ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా గుజరాత్ బ్యాటింగ్‌కు దిగింది.
Updates:
పదిహేను ఓవర్లలో గుజరాత్ స్కోరు: 159-1
జోస్ బట్లర్ 26, సాయి సుదర్శన్ 57 పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
12.2: గిల్ రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్ ఇచ్చి.. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ పెవిలియన్ చేరాడు.
మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న గిల్ ఖాతాలో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. స్కోరు: 129-1. జోస్ బట్లర్ క్రీజులోకి రాగా.. సుదర్శన్ 51 పరుగులతో ఉన్నాడు.
సాయి సుదర్శన్ ఫిఫ్టీ
11.1: నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్. ఈ సీజన్‌లో అతడికి ఇది వరుసగా ఐదో అర్ధ శతకం.
పది ఓవర్లలో గుజరాత్ స్కోరు: 111-0
ఓపెనర్లు గిల్ 30 బంతుల్లో 62, సుదర్శన్ 30 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.
గిల్ అర్ధ శతకం
6.6: నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్సర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న శుబ్‌మన్ గిల్. 23 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్. స్కోరు: 78-0.
పవర్ ప్లేలో గుజరాత్ స్కోరు: 62-0 (6)
గిల్ 18 బంతుల్లో 35, సుదర్శన్ 18 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు.
హాఫ్ సెంచరీ
5.1: అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ ఫోర్ బాదగా.. గుజరాత్ యాభై పరుగుల మార్కు అందుకుంది.
తొలి ఓవర్లో గుజరాత్ స్కోరు: 8-0
ముకేశ్ చౌదరి చెన్నై బౌలింగ్ ఎటాక్ మొదలుపెట్టగా.. గిల్ ఏడు, సాయి సుదర్శన్ ఒక పరుగుతో ఉన్నారు.
టాస్ గెలిచిన చెన్నై
ఐపీఎల్-2026లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందుగా టాప్-4లో అడుగుపెట్టగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి అర్హత సాధించింది. తమతో పాటు గుజరాత్ టైటాన్స్‌ను కూడా ప్లే ఆఫ్స్‌నకు తీసుకువెళ్లింది.
మిగిలిన ఒక్క స్థానం కోసం
ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ఐదు జట్లు (రాజస్తాన్, పంజాబ్, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ) అధికారికంగా రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై తమ లీగ్ దశలో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో అద్భుతం జరగాలని కోరుకుంటోంది. ఇందుకు పటిష్ట గుజరాత్ టైటాన్స్‌తో గురువారం తలపడేందుకు సిద్ధమైంది.
తుదిజట్లలో మార్పులు ఇవీ
అహ్మదాబాద్ వేదికగా ఇరుజట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. అకీల్ హొసేన్ స్థానంలో గుర్జప్నీత్ సింగ్, ప్రశాంత్ వీర్ స్థానంలో మాథ్యూ షార్ట్ వచ్చినట్లు తెలిపాడు.
ఇక గుజరాత్ టైటాన్స్ సైతం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. సాయి కిషోర్ స్థానంలో ప్రసిద్ కృష్ణను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.
గుజరాత్ వర్సెస్ చెన్నై తుదిజట్లు
గుజరాత్
సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్.
చెన్నై
సంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.


