ఒక్కరోజు వ్యాపారి! | Delhi Content Creator Sells Maggi In The Mountains For A Day | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు వ్యాపారి!

May 22 2026 12:05 AM | Updated on May 22 2026 12:05 AM

Delhi Content Creator Sells Maggi In The Mountains For A Day

దిల్లీకి చెందిన కంటెంట్‌ క్రియేటర్‌ దేవాన్ష్‌ త్యాగికి మ్యాగీ అంటే చా...లా ఇష్టం.‘నా ఇష్టాన్ని ఒక్కరోజైనా లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవచ్చా!’ అని ఆలోచించాడు. ఒక్కరోజులో ఎంత సంపాదించవచ్చో తెలుసుకోవడానికి ఒక అందమైన కొండ ప్రాంతంలో తాత్కాలికంగా మ్యాగీ స్టాల్‌ను తెరిచాడు. మ్యాగీ పాకెట్లను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేశాడు. ప్లాస్టిక్‌ కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేశాడు. 

పర్వతాలు కనిపించేలా వంట కౌంటర్‌ను ఏర్పాటు చేశాడు. నూడుల్స్‌ తయారుచేయడానికి సమీపంలో వాగు నుంచి నీళ్లు తెచ్చుకునేవాడు. పర్వతాల నేపథ్యంలో వేడి వేడి మ్యాగీని ఆస్వాదించడానికి పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. రోజు గడిచే కొద్దీ స్టాల్‌ చుట్టూ జనం పెరుగుతూనే ఉన్నారు. మ్యాగీ ప్యాకెట్లన్నీ అమ్ముడు పోయాయి. కట్‌ చేస్తే... ఒక్కరోజులో రూ.24,000 సంపాదించినట్లు త్యాగి చెబుతున్నాడు! 

Advertisement
 
Advertisement
Advertisement