డీఎంకే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఆయన్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని తమిళ ప్రజలు భావించేవారు. ‘‘తప్పుడు కేసులతో స్టాలిన్ ప్రభుత్వం నా నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ స్వయంగా ఆయన కూడా ఆరోపించేవారు. ఈ ఏడాది పరువు నష్టం కేసులోనూ మద్రాస్ హైకోర్టు ఆయనకు బెయిల్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగానే..2026 ఏప్రిల్‌లో చెన్నై పోలీసులు గూండాస్ చట్టం కింద నిర్బంధం విధించారు. ఏపీలో అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకువచ్చే సమయంలో పోలీసులపై రాళ్లు విసిరారని కేసు పెట్టారు. అయితే ఈ కేసులో ఆయన నిర్దోషి అని విజయ్ ప్రభుత్వం గుర్తించింది. అడ్వైజరీ బోర్డు పరిశీలనలో ఆయన నిర్బంధానికి తగిన కారణం లేదని తేలడంతో విడుదల చేయాలని ఆదేశించింది. ఆయనపై ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. వాటిలో చిక్కులను పరిశీలించాక ఆయన్ని విడుదల చేయాలని పోలీసు శాఖకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడో విషయం ఏంటంటే.. సావుక్కు శంకర్ విజయ్‌నూ వదల్లేదు. కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత తీరును ఏకిపారేస్తూ వీడియో సిరీస్ తీశాడు. వాటికి విపరీతంగా ఆదరణ దక్కింది.
‘బిహార్’ దెబ్బ: బంగ్లా వీడి ఆశ్రమానికి ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం దరిమిలా రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌ను కొత్త నిర్ణయం తీసుకున్నారు. పట్నాలోని విలాసవంతమైన బంగ్లాను వదిలి, ఒక ఆశ్రమానికి తన నివాసాన్ని మార్చారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.షేక్‌పురా హౌస్ ఖాళీ.. ఆశ్రమంలోనే బసదర్భంగాలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ తాను పట్నాలోని పాత నివాసాన్ని ఖాళీ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఐఐటీ పట్నాకు సమీపంలో ఉన్న ‘బిహార్ నవనిర్మాణ ఆశ్రమం’ ఇకపై తన నివాసమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ తన ముద్ర వేసేంత వరకు, అంటే తదుపరి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తాను ఈ ఆశ్రమంలోనే ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇంతకాలం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక ‘షేక్‌పురా హౌస్’ బంగ్లా నుండి కార్యకలాపాలు సాగించారు.ఘోర పరాజయం.. నితీష్‌పై తీవ్ర విమర్శలుఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఘోర పరాభవం తర్వాత పీకే రూట్ మార్చారు. ఇదే సమయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ కుమారుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కావడంపై మండిపడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజల వలసలను ఆపలేని ముఖ్యమంత్రి, తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకు మాత్రం గట్టి పునాది వేసుకున్నారని పీకే ఎద్దేవా చేశారు.ఓటర్లకు పిలుపు.. రూ.10 వేల పథకంపై ఎటాక్కుల మతాలకు, డబ్బు ఆశలకు లొంగకుండా ప్రజలు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయాలని ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ వంటి నాయకుల మాటలకు మోసపోవద్దన్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ కింద సుమారు 1.5 కోట్ల మంది మహిళలకు పంపిణీ చేసిన రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని ఉద్దేశిస్తూ.. కేవలం పదివేల రూపాయల కోసం ఓట్లను అమ్ముకోవద్దని పీకే ఓటర్లను హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ‘నాన్నా.. నీ కల నిజం చేస్తా’.. రాహుల్ భావోద్వేగ ట్వీట్!
నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం : సైంటిస్టుల హెచ్చరిక
శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగంతో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతలు ఎగసి వాతావరణ మార్పులు సర్వసాధారణమవుతున్నాయి. గ్లోబల్ వారి్మంగ్ ధాటికి వర్షాలు తగ్గి పంటదిగుబడి దారుణంగా పడిపోయి ప్రజలకు ఆకలికష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. వాతావరణ మార్పులు అనేవి ఒక్క మానవాళికే కాదు జలచరాలకూ కొత్త పెనుసమస్యగా దాపురించిందని అంతర్జాతీయ అధ్యయనం ఒకటి హెచ్చరికలు చేసింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో నదీజలాల ఉపరితల ఉష్ణోగ్రతలు హెచ్చుతున్నాయని దీంతో నదీజలాల నుంచి ఆక్సిజన్ నెమ్మదిగా అదృశ్యమవుతోందన్న ప్రమాదహెచ్చరికలను చైనాలోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలసహితంగా వెల్లడించారు. 1985 ఏడాది నుంచిచూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 21,000 ప్రధాన నదుల్లో ఆక్సిజన్ స్థాయిలు నెమ్మదిగా తగ్గుతున్నాయని అధ్యయనంలో తేలింది. 1985 ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ముఖ్యమైన నదీజలాల్లో ఆక్సిజన్ 2.1 శాతం తగ్గిందని వెల్లడైంది. ఉష్ణోగ్రతలు ఇలాగే అత్యధిక స్థాయిల్లో కొనసాగితే నదీజలాల్లో ఆక్సిజన్ క్షీణత మరింత పెరిగే ఆస్కారముంది. ఆక్సీజన్ తగ్గిపోతే ప్రాణవాయువును పీల్చి బతికే జలచరాల మనుగడే ప్రశ్నార్థకమంగా మారే ప్రమాదముంది. ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘సైన్సెస్ అడ్వాన్సెస్’జర్నల్‌లో శుక్రవారం ప్రచురితమయ్యాయి. ఆమ్లజని గాఢత తగ్గుతూ పోతే వచ్చే శతాబ్దంచివరినాటికి తూర్పు అమెరికా మొదలు భారత్ దాకా ఉష్ణమండల ప్రాంతాలు దేశాల్లో నదుల్లో చేపల వంటి జలచరాల సంఖ్య దారుణంగా పడిపోతాయి. అప్పుడు నదీజలాల్లో వెతికినా ఒక్క చేప కూడా దొరకదని అధ్యయనం ముందస్తు ప్రమాదఘంటికలు మోగించింది. సాధారణంగా భౌతిక, రసాయన శాస్త్ర భావనల ప్రకారంచూసినా వేడి నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మానవప్రేరేపిత వాతావరణ మార్పుల ప్రభావం అతిగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో ఆయువు పోయాల్సిన ఆమ్లజనికి మనిషే స్వయంగా ఆయువు తీస్తున్నాడని నివేదిక ఘాటు వ్యాఖ్యలుచేసింది. ప్రస్తుతమున్న క్షీణతరేటును పరిగణనలోకి తీసుకుంటే ఈ శతాబ్దంచివరినాటికి నదుల్లో ఆక్సిజన్ 5 శాతం తగ్గిపోయే అవకాశముంది. నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం మత్స్యకారులకు, మత్స్యసంబంధ వృత్తులతో జీవనం సాగించే జనాభాకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో కీలక రచయిత, నంజియాంగ్ సిటీలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఎన్విరాన్మెంటల్ విభాగ శాస్త్రవేత్త క్వీ గువాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘నదుల్లో ఆక్సిజన్ తగ్గిపోతే దానిని డీఆక్సిజనరేషన్గా పిలుస్తాం. ఇది చేపల సంతతిపై, వాటి మనుగడపై దుష్ట్రభావం చూపిస్తుంది. నాణ్యమైన ఆక్సిజన్ లేకపోతే జలచరాల ఉనికి ప్రమాదంలో పడుతుంది. చేపలు, రొయ్యలు, ఇతరత్రా చలజరాల దిగుబడి తగ్గిపోతే మత్స్యకారులతోపాటు మత్స్యరంగం అభివృద్ధి సైతం కుంటుబడుతుంది. ఇదీ చదవండి: సరస్వతీ మాత విగ్రహం కోహినూర్ కన్నా ముఖ్యంఇది పరోక్షంగా ఆయా దేశాల జీడీపీపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆక్సిజన్ క్షీణతరేటు విపరీతంగా పెరిగిపోతే నదీమతల్లులు చివరకు జలచరాల మృత్యుకుహరాలుగా రూపాంతరంచెందుతాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, చీసాపీక్ బే, లేక్ ఎరీ లాంటి ప్రాంతాల్లో చేపలు కనీసం శ్వాసించే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు మత్స్యసంపదకు ఆలవాలమైన ప్రాంతాలన్నీ డెడ్ జోన్లుగా మిగిలిపోతాయి’’అని శాస్త్రవేత్త హెచ్చరించారు. గంగానది మరింత దారుణం ‘‘పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సగటు మరింత పెరుగుతున్న ఈ రోజుల్లో గంగానదిలో ఆక్సిజన్ పాళ్లు ఏకంగా 20 రెట్లు ఎక్కువ వేగంతో క్షీణిస్తున్నాయి. తూర్పు అమెరికా, ఆర్కిటిక్, భారత్, దక్షిణ అమెరికాలోని నదుల్లో ఈ శతాబ్దం చివరినాటికి ఆక్సిజన్ దాదాపు 10 శాతం క్షీణించనుంది. బ్రెజిల్‌లోని అమెజాన్ వంటి ఉష్ణమండల నదుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1980 నుంచి చూస్తే అమెజాన్ నదిలో ఆక్సీజన్లేని డెడ్జోన్ ప్రాంతాల్లో రోజుల సంఖ్య ప్రతి దశాబ్దానికి అదనంగా 16 రోజులు పెరుగుతూ పోతోంది’’అని శాస్త్రవేత్త క్వీ గువాన్ తెలిపారు. అందరి ఆయువును నిలబెట్టే ఆక్సీజన్‌ను నదుల్లో నిలుపుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని శాస్త్రవేత్తలు హితబోధ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఇదీ చదవండి: 60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్ స్టార్ట్
ఎన్ఆర్ఐ
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
క్రైమ్
బతికి ఉంటే ఇబ్బంది పెడతాడని.. భర్తను చంపేసింది
హైదరాబాద్: కుటుంబ కలహాలతో వేరుగా ఉంటున్న భార్య ఇంటికి పిల్లలను చూడటానికి వచ్చిన భర్తను తమ్ముడు, అతని స్నేహితుడితో కలిసి భార్య విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. వికారాబాద్ జిల్లా హజీపూర్ గ్రామానికి చెందిన గురు వెంకటేశ్ (31) బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటూ హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య, పిల్లలు వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్.. పిల్లలను చూసేందుకు రైతు బజార్ సమీపంలోని డబుల్బెడ్రూం నివాసాల్లో భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు.భర్తను చూసిన స్వప్న ఇక్కడికెందుకు వస్తున్నావు అంటూ తమ్ముడు పాండుతో కలిసి మూడో అంతస్తు నుండి కిందకు తీసుకువస్తూ దాడి చేశారు. అంతటితో ఆగకుండా పాండు తన స్నేహితుడు జగదీష్‌ను పిలిపించుకుని ముగ్గురూ కలిసి మూకుమ్మడిగా దాడిచేశారు. స్పృహ తప్పి పడిపోవడంతో..బతికి ఉంటే మళ్లీ ఇబ్బంది పెడతాడని దాడి చేసి తీవ్రంగా కొట్టి గ్రౌండ్‌ఫ్లోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు గమనించారు. మృతుడి సోదరుడు గురు తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతుని భార్య స్వప్న, ఆమె తమ్ముడు పాండు, అతని స్నేహితుడు జగదీష్‌లపై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు? నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారిస్తున్నట్లు తెలిసింది.
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్‌గా కూడా చాలాకాలం సేవలు అందించారు.
యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య
యర్రగొండపాలెం: తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా నరికి పొలాల్లో ఉన్న బోరు బావిలో పడేసిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీవైఎస్పీ కె.నాగరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెంచు కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు (21) ఈ నెల 13వ తేదీ రాత్రి ఓ 15 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూస్తే బాలికతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆవేశంలో ఇంట్లో ఉన్న అట్లపెనం తీసుకొని యువకుడి తలపై మోదడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు కూడా ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాసన వస్తుండటంతో నిందితులు మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ముక్కలుగా నరికి అక్కడికి సమీపంలోని ప్రైవేటు స్కూలు వెనుక వైపు పొలాల్లో ఉన్న ఒక బోరుబావిలో పడేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆంజనేయులు కనిపించకుండా పోయాడని అతని బావ చెల్లె వెంకటరావు ఈ నెల 16న ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ కె.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు సెల్ ఆధారంగా బాలిక ఇంటి వద్ద అదృశ్యమైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్నబాలిక తల్లిదండ్రులకు పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు. వారి కుమార్తెను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ కె.అజయ్‌కుమార్, ఎస్సై ఎం.దేవకుమార్‌లను ఆయన అభినందించారు. బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా డీవైఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మృతుడు ఆంజనేయులు బంధువులు పోలీస్ స్టేషన్లో గొడవకు దిగారు. వెంటనే బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీయాలని, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అత్తమామలను చంపిన అల్లుడికి ఉరి
వరంగల్ లీగల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడానికి అమె తల్లిదండ్రులు (అత్తమామలు) కారణమని భావించి వారిని చంపిన అల్లుడికి వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి జె. మైత్రేయి బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజుకు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు చెందిన బానోతు దీపిక ప్రేమించుకున్నారు. 2023లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. అయితే పెళ్లయినప్పటి నుంచే దీపికను నాగరాజు గృహహింసకు గురిచేయడంతో భరించలేని ఆమె 2024లో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అందుకు దీపిక తల్లిదండ్రులే కారణమని కక్ష పెంచుకున్న నాగరాజు.. ఆ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. 2024 జూలై 10న అర్ధరాత్రి దాటాక 16 చింతల తండాకు చేరుకొని నిద్రిస్తున్న దీపికతోపాటు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా బానోతు శ్రీను మృతి చెందాడు.
వీడియోలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!
క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం
పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం
గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..
నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు
బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి
బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి
మరో వివాదంలో సీఎం విజయ్


